eliminator match
-
రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముగిసింది. ‘కప్ నమ్దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్ నాకౌట్ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్‌తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్‌వెల్ (0)లను వరుస బంతులకు అవుట్ చేసి అశ్విన్ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్ ఇన్నింగ్స్ ఆర్సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో దినేశ్ కార్తీక్ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్... ఛేదనను జైస్వాల్, టామ్ కోలర్ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్ దయాళ్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్ ఇన్నింగ్స్‌ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్ (8) రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్‌లో పరాగ్ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్‌మైర్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్‌ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) (సబ్) ఫెరీరా (బి) చహల్ 33; డుప్లెసిస్ (సి) పావెల్ (బి) బౌల్ట్ 17; గ్రీన్ (సి) పావెల్ (బి) అశ్విన్ 27; పటిదార్ (సి) పరాగ్ (బి) అవేశ్ 34; మ్యాక్స్‌వెల్ (సి) జురేల్ (బి) అశ్విన్ 0; లోమ్రోర్ (సి) పావెల్ (బి) అశ్విన్ 32; కార్తీక్ (సి) జైస్వాల్ (బి) అవేశ్ 11; స్వప్నిల్ (నాటౌట్) 9; కరణ్ (సి) పావెల్ (బి) సందీప్ 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్: బౌల్ట్ 4–0–16–1, సందీప్ శర్మ 4–0–48–1, అవేశ్ ఖాన్ 4–0–44–3, అశ్విన్ 4–0–19–2, చహల్ 4–0–43–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కార్తీక్ (బి) గ్రీన్ 45; టామ్ కోలర్ (బి) ఫెర్గూసన్ 20; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కరణ్ 17; పరాగ్ (సి) సిరాజ్ 36; జురేల్ (రనౌట్) 8; హెట్‌మైర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 26; పావెల్ (నాటౌట్) 16; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్: స్వప్నిల్ 2–0–19–0, సిరాజ్ 4–0–33–2, దయాళ్ 3–0–37–0, ఫెర్గూసన్ 4–0–37–1, కరణ్ శర్మ 2–0–19–1, గ్రీన్ 4–0–28–1. -
Virat Kohli: రాజస్తాన్‌తో కీలక మ్యాచ్.. కోహ్లి ప్లాన్ ఇదే
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత... అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4కు అర్హత సాధించి.. టైటిల్ రేసులో నిలవగలిగింది.రాజస్తాన్ రాయల్స్‌తో అమీ తుమీఈ క్రమంలో ఎలిమినేటర్ రూపంలో తొలి గండం దాటేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో అమీ తుమీ తేల్చుకోనుంది.ఇక ఆర్సీబీ వరుస విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. కోహ్లి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 14 ఇన్నింగ్స్‌లో కలిపి 708 పరుగులు సాధించాడు.తద్వారా టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక రాజస్తాన్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.బౌలర్ల విషయంలో నా ప్లాన్ ఇదే‘‘అతిగా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. గణాంకాలను నేను పెద్దగా పట్టించుకోను. ప్రత్యర్థి జట్టు బౌలర్ .. రిస్ట్ పొజిషన్ ఏంటి? బాల్ ఎక్కడ వేస్తాడు? అన్న విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు చూడను.ఎందుకంటే.. మ్యాచ్ నాటికి ఆ బౌలర్ సరికొత్త, విభిన్న ప్రణాళికతో మన ముందుకు రావచ్చు కదా! అందుకే నేను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకే మొగ్గు చూపుతా.బౌలర్ బంతిని సంధించే సమయంలో కేవలం నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా. బాల్‌కు రియాక్ట్ అయ్యే విషయంలో నా మెదడు ఏది చెబితే అదే చేస్తా. మనకు మనంగా నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొనే వీలుంటుందని నేను బలంగా నమ్ముతాను. బేసిక్స్ మర్చిపోనుకంప్యూటర్ అనాలసిస్‌తో పరిస్థితులను అంచనా వేయలేం. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫలితాలనిస్తాయి. బేసిక్స్‌ను నేనెప్పుడూ మర్చిపోను. వాటి ఆధారంగానే మూడు ఫార్మాట్లలోనూ నేను ఒకే విధంగా ఆడటానికి ఒక రకంగా ఇదే కారణం అని చెప్పవచ్చు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం Incredible Icon @imVkohli talks about his mentality when he walks out to bat! 👀Will he unsettle #RajasthanRoyals' bowlers today and take #RoyalChallengersBengaluru a step closer to the #IPLfinal?📺 | #RRvRCB #Eliminator | TODAY, 6:30 PM | #IPLOnStar | #PlayOffsOnStar pic.twitter.com/Kkc1L0QqEo— Star Sports (@StarSportsIndia) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
WPL 2024: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమీతుమీకి అర్హత సాధించేందుకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా, గత సీజన్లో నిరాశపరిచిన బెంగళూరు కొత్తగా ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బృందం గెలిస్తే గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ముంబై గెలిస్తే మాత్రం 2023 సీజన్ ఫైనల్ పునరావృతం అవుతుంది. ఇక ఈ సీజన్ విషయానికొస్తే బెంగళూరు మెరుగుపడింది. లీగ్ ఆరంభ దశలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్లపై వరుస విజయాలతో టచ్‌లోకి వచ్చింది. అయితే గత ఫైనలిస్టులతో తలపడిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పటికీ అడపాదడపా విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో పాటు ఆఖరి మ్యాచ్‌లో ముంబైలాంటి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆర్సీబీ స్టార్ ఎలీస్ పెరీ ఆల్‌రౌండ్ షో ముంబైని ముంచేసింది. కీలకమైన పోరులో ఓపెనర్లు స్మృతి, సోఫీలు విఫలమైనా బ్యాట్‌తోనూ పెరీ జట్టును నడిపించింది. హిట్టింగ్తో రిచా ఘోష్ జట్టులో కీలకపాత్ర పోషిస్తోంది. సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్‌లు కూడా ధాటిగా ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్‌ను మినహాయించి ఓవరాల్‌గా చూసుకుంటే ముంబై డిఫెండింగ్ చాంపియన్ పాత్రకు న్యాయం చేసేలా ఆడింది. హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, అమెలియా కెర్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో స్పీడ్‌స్టర్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగళూరును ఓడించడం ఏమంత కష్టం కానేకాదు. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్‌లో లీగ్ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. -
ఒక 'SKY' మరో 'స్కై'తో.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరడంలో జట్టు బౌలర్ ఆకాశ్ మధ్వాల్ది కీలకపాత్ర. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్ మధ్వాల్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. బుమ్రా లేని లోటును తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా మారిన ఆకాశ్ మధ్వాల్ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడి 13 వికెట్లు పడగొట్టాడు. రానున్న క్వాలిఫయర్-2లో ఆకాశ్ కీలకపాత్ర వ్యవహరించే అవకాశం ఉంది. Photo: IPL Twitter ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ యాదవ్(SKY).. ముంబైని గెలిపించిన మరో SKY(ఆకాశ్ మధ్వాల్)ను ఫన్నీ ఇంటర్య్వూ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందుగా ఐదు వికెట్లతో ముంబైని గెలిపించినందుకు నీకు అభినందనలు.. కానీ ఇలాగే వదిలేస్తే మ్యాచ్‌లో పది వికెట్లు తీయాలని అనుకున్నావా అని ప్రశ్నించాడు. సూర్య ప్రశ్నకు ఆకాశ్ మధ్వాల్ నవ్వుతూ.. ''కచ్చితంగా.. వదిలేస్తే ఎలా ఊరుకుంటా'' అని పేర్కొన్నాడు. ''ఆకాశ్ మధ్వాల్ తనను తాను బెస్ట్ బౌలర్‌గా నిరూపించుకునే పనిలో పడ్డాడు. అవకాశమొచ్చి ఉంటే పది వికెట్లు తీసేవాడిని అని నాతో అన్నాడు. కానీ కీలక సమయంలో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషమనిపించింది. మా బౌలింగ్‌కు పెద్ద దిక్కులా నిలిచాడు.'' అంటూ సూర్య పొగడ్తలు కురిపించాడు. Photo: IPL Twitter 'రోహిత్ నిన్ను నమ్మి బంతి చేతిలో పెట్టడంపై ఎలా తీసుకున్నావని' సూర్య అడగ్గా.. ఆకాశ్ మధ్వాల్ మాట్లాడుతూ.. ''కెప్టెన్ రోహిత్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నా. వికెట్లు సాధించాలన్న తపనతో బౌలింగ్‌పై ఎక్కువ హార్డ్‌వర్క్ చేశా.. ఫలితం సాధించా. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు హోటల్ రూంలోనే నా బౌలింగ్‌పై నేను, రోహిత్ భయ్యా చర్చించుకున్నాం. కండీషన్స్‌ను బట్టి బౌలింగ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఆ సమయంలో నా మైండ్‌సెట్ క్లియర్‌గా ఉండడంతో రోహిత్ చెప్పింది బుర్రకెక్కింది.'' అంటూ తెలిపాడు. When 𝗦𝗞𝗬 meets 𝗦𝗞𝗬 🤝😁 A fabulous five-wicket haul, splendid run-outs and @mipaltan's massive #Eliminator win summed up ft. @surya_14kumar & Akash Madhwal 👌🏻👌🏻 - By @ameyatilak Full Interview 🎥🔽 #TATAIPL | #LSGvMI https://t.co/C90qLI8IFS pic.twitter.com/ry8LleIHiq — IndianPremierLeague (@IPL) May 25, 2023 చదవండి: #MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే! -
జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్; భలే దొరికాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు వెళ్లే దారిలో ఎలిమినేటర్‌ను క్లియర్ చేసి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 26(శుక్రవారం) గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్లో సీఎస్కేను చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై గెలుపుకు ప్రధాన కారణం ఆకాశ్ మధ్వాల్. తన సంచలన బౌలింగ్‌తో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆకాశ్ మధ్వాల్‌ను ముంబై తమ ట్రంప్‌కార్డ్‌గా భలే ఉపయోగించుకుంది. అంతకముందు లీగ్ దశలోనూ ప్లేఆఫ్ చేరాలంటే ఎస్ఆర్హెచ్పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లనూ ఆకాశ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన ఆకాశ్ మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. యార్కర్ల కింగ్ బుమ్రా లేని లోటును మధ్వాల్ తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు. Photo: IPL Twitter ఎలిమినేటర్ లాంటి కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధ్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. జాఫర్ వెలికితీసిన ఆణిముత్యం.. ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. యూపీ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. Photo: IPL Twitter ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా.. పంత్ పొరుగింట్లో నివాసం 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మధ్వాల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పొరుగింట్లోనే అతడు నివసిస్తుండటం విశేషం. వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కోసం.. ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. Photo: IPL Twitter ఆర్సీబీ వదిలేసింది.. ముంబై ఒడిసిపట్టింది 2021లోనే ఆకాశ్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. 2022లో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. Photo: IPL Twitter ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్సీబీ ఆకాశ్‌కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా.. ముంబై మాత్రం ఆకాశ్‌ను ఆడించి ప్రయోజనం పొందింది. 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: #DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు! పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
IPL 2023 Eliminator: చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ఒక్క దెబ్బకు ఎన్ని రికార్డులో..!
లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు (3.3-0-5-5) నమోదు చేసిన ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వాల్.. ఈ ఒక్క ఫీట్‌తో పలు ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ వివరాలేంటో చూద్దాం.. ఐపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ ఆకాశ్ మధ్వాల్ (5/5) అంకిత్ రాజ్‌పుత్ (5/14, పంజాబ్ 2018), వరుణ్ చక్రవర్తి (5/20, కేకేఆర్ 2020), ఉమ్రాన్ మాలిక్ (5/25, సన్‌రైజర్స్ 2022) ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు ఆకాశ్ మధ్వాల్ (5/5) డౌగ్ బొలింగర్ (4/13) జస్ప్రీత్ బుమ్రా (4/14) ధవల్ కులకర్ణి (4/14) ఐపీఎల్లో అతి తక్కువ ఎకానమీతో 5 వికెట్లు ఆకాశ్ మధ్వాల్ (5/5, 1.4 ఎకానమీ) అనిల్ కుంబ్లే (5/5, 1.57, 2009) జస్ప్రీత్ బుమ్రా (5/10, 2.50, 2022) ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు అల్జరీ జోసఫ్ (6/12) సోహైల్ తన్వీర్ (6/14) ఆడమ్ జంపా (6/19) అనిల్ కుంబ్లే (5/5) ఆకాశ్ మధ్వాల్ (5/5) కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నోపై ముంబై 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది. చదవండి: ముంబై ఆనందం ‘ఆకాశ’మంత... -
సపోర్ట్ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్ ఉందని ముందే పసిగట్టాను: రోహిత్ శర్మ
ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. పేసర్ ఆకాశ్ మధ్వాల్ (3.3-0-5-5) అద్భుతమైన బౌలింగ్ విన్యాసాలతో ముంబైని గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, లక్నో బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసిన ఆకాశ్‌పై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. యువ పేసర్‌ను ఆకాశానికెత్తాడు. గత సీజన్లో ఆకాశ్ సపోర్ట్ బౌలర్‌గా జట్టులో చేరాడని, అతనిలో టాలెంట్‌ను ముందే పసిగట్టానని, జోఫ్రా ఆర్చర్ మధ్యలో వెళ్లిపోయాక ఆకాశ్ అతని లోటును భర్తీ చేయగలడనే నమ్మకం ముందే కలిగిందని, ఆకాశ్.. ముంబైని గెలిపించగలడని ముందే నమ్మానని రోహిత్ చెప్పుకొచ్చాడు. అనూహ్య పరిణామాల మధ్య ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, ఆపై ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గడంపై రోహిత్ స్పందిస్తూ.. చాలా సీజన్లుగా చేస్తున్నదే తాము ఈ సీజన్లోనూ చేశాం. అయితే ఈ సారి కాస్త వైవిధ్యంగా చేశామని అన్నాడు. జట్టులో యువ ఆటగాళ్ల (భారత ఆటగాళ్లు) గురించి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ కుర్రాళ్లు చాలామంది భారత్‌కు ఆడటం చూశాం. వారు తమకు ప్రత్యేకమనే అనుభూతిని కలిగించడం ద్వారా ఫలితాలు రాబట్టగలిగాం. ఈ ప్రదర్శనలే వారిని టీమిండియాకు ఆడేలా చేస్తున్నాయని తెలిపాడు. మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. జట్టుగా మేము ఫీల్డింగ్‌ను బాగా ఆస్వాదించామని, ఫీల్డ్‌లో ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉండటం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు. చెన్నైలో ఆడటంపై స్పందిస్తూ.. ఇది మాకు రెండో హోం టౌన్ లాంటిదని, ఇక్కడ ఆడినప్పుడుల్లా వాంఖడేలో ఆడిన ఫీలింగే కలుగుతుందని చెప్పుకొచ్చాడు. అంతిమంగా.. సమష్టిగా రాణించడం వల్లే తాము లక్నోపై విజయం సాధించగలిగామని తెలిపాడు. కాగా, లక్నోపై డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలవడం ద్వారా ముంబై క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. క్వాలిఫయర్-2లో రోహిత్ సేన.. గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఇందులో గెలిచిన జట్టు మే 28న జరిగే ఫైనల్లో సీఎస్కేతో తలపడుతుంది. చదవండి: #LSG: ఎలిమినేటర్ గండం దాటలేక.. ఓటమికి కారణాలెన్నో! -
ముంబై ఆనందం ‘ఆకాశ’మంత...
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి తమ అసలు స్థాయిని ప్రదర్శించింది. లీగ్ దశ చివర్లో కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై తమ బలాన్ని ఎలిమినేటర్‌లో చూపించింది. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శనతో గౌరవప్రదమైన స్కోరు సాధించిన టీమ్, ఆపై లక్నో సూపర్ జెయింట్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. పేసర్ ఆకాశ్ మధ్వాల్ అద్భుత బౌలింగ్‌కు తోడు టీమ్ మెరుపు ఫీల్డింగ్ ముంబైని రెండో క్వాలిఫయర్‌కు చేర్చాయి... ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్ సూపర్ ఆటతో ఐపీఎల్లో తన ఉనికిని ప్రదర్శించాడు. కనీస ప్రదర్శన ఇవ్వలేని పేలవ బ్యాటింగ్‌తో లక్నో కుప్పకూలడంతో హోరాహోరీగా సాగుతుందనున్న మ్యాచ్ కాస్తా ఏకపక్షంగా మారిపోయింది. ఇక ఫైనల్ చేరేందుకు శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో రోహిత్ జట్టు క్వాలిఫయర్–2 సమరానికి సిద్ధం కాగా, వరుసగా రెండో సీజన్లోనూ లక్నో నాలుగో స్థానానికే పరిమితమైంది. చెన్నై: ముంబై ఇండియన్స్ మరో కీలక అడుగు వేసింది. ఎలిమినేటర్ దశను విజయవంతంగా అధిగమించి క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన పోరులో ముంబై 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్ తన 3.3 ఓవర్ల కోటాలో 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆకాశ్ నిలిచాడు. కీలక భాగస్వామ్యం... ఓపెనర్లు ఇషాన్ కిషన్ (15), రోహిత్ శర్మ (11) ముంబైకి ఆశించిన ఆరంభాన్ని అందించలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే గ్రీన్, సూర్యకుమార్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. గ్రీన్ తాను ఎదుర్కొన్న తొలి 10 బంతుల్లోనే 6 ఫోర్లు కొట్టగా, సూర్య కూడా తనదైన శైలిలో వికెట్ వెనుక భాగంలో రెండు సిక్సర్లు బాది అలరించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 66 పరుగులు జోడించారు. అయితే నవీన్ వేసిన 11వ ఓవర్ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. ఈ ఓవర్లోనే సూర్య, గ్రీన్‌లను అతను అవుట్ చేశా డు. తర్వాతి నాలుగు ఓవర్లలో తడబడిన ముంబై 26 పరుగులే చేయగలిగింది. అయితే చివర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), నేహల్ వధేరా (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి ముంబైకి మెరుగైన స్కోరు అందించారు. ఆఖరి 5 ఓవర్లలో జట్టు 51 పరుగులు సాధించింది. టపటపా... ఛేదనలో లక్నోకు ఏదీ కలిసి రాలేదు. రెండో ఓవర్లోనే ప్రేరక్ మన్కడ్ (3) వెనుదిరగ్గా, ‘ఇంపాక్ట్’గా వచ్చిన కైల్ మేయర్స్ (18) పెద్దగా ప్రభావం చూపలేదు. మూడో స్థానంలో వచ్చి న కెపె్టన్ కృనాల్ పాండ్యా (8) కూడా విఫలమయ్యాడు. మరో ఎండ్‌లో స్టొయినిస్ మాత్రమే కాస్త ధాటిగా ఆడుతూ ఆశలు రేపాడు. కానీ ఆకాశ్ వరుస బంతుల్లో బదోని (1), పూరన్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 75/5కు చేరింది. 10 ఓవర్లలో 108 పరుగులు చేయాల్సిన కష్టసాధ్యమైన స్థితిలో స్టొయినిస్‌ను జట్టు నమ్ముకుంది. అయితే దీపక్ హుడా (15)తో సమన్వయ లోపంతో స్టొయినిస్ రనౌట్ కావడంతో జట్టు ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) పూరన్ (బి) యశ్ 15; రోహిత్ (సి) బదాని (బి) నవీన్ 11; గ్రీన్ (బి) నవీన్ 41; సూర్యకుమార్ (సి) గౌతమ్ (బి) నవీన్ 33; తిలక్ వర్మ (సి) హుడా (బి) నవీన్ 26; డేవిడ్ (సి) హుడా (బి) యశ్ 13; వధేరా (సి) బిష్ణోయ్ (బి) యశ్ 23; జోర్డాన్ (సి) హుడా (బి) మొహసిన్ 4; షోకీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–30, 2–38, 3–104, 4–105, 5–148, 6–159, 7–168, 8–182. బౌలింగ్: కృనాల్ 4–0–38– 0, గౌతమ్ 1–0–8–0, నవీన్ ఉల్ హక్ 4–0– 38–4, యశ్ ఠాకూర్ 4–0–34–3, మొహసిన్ 3–0–24–1, రవి బిష్ణోయ్ 4–0–30–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) గ్రీన్ (బి) జోర్డాన్ 18; ప్రేరక్ (సి) షోకీన్ (బి) ఆకాశ్ 3; కృనాల్ (సి) డేవిడ్ (బి) చావ్లా 8; స్టొయినిస్ (రనౌట్) 40; బదోని (బి) ఆకాశ్ 1; పూరన్ (సి) ఇషాన్ (బి) ఆకాశ్ 0; హుడా (రనౌట్) 15; గౌతమ్ (రనౌట్) 2; బిష్ణోయ్ (సి) జోర్డాన్ (బి) ఆకాశ్ 3; నవీన్ (నాటౌట్) 1; మొహసిన్ (బి) ఆకాశ్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం(16.3 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1–12, 2–23, 3–69, 4–74, 5–74, 6– 89, 7–92, 8–100, 9–100, 10–101. బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 3–0–21–0, ఆకాశ్ 3.3–0–5–5, జోర్డాన్ 2–1–7–1, గ్రీన్ 3–0– 15–0, షోకీన్ 1–0–18–0, చావ్లా 4–0–28–1. -
#LSG: ఎలిమినేటర్ గండం దాటలేక.. ఓటమికి కారణాలెన్నో!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి ప్లేఆప్స్కే పరిమితమైంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో 81 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్లో గతేడాదే కొత్తగా వచ్చి లక్నో సూపర్‌జెయింట్స్ ఎలిమినేటర్ గండాన్ని వరుసగా రెండోసారి కూడా దాటలేకపోయింది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన లక్నో.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు దాసోహమంది. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమికి చాలా కారణాలున్నాయి. మొదటిది పదేపదే జట్టును మార్చడం లయను దెబ్బతీసింది. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కృనాల్ పాండ్యా లీగ్ స్టేజీలో బాగానే నడిపించాడు. కైల్మేయర్స్ను కాదని ప్రేరక్ మన్కడ్‌ను తీసుకోవడం.. క్వింటన్ డికాక్‌కు అవకాశం ఇవ్వడం వరకు బాగానే ఉంది. అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌కు డికాక్‌ను పక్కనబెట్టి కృనాల్ పెద్ద తప్పే చేశాడు. అసలు ఏమాత్రం ఫామ్‌లో లేని దీపక్ హూడాకు అవకాశమిచ్చి చేతులు కాల్చుకున్నాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా ఔట్ చేసి చివరకు తాను కూడా రనౌట్ అయి కర్మ ఫలితం అనుభవించాడు. ముంబైతో ఎలిమినేటర్ మ్యాఛ్‌లో కైల్ మేయర్స్, డికాక్‌తో ఓపెనింగ్ చేయించి ఉంటే లక్నో పరిస్థితి వేరుగా ఉండేదేమో. కేఎల్ రాహుల్ ఉన్నప్పుడు జట్టు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికి మిడిలార్డర్లో స్టోయినిస్, పూరన్‌లు చాలా మ్యాచ్‌ల్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు, అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పూరన్ గోల్డెన్ డకౌట్ అవ్వడం.. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న స్టోయినిస్ రనౌట్ కావడం లక్నో ఓటమిని ఖరారు చేసింది. మరి వచ్చే సీజన్లోనైనా సరికొత్త ప్రణాళికతో ఎలిమినేటర్ గండం దాటి కప్ కొడుతుందేమో చూద్దాం. -
#Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వికెట్లతో చెలరేగి లక్నో వెన్నులో వణుకు పుట్టించిన ఆకాశ్ మధ్వాల్ ఇవాళ్టి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ లక్నోపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చరిత్రకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో 5 పరుగులకే ఐదు వికెట్లు తీసి అత్యంత బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన రెండో బౌలర్‌గా ఆకాశ్ మధ్వాల్ నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. 2009లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున కుంబ్లే ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక ముంబై ఇండియన్స్ తరపున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన ఆటగాడిగా ఆకాశ్ మద్వాల్ నిలిచాడు. ఇంతకముందు లసిత్ మలింగ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం అత్యుత్తమంగా ఉంది. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఐపీఎల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన జాబితాలో ఆకాశ్ మధ్వాల్ తొలి స్థానంలో నిలిచాడు. ఆకాశ్ తర్వాత అంకిత్ రాజ్‌పుత్- KXIP..(5/14 Vs SRH, 2018), వరుణ్ చక్రవర్తి-కేకేఆర్(5/20 Vs DC, 2020), ఉమ్రాన్ మాలిక్-ఎస్ఆర్హెచ్(5/25 Vs GT, 2022) ఉన్నారు. Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.కామెరాన్ గ్రీన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ 33, తిలక్ వర్మ 26, నిహాల్ వదేరా 23 పరుగులతో రాణించారు. ఇక జట్టులో ఒక్కరు కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోనప్పటికి ప్లేఆఫ్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ తొలిస్థానంలో నిలిచింది. ఇంతకముందు 2018 ఫైనల్లో సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ 178 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఒక్క ఫిఫ్టీ కూడా నమోదు కాలేదు. 2018లోనే క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్.. కేకేఆర్‌పై 174 పరుగులు, 2013 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 165 పరుగులు, 2008 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌పై సీఎస్కే 163 పరుగులు చేసింది. చదవండి: కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు! -
కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో కోహ్లి, నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన గొడవ సీజన్‌కే హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్యలో గంభీర్ దూరడంతో ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ గొడవ ఇప్పట్లో సద్దమణిగేలా కనిపించడం లేదు. కోహ్లి ఈ విషయం పెద్దగా పట్టించుకోకపోయినా క్రికెట్ అభిమానులు మాత్రం నవీన్ ఉల్ హక్‌ను టార్గెట్ చేస్తున్నారు. గొడవ జరిగిన తర్వాత లక్నో ఎక్కడికి వెళ్లి మ్యాచ్ ఆడినా నవీన్ ఉల్ హక్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే వస్తున్నారు. నవీన్ ఉల్ హక్ కూడా అభిమానులనుద్దేశించి వినూత్న గెస్టర్స్తో సమాధానం ఇస్తున్నాడు. తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ బుధవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్ తన చర్యతో మరోసారి హైలెట్ అయ్యాడు. మ్యాచ్‌లో రోహిత్ శర్మ 11 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్స్ దిశగా రోహిత్ భారీ షాట్ ఆడగా ఆయుష్ బదోని క్యాచ్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ వికెట్ తీసుకోగానే తన రెండు చేతులను చెవుల దగ్గర పెట్టి వినిపించడం లేదు అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసిన నవీన్ ఉల్ హక్.. గ్రీన్‌ను ఔట్ చేసిన సమయంలోనూ ఇదే తరహా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. కోహ్లితో కదా నీ వైరం.. మధ్యలో మా రోహిత్ ఏం చేశాడు అంటూ కామెంట్ చేశారు. Afghan breakthrough! Naveen gets the big wicket of Rohit Sharma in the #TATAIPL #Eliminator 👏#LSGvMI #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/vFl43ZPSuW — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: ధోని పట్టిందల్లా బంగారమే! -
లక్నోను ముంబై ఓడించగలదా.. రికార్డులు ఏం చెబుతున్నాయి..?
IPL 2023 LSG Vs MI- Eliminator: లక్నో సూపర్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం (చెన్నై) వేదికగా ఇవాళ (మే 24) జరుగనున్న ఐపీఎల్-2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి..? గత రికార్డులు ఏం చెబుతున్నాయి..? ఈ వివరాలను పరిశీలిస్తే.. ప్రస్తుత సీజన్లో లక్కు కొద్ది (గుజరాత్ ఆర్సీబీని ఓడగొట్టడంతో) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబైతో పోలిస్తే.. సీఎస్కేతో సమానంగా సత్తా చాటి ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నోకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయనేది జనాల అభిప్రాయం. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో సైతం అద్భుతంగా రాణిస్తున్న లక్నో.. కేవలం ఒక్కరిపై ఆధారపడకుండా సమష్ఠిగా విజయాలు సాధించింది. ఈ సీజన్లో లక్నో ట్రాక్ రికార్డు పరిశీలిస్తే.. వారు గెలిచిన 8 మ్యాచ్‌ల్లో బ్యాటర్లతో సమానంగా బౌలర్లు కూడా సత్తా చాటారు. అలాగే ఆ జట్టుకు కొన్ని మ్యాచ్‌ల్లో లక్ కూడా కలిసొచ్చింది. దీపక్ హుడా లాంటి అంచనాలు కలిగిన బ్యాటర్లు విఫలమైనా.. బ్యాటింగ్‌లో స్టోయినిస్, పూరన్, ప్రేరక్ మన్కడ్, కైల్ మేయర్స్.. బౌలింగ్‌లో బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ నిలకడగా సత్తా చాటారు. లక్నో పేస్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, స్పిన్నర్లు ఆ లోటును భర్తీ చేస్తున్నారు. ముంబై విషయానికొస్తే.. రోహిత్ సేనలో నాణ్యమైన బౌలర్లు లేనప్పటికీ, వారు పటిష్టమైన బ్యాటింగ్ విభాగంతో మ్యాచ్‌లు గెలిచారు. వీరికి కూడా లక్ భారీగా కలిసొచ్చింది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములు ఎదుర్కొన్న ముంబై అనూహ్యంగా పుంజుకుని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్, బెహ్రెన్‌డార్ఫ్, పియూష్ చావ్లా.. బ్యాటింగ్‌లో సూర్యకుమార్, గ్రీన్, ఇషాన్ కిషన్, నేహల్ వధేరా లాంటి వారు ముంబై విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. సూర్యకుమార్ తన అత్యుత్తమ ఫామ్‌లో ఉండగా.. రోహిత్ శర్మ నిలకడలేమి, నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగం లేకపోవడం ఆ జట్టుకు ప్రధాన లోటుగా చెప్పవచ్చు. అయినా వీరిదైన రోజున బ్యాటర్లు తెగిస్తే వీరిని ఆపడం చాలా కష్టం. ఇక, గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 3 సందర్భాల్లో గెలుపు లక్నోనే వరించింది. చదవండి: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే కౌంటరిచ్చిన జడేజా -
WPL 2023 Final: తొలి టైటిల్ కొట్టేదెవరు?
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్‌రేట్‌ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది. ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై ఉంది. ఆల్‌రౌండర్‌గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం. -
సివర్ జోరు... వాంగ్ హోరు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ లో ఆరంభ అంచనాలను నిజం చేస్తూ ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశ చివర్లో కాస్త తడబడినా... తమ స్థాయిని ప్రదర్శిస్తూ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం శుక్రవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 72 పరుగులతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో నాట్ సివర్ బ్రంట్ చెలరేగగా, బౌలింగ్ ఇసీ వాంగ్ లీగ్‌లో తొలి ‘హ్యాట్రిక్’తో సత్తా చాటింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నాట్ సివర్ (38 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించగా... అమేలియా కెర్ (19 బంతుల్లో 29; 5 ఫోర్లు) చివర్లో దూకుడుగా ఆడింది. అనంతరం యూపీ 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కిరణ్ నవ్‌గిరే (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెపె్టన్ అలీసా హీలీ పుట్టిన రోజునాడు ఓటమిని ఎదుర్కొన్న యూపీ టోర్నీని మూడో స్థానంతో ముగించగా... ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడుతుంది. సివర్ దూకుడు... ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో నాట్ సివర్ ఆట చుక్కానిలా నిలిచింది. వరుసగా నాలుగు కీలక భాగస్వామ్యాలతో ఆమె జట్టుకు భారీ స్కోరును అందించడంలో సఫలమైంది. తొలి బంతికే ఫోర్‌తో యస్తిక భాటియా (18 బంతుల్లో 21; 4 ఫోర్లు) ఆటను మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత యస్తికను అంజలి శర్వాణి వెనక్కి పంపించింది. ఆ తర్వాత హేలీ మాథ్యూస్ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) జత కలసింది. హేలీ తనదైన శైలిలో ధాటిగా ఆడలేక విఫలం కాగా, ఎకెల్‌స్టోన్ చక్కటి బంతికి హర్మన్‌ప్రీత్ (14) అవుటైంది. అయితే మరో ఎండ్‌లో మాత్రం సివర్ తన జోరు కొనసాగించింది. పార్శవి ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన ఆమె 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి 2 ఓవర్లలో ముంబై 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టడం విశేషం. టపటపా... కిరణ్ నవ్‌గిరే ఇన్నింగ్స్ మినహా యూపీ ఆటలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది. ఇషాక్ ఓవర్లో కిరణ్ 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడమై హైలైట్. కీలక ప్లేయర్లు అలీసా హీలీ (11), తాలియా మెక్‌గ్రాత్ (7), గ్రేస్ హారిస్ (14) విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. 56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో నవ్‌గిరే, సిమ్రన్ షేక్, సోఫీ ఎకెల్స్టోన్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించింది. వాంగ్ దెబ్బకు యూపీ ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) నవ్‌గిరే (బి) అంజలి 21; హీలీ మాథ్యూస్ (సి) నవ్‌గిరే (బి) పార్శవి 26; నాట్ సివర్ (నాటౌట్) 72; హర్మన్‌ప్రీత్ (బి) ఎకెల్‌స్టోన్ 14; అమేలియా కెర్ (సి) అంజలి (బి) ఎకెల్‌స్టోన్ 29; పూజ వస్త్రకర్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–31, 2–69, 3–104, 4–164. బౌలింగ్: హారిస్ 3–0–20–0, అంజలి 3–0–17–1, రాజేశ్వరి 4–0–36–0, ఎకెల్‌స్టోన్ 4–0–39–2, దీప్తి శర్మ 4–0–39–0, పార్శవి చోప్రా 2–0–25–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) హర్మన్ (బి) వాంగ్ 11; శ్వేత (సి) మాథ్యూస్ (బి) ఇషాక్ 1; తాలియా (రనౌట్) 7; నవ్‌గిరే (సి) సివర్ (బి) వాంగ్ 43; హారిస్ (సి) వాంగ్ (బి) సివర్ 14; దీప్తి శర్మ (సి) కలిత (బి) మాథ్యూస్ 16; సిమ్రన్ (బి) వాంగ్ 0; ఎకెల్‌స్టోన్ (బి) వాంగ్ 0; అంజలి (బి) కలిత 5; రాజేశ్వరి (ఎల్బీ) (బి) ఇషాక్ 5; పార్శవి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 110. వికెట్ల పతనం: 1–8, 2–12, 3–21, 4–56, 5–84, 6–84, 7–84, 8–94, 9–104, 10–110. బౌలింగ్: నాట్ సివర్ 3–0–21–1, సైకా ఇషాక్ 2.4–1–24–2, వాంగ్ 4–0–15–4, అమేలియా 3–0–25–0, మాథ్యూస్ 3–0–21–1, అమన్‌జోత్ 1–0–2–0, కలిత 1–0–2–1. -
ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి!
మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ముందు బ్యాటింగ్ ఎవరు రావాలనే దానిపై వివిధ పద్దతులు ఆచరించేవాళ్లం. ఒక పిల్లాడు వంగితే.. వాడి వీపుపై చేతులతో సంఖ్యలను చెబుతూ ఏ స్థానంలో ఎవరు ఆడాలనేది నిర్ణయించేవారు. మరికొంతమంది పచ్చాలు వేసేవారు. ఇదంతా గల్లీ క్రికెట్ కాబట్టి మస్తు ఎంజాయ్‌గా అనిపించేది. కానీ ఇదే తీరు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగితే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా అబుదాబి టి10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబి జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, క్రిస్ లిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రైక్ తీసుకోవాలనిదానిపై చిన్న గేమ్ ఆడారు. ఆ గేమ్ పేరు రాక్-పేపర్-సిసర్స్. ఈ గేమ్‌లో గెలిచిన హేల్స్ స్ట్రైక్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు అభిమానులు.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గల్లీ క్రికెట్‌లా ఆటలేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేవారు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన హేల్స్ సుల్తాన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్ అబుదాబిని 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఓడియన్ స్మిత్ 32 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 21 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-2లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 4న(ఆదివారం) న్యూయార్క్ స్ట్రైకర్స్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. pic.twitter.com/HC34HqTkbQ — Hassam (@Nasha_e_cricket) December 3, 2022 చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. -
'కోచ్‌గా ఉండుంటే కేఎల్ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని'
ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి సీజన్లోనే అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని జట్టు లీగ్ దశలో మంచి విజయాలు అందుకొని ఓవరాల్‌గా 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. ఐదు పరాజయాలతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒత్తిడిని అదిగమించలేక.. ఆర్సీబీ చేతిలో కేఎల్ రాహుల్ సేన ఓటమి చవిచూసి ఇంటిబాట పట్టింది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ సహచరులు విఫలమైనప్పటికి తాను మాత్రం 79 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అంతేకాదు వరుసగా నాలుగు సీజన్ల పాటు 600 పైచిలుకు పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా లక్నో కెప్టెన్ చరిత్ర సృష్టించాడు. ఇలా అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా సూపర్ సక్సెస్ అయిన కేఎల్ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం కేఎల్ రాహుల్ ఆటతీరును విమర్శించడం ఆసక్తి కలిగించింది. ''కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శన మెచ్చుకోదగినదే. కానీ ఓపెనర్‌గా వచ్చిన అతను.. చివరిదాకా నిలబడినప్పటికి బ్యాటింగ్‌లో వేగం తగ్గినట్లు అనిపించింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌ళో మంచి బౌండరీలు బాదిన రాహుల్ ఆఖర్లో అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. చివరి దాకా నిలబడాలనేది మంచిదే.. కానీ అదే సమయంలో వేగంగా ఆడడం కూడా ముఖ్యమే. కానీ నిన్నటి మ్యాచ్‌లో రాహుల్‌లో అది లోపించింది. తొలి పవర్ ప్లే ముగిసేసరికి 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్నో విజయానికి ఏడు ఓవర్లలో 99 పరుగులు అవసరమైన దశలోనూ రాహుల్ 42 బంతుల్లో 48 పరుగులతో ఆడుతున్నాడు. ఆ తర్వాతే బ్యాట్ ఝులిపించిన రాహుల్ మిగతా 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా కాకుండా మొదటి నుంచి రాహుల్ కాస్త దూకుడు ప్రదర్శించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒకవేళ నేను రాహుల్‌కు కోచ్‌గా ఉంటే మాత్రం అతని ఆటతీరుపై కచ్చితంగా తిట్టేవాడిని. అతను కెప్టెన్‌గా ఉన్నప్పటికి నిర్ణయాన్ని రాహుల్ చేతుల్లో నుంచి నేను తీసుకునేవాడిని. అయితే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి లాగా రాహుల్ కెప్టెన్సీకి అంతగా సూట్ కాలేడు. టెంపరరీగా అయితే మాత్రం అతను బెస్ట్ అని చెప్పొచ్చు.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022 Eliminator Match: లక్నో, ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్ లక్నో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! ఒకవేళ అలా కాకపోయి ఉంటే! Grateful for the game, grateful for the support! Check out Skipper's thoughts on today's eliminator🤝 See you next season! 👊#AbApniBaariHai💪 #IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/hyqA7tnXm8 — Lucknow Super Giants (@LucknowIPL) May 25, 2022 -
ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం అందింది. లైవ్ మ్యాచ్ చూస్తూనే ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహించినట్లు తేలింది. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్క్వాడ్(ఏఆర్ఎస్) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురు బిహార్‌కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికెత్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ ఐదుగురు స్టేడియంలోని ఎఫ్-1 బ్లాక్‌లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్‌లో మునిగిపోయారు. అనుమానం వచ్చి తోటి ప్రేక్షకులు స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్ వారిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ కోల్‌కతాలోని న్యూ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ రూటర్ చార్జర్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం -
డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సూపర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఒత్తిడిని దరి చేరనీయకుండా సూపర్ స్పెల్ వేశాడు. రెండు వైడ్లు సహా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షల్ కీలకమైన స్టోయినిస్ వికెట్‌ను పడగొట్టి ఆర్సీబీకి ఊరటనిచ్చాడు. ఒక రకంగా ఆర్సీబీ మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది ఈ ఓవర్లోనే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న హర్షల్.. లక్నోతో మ్యాచ్ తర్వాత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గానూ పేరు సంపాదించాడు. కాగా మ్యాచ్ విజయం అనంతరం హర్షల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడు ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఆ ఒత్తిడి అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక బౌలర్లో నెర్వస్‌లో సూపర్ బౌలింగ్ చేయడం ముఖ్యం. దానిని ఇవాళ లక్నోతో మ్యాచ్‌లో సాధించాను. గత రెండు- మూడేళ్లుగా హర్యానా తరపున డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ బాగా రాటుదేలాను. అలాంటి సందర్భాలను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలనుకున్నా. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ అవకాశం వచ్చింది. మ్యాచ్ ఓడిపోతే ఇంటిబాటే అన్న సందర్భంలో బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఇలాంటి చాలెంజ్‌లను సమర్థంగా స్వీకరిస్తా. వచ్చే సౌతాఫ్రికా సిరీస్‌కు భువనేశ్వర్‌తో కలిసి కొత్త బంతిని పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022 LSG Vs RCB: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ కార్తీక్ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్.. గంభీర్ రియాక్షన్ ఇదే -
'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్
మ్యాచ్ సీరియస్‌గా జరుగుతున్న సమయంలో తన ఫెవరెట్ ఆటగాడిని దగ్గరి నుంచి చూడాలనే కోరిక చాలా మంది ఫ్యాన్స్‌లో ఉంటుంది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో అది కష్టమని భావించి ఆ కోరికను చంపేసుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ కోరికను అణుచుకోలేక ఏం జరిగినా సరే మైదానంలోకి దూసుకొచ్చి తమ అభిమాన ఆటగాడిని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా అలాంటి సంఘటనే ఐపీఎల్ 2022 సీజన్లో చోటు చేసుకుంది. బుధవారం ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. లక్నో బ్యాటింగ్ సమయంలో ఆర్సీబీ ఆటగాడు కోహ్లి బౌండరీ లైన్ వద్ద సీరియస్‌గా ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో కోహ్లి వద్దకు ఒక అభిమాని పరిగెత్తుకు వచ్చాడు. అది చూసిన కోహ్లి.. అతనికి దూరంగా వెళ్లాడు. సెక్యూరిటీని పిలిచి ఆ వ్యక్తిని స్టేడియం నుంచి తీసుకెళ్లాలని అరిచాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సదరు వ్యక్తిని వడ్డ బస్తా ఎత్తినట్లుగా భుజంపై పెట్టుకొని స్టాండ్స్‌లోకి తీసుకెళ్లారు. ఇది చూసిన కోహ్లి తన నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు.. అభిమానుల వైపు తిరిగి జాన్‌సీనా(డబ్ల్యూడబ్యూఈ ఫేమ్) తరహాలో అదిరిపోయే రియాక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..? When the intruder towards Virat Kohli at Eden Gardens - VK couldn't control his laugh seeing policeman's reaction 😂 pic.twitter.com/Ctvw8fU4uy — sohom ᱬ (@AwaaraHoon) May 26, 2022 -
'నీ ఫోకస్ తగలెయ్యా.. కొంచెం ప్రైవసీ ఇవ్వు'
విరాట్ కోహ్లి ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తోడో.. ఆఫ్ ఫీల్డ్‌లో అంత సరదాగా ఉంటాడు. తననే ఫోకస్ చేస్తూ కెమెరామన్ చేసిన పనికి కోహ్లి ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ఇది చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ప్రాక్టీస్ సెషన్‌కు రెడీ అవడానికిముందు గార్డ్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు ఒక్కసారిగా కెమెరా యాంగిల్ కోహ్లివైపు తిరిగింది. దీంతో కోహ్లి.. నేను గార్డ్‌ను పెట్టుకోవాలి.. కాస్త కెమెరాను అటు తిప్పు అన్నట్లుగా అతనికి సైగలు చేశాడు. అయితే ఇదేం పట్టించుకోని కెమెరామన్ కోహ్లివైపే కెమెరాను ఫోకస్ చేశాడు. ఇది పట్టించుకోని కోహ్లి తన షర్ట్ తీసి గార్డ్‌ను పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ పైకి చూసిన కోహ్లికి కెమెరా తనవైపు ఉన్నట్లు అనిపించింది. నీ ఫోకస్ తగలెయ్యా.. కొంచెం ప్రైవసీ ఇవ్వు అన్నట్లుగా కోహ్లి సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక వర్షం అంతరాయంతో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ చేసింది. రజత్ పాటిదార్ 54 బంతుల్లో 112 నాటౌట్ సూపర్ సెంచరీతో మెరవగా.. కార్తీక్ 37 , కోహ్లి 25 పరుగులు చేశారు. చదవండి: Kohli-Ganguly: కోహ్లి స్టైలిష్ బౌండరీ.. గంగూలీ రియాక్షన్ అదిరే IPL 2022: రజత్ పాటిదార్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలి బ్యాటర్‌గా bhai guard to pehn ne do usko 😂😂 pic.twitter.com/eMVfhnwgTH — Ravi bhai (@highon_beer) May 24, 2022 -
లక్నో సూపర్ జెయింట్స్ ఔట్.. క్వాలిఫయర్-2కు ఆర్సీబీ
లక్నో ఔట్.. క్వాలిఫయర్-2కు ఆర్సీబీ ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. శుక్రవారం(మే 27న) రాజస్తాన్‌తో క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. ఇక ఈ సీజన్లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆఖరి వరకు పోరాడినప్పటికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, సిరాజ్, హర్షల్ పటేల్, హసరంగా తలా ఒక వికెట్ తీశారు. కేఎల్ రాహుల్ (79) ఔట్.. 79 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్ ...15 ఓవర్లలో 144/3 15 ఓవర్ల ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న దీపక్ హుడా వికెట్‌ను హసరంగా దక్కించుకున్నాడు. 9 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 84/2 ►9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 34, దీపక్ హుడా 17 పరుగులతో ఆడుతున్నారు. పోరాడుతున్న లక్నో.. 7 ఓవర్లలో 67/2 ►భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 7 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 29 పరుగులు, దీపక్ హుడా 6 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్(6) ఔట్ ►208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరు పరుగులు చేసిన డికాక్ సిరాజ్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో రెండడు ఓవర్లలో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీ భారీ స్కోరు ►ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్‌డౌన్‌లో వచ్చిన రజత్ పాటిదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 పరుగులతో సూపర్ సెంచరీతో మెరిశాడు. దినేశ్ కార్తిక్ చివర్లో 23 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్లందరు బారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయి, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. మహిపాల్ లామ్రోర్(14) ఔట్.. నాలుగో వికెట్ డౌన్ ►14 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్ రవిబిష్ణోయి బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. పాటిదార్ 66, కార్తిక్ 5 పరుగులతో ఆడుతున్నారు. పాటిదార్ ఫిప్టీ.. మ్యాక్స్‌వెల్(9) ఔట్ ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 9 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎవిన్ లూయిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక రజత్ పాటిదార్ సూపర్ ఫిప్టీతో మెరిశాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో పాటిదార్ అర్థశతకం సాధించాడు. 11 ఓవర్లలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కోహ్లి(25) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ►లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కోహ్లి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో మోసిన్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ 49, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. డుప్లెసిస్ గోల్డెన్ డక్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ►ఆర్సీబీ కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ►ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా 8 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ నిర్ణీత ఓవర్లతోనే జరగనుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం ► చిరుజల్లుల కారణంగా టాస్ కాస్త ఆలస్యం కానుంది. ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ►ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లోకి అడుగుపెట్టనుండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. కాగా క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ విజేత అమితుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో లక్నో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 పరాజయాలతో మూడోస్థానంతో ప్లేఆఫ్ చేరుకోగా.. ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. ఆరు పరాజయాలతో నాలుగో స్థానంతో అడుగుపెట్టింది. ఇక లీగ్ దశలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్ ఆర్సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ -
ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్డేట్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తరువాత జరిగే క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికలకు (ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వాంఖడే, బ్రబోర్న్ స్టేడియం, పూణేలోని ఎంసీఏ స్టేడియం) మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. దేశంలో కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలను విస్తరించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇందులో భాగంగా తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ రెండో క్వాలిఫయర్ సహా ఐపీఎల్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక మ్యాచ్‌లను ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, తొలుత తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే నెల (మే) 22 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఆ తరువాత క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 29న ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2022: కెప్టెన్‌గా తొలి గెలుపు.. ఆమెకే అంకితం: జడేజా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెండు జట్లకు చివరి అవకాశం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరుకుంది. నేడు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో యూపీ యోధతో పుణేరి పల్టన్; రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. నెగ్గిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఓడిన రెండు జట్లు నిష్క్రమిస్తాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. సెమీఫైనల్స్ 23న, ఫైనల్ 25న జరుగుతాయి.