జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానుల ఆగ్రహం | Jofra Archer slammed for anti-India, MS Dhoni tweets | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 31 2018 1:35 PM | Last Updated on Wed, Jan 31 2018 1:35 PM

Jofra Archer slammed for anti-India, MS Dhoni tweets - Sakshi

జోఫ్రా ఆర్చర్‌(ఫైల్‌ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌ వేలంలో రికార్డు ధర పలికి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న వెస్టిండీస్‌ అండర్‌-19 క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్చర్‌ కనీస ధర రూ.40 లక్షలు ఉండగా రూ.7.20 కోట్ల ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. దీంతో ఆర్చర్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఆర్చర్‌ భారత ద్వేషి అని, ముఖ్యంగా ధోనిని విమర్శిస్తూ గతంలో ట్వీట్‌లు చేశాడని భారత అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. జోఫ్రా గతంలో చేసిన ట్వీట్స్‌ను తొలిగించినప్పటికి వాటి స్క్రీన్‌ షాట్‌లతో నిలదీస్తున్నారు. ఆర్చర్‌ భారతీయులు నాశనం కావలని, ధోని తనకు తానే స్మార్ట్‌ అని భావిస్తున్నాడని, ధోని లూల్‌ అంటూ ఆ ట్వీట్‌లలో పేర్కొన్నాడు.

భారత నాశనాన్ని కోరుకున్న క్రికెటర్‌కు ఐపీఎల్‌లో అవకాశమివ్వడేమిటని రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌ ఆడాలంటే ముందుగా భారత దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. విండీస్‌ అనమాక క్రికెటరైన ఆర్చర్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో రాణించి గుర్తింపు పొందాడు. బార్బోడాస్‌ జట్టు తరుపున బంతి, బ్యాట్‌తో సత్తా చాటడంతో ఐపీఎల్‌ వేలంలో కోట్లు పలికాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement