![Hyderabad Crime: Minors Commit Suicide Amid Parents Warn Love - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/1/Lovers.jpg.webp?itok=IpAqt4QK)
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియని వయసు.. ప్రేమ పేరుతో ఆకర్షణ.. ఆ వయసుకి స్వతహాగానే పెద్దల మందలింపు.. వెరసి ఆ బాధలో ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పేట్‌బషీరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫాక్స్‌సాగర్‌లో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు.. ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అలాంటి పనులు వద్దంటూ మందలించారు. విద్యార్థినిని ఇంటి వద్దే ఉంచారు. ఈ క్రమంలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చే వంకతో బయటకు వెళ్లిన విద్యార్థిని.. అతన్ని కలుసుకుంది. ఆపై వేరే విద్యార్థి ఇంట్లో బ్యాగు పెట్టేసి.. సైకిల్‌పై వెళ్లిపోయారు.
వాళ్లు కనిపించపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్లు చెరువు వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో వెతక్కగా.. ముందుగా విద్యార్థిని మృతదేహాం దొరికింది. ఇక ఇవాళ(శుక్రవారం) ఉదయం విద్యార్థి దేహం దొరకడంతో.. ఈ ప్రేమ వ్యవహారం విషాదాంతం అయినట్లు పోలీసులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment