cameraman
-
నంది అవార్డు గ్రహీత, కెమెరామెన్ కన్నుమూత
సీనియర్ టీవీ కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ అనారోగ్యంతో బుధవారం (మార్చి 3) మరణించారు. శ్వాస సంబంధ సమస్యతో మంగళవారంనాడు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంటక రమణ స్వస్థలం మచిలీపట్నం. ఋతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు, మొదలగు ప్రజాదరణ పొందిన పలు సీరియల్స్‌కు కెమెరామెన్‌గా పనిచేశారు. ఎస్వీబీసీ ఛానల్ నిర్మించిన “శ్రీ వైనతేయ” ధారావాహికకుగానూ 2009లో ఉత్తమ కెమెరామెన్‌గా నంది పురస్కారం అందుకున్నారు. పూరి జగన్ తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలీఫిలిమ్ “జీవితం" కు పోతన వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి టివి కెమెరామెన్ సంఘంతో పాటు బుల్లితెర ఇండస్ట్రీలోని పలువురు సంతాపం తెలిపారు. మచిలీపట్నంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: డేరింగ్ స్టంట్స్.. అజిత్ కారు ప్రమాదం వీడియో వైరల్ -
'అవతలికి పో'.. కెమెరామన్‌పై రొనాల్డో అసహనం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కెమెరామన్‌పై అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం మొదలైన అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా అల్-నసర్, అల్-సాహబ్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్ చేయడంలో విఫలమయ్యాడు. మ్యాచ్‌లో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో 0-0తో పేలవ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగిసిందిన్న బాధలో ఉన్న రొనాల్డో డగౌట్ వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనకాలే కెమెరామన్ అతన్ని అనుసరించాడు. రొనాల్డో ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుండడం చిరాకు తెప్పించింది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కొన్ని నీళ్లు తాగిన రొనాల్డో ఆ తర్వాత కొన్ని నీళ్లను కెమెరామన్వైపు చల్లుతూ.. ''అవతలికి పో'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కెమెరామన్ సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తన ట్విటర్లో ఒక పోస్టు షేర్ చేశాడు. ''గ్రూప్ స్టేజీలో మొదటి గేమ్ చాలా టఫ్‌గా అనిపించింది.. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. మేం పోరాడుతాం'' అంటూ కామెంట్ జత చేశాడు. 🎥 | مغادرة كريستيانو رونالدو قائد فريق #النصر أرضية الملعب بعد المواجهة "غير راض"، ويطلب من المصور إبعاد الكاميرا عنه. #كأس_الملك_سلمان_للاندية pic.twitter.com/4R2xoB7la7 — الشرق الأوسط - رياضة (@aawsat_spt) July 28, 2023 చదవండి: ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! ఆసియా కప్ తర్వాత జట్టు నుంచి అవుట్ -
ప్రిన్స్ హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు!.. కొద్దిలో తప్పిన ప్రమాదం
న్యూయార్క్: అమెరికాలో ఓ దాతృత్వ కార్యక్రమానికి వెళ్లొస్తున్న బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, భార్య మెఘాన్, అత్త డోరియా రాగ్లాండ్లను మీడియా ఫొటోగ్రాఫర్లు ఫొటోల కోసం వెంబడించారు. ఇది పాతికేళ్ల క్రితం హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానాను పారిస్‌లో కెమెరామెన్లు వాహనాల్లో వెంబడించడం అది విషాదాంతమవడాన్ని గుర్తుచేసింది. ‘ఆరు వాహనాల్లో మీడియా వ్యక్తులు ఏకంగా రెండు గంటలపాటు హ్యారీ వాహనాన్ని వెంబడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలు వాహనాలు దాదాపు గుద్దుకున్నంత పని జరిగింది. ఈ ఘటనలో పలు వాహనాలు, పాదచారులు, ఇద్దరు న్యూయార్క్ పోలీసు అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు’ అని హ్యారీ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. ఘటన తర్వాత పోలీస్ రక్షణలో వారు వెళ్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే అధికారికంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని న్యూయార్క్ పోలీసు విభాగం ప్రకటించింది. లండన్‌లో బ్రిటన్ రాజుగా చార్లెస్ పట్టాభిషేకÙకం తర్వాత దాదాపు నెలరోజుల తర్వాత తొలిసారిగా ఈ జంట మీడియా కంటపడటంతో మీడియా అత్యుత్సాహం చూపి ఉంటుందని వార్తలొచ్చాయి. చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
బ్యాటర్‌గా విఫలం.. కొత్త అవతారం ఎత్తిన హ్యారీ బ్రూక్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని చవి చూసింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో హోంగ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. బ్యాటర్ల వైఫల్యంతో ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ ప్రదర్శన ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. స్పిన్నర్ల బలహీతనను అధిగమించలేక బ్రూక్ వికెట్ పారేసుకుంటున్నాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో అయితే 14 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి నోర్ట్జే బౌలింగ్‌లో వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా కాసేపు కెమెరామన్‌గా అలరించాడు. బ్రూక్ కెమెరామన్ పాత్రను పోషించడంపై కామెంటేటర్ హర్షా బోగ్లే స్పందించాడు. ''ఓ మ్యాన్.. ఇవాళ బ్రూక్ రూపంలో మనకు ఒక కొత్త కెమెరామన్ కనిపిస్తున్నాడు. టెలివిజన్ ప్రొడక్షన్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కెమెరామన్‌గా బ్రూక్ చరిత్ర సృష్టించాడు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా బ్రూక్‌ను వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. He'll whack it outta the park and show you how it sails through the air too - Harry Brook 😉#SRHvDC #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/ar6t314xu3 — JioCinema (@JioCinema) April 24, 2023 చదవండి: #JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం -
#KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా!
ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆటగాళ్ల కంటే ఒకరిమీదే కెమెరాలు ఎక్కువ ఫోకస్‌గా ఉంటాయి. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా ఎవరనేది. అవునండీ ఆమె కావ్యా మారన్. ప్రతీ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అక్కడ టక్కున వాలిపోయి వారిని ఉత్సాహపరుస్తుంది. జట్టు ఓడిపోతే తాను బాధపడుతుంది.. గెలిస్తే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటుంది. అలాంటి కావ్యా మారన్‌కు ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒక కెమెరామన్ కోపం తెప్పించాడు. ఆ కోపానికి వేరే కారణం ఉంది లెండి. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని కావ్యా మారన్ తెగ సంతోషపడింది. కానీ కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ధావన్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్‌కు ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్‌లో కూర్చొని సీరియస్‌గా మ్యాచ్ చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో'' చల్ ..హట్ రే '' అని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులతో అసమాన ఆటతీరు ప్రదర్శించి పంజాబ్‌కు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. Baby #kavyamaran 😂 To cameraman Hat rey 😹😹#SRHvPBKS pic.twitter.com/duImSUu5OZ — चयन चौधरी (@Chayanchaudhary) April 9, 2023 -
‘నువ్వంటే ఇష్టం... నాతో ఉండిపో’.. వివాహితకు సినీ కెమెరామెన్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: వివాహితను వేధింపులకు గురిచేస్తున్న కెమెరామెన్‌పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్‌గూడ సమీపంలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న కూనపరెడ్డి శ్రీనివాస్(49) సినీ పరిశ్రమలో కెమెరామెన్‌గా, యాడ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. పలు సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటికి ఎదురుగా వివాహిత(39) తన భర్త, పిల్లలతో కలిసి 2007 నుంచి ఉంటోంది. శ్రీనివాస్ కుటుంబంతో పరిచయం ఉన్న బాధితురాలిని కొన్ని నెలలు గా తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇంటిముందు నిలబడి గట్టిగా కేకలు వేయడం, సదరు మహిళ గురించి చెడుగా మాట్లాడటంతో కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మద్యం మత్తులో అలా ప్రవర్తిస్తుంటాడని భావించిన వివాహిత భర్తతో పాటు కుటుంబసభ్యులు పలు మార్లు మందలించినా ఏ మాత్రం మార్పురాకపోగా వేధింపులు తీవ్రమయ్యాయి. నువ్వంటే ఇష్టం.. నాతో ఉండిపో.. అంటూ రోడ్డుమీదనే అటకాయించడం, తనమాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నా డు. దీంతో విసిగిపోయిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు కూనపరెడ్డి శ్రీనివాస్‌పై ఐపీసీ 354(డి), 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ -
యాక్... బాలేదు అని మోహం మీద చెప్పేస్తాడు: నాగ చైతన్య
-
నిర్మాతగా మారిన కెమెరామేన్.. యాక్షన్ థ్రిల్లర్‌గా రెండో సినిమా
Gnanashekar Sujana Rao Second Movie Action Thriller: ‘కంచె’, ‘మణికర్ణిక’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన జ్ఞానశేఖర్ (Gnanashekar) ‘గమనం’ సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తాజాగా జ్ఞానశేఖర్ నిర్మాతగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాను ‘గమనం’ దర్శకురాలు సుజనా రావు (Sujana Rao) తెరకెక్కించనున్నారు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక బాలీవుడ్లో విద్యుత్ జమాల్ హీరోగా చేస్తున్న ‘ఐబీ 71’, ‘జయం’ రవి హీరోగా చేస్తున్న తమిళ సినిమాకు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. చదవండి: దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
'నీ ఫోకస్ తగలెయ్యా.. కొంచెం ప్రైవసీ ఇవ్వు'
విరాట్ కోహ్లి ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తోడో.. ఆఫ్ ఫీల్డ్‌లో అంత సరదాగా ఉంటాడు. తననే ఫోకస్ చేస్తూ కెమెరామన్ చేసిన పనికి కోహ్లి ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ఇది చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ప్రాక్టీస్ సెషన్‌కు రెడీ అవడానికిముందు గార్డ్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు ఒక్కసారిగా కెమెరా యాంగిల్ కోహ్లివైపు తిరిగింది. దీంతో కోహ్లి.. నేను గార్డ్‌ను పెట్టుకోవాలి.. కాస్త కెమెరాను అటు తిప్పు అన్నట్లుగా అతనికి సైగలు చేశాడు. అయితే ఇదేం పట్టించుకోని కెమెరామన్ కోహ్లివైపే కెమెరాను ఫోకస్ చేశాడు. ఇది పట్టించుకోని కోహ్లి తన షర్ట్ తీసి గార్డ్‌ను పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ పైకి చూసిన కోహ్లికి కెమెరా తనవైపు ఉన్నట్లు అనిపించింది. నీ ఫోకస్ తగలెయ్యా.. కొంచెం ప్రైవసీ ఇవ్వు అన్నట్లుగా కోహ్లి సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక వర్షం అంతరాయంతో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ చేసింది. రజత్ పాటిదార్ 54 బంతుల్లో 112 నాటౌట్ సూపర్ సెంచరీతో మెరవగా.. కార్తీక్ 37 , కోహ్లి 25 పరుగులు చేశారు. చదవండి: Kohli-Ganguly: కోహ్లి స్టైలిష్ బౌండరీ.. గంగూలీ రియాక్షన్ అదిరే IPL 2022: రజత్ పాటిదార్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలి బ్యాటర్‌గా bhai guard to pehn ne do usko 😂😂 pic.twitter.com/eMVfhnwgTH — Ravi bhai (@highon_beer) May 24, 2022 -
మానస్ కేసు క్రైమ్ బ్రాంచ్‌కి! రాసలీలల చిప్ కోసమే..?
తమ కొడుకుది సుపారీ హత్యేనని ఆ తల్లిదండ్రులు, తన భర్త మరణం వెనుక కుట్ర దాగుందని, తనకి న్యాయం చేయకపోతే ఆత్మాహుతికి పాల్పడతానంటూ ఓ బాధితురాలు.. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందే ధర్నాకు సిద్ధపడడం సంచలనంగా మారింది. ఓ వెబ్‌పోర్టల్‌లో పని చేసే కెమెరామ్యాన్ హత్యోదాంతం.. ఇప్పుడు ఒడిశాను కుదిపేస్తోంది. ఓ వెబ్ పోర్టల్‌లో కెమెరామ్యాన్ మానస్ స్వాయిన్(28) హత్య ఉదంతం ఒడిషాను కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్న సదరు వెబ్ పోర్టల్ ఓనర్ సర్మిస్తా రౌత్ ఇంకా పరారీలోనే ఉంది. దాదాపు ఇరవై రోజులు కావొస్తున్న కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులపై విమర్శలు పెరిగాయి. దీంతో ఈ కేసును సీఐడీ క్రైం బ్రాంచ్‌కు కేసు అప్పగించింది ప్రభుత్వం. మానస్ స్వాయిన్‌ను ఫిబ్రవరి 7వ తేదీన ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లాడు. ఆ టైంలోనే సర్మిస్తాతో పాటు మరో నలుగురు వ్యక్తులు మానస్‌ను అపహరించి.. భువనేశ్వర్ సుందర్‌పాదాలో సర్మిస్తాకు చెందిన ఓ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజు మానస్ మృతదేహం పోలీసులకు దొరికింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యగా నిర్ధారించారు. చిప్ కోసమేనా? ఈ కేసు ఓ మెమొరీ చిప్ చుట్టూ తిరుగుతుండడం విశేషం. అందులో సర్మిస్తా, పలువురు ప్రముఖులకు చెందిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిని మానస్ స్వాయిన్ ఎక్కడో దాచి పెట్టాడని, తన రాసలీలలు బయటపడతాయనే భయంతోనే ఆమె అతన్ని దారుణంగా హతమార్చిందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమెకు ఉన్న పరిచయాలపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఒడిషా సమాచార విభాగంలో(OIS) అధికారిగా పని చేసిన నిరంజన్ సేథీని.. మూడు రోజుల కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన.. తన రిటైర్మెంట్కు సరిగ్గా ఒక రోజు ముందు సర్మిస్తా నడిపించే ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్‌కు యాడ్ పర్మిషన్లు ఇప్పించాడు. పైగా మానస్ హత్యకు ముందు రోజు సర్మిస్తా-నిరంజన్ మధ్య దాదాపు అరగంటకు పైగా ఫోన్ సంభాషణలు సాగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అందుకే అరెస్ట్ చేసి.. ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటిదాకా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సర్మిస్తా రౌత్ సోదరుడు పరమేశ్వర్‌ను విజయవాడలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రౌత్ తప్పించుకుని పోవడానికి పరమేశ్వర్ కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో రెండు టీంలు రంగంలోకి దిగాయి. ఒకటి రౌత్ కోసం గాలిస్తుండగా.. మరొకటి ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. సర్మిస్తా రౌత్ వేరే రాష్ట్రంలో తలదాచుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే కేసును లోతుగా దర్యాప్తు చేస్తే.. రాజకీయ, హైప్రొఫైల్ సెలబ్రిటీల గుట్టు బయటపడొచ్చని భావిస్తున్నారు. -
కెమెరామెన్‌ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన రష్యా మంత్రి
మాస్కో: రష్యాకు చెందిన మంత్రి ఒకరి ప్రాణాలు కాపాడబోయి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఓ డ్రిల్ శిక్షణలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. రష్యా అత్యవసర శాఖ మంత్రి యెవ్గెని జినిచేవ్ (55). ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ ఘటన నార్లిస్క్లోని ఆర్కిటిక్ పట్టణంలో బుధవారం జరిగింది. ప్రమాదవశాత్తు జినిచేవ్ ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటన వెలువడింది. చదవండి: బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు డ్రిల్‌లో భాగంగా శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కెమెరామ్యాన్‌ను రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్ ఏజెన్సీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిన్న కొండను జినిచేవ్ ఎగిరి దాటవేశారు. అయితే అలాగే కెమెరామ్యాన్ ప్రయత్నించగా ఆయన త్రుటిలో పడిపోతున్నారు. వెంటనే గ్రహించి జినిచేవ్ అతడిని పట్టుకున్నారు. అయితే అంచున కాలు పెట్టడంతో ఆయన త్రుటిలో కాలుజారి కిందపడి మృతి చెందారు. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు -
అందగత్తెపై కెమెరామెన్ జూమ్.. కామెంటేటర్ పాట
సాధారణంగా కెమెరామెన్ల కన్ను మైదానంలోనే ఆట, ఆటగాళ్ల మీదే కాదు.. చుట్టుపక్కల జరిగే వాటి మీద కూడా పడుతుంది. వెరైటీగా అనిపించేవాటితో పాటు అందంగా కనిపించే ఆడవాళ్లను కూడా బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంటారు. ఆ టైంలో స్క్రీన్ మీద కనిపించే వాళ్ల రూపాల్ని చూసి మురిసిపోతుంటారు కూడా. అయితే అలాంటి ఘటనే ఒకటి వీడియో ఇప్పడు వైరల్ అవుతుండగా.. రకరకాల రియాక్షన్లు వ్యక్తం అవుతున్నాయి. ఆడియెన్స్ గ్యాలరీలో కాళ్లు ముడుచుకుని కూర్చున్న ఓ అమ్మాయిని, ఆమె అందాల్ని పదే పదే జూమ్ చేస్తూ ఉండిపోయాడు కెమెరామెన్. అది గమనించిన కామెంటేటర్.. ఆ కెమెరామెన్ టైమింగ్‌కు తగ్గట్లే ఓ పాట పాడాడు. అలా ఒక్కసారి కాదు.. జూమ్ వేస్తూ చాలాసార్లు ఫోకస్ చేశాడు. ఇక ఆ చేష్టల్ని చూయింగ్ గమ్ నములుతూ ఆ అమ్మాయి కూడా అంతే లైట్ తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ ద్వారా వైరల్ అయ్యింది. ఈ వీడియో ఏ మ్యాచ్ సందర్భంగా జరిగిందో తెలియదు. పాతదో కొత్తదో లేదంటే ఎడిట్ చేసిందో క్లారిటీ లేదు. కానీ, @hfussbaIl అనే ట్విటర్ అకౌంట్ నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు ఆ కెమెరామెన్‌ను, మరికొందరు పాటపాడిన ఆ కామెంటేటర్ తీరును తప్పుబడుతూ తిట్లు తిడుతున్నారు. నైతిక విలువలు లేకుండా వ్యవహరించిన వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకొందరి బాధేంటంటే.. ఆ వ్యక్తి పాడిన పాటకి అర్థం తెలుసుకోవాలనే ప్రయత్నం. దీంతో ఓ వ్యక్తి అది అరబ్ పాట అని చెబుతూ.. ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేశాడు. ఆ అందానికి గుండెలో ముళ్లు గుచ్చుకున్నట్లు అయ్యిందని, జీవితాంతం ఆమె పాదాల దగ్గర పడి ఉండాలని ఉంద’ని ఆ పాట సారాంశం అని సదరు వ్యక్తి బదులిచ్చాడు. చదవండి: హిల్లరీ క్లింటన్‌ను ఉరి తీశారా? -
అమ్మో.. ఛోటానా? అంటారు
‘‘నాకు నేను అప్‌గ్రేడ్ అవడానికి ఇప్పటి సినిమాలు చూస్తా. ముఖ్యంగా ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో ఎంపికైన 5 సినిమాలు చూస్తా.. ఎలా తీశారనే టెక్నిక్స్ తెలుసుకుంటా. మన భారతీయ సినిమా, హాలీవుడ్ సినిమాలన్నీ ఇప్పుడు బాగా దగ్గరైపోయాయి. ప్రస్తుతం కొత్త డైరెక్టర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఎందుకంటే కొత్తవారు కొత్త ఆలోచనలతో వస్తారు. మనకు తెలియని విషయాలు కూడా వారికి తెలుస్తాయి’’ అని ప్రముఖ కెమెరామన్ ఛోటా కె.నాయుడు అన్నారు. అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరామన్‌గా చేసిన ఛోటా కె.నాయుడు చెప్పిన విశేషాలు. ►అల్లాణి శ్రీధర్‌గారి దర్శకత్వంలో నా తొలి సినిమా ‘రగులుతున్న భారతం’ స్టార్ట్ అయింది. అదే సమయంలో మా గురువు దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో ‘అమ్మ రాజీనామా’ చేశా. ‘రగులుతున్న భారతం’ కంటే ముందుగా ‘అమ్మ రాజీనామా’ విడుదలయింది. ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశాననే సంఖ్య కరెక్టుగా తెలియదు. మా వాళ్లేమో 94 అంటున్నారు. అందుకే 100కు దగ్గరలో ఉన్నానని చెబుతుంటా. ►కొందరు హీరోలు, నిర్మాతలు ‘అమ్మో.. ఛోటానా?’ అంటూ నా వద్దకు రాకుండా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటా. ఏ విషయంలోనూ రాజీ పడను. ‘ఠాగూర్’ సినిమాకి చిరంజీవిగారు ఛోటాని తీసుకుందామని చెప్పగానే వీవీ వినాయక్ ఎగిరి గంతెయ్యలేదు. మన మాట వింటాడో? లేదో? అని లోపల మదనపడ్డాడు. రెండు రోజులు షూటింగ్ తర్వాత.. ‘మీరేంటో, మీ పనేంటో నాకు అర్థం అయింది’ అని వినాయక్ సంతోషంగా చెప్పాడు. ►‘స్టాలిన్’ సినిమా తర్వాత ఓంకార్ యాంకర్‌గా ఉన్న ఓ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచాడు. అప్పటి నుంచి మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘జీనియస్’ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నానంటూ ఓంకార్ కథ చెప్పగానే ఆశ్చర్యపోయా. ఆ సినిమాకి డేట్స్ కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోయా. ఆ తర్వాత ‘రాజుగారి గది’ చిత్రానికి కూడా పని చేద్దామనుకున్నాం. కానీ, కుదరలేదు. ‘రాజుగారి గది 3’కి కుదిరింది. ►పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ అంశాలు తక్కువగా ఉంటాయి. నాకు చెప్పిన కథని ఓంకార్ అదే విధంగా తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో హీరో అశ్విన్ బాబు అనగానే పూర్తి స్థాయి పాత్రకి సరిగ్గా న్యాయం చేయగలడా?’ అనిపించింది. ఎందుకంటే హీరోగా చేయడం అంటే చాలా కష్టం. కానీ తన నటన చూశాక చాలా సర్ప్రైజ్ అయ్యా. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్... ఇలా ప్రతిదీ సింగిల్ టేక్‌లోనే చేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్గా తమన్నా స్థానంలో అవికా గోర్ని తీసుకున్నామని ఓంకార్ చెప్పగానే సరిగ్గా చేయగలదా? అనిపించింది. పతాక సన్నివేశాల్లో తన నటన చూసి అభిమాని అయిపోయా. అద్భుతంగా నటించింది. ►దర్శకత్వం చాలా కష్టమైన పని. ఇప్పుడు నాకున్న టెంపర్‌కి దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. పైగా ప్రస్తుతం సినిమాలకి కథ చాలా ముఖ్యం. అది లేకుంటే ఏమీ చేయలేం. మంచి కథ కుదిరితే కొన్నేళ్ల తర్వాత అయినా దర్శకత్వం చేస్తా. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ఆ తర్వాత ప్రేమకథలంటే ఆసక్తి. ►‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత రాత్రిళ్లు షూటింగ్ చేయడం మానేశా. కానీ, ‘రాజుగారి గది 3’కి మాత్రం చాలా రోజులు రాత్రిళ్లు పని చేయాల్సి వచ్చింది. పొద్దున్నే 6:30 గంటలకు సెట్స్‌కి వెళ్లడమే నా పని. రాత్రి అయినా ఎప్పుడు ప్యాకప్ చెబుతాడన్నది ఓంకార్ ఇష్టం. ►24 శాఖల్లో నాకు కొరియోగ్రఫీ అంటే ఇష్టం. భారతీయ కెమెరామన్లలో సంతోష్ శివన్, పీసీ శ్రీరామ్, ఛోటా కె.నాయుడు (నవ్వుతూ) అంటే ఇష్టం. హాలీవుడ్ కెమెరామన్ రాబర్ట్ రిచర్డ్సన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో రెండున్నర గంటలు కలిసి మాట్లాడిన రోజుని మరచిపోలేను. ఎవరైనా దర్శకులు, కెమెరామన్లు అద్భుతం చేస్తే అహంభావం లేకుండా వాళ్లకు నేను సరెండర్ అయిపోతా.. అభినందిస్తా. ►ఏ సినిమాకైనా 100శాతం డైరెక్టర్లతో ప్రయాణం చేస్తా. వాళ్లు అనుకున్న దానికంటే కనీసం ఒక్క శాతమైనా ఎక్కువ చేయాలనుకుంటా. అదే నా విజయ రహస్యం. నా తమ్ముడు శ్యామ్ కె.నాయుడు నా కంటే మంచి కెమెరామన్.. చాలా మంచి సినిమాలు చేశాడు. ప్రస్తుతానికి నేను కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. చివరి శ్వాస ఉన్నంత వరకూ కెమెరామన్గానే పని చేయాలన్నది నా కోరిక. -
పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్
జూబ్లీహిల్స్: చలన చిత్రం.. ఈ పరిశ్రమ ఎందరికో కలల ప్రపంచం. ఇందులో రాణించాలని వేలాది మది ఉవ్విళ్లూరుతుంటారు. అదే కలగా జీవిస్తుంటారు. కొందరు విజయం సాధిస్తుంటారు.. ఇంకొందరు అవకాశాలు రాక వెనుదిగుతుంటారు. కొందరు మాత్రమే తాము అనుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుని తమకు అనుకూలంగా మలచుకుంటారు. అలాంటి వారిలో ఒకడు ‘సుధాకర్’. కెమెరాపై ప్రేమ పెంచుకున్న ఈ యువకుడు పీసీ శ్రీరామ్ అంతటి సినీమాటోగ్రాఫర్‌గా ఎదగాలని గ్రామం నుంచి సిటీకి వచ్చాడు. తన జర్నీలో భాగంగా పొట్టి (షార్ట్ ఫిలింమ్స్) చిత్రాలు రూపొందించడంలో తనదైన ముద్ర వేశాడు ఈ సూర్యాపేట కుర్రాడు. యాత్ర అలా మొదలైంది.. సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచీ ఫొటోగ్రఫీ అంటే పిచ్చి. తండ్రి కొనిచ్చిన చిన్ని కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా స్మార్ట్ ఫోన్ల రావడం.. వాటిలో అత్యుత్తమ నాణ్యత గల కెమరాలు ఉండడంతో ఫోన్‌తోనూ లఘు చిత్రాలు తీసి భళా అనిపించుకున్నాడు. పెద్ద చిత్రాలను షూట్ చేసే క్రమంలో ప్రయోగాలకు అంత అవకాశం ఉండదు. ఎంతో ఎత్తుకు ఎదిగితేగాని అలా చేయలేం. దాంతో పొట్టి చిత్రాలు రూపొందించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ఫొట్రోగ్రఫీ ప్రయోగాలకు అనువుగా మార్చుకున్నాడు. ప్రతి లఘు చిత్రాన్ని దేనికదే కొత్తదనంతో తీర్చిదిద్దాడు. అలా ఇప్పటిదాకా సుధాకర్ దాదాపు 200కు పైగా షార్ట్ ఫిలిమ్స్‌కు కెమెరామెన్‌గా పనిచేసాడు. సుధాకర్ ఫొటోగ్రఫీ అందించిన ‘హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ, శ్వాసనువ్వే, రుధిరం, సిక్త్స్ సెన్స్’ వంటి లఘుచిత్రాలు యూట్యూబ్‌లో పెద్దహిట్. వీటితో మంచి గుర్తింపు సైతం తెచ్చుకున్నాక.. ఇతడి ప్రతిభను గుర్తించిన నిర్మాతలు ఇటీవల విడుదలైన ‘రహస్యం’ చలనచిత్రానికి పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా అవకాశం కల్పించారు. మరో రెండు సినిమాలకు కూడా ఛాయా గ్రాహకుడిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు సుధాకర్. ఆర్జీవీ స్ఫూర్తిగా.. ఫొటోగ్రఫీ తిలక్ వద్ద నేర్చుకున్నాను. మావూరి వంట కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పనిచేసాను. రామ్‌గోపాల్ వర్మ స్ఫూర్తిగా డబ్బులు కూడబెట్టుకుని 5డీ కెమెరా కొని షార్ట్ఫిలిమ్స్కు పనిచేశాను. వాటితో మంచి గుర్తింపు వచ్చింది. పెద్ద చిత్రాలకు పనిచేసే అవకాశాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. నాఫేస్బుక్ పేజ్‌కు 5వేల మంది, ఇన్‌స్ట్రాగామ్ పేజ్‌కు 4వేల మంది అభిమానులు ఉన్నారు. ఈ రంగంలో మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. – సుధాకర్, షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్ -
నేను యస్.. ఆయన వి...
‘‘గీత గోవిందం’ సినిమా పూజ రోజు అల్లు అరవింద్‌గారు నాతో ‘మా లక్ష్మీ (పారితోషికం)ని మీరు తీసుకొని మీ సరస్వతి (కెమెరా వర్క్)ని మాకు ఇవ్వండి’ అన్నారు. ఎందుకో ఆ మాట నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. టెక్నీషియన్స్‌కు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పది’’ అని కెమెరామేన్ యస్. మణికందన్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఈ నెల 15న రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోందని చిత్రబృందం పేర్కొంది. మణికందన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్ స్టార్టింగ్‌లో కెమెరామేన్ శరవణన్, మనోజ్ పరమహంసలగారి వద్ద వర్క్ చేశాను. ‘రేసు గుర్రం’ సినిమాలో రెండు పాటలకు లైటింగ్ చేయడానికి వస్తే ‘ముకుంద’ సినిమాకు అవకాశం వచ్చింది. తమిళంలో ‘కుట్రమ్ కడిదల్, మగళిర్ మట్టుమ్’ అనే సినిమాలు చేశాను. ► ‘గీత గోవిందం’ పాయింట్ బావుంది.. ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ అవుతుందనుకోలేదు. అరవింద్‌గారి అనుభవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు ఏం కావాలో మాత్రమే ఆలోచిస్తారు. వరుసగా రెండు సార్లు ఆయన బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. పరశురామ్‌తో వర్క్ చేయడం బాగుంటుంది. ఫస్ట్ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ జర్నీ చాలా నచ్చడంతో సెకండ్ సినిమాకు కూడా అసోసియేట్ అయ్యాం. ► ‘బన్నీ’ వాసు గారు సినిమా స్టార్ట్ కాకముందు ఏం కావాలి? అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ ఇస్తారు. విజయ్ దేవరకొండ సింప్లీ సూపర్. ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అయినా కూడా తను మాత్రం సింపుల్‌గానే ఉన్నాడు. ► నా నెక్ట్స్ మూవీ సెప్టెంబర్‌లో ఆరంభమవుతుంది. పూరీగారు కాల్ చేశారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. తెలుగు ఆడియన్స్ అంటే ఇష్టం. వాళ్లు సినిమా మీద చూపించే అభిమానం ఆకట్టుకుంది. నా దృష్టిలో బెస్ట్ ఆడియన్స్ అంటాను. ‘‘చాలామంది నన్ను కెమెరామేన్ వి.మణికందన్ (ఓం శాంతి ఓం, రా.వన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫేమ్)తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇదే విషయాన్ని ఓసారి ఆయనతో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు నా ‘ఓం శాంతి ఓం’ నువ్వే చేశా వని చెప్పేయ్’’ అని సరదాగా అన్నారు. -
మా మదిలో వైఎస్సార్ - చోటాకే నాయుడు
-
సంక్రాంతి పర్వాన ఆకాశ దేశాన!
ఏమాటకామాట చెప్పుకోవాలి... సంక్రాంతి రోజుల్లో ఆకాశం ఆకాశంలా ఉండదు. విశాలమైన పూలతోటలా ఉంటుంది. ఆ తోటలో... ఎన్ని అందమైన గాలిపట పుష్పాలో కదా! ఆ నోటా ఈ నోటా... మన పండగ సమయపు ఆకాశాన్ని గూర్చి విన్న ఫ్రాన్సిస్కో లిగ్‌నోల అనే ఇటాలియన్ అమ్మాయి తన మిత్రుడు, కెమెరామెన్ జీన్ ఆంటోనితో చర్చించింది. అప్పుడు వారొక నిర్ణయానికి వచ్చారు... సంక్రాంతి పండగ రోజుల్లో ఇండియాకు వెళ్లాలని. అలా ఓ సంక్రాంతి పండగ రోజుల్లో గుజరాత్‌లోని ప్రముఖ నగరమైన అహ్మదాబాద్‌కు వచ్చారు... పతంగుల పండగ కోసం, ఆకాశంలో వెలిగిపోయే పూలతోట కోసం! ఈ నేపథ్యంలో పుట్టిందే ‘అండర్ ది అహ్మదాబాద్ స్కై’ డాక్యుమెంటరీ. మొదట ఆల్జజీరా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ‘విట్నెస్ స్పెషల్’ కార్యక్రమంలో ఈ డాక్యుమెంటరీ ప్రసారమైంది. నాలుగు భాగాల ఈ డాక్యుమెంటరీలో ఎన్నెన్నో కోణాలు కనిపిస్తాయి. తొలి దృశ్యం... అందమైన సూర్యోదయం. అయ్యవారి మాటలు వినిపిస్తుంటాయి... ‘‘ఏదో ఒకరోజు... ఆ ఆకాశంలో నారాయణుడు కనిపించి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాడు. నారాయణుడి చుట్టూ చేరి దేవతలు సంతోషంలో తలమునకలై పోతారు...’’ ఆకాశంలో కనిపించే సంభ్రమాశ్చర్య దృశ్యాన్ని చూసి... ప్రజలు ‘పతంగ్ ఉత్సవ్’ను ఘనంగా జరుపుకుంటారట. దీంతో... రోజూ కనిపించే ఆకాశమే ఆరోజు రంగులమయమై, సౌందర్యమయమై, కన్నులపండగై కనిపిస్తుందట. కొద్ది సేపటి తరువాత కెమెరా అహ్మదాబాద్ పతంగుల దుకాణాల గల్లీలలోకి వెళుతుంది. ‘‘ఎలా ఉన్నాయి పతంగ్‌ల ధరలు?’’ అడుగుతాడు కస్టమర్. పతంగులు అమ్మేటాయన దగ్గరి నుంచి ఏకవాక్య సమాధానం వినిపించదు. ఎందుకంటే, మనుషుల్లో తేడా ఉన్నట్లే, మనసుల్లో తేడా ఉన్నట్లే పతంగుల్లోనూ తేడాలు ఉంటాయి. అన్నీ ఎగిరేది ఆకాశంలోనైనా పేదోళ్ల పతంగులు, పెద్దోళ్ల పతంగులు, మధ్యతరగతి పతంగులు... ధరను బట్టి పతంగుల విలువ పెరుగుతుంది. అందుకే, దుకాణదారుడిని ‘‘ధర ఎంత?’’ అని అడిగితే చాలు... చాలా వివరంగా మాట్లాడతాడు. తన దుకాణంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు తొంగి చూస్తున్న 15 రకాల పతంగుల గురించి! హిందువులు మాత్రమే కాదు... జైనులు, సిక్కులు, ముస్లింలు... మతాలకు అతీతంగా ‘ఫెస్టివల్ ఆఫ్ మకరసంక్రాంతి’ని పతంగుల పండగ ద్వారా సొంతం చేసుకుంటారు. పతంగి అంటే ఆట వస్తువు కాదు... మతాలకతీతమైన లౌకిక ప్రతీక! ఢిల్లీ గేట్ దగ్గర మాంజా తయారీదారులు కూడా ఈ డాక్యుమెంటరీలో తమ గొంతు వినిపిస్తారు. కూరగాయలు, రకరకాల ఔషధ మొక్కల సారంతో తొమ్మిది రకాల మాంజా ఎలా తయారవుతుందో చెబుతారు. ‘మాంజా గురు’గా ప్రసిద్ధుడైన అరవై సంవత్సరాలు పైబడిన ధీరుబాయి పటేల్ - ‘‘మాంజాను అందరూ ఒకేవిధంగా తయారుచేసినట్లు అనిపించినా... ఎవరి రహస్యాలు వారికి ఉంటాయి’’ అంటారు. అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కవి భాను షా... ఇంటర్వ్యూలో ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి. భాను షా అంటే కవి మాత్రమే కాదు... పతంగులకు సంబంధించిన సంపూర్ణ సమాచార సర్వస్వం. వివిధ కాలాల్లో పతంగుల తయారీ, పతంగ్ ఉత్సవ్‌కు సంబంధించిన ఆనాటి విశేషాలు ఆయన నోటి నుంచి వినాల్సిందే. ‘అహ్మదాబాద్ కైట్ మ్యూజియం’లో ప్రతి పతంగి గురించి సాధికారికంగా చెప్పగలిగే సామర్థ్యం భాను షా సొంతం. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి తాత్విక నిర్వచనాలు ఇస్తారు షా. ‘‘ఆకాశం అనే ప్రపంచంలో గాలిపటం అనేది స్వేచ్ఛను, ఒకరి గాలిపటాన్ని మరొకరు తెంపడం అనేది పోటీ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి’’ అంటారు ఆయన. ‘‘నగరమంతా ఆ రోజు ఇళ్లలో కాదు... ఇంటి కప్పులపై ఉంటుంది’’ అని చమత్కరిస్తారు అహ్మదాబాద్ అర్కిటెక్చర్ ప్రొఫెసర్ నితిన్ రాజే. కైట్ మార్కెట్లో వినిపించే ‘షోలే’ సినిమాలోని ‘మెహబూబా మెహబూబా ’ పాట కావచ్చు, ఆలయ వీధుల్లో పవిత్రధ్వనితో వినిపించే ‘ధినక్ ధినక్ నాచే బోలానాథ్’ పాట కావచ్చు... నేపథ్యసంగీతం ద్వారా దృశ్యాన్ని పండించి ‘అండర్ ది అహ్మదాబాద్ స్కై’ డాక్యుమెంటరీని కన్నుల పండగ చేయడంలో విజయం సాధించింది ఫ్రాన్సిస్సో లిగ్‌నోల, జీన్ అంటోని ద్వయం. - యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: అండర్ ది అహ్మదాబాద్ స్కై దర్శకత్వం: ఫ్రాన్సిస్కో లిగ్‌నోల కెమెరా: జీన్ ఆంటోని -
రౌడీషీటర్‌ను హత్య చేసేందుకు వచ్చి...
బంజారాహిల్స్: రౌడీషీటర్‌ను హత్య చేసేందుకు వచ్చిన కొందరు దుండగలు అతనే అనుకొని పొరబడి ఓ సినీ అసిస్టెంట్ కెమెరామెన్‌పై తల్వార్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శ్రీకృష్ణానగర్‌లో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... శ్రీకృష్ణానగర్ బి - బ్లాక్‌లో సినీ అసిస్టెంట్ కెమెరామెన్ గోపి తన స్నేహితులతో మాట్లాడుతుండగా రహ్మత్‌నగర్ నివాసి చోర్ చేత, చోర్ అబ్బు, శ్రీను తమ అనుచరులు 30 మందితో వచ్చి ఒక్కసారిగా తల్వార్లతో దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయారు. గోపి తీవ్రగాయాలు కావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. స్థానిక రౌడీషీటర్ అర్జున్యాదవ్ను హత్య చేసేందుకు వచ్చిన దుండగలు అతనే అనుకొని పొరపాటున గోపిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
సాక్షాత్తూ ‘మల్లీశ్వరి’ కెమెరామేన్ మెచ్చుకున్నారు!
‘గూండా’ సినిమా క్లైమాక్స్. విలన్లు రైలు కింద బాంబులు అమర్చారు. ఏ క్షణంలోనైనా పేలిపోతాయి. హీరో చిరంజీవి ఊరుకుంటాడా! ఎంతో సాహసంతో కదులుతున్న రైల్లోంచి ఆ బాంబుల్ని తీసి పారేశాడు. ఈ క్లైమాక్స్‌కి క్లాప్స్ పడ్డాయి. తెరపై రిస్క్ చిరంజీవిదైతే, తెరవెనుక రిస్క్ మాత్రం కెమెరామేన్ ఎ. వెంకట్‌ది. కదులుతున్న రైలు కింద కెమెరా పెట్టి రకరకాల యాంగిల్స్‌లో షాట్స్ తీయడమంటే మాటలు కాదు. వెంకట్ కెరీర్లో ఇలాంటి సాహసాలు, ప్రయోగాలు చాలా ఉన్నాయి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీల్లో సుమారు 80 చిత్రాలకు పని చేసిన ఈ అనుభవజ్ఞుడైన ఛాయాగ్రాహకుడు చెన్నైలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన ‘సాక్షి’కి చెప్పిన కొన్ని ముచ్చట్లు. మాది బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామం. స్టిల్ కెమెరాపై ఆసక్తి నన్ను మూవీ కెమెరా దగ్గరకు చేర్చింది. మా ఊరి ప్రొడక్షన్ మేనేజర్ పుణ్యమా అంటూ చెన్నై చేరుకున్నాను. కష్టపడి రేవతీ స్టూడియోలో అప్రెంటిస్‌గా చేరా. అలా మొదలైన ప్రయాణం విన్సెంట్ గారి పరిచయంతో మలుపు తిరిగింది. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఎంతలా అంటే... సేమ్ టూ సేమ్ ఆయనలా షాట్స్ తీయాలంటే నా వల్లే అవుతుందన్నంతగా అన్నమాట. విన్సెంట్‌గారి దగ్గర పని చేస్తున్నప్పుడే నాకు ‘రాజమల్లి’ (1964) అనే మలయాళ సినిమాకు స్వతంత్రంగా ఛాయాగ్రహణం చేసే అవకాశం వచ్చింది. ఓ పక్క నా సినిమాలు చేసుకుంటూనే, మరో పక్క విన్సెంట్‌గారి దగ్గర ఆపరేటివ్ కెమెరామేన్‌గా పని చేసేవాణ్ణి. గురువుగారి ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్ప సినిమాలకు పని చేశానన్న సంతృప్తి ఉంది. భక్త ప్రహ్లాద, లేత మనసులు, వసంత మాళిగై (తమిళం), ప్రేమనగర్ (హిందీ)... ఆ జాబితాలో ఉన్నాయి. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ సినిమాకి నేనే సెకండ్ యూనిట్ కెమేరామేన్ని. నా దగ్గరకు వచ్చిన అవకాశాలే చేశాను. ఎవర్నీ అడగలేదు. మిచెల్, యారీఫ్లెక్స్ కెమెరాలన్నీ నాకు కొట్టిన పిండి. ఇప్పటి డిజిటల్ కెమెరాలపై అవగాహన లేదు. ఛాయాగ్రాహకునిగా రాసి కన్నా వాసి ప్రాధాన్యమిచ్చేవాణ్ణి. అవకాశం ఎక్కడ దొరికినా ప్రయోగాలకు సిద్ధమయ్యేవాణ్ణి. మాస్క్ షాట్స్ అందరూ చేస్తారు కానీ, బ్యాక్ ప్రొజెక్షన్లో చేయడం చాలా కష్టం. తమిళంలో ‘మదనమాళిగై’ కోసం కదులుతున్న రైల్లో మాస్క్ షాట్స్ తీశా. ఇద్దరు శివకుమార్‌లు ఒకే ఫ్రేమ్‌లో ప్రయాణిస్తున్నట్టు బ్యాక్ ప్రొజెక్షన్లో చిత్రీకరించా. సాక్షాత్తూ ‘మల్లీశ్వరి’ కెమెరామేన్ కొండారెడ్డి ఈ షాట్‌ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ‘జగమొండి’లో ఫ్రేమ్‌లో అయిదుగురు శోభన్‌బాబులు కనిపించేలా తీశా. తమిళ చిత్రం ‘అక్కర పచ్చై’లో రెండే రెండు లాంగ్ షాట్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా కాబట్టి అన్నీ మిడ్ షాట్స్ తీశా. మలయాళ చిత్రం ‘తీర్థయాత్ర’కి కొవ్వొత్తి వెలుగులో నది ఒడ్డున కార్తికస్నానం షాట్ తీశా. ఆ షాట్స్ గురించి ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు. విన్సెంట్‌గారు డెరైక్ట్ చేసిన 10 సినిమాలకు నేనే ఛాయాగ్రాహకుణ్ణి. అది నా అదృష్టం. ముఖ్యంగా, మలయాళ చిత్రం ‘నది’ అంతా పడవ లోనే నడుస్తుంది. 15-20 రోజులు ఆల్వాయ్ నదిలో షూటింగ్ చేశాం. కొన్ని మ్యాచింగ్ షాట్స్ మిగిలిపోతే మద్రాసులోని జెమినీ స్టూడియోలో సెట్ వేసి తీయాల్సి వచ్చింది. నాకు వేరే సినిమా వర్క్ ఉండి, మల్లీ ఇరానీని పంపించాను. ‘‘ఒక్క రోజుకే నా నడుము పడిపోయింది. ఆయనతో ఇన్ని రోజులు ఎలా పనిచేశావు. అన్నీ లోయాంగిల్ షాట్స్ అంటున్నారు’’ అని చెప్పాడు నాతో. హిందీలో దిలీప్‌కుమార్, జితేంద్ర, రాజేష్‌ఖన్నా, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, రిషీకపూర్ల చిత్రాలకు పనిచేశా. తెలుగులో నా తొలి సినిమా ‘సావాసగాళ్లు’. ఆఖరి సినిమా ‘హలో గురూ’. నేను గర్వంగా చెప్పుకునే సినిమా - ‘ముందడుగు’. ఆ భారీ మల్టీస్టారర్‌లో ఆర్టిస్టులను డీల్ చేయడం చాలా కష్టం కదా. అయినా సునాయాసంగా చేయగలిగా. జితేంద్ర, రాజేశ్ఖన్నాలతో తీసిన హిందీ వెర్షన్ ‘మక్సద్’కి నేనే వర్క్ చేశా. ‘అగ్ని పూలు’ కూడా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. ‘రామరాజ్యంలో భీమరాజు’లో కృష్ణను అందంగా చూపించానంటూ శతదినోత్సవ సభలో దాసరి ప్రశంసించారు. ‘‘కెమెరాను ఆపరేట్ చేయడంలో వెంకట్‌ని ఎవ్వరూ కొట్టలేరు’’ అని విన్సెంట్ గారు అందరికీ చెబుతుంటారు. అదే నాకు పెద్ద పురస్కారం. - పులగం చిన్నారాయణ