
సాక్షి, మేడ్చల్: పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు పెళ్లైన ఆరు నెలలు తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యతో కలిసి హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో కాపురం పెట్టాడు.
దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వినయ్ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వినయ్ ఫ్యానుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు.
కాగా అయిదు రోజుల క్రితమే వినయ్ ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లైన ఆరు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వినయ్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే భార్య వేధింపుల కారణంగానే వినయ్ ప్రాణం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
Comments
Please login to add a commentAdd a comment