IPL 2023 LSG Vs MI Eliminator: SKY Funny Interview With Akash Madhwal After 5 Wicket Haul Against LSG - Sakshi
Sakshi News home page

SKY-AkashMadhwal: ఆకాశ్‌ మధ్వాల్‌తో SKY ఫన్నీ ఇంటర్య్వూ.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?'

Published Thu, May 25 2023 11:50 AM | Last Updated on Thu, May 25 2023 12:50 PM

Ab-Kya-10-WKTS-Lega-SKY Pokes Fun Akash Madhwal 5-Wicket Haul Vs LSG - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ క్వాలిఫయర్‌-2కు చేరడంలో జట్టు బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ది కీలకపాత్ర. 3.3 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్‌ మధ్వాల్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. బుమ్రా లేని లోటును తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా మారిన ఆకాశ్‌ మధ్వాల్‌ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడి 13 వికెట్లు పడగొట్టాడు. రానున్న క్వాలిఫయర్‌-2లో ఆకాశ్‌ కీలకపాత్ర వ్యవహరించే అవకాశం ఉంది.


Photo: IPL Twitter

ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌(SKY).. ముంబైని గెలిపించిన మరో SKY(ఆకాశ్‌ మధ్వాల్‌)ను ఫన్నీ ఇంటర్య్వూ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముందుగా ఐదు వికెట్లతో ముంబైని గెలిపించినందుకు నీకు అభినందనలు.. కానీ ఇలాగే వదిలేస్తే  మ్యాచ్‌లో పది వికెట్లు తీయాలని అనుకున్నావా అని ప్రశ్నించాడు. సూర్య ప్రశ్నకు ఆకాశ్‌ మధ్వాల్‌ నవ్వుతూ.. ''కచ్చితంగా.. వదిలేస్తే ఎలా ఊరుకుంటా'' అని పేర్కొన్నాడు.

''ఆకాశ్‌ మధ్వాల్‌ తనను తాను బెస్ట్‌ బౌలర్‌గా నిరూపించుకునే పనిలో పడ్డాడు. అవకాశమొచ్చి ఉంటే పది వికెట్లు తీసేవాడిని అని నాతో అన్నాడు. కానీ కీలక సమయంలో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషమనిపించింది. మా బౌలింగ్‌కు పెద్ద దిక్కులా నిలిచాడు.'' అంటూ సూర్య పొగడ్తలు కురిపించాడు.


Photo: IPL Twitter

'రోహిత్‌ నిన్ను నమ్మి బంతి చేతిలో పెట్టడంపై ఎలా తీసుకున్నావని' సూర్య అడగ్గా.. ఆకాశ్‌ మధ్వాల్‌ మాట్లాడుతూ.. ''కెప్టెన్‌ రోహిత్‌ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నా. వికెట్లు సాధించాలన్న తపనతో బౌలింగ్‌పై ఎక్కువ హార్డ్‌వర్క్‌ చేశా.. ఫలితం సాధించా. ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు హోటల్‌ రూంలోనే నా బౌలింగ్‌పై నేను, రోహిత్‌ భయ్యా చర్చించుకున్నాం. కండీషన్స్‌ను బట్టి బౌలింగ్‌ చేస్తే రిజల్ట్‌ ఉంటుంది. ఆ సమయంలో నా మైండ్‌సెట్‌ క్లియర్‌గా ఉండడంతో రోహిత్‌ చెప్పింది బుర్రకెక్కింది.'' అంటూ తెలిపాడు. 

చదవండి: #MI: క్వాలిఫయర్‌-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement