
ముంబై: ప్రపంచ క్రికెట్‌లో పరుగుల మెషీన్‌గా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి హద్దులు ఎరుగని అభిమానం సొంతం. క్రికెట్ ఆడే దేశాల్లో కోహ్లికు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన దాయాది దేశం పాకిస్తాన్‌లో అయితే కోహ్లి అభిమానులు మెండుగానే ఉన్నారు. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ.
దుబాయ్‌లో ఇస్లామాబాద్ యు నైటెడ్-క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 'పీఎస్‌ఎల్‌లో విరాట్ కోహ్లిని చూడాలనుకుంటున్నాం' అని ఓ అభిమాని బ్యానర్ పట్టుకొని కనిపించింది. ఇది ఇప్పుడు షల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది ఐసీసీ వరల్డ్ లెవెన్-పాకిస్తాన్ జట్ల మధ్య లాహోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓ పోలీసు ' కోహ్లి నన్ను పెళ్లి చేసుకో' అని ఫ్లకార్డు ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment