మండల పరిధిలోని జంపాపురం గ్రామంలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం మధా్యహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
యువతి ఆత్మహత్య
Nov 6 2016 11:48 PM | Updated on Nov 6 2018 7:56 PM
కోసిగి : మండల పరిధిలోని జంపాపురం గ్రామంలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం మధా్యహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కంబళదిన్నె బోయ అంజినయ్య, మారెమ్మ దంపతుల మూడో కుమార్తె అయిన అనుమంతమ(18)కు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు.దీనికి తోడు ఆయువతి కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత అనుమానంతో చుట్టు పక్కల వారు తలుపులు తెరిచి చూస్తే తాడుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ సమాచారాన్ని వారు యువతి కుటుంబ సభ్యులకు చేరవేశారు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న కోసిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement