కరాచీ: ఫిబ్రవరి 20న అట్టహాసంగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్ 2021) గురువారం అర్థంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా ఏడుగురు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పీసీబీ లీగ్‌ను వాయదా వేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా పీఎస్‌ఎల్ లీగ్‌పై మరో విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని.. ఎక్కడ పరిశుభ్రత పాటించడం లేదని.. అందుకే కరోనా కేసులు వెలుగు చూశాయంటూ ట్రోల్స్ చేశారు.
దీనికి తోడూ ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ తన ట్విటర్‌లో పెట్టిన ఫోటోను ఒక వ్యక్తి రీట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో రెండు ఎగ్స్, టోస్ట్ బ్రెడ్.. కనిపించాయి. హేల్స్ కూడా పీసీబీని ట్రోల్ చేస్తూ ఆ ఫోటో పెట్టాడంటూ సదరు వ్యక్తి కామెంట్స్ చేశారు. అయితే ఇది చూసిన హేల్స్.. చెత్త ఫుడ్ అంటూ విమర్శలు చేసినవారికి క్లారిటీ ఇస్తున్నట్లుగా తన కామెంట్స్‌లో తెలిపాడు.
'' మీరు ఫోటోలో చూస్తున్నది నిజానికి మంచి క్వాలిటీతో ఉన్న ఆహారం. కాకపోతే వారిచ్చిన ఫుడ్ ఆర్డర్ ప్రకారం ఇవ్వలేదు.. ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది.. అందుకే ఫోటోను షేర్ చేశా.. అంతేగాని ఫుడ్ క్వాలిటీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. పీఎస్‌ఎల్ నిర్వాహకులు మా అందరిని ఆహ్లదకర వాతావరణంలోనే ఉంచింది. అనవసరంగా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అలెక్స్ హేల్స్ పీఎస్‌ఎల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
చదవండి:
పీఎస్‌ఎల్ 2021 వాయిదా..
వికెట్ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్
It was one meal where the order was incorrect.. I found it funny, nothing more. The food and hospitality here has been excellent, hope this clears it up 👍🏼
— Alex Hales (@AlexHales1) March 4, 2021
Comments
Please login to add a commentAdd a comment