IPL 2024: ధోని బాగా ఆడాలి.. కానీ, మ్యాచ్‌ మాత్రం మేమే గెలవాలి..! | IPL 2024: Lucknow Fans In Support Of Dhoni Erect A Hoarding In City Welcoming Him | Sakshi
Sakshi News home page

IPL 2024: ధోని బాగా ఆడాలి.. కానీ, మ్యాచ్‌ మాత్రం మేమే గెలవాలి..!

Published Thu, Apr 18 2024 4:30 PM | Last Updated on Thu, Apr 18 2024 4:54 PM

IPL 2024: Lucknow Fans In Support Of Dhoni Erect A Hoarding In City Welcoming Him - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా రేపు (ఏప్రిల్‌ 19) లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. లక్నో హోం గ్రౌండ్‌ అయిన భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇదివరకే లక్నోకు చేరుకున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో నిన్నటి నుంచే లక్నోకు క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకుంది.

నగరంలో ఎక్కడ చూసినా మ్యాచ్‌కు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఓ హోర్డింగ్‌పై రాసిన కంటెంట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ హోర్డింగ్‌పై ఏముందంటే.. ధోని బాగా ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ మ్యాచ్‌ మాత్రం ఎల్‌ఎస్‌జీనే గెలవాలని ఉంది.

ఈ కంటెంట్‌ చూస్తే లక్నో అభిమానులకు సైతం ధోనిపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఐపీఎల్‌ కోసం ధోని ఎక్కడికి వెళ్లినా ఇలాంటి క్రేజే కనిపిస్తుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమైనా అభిమానులు ఇంకా అతన్ని నామాన్నే జపిస్తూ ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇంచుమించు ఒకటే  తరహా ప్రదర్శనలతో ముందుకు పోతున్నాయి. లక్నోతో పోలిస్తే సీఎస్‌కే ఓ అడుగు ముందుంది. సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో ఆరింట మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం సీఎస్‌కే మూడు, లక్నో ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement