కెమెరామెన్‌ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన రష్యా మంత్రి | To Save A Cameraman Russian Minister Depart His Life | Sakshi
Sakshi News home page

కెమెరామెన్‌ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన రష్యా మంత్రి

Published Wed, Sep 8 2021 7:21 PM | Last Updated on Wed, Sep 8 2021 7:41 PM

To Save A Cameraman Russian Minister Depart His Life - Sakshi

యెవ్‌గెని జినిచేవ్‌(ఫైల్‌ఫోటో)

మాస్కో: రష్యాకు చెందిన మంత్రి ఒకరి ప్రాణాలు కాపాడబోయి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఓ డ్రిల్‌ శిక్షణలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. రష్యా అత్యవసర శాఖ మంత్రి యెవ్‌గెని జినిచేవ్‌ (55). ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ ఘటన నార్లిస్క్‌లోని ఆర్కిటిక్‌ పట్టణంలో బుధవారం జరిగింది. ప్రమాదవశాత్తు జినిచేవ్‌ ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటన వెలువడింది.
చదవండి: బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు 

డ్రిల్‌లో భాగంగా శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కెమెరామ్యాన్‌ను రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్‌ ఏజెన్సీ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిన్న కొండను జినిచేవ్‌ ఎగిరి దాటవేశారు. అయితే అలాగే కెమెరామ్యాన్‌ ప్రయత్నించగా ఆయన త్రుటిలో పడిపోతున్నారు. వెంటనే గ్రహించి జినిచేవ్‌ అతడిని పట్టుకున్నారు. అయితే అంచున కాలు పెట్టడంతో ఆయన త్రుటిలో కాలుజారి కిందపడి మృతి చెందారు.
చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement