twitter trolling
-
దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ ట్విటర్ వేదికగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. సైనీ.. తన హార్లీ డేవిడ్సన్ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చోండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్ చూసిన కొందరు సైనీని మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు. Accompany me on my bike to feel the fear @harleydavidson pic.twitter.com/iosa8wS2ya — Navdeep Saini (@navdeepsaini96) May 30, 2021 క్రికెటర్ అయి ఉండి ఇంత బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తావా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కుర్రాళ్లు నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు గురైతే బాధ్యులెవరని మరికొందరు మండిపడ్డారు. టీమిండియాకు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు.. కాస్త ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని మరికొందరు చివాట్లు పెట్టారు. మరికొందరు స్పందిస్తూ.. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?' అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. కాగా, కొందరు నెటిజన్లు మాత్రం స్టంట్ అదిరిపోయిందంటూ సైనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతని సిక్స్ ప్యాక్ బాడీ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన సైనీ.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. అక్కడ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో కూడా సైనీకి మొండి చెయ్యే ఎదురైంది. చదవండి: టీమిండియా ఆ 42 రోజులు ఏం చేస్తుంది..? -
బుమ్రా పెళ్లి వేడుకల ఫోటోలు.. కొత్త తలనొప్పులు
ముంబై: కొద్దిరోజుల కిందటే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఊహించని తలనొప్పులు వచ్చి పడ్డాయి. తన పెళ్లి వేడుకల్లో తీసుకున్న ఫోటోల్లో బాణసంచా కాల్చడం కనిపించడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని ఆయన, తన అభిమానులను కోరుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీటే ఆయన తలనొప్పికి కారణంగా మారింది. తన వివాహ వేడుకకు సంబంధించిన రెండు ఫోటోలను శుక్రవారం ఆయన ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'టపాసులు కాల్చొద్దని ఇతరులకు నీతులు చెప్పడమేనా.. మీరు స్వయంగా ఏమైనా పాటించేదుందా' అంటూ కొందరు, 'ఆచరణ సాధ్యంకాని ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని' మరికొందరు కామెంట్లు చేశారు. గతంలో ఆయన చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు రకరకాల పంచ్‌లు వేస్తున్నారు. కాగా, బుమ్రా ఈనెల 15న క్రీడా ఛానల్ వ్యాఖ్యాత సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Diwali celebration at home! 🎆 Wishing everyone a very Happy and a prosperous Diwali!💥🎆💥#saynotocrackers pic.twitter.com/koCbYkLJ4I — Jasprit Bumrah (@Jaspritbumrah93) October 19, 2017 The last few days have been nothing short of absolutely magical! We are so grateful for all the love & wishes we’ve received. Thank you. pic.twitter.com/dhWH918Ytu — Jasprit Bumrah (@Jaspritbumrah93) March 19, 2021 -
‘సిద్ధు.. ఎప్పుడు తప్పుకుంటావ్’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓడి పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు.. పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుని తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటావ్’ అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమేథీలో స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను సిద్ధు ఖండించారు. ‘అమేథీ కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోవడం అనే మాట కల. ఒకవేళ అదే జరిగితే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాన’ని సిద్ధు బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న వెల్లడించిన ఫలితాల్లో స్మృతి ఇరానీ.. 28 వేల మెజారిటీతో రాహుల్ గాంధీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు ‘సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటావ్’.. ‘రాజీనామ లెటర్ టైప్ చేయడం ప్రారంభించావా’.. ‘రాహుల్ ఓడిపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావ్.. ఇక బ్యాగ్ సర్దుకో.. ప్రపంచ కప్ వచ్చేస్తుందిగా.. నువ్వు బాగా మాట్లాడతావ్’.. ‘నువ్వు మాటల మనిషివని నాకు తెలుసు.. ఇక వెళ్లిపో’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. -
వార్నర్ పశ్చాతాపంపై నెటిజన్ల ఫైర్
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తప్పంతా తనదేనని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం మీడియా సమావేశంలో వార్నర్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే వార్నర్ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వార్నర్‌ది నకీలీ ఏడుపని కొందరంటే, ఆస్కార్ నటులను మించిపోయాడని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే వార్నర్‌కు బెస్ట్ టెలివిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వొచ్చని సెటైరేస్తున్నారు. మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఎలా తప్పించుకున్నాడో గమనించారా అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో వార్నర్ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడనని వెల్లడించాడు. కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వార్నర్ పునరాలోచన చేయాలని అతని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పులు అందరు చేస్తారని కానీ చేసిన తప్పును ఒప్పుకోవడం పెద్ద విషయమని, వార్నర్‌కు మద్దతివ్వాలని అతని అభిమానులు కోరుతున్నారు. Best television of the year so far — Joe kennedy (@kennedy510) 31 March 2018 Do you have to weep to be considered truly sorry for your actions? #DavidWarner — Dan Walker (@mrdanwalker) 31 March 2018 Notice how well he’s avoiding EVERY question? — Nathan Edwards (@NathanEdwards16) 31 March 2018 -
జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న వెస్టిండీస్ అండర్-19 క్రికెటర్ జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్చర్ కనీస ధర రూ.40 లక్షలు ఉండగా రూ.7.20 కోట్ల ధరకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. దీంతో ఆర్చర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఆర్చర్ భారత ద్వేషి అని, ముఖ్యంగా ధోనిని విమర్శిస్తూ గతంలో ట్వీట్లు చేశాడని భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జోఫ్రా గతంలో చేసిన ట్వీట్స్‌ను తొలిగించినప్పటికి వాటి స్క్రీన్ షాట్లతో నిలదీస్తున్నారు. ఆర్చర్ భారతీయులు నాశనం కావలని, ధోని తనకు తానే స్మార్ట్ అని భావిస్తున్నాడని, ధోని లూల్ అంటూ ఆ ట్వీట్లలో పేర్కొన్నాడు. భారత నాశనాన్ని కోరుకున్న క్రికెటర్‌కు ఐపీఎల్లో అవకాశమివ్వడేమిటని రాజస్తాన్ రాయల్స్ జట్టును అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ఆడాలంటే ముందుగా భారత దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విండీస్ అనమాక క్రికెటరైన ఆర్చర్ బిగ్‌బాష్ లీగ్‌లో రాణించి గుర్తింపు పొందాడు. బార్బోడాస్ జట్టు తరుపున బంతి, బ్యాట్‌తో సత్తా చాటడంతో ఐపీఎల్ వేలంలో కోట్లు పలికాడు. Don't let him play till he apologizes MSD — Rohit Joshi (@rpjoshi648) 29 January 2018 -
ధోని జట్టుపై పేలుతున్న జోకులు
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్లో రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో జట్టు యాజమాన్యం డబ్బులన్నీ వృథా చేసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలానికి ముందే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను రిటైన్ పద్దతిలో అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. మిగిలిన 22 మంది ప్లేయర్లను సీఎస్కే వేలంలో దక్కించుకుంది. అయితే జట్టు ఎంపికపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. యువ క్రికెటర్లను కాదని సీనియర్ క్రికెటర్లు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన మెత్తం 25 మంది ఆటగాళ్లలో 11 మంది ప్లేయర్లు వయసు రీత్యా 30 ఏళ్లకు పైబడినవారే కావడం విశేషం. ఈ వ్యవహారమే అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో వారి ఫొటో షాప్ నైపుణ్యానికి పని చెప్పి మరి సీఎస్కే యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్పిన్నర్ అశ్విన్ కాకుండా హర్భజన్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధోని జట్టుకు పెన్షన్ పథకం అమలు చేయండని కొందరంటే.. ఆట కంటే వయస్సునే పరిగణలోకి తీసుకున్నారని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆటగాళ్లు వారి వయసు.. 1. ఎంఎస్ ధోనీ-36 (రూ. 15 కోట్లు) 2. సురేష్ రైనా-31 (11 కోట్ల రూపాయలు) 3. డ్వేన్ బ్రేవో-34 (రూ 6.4 కోట్లు) 4. షేన్ వాట్సన్-36 (రూ .4 కోట్లు) 5. కేదార్ జాధవ్-32 (రూ .7.8 కోట్లు) 6. హర్భజన్ సింగ్ (2 కోట్లు)-37 7. అంబటి రాయుడు-32 (రూ 2.2 కోట్లు) 8. ఇమ్రాన్ తాహిర్ -38(రూ. 1 కోట్లు) 9. డుప్లెసిస్-33 (రూ. 1.6 కోట్లు) 10. మురళీ విజయ్-33 (రూ .2 కోట్లు) 11. కరణ్ శర్మ-30 (రూ .5 కోట్లు) CSK have launched "MS Dhoni Buddhe Bachao, Pension Dilao Yojana" #IPLAuction — Amol (@Imamol97) 27 January 2018 pic.twitter.com/abW89vxZOe — VIRENDER SEHWAG (@virendr_sehwag) 28 January 2018 -
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై అభిమానుల ఆగ్రహం
జోహన్నెస్‌బర్గ్ : భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు సఫారి ఆటగాళ్లు పై చేయి సాధించారు. కానీ ఆ దేశ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా విభాగం మాత్రం పప్పులో కాలేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్ల సహనానికే పరీక్షగా మారి అర్ధ సెంచరీ సాధించాడు భారత నయావాల్ పుజారా. ఈ తరుణంలో పుజారాను అభినందిస్తూ దక్షిణాఫ్రికా బోర్డు చేసిన ట్వీట్ భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ ఏం ట్వీట్ చేసారంటే.. ‘పుజారా కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా నెమ్మదిగా 173 బంతుల్లో సాధించాడు. తొలి పరుగుకే 50 బంతులాడిన విషయం తెలిసిందే’ అంటూ పుజారాకు బదులు అశ్విన్ ఫొటోను ట్వీట్ చేసింది. రెండో టెస్ట్ సమయంలోనూ భారత కీపర్ పార్థివ్ పటేల్ బదులు సాహా పేరుతో ట్వీట్ చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. సౌతాఫ్రికా చేసిన తాజా తప్పిదంపై భారత క్రికెట్ అభిమానులు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ట్వీట్ చేసే ముందు కళ్లజోడు పెట్టుకొని చేయాలని ఒకరంటే.. పుజారాలా మాకు ఓపిక ఉంది. చెత్త బంతులు, చెత్త ఫొటోలు వదలకండి అని ఘాటుగా ఇంకొంకరు కామెంట్ చేశారు. Here's 50 up for Pujara, his 17th in Test cricket, and probably his slowest too. He took 173 balls. Remember he needed over 50 balls to get his first run. India 143/4 #SAvsIND #FreedomSeries pic.twitter.com/dniIGsRQwh — Cricket South Africa (@OfficialCSA) 24 January 2018 That's not @cheteshwar1 it's @ashwinravi99 .use some specs or check before tweeting — pavankumar (@pavankumarmsc9) 24 January 2018 -
సర్ఫరాజ్ ధోనిని కాపీ కొట్టావా..?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనిని కాపీ కొట్టావా అంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం పాక్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు పాక్‌ను వన్డే సిరీస్‌లో 5-0తో వైట్ వాష్ చేయగా మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌ను సైతం కివీసే గెలుపొందింది. పాకిస్తాన్ విసిరిన 106 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఇంకా 25 బంతులుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫారాజ్ అవుటైన విధానంపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన టెక్నిక్‌తో స్టంప్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. అప్పట్లో ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిసింది. అదే టెక్నిక్‌ను సర్ఫరాజ్ తొలి టీ20లో ఉపయోగించాడు. కానీ ఇక్కడ సర్ఫరాజ్ అవుటయ్యాడు. ఇంకేముంది ఈ ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ నేర్చుకున్న టెక్నిక్ ఇదే అని ఒకరంటే.. లెజెండ్స్‌ను ఎప్పుడు ఫాలో కావాలని ఇంకోకరు.. ఇతరుల టెక్నిక్ కాపీ చేస్తే ఇలానే అవుతుందని మరోకరు కామెంట్ చేస్తున్నారు. When Sarfaraz tried a #Dhoni @msdhoni #NZvPAK 😂😂😂 pic.twitter.com/6aqRswIPOO — Ravi Kalle (@rt_Kalle) 22 January 2018 What a split, Sarfaraz learning ballet these days 😮 — Sawera Pasha (@sawerapasha) 22 January 2018 -
సోషల్ మీడియాలో రోహిత్‌పై పేలిన జోక్స్
సాక్షి, హైదరాబాద్ : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కోహ్లిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసిన నెటిజన్లు తాజాగా రోహిత్‌ను రోస్ట్ చేశారు. కుళ్లు జోకులతో, ఫొటో, వీడియో మార్ఫింగ్‌లతో హిట్ మాన్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఇక రోహిత్ 59 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేయడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. హిట్ మాన్‌గా ముద్ర వేసుకున్న రోహిత్ తన శైలికి భిన్నంగా బంతిని బ్యాట్‌కు తగిలించడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. స్టెయిన్, రబడా, మోర్కెల్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేక చేతులేత్తేశాడు. రబడా బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. శ్రీలంక సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబర్చడంతో కెప్టెన్ కోహ్లి వైస్ కెప్టెన్ రహానేను కాదని తుది జట్టులోకి తీసుకున్నాడు. కానీ హిట్ మ్యాన్ కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఇప్పటికే రహానేను ఎందుకు తీసుకోలేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు కోహ్లిని ఎత్తిపొడుస్తుండగా.. రోహిత్ వైఫల్యం కోహ్లికి మరిన్ని చికాకులు తెప్పించనుంది. రోహిత్‌పై పేలిన జోకులు.. ‘డేల్ స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కుంటే రోహిత్ డబుల్ సెంచరీ చేసినట్టే’ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో గంటసేపు తడబడ్డ రోహిత్ నాకు తెలిసి గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ వాచ్‌మన్. భారత్‌లోనే రోహిత్ వంద, రెండొందలు బాదగలడు..కానీ విదేశాల్లో రాణించలేడు. సీమర్స్ను ఎదుర్కోవాలంటే రోహిత్ ఒళ్లంతా ప్యాడ్స్ పెట్టుకోవాలి Exclusive pic of Rohit Sharma offering pads against express fast bowlers 😂😂 #SAvIND #INDvSA #FreedomSeries pic.twitter.com/9qkcJPg912 — Rahul (@clickator7) 6 January 2018 తొలి ఇన్నింగ్స్‌లో 92 కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అపద్భాందవుడిలా ఆదుకున్నాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న పాండ్యా(93) భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ 209 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు సైతం పాండ్యా తీయడం విశేషం. ఇక భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ రాణించకపోతే రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కడం కష్టమవుతోంది. -
కోహ్లిపై సెటైర్లతో నెటిజన్ల ఫైర్
కేప్‌టౌన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. దక్షిణాఫ్రికాతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో కోహ్లి(5) దారుణంగా విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కారు. కొందరైతే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫొటో మార్ఫింగ్‌లతో ట్రోల్ చేస్తున్నారు. తుది జట్టులో రహానేను తీసుకోకపోవడంపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ఓవర్సీస్లో రాణించే రహానేను ఎందుకు పక్కన పెట్టారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో దక్షిణాఫ్రికా 286 ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఓపెనర్లు మురళి విజయ్(1), శిఖర్ ధావన్(16)ల వికెట్లను స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. బాధ్యతాయుతంగా ఆడాల్సిన కోహ్లి(5) సైతం నిరాశపరచడంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో తమ ఆవేశాన్ని సోషల్‌మీడియాలో వెల్లగక్కారు. ఇప్పుడు ఈ పోస్టులు తెగవైరల్ అవుతున్నాయి. కోహ్లిపై అభిమానుల సెటైరిక్ ట్వీట్స్.. అంచనాలు : కోహ్లి ఏ పరిస్థితుల్లోనైనా ఆడగలడు. నిజం: బ్యాటింగ్ పిచ్‌లో 200 పైగా పరుగులు చేయగలడు. కానీ బౌలింగ్ పిచ్‌లో 20 పరుగులు చేయలేడు. కోచ్: కోహ్లి దక్షిణాఫ్రికాలో ఎందుకు ఇబ్బందిపడుతున్నావు..? కోహ్లి: జాతిపిత మహాత్మగాంధే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కున్నారు నేనేంత ‘హనీమూన్ డేస్ ఉద్యోగానికి రమ్మంటే ఇలానే ఉంటుంది.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాను.. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లైంది’. ‘కోహ్లి కన్నా స్మిత్ బెస్ట్. అన్నిపరిస్థితుల్లో స్మిత్ ఆడగలడు. కోహ్లి కేవలం ఉపఖండ పిచ్‌లపైనే రాణించగలడు’. ‘హనీమూన్ హ్యాంగోవర్ నుంచి బయటపడి తన సహజమైన ఆట ఆడటానికి కోహ్లి ఇంకా 10 నుంచి 15 ఇన్నింగ్స్‌లు తీసుకుంటాడు’. ‘మోదీగారు.. ఓవర్సీస్లో ఎలా రాణించాలో కోహ్లికి సలహాలివ్వండి’. Coach : why are you struggling in South Africa? Virat Kohli : even the great Mahatma Gandhi struggled here, mai kya cheez hun. #INDvSA — Pakchikpak Raja Babu (@HaramiParindey) 5 January 2018 ఈపర్యటన నేపథ్యంలో ఇప్పటికే టీమిండియాపై ఒత్తిడి నెలకొనగా తొలి మ్యాచ్‌లో ఓడితే మరింత ఒత్తిడి పెరగనుంది. దక్షిణాఫ్రికాలో ఆరుసార్లు పర్యటించిన భారత్ ఒక్కటంటే ఒక్క టెస్ట్ సిరీస్ గెలవలేదు. సఫారీలతో భారత్ కేవలం రెండు టెస్టులు మాత్రమే నెగ్గగా 8 ఓడి, 7 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఇక క్రీజులో రోహిత్, పుజారాలున్నారు. ఈ రోజు బ్యాటింగ్‌తో భారత విజయవకాశం తేలనుంది. -
షమీ శివలింగా ట్వీట్.. నెటిజన్ల ఫైర్
న్యూఢిల్లీ : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. కొత్త సంవత్సరం సందర్భంగా షమీ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. ఇది గుర్తించిన షమీ వెంటనే తన ట్వీట్‌ను తొలిగించాడు. అభిమానులనుద్దేశించి ‘నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబాలకు అన్ని శుభాలే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. అందరికీ హ్యాపీ న్యూఇయర్ అని’ పూలతో అలంకరించిన శివలింగా ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ముస్లిం వర్గానికి చెందిన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని ఘాటుగా స్పందించారు. ఇక షమీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలో తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా చేసిన ట్వీట్‌పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాంలో పుట్టినరోజు సంబరాలు చేసుకోరని ఫైర్ అయ్యారు. తన సతీమణి, కూతురితో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఫొటోపై కూడా విమర్శలొచ్చాయి. షమీ భార్య దుస్తులను ప్రస్తావిస్తూ.. ముస్లిమై బుర్ఖా ధరించకపోవడం ఏమిటని ట్రోల్ చేశారు. -
కోహ్లి రిసెప్షన్లో అనిల్ కుంబ్లే.! ఆశ్చర్యంలో అభిమానులు
ముంబై : టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య వివాదలున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే వీరి మధ్య ఈ వివాదాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచే సత్తా కోహ్లి సేనకే ఉందని కుంబ్లే కొనియాడటం.. ముంబైలో జరిగిన కోహ్లి-అనుష్కా రిసెప్షన్‌కు హజరవ్వడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. కుంబ్లే విరుష్కా రిసెప్షన్‌కు హజరవ్వడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. వారి గొడవలు ఆటలో భాగమే.. వ్యక్తిగతం కాదనీ కొందరంటే.. గొడవలు పక్కన పెట్టి కుంబ్లేను కోహ్లి ఆహ్వానించడం.. కుంబ్లే హజరవ్వడం వారి హుందాతానాన్ని చాటుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే కోహ్లి రిసెప్షన్‌కు కుంబ్లే హజరయ్యాడంటే మేము నమ్మమని ట్రోల్ చేస్తున్నారు. కోచ్‌గా కుంబ్లే ఆటగాళ్లను ఇబ్బంది పెడుతన్నాడని కోహ్లి కామెంట్ చేయడం.. దీంతో కోచ్ పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఇద్దరి మధ్య చాల పెద్ద వివాదం చోటుచేసుకుందని అందరు భావించారు. ఈ విషయం పలుమార్లు ఈ ఇద్దరు బాహటంగానే వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ 5న టీచర్స్‌డే సందర్భంగా కోహ్లి సోషల్ మీడియాలో తన గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో కుంబ్లే లేకపోవడంపై నెటిజన్లు కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికొకరు బర్త్‌డే విషెస్ చెప్పుకోకపోవడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మహ్మద్ కైఫ్‌పై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కైఫ్‌ను నెటిజన్లు మతాన్నిప్రస్తావిస్తూ దూషణకు దిగుతున్నారు. సోమవారం కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కైఫ్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. ఈ ఫొటోకు కొంతమంది ‘నీవు నిజమైన భారతీయునివి’ అని సానుకూలంగా స్పందించంగా మరికొంత మంది ఘాటుగా వ్యక్తిగత దూషణకు దిగారు. ఓ ముస్లింగా క్రిస్మమస్ శుభాకాంక్షలు తెలపడం షేమ్ అని కొందరంటే.. నీ మతమేంటో మరిచిపోయావా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే నీ తాత హిందువు నుంచి ముస్లిం మతం ఎంచుకున్నాడా.., ఇలాంటివి పోస్ట్ చేసే ముందు నీ మతం ఏంటో తెలుసుకో అని ట్రోల్ చేస్తున్నారు. కైఫ్ నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వడం ఇది తొలిసారేం కాదు. గతంలో యోగా చేస్తూ సూర్యనమస్కారాలు పెట్టడం, కొడుకుతో చెస్ ఆడుతున్నఫొటోలతో విమర్శలకు గురయ్యాడు. వీటన్నిటికి స్ట్రాంగానే రిప్లే ఇచ్చిన కైఫ్ తాజా కామెంట్లకు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. Merry Christmas ! A post shared by Mohammad Kaif (@mohammadkaif87) on Dec 24, 2017 at 7:24pm PST -
రాజాసింగ్, పవన్ కళ్యాణ్‌లపై మహేశ్ కత్తి ఫైర్
సాక్షి, హైదరాబాద్: సినీ విమర్శకుడు మహేశ్ కత్తిపై కేసు నమోదు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహేశ్ కత్తి తనదైన శైలిలో స్పందించారు. ‘చట్టం తెలియని ఒక ఎమ్మెల్యే నా మీద ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎవరు కంగారు పడకండి. ఆ ఫిర్యాదు చెల్లదు. అది కేసు అసలే కాదు. నాకు చట్టాల గురించి బాగా తెలుసని పోస్ట్ చేశాడు’. అంతకు ముందు చీప్ పబ్లిసిటీ కోసం మహేశ్ కత్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నరహంతకుడితో పోల్చాడని వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ ట్వీట్ చేశారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించే క్రమంలో మహేశ్ కత్తి మోదీని నరహంతకుడితో పోల్చిన విషయం తెలిసిందే. ఏమాత్రం తగ్గని కత్తి.. ఇప్పటి వరకు కేవలం పవన్ కళ్యాణే టార్గెట్ చేసిన మహేష్ కత్తి తాజా పోస్టులో మోదీ వ్యాఖ్యలపై విమర్శనస్త్రాలు విడిచారు. మణిశంకర్ అయ్యర్ అన్నాడు. మోదీ రుజువు చేసుకున్నాడు. మణిది బాధ్యత లేని వాగుడు. మోదీది బాధ్యత మరిచిన సణుగుడు. అంతే! అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒంగోలు పర్యటనను విడిచి పెట్టిన మహేశ్ కత్తి ప్రశ్నించే నాయకుడికి మరో ప్రశ్నవేసాడు. బాబును రాజీనామ చేయమను పవన్ కళ్యాణ్ ‘నిజమే...ఎక్కడో రైలు దుర్ఘటన జరిగితే లాల్ బహుదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రాజీనామ చెయ్యాలో. ఒకసారైనా రిజైన్ చెయ్యమని కోరకూడదా పవన్ కళ్యాణ్!’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ అభిమానులు మహేశ్ కత్తిని బద్ద శత్రువుగా చూస్తుండగా.. తాజాగా రాజాసింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ కార్యకర్తలు సైతం ఆయనకు వ్యతిరేకంగా మారనున్నారు. Best way to be in news is to target @narendramodi ji for a cheap publicity. Focus on being a film critic for your livelihood Request @hydcitypolice to register case against him immediately as he called Modiji a Murderer — Raja Singh BJP MLA (@TigerRajaSingh) 8 December 2017 -
పవన్‌పై మరోసారి ‘కత్తి’ దూసాడు
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్‌పై సినీవిమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గురువారం రాజమండ్రిలో జనసేన కార్యకర్తల సమావేశంలో తన చుట్టూ ఒక కులమే.. ఉందని తనకు ఓ కులానికి పరిమితం చేస్తే అందరి కుల లెక్కలు బయటపెడతానన్న పవన్ వ్యాఖ్యలపై ‘కత్తి’ సెటైరిక్‌గా విమర్శించారు. ‘తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో వచ్చిన ఈ విశ్వమానవుడు, మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అంతేగాకుండా.. మోదీతో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రాన మోదీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్’ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇక అంతకు ముందు చిరంజీవి సామాజిక న్యాయమంటూ మోసం చేశాడు. ఇప్పుడు నువ్వొచ్చావ్.. అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం. అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకో... రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాలని సూచిస్తూ.. మహేశ్ కత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రజాక్షేత్రంలో ఉంటా అని పవన్ వచ్చిన సమయంలో మహేశ్ కత్తి ఎంత మాత్రం వెనక్కు తగ్గకుండా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. -
నీతి సూక్తులు వద్దు బాబు.. నెటిజన్ల ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: నీతి సూక్తులు వద్దుబాబు.. నీవేమన్న సుద్దపూసవా..?అంటూ టీమిండియా క్రికెటర్ యువరాజ్‌సింగ్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనికి కారణం దీపావళికి ఫైర్ క్రాకర్స్ నిషేదిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు యువరాజ్ మద్దతు తెలుపుతూ.. పటాకులు వద్దు..దీపాలు ముద్దు అని ఫ్యాన్స్‌కు పిలుపు నివ్వడమే. యువీ ‘దీపావళికి ఫైర్ క్రాకర్స్ వద్దు.. దీపాలతో ఈ దీపావళిని జరుపుకుందాం. కాలుష్యంతో మనకు, మన పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఓ వీడియో మెసేజ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే నెటిజన్లు యువరాజ్ పెళ్లి సంబరాల ఫోటోలను ప్రస్తావిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పెళ్లికి పటాకులు కాలిస్తే కాలుష్యం కాదు..కానీ దీపావళికి కాలిస్తే వాతావరణం దెబ్బతింటుంది కదా యువరాజ్ అంటూ కొందరూ.. దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ విషవాయువులు రిలీజ్ చేస్తాయి. కానీ యువీ పెళ్లి వేడుకల్లో మాత్రం ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని వంగ్యచలోక్తులు విసురుతున్నారు. Hello Yuvraj Singh, Crackers creates pollution during diwali and not during your wedding! pic.twitter.com/Pzqw1YtPPD — Mishra Vikas (@camishravikas) 9 October 2017 Pic 1:Yuvraj Singh Supports #FirecrackerBan on Diwali Pic 2:On his Wedding,crackers Produced Oxygen & Delhi was Pollution Free#Hypocrites pic.twitter.com/CxFD0Mpmdh — Ashwin Pagare (@pagareashwin) 13 October 2017 -
భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిషేదించాలి: పాక్
లాహోర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ అనంతరం కొందరు ఆకతాయిలు రాయి విసిరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీన్నే ఆసరాగా తీసుకుంటూ.. పాక్ అభిమానులు ట్విట్టర్ వేదికగా భారత్‌పై ఉన్న తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిచడానికి వీలు లేదు. అక్కడ ఆటగాళ్లకు భద్రత కరువైంది. భారత్‌లో ఉగ్రవాద చర్యలు చోటు చేసుకుంటున్నాయి. ఐసీసీ వెంటనే భారత్‌లో క్రికెట్‌పై నిషేదం విధించాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక వరల్డ్ ఎకానమీ ఫోరం సంస్థ చేసిన సర్వేలో పర్యాటక దేశాల్లో ప్రపంచంలోనే నాలుగో ప్రమాదకరమైన దేశంగా పాకిస్థాన్ నిలిచింది. అలాంటి దేశం భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించొద్దని, అక్కడ ఆటగాళ్లకు భద్రత లేదని అంటోందా అని భారత అభిమానులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లపై పాక్‌లో ఉగ్రదాడి జరగడంతో ఐసీసీ ఆ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పాక్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ తీవ్రంగా శ్రమిస్తుస్తోంది. ఈ మధ్యే ప్రపంచ ఎలెవన్ జట్టు పాక్‌లో పర్యటించి టీ20 సిరీస్ ఆడింది. Alhamdullilah. Thanks to Allah . Pakistan is safe country. India is behind in all terrorists activities — Adil Raza 🇵🇰 (@AdilRaza1991) 10 October 2017 And then they say #Pakistan is not a safe place. I can assure you @AaronFinch5 that Pakistan is ever safer than #India. We are a peaceful & cricket loving nation We want our cricket back And we will do InshaAllah #HopeNotOut https://t.co/1wgI4oV3Us — HAMAS \o/ (@HamasulGhani) 11 October 2017 -
హర్భజన్సింగ్పై నెటిజన్ల విమర్శలు...
సాక్షి, హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై నెటిజన్లు ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. పంజాబీలో పెళ్లైన మహిళలు పవిత్రంగా జరుపుకునే ‘కర్వా చౌత్’ పండుగ సందర్భంగా బజ్జీ తన భార్యకు విషేస్ తెలియజేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం లేపింది. కర్వా చౌత్ శుభాకాంక్షలు గీతా బస్రా. నేను బానే ఉన్నా.. ఆకలిగా ఉంటుంది తినండి’ అని భార్య ఫోటోతో బజ్జీ పోస్టు చేశాడు. దీనిపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. ఈ మూడనమ్మకాన్ని పంజాబీలు ఇంకా పాటించడం బాధగా ఉంది. సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌లో ఇది ఒక మూఢాచారమని ఒకరు కామెంట్ చేయగా.. బజ్జీ సిక్కిసమ్ను బోధిస్తున్నాడని విమర్శించారు. ఈ ట్వీట్లపై మరికొందరు బజ్జీకి మద్దతుగా నిలిచారు. పంజాబీల గురించి మీకు అవగాహనలేకుంటే మాట్లాడకండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఓ బజ్జీ అభిమాని. ఇక హర్భజన్ కూడా నెటిజన్లకు ‘మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించకండి. మంచిగా ఉండటమే అతి పెద్ద మతమని’ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కార్తీక పౌర్ణమి తరవాత నాలుగవ రోజున ఈ కర్వా చౌత్ పర్వదినాన్ని ఉత్తరాది మహిళలు జరుపుకుంటారు. తమ భర్తలు ఆయు, ఆరోగ్యాల కోసం ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేసి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, చంద్రోదయం తర్వాత జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేయడం వలన తమ భర్త ఆయు, ఆరోగ్యాలతో ఉంటారని వారి విశ్వాసం. తమ భర్తను జల్లెడ చాటున చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. Happy karwa chaouth biwi ❤️❤️❤️😘😘😘@Geeta_Basra now khao 🍎🍇🍔🍕piyo moaj karo I am sure badi bukh lagi hogi 😜😜🍎 pic.twitter.com/6opQbjmDxq — Harbhajan Turbanator (@harbhajan_singh) 8 October 2017 Feeling sad to see a Punjabi is doing such a hypocrisy... Its called hypocrisy according to Shri Guru Granth Sahib Ji... — Amrit Lohar (@AmritLohar07) 8 October 2017 Kon se Granth mai likha hai yeh na karo wo na karo.Dharm ke naam par logo ko gumrah mat karo.phle acha insaan bano wohi sabse bada dharm hai https://t.co/92KlSAsCMh — Harbhajan Turbanator (@harbhajan_singh) 8 October 2017 -
రాహుల్ గాంధీ.. ఓ కొబ్బరికాయ!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రసంగాల మీద పదే పదే జోకులు పేలుతున్నాయి. తాజాగా ఆయన చేసిన మరో ప్రసంగం కూడా సోషల్ మీడియాలో జోకులకు కారణమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన 'మేకిన్ ఇండియా' నినాదాన్ని అంది పుచ్చుకోవాలనుకున్నారో ఏమో గానీ.. అచ్చం ఆయన మాట్లాడినట్లే మాట్లాడేందుకు రాహుల్ ప్రయత్నించి, బొక్కబోర్లా పడ్డారు. మణిపూర్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పైనాపిల్, వక్క, తమలపాకులు ఇలాంటివి చాలా విస్తృతంగా పండుతాయి. అందువల్ల అక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలన్నది రాహుల్ డిమాండు. ఆ విషయం చెప్పడానికి ఆయన చెప్పిన మాటలే చిత్రంగా ఉన్నాయి. ''లండన్‌లో ఎవరో ఒకరు కొబ్బరి రసం తాగుతూ ఉండాలి.. ఆ బాటిల్ మీద మేడిన్ మణిపూర్ అని రాసి ఉండాలన్నది నా ఆశ'' అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ అచ్చం ఇలాగే మాట్లాడుతుంటారు. కానీ, విషయం ఏమిటంటే.. మణిపూర్ వాతావరణానికి అక్కడ అసలు కొబ్బరిచెట్లే పెరగవు, కొబ్బరికాయలు కాయవు. ఆ సంగతి తెలుసుకోకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొబ్బరి నీళ్ల గురించి మాట్లాడటంతో ట్విట్టర్ జనాలు ఆయన మీద జోకులు పేల్చారు. బహుశా మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ఆయనకు స్పీచ్ రాసిచ్చేటపుడు మర్చిపోయారేమోనని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు.