cliff
-
120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకుని ఓ కొట్టు..ఎక్కడంటే
కొండ బండను ఆనుకొని ఉన్న ఈ చెక్క నిర్మాణం అధిరోహకులను రెస్క్యూ చేయడానికేమో అని అనుకుంటే అచ్చంగా పొరపాటే! అదో కొట్టు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షినియుజాయ్ అనే సుందరమైన ప్రాంతం అది. అక్కడ 120 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న కొండను ఎక్కే అధిరోహకులకు.. ఆహారం, మంచినీరు, విశ్రాంతి వంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వం ఓ కొట్టు తెరిచింది. దాని పేరు ‘హ్యాంగింగ్ కన్వీనియెన్స్ స్టోర్. ’ ఈ ఫొటోలో కనిపిస్తున్నదదే! అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండి.. పర్యాటకులకు సేవలు అందిస్తుంటాడు. అవసరమయ్యే వస్తువులన్నిటినీ తాడుతో కింది నుంచి పైకిలాగి ఈ కొట్టులో స్టోర్ చేస్తారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా మౌంటెనీర్సే తమకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ మోసుకెళ్లేవారు. ఆ అవస్థ చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పుడు మౌంటెనీర్స్కి కావలసిన వస్తువులన్నీ తక్కువ ధరకే ఈ కొట్టులో లభిస్తున్నాయి. దాంతో మౌంటెనీరింగ్ ఈజీ అయింది.. ఆ కొట్టు వ్యాపారమూ జోరుగా సాగుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మూతపడ్డ ఈ స్టోర్‌ను తిరిగి తెరవడంతో విషయం వైరల్ అయింది. (చదవండి: ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..) -
వెరైటీ వెడ్డింగ్ పార్టీ.. చూస్తేనే గుండె గుబుల్..!
పెళ్లిరోజు మరుపురాని రోజు. అంతే ప్రత్యేకంగా గుర్తుండిపేయేలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు. రొమాంటిక్ సెటప్ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరికొందరు సాంప్రదాయానికి ప్రముఖ్యతనిస్తారు. కానీ మనం తేలుసుకోబోయే జంట మాత్రం తమ వెడ్డింగ్ రోజునే సాహసాలు చేశారు. వెడ్డింగ్‌కి వచ్చిన బంధువులతో ఈ విన్యాసాలు చేశారు. వీడియో ప్రకారం.. పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె ఇద్దరు వెడ్డింగ్ డ్రస్‌లో ఉన్నారు. అది చూడటానికే భయంకరమైన లొకేషన్లా ఉంది. లోతైన లోయలో స్కై డైవింగ్ చేస్తూ హౌరా..! అనిపించారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే పేర్లు గల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అదే రోజున థ్రిల్లింగ్ కోసం ఇలా సాహసాలు చేశారు. రయ్.. రయ్ మంటూ రివ్వున లోయలోకి దూసుకెళ్లారు. ఈ వీడియోను తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇంత భయంకరమైన స్కై డైవింగ్ పెళ్లి రోజునే ఎందుకు బ్రో అంటూ కామెంట్లు పెట్టారు. 'జర భద్రం ర అయ్యా..!' అంటూ మరికొందర ఫన్నీగా కామెంట్లు పెట్టారు. కొత్తజంట సాహసాలు మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్ -
భార్యను చంపాలన్న ప్లాన్ బెడిసికొట్టి.. ఇప్పుడు మెంటల్ ప్లాన్
కాలిఫోర్నియా: అతడు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారై. చాలా పేద్ద డాక్టర్. కాలిఫోర్నియాలో మంచి పేరున్న వైద్య నిపుణుడు. అయితే ఏం లాభం. బుద్ధి గడ్డి తిని భార్యా పిల్లలను చంపాలనుకున్నాడు. చివర్లో కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. శిక్ష తప్పించుకునేందుకు మెంటల్ అంటూ నాటకం ఆడుతున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డాక్టర్ తన కుటుంబాన్ని హతమార్చాలన్న ప్రణాళిక పసిఫిక్ తీరం వద్ద 250 అడుగుల ఎత్తుకు టెస్లా కారులో తీసుకుని వెళ్ళాడు. కొండ మీదకు తీసుకెళ్లింది తడవు అక్కడినుంచి కారును ముందుకు తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న కుటుంబ సభ్యులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సహాయక సిబ్బంది వెంటనే స్పందించి ఇద్దరు చిన్నారులను ఆ దంపతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. భారత సంతతికి చెందిన డాక్టర్ ధర్మేశ్ పటేల్ కాలిఫోర్నియాలో రేడియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. తన భార్య నేహా పటేల్ ను ఇద్దరు పిల్లలను టెస్లా వై మోడల్ కారులో ఎక్కించుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెలుపల పసిఫిక్ సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళాడు. పక్కా ప్లాన్ తో మంచి వాడిగా నటిస్తూ.. వారిని కారులోనే కూర్చోబెట్టి వెనకనుంచి ముందుకు తోసేశాడు. ఇంకేముంది కారు కాస్తా కొండపై నుంచి కిందికి పడింది. జరిగింది పెద్ద ప్రమాదమే కానీ వారంతా చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. అనంతరం విచారణ సమయంలో ధర్మేశ్ అతని కారు టైర్ సరిగ్గా పని చేయడం లేదని దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించారు. పోలీసులు మాత్రం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మేశ్ తరపు లాయర్లు తన క్లయింట్ మానసిక పరిస్థితి బాగాలేదని అర్జంటుగా అతడికి ట్రీట్మెంట్ అవసరమని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. Indian-Origin Doctor Dharmesh Patel Who Drove Tesla Off Cliff With Family in California Asks Court for Mental Health Treatment #DharmeshPatel #US #California https://t.co/VCzHQSZm0O — LatestLY (@latestly) July 10, 2023 దీనిపై అతడి భార్య నేహా వాంగ్మూలం ఇస్తూ.. నా భర్త మానసిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ మమ్మల్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే కొండ మీదకు తీసుకెళ్లాడని, పైశాచిక ఆనందాన్ని కనబరుస్తూ ఆయనే స్వయంగా ఆ విషయాన్ని చెప్పినట్లు తెలిపింది. కాలిఫోర్నియా హైవే అధికారులు మాట్లాడుతూ ధర్మేశ్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయంతోనే కారు డ్రైవ్ చేశాడని. ప్రమాదం జరిగే సమయానికి కారు ఆటోమేటిక్ మోడ్ లో లేదని తెలిపారు. ప్రమాదంలో నేహా పటేల్, ఏడేళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి కాని వారికెలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. Doctor who drove family off cliff asks court for mental health treatment #dharmeshpatel https://t.co/9PvxnK3jfx — Eerie News (@EerieNewsToday) July 9, 2023 నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడిని రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించినాట్లు తెలిపారు. శిక్ష నుండి తప్పించుకునేందుకే ఇప్పుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కొత్త డ్రామాకు తెరతీశాడని వారు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా.. -
రెండు రోజులుగా చావు అంచున వేలాడుతూ, చివరికి..
ఊహించని రీతిలో చావు అంచున వేలాడుతూ రెండు రోజులు గడిపాడు ఆ వ్యక్తి. అధికారులు ప్రయత్నించినా.. అతన్ని కాపాడడం వీలు కాలేదు. ఇక తన ప్రాణం పోవడం ఖాయం అనుకుంటూ ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆ తరుణంలో భారత్ ఆర్మీ ఎంట్రీతో సీన్ మారింది. ఆ కేరళ యువకుడి ప్రాణాలు నిలిచాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకున్న ఆర్.బాబు (23), తన స్నేహితులు సోమవారం నాడు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కొండ అలా ఉండడంతో కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు మధ్యదాకా వెళ్లి కిందకు వచ్చేశారు. కానీ, బాబు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి కొండపైకి చేరుకున్నాడు. కానీ, తిరిగి వచ్చే క్రమంలో అతనికి పట్టు జారిపోయింది. దీంతో రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం తోచలేదు. సీఎం చొరవతో.. కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయి సోమవారం నుంచి ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన చావు ఇలా రాసి ఉందా? అని యువకుడు అనుకున్నాడు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు. దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది. ముందు తిండి.. ఆపై బాబును సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి తిండి, నీరు అందించారు. ఆపై అతడికి కొంచెం ఓపిక వచ్చాక.. అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. కాగా, సురక్షితంగా ఒక ప్రాణం నిలబెట్టిన భారత్ ఆర్మీకి సోషల్ మీడియా సలాం చెబుతోంది. కృతజ్క్షతలు చెప్పినవాళ్లలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఉన్నారు. Worries have been put to rest as the young man trapped in the Cherad hill in Malampuzha has been rescued. The treatment & care needed to regain his health will be provided now. Thanks to the soldiers who led the rescue operation and everyone who provided timely support. pic.twitter.com/YAwHQOxZAP — Pinarayi Vijayan (@vijayanpinarayi) February 9, 2022 -
కెమెరామెన్‌ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన రష్యా మంత్రి
మాస్కో: రష్యాకు చెందిన మంత్రి ఒకరి ప్రాణాలు కాపాడబోయి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఓ డ్రిల్ శిక్షణలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. రష్యా అత్యవసర శాఖ మంత్రి యెవ్గెని జినిచేవ్ (55). ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ ఘటన నార్లిస్క్లోని ఆర్కిటిక్ పట్టణంలో బుధవారం జరిగింది. ప్రమాదవశాత్తు జినిచేవ్ ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటన వెలువడింది. చదవండి: బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు డ్రిల్‌లో భాగంగా శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కెమెరామ్యాన్‌ను రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్ ఏజెన్సీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిన్న కొండను జినిచేవ్ ఎగిరి దాటవేశారు. అయితే అలాగే కెమెరామ్యాన్ ప్రయత్నించగా ఆయన త్రుటిలో పడిపోతున్నారు. వెంటనే గ్రహించి జినిచేవ్ అతడిని పట్టుకున్నారు. అయితే అంచున కాలు పెట్టడంతో ఆయన త్రుటిలో కాలుజారి కిందపడి మృతి చెందారు. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు -
మహిళపై అత్యాచారం.. ఆపై వివాహం.. కొండపై తీసుకెళ్లి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహల కారణంగా కట్టుకున్న భార్యను హింసించి.. కొండపై నుంచి తోసేసి హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన ఉధామ్‌సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. కాగా, 24 ఏళ్ల రాజేష్‌రాయ్ అనే యువకుడు సెల్స్‌మెన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతడు, గతేడాది 29 ఏళ్ల బబిట అనే మహిళను అత్యాచారం చేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, బబిటా తనను వివాహం చేసుకుంటే.. ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని చెప్పింది. దీంతో, రాజేష్ రాయ్, బబిటను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు వీరి వివాహబంధం సాఫీగానే కొనసాగింది. కాగా, గత కొంత కాలంగా రాజేష్ రాయ్, బబిటను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈక్రమంలో, భర్త పోరు పడలేక బబిట ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో గత నెల జూన్ 11న రాయ్ పుట్టింటికి వెళ్లి తన భార్యను తెచ్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బబిట ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రాజేష్‌రాయ్‌ను బబిట గురించి ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి బంధువులు రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. రాజేష్ రాయ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో బబిటను నైనిటల్ కొండపై తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసినట్లు.. రాయ్ పోలీసుల విచారణంలో అంగీకరించాడు. కాగా, కొండ ప్రాంతంలో బాధిత మహిళ మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. -
సరదా తీర్చిన ఉయ్యాల.. పట్టు తప్పి 6300 అడుగుల లోయలో!
ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో ఉయ్యాల ఊగే ఉంటారు. ఇంట్లో, పొలాల వద్ద, చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగూతుంటే మహా సరాదాగా ఉండేంది. ఒక్కసారి ఉయ్యాలపై కూర్చొని ఊగుతుంటే వయసుని మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అదే ఉయ్యాల సరదా తాజాగా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉయ్యాలపై జాలీగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు. కొండ అంచు శిఖరం మీద ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఊగితే చాలా థ్రిల్‌గా ఉంటుందని భావించారు ఇద్దరు యువతులు. కానీ చివరికి వాళ్లు ఊహించని విధంగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన రష్యాలోని డగేస్టన్‌లో చోటుచేసుకుంది. సులాక్ కాన్యాన్ ప్రాంతంలో పర్యాటకుల కోసం కొండ అంచున ఒక ఉయ్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఉయ్యాలలో కూర్చొని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అయితే ఉయ్యాల వద్ద భద్రత సరిగా లేదని అక్కడి ప్రభుత్వం హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదు. ఇదే క్రమంలో తాజాగా ఓ ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కి చక్కగా ఊగుతున్న సమయంలో లోతును చూసి ఒక్కసారిగా భయపడ్డారు. దీంతో ఉయ్యాల కదులుతుండగానే దాని నుంచి హడావిడిగా దిగేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది సరాసరి ఉయ్యాల పక్కన ఉన్న 6300 అడుగుల లోయలోకి పడిపోయారు. అయితే, వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. ఆ ఉయ్యాల ఇంకాస్త వేగంగా ఊగి ఉంటే ఖచ్చితంగా వాళ్లు నేరుగా లోయలో పడిపోయేవారు. కాగా ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా హడలిపోతారు. ఇక ఈ ఘటన అనంతరం ఇద్దరు యువుతులు ఇక తమ జీవితంలో ఉయ్యాల ఎక్కేందుకు సాహసించరేమో.. Moment two women fell off a 6000-Ft cliff swing over the Sulak Canyon in Dagestan, Russia. Both women landed on a narrow decking platform under the edge of the cliff & miraculously survived with minor scratches. Police have launched an investigation. pic.twitter.com/oIO9Cfk0Bx — UncleRandom (@Random_Uncle_UK) July 14, 2021 -
వామ్మో.. చూస్తుండగానే 60 అడుగుల కొండపై నుంచి..
లండన్: మనలో చాలా మంది కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి కొండలపైకి, కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అక్కడ తమ వారితో సరదాగా గడిపి ఒత్తిడిని దూరం చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కొసారి ఈ విహారయాత్రలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. దీంతో, ఆ విహార యాత్ర కాస్త, విషాద యాత్ర గా మారిపోతుంది. అయితే, యూకేలోజరిగిన ఒక విషాదయాత్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్న్‌వాల్ లోని లామోర్నా కోవ్ పట్టణంలో రెబెకా క్రాఫోర్డ్ అనే 37 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉండేది. ఆమె గతేడాది తన సోదరి రెబెకా డెబ్స్తో కలిసి స్థానికంగా ఒక ఎత్తైన కొండపైకి వెళ్లారు. అక్కడ సరదాగా గడపాలను కున్నారు. ఈ క్రమంలో వారిద్దరు మాట్లాడుకుంటూ కొండ అంచుల వద్ద చేరుకున్నారు. అక్కడ చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, వారు మాటల్లో పడి కొండ అంచున ఉన్న విషయం కూడా మరిచిపోయారు. అప్పుడు, రెబెకా క్రాఫోర్డ్ కొండపై నుంచి చూస్తుండగానే కాలుజారి కింద పడింది. దీంతో, రెబెకా డెబ్స్ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యింది. తన సోదరి కొండపై నుంచి కింద పడటాన్ని చూసింది. ఆమె నోటినుంచి మాట రాలేదు. తన అక్క అరుపులు, కేకలు వినిపించాయి. వెంటనే తేరుకుని యూకేలోని డయల్ అంబూలెన్స్‌కు ఫోన్ చేసింది. ఆ ప్రాంతం కొండపైన ఉండటంతో కాసేపటికి ఎయిర్ అంబూలెన్స్ సర్వీస్ అక్కడికి చేరుకున్నారు. ఆమెను వెంటనే యూకేలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. అయితే, రెబెకా ప్రస్తుతం కోలుకుంటుదని వైద్యులు తెలిపారు. అయితే, తాజాగా రెబెకా క్రాఫోర్డ్.. మెట్రో.కో.యూకే తో జరిగిన ఇంటర్వ్యూలో ఆ విషాదాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఆ భయంకర సంఘటన నా జీవితంలో మరిచిపోలేను’.. నేను నా సోదరితో కలిసి ఎత్తైన కొండపై ఉన్నప్పుడు అనుకోకుండా కింద పడ్డాను. నా సోదరి అరుపులు నాకు వినిపించాయి. నేను కిందకు పడిపోయేటప్పుడు ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు. నేను బండలపై పడ్డాను. ఆ తర్వాత, నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రెబెకా డెబ్స్ మాట్లాడుతూ.. ఇలాంటివి బహుశా సినిమాల్లో చూసుంటారు. 60 అడుగుల ఎత్తైన కొండపైనుంచి పడి బతకడం చాలా అరుదని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు మా సోదరికి పెద్ద గాయాలేవి కాలేవు. ఏలాంటి, రక్త స్రావం జరుగలేదు. కానీ, ముఖం దగ్గర మాత్రం కుట్లు పడ్డాయని తెలిపింది. నడుము దగ్గర చిన్నగా ఫాక్చర్ అయ్యిందని వివరించింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపింది. తమ సోదరిని సమయానికి ఆసుపత్రికి చేర్చిన ఎయిర్ అంబూలెన్స్ సిబ్బందికి రెబెకా సిస్టర్స్ ధన్యవాదాలు తెలిపారు. -
‘ఎప్పుడు కొండ అంచుకే తీసుకెళ్తాడెందుకు?
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి ఒక్కరికి ఫేమస్ అవ్వాలనే పిచ్చి బాగా ముదిరింది. అందుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ జంట కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కెల్లి కాస్టెల్, కొడి వర్కమ్యాన్ అనే దంపతలు పోస్టీట్రావేల్లీ అనే ఇన్స్టాగ్రామ్ ట్రావెల్ అకౌంట్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ.. అక్కడి అందమైన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూంటారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిత్రం వీరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పెరువియన్ అండెస్లోని లగునా హుమాంటయ్ అనే సరస్సుకు దాదాపు వంద అడుగుల ఎత్తులో.. కొండ చరియలపై ప్రమాదకర రీతిలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ జంట. ‘గతంలోని ప్రతికూలతలను, అణచివేతను వదిలేసి ఓ అవకాశం తీసుకొండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో గమనించండి. మీ ప్రాణాలను మీరే ప్రమాదంలో పెట్టడానికి.. రిస్క్ తీసుకోవడానికి మధ్య వ్యత్యాసం ఉంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై నెటిజనులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి తప్ప ఇలాంటి ప్రయోగాల వల్ల దేశానికి కొంచెం కూడా ప్రయోజనం లేదు’.. ‘అతను ఎప్పుడు మిమ్మల్ని కొండ అంచుకే తీసుకెళ్తాడు ఎందుకు’.. ‘జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు చేసేవన్ని బుద్ధిలేని పనులే’ అంటూ విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ జంట మాత్రం తమ ప్రయత్నాన్ని సమర్థించుకుంటున్నారు. ‘ఇది మాకు ప్రమాదకరంగా ఏం అనిపించలేదు. చాలా సులభంగానే చేశాం. మాలోని సృజనాత్మకతకు ఈ ఫోటోలు నిదర్శనం.. మా ప్రాణాలను మేం పణంగా పెట్టం’ అని పేర్కొన్నారు. View this post on Instagram The world is waiting for you! Behind the masses of those that wish to watch you lead a quiet and sedentary life is an open, unlined canvas. We urge you to take a chance, to push past barriers of negativity and oppression of self fulfillment and paint the picture of who YOU want to be. Never let yourself be beat down for living your life by those too afraid to live their own. There is a difference between risking your life and taking a risk at having one. We know which side we would rather be on, do you? A post shared by KELLY + KODY (@positravelty) on Aug 28, 2019 at 8:33am PDT -
ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు
బీజింగ్ : చైనా పోలీసుల ముందుచూపుతో ఇద్దరు వ్యక్తులు మరణం అంచు నుంచి తప్పించుకోగలిగారు. దక్షిణ చైనాలోని యువాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్-మోహన్ రహదారి ఎత్తైన కొండల గుండా వెళుతుంది. ఎత్తైన కొండ నుంచి కింది వైపుకి ఉన్న కున్‌మో ఎక్స్‌ప్రెస్ హైవేలో దాదాపు 27 కిలో మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరమైంది. దీనికి స్లోప్ ఆఫ్ డెత్ గా పేరు కూడా ఉంది. తరుచూ ప్రమాదాలు జరిగే కొన్ని ప్రాంతాలను గుర్తించి, ఒక వేళ ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని, ఇంజినీర్ల సహాయంతో 2015లో స్థానిక పోలీసులు కొన్ని నిర్మాణాలను చేపట్టారు. వాహనాలు లోయలో పడిపోకుండా ఏటవాలుగా కొద్దిదూరం రోడ్డును నిర్మించి కంకరతో నింపారు. అంతేకాకుండా కొండపైన రోడ్డు అంచునుంచి కిందకి పడిపోకుండా భారీ వలను కూడా ఏర్పాటు చేశారు. అయితే సోమవారం ఓ భారీ లారీ కున్‌మో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న మూలమలుపు వద్ద అదుపుతప్పింది. భారీ వాహనం కావడం, అది కూడా అతివేగంగా వెళ్లడంతో కంకరను సైతం దాటుకొని రోడ్డు అంచున ఆగిపోయింది. లారీ వెనక భాగం రోడ్డుపైనే నిలిచిపోగా.. క్యాబిన్ రోడ్డు అంచును దాటుకొని ముందుకు వాలిపోయింది. దీంతో లారీ అద్దాల్లో నుంచి డ్రైవర్, క్లీనర్‌లో బయటివైపు పడిపోయారు. అయితే అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మించిన వల ఉండటంతో అందులో పడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదాల నివారణ కోసం స్థానిక పోలీసులు 2015లో మూల మలుపు వద్ద చేపట్టిన నిర్మాణాకి అంచున వలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ నిర్మాణం వల్ల ఐదుగురు వ్యక్తులు ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆ భారీ వల లేకపోతే దాదాపు330 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయి, ఈ పాటికి చనిపోయి ఉండేవాళ్లమని, అధికారులకు డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపాడు. -
ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు
-
కొండలోకి పడిపోయిన కారు.. 8మంది మృతి
సాక్షి, సిమ్లా: హిమచల్ ప్రదేశ్ భిలాస్పూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి జాతీయ రహదారి 21పై ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో కారు కొండలోకి పడిపోయింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, ఒకరికి గాయలయ్యాయి. తీవ్ర గాయాలైన ఒకరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముంచెత్తిన ‘రోను’
ఎన్డీఆర్ఎఫ్తో పాటు 15 నేవీ బృందాలు సిద్ధం తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం పెదగంట్యాడలో అత్యధికంగా 17 సెం.మీ. వర్షం కశింకోటలో 15.5 సెం.మీ. లోతట్టు ప్రాంతాలు జలమయం.. నీటమునిగిన వరి, చెరకు వేసవి దుక్కులకు అనుకూలం జిల్లాలో రోను తుపాను అలజడి సృష్టించింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఏజెన్సీలోని అనేక గిరిజన గ్రామాల్లో అంధకారం నెలకొంది. చోడవరం, అనకాపల్లిలో ఇళ్లు కూలాయి. కశింకోట, రాంబిల్లి, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. దేవరాపల్లిలో ఇంటి ముందు పోర్టికో కూలి తల్లీ కూతుళ్లు గాయపడ్డారు. అనంతగిరి సమీపంలో కేకే రైలు మార్గంలో కొండ చరియలు విరిగిపడి రైలు పట్టాల మీద పడటంతో గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. అక్కడక్కడా పంటలకు నష్టం కలగజేసినప్పటికీ ఈ వర్షాలు వేసవి దుక్కులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. విశాఖపట్నం: మండువేసవిలో కుండపోత జిల్లాను ముంచెత్తింది. ‘రోవాను’ తుపాను వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గురువారం డివిజన్, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు తెరిచారు. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ గురువారం మీడియాకు వివరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఒలను మండల కేంద్రాల్లోనే ఉండేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ తుపాను విపత్తును ఎదుర్కోడానికి వీలుగా జిల్లాలో అందుబాటులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు నావీ అధికారులతో చర్చించి 15 ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేశారు. 96 తీరగ్రామాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. హుద్‌హుద్ తుపానుకు 250 కి.మీ వేగంతో గాలులు వేయగా...ప్రస్తుత రోవాను తుపాను సందర్భంగా తీరం వెంబడి 100 కి.మీ.వేగంతోనే ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనావేయడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ గాలులుకు పూరిళ్లు ఎగిరి పోయే ప్రమాదం ఉన్నందున, పూరిళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి తరలింపు నిర్ణయం తీసుకోనున్నారు. తుపాను షెల్టర్లు, ఫ్లడ్‌బ్యాంక్స్ పునరుద్ధరణ 86 తుఫాన్ షెల్టర్స్‌లో 36 షెల్టర్లను పునర్నిర్మించగా, మరో 15 వరకు పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా కమ్యూనిటీ హాల్స్, పాఠశాలలను కూడా సిద్ధం చేశారు. మండలాలకు అదనంగా బియ్యం నిల్వలను తరలిస్తున్నారు. జిల్లాలోని శారదా, వ రహా, గోస్తని, పెద్దేరు వంటి నదీ తీర ప్రాంతాల్లో 16 చోట్ల ఫ్లడ్ బ్యాంక్స్ బలహీనంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో గండ్లు పడకుండా ముందుజాగ్రత్త చర్యగా ఇరిగేషన్ శాఖ ద్వారా ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చోడవరం మండలం వడ్డాది వద్ద అత్యంత బలహీనంగా ఉన్న పెద్దేరు నదిగట్టుపై ఇసుక బస్తాలతో పటిష్టపర్చే చర్యలు చేపట్టారు. సబ్బవరం మండలం రాయపురాజుచెరువు గండిపడి 25 ఎకరాల కూర గాయల పంటలు దెబ్బతినడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగు, తాగునీటి చెరువులను ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. నీరుచెట్టు కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా చెరువుగట్లు తొలగించి ఉంటే వెంటనే పూడ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రెండో ఘాట్ రోడ్డులో కూలిన బండ
- ఈ మార్గం మూసి ఉండటంతో తప్పిన ప్రమాదం - మరిన్ని కూలే అవకాశముందని నిపుణుల అంచనా తిరుమల తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో సోమవారం భారీ బండ కూలింది. ఈ మార్గంలోని 16వ కిలోమీటరు వద్ద సుమారు పది టన్నుల బరువు గల బండ రోడ్డుపై పడింది. తరచూ కొండ చరియలు కూలుతుండటంతో ఈనెల 8వ తేదీ నుంచే ఈ మార్గాన్ని మూసివేశారు. వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ముప్పూ వాటిల్లలేదు. కూలిన బండరాయిని తొలగించటం కష్టం కావడంతో ఆ రాయిని ముక్కలు చేసి తొలగించాలని టీటీడీ ఇంజినీర్లు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి అలిపిరి సమీపంలో మరో భారీ రాయి కూడా కూలింది. ఇదే తరహాలోనే భారీ కొండ చరియలు మరిన్ని కూలే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మార్గంలోని 7 నుంచి 16వ కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి ఘటనలు జరగవచ్చని అంచనా వేశారు. ఘాట్‌లో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఏ నిమిషానికి ఏ బండ కూలునో!
తిరుమల ఘాట్‌లో కూలుతున్న కొండ చరియలు భయం భయంగా ప్రయాణం నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ఫలితం తిరుమల: తిరుమల ఘాట్ రోడ్లలో ఏ నిమిషంలో ఏ బండ కూలుతుందోనన్న ఆందోళన నెలకొంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇరవై ప్రాంతాల్లో బండరాళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించేం దుకు భక్తులు భయపడుతున్నారు. శాశ్వత చర్యలు తీసుకోవడంలో టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో ఘాట్‌లో 20కిపైగా సమస్యాత్మక ప్రాంతాలు 1944 ఏప్రిల్ 10న తొలి ఘాట్ రోడ్డు నిర్మించారు. రాకపోకలు ఒకే రోడ్డులో జరిగేవి. శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు పెరిగారు. 1960లో రెండో ఘాట్‌రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనువైన మార్గాన్ని సర్వే చేసి 1969 నుంచి 1973 మధ్య కాలంలో రెండో ఘాట్ రోడ్డును నిర్మించారు. అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గోకరాజు గంగరాజు రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. అలిపిరి నుంచి ఏడు కిలోమీటర్ల తర్వాత నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. వరుసగా రెండు రోజుల పాటు ఓ మోస్తరులో వర్షం కురిస్తే చాలు భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడటం సాధారణమైపోయింది. శ్రీవారి ఆశీస్సులతో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. కొండచరియల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులోనూ, ఈ ఏడాది మూడు దఫాలుగా కొండ చరియలు కూలాయి. నిపుణుల సూచనలు పట్టించుకోని టీటీడీ కొండచరియలు కూలే ఘాట్ రోడ్డు ప్రాంతాలను ఐఐటీ ఇంజినీరింగ్ నిపుణులు నరసింహారావు సందర్శించారు. ఇక్కడ ఉన్న రాతిశిలల నిర్మాణంపై, వాటి భవిష్యత్ స్థితిగతులపై స్వయంగా అధ్యయనం చేశారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 20 ప్రాంతాల్లోని కొండరాళ్లను దశలవారీగా తొలగించాలని నివేదిక సమర్పించారు. అవసరాన్ని బట్టి రాక్బౌల్టర్ట్రాప్, రివిట్మెంట్లు నిర్మించాలని సూచించారు. దశాబ్దకాలం ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద చేపట్టిన భద్రతా చర్యలను కూడా అమలు చేయాలని సిఫారసు చేశారు. వీటిని టీటీడీ ఉన్నతాధికారులు లెక్కలోకి తీసుకోలేదు. కూలే రాళ్ల తొలగింపులో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వర్షం వచ్చిన సందర్భాల్లో రాళ్లు కూలటం రివాజుగా మారింది. ఘాట్ ప్రయాణంలో స్వీయ అప్రమత్తత తప్పనిసరి వర్షాల వల్ల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు కూలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ప్రయాణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్‌రోడ్డులో ఏడో కిలోమీటరు నుంచి తిరుమలకు వచ్చే వరకు ఇలాంటి పరిస్థితులున్నట్టు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వాహనదారులు కుడివైపున కొండలు ఆనుకుని కాకుండా ఎడమవైపు ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్ వాడటం శ్రేయస్కరమని హెచ్చరిస్తున్నారు. ఘాట్ రోడ్డులో మొబైల్ పార్టీలతో గస్తీ పెంచారు. -
డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని..
ఇరవై నాలుగేళ్ల ‘హ్యారీపాటర్’ స్టార్ సినిమాల్లోనైతే అదరగొడుతున్నాడు గానీ... డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని ఇప్పుడే తెలిసింది. ఇన్నేళ్లుగా మనోడికి డ్రైవింగ్ లెసైన్సే లేదట. ఈస్ట్ లండన్ సబర్బన్ హార్న్చర్చ్లో రీసెంట్గా వేసిన ట్రయల్స్‌లో పాసైపోయాడట. విషయమేమంటే.. ఇదే ఈ హీరోగారి ఫస్ట్ అండ్ లాస్ట్ డ్రైవింగ్ టెస్ట్..! తనను ఎవరూ గుర్తు పట్టలేనంతగా... చింపిరి జుత్తు, మాసిన గడ్డంతో వెళ్లాడట రాడ్‌క్లిఫ్. విషయమేమంటే... అదే సమయంలో టెస్ట్‌లో గట్టెక్కిన జర్రా కషింగ్ అనే అమ్మాయికి కూడా అతడు క్లిఫ్ అని తెలియలేదట! -
ఏ రాయి కూలునో..!
తిరుపతి నుంచి తిరుమలకు వాహనాల్లో వెళ్లే ప్రయాణికుల గుండెలు అరచేత పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో రెండో ఘాట్‌రోడ్డులో భారీ కొండ చరియలు విరగిపడుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా 50 టన్నుల కొండ కూలింది. సాక్షి, తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో సుమారు ఇరవై ప్రాంతా ల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అలిపిరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత నుంచి తిరుమలకు చేరే వరకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనూ చివరి ఐదు మలుపులు (హెయిర్ పిన్ కర్వ్స్) వద్ద చాలా ప్రాంతాల్లో కొండ చరియలు కూలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగి పడడంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజినీరింగ్ నిపుణులను రప్పించి వాటిని తొలగించారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండ బొరియల్లోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె (ఫెన్సింగ్) నిర్మించారు. చివరి మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడడంతో రెండేళ్లకు ముందు అక్కడ రాక్‌బౌల్టర్ ట్రాప్ (ఇనుప కంచె) నిర్మించారు. దీనివల్ల బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండడంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఇలాంటి పరిస్థితులే సుమారు మరో ఇరవై ప్రాంతాల్లో వెలుగుచూస్తుండడం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొండరాళ్లు కూలే ఘటనల్లో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రతాపరంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. కొండ చరియలు విరిగి పడుతున్న రెండో ఘాట్‌రోడ్డులో వాహనదారులు, ద్విచక్రాలపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని అవ్వాచ్చారి కోన ఎగువ ప్రాంతం, కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు మాత్రమే కొండచరియలు అడపా దడపా విరిగి పడుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈ పరిస్థితులు లేవని ఇంజినీర్లు చెబుతున్నారు. కూలుతున్న బండరాళ్లపైటీటీడీ అప్రమత్తం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌రోడ్డులో ఆదివారం కూడా కొండచరియలు కూలాయి. శుక్రవారం అర్ధరాత్రి 50 టన్నుల కొండ కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డి ఆదేశాలతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరామకృష్ణ, డెప్యూటీ ఇంజినీర్ సురేంద్రరెడ్డి అప్రమత్తంగా ఉంటున్నారు. కూలిన ప్రాంతంలో మరమ్మతు పనులు, కొత్త రివిట్మెంట్ (గోడ) నిర్మాణం చేపట్టారు. ప్రతి రెండు గంటలకు ఘాట్‌రోడ్డు మొబైల్‌పార్టీ వాహనాల్లో ఇంజినీరింగ్ సిబ్బందిని పంపించి పడిన రాళ్లను తొలగించారు. దీంతో మొదటి, రెండో ఘాట్‌రోడ్లలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. దీనికితోడు టీటీడీ విజిలెన్స్ విభాగం ఏవీఎస్వోలు కూర్మారావు, వెంక టాద్రి కూడా కొండ చరియలు కూలినట్టు సమాచారం అందితే అందుకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.