
ప్రతీకాత్మచిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని తల్లిదండ్రులు మందలించి ఇంటికి తీసుకురాగా మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండలో జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్‌పీఆర్ హిల్స్ సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన బి.లక్ష్మయ్య,నాగలక్ష్మిల కూతురు హేమలత (19) నల్గొండకు చెందిన వరుణ్‌కు ప్రేమించింది.
పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న పెళ్లి చేసుకుంది.అదే రోజు అక్కడి పోలీసులు హేమలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు నల్గొండకు వెళ్లి పోలీసుల సమక్షంలో కూతురికి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం హేమలత నాయనమ్మ యాదమ్మ ఇంటి బయటకు కూర్చుని ఉండగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది.
విషయాన్ని గమనించిన యాదమ్మ కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా వచ్చి చూసేసరికి యువతి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment