LSG
-
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. నంబర్ వన్‌గా..
-
అదరగొట్టిన రాహుల్.. చెన్నైపై లక్నో పైచేయి
-
IPL 2024: ధోని బాగా ఆడాలి.. కానీ, మ్యాచ్ మాత్రం మేమే గెలవాలి..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రేపు (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే లక్నోకు చేరుకున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో నిన్నటి నుంచే లక్నోకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. నగరంలో ఎక్కడ చూసినా మ్యాచ్‌కు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఓ హోర్డింగ్‌పై రాసిన కంటెంట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ హోర్డింగ్‌పై ఏముందంటే.. ధోని బాగా ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ మ్యాచ్ మాత్రం ఎల్‌ఎస్‌జీనే గెలవాలని ఉంది. Lucknow welcomes MS Dhoni. - The Craze is unmatched 💥 pic.twitter.com/b7WUge2bQw — Johns. (@CricCrazyJohns) April 18, 2024 ఈ కంటెంట్ చూస్తే లక్నో అభిమానులకు సైతం ధోనిపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఐపీఎల్ కోసం ధోని ఎక్కడికి వెళ్లినా ఇలాంటి క్రేజే కనిపిస్తుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమైనా అభిమానులు ఇంకా అతన్ని నామాన్నే జపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంచుమించు ఒకటే తరహా ప్రదర్శనలతో ముందుకు పోతున్నాయి. లక్నోతో పోలిస్తే సీఎస్కే ఓ అడుగు ముందుంది. సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో ఆరింట మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం సీఎస్కే మూడు, లక్నో ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
కేకేఆర్ చేతిలో లక్నో చిత్తు
-
లక్నో జోరుకు బ్రేక్.. ఢిల్లీకి రెండో విజయం
-
IPL 2024: లక్నోపై ఆర్సీబీ ఆధిపత్యం కొనసాగేనా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆర్సీబీ.. కేకేఆర్‌తో ఆడిన తమ చివరి మ్యాచ్‌లో హోం గ్రౌండ్లో పరాజయం చవిచూసింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉండగా.. లక్నో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ ఓటమితో ఆరో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ.. సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో ఓడి పంజాబ్‌పై గెలుపొందగా.. రాజస్థాన్ చేతిలో ఓడిన లక్నో.. పంజాబ్‌పై విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ఎదురెదురుపడగా.. మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ఓ మ్యాచ్‌లో లక్నో గెలుపొందాయి. ఐపీఎల్లో లక్నోపై ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. మెరుగ్గా కనిపిస్తున్న లక్నో.. అయితే ప్రస్తుత సీజన్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఆర్సీబీతో పోలిస్తే ఎల్ఎస్జీ పటిష్టంగా కనిపిస్తుంది. డికాక్, రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుశ్ బదోనిలతో కూడిన లక్నో బ్యాటింగ్ లైనప్ బలహీనమైన ఆర్సీబీ బౌలింగ్‌కు సవాలు విసురుతుంది. బౌలింగ్ విభాగంలోనూ లక్నో ఆర్సీబీ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. సంచలన పేసర్ మయాంక్ యాదవ్, నవీన్ ఉల్ హక్, మొహిసిన్ ఖాన్, రవి భిష్ణోయ్, కృనాల్‌తో లక్నో బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆర్సీబీ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఈ జట్టు పేపర్‌పై పటిష్టంగానే కనిపిస్తున్నా.. ఒక్క విరాట్ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాణించాడు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లు ఇప్పటివరకు బ్యాట్‌కు పని చెప్పలేదు. దినేశ్ కార్తీక్ ఆఖర్లో తన పాత్రను న్యాయం చేస్తున్నాడు. కోహ్లి, కార్తీక్ మినహా ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేవు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో ఆర్సీబీ చాలా పూర్‌గా ఉంది. సిరాజ్, యశ్ దయాల్, అల్జరీ జోసఫ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అత్యంత బలహీనమైనదిగా కనిపిస్తుంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. -
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ డేవిడ్ విల్లే లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత్‌కు రాకుండా స్వదేశమైన ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. గత రెండు నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉండిన విల్లే.. పీఎస్ఎల్ ఫైనల్ అనంతరం వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని లక్నో హెడ్ కోచ్ ఇవాళ (మార్చి 20) వెల్లడించాడు. కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్న విల్లే కుటుంబంతో కొద్ది రోజులు గడిపి తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అందుకే లక్నో మేనేజ్మెంట్ విల్లేకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఏది ఏమైనా విల్లే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం ఖాయంగా తెలుస్తుంది. విల్లేను ఐపీఎల్ 2024 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. విల్లే ఉన్నపళంగా హ్యాండ్ ఇవ్వడంతో ఎల్ఎస్జీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇదివరకే మరో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ స్వదేశీ బోర్డు అంక్షలు విధించడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు వుడ్‌పై వర్క్ లోడ్ పడకూడదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనికి ఐపీఎల్ ఆడేందుకు అనుమతి నిరాకరించింది. వుడ్ స్థానాన్ని ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ విండీస్ నయా పేస్ సంచనలం షమార్ జోసఫ్‌తో భర్తీ చేసింది. వుడ్ స్థానాన్ని భర్తీ చేసుకున్నామనుకునే లోపే విల్లే రూపంలో లక్నోకు మరో షాక్ తగిలింది. విల్లే గత రెండు సీజన్ల పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో లక్నో.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. తొలి విడతలో ప్రకటించిన షెడ్యూల్ వరకు లక్నో మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. 30న పంజాబ్‌తో (లక్నో), ఏప్రిల్ 2న ఆర్సీబీతో (బెంగళూరు), ఏప్రిల్ 7న గుజరాత్‌తో తలపడనుంది. లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మొమ్మద్ అర్షద్ ఖాన్. -
IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరుతో 2024 సీజన్‌కు తెరలేవనుంది. ఇక దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ మ్యాచ్?.. వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు తదితర వివరాలు తెలుసుకుందాం! ఐపీఎల్-2024 తొలి దఫా షెడ్యూల్లో 21 మ్యాచ్‌లు.. ఏయే వేదికల్లో అంటే! ►మార్చి 22- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే- CSK) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ- RCB)- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్- PBKS)వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ- DC)- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)- కోల్‌కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్(జీటీ-GT) వర్సెస్ ముంబై ఇండియన్స్(ఎంఐ- MI)- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్ టైటాన్స్- చెన్నై ►మార్చి 27- సన్‌రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్‌రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్‌రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో. నోట్: మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్‌లు.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3.30కి, రాత్రి జరిగే మ్యాచ్‌లు 7.30కి ఆరంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం. ఐపీఎల్-2024 తొలి దఫా మ్యాచ్‌లు జరిగే వేదికలు చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి దఫా షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్ హోం గ్రౌండ్‌గా ఉంటుంది. IPL 2024లో పాల్గొనే పది జట్ల వివరాలు చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. ►గాయపడిన ఆటగాళ్ళు: డెవాన్ కాన్వే, మతీష పతిరణ. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, దిల్షాన్ మధుశాంక. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: మహ్మద్ షమీ, రాబిన్ మింజ్. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొమ్మద్. అర్షద్ ఖాన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: మార్క్ వుడ్. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడం జంపా, ఆవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, అబిద్ ముస్తాక్, నండ్రే బర్గర్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, లుంగి ఎన్గిడి. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. చదవండి: SRH: రెండుసార్లు చాంపియన్‌గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ! -
స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాదు దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు, స్టార్టప్స్‌లో పెట్టుబడుల ద్వారా రాణిస్తున్నాడు. కోహ్లి ముఖ్యమైన వ్యాపార భాగస్వాములలో ఒకరు. బిలియనీర్ గురించి తెలుసా మీకు. ప్రత్యర్థి ఐపీఎల్ టీం ఓనరుతో కోహ్లి మధ్య వ్యాపార సంబంధాలు ఏంటో ఒకసారి చూద్దాం! ఆయన ఎవరోకాదు రూ. 7,090 కోట్ల ఐపీఎల్ టీం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గొయెంకా దేశీయ దిగ్గజం కంపెనీ మల్టీ బిలియన్డాలర్ల విలువైన ఆర్పీ గోయెంకా గ్రూప్ చైర్మన్ కూడా. ఈ కంపెనీ పవర్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ మీడియా, ఎంటర్టైన్మెంట్, విద్య వంటి అనేక పరిశ్రమలలో విస్తరించి ఉంది. ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టు ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకాతో అనేక వ్యాపారాల్లో జతకట్టడంతో పాటు ఇతర భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) 2017నుంచి కోహ్లీ ఫౌండేషన్, ఆర్పీసంజీవ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ కోసంవిరాట్,సంజీవ్ జత కట్టారు. అలాగే పలు వ్యాపార వెంచర్లలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాదు కోహ్లీ, గోయంకా ద్వయం సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం విశేషం దీంతో దాదాపు రూ. 50వేల కోట్ల ఆస్తి, రూ. 35,451 కోట్ల స్థిరమైన ఆదాయంతో ఆలరారుతున్న సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్ నేతృత్వంలోని ప్రముఖ స్నాకింగ్ బ్రాండ్ ‘టూ యమ్’కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా విరాట్ కోహ్లీ ఉండటం గమనార్హం. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) దీంతో పాటు ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ జట్టు , ఏటీకే మోహన్ బగాన్ ఫుడ్ బాల్ క్లబ్ ఓనరు కూడా .2023 నాటికి, ఆర్పీఎస్జీ గ్రూప్ గ్రూప్ ఆదాయం 4.3 బిలియన్ల డాలర్లకు పైమాటే. అంటూ దాదాపు రూ. 35,451 కోట్లకు పైనే. ఫోర్బ్స్ ప్రకారం, సంజీవ్ గోయెంకా వ్యక్తిగత నికర విలువ రూ. 17,300 కోట్లు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశంలో 83వ అత్యంత సంపన్నుడు, మొత్తం ప్రపంచంలో 1238వ స్థానంలో ఉన్నారు. సంజీవ్ గోయెంకా ఎక్కడ పుట్టారు 1961, జనవరి 29న పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో వ్యాపారవేత్త రామ ప్రసాద్ గోయెంకా, సుశీలా దేవి దంపతులకు జన్మించారు. -
కోహ్లీ పేరు ఫుల్ కిక్ ఇస్తుంది
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
ముంబై లక్నోని ఎందుకు ముంచేసింది... ఇక కష్టమే...
-
నవీన్ ఉల్ హక్ కి చెంపపెట్టులా కోహ్లి పై LSG ట్వీట్
-
ఒక 'SKY' మరో 'స్కై'తో.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరడంలో జట్టు బౌలర్ ఆకాశ్ మధ్వాల్ది కీలకపాత్ర. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్ మధ్వాల్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. బుమ్రా లేని లోటును తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా మారిన ఆకాశ్ మధ్వాల్ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడి 13 వికెట్లు పడగొట్టాడు. రానున్న క్వాలిఫయర్-2లో ఆకాశ్ కీలకపాత్ర వ్యవహరించే అవకాశం ఉంది. Photo: IPL Twitter ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ యాదవ్(SKY).. ముంబైని గెలిపించిన మరో SKY(ఆకాశ్ మధ్వాల్)ను ఫన్నీ ఇంటర్య్వూ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందుగా ఐదు వికెట్లతో ముంబైని గెలిపించినందుకు నీకు అభినందనలు.. కానీ ఇలాగే వదిలేస్తే మ్యాచ్‌లో పది వికెట్లు తీయాలని అనుకున్నావా అని ప్రశ్నించాడు. సూర్య ప్రశ్నకు ఆకాశ్ మధ్వాల్ నవ్వుతూ.. ''కచ్చితంగా.. వదిలేస్తే ఎలా ఊరుకుంటా'' అని పేర్కొన్నాడు. ''ఆకాశ్ మధ్వాల్ తనను తాను బెస్ట్ బౌలర్‌గా నిరూపించుకునే పనిలో పడ్డాడు. అవకాశమొచ్చి ఉంటే పది వికెట్లు తీసేవాడిని అని నాతో అన్నాడు. కానీ కీలక సమయంలో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషమనిపించింది. మా బౌలింగ్‌కు పెద్ద దిక్కులా నిలిచాడు.'' అంటూ సూర్య పొగడ్తలు కురిపించాడు. Photo: IPL Twitter 'రోహిత్ నిన్ను నమ్మి బంతి చేతిలో పెట్టడంపై ఎలా తీసుకున్నావని' సూర్య అడగ్గా.. ఆకాశ్ మధ్వాల్ మాట్లాడుతూ.. ''కెప్టెన్ రోహిత్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నా. వికెట్లు సాధించాలన్న తపనతో బౌలింగ్‌పై ఎక్కువ హార్డ్‌వర్క్ చేశా.. ఫలితం సాధించా. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు హోటల్ రూంలోనే నా బౌలింగ్‌పై నేను, రోహిత్ భయ్యా చర్చించుకున్నాం. కండీషన్స్‌ను బట్టి బౌలింగ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఆ సమయంలో నా మైండ్‌సెట్ క్లియర్‌గా ఉండడంతో రోహిత్ చెప్పింది బుర్రకెక్కింది.'' అంటూ తెలిపాడు. When 𝗦𝗞𝗬 meets 𝗦𝗞𝗬 🤝😁 A fabulous five-wicket haul, splendid run-outs and @mipaltan's massive #Eliminator win summed up ft. @surya_14kumar & Akash Madhwal 👌🏻👌🏻 - By @ameyatilak Full Interview 🎥🔽 #TATAIPL | #LSGvMI https://t.co/C90qLI8IFS pic.twitter.com/ry8LleIHiq — IndianPremierLeague (@IPL) May 25, 2023 చదవండి: #MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే! -
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
ఛాంపియన్ ఎవరు?
-
కే ఎల్ రాహుల్ అవుట్...ఎల్ఎస్ జీ లోకి కొత్త ప్లేయర్
-
కోచ్ లు డగౌట్ లో ఉండాలి.. గ్రౌండ్ లో ఏం పని
-
కోహ్లీ, గంభీర్‌కి బిగ్ షాక్.. నవీన్‌కి కూడా దెబ్బ పడింది
-
అమిత్ మిశ్రాపై విరాట్ కోహ్లీ ఫాన్స్ ఫైర్..
-
'వాట్ యాన్ ఐడియా సర్ జీ'.. ఈ దెబ్బతో బౌలర్లు దారిలోకి
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సోమవారం సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌లో సీఎస్కే 12 పరుగులతో గెలిచి సీజన్లో బోణీ కొట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో 34 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం ఆసక్తి కలిగించింది. ఇందులో వైడ్లు 20 ఉంటే.. సీఎస్కేవి 13 కాగా.. లక్నోవి ఏడు వైడ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ 13 వైడ్స్ ఇవ్వకపోయుంటే 25 పరుగులతో గెలిచి ఉండేది. అలా అయితే రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండేది. ఇక తమ బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వడంపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సీరియస్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ..'' తర్వాతి మ్యాచ్ నుంచి మా బౌలర్లు నోబాల్స్, వైడ్స్ ఎక్కువగా వేస్తే ఊరుకోను. నేను కెప్టెన్ పదవి నుంచి దిగిపోతా. అప్పుడు వేరే కెప్టెన్ నేతృతంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్.. ఇంకోసారి ఇలా జరిగితే తప్పుకుంటా'' అంటూ జట్టును హెచ్చరించాడు. ఇదే విషయమై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఒక యూనిక్ ఐడియా ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.'' మ్యాచ్‌లో బౌలర్లు రెండు లేదా మూడు వైడ్స్ వేస్తే బ్యాటర్‌కు ఫ్రీహిట్ ఇవ్వండి.. అప్పుడు బౌలర్లు ఆటోమెటిక్‌గా దారిలోకి వస్తారు. నియంత్రణతో బౌలింగ్ వేయడం చూస్తాం.'' అంటూ పేర్కొన్నాడు. కాగా లక్నో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో దీపక్ చహర్ వరుసగా మూడు వైడ్స్ వేసిన సమయంలో సునీల్ కామెంట్రీలో ఇలా స్పందించాడు. పక్కనే ఉన్న మరో కామెంటేటర్ ఇయాన్ బిషప్ మాత్రం..'' వినడానికి హాస్యాస్పదంగా'' ఉంది అంటూ కామెంట్ చేశాడు. అయితే బిషప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సునీల్.. ''ఇలాంటి వైడ్స్, నోబాల్స్ వల్ల మ్యాచ్ సమయం చాలా వృథా అవుతుంది. అందుకే నేను చెప్పింది మంచి ఆలోచనే.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తే మంచిది'' అంటూ తనను తాను సమర్థించుకున్నాడు. అయితే సునీల్ గావస్కర్ ఐడియాపై కొందరు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వాట్ యాన్ ఐడియా సర్ జీ.. దెబ్బకు బౌలర్లు దారిలోకి రావడం ఖాయం.'' అంటూ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు పలు కొత్త రూల్స్ వచ్చాయి. ఇంపాక్ల్ ప్లేయర్ అనే రూల్‌ను ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఇంపాక్ట్ రూల్‌ను అన్ని జట్లు విరివిగా వాడేస్తున్నాయి. ఇక వైడ్, నోబాల్స్ విషయంలోనూ ఆటగాళ్లు డీఆర్ఎస్కు వెళ్లే అవకాశాన్ని కల్పించారు.