
విరాట్ కోహ్లి ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తోడో.. ఆఫ్ ఫీల్డ్‌లో అంత సరదాగా ఉంటాడు. తననే ఫోకస్ చేస్తూ కెమెరామన్ చేసిన పనికి కోహ్లి ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ఇది చోటు చేసుకుంది.
విషయంలోకి వెళితే.. ప్రాక్టీస్ సెషన్‌కు రెడీ అవడానికిముందు గార్డ్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు ఒక్కసారిగా కెమెరా యాంగిల్ కోహ్లివైపు తిరిగింది. దీంతో కోహ్లి.. నేను గార్డ్‌ను పెట్టుకోవాలి.. కాస్త కెమెరాను అటు తిప్పు అన్నట్లుగా అతనికి సైగలు చేశాడు. అయితే ఇదేం పట్టించుకోని కెమెరామన్ కోహ్లివైపే కెమెరాను ఫోకస్ చేశాడు. ఇది పట్టించుకోని కోహ్లి తన షర్ట్ తీసి గార్డ్‌ను పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ పైకి చూసిన కోహ్లికి కెమెరా తనవైపు ఉన్నట్లు అనిపించింది. నీ ఫోకస్ తగలెయ్యా.. కొంచెం ప్రైవసీ ఇవ్వు అన్నట్లుగా కోహ్లి సీరియస్ లుక్ ఇచ్చాడు.
ఇక వర్షం అంతరాయంతో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ చేసింది. రజత్ పాటిదార్ 54 బంతుల్లో 112 నాటౌట్ సూపర్ సెంచరీతో మెరవగా.. కార్తీక్ 37 , కోహ్లి 25 పరుగులు చేశారు.
చదవండి: Kohli-Ganguly: కోహ్లి స్టైలిష్ బౌండరీ.. గంగూలీ రియాక్షన్ అదిరే
IPL 2022: రజత్ పాటిదార్ కొత్త చరిత్ర.. ఆర్‌సీబీ తరపున తొలి బ్యాటర్‌గా
bhai guard to pehn ne do usko 😂😂 pic.twitter.com/eMVfhnwgTH
— Ravi bhai (@highon_beer) May 24, 2022