
సీఎస్‌కే జట్టు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో జట్టు యాజమాన్యం డబ్బులన్నీ వృథా చేసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలానికి ముందే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను రిటైన్ పద్దతిలో అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే.
మిగిలిన 22 మంది ప్లేయర్లను సీఎస్‌కే వేలంలో దక్కించుకుంది. అయితే జట్టు ఎంపికపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. యువ క్రికెటర్లను కాదని సీనియర్ క్రికెటర్లు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన మెత్తం 25 మంది ఆటగాళ్లలో 11 మంది ప్లేయర్లు వయసు రీత్యా 30 ఏళ్లకు పైబడినవారే కావడం విశేషం. ఈ వ్యవహారమే అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో వారి ఫొటో షాప్ నైపుణ్యానికి పని చెప్పి మరి సీఎస్‌కే యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్పిన్నర్ అశ్విన్ కాకుండా హర్భజన్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధోని జట్టుకు పెన్షన్ పథకం అమలు చేయండని కొందరంటే.. ఆట కంటే వయస్సునే పరిగణలోకి తీసుకున్నారని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఆటగాళ్లు వారి వయసు..
1. ఎంఎస్ ధోనీ-36 (రూ. 15 కోట్లు)
2. సురేష్ రైనా-31 (11 కోట్ల రూపాయలు)
3. డ్వేన్ బ్రేవో-34 (రూ 6.4 కోట్లు)
4. షేన్ వాట్సన్-36 (రూ .4 కోట్లు)
5. కేదార్ జాధవ్-32 (రూ .7.8 కోట్లు)
6. హర్భజన్ సింగ్ (2 కోట్లు)-37
7. అంబటి రాయుడు-32 (రూ 2.2 కోట్లు)
8. ఇమ్రాన్ తాహిర్ -38(రూ. 1 కోట్లు)
9. డుప్లెసిస్-33 (రూ. 1.6 కోట్లు)
10. మురళీ విజయ్-33 (రూ .2 కోట్లు)
11. కరణ్ శర్మ-30 (రూ .5 కోట్లు)
CSK have launched "MS Dhoni Buddhe Bachao, Pension Dilao Yojana" #IPLAuction
— Amol (@Imamol97) 27 January 2018
— VIRENDER SEHWAG (@virendr_sehwag) 28 January 2018