indian fans
-
భారతీయుల అభిమానానికి మెస్సీ ఫిదా..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ మెస్సీకి వీరాభిమానులు చాలా మందే. కేవలం మెస్సీ ఆటను చూడడం కోసమే చాలా మంది భారత అభిమానులు ఖతార్ చేరుకున్నారు. మాములుగానే మెస్సీ ఎక్కడికైనా వస్తున్నాడంటే అక్కడ వాలిపోయే అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడి కోసం గంటల కొద్దీ నిరీక్షించడం చూస్తూనే ఉంటాం. మరి అలాంటిది ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ ఆడేందుకు జట్టుతో కలిసి ఖతార్‌కు వస్తున్నాడంటే ఇక ఆ నిరీక్షణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెస్సీ బృందం ఖతార్‌లో అడుగుపెట్టింది. అయితే అక్కడ ఉన్న వందల మంది అభిమానుల్లో భారతీయులే ఎక్కువగా ఉండడం విశేషం. మెస్సీ బస్సు నుంచి దిగగానే ఇండియన్స్ పెద్ద ఎత్తున డ్రమ్స్ వాయించి అతనికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇది చూసిన మెస్సీ మొహం సంతోషంతో వెలిగిపోయింది. తనకోసం కొన్ని గంటల నుంచి నిరీక్షిస్తున్నారన్న సంగతి తెలుసుకున్నాకా వారిపై ప్రేమ మరింత పెరిగిన మెస్సీ ముద్దుల వర్షం కురిపించాడు. ఇక గురువారం తెల్లవారుజామునే అర్జెంటీనా జట్టు దుబాయ్ నుంచి ఖతార్‌కు చేరుకుంది. అంతకముందు బుధవారం రాత్రి యూఏఈతో జరిగిన చివరి వార్మప్ మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో విజయాన్ని అందుకుంది. ఒక గోల్ చేసిన మెస్సీ తన 91వ అంతర్జాతీయ గోల్‌ను అందుకున్నాడు.ఇక గ్రూప్-సీలో ఉన్న అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌ను వచ్చే మంగళవారం సౌదీ అరేబియాతో ఆడనుంది. కాగా ఇదే గ్రూప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియాలతో పాటు మెక్సికో, పొలాండ్లు కూడా ఉన్నాయి. మెస్సీకి బహుశా ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్ అయ్యే అవకాశం ఉంది. మెస్సీ వయస్సు ప్రస్తుతం 35 ఏళ్లు. మరో సాకర్ సమరం జరగడానికి నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మెస్సీ ఆడడం కష్టమే. అందుకే మెస్సీ ఈసారి ఎలాగైనా అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1986లో డీగో మారడోనా నేతృతంలో ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన అర్జెంటీనా మరోసారి విజేత కాలేకపోయింది. Argentina fans in Qatar 🎉🤩#QatarWorldCup2022 pic.twitter.com/LNJlWHpK3j — shukran 👤 (@mury515) November 16, 2022 చదవండి: ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
మరోసారి భారతీయుల మనసులు కొల్లగొట్టిన వార్నర్ భాయ్..!
David Warner: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి భారతీయుల మనసులను కొల్లగొట్టేశాడు. గణేష్ చతుర్థి నాడు వినూత్నమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు. గణనాథుడి ముందు చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లు డిజైన్ చేసిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. అక్కడ ఉన్న నా స్నేహితులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని కామెంట్ జోడించాడు. వార్నర్ చేసిన ఈ పోస్ట్‌కు భారతీయుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. గతంలో సినిమా పాటలకు డ్యాన్స్ వేయడం, పాపులర్ డైలాగ్స్‌కు మీమ్స్ చెప్పడం లాంటివి చేసి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న వార్నర్ భాయ్.. తాజాగా చర్యతో భారతీయులకు మరింత చేరువయ్యాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న వార్నీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపర్చుకున్నాడు. వార్నర్ పోస్ట్‌కు తెలుగు ప్రజల నుంచి అధికమైన రెస్పాన్స్ వస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, వార్నర్ ప్రస్తుతం స్వదేశంలో జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇవాళ జరిగిన రెండో వన్డేలో అతను 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పర్యాటక జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి వన్డేలో వార్నర్ అర్ధసెంచరీతో మెరిశాడు. చదవండి: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ -
మహిళా అభిమానికి ఫిదా.. 'ఐ లవ్ ఇండియా' అన్న పాక్ క్రికెటర్
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ భారతీయ మహిళా అభిమానికి ఫిదా అయ్యాడు. తనపై ఆమె చూపించిన అభిమానానికి ముగ్దుడైన హసన్ అలీ.. 'ఐ లవ్ ఇండియా' అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మంగళవారం రాత్రి పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత్‌కు చెందిన ఒక మహిళ అభిమాని అక్కడికి వచ్చింది. ఆమెతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కాగా పాక్ క్రికెటర్లంతా ప్రాక్టీస్ ముగించుకొని డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న సమయంలో తమ కెమెరాలతో ఫోటోలు క్లిక్‌మనిపించారు. ఈ సమయంలో అక్కడినుంచి వెళుతున్న హసన్ అలీని ఆపి.. ''మీకు భారత్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.'' అని మహిళ పక్కన ఉన్న వ్యక్తి పేర్కొంటూ సెల్ఫీ కావాలని అడిగాడు. ''అవును మాకు ఇండియాలో కూడా అభిమానులు ఉంటారు.. ఐ లవ్ ఇండియా..'' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత సదరు మహిళతో ఫోటోలకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. ఇక హసన్ అలీ భార్య సమియా ఆర్జూ భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. ఇక మొదట హసన్ అలీ ఆసియాకప్‌కు పీసీబీ ప్రకటించిన జట్టులో లేడు. మహ్మద్ వసీమ్ గాయపడడంతో అతని స్థానంలో హసన్ అలీని ఎంపిక చేశారు. ఇక చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్‌లో హసన్ అలీకి అవకాశం రాలేదు. హసన్ అలీ కంటే హారిస్ రౌఫ్, షాహనవాజ్ దహాని, నసీమ్ షాల త్రయంవైపే కెప్టెన్ బాబర్ ఆజం మొగ్గు చూపాడు. అయితే టీమిండియాతో మ్యాచ్‌లో యంగ్ బౌలర్ నసీమ్ గాయపడడంతో హాంకాంగ్‌తో మ్యాచ్‌కు హసన్ అలీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా టీమిండియా బుధవారం హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూఫ్-ఏ నుంచి సూపర్-4కు టీమిండియా అర్హత సాధించనుంది. మరోవైపు టీమిండియాతో చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. హాంకాంగ్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి రెండో జట్టుగా పాక్ సూపర్-4లో అడుగుపెట్టాలని ఆశపడుతుంది. చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ ఆసియా కప్‌లోనే మరోసారి పాక్‌తో తలపడనున్న టీమిండియా..! -
భారతీయులను ఇష్టపడను.. వెళ్లిపోండి!
సిడ్నీ : భారత అభిమానులపై మాజీ రేసర్, అడల్ట్ స్టార్ రెనీ గ్రేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనుమతి లేకుండా భారత అభిమానులు తన ఫొటోలను, వీడియోలను వినియోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాగే సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ పేజీలు సృష్టించి.. అక్రమంగా తన కంటెంట్‌ను అందులో పోస్ట్ చేయవద్దని కోరారు. అది కేవలం తనకు మాత్రమే చెందిన కంటెంట్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు అడల్ట్ సబ్స్క్రిషన్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. ‘కాపీ రైట్ నిబంధనలు ఉల్లంఘించకండి.. నా పేజీలో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల హక్కులను నేను మాత్రమే కలిగి ఉన్నాను. మీరు కాదు. నా పేరిట ఫేక్ పేజీలు నడపటం మానుకోండి. చట్ట విరుద్ధంగా నా వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం ఆపండి. ప్రస్తుతం నేను భారతీయులను ఇష్టపడటం లేదు. ఒకవేళ మీరు ఇండియన్ అయితే నా పేజీ నుంచి వెంటనే వైదొలగండి. ఇకపై వారిని నా పేజీలో అనుమతించను. నేనే నా పేజీ నుంచి భారతీయులను అందరినీ తొలగించబోతున్నాను’ అని గ్రేసీ పేర్కొన్నారు. అలాగే తన ఫొటోలు షేర్ చేసేవారిపై ఆమె అసభ్య పదజాలన్ని కూడా వాడారు. కాగా, వీ8 సూపర్ కార్స్లో మొదటి ఫుల్ టైం లేడీ రేసర్ రెనీ గ్రేసీ కావడం గమనార్హం. రేసర్‌గా మంచి గుర్తింపు పొందిన గ్రేసీ.. ఆ తర్వాత అడల్ట్ స్టార్‌గా మారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. చాలా కాలంగా రేసర్‌గా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే అడల్ట్ స్టార్‌గా మారినట్టు చెప్పారు. (బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌గా..) -
ఇంకెప్పుడ్రా మా మ్యాచ్.!
లండన్ : ప్రపంచకప్‌లో టీమిండియా ఆరంభ మ్యాచ్ ఆలస్యంపై భారత అభిమానులు కుళ్లుజోకులు పేల్చుతున్నారు. టోర్నీ ప్రారంభమై దాదాపు వారం అవుతున్నా.. ఇప్పటికే కొన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడినా భారత్ ఇంతవరకు మ్యాచ్ ఆడకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి భారత్ (రేపు) బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్‌కు ఇది తొలి మ్యాచ్ అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం మూడోవది కావడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. తమ ఫొటో షాప్ నైపుణ్యానికి పని చెప్పి మరి ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘కోడి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలైనా భారత్ మ్యాచ్ ఆడేటట్టు లేదుగా’ అని ఒకరు.. ‘ఆటగాళ్లంతా డగౌట్లో కూర్చుని అస్థిపంజరాలైనా ఐసీసీ మ్యాచ్’ ఆడించేటట్టు లేదని కామెంట్ చేస్తున్నారు. me waiting for india's 1st match #CWC19 pic.twitter.com/k2zmqsnzKQ — SƎ7⃣EN says (@seven_bound) June 4, 2019 ఆలస్యానికి కారణం ఏంటంటే! వాస్తవానికి ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఆలస్య ఎంట్రీకి బీసీసీఐనే కారణం. ఐపీఎల్ 2019 సీజన్లో నెలన్నరపాటు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడిన భారత్ ఆటగాళ్లకి విశ్రాంతి కావాలని స్వయంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని బీసీసీఐ అభ్యర్థించింది. దీంతో.. భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని సవరించిన ఐసీసీ.. టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా షెడ్యూల్‌ను రూపొందించింది. మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 సీజన్ మే 12న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ ఫైనల్‌కి ముందే స్వదేశాలకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు నియమిత లోధా కమిటీ.. టీమిండియా ఆడే టోర్నీ, టోర్నీకి మధ్య కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలని సిఫారసు చేసింది. దీంతో.. ఐపీఎల్, ప్రపంచకప్ మధ్య ఈ వ్యవధి నియమాన్ని బీసీసీఐ పాటించినప్పటికీ.. ఆటగాళ్లకి మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఐసీసీని అభ్యర్థించింది. ఈ బ్రేక్ టైమ్.. ఆటగాళ్ల ప్రాక్టీస్‌తో గాయపడిన క్రికెటర్లు ఫిట్నెస్ సాధించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడింది. ఐపీఎల్లో గాయపడిన కేదార్ జాదవ్.. ఇప్పటికే పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో ఇతర ఆటగాళ్లతో సాధన చేస్తూ కనిపించాడు. Team India in World cup R.n 😄😂😅#cwc #PakvsEng pic.twitter.com/lTusYdMGGr — #dani (@devildani44) June 3, 2019 -
కోహ్లి చాలా కాస్ట్లీ.. కష్టం!
సాక్షి, స్పోర్ట్స్ : భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఎవరైనా ట్వీట్లు చేస్తే చాలూ.. ఫ్యాన్స్ అందుకు తగ్గట్లుగానే రియాక్ట్ అవుతుంటారు. నెగటివ్ అయితే తిడుతూ.. పాజిటివ్ అయితే సంబరపడుతూ బదుళ్లు ఇస్తుంటారు. అయితే మరి కోహ్లిని ఉద్దేశించి ట్వీట్లు చేస్తే ఊరుకుంటారా? వెంటనే ట్రోల్ చేసేస్తున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లి ఆడితే చూడాలనుకుంటున్నాం అంటూ ఓ పాక్ అభిమాని ఫ్లకార్డు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్ యునైటెడ్-క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. దీనిని పట్టుకుని సోషల్ మీడియాలో కూడా కొందరు కోహ్లికి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. మరి అది చూసి టీమిండియా ఫ్యాన్స్ ఊరుకుంటారా? పీఎస్ఎల్కు కోహ్లిని కొనేంత సీన్ లేదు, కోహ్లి ధర వెలకట్టలేనిది, కోహ్లిని కోనడం కలలో కూడా మీకు జరగని పని, పాక్‌కు కశ్మీర్ ఎలాగో కోహ్లి కూడా అంతే.. రెండూ దక్కవు. మొత్తం ఇలాంటి సందేశాలే కనిపిస్తున్నాయి. పాక్ ప్లేయర్‌ను ఆడుకున్న సొంత ఫ్యాన్స్ -
పీఎస్ఎల్పై అభిమానుల కుళ్లు జోకులు
సాక్షి, స్పోర్ట్స్ : దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మూడో సీజన్ అభిమానులను ఆకర్షించలేకపోతుంది. భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లా విజయవంతం చేయాలని ఆర్గనైజర్లు గ్లామర్ సెలబ్రిటీలను భాగస్వామ్యం చేసినా అభిమానులు స్టేడియాలకు వెళ్లడం లేదు. దీంతో మ్యాచ్‌లు జరుగుతున్న వేదికలన్నీ బోసిబోయి కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా పీఎస్ఎల్పై జోకులు పేలుస్తున్నారు. ఖాళీగా ఉన్న మైదనాల ఫొటోల పక్కన నిర్మానుష్యమైన ఎడారి, సముద్రాల ఫొటోలతో పోల్చుతున్నారు. ఐపీఎల్లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభిస్తే లక్షల్లో బహుమానం ఉంటుందని, అదే పీఎస్ఎల్ మంచి డిన్నర్ ఏర్పాటు చేస్తారని ఎగతాళి చేస్తున్నారు. ఇలా ఫొటో షాప్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పీఎస్ఎల్ పై విమర్శలు గుప్తిస్తున్నారు. గత ఫిబ్రవరి 22న దుబాయ్ వేదికగా పీఎస్ఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. విదేశీ ప్లేయర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఈ లీగ్ అభిమానులు ఆదరణను నోచుకోవడం లేదు. అయితే ప్రస్తుత ఫామ్‌లో ఉన్న క్రికెటర్లు కాకుండా మాజీ క్రికెటర్లు ఎక్కువగా ఉండటంతో అభిమానులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. ప్రారంభ వేడుకల్లో సినీతారలు సైతం సందిడి చేశారు. అయితే పాక్ మాజీ క్రికెటర్ షాహిది ఆఫ్రిదీ ఓ మ్యాచ్‌లో బౌండరీ దగ్గర అందుకున్న క్యాచ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకట్టుకోంది. లీగ్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోని నాలుగు వేదికల్లో జరుగుతుండగా క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్‌లు పాకిస్తాన్లో జరగనున్నాయి. పాక్లోనన్నా అభిమానులు కరుణిస్తారో చూడాలి. Man of the match reward in #IPL and #PSL.. pic.twitter.com/ssqQAXcMkT — The-Lying-Lama (@KyaUkhaadLega) 20 February 2018 -
జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న వెస్టిండీస్ అండర్-19 క్రికెటర్ జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్చర్ కనీస ధర రూ.40 లక్షలు ఉండగా రూ.7.20 కోట్ల ధరకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. దీంతో ఆర్చర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఆర్చర్ భారత ద్వేషి అని, ముఖ్యంగా ధోనిని విమర్శిస్తూ గతంలో ట్వీట్లు చేశాడని భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జోఫ్రా గతంలో చేసిన ట్వీట్స్‌ను తొలిగించినప్పటికి వాటి స్క్రీన్ షాట్లతో నిలదీస్తున్నారు. ఆర్చర్ భారతీయులు నాశనం కావలని, ధోని తనకు తానే స్మార్ట్ అని భావిస్తున్నాడని, ధోని లూల్ అంటూ ఆ ట్వీట్లలో పేర్కొన్నాడు. భారత నాశనాన్ని కోరుకున్న క్రికెటర్‌కు ఐపీఎల్లో అవకాశమివ్వడేమిటని రాజస్తాన్ రాయల్స్ జట్టును అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ఆడాలంటే ముందుగా భారత దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విండీస్ అనమాక క్రికెటరైన ఆర్చర్ బిగ్‌బాష్ లీగ్‌లో రాణించి గుర్తింపు పొందాడు. బార్బోడాస్ జట్టు తరుపున బంతి, బ్యాట్‌తో సత్తా చాటడంతో ఐపీఎల్ వేలంలో కోట్లు పలికాడు. Don't let him play till he apologizes MSD — Rohit Joshi (@rpjoshi648) 29 January 2018 -
మళ్లీ నిరాశ పరిచిన మంధన
డెర్బీ: భారత ఓపెనర్ స్మృతి మంధన మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. గత నాలుగు మ్యాచుల్లో వరుసగా విఫలమైన ఓపెనర్ స్మృతి మంధన మరోసారి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టోర్ని ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టిన ఈ బ్యూటిఫుల్ లేడీ క్రికెటర్ భారత్ అభిమానుల మనసును దోచుకుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్ తో 90 పరుగుల, వెస్టిండీస్ తో సెంచరీతో చెలరేగిన మంధన తరువాతి నాలుగు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఆసీస్ తో జరుగుతున్న సెమీస్ లోనైనా రాణిస్తుందనుకున్న అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. ఆసీస్ బౌలర్ విలాని తొలి ఓవర్లో ఫోర్ తో పరుగుల ఖాత తెరిచిన మందన(6) చివరి బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. -
భారత అభిమానుల చెంతకు మాంచెస్టర్ యునెటైడ్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్ తొలిసారిగా భారత్‌లో తమ అభిమానులను కలువనుంది. ‘ఐలవ్యునెటైడ్ఇండియా’ పేరిట జరిగే ఈ ఈవెంట్ వచ్చే నెల 17న బెంగళూరులోని యూబీ సిటీకి చెందిన ఆంఫి థియోటర్లో జరుగుతుంది. ఇందులో ఎంయూ అంబాసిడర్ డ్వైట్ యార్క్, క్లబ్ దిగ్గజ ఆటగాడు క్వింటాన్ ఫార్చూన్ పాల్గొని తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. అలాగే ఆరోజు లివర్‌పూల్‌తో జరిగే మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అభిమానులకు చూయించనున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టిక్కెట్ల కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇలాంటి కార్యక్రమమే ఫిబ్రవరిలో ముంబైలో నిర్వహిస్తారు. -
ఆడితే ఆరాధిస్తాం!
- భారత్‌లో డివిలియర్స్‌కు అడుగడుగునా బ్రహ్మరథం - గతంలో ఏ విదేశీ క్రికెటర్‌కూ లేని ఆదరణ ఏ దేశంలో ఏ మైదానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నా ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారంటే... ఆ బ్యాట్స్‌మన్ పేరు సచిన్ టెండూల్కర్. రెండేళ్ల క్రితం వరకూ పరిస్థితి ఇది. ఇప్పుడు సరిగ్గా ఆ స్థాయి గౌరవం అందుకుంటున్న క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ క్రీజులోకి వస్తుంటే భారత్‌లోని ప్రతి వేదికా హోరెత్తింది. గతంలో ఏ విదేశీ క్రికెటర్‌కూ ఈ స్థాయిలో ఇక్కడ ఆదరణ లభించలేదు. సాక్షి క్రీడావిభాగం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టుకు తొలి రోజు ఊహించని స్థాయిలో ప్రేక్షకులు వచ్చారు. టెస్టుకు ఇంత ఆదరణా అంటూ నిర్వాహకులు పొంగిపోయారు. కొద్దిసేపటి తర్వాతగానీ దీనికి కారణం తెలియలేదు. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్‌కు వస్తుంటే స్టేడియం హోరెత్తింది. భారత క్రికెటర్లకు మించిన స్థాయిలో స్వాగతం పలికారు. ఎందుకంటే... అది అతని వందో టెస్టు. ప్రేక్షకుల స్పందన దక్షిణాఫ్రికా క్రికెటర్లతో పాటు భారత క్రికెట్ వర్గాల్లోనూ ఆశ్చర్యం పెంచింది. ఐపీఎల్లో డివిలియర్స్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఆ స్థాయిలో ఆదరణ వచ్చిందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత నాగ్‌పూర్‌లో, ఢిల్లీలోనూ అంతే. ముఖ్యంగా ఢిల్లీలో స్కూల్ పిల్లల హాజరు ఎక్కువగా ఉన్నందున డివిలియర్స్ బ్యాటింగ్‌కు వస్తున్నపుడు సందడి బాగా పెరిగింది. అంటే పిల్లల్లో కూడా డివిలియర్స్‌కు ఏ స్థాయిలో ఆదరణ ఉందో ఢిల్లీ టెస్టు ద్వారా అందరికీ అర్థమైంది. వైవిధ్యమే కారణం డివిలియర్స్ కంటే గొప్ప విదేశీ క్రికెటర్లు, దిగ్గజాలు గతంలోనూ భారత్‌లో ఆడారు. కానీ వాళ్లెవరికీ లభించని ఆదరణ ఏబీకే ఎందుకు దక్కింది? దీనికి ప్రధాన కారణం అతని వైవిధ్యభరిత ఆటతీరు. అతను క్రీజులో ఉన్నంతసేపు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని, ఆనందాన్ని పంచుతాడు. ఏ షాట్ ఎటు ఆడతాడో తెలియదు. బంతి ఎక్కడ వేయాలో తెలియక బౌలర్ తలపట్టుకుంటే... ప్రేక్షకుడు మాత్రం సంతోషంతో గంతులు వేస్తుంటాడు. పైగా డివిలియర్స్ ఆడేవి మొద్దు షాట్లు, అడ్డబాదుడు కాదు... ఎలాంటి షాట్ ఆడినా అందులో కళ ఉంటుంది. ఈ వైవిధ్యమే ప్రస్తుత తరం క్రికెటర్లలో అతణ్ని భిన్న ఆటగాడిని చేసింది. దీనికి తోడు ఐపీఎల్ రూపంలో అతను భారత ప్రేక్షకులకు బాగా సుపరిచితుడయ్యాడు. ఎనీ బాల్ డిఫెన్స్! డివిలియర్స్ అంటే ఇంతకాలం మెరుపు వేగం అని మాత్రమే భారత అభిమానులకు తెలుసు. గతంలో అతను టెస్టుల్లో చాలాసార్లు నెమ్మదిగా ఆడినా వాటిని ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. తాజాగా ఢిల్లీ టెస్టులో అతను ఆడిన తీరు మనవాళ్లకు చాలా కొత్తగా అనిపించి ఉంటుంది. అక్టోబరు 25న ముంబైలో భారత్‌తో జరిగిన చివరి వన్డేలో 61 బంతుల్లో 119 పరుగులు చేసి... అందులో 11 సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. నెల రోజుల తర్వాత భారత్‌తో ఆఖరి టెస్టులో ఏకంగా 297 బంతులు ఆడి 43 పరుగులే చేశాడు. విధ్వంసమే కాదు... డిఫెన్స్ కూడా బాగా ఆడగల నైపుణ్యం తనలో ఉందని చూపించాడు. ఈ మ్యాచ్‌లో డిఫెన్స్ ఎంత బాగా ఆడాడంటే... ఏబీడీ అంటే ఎనీ బాల్ డిఫెన్స్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకున్నారు. ఏమైనా ఈ తరం సూపర్ స్టార్ డివిలియర్స్ అని మరోసారి రుజువైంది. దేశంతో సంబంధం లేదు క్రికెట్ విషయంలో ఉపఖండం ప్రేక్షకులకు, బయటి దేశాల ప్రేక్షకులకు బాగా తేడా ఉంటుంది. బాగా ఆడితే ఏ దేశపు క్రికెటర్‌నైనా వారు అభినందిస్తారు. కానీ ఉపఖండంలో మాత్రం తమ దేశ ఆటగాళ్లకు మాత్రమే బ్రహ్మరథం పడుతుంటారు. ఒక్క సచిన్ విషయంలోనే గతంలో ఇది దేశాలకు అతీతంగా సాగింది. కానీ ఇప్పుడు డివిలియర్స్‌కు కూడా అన్ని దేశాల్లో అభిమానులు పెరిగారు. బాగా ఆడితే ఏ దేశ క్రికెటర్‌నైనా ఆరాధిస్తామని భారత ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌తో ప్రపంచానికి చాటారు.