IPL 2024 CSK vs LSG Live Updates:
రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్‌కేపై లక్నో ఘన విజయం
ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిష్, మోహ్షిన్ ఖానా తలా వికెట్ సాధించారు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో..
134 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ముస్తఫిజుర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో కేఎల్ రాహుల్(73), పూరన్ ఉన్నారు.
కేఎల్ రాహుల్ ఫిప్టీ..
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీని రాహుల్ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లకు లక్నో స్కోర్: 103/0
9 ఓవర్లకు లక్నో స్కోర్: 84/0
9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(46), క్వింటన్ డికాక్(34) పరుగులతో ఉన్నారు.
4 ఓవర్లకు లక్నో స్కోర్: 32/0
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(19), క్వింటన్ డికాక్(23) పరుగులతో ఉన్నారు.
ఆఖరిలో ధోని మెరుపులు.. లక్నో టార్గెట్ 177 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిష్, మోహ్షిన్ ఖానా తలా వికెట్ సాధించారు.
సీఎస్‌కే ఆరో వికెట్ డౌన్..
మొయిన్ అలీ రూపంలో సీఎస్‌కే ఆరో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన అలీ.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధోని వచ్చాడు. 18 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 142/6
రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ..
17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(53), మొయిన్ అలీ(12) పరుగులతో ఉన్నారు.
సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్.. రిజ్వీ ఔట్
సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన సమీర్ రిజ్వీ.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్.. దూబే ఔట్
శివమ్ దూబే రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన శివమ్ దూబే.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 89/4
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్.. రహానే ఔట్
అజింక్య రహానే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన అజింక్య రహానే.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(20) పరుగులతో ఉన్నారు. 8.1 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 68/3
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్
సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. యష్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే(24), రవీంద్ర జడేజా(1) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. రవీంద్ర ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పులతో బరిలోకి దిగగా.. లక్నో ఒక మార్పు చేసింది. సీఎస్‌కే జట్టులోకి మొయిన్ అలీ, దీపక్ చాహర్ వచ్చారు. అదే విధంగా లక్నో తరపున మాట్ హెన్రీ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment