పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్‌ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ బ్యాట్స్‌మన్ రిలీ రోసౌ వింత సెలబ్రేషన్స్‌తో మెరవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో రోసౌ హాఫ్ సెంచరీ పూర్తి చేశాకా.. పెవిలియన్‌వైపు చూస్తూ.. వెనక్కి తిరిగి నడుము కింది భాగాన్ని ఊపుతూ కనిపించాడు. ఇదేం సెలబ్రేషన్ అంటూ చూసినవాళ్లు తలలు పట్టుకున్నారు. తాజాగా దీనిపై రోసౌ క్లారిటీ ఇచ్చాడు. ''నా ఏడేళ్ల కూతురు కోరిక ఇది.. ఫిప్టీ కొట్టగానే ఈ విధంగా సిగ్నేచర్ ఇస్తానని నా చిట్టితల్లికి మాట ఇచ్చా.. అందుకే ఇలా చేశా'' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 Auction: మెగా వేలానికి ముందు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు
ఈ మ్యాచ్‌లో రోసౌ 35 బంతుల్లో 67 పరుగులు నాటౌట్‌గా నిలిచి ముల్తాన్ సుల్తాన్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతని దెబ్బకు ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. మిగతావారిలో టిమ్ డేవిడ్(71), మసూద్ 43 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 19.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ముల్తాన్ సుల్తాన్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్‌కే దక్కించుకోనుందా!
.@Rileerr ki 50 celebration ka #LevelHai #HBLPSL7 l #LevelHai l #MSvIU pic.twitter.com/g4D060FC2s
— PakistanSuperLeague (@thePSLt20) February 1, 2022
Comments
Please login to add a commentAdd a comment