కొండ బండను ఆనుకొని ఉన్న ఈ చెక్క నిర్మాణం అధిరోహకులను రెస్క్యూ చేయడానికేమో అని అనుకుంటే అచ్చంగా పొరపాటే! అదో కొట్టు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షినియుజాయ్ అనే సుందరమైన ప్రాంతం అది. అక్కడ 120 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న కొండను ఎక్కే అధిరోహకులకు.. ఆహారం, మంచినీరు, విశ్రాంతి వంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వం ఓ కొట్టు తెరిచింది. దాని పేరు ‘హ్యాంగింగ్ కన్వీనియెన్స్ స్టోర్.
’ ఈ ఫొటోలో కనిపిస్తున్నదదే! అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండి.. పర్యాటకులకు సేవలు అందిస్తుంటాడు. అవసరమయ్యే వస్తువులన్నిటినీ తాడుతో కింది నుంచి పైకిలాగి ఈ కొట్టులో స్టోర్ చేస్తారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా మౌంటెనీర్సే తమకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ మోసుకెళ్లేవారు. ఆ అవస్థ చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పుడు మౌంటెనీర్స్‌కి కావలసిన వస్తువులన్నీ తక్కువ ధరకే ఈ కొట్టులో లభిస్తున్నాయి. దాంతో మౌంటెనీరింగ్ ఈజీ అయింది.. ఆ కొట్టు వ్యాపారమూ జోరుగా సాగుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మూతపడ్డ ఈ స్టోర్‌ను తిరిగి తెరవడంతో విషయం వైరల్ అయింది.
(చదవండి: ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..)
Comments
Please login to add a commentAdd a comment