పీఎస్‌ఎల్‌లో ఖాళీగా ఉన్నస్టేడియం
సాక్షి, స్పోర్ట్స్ : దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మూడో సీజన్ అభిమానులను ఆకర్షించలేకపోతుంది. భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లా విజయవంతం చేయాలని ఆర్గనైజర్లు గ్లామర్ సెలబ్రిటీలను భాగస్వామ్యం చేసినా అభిమానులు స్టేడియాలకు వెళ్లడం లేదు. దీంతో మ్యాచ్‌లు జరుగుతున్న వేదికలన్నీ బోసిబోయి కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా పీఎస్‌ఎల్‌పై జోకులు పేలుస్తున్నారు.
ఖాళీగా ఉన్న మైదనాల ఫొటోల పక్కన నిర్మానుష్యమైన ఎడారి, సముద్రాల ఫొటోలతో పోల్చుతున్నారు. ఐపీఎల్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభిస్తే లక్షల్లో బహుమానం ఉంటుందని, అదే పీఎస్‌ఎల్ మంచి డిన్నర్ ఏర్పాటు చేస్తారని ఎగతాళి చేస్తున్నారు. ఇలా ఫొటో షాప్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పీఎస్‌ఎల్ పై విమర్శలు గుప్తిస్తున్నారు.
గత ఫిబ్రవరి 22న దుబాయ్ వేదికగా పీఎస్‌ఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. విదేశీ ప్లేయర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఈ లీగ్ అభిమానులు ఆదరణను నోచుకోవడం లేదు. అయితే ప్రస్తుత ఫామ్‌లో ఉన్న క్రికెటర్లు కాకుండా మాజీ క్రికెటర్లు ఎక్కువగా ఉండటంతో అభిమానులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. ప్రారంభ వేడుకల్లో సినీతారలు సైతం సందిడి చేశారు. అయితే పాక్ మాజీ క్రికెటర్ షాహిది ఆఫ్రిదీ ఓ మ్యాచ్‌లో బౌండరీ దగ్గర అందుకున్న క్యాచ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకట్టుకోంది. లీగ్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోని నాలుగు వేదికల్లో జరుగుతుండగా క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరగనున్నాయి. పాక్‌లోనన్నా అభిమానులు కరుణిస్తారో చూడాలి.
Man of the match reward in #IPL and #PSL.. pic.twitter.com/ssqQAXcMkT
— The-Lying-Lama (@KyaUkhaadLega) 20 February 2018
Comments
Please login to add a commentAdd a comment