Hang
-
120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకుని ఓ కొట్టు..ఎక్కడంటే
కొండ బండను ఆనుకొని ఉన్న ఈ చెక్క నిర్మాణం అధిరోహకులను రెస్క్యూ చేయడానికేమో అని అనుకుంటే అచ్చంగా పొరపాటే! అదో కొట్టు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షినియుజాయ్ అనే సుందరమైన ప్రాంతం అది. అక్కడ 120 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న కొండను ఎక్కే అధిరోహకులకు.. ఆహారం, మంచినీరు, విశ్రాంతి వంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వం ఓ కొట్టు తెరిచింది. దాని పేరు ‘హ్యాంగింగ్ కన్వీనియెన్స్ స్టోర్. ’ ఈ ఫొటోలో కనిపిస్తున్నదదే! అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండి.. పర్యాటకులకు సేవలు అందిస్తుంటాడు. అవసరమయ్యే వస్తువులన్నిటినీ తాడుతో కింది నుంచి పైకిలాగి ఈ కొట్టులో స్టోర్ చేస్తారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా మౌంటెనీర్సే తమకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ మోసుకెళ్లేవారు. ఆ అవస్థ చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పుడు మౌంటెనీర్స్కి కావలసిన వస్తువులన్నీ తక్కువ ధరకే ఈ కొట్టులో లభిస్తున్నాయి. దాంతో మౌంటెనీరింగ్ ఈజీ అయింది.. ఆ కొట్టు వ్యాపారమూ జోరుగా సాగుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మూతపడ్డ ఈ స్టోర్‌ను తిరిగి తెరవడంతో విషయం వైరల్ అయింది. (చదవండి: ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..) -
ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరితీయాలి: పాక్ ప్రతిపక్ష నేత
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అహ్మద్ ఖాన్. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టులపై కూడా విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్‌ను జడ్జీలు అల్లుడిలా ట్రీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్.. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని, యూధుల ఏజెంట్ అని తీవ్ర ఆరోపణలు చేశారు రియాజ్. ఈ ఉగ్రవాదులే పాక్ పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారని, దాడులు చేశారని పేర్కొన్నారు. కమాండర్ జిన్నా ఇంటిని కూడా తగలబెట్టారని మండిపడ్డారు. కోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఒకవేళ ఆయన అంతగా నచ్చితే జడ్జీలంతా వెళ్లి పీటీఐ పార్టీలో చేరాలని సెటైర్లు వేశారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ మద్దతుదారులు పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, భవనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయారు. దీంతో ప్రజలంతా శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. పోలీసులు పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. హింసకు పాల్పడింది ఒవరో నిర్ధారించుకోకుండా పీటీఐ శ్రేణలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. చదవండి: అమ్మో హాజీ! పాకిస్తాన్ అండతో రెచ్చిపోతున్న డ్రగ్ కింగ్.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్... -
కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమికులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులను భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతిగా గుర్తించారు. ఇద్దరూ ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. స్నేహితుడి రూమ్‌కు వెళ్లి ఆత్యహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోగా.. శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
భారత సంతతి తంగరాజును ఉరితీసిన సింగపూర్.. కేసు ఇదే..
సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46)ను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. కాగా, తంగరాజు.. సింగపూర్‌కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో, ఉరిశిక్షను అధికారులు అమలు చేశారు. వివరాల ప్రకారం.. సింగపూర్‌కు కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో, తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్పయ్య కుటుంబ సభ్యులు, ఐక్యరాజ్య సమితి యాక్టివిస్టులు విజ్ఞప్తులు చేసినప్పటికి సింగపూర్ అధికార యంత్రాంగం ఉరి శిక్షను అమలు చేసింది. ఇదిలా ఉండగా.. తంగరాజు సుప్పయ్య కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్‌కు చివరి నిమిషంలో లేఖ రాశారు. అయినప్పటికీ ఉరి శిక్షను అమలు చేయడం గమనార్హం. అయితే, తంగరాజు.. నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో దోషిగా తేలాడు. ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు. మరోవైపు.. తంగారాజు ఉరిశిక్షపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వారం తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిన తర్వాత ఛాంగి జైలులో గ్లాస్ కిటికీ మధ్యలో నుంచి తాము సుప్పయ్యను చూసేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ రోజు వస్తుందని తంగరాజు మానసికంగా సిద్ధమై ఉన్నారని, అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారని చెప్పారు. కాగా, సింగపూర్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సింగపూర్ చెబుతోంది. అందుకు ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. Singapore has hanged 46-year-old Tangaraju Suppiah who was found guilty in 2018 of trafficking more than 1kg of cannabis https://t.co/TZ5yq6rIVv pic.twitter.com/P5aM22AUIa — Al Jazeera English (@AJEnglish) April 26, 2023 -
'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందన్నారు. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టారు. ఆమె కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించకుండా.. వాహనాన్ని కిలోమీటర్ల మేర తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి దస్తులు చిరిగిపోయాయి. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం ఢిల్లీలో కలకలం రేపింది. అనంతరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. చదవండి: ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం -
కశ్మీర్ ఫైల్స్.. అదే నిజమైతే ఉరి తీయండి
ది కశ్మీర్ ఫైల్స్ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్ పండిట్ల వలసలకు ఫరూఖ్ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన. అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. ది పొలిటికల్ హీట్! -
భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య
జైపూర్: భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని మనస్తాపానికి గురైన భార్య.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు.. ఈ సంఘటన రాజస్తాన్, ఆర్కే పురం స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అంజలి సుమన్ అనే మహిళకు రాజస్తాన్‌కు చెందిన శుభం అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు బాగానే ఉండేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం దంపతులిద్దరికి ఓ షర్ట్ విషయంలో గొడవ జరగింది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని అతడితో గొడవపడింది అంజలి. (చదవండి: వివాహితతో ప్రేమ.. యువకుడిని దారుణంగా కొట్టి ) చిన్నగా ప్రారంభం అయిన వివాదం కాస్త ముదరడంతో ఆగ్రహించిన శుభం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అంజలి భర్తకు ఫోన్ చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక మాట్లాడదాం అని చెప్పాడు. అరగంట తర్వాత అతడి మొబైల్‌కు ఓ కాల్ వచ్చింది. విషయం ఏంటంటే అంజలి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికే అంజలి ఏకంగా ప్రాణాలు తీసుకోవడం ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. చదవండి: అవని ఆనందం ఆకాశమంత... -
తప్పిన ప్రమాదం.. రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తృటిలో బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ బ్రేకులు వేయడంతో బస్సు గాలిలో వేలాడుతూ ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, పోలీసులు ట్రాఫిక్‌ను అదుపు చేస్తున్నారు. బస్సు కింద పడుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు తెలిపారు. అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: 'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో -
టీనేజర్ ఉసురు తీసిన చోరీ.. చేతిలో లోదుస్తులతో పరిగెడుతుండగా
బాల్కనీలో ఆరేసిన లోదుస్తులు చోరీ చేస్తుండగా ఓ టీనేజర్‌ను ఆ జంట చూసింది. అతన్ని వెంటాడి పట్టుకుని గదిలో బంధించింది. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ టీనేజర్ ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. భోపాల్: రవి(24), అతని భార్య స్థానికంగా గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. ఆరేసిన రవి భార్య లోదుస్తులను తీసుకుని ఓ కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. అతని వెంటాడి పట్టుకున్న ఆ జంట గదిలో వేసి బంధించారు. పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ డోర్ తెరిచి చూసేసరికి.. ఫ్యాన్‌ను ఉరేసుకుని చనిపోయాడు. అయితే మృతుడి బంధువు ఫిర్యాదు ఆధారంగా ‘ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద రవి, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఆ దంపతుల తప్పేమీ లేదని, అవమానంతో ఆ కుర్రాడే ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టుపక్కలవాళ్లు చెప్తున్నారు. -
ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం!
గువాహటి: అస్సాంలో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అక్కడి మీడియాలో ఎక్కువ ఫోకస్ కావడంతో ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. కోక్రాజ్హర్ జిల్లా అభయకుటి గ్రామం శివారులోని అడవుల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు చుట్టాలయ్యే ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఒకరి వయసు 16, మరొకరి వయసు 14. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారని, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆ ఇద్దరూ కనిపించకుండా పోయారని బంధవులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించి.. నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. బాధితుల్లో ఒకరు అనాథ కాగా, మరొక తల్లి రోదనలతో అభయకుటిలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనలో అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కోక్రాజ్హర్ పోలీసులు చెప్తున్నారు. చదవండి: శారీరక సుఖం కోసం పోయి.. -
150 ఏళ్ల అనంతరం తొలి ఉరి.. 40 ఏళ్లలో తొలిసారి
సాక్షి, న్యూఢిల్లీ : తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హత్యచేసిన ఉత్తరప్రదేశ్ మహిళ షబ్నమ్-సలీంలను ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఒకే కేసులో దోషులుగా తేలిన ప్రియుడు సలీం, ప్రియురాలు షబ్నమ్ ప్రస్తుతం వేరువేరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2010లో దిగువ విధించిన మరణశిక్షను 2015లో సుప్రీంకోర్టు సమర్థించడం, ఆ తరువాత దోషులు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తోసిపుచ్చడంతో ఉరిశిక్ష తప్పలేదు. ఈ క్రమంలోనే ఖైదీలను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథురు జైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో ఆగ్రా సెంట్రల్ జైలు ఉన్న మరో దోషి సలీంను సైతం ఉరితీసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అయితే ఈ రెండు ఉరితీతలకు ఓ ప్రత్యేకత ఉంది. దేశానికి స్వాతంత్య్ర వచ్చిన అనంతరం ఉరితీయబడుతున్న తొలి మహిళ షబ్నమ్ కావడంతో పాటు.. 1984న తరువాత ఆగ్రా సెంట్రల్ జైలులో ఉరితీయడం కూడా ఇదే తొలిసారి. మథుర జైలులో షబ్నమ్‌ను ఉరితీసే సమయానికి ఆగ్రాలో సలీంను సైతం ఉరికంభం ఎక్కించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అనేక కారాగారాలు ఉన్నప్పటికీ కేవలం ఆగ్రా, మథురలోనే ఉరికంభాలు ఉన్నాయి. అప్పటి బ్రిటిష్ ఇండియాలో 1741లో ఆగ్రా సెంట్రల్‌ను జైలు ఏర్పాటు చేయగా.. ఎంతోమందికి అక్కడ ఉరితీశారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి 35 మందిని ఉరికంభం ఎక్కించారు. ఒక్క 1959లోనే పదిమంది ఖైదీలను ఉరితీయగా.. 1984లో చివరిసారిగా ఆగ్రాజైలు ఉరితీత జరిగింది. ఓ బాలికపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిపిన బులంద్‌షహర్‌కు చెందిన జమాన్ ఖాన్‌ను చివరగా ఉరితీశారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆగ్రాజైల్లో ఒక్క ఖైదీని కూడా ఉరికంభం ఎక్కించలేదు. దాదాపు 40 ఏళ్ల అనంతరం సలీంను బలిపీఠం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. మరోవైపు దేశంలో 150 ఏళ్ల తరువాత ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తన ప్రియుడు సలీంతో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించారన్న కారణంతో 2008లో షబ్నమ్ కుటుంబ సభ్యుల్ని అందరినీ దారుణంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. రెండు పీజీ పట్టాలు పొందిన యువతి ఆరో తరగతి చదవిన యువకుడి కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడం దేశ వ్యాప్తంగా సంచలన రేపింది. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. దీంతో తాజాగా మథుర కోర్టు దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా కాగా బ్రిటిష్ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం. అయితే ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ షబ్నమ్‌కు క్షమాభిక్ష పెట్టాలని ఆమె తరుఫు న్యాయవాదులు కోరుతున్నారు. మరోవైపు తన తల్లికి విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలని షబ్నమ్ కుమారుడు వేడుకుంటున్నాడు. ‘అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి?’ ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి -
‘అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి?’
లక్నో: అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి.. ఈ ప్రశ్న చదువుతుంటేనే కడుపులో పేగు బాధతో మెలిపెడుతోంది కదా. అలాంటిది తన కళ్ల ముందే తల్లి చనిపోతుందని తెలిస్తే.. 12 ఏళ్ల ఆ చిన్నారి మనసు ఎంత విలవిల్లాడుతుందో ఊహించుకోండి. తల్లి లేకుండా అసలు బిడ్డలు తమ జీవితాన్ని ఊహించుకోలేరు. ఎన్ని జన్మలు అనుభవించినా తనివి తీరనది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి బంధం తర్వలోనే తనకు దూరం కాబోతుందని తెలిసి ఆ చిన్నారి విలవిల్లాడాడు. తన కోసం అయినా అమ్మను క్షమించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇంతకు ఆ చిన్నారి ఎవరు.. ఎందుకు అతడి తల్లి చనిపోతుంది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా షబ్నం అనే పేరు మార్మోగుతుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్ష అనుభవించబోతున్న తొలి మహిళ షబ్నం. ఉత్తరప్రదేశ్ మథురలో నివాసం ఉండే ఈమె.. ప్రేమించిన వ్యక్తితో విహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో లవర్‌తో కలిసి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల క్రితం అనగా 2008 ఏప్రిల్ 14న షబ్నం తన ప్రియుడు సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును మథుర కోర్టు విచారించింది. ఇక నిందితులు షబ్నం, ఆమె ప్రియడు ఇద్దరికి మరణశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. 2010లో వచ్చిన మథుర కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. దోషులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇదే రిపీట్ కావడంతో 2015లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిని ఉరి తీయాల్సిందిగా మథుర కోర్టు, జైలు అధికారులను ఆదేశించింది. ఇక కుటుంబ సభ్యులను హతమార్చే సమయానికే షబ్నం గర్భవతిగా ఉంది. జైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. తనతో పాటే కుమారుడిని పెంచింది. అయితే ఖైదీగా ఉన్న తల్లి దగ్గర పిల్లలు ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ఉండకూడదు. ఈ క్రమంలో 2015లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి షబ్నం కుమారుడిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించింది. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది. దాంతో షబ్నం కాలేజీ స్నేహితుడైన సైఫి, ఆమె కుమారుడి బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లి పెంచసాగాడు. ఈ సందర్భంగా సైఫి మాట్లాడుతూ.. ‘‘చదువుకునే రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నేను చాలా వీక్‌గా ఉండేవాడిని. అప్పుడు షబ్నం నాకు ఎన్నో సార్లు డబ్బు సాయం చేసింది. ఆమె వల్ల నేను కాలేజీ చదువు పూర్తి చేయగలిగాను. ఆమె నాకు అక్క కన్నా ఎక్కువ. చదువు పూర్తయ్యాక నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిందని తెలిసి నేను షాక్ అయ్యాను. వెళ్లి ఆమెను కలవాలని అనుకున్నాను’’ అని తెలిపాడు. ప్రస్తుతం సైఫి బులంద్‌షహర్‌లో జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ‘‘ఇదే సమయంలో షబ్నం కుమారుడి దత్తతకు సంబంధించిన యాడ్ చూశాం. గతంలో తను నన్ను ఆదుకోకపోయి ఉంటే.. ఇప్పుడు ఇంత మంచి స్థితిలో ఉండేవాడిని కాదు. ఆమె నాకు చేసిన మేలుకు రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఆమె కుమారుడి బాధ్యత నేనే తీసుకోవాలనుకున్నాను. దీని గురించి నా భార్యతో కూడా మాట్లాడాను. ఆమె కూడా అంగీకరించింది’’ అని తెలిపాడు. ‘‘ఆ తర్వాత మేం భార్యభర్తలిద్దరం జైలుకు వెళ్లి షబ్నమ్‌ని కలిశాము. ఆమె కుమారుడిని మాతో పాటు తీసుకెళ్తాం.. అతడి బాధ్యతను మేం తీసుకుంటాం అని అడిగాం. ఆమె అంగీకరించింది. ఇక బాబును ఎన్నటికి అతడి తల్లి పుట్టిన ఊరికి తీసుకెళ్లకూడదని భావించాం. ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడకు తీసుకెళ్లలేదు. జైలులో తనకు పెట్టిన పేరు మార్చి.. తాజ్ అని పెట్టాం’’ అని తెలిపారు. ‘‘తల్లి గురించి తాజ్‌కు అన్ని వివరాలు తెలుసు. ఎంతైనా కన్న తల్లి కదా. ఆమె మీద ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. ఇక తర్వలోనే షబ్నమ్‌ను ఉరి తీస్తారని తెలిసి ఆ చిన్నారి మనసు విలవిల్లాడుతుంది. అందుకే తన తల్లిని క్షమించాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కోరుతున్నాడు. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్‌ని దాఖలు చేశాడు. పాపం అమ్మ చనిపోతే నా పరిస్థితి ఏంటంటూ ఆ చిన్నారి అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాడు. చూడాలి ఏమవుతుందో అన్నాడు’’ సైఫి. చదవండి: ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి న్యాయవాదుల హత్య: ఆ కేసులే కారణమా? -
ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి
సాక్షి, న్యూఢిల్లీ : స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు ఉత్తరప్రదేశ్ జైలు అధికారులు సిద్ధమయ్యారు. ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చిన ఓ మహిళను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథుర కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో తలారి పవన్ జల్లద్ ఉరితాడును సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేసు వివరాల ప్రకారం.. మథురకు చెందిన షబ్నమ్ అనే మహిళ స్థానికంగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే సలీం అనే వ్యక్తితో పరిచయం ఏర్పాడి అనంతరం శారీరక సంబంధానికి దారతీసింది. పెళ్లికి ముందే షబ్నమ్ దారితప్పడంతో కుటుంబ సభ్యలు గట్టిగా మందలించారు. మరోసారి అతనితో తిరగొద్దని ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని షబ్నమ్ సలీంను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కొరకు కుటుంబ సభ్యుల అనుమతినికోరింది. దీని వారు నిరాకరించడంతో పాటు షబ్నమ్‌ను గృహనిర్బంధం చేశారు. దీంతో కుటుంబ సభ్యులపై కక్షపెంచుకున్న షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి హతమర్చాలని పథకం పన్నింది. అనుకున్నదే తడువుగా 2008 ఏప్రిల్ 14న అర్థరాత్రి సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదు రోజుల అనంతరం నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారద్దరినీ జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్ ఏడు వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యులను హతమార్చేలా సలీంను షబ్నమే ప్రోత్సహించిందని తేలింది. అంతేకాకుండా ఆమె ఎంఏ ఇంగ్లీష్, జాగ్రఫీలో పట్టాపొందారు కూడా. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. దీంతో తాజాగా మథుర కోర్టు దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా కాగా బ్రిటిష్ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం. -
హత్రాస్ దోషులను ఉరి తీయాలి: సీఎం
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, వారి మద్దతుదారులు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మేమంతా ఎంతో బాధతో ఇక్కడ సమావేశం అయ్యాం. మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దోషులను వీలైనంత త్వరగా ఉరి తీయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు. (చదవండి: ‘వారు రైతుల పక్షాన పోరాడారు’) ఇక భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్.. ‘హత్రాస్‌ను సందర్శిస్తాను. యూపీ సీఎం రాజీనామా చేసేవరకు నా పోరాటం కొనసాగుతుంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు నేను వెనకడుగు వేయను. ఈ ఘటనను పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరుతున్నాను’ అన్నారు. సూర్యాస్తమయం తర్వాత నిరసనకారులు కొవ్వొత్తులను వెలిగించి చీకటిలో పట్టుకుని నిలబడ్డారు. -
ఖేల్ ఖతమ్
-
నిర్భయ కేసు: దేశ చరిత్రలో ఇదే ప్రథమం
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లు ఈ తెల్లవారుజామున ఉరి తీయబడ్డారు. ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరితీయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జలాద్ వారిని ఉరితీశారు. జైలు నెంబర్ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కాగా, 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది. చదవండి : నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ -
ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి..
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందోనని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే త గిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి:పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సం తృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. -
ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరికి రంగం సిద్ధమైంది. 2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించడం.. తీహార్ జైలు అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేయడంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు వారి ఉరితీత ఖరారైంది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉండగా.. ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు. ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిటిషన్‌ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో తీహార్ జైలు అధికారులు తాజా డెత్ వారెంట్లు కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు వెంటనే వాటిని జారీ చేయడం చకచక జరిగిపోయాయి. నిర్భయ తండ్రి హర్షం.. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినవారిలో ఒకరైన ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంపై నిర్భయ తండ్రి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లకు ఉరిపడటం దాదాపుగా ఖాయమైనందుకు సంతోషంగా ఉంది. క్షమాభిక్ష పెట్టిన వెంటనే తిరస్కరిస్తారని మాకు భరోసా ఇచ్చారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 22న జరగాల్సిన ఉరితీత వాయిదా పడటం నిరాశకు గురిచేసిందని, తాజా పరిణామాలతో మళ్లీ ఆశలు చిగురించాయన్నారు. నిర్భయ ఘటన.. 2012 డిసెంబర్లో నిర్భయపై ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్ అనే నలుగురితోపాటు మరికొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటం, ఈ క్రమంలో అయిన తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ నిర్భయ కొన్ని రోజుల తరువాత సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో మరణించడం మనకు తెలిసిన విషయమే. ఈ ఘోర సంఘటనకు స్పందనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2013 మార్చిలో ఐదుగురు నిందితులపై కేసు విచారణ మొదలైంది ఈలోపుగా ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుల్లో మరొకరు జువెనైల్ కావడంతో అతడిని మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచి ఆ తరువాత విడుదల చేశారు.మిగిలిన నలుగురి నిందితుల విచారణ తరువాత 2013 సెప్టెంబర్‌లోనే న్యాయస్థానం దోషులు నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. మైనర్‌నంటూ సుప్రీంకోర్టుకు.. నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌నంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఇదే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేయగా, దాన్ని హైకోర్టు కొట్టేసింది. విచారణ సమయంలో దోషి తరఫు న్యాయవాది హాజరుకాక పోవడంతో అతనిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే వ్యవహారంపై పవన్ కుమార్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. -
నిర్భయ కేసు: ఉరికంబాలు సిద్ధం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్యకేసులోని నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష వేసేందుకు రంగం సిద్ధమైంది. దేశంలో నలుగురు దోషులకు ఒకేచోట, ఒకేసారి ఉరిశిక్షను అమలు చేస్తున్న జైలుగా.. తీహార్ జైలు రికార్డు సృష్టించనుంది. గతంలో తీహార్ జైలులో ఒక ఉరికంబం మాత్రమే ఉండగా.. ఒకేసారి నలుగురు దోషుల ఉరితీతకు ఉరికంబాలు అవసరం అవుతుండడంతో జైలు అధికారులు ఆ దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అంతేకాక ఉరితీత సమయంలో జేసీబీ అవసరం కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే తీసుకువచ్చి తీహార్ జైలు ప్రాంగణంలో ఉంచారు. జేసీబీ యంత్రం సహాయంతో ఉరి తీయడానికి ఫ్రేమ్, భూగర్భంలో కొద్దిమేర గుంత తవ్వడానికి, ఉరిశిక్ష అనంతరం దోషుల మృతదేహాలను తరలించడానికి ఉపయోగించబడుతుంది. వివరాల్లోకి వెళితే.. 2012, డిసెంబర్ 16న పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానవీయంగా హత్యాచారం చేశార. సామూహిక అత్యాచారం అనంతరం ఆమెను కదులుతున్న బస్సులోంచి కిందకు తోసివేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబరు 29, 2012న ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. నిందితుల్లో ఒకరు జైలులోనే ఆత్మహత్య చేసుకోగా మరో నిందితుడు మైనర్ కావడంతో మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. మిగతా నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారుచేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కాగా నిర్భయ దోషులకు డెత్ వారెంట్ల జారీపై విచారణను పటియాలా హౌజ్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. చదవండి: నిర్భయ కేసు : లాయర్‌కు భారీ జరిమానా..! -
సెంగార్‌కు ఉరే సరి
ఉన్నావ్/న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తల్లి మంగళవారం డిమాండ్ చేశారు. మరో నిందితురాలు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం యూపీలోని ఉన్నావ్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారన్న కేసులో ఢిల్లీ కోర్టు సెంగార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లి మంగళవారం స్పందిస్తూ ‘‘శశిసింగ్‌ను ఎందుకు వదిలేశారు? ఉద్యోగమిస్తానని మాయమాటలు చెప్పి నా కూతురిని కుల్దీప్ సెంగార్ వద్దకు తీసుకెళ్లింది శశిసింగే’అని వాపోయారు. బాధితురాలి సమీప బంధువు ఇప్పటికీ జైల్లో ఉన్నారని, అతడు విడుదలయ్యేంత వరకూ తనకు న్యాయం దక్కనట్లేనని స్పష్టం చేశారు. దోషికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ వాదించగా ఈ అంశంపై తాను డిసెంబరు 20న తీర్పు వెలువరిస్తానని ఢిల్లీ జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ప్రకటించారు. (ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే) -
నిర్భయ దోషులను ఉరి: తలారి కోసం వెతుకులాట
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషులపైకి మళ్లింది. ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా.. దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖులూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారని, దానిపై రామ్‌నాథ్ కోవింద్ తుది నిర్ణయం తీసుకున్న అనంతరం శిక్షను అమలు చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే క్షమాభిక్ష పటిషన్‌పై వినయ్ శర్మ వెనక్కితగ్గారు. రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకోలేదని ఆయన తరుఫున న్యాయవాది తెలిపారు. దీనిపై కేంద్ర నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఉరిశిక్ష అమలుకు తిహార్ జైలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దోషులను ఉరి తీసేందుకు జైలులో తలారి లేరని జైలు అధికారులు అంటున్నారు. దేశంలో ఉరిశిక్షలు చాలా తక్కువ సందర్భాల్లో అమలు అవుతున్న విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేవలం నాలుగురిని మాత్రమే ఉరితీశారు. దీంతో జైలులో ఉరి తీసేందుకు శాశ్వత సిబ్బందిని అధికారులు నియమించడంలేదు. అవసరం పడిన సందర్భాల్లో మాత్రమే తలారి కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. తాజాగా నిర్భయ నిందితులును ఉరి తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుండటంతో ఆ మేరకు జైలు అధికారులు తలారి కోసం మల్లాగుల్లాలు పడుతున్నారు. కాగా వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌పై కేంద్ర హోంశాఖ తుది ప్రకటన వెలువడిన అనంతరం వారికి విధించిన శిక్షను అమలు చేస్తామని జైలు అధికారులు పేర్కొన్నారు. -
ఆయన కంటే ముందే నేను చనిపోతాను
సాక్షి, హైదరాబాద్: ‘నా భర్త మరణాన్ని జీర్ణించుకునే శక్తి నాకు లేదు.. ఆయన కంటే ముందే నేను చనిపోతా.. అంటూ తల్లికి ఫోన్ చేసి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం నారాయణపేటకు చెందిన సింధూజ(25), భర్త శివకుమార్‌తో కలసి రహ మత్‌నగర్‌లో అద్దెకుంటోంది. వారికి ఇద్దరు కొడుకులు. ఈ నెల 12న శివకుమార్‌కు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన శివకుమార్ తన భార్యకు చెప్పి ఇక తాను ఎక్కువ రోజులు బతకలేనేమోనని బాధపడ్డాడు. మానసిక ఒత్తిడికి గురైన సింధూజ తన తల్లి రత్నాదేవికి ఫోన్‌చేసి ఏ క్షణంలోనైనా తన భర్త గుండెపోటుతో చనిపోవచ్చని ఆయన కంటే ముందే తానే చనిపోతానంటూ చెప్పి ఏడ్చింది. సముదాయించిన ఆమె ఆ తెల్లవారే కుమార్తె వద్దకు రావాలని అనుకున్నా రాలేక పోయింది. ఈలోపునే సింధూజ సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రత్నాదేవి సోమవారం ఉదయం వచ్చే సరికి ఆమె విగతజీవిగా కనిపించింది. తమ అల్లుడి ఆరోగ్యం విషయంలో మనస్తాపానికి గురైన తన కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
ఊయలే ఉరితాడై..
ప్రకాశం, అద్దంకి: అప్పటి వరకు ఊయలలో ఊగుతూ చిన్నారి కేరింతలు కొట్టింది. కిలకిలా నవ్వింది. అంతలోనే ఆ ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడుగా మారింది. ఊయలగా చేసిన చీర మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పట్టణంలోని రాజీవ్ కాలనీలో సోమవారం జిరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీలో రాజు కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి లక్ష్మీ ప్రసన్న (9) అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో బాలిక తండ్రి రెండు నెలల క్రితం, తల్లి 9 నెలల క్రితం మృతి చెందారు. చిన్నారి అత్త వద్దే ఉంటోంది. దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మకు చీరను ఊయలగా వేసుకుని బాలిక ఊగుతోంది. ఊయల గిరగిరా గుండ్రంగా తిరగడం ప్రారంభించింది. కొద్దిసేపటికి చీర పైనుంచి మెలికలు పడటం మొదలు పెట్టింది. చిన్నారి కిందకు జారిన సమయంలో చీర మెడకు చుట్టుకుని బిగుసుకోవడంతో ఊపిరి ఆడక మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. బాలిక మృతిపై పలు అనుమానాలు చిన్నారి తల్లిదండ్రులు ఇదివరకే మరణించడంతో బాలిక పేరుతో ఉన్న ఆస్తి కోసం బంధువులెవరైనా హత్య చేసి ఊయల ఊగుతూ మృతి చెందిందనే కథ అల్లి ఉండొచ్చనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విధంగా మృతి చెందింది పోస్టుమార్టం రిపోర్టులో తెలియాల్సి ఉంది. బాలిక మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పాపం పసివాళ్లు
పహాడీషరీఫ్: ఎనిమిదేళ్ల క్రితమే అమ్మా నాన్నలను కోల్పోయి బాబాయి వద్ద పెరుగుతున్న ఓ బాలుడి జీవితంతో విధి మరోసారి ఆడుకుంది. ఇంట్లో తాడుతో ఆడుకుంటుండగా తాడు మెడకు చుట్టుకొని ఉరి పడటంతో బాలుడు మృతి చెందిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మధు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ గ్రామానికి చెందిన కె.లోకేష్(11)కు తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నాన్న ప్రభాకర్, చిన్నమ్మ హరిత వద్ద ఉంటూ స్థానిక లార్డ్స్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అతను తన చిన్నాన్న కుమారుడితో కలిసి తాడుతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇంట్లోకి వచ్చిన అతడి చిన్నమ్మ హరిత దీనిని గుర్తించి స్థానికుల సహాయంతో లోకేష్‌ను బాలాపూర్‌లోని ఓం సాయి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచనమేరకు డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. వారు నిలోఫర్‌కు రెఫర్ చేశారు. దీంతో అతడిని నిలోఫర్‌కు తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి లోకేష్(11) తల్లిదండ్రులు శ్రీనివాస్, లావణ్య ఎనిమిదేళ్ల క్రితమే మృతి చెందారు. 2011లో కుటుంబ కలహాల కారణంగా అతడి తల్లి లావణ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలను ఆర్పే క్రమంలో భర్తకు కూడా అంటుకోవడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి వారి బాబాయి ప్రభాకర్ చిన్నారులను పెంచుకుంటున్నాడు. కాగా ఈ నెల 10న లోకేష్ మరో బాబాయి పెళ్లి జరుగనుంది. ఈ తరుణంలో లోకేష్ మృతితో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భవనంపై నుంచి పడి బాలుడి దుర్మరణం యాకుత్‌పురా: ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకత్తా ప్రాంతానికి చెందిన కరీముల్లా ఘాజీ, హీనా ఘాజీలు దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మీరాలంమండిలో ఉంటూ బుర్ఖాల దుకాణంలో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి అతడి కుమారుడు అర్షద్(3) చిన్నారులతో కలిసి భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డా డు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం పురానీహవేలిలోని దుర్రు షెహవర్ ఆసుపత్రికి త రలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మీర్‌చౌక్ పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తాళి కట్టాకే ఆత్మహత్య ?
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు: ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని, మృతి చెందారు. ఎవరూ లేని సమయంలో గదిలో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. లంపకలోవ గ్రామానికి చెందిన మాసా ఏసుబాబు, రాణి దంపతుల కుమార్తె నవ్య (17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం దూర ప్రాంతంలో ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. నవ్య తన నాయనమ్మ మాసా ముసలమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కింతాడ అంజిబాబు (21) పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అంజిబాబు, నవ్యలు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అంజిబాబు తల్లిదండ్రులు రాంబాబు, నూకాలమ్మలు అంజిబాబు, నవ్యలకు వివాహం చేయాలని నవ్య తల్లిదండ్రులను కోరారు. కానీ బంధువుల అబ్బాయితో తమ కుమార్తెకు వివాహం చేస్తామంటూ ఏసుబాబు, రాణిలు తిరస్కరించారు. పెద్దలు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో నవ్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి పాలడ్డారు. మాసా ముసలమ్మ ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగా నవ్య మృతదేహం కిందన, దూలానికి వేలాడుతూ అంజిబాబు ఉండడంతో కేకలు పెట్టింది. ఇరుగు పొరుగు ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎం అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని, విచారిస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం ప్రేమికుల ఆత్మహత్య రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇరుగు పొరుగుతో సఖ్యతతో ఉండే అంజిబాబు, నవ్యలు మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవ్య నాయనమ్మ ముసలమ్మను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పిల్లను చేతిలో పెట్టి బతుకు దెరువు కోసం దూరప్రాంతాని వెళ్లిన తన కొడుకు, కోడలికి ఏమి చెప్పాలంటూ బోరున విలపిస్తోంది. ఇక కింతాడ రాంబాబు, నూకాలమ్మ దంపతుల మూడో సంతానమైన అంజిబాబు ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు మృతిని వారు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం వరకు కళ్లముందు ఉన్న కొడుకు విగతజీవుడుగా మారడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాళి కట్టాకే ఆత్మహత్య ? మాసా నవ్య మెడలో పసుపుతాడు ఉండడంతో ఆత్మహత్యకు ముందే ఆ గదిలో వివాహం చేసుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది. వారిద్దరి వివాహానికి నవ్య తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు అనుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోగలిగామనే సంతృప్తితోనే ఆఖరి క్షణంలో వివాహం చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యల వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిందే.