Minor
-
మైనర్‌పై అత్యాచారం
అవుకు: ఇంట్లో ఎవరూ లేని సమయం తెలుసుకున్న ఓ ప్రబుద్ధుడు తాగడానికి మంచినీళ్లు అడిగి... అదే అదునుగా మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లా, అవుకు మండల పరిధిలోని కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురం గ్రామానికి చెందిన మైనర్ కోవెలకుంట్ల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే వ్యక్తి ఇదే పాఠశాల వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.రోజూ బాలిక ఇదే వ్యాన్‌లో ఊరికి వచ్చేది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటి వద్దకు వెళ్లి బాలికను..మీ నాన్న ఇంట్లోలేడా అని అడిగి.. తాగేందుకు మంచినీళ్లు తీసుకురమ్మన్నాడు. బాలిక ఇంట్లోకి వెళ్లగానే నిందితుడు తలుపులు వేసి బాలికనోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చి గేటు తీసింది. గేటు శబ్దం విన్న నిందితుడు బాలికను బెదిరించి మంచం కింద దాక్కున్నాడు. అప్పటికే భయాందోళనగా ఉన్న బాలిక తలుపులు తెరవగానే చెంపపై కాట్లు ఉండటంతో తల్లి ప్రశి్నస్తూనే నిందితుడిని గమనించింది. దీంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు, బంధువులు బాలిక ఇంటికి వచ్చి నిందితుడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మియాపూర్: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ
సాక్షి,హైదరాబాద్: మియాపూర్‌లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. -
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్‌గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
ఏడురోజులకు బాలిక మృతదేహం లభ్యం..
మహబూబాబాద్: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన దంపతుల కుమార్తె మియాపూర్‌లో ఈ నెల 7న అదృశ్యమైంది. అనంతరం అదే మియాపూర్ జంగల్లో 7రోజుల తర్వాత బాలిక మృతదేహం శుక్రవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మాతండా గ్రామ పంచాయతీకి చెందిన బానోతు నరేశ్, శారద దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఇద్దరి పిల్లలతో గత 20రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ మియాపూర్ ఏరియా పరిధిలోని నడిగడ్డతండాలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన వారి కుమార్తె బానోతు వసంత (12) సమీపంలోని కిరాణా షాపు వద్దకు వెళ్లింది.ఎంతకూ ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి నరేశ్ చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా మియాపూర్ జంగల్లో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక అనుమానాస్పదంగా మృతి చెందినట్లు భావించిన పోలీసులు వసంత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సదరు మృతదేహం తమ బిడ్డదేనని గుర్తించి బోరున విలపించారు. -
పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా నిందితుడు మైనర్ బాలుడి కుటుంబానికి సంబంధించిన ఓ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలను శనివారం అధికారులు కూల్చి వేశారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ మల్కంపేట్ ప్రాంతంలో మైనర్ బాలుడి ఫ్యామిలీకి ‘ఎంపీజీ క్లబ్’ అనే పేరుతో ఓ రిసార్ట్ ఉంది. దానిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులకు సమాచారం అందింది.The administration in Maharashtra's Satara district on June 9 demolished illegal structures in a resort in Mahabaleshwar owned by the family of the 17-year-old boy allegedly involved in the Pune Porsche crash, an official said.https://t.co/l9Hdui9pH1— The Hindu (@the_hindu) June 8, 2024 ఈ వ్యవహారంపై గతవారం సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్‌లో ఉన్న కట్టడాలు అక్రమమని తేలితే చర్యలు తీసుకోవాలని సతారా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే గతవారం రిసార్ట్‌ను అధికారులు సీల్ చేశారు. తర్వాత వాటిపై విచారణ చేపట్టగా.. ఆ కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణ అయింది. దీంతో శనివారం ఎంపీజీ క్లబ్ వద్దకు బుల్డోజర్ను తీసుకువెళ్లిన అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.మే 19 తెల్లవారుజామున మైనర్ బాలుడు మద్యం మత్తులో వేగంగా పోర్షేకారు నడిపి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్! -
పుణె మైనర్ ర్యాష్ డ్రైవింగ్ ఘటన .. ‘ఇది ప్రమాదం కాదు హత్యే’
మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్యంగా పోర్షే కారు నడిపి.. ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మైనర్‌కు 15 గంటల్లోనే బెయిల్ లభించగా.. బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పుణెలో ఆదివారం తెల్లవారు జామున 17 ఏళ్ల బాలుడు తాగిన మైకంలో పోర్స్చే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిపిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీశ్, అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటన సమయంలో మైనర్ 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా మైనర్ ర్యాష్ డ్రైవింగ్ రెండు కుంటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలు మంగళవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. అనీశ్ అవదీయా మృతదేహాన్ని మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బంధువులు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మైనర్ డ్రైవర్‌కు బెయిల్ ఇవ్వకూడదని అనీశ్ కుటుంబ సభ్యులు, బంధువులు అన్నారు. ‘ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఇది ప్రమాదం కాదని హత్య మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు, అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారు? అతడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.గత రాత్రి అశ్విని కోష్ట మృతదేహం జబల్పూర్లోని ఆమె ఇంటికి చేరుకుంది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై వారి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యాయ కోసం చివరి వరకు పోరాడతామని తెలిపింది. ‘మేము షాక్‌లో ఉన్నాము. నిందితుడికి 15 గంటల్లో బెయిల్ ఎలా ఇస్తారు. మైనర్‌తోపాటు అతడి తల్లిదండ్రులను విచారించాలి. అశ్విని తన కెరీర్‌పై ఎన్నో కలలు కంది. తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని కోరుకుంది. మా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. అశ్విని అంత్యక్రియలు ముగిసిన తర్వాత మేము ఈ విషయాన్ని చర్చిస్తాం’ అని పేర్కొంది.కాాగా, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడికి కోర్టు 14 గంటల్లోనే జువైనల్ కోర్టు బెయిలు మంజూరు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 ఏళ్ల మైనర్‌కు జువెనైల్ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ 300 పదాలతో ఓ వ్యాసాన్ని రాయడం, 15 రోజులపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయడం, మానసిక పరిస్థితిపై పరీక్ష చేయించుకుని, చికిత్స పొందడం వంటి షరతులను విధించింది. ప్రమాద తీవ్రతను ఆధారంగా నిందితులను మేజర్‌గా పరిగణించి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోరగా కోర్టు తిరస్కరించింది. తాజాగా పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. -
కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
తన ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్‌కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది.వివరాలు.. పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. పుణెలో ఆదివారం తెల్లవారుజామున పోర్స్చే కారును అతివేగంగా నడిపిన 17 ఏళ్ల బాలుడు బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీష్ అవధియా, అశ్విని కోష్ట ఎగిరి పడ్డారు. కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో కారు గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.అయితే బాలుడు అరెస్టైన 15 గంటల్లోనే కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు మైనర్ అవ్వడం వల్ల కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అతని తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ చెప్పారు. బాలుడు 15 రోజుల పాటు ఎరవాడలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, ప్రమాదాలపై వ్యాసం రాయాలని కోర్టు తెలిపింది. మద్యపానం సేవించకుండా ఉండేందుకు చికిత్స చేయించుకోవాలని, అలాగే కౌన్సెలింగ్ సెషన్లు తీసుకోవాలని తెలిపింది. కాగా నిందితుడు పుణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు కావడం గమనార్హం. -
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
అది ప్రేమే..కామం కాదు: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబై: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. యువకుడు, మైనర్ రిలేషన్లో ఉన్నారని, వారి మధ్య ఏర్పడిన లైంగిక సంబంధం ప్రేమ కారణంగా కలిగినదే తప్ప.. కామం వల్ల కాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఊర్మిళ జోషి పార్కే తీర్పు వెల్లడించింది. ‘బాలిక మైనర్యే కావచ్చు. కానీ ఆమె తన ఇష్టం మేరకే ఇంటిని వదిలి నిందితుడు నితిన్ ధబేరావుతో కలిసి ఉంటున్నట్లు పోలీసులతో చెప్పింది. ధబేరావు వయసు కూడా 26 ఏళ్లు. వారి ఇద్దరు ప్రేమ వ్యవహారం కారణంగానే కలిసి ఉండాలని అనుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం వల్లే లైంగికంగా ఒకటయ్యారు. అంతేగానీ నిందితుడు ఆమెను కామంతో లైంగిక వేధింపులకు గురిచేయలేదు. ఆమెపై బలవంతంగా జరిగిన దాడి కాదు’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ఆంక్షలతో కూడి బెయిల్ మంజూరు చేసింది. కాగా 13 ఏళ్ల మైనర్ తన ఇంటి పక్కన నివసించే నితిన్ దామోదర్ ధబేరావ్ను ప్రేమించింది. 2020 ఆగస్టులో అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు ఇద్దరు ఒకచోట నివసించారు. బాలిక తండ్రి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు. 2020 ఆగస్టు 30న దామోదర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. అక్టోబర్‌లో అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ధబేరావ్తో ప్రేమించడం కారణంగానే.. తన ఇష్టపూర్వకంగా ఇంటిని వదిలి బయటకు వచ్చినట్లు బాలిక తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినట్లు పేర్కొంది. అతనితో కలిసి జీవించేందుకే తన ఇంట్లో నుంచి బంగారం, డబ్బులు దొంగిలించినట్లు వెల్లడించింది. చదవండి: Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం -
మైనర్‌కు అబార్షన్.. కేరళ హై కోర్టు కీలక తీర్పు
కొచ్చి: పన్నెండేళ్ల వయసున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండడ్రులు పెట్టుకున్న అభ్యర్థనకు కేరళ హై కోర్టు నో అన్నది. ఇప్పటికే బాలిక గర్భంలోని పిండం వయసు 34 వారాలకు చేరినందున గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తెలిపింది. ‘గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే 34 వారాలకు చేరింది. బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతోంది ఈ దశలో అబార్షన్ కుదరదు’అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మైనర్ అయినందున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల పేరేంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆమె గర్భానికి కారణమయ్యాడని ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుడిని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది. గతంలో బాలిక అబార్షన్‌కు అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది. బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా, సామాజికంగా మనోవేదనను అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా మళ్లీ కోర్టు నో అన్నది. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల సమ్మె..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
క్రికెట్లో గొడవ... బాలుడి ప్రాణం తీసింది
మహారాష్ట్ర, చంద్రాపూర్: మహారాష్ట్రలోని బాగాడ్కిడ్కిలో దారుణం జరిగింది. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా తలెత్తిన వివాదంలో 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో కొట్టి చంపేశాడు. హత్య జూన్ 3న జరిగితే జూన్ 6న మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, అప్పటికే పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు చంద్రాపూర్ పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి... జూన్ 3న బాగాడ్కిడ్కిలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా పిల్లల మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది. అంతలోనే కోపగించిన 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో బలంగా తలపై కొట్టాడు. దీంతో ఆ మైనర్ బాలుడు కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ జూన్ 5న బాలుడు తుదిశ్వాస విడిచాడు. పోలీసులకి విషయం చెప్పకుండా బాలుడి తల్లిదండ్రులు మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాతి రోజున బాలుడి తల్లి చంద్రాపూర్ జిల్లా పోలీసులను ఆశ్రయించి విషయాన్ని వివరించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జూన్ 7న మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్షల నిమిత్తం పంపించి, హత్య చేసిన బాలుడిపై ఐపీసీ 302 సెక్షన్‌ను అభియోగించారు. ఇది కూడా చదవండి: చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత -
ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!
ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ వ్యక్తి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆరు పదుల వయసు దాటిన ఆయన తాజాగా పట్టుమని 20 ఏళ్లు కూడా లేని మైనర్‌ను మనువాడాడు. 65 ఏళ్ల మేయర్.. 16 ఏళ్ల పాపను పెళ్లాడటమే కాకుండా పిల్లనిచ్చిన అత్తకు ఏకంగా ప్రభుత్వ శాఖలో పదోన్నతి కూడా కల్పించాడు. ఈ వింత పెళ్లి బ్రెజిల్ దేశంలో వెలుగుచూసింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ పెళ్లి వ్యవహారం మేయర్‌ను ఇరకాటంలో పడేసింది. వివరాలు.. దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది! కాగా బ్రెజిల్లో అమ్మాయిల కనీసం వివాహ వయసు 16 ఏళ్లు. అక్కడి చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన యువతులు తల్లిదండ్రుల అనుమతితో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. తాజాగా మేయర్ సదరు అమ్మాయికి ఏప్రిల్ 11న, 16 ఏళ్లు నిండటంతో మరుసటి రోజే అంటే ఏప్రిల్ 12న ఆమెను పెళ్లాడాడు. అంతేగాక అప్పటికే విద్యాశాఖలో తక్కువ జీతంతో పనిచేస్తున్న వధువు తల్లిని సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు. ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్ సీమా ఆరోపించింది. దీంతో మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. కాగా దేహైనీకి ఇది మూడో వివాహం. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కొత్త భార్యకు పదహారేళ్లే కావడంతో ఆమె కాలేజీకి వెళ్తోంది. చదవండి: వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..! -
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు -
అంకుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కిడ్నాప్ చేశా! నివ్వెరపోయిన పోలీసులు
ఒక వ్యక్తి ఇంటి బటయ ఆడుకుంటున్నా చిన్నారిని కిడ్నాప్ చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిన అరెస్టు చేశారు. ఐతే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే...21 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని గౌతమ్‌పురిలో ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కి గురయ్యింది. దీంతో చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు రెండు రోజుల నుంచి చిన్నారి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాధితుడు పొరిగింటి వ్యక్తి కిడ్నాప్ అయిన రోజే అతను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ.. ఆవ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని గట్టిగా విచారించగా.. తన మేనమామకు పిల్లలు లేరని, తన మేనత్తకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పాడు. అందుకని వారికి ఈ బాలుడిని గిఫ్ట్‌గా ఇచ్చేందుకే ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య
ముంబై: ఒక వ్యక్తి టపాసుల కాల్చొద్దని చెప్పినందుకు ముగ్గురు మైనర్ల చేతిలో హతమయ్యాడు. ఈఘటన శివాజి నగర్‌లోని గోవాండిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ముగ్గురు మైనర్లు బహిరంగంగా సీసాలో టపాసులు పెట్టి కాలుస్తున్నారు. దీంతో 21 ఏళ్ల వ్యక్తి వారిని అలా టపాసులు కాల్చొద్దు అని వారించాడు. ఆ తర్వాత ఇరువైపులా మాటా మాటా పెరిగి వాగ్వాదం తలెత్తింది. అంతే కోపంతో ఒక మైనర్ సదరు వ్యక్తిని దారుణంగా కొట్టి చాకుతో మెడపై పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు) -
మైనర్ల వివాహం వైరల్.. విస్తుపోయే విషయాలు
చెన్నై: సోషల్ మీడియా, సినిమాల ప్రభావం.. ముఖ్యంగా పిల్లలపై పెద్దల నిఘా కరువు యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. చెడు వ్యసనాలతో పాటు వయసుకు మించిన పరిణితితో చేయకూడని పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడు కడలూరు జిల్లాలో మైనర్ల వివాహం వైరల్ కావడం సంచలనం సృష్టించింది. చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద జరిగన మైనర్ల వివాహం తీవ్ర చర్చనీయాంశంగా జరిగింది. ఈ వైరల్ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. అమ్మాయి(16)కి పసుపు కొమ్ము కట్టిన మైనర్(17)ను ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. అబ్జర్వేషన్ హోంకు మైనర్‌ను తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, ఇలా చేస్తే అయినా అంగీకరిస్తారని స్నేహితులు వాళ్లను ప్రలోభపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అలా స్నేహితుల ప్రోద్భలంతోనే ఇంటర్ చదువుతున్న ఆమెను.. పాలిటెక్నిక్ చదువుతున్న ఆ అబ్బాయి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు బాలికతో మైనర్ బాలుడికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో.. బాలికకు వైద్యపరీక్షలు చేయించారు పోలీసులు. అంతేకాదు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి.. ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తమిళనాడు సేలం జిల్లాలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల కాలేజీ యువతి.. మైనర్ బాలుడు అయిన తన క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకుంది. ఏప్రిల్‌లో ఈ ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే అప్పుడే వీళ్లిద్దరూ వివాహం చేసుకుని.. అదే కాలేజీకి చెందిన ఓ సీనియర్ ఇంట్లో వీళ్లిద్దరూ కాపురం పెట్టినట్లు తెలుస్తోంది. మైనర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు ట్రేస్ చేసి ఇద్దరినీ కనిపెట్టారు. యువతి గర్భవతిగా తేలడంతో.. వైద్య పరీక్షలకు తరలించారు. మరోవైపు ఆమెపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నిలువునా మోసం -
పెంచిన తండ్రినే కడతేర్చిన కసాయి కూతురు
ఉత్తరప్రదేశ్: ఒక బాలిక తన స్నేహితుడుతో కలిసి పెంచిన తండ్రినే కడతేర్చింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో వైశాలి అపార్టమెంట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ బాలికను పుట్టిన వారం రోజులకే ఘజియాబాద్‌లోని ఒక దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. 14 ఏళ్ల బాలిక తన స్నేహితుడుతో కలిసి 58 ఏళ్ల పెంచిన తండ్రిని చేతులు కాళ్లు కట్టేసి.. ఒక రోప్‌తో చంపేసి పరారయ్యింది. సాయంత్రం బాధితుడు భార్య ఇంటికి వచ్చి చూడగా అతను చనిపోయి ఉన్నాడు. ఐతే బాధితుడు భార్య తాము పెంచుకుంటున్న కూతురుపైన అనుమానంగా ఉందని తెలిపింది. ఆమె గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తితో తరుచుగా మాట్లాడటం, చాటింగ్‌లు వంటివి చేసిందని కూడా ఆమె చెప్పింది. కొన్ని నెలల క్రితం సదరు బాలిక 19 ఏళ్ల యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడు బాధితుడు పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై పోస్కో చట్టం కింద కేసు పెట్లి జైలుకి పంపించి, కూతురుని ఇంటికి తీసుకు వచ్చారు. తండ్రి ఇలాంటి యువకులను వదిలిపెట్టకూడదని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు చెబితే కూతురు మాత్రం ఆ యువకుడికి అనుకూలంగా పోలీస్టేషన్లో స్టేట్మెంట్లు ఇచ్చింది. ఐతే ఆ బాలిక మాత్రం తండ్రి తీరుపై కక్ష పెంచుకుని జైల్లో ఉన్న యువకుడితో టచ్‌లోనే ఉంది. అంతేగాదు తన తండ్రి వేధిస్తున్నాడని తనను తీసుకుపోవాలని చెబుతుండేది. దీంతో ఆ యువకుడు ఆమె మాటలకు జాలిపడి ఆమెతో కలిసి అతన్ని చంపేందుకు కుట్రపన్నాడు. దీంతో సదరు యువకుడు 23 ఏళ్ల మరో యువకుడిని పురమాయించి ఈ హత్యకు పథకం వేశాడు. బాలిక ఆ యువకుడితో కలిసి తండ్రిని రోప్‌తో చంపేసి ఇంట్లోంచి కొన్ని క్రెడిట్ కార్డులు తీసుకుని పరారయ్యింది. ఐతే పోలీసులు సీసీటీపీ పుటేజ్‌లు ఆధారంగా సదరు నిందితులను గుర్తించి ఫోన్ కాల్స్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితులిద్దరు నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. (చదవండి: దారుణం...బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం) -
దారుణం.. బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం
జైపూర్: రాజస్థాన్ అల్వార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 8 మంది యువకులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలి నుంచి రూ.50వేలు వసూలు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 1న ప్రధాన నిందితుడు సోహిల్ తనకు సోదరి వరసయ్యే బాలికకు ఫోన్ చేసి ఓ చోటుకు రమ్మన్నాడు. అక్కడకి రాకపోతే సీక్రెట్‌గా తీసిన ప్రైవేటు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయంతో అక్కడకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెపై సోహిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత నుంచి బాధితురాలిని తరచూ బ్లాక్ చేసి డబ్బు వసూలు చేశాడు సోహిల్. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఓసారి బాలిక డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత! -
స్విగ్గీ డెలివరీ మ్యాన్ విషాదం: తండ్రి అలా, కొడుకు ఇలా..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. ఒక మైనర్ నిర్ల్యక్షం గోలే మార్కెట్‌కు చెందిన రాహుల్ కుమార్‌ని బలి తీసుకుంది. దేశ్ బంధు గుప్తా రోడ్డు వద్ద శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో ఎంజీ హెక్టార్(ఎస్యూవీ) కారును నడపడంతో అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టాడు. ఆ తరువాత కారును అక్కడే వదిలేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ రాహుల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించి నప్పటికీ ఫలితంలేదు. చికిత్స పొందుతూ రాహుల్ మరణించాడు. బైక్‌పై వెనుక కూర్చున్న రాహుల్ స్నేహితుడు పవన్ కుమార్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇంటర్ విద్యార్థి, మైనర్ బాలుడు కారును నడుపుతున్నాడు. కారులో నిందితుడితోపాటు, అతని స్నేహితుడు, మరో విదేశీ పౌరుడు కూడా ఉన్నారు. ఘటనాస్థలంలో వదిలేసి పారిపోయిన కారు ఆధారంగా రవాణా శాఖ సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతేకాదు కోట్లా రూపాయల కుంభకోణంలో కొన్ని నెలల క్రితం అరెస్టయినట్టు పోలీసుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాధితుడి స్నేహితులు, తండ్రి అలా, కొడుకు ఇలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంకిత మైనర్!!.. ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి
జార్ఖండ్ డుమ్కాలో ఓ ప్రేమోన్మాది ఒక స్టూడెంట్ను సజీవ దహనం చేసిన ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలు మేజర్ కాదని.. మైనర్ అని చైల్డ్ వెల్ఫ్‌ఫేర్ కమిటీ నిర్ధారించింది. దీంతో పోక్సో చట్టం ప్రకారం కేసు, నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాలని ఈ ప్యానెల్.. పోలీసులను ఆదేశించింది. రాంచీ: అకింతా సింగ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలి వయసును తొలుత.. 19 ఏళ్లుగా రిపోర్ట్‌లో పొందుపర్చారు పోలీసులు. అయితే మీడియాకు మాత్రం వయసును 17ఏళ్లుగా చెప్పారు. అంకిత వయసుపై పోలీసులు చేస్తున్న వేర్వేరు ప్రకటనలపై ఆమె కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమె వయసును 15ఏళ్లుగా నిర్ధారిస్తూ ప్రకటన చేసింది. అంతేకాదు.. రికార్డెడ్ స్టేట్మెంట్లోనూ ఆమె వయసును సవరించాలంటూ స్థానిక ఎస్పీకి సూచించింది. మతోన్మాది ఘాతుకం! డుమ్కా ప్రాంతానికి చెందిన అంకితా కుమారి సింగ్‌ను.. పొరుగింట్లో ఉండే షారూఖ్ హుస్సేన్(19) ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. పెద్దలు మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆగష్టు 23వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి.. నిప్పటించి పారిపోయాడు. 90 శాతం తీవ్ర గాయాలతో ఫులో జానో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆగస్టు 28వ తేదీన అంకిత కన్నుమూసింది. ఈ ఘటనలో బాధితురాలిని వేధింపులు.. మతం మారాలనే ఒత్తిడి చేసినట్లు తేలడంతో ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలను దారి తీసింది. బీజేపీతో పాటు భజరంగ్ దల్ కార్యకర్తలు బాధితురాలి న్యాయం కోసం పోరాటానికి దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు చేపట్టారు. మరోవైపు బీజేపీ ఒత్తిడితో బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించగా.. ఆమె తండ్రి సంజీవ్ సింగ్ ఆ పరిహారాన్ని తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక కేసులో సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఆ ఫొటోలు మార్ఫింగ్‌వి! ఇదిలా ఉంటే.. నిందితుడు షారూఖ్ హుస్సేన్‌తో సన్నిహితంగా ఉన్న బాధితురాలి ఫొటోలు కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై అంకిత కుటుంబం స్పందించింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, నిందితుడిని బయటపడేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ మండిపడింది. తమ కూతురికి సత్వర న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించింది అంకిత కుటుంబం. ఫొటోలు, వీడియోలు వైరల్ చేయకండి ఇదిలా ఉంటే.. డుమ్కా మైనర్ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(బుధవారం) డుమ్కాలో పర్యటించి.. వివరాలను సేకరించింది. అయితే.. బాధితురాలి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై ఎన్సీడబ్ల్యూ లీగల్ కౌన్సెలర్ షాలిని సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బాధితురాలి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. Dumka, Jharkhand | People are circulating photos of victim on social media. Please ensure this is stopped, vital information is not misused & a woman's dignity is protected: Shalini Singh, Legal Counsellor, NCW pic.twitter.com/mj5jKRqMXo — ANI (@ANI) August 31, 2022 ఇదీ చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను -
చదువుకోవడం ఇష్టం లేక... మర్డర్ ప్లాన్ చేసిన విద్యార్థి!
తల్లిదండ్రులు పిల్లల అభిరుచి ఏంటో తెలుసకోవడమే కాకుండా వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. లేదంటే వారు చెడ్డపనుల వైపు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రతీది అందుబాటులో ఉండటంతో చిన్నారులు పెడదోవ పట్టే అవాకాశాలే పొంచి ఉన్నాయి. ఇక్కడొక విద్యార్థి కూడా అలానే చెడు మార్గంలో పయనించి స్నేహితుడినే హతమార్చి జైలు పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే....పోలీసులు కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక 16 ఏళ్ల మైనర్ 13 ఏళ్ల తన స్నేహితుడి గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఢిల్లీలోని మసూరి నివాసి. ఏడవ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు సదరు బాధితుడుని తన మైనర్ స్నేహితుడే ఇంటికి వచ్చి తీసుకువెళ్లినట్లు బాధితుడి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో పోలీసులు సదరు మైనర్ ఇంటిని విచారించగా....అతను ఆ సమయానికి ఇంట్లో లేడు. పైగా అతని తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలేమి తెలియవు. ఐతే పోలీసులు సదరు మైనర్ని ఒక టీ దుకాణం వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఆ మైనర్ చెప్పిన విషాయలు విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. విచారణలో....సదరు మైనర్కి చదవుకోవడం ఇష్టం లేదని తన తల్లిదండ్రుల పోరు భరించలేక చదువుతున్నట్లు చెప్పాడు. ఈ చదువు నుంచి ఎలాగైన తప్పించుకుని ఏదైన శరణాలయానికి వెళ్లిపోవాలని గత ఐదేళ్లుగా ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని సినిమాలు చూసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పాడు. తన స్నేహితుడిని సరదాగా కారులో వెళ్దామని పిలిచి ఒక గాజు ముక్కతో గొంతు కోసి హతమార్చినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు మరోక స్నేహితుడిని చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులు తనను వెతుక్కుంటూ రాకపోతే తానే లొంగిపోదామని అనుకున్నట్లు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. (చదవండి: సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి) -
శ్రీకాకుళంలో బయటపడ్డ మైనర్ బాలుడి నేరాలు
-
Crime News: భర్త అనారోగ్యంతోనే.. ఆమె పక్కదారి పట్టింది
సాక్షి, హైదరాబాద్/గుడివాడ: వివాహ బంధాలు విలువ లేకుండా పోతున్నాయనే అభిప్రాయం పెరిగిపోవడానికి కారణం.. కొందరి చేష్టలే!. అలాంటి ఘటనే ఇది. భర్త అనారోగ్యం అనే కారణంతో.. ఎదురింట్లో ఉన్న ఓ మైనర్‌పై మనసు పారేసుకుంది నలుగురు పిల్లల తల్లి. అతనితో శారీరకంగా సంబంధం నడిపింది. ఆపై ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతన్ని ట్రాప్ చేసి.. ఊరు విడిచి పారిపోయింది కూడా. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ కేసు సంచలనం రేపింది. ఎదురింట్లో ఉండే మైనర్‌ను తీసుకొని పారిపోయిన వివాహిత స్వప్నను పొక్సో యాక్ట్ కింద ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆపై బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. అలాగే మైనర్‌కు కౌన్సెలింగ్ ఇప్పించిన పోలీసులు.. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంతో కథ సుఖాంతం అయ్యింది. భర్త దూరంగా.. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. భర్త అనారోగ్యం కారణంగానే మైనర్‌తో స్వప్న వివాహేతర సంబంధం నడిపిందని పేర్కొన్నారాయన. గుడివాడ గుడ్‌మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30)కు నలుగురు పిల్లలు. భర్త అనారోగ్యంతో వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో తన ఎదురింటిలో ఉండే మైనర్(15)తో శారీరక సంబంధం పెట్టుకుంది. నెలరోజులు గుట్టుగా అతనితో వ్యవహారం నడిపించింది. ఈ నెల 19న అతనితో పరారయ్యింది. ఈ క్రమంలో మైనర్ తండ్రి గత సోమవారం పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వప్న కూడా కనిపించపోయేసరికి.. అనుమానాలు మొదలయ్యాయి. స్వప్న, సదరు మైనర్ హైదరాబాద్ బాలానగర్‌లో ఓ గదిలో అద్దెకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసి.. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. స్వప్నను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. అశ్లీల వీడియోలతో ట్రాప్ ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్.. ‘ఆంటీ’ అంటూ స్వప్న ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి అశ్లీల వీడియోలు చూపించి.. శారీరకంగా లోబర్చుకుంది ఆమె. ఆపై భర్త, పిల్లలను వదిలేసి.. ఇద్దరం కలిసి బతుకుదామని, తన వెంట వచ్చేయమని మైనర్ని బలవంతం చేసింది. ఈ క్రమంలో భయం భయంగానే ఆమెతో పాటు హైదరాబాద్ వచ్చేశాడు బాలుడు. అయితే గుడివాడ టూటౌన్ పోలీసులు ఈ కేసు ఛేదించిన విషయం.. వారిద్దరినీ గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని బాలానగర్ సీఐ భాస్కర్ చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి: విశాఖ ఆర్కే బీచ్ నుంచి గాయబ్.. భర్తకు సాయిప్రియ సర్ప్రైజ్ -
పసిమొగ్గపై కిరాతకం
బనశంకరి: గత పదేళ్లుగా నిరంతరం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరు తూర్పువిభాగ మహిళా పోలీస్‌స్టేషన్‌లో 8 మందిపై కేసు నమోదుచేశారు. లైంగికదాడి, పోక్సో చట్టాల కింద అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. బాలిక తండ్రి చర్చ్ ఫాదర్‌గా పనిచేస్తుంటాడు. ఆమెకు 6 ఏళ్ల వయసులో స్నేహితుని ఇంట్లో వదలిపెట్టాడు. 10 ఏళ్లు వయసులో స్నేహితుని కుమారుడు బాలికకు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడాలని బలవంతం చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడునాలుగేళ్లు దారుణం కొనసాగించాడు. అతని వేధింపులను తట్టుకోలేక బాలిక పాఠశాల ఉపాధ్యాయునికి మొరపెట్టుకుంది. ఆ ఉపాధ్యాయుడు, అతడి భార్య కలిసి యువకున్ని మందలించారు. అదే సమయంలో నీ గురించి అందరికీ చెబుతానని బెదిరించిన ఆ ఉపాధ్యాయుడు బాధిత బాలిక మీద రెండేళ్ల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తన స్నేహితురాలిపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడని, ఇది తెలిసి మరో 6 మంది తమపై దారుణానికి ఒడిగట్టారని బాలిక ఆరోపించింది. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామాంధ తండ్రికి జైలుశిక్ష బనశంకరి: కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యానికి ఒడిగట్టాడు. ఆ కిరాతక తండ్రికి 20 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ బుధవారం మంగళూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. విట్ల పేరువాయి గ్రామ నివాసి 2020 మార్చిలో మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై విట్ల పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి కేఎం.రాధాకృష్ణ దోషికి 20 ఏళ్ల కఠినశిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. (చదవండి: విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్) -
హైదరాబాద్: మైనర్ల ‘ప్రేమకథ’ విషాదాంతం
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియని వయసు.. ప్రేమ పేరుతో ఆకర్షణ.. ఆ వయసుకి స్వతహాగానే పెద్దల మందలింపు.. వెరసి ఆ బాధలో ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పేట్బషీరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఫాక్స్‌సాగర్‌లో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు.. ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అలాంటి పనులు వద్దంటూ మందలించారు. విద్యార్థినిని ఇంటి వద్దే ఉంచారు. ఈ క్రమంలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చే వంకతో బయటకు వెళ్లిన విద్యార్థిని.. అతన్ని కలుసుకుంది. ఆపై వేరే విద్యార్థి ఇంట్లో బ్యాగు పెట్టేసి.. సైకిల్‌పై వెళ్లిపోయారు. వాళ్లు కనిపించపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్లు చెరువు వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో వెతక్కగా.. ముందుగా విద్యార్థిని మృతదేహాం దొరికింది. ఇక ఇవాళ(శుక్రవారం) ఉదయం విద్యార్థి దేహం దొరకడంతో.. ఈ ప్రేమ వ్యవహారం విషాదాంతం అయినట్లు పోలీసులు నిర్ధారించారు. -
ప్రేమవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య
జీడిమెట్ల: ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మైనర్ బాలిక చెరువులో దూకి అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. దర్గయ్య, లలిత దంపతులు కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో శివ, ఇందిర దంపతుల కుమారుడు (14) 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను ఇంటి వద్దనే ఉంచుతున్నారు. బుధవారం ఉదయం బాలిక అపార్ట్మెంట్లో పని చేస్తున్న తండ్రి దర్గయ్యకు టిఫిన్ బాక్సు ఇచ్చి సుభాష్‌నగర్‌లో బాలుడిని కలిసింది. ఇద్దరు కలిసి వీరితో చదివే వేరే బాలుడి ఇంటికి వెళ్లి అక్కడ బాలుడి స్కూల్ బ్యాగును ఉంచారు. మద్యాహ్నం సైకిల్‌పై ఇద్దరూ వెళ్లారు. రాత్రైనా ఇద్దరు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వేర్వేరుగా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలిక, బాలుడి చెప్పులు, బాలుడి సైకిల్‌ను జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ వద్ద గుర్తించారు. ఇద్దరు చెరువులో దూకి ఉంటారనే అనుమానంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం బాలిక(14) మృతదేహం చెరువు నీటిపై తేలడంతో ఒడ్డుకు తీసి మృతదేహాన్ని పోస్టుమార్డమ్ నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. లభించని బాలుడి ఆచూకీ? బాలుడు బాలికతో పాటు నీటిలో దూకాడన్న అనుమానంతో పోలీసులు చెరువులో వెతకడం మొదలుపెట్టారు. ఎంతసేపైనా బాలుడి అచూకీ లభించకపోవడంతో పాటు బాలుడి తండ్రి సదరు బాలుడికి ఈత వచ్చని తెలిపారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. గురువారం చీకటి పడటంతో బాలుడికోసం గాలింపు చర్యలు సైతం చేపట్టారు. (చదవండి: కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి) -
Hyderabad: పబ్‌లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం!
సాక్షి, హైదరాబాద్: వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. హైదరాబాద్‌లో పబ్‌ల తీరు మారడం లేదు. తాజాగా.. జూహ్లీహిల్స్ అమ్నీషియా పబ్ తరహాలో ఓ పబ్‌లో మైనర్ల పార్టీ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో రెండ్రోజుల పాటు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సైబర్ హవర్స్ వాల్యూమ్-11 పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. అయితే ఒక బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఎరేంజ్ చేసినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ల పార్టీకి కొందరు ఆహ్వానాలు పంపించారు. ఇక నిర్వాహకులేమో పబ్‌లో మద్యం సరఫరా చేయలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో రూ.11 లక్షలు కాజేశాడు
యలమంచిలి రూరల్ : పెళ్లి పేరిట మైనర్ యువతిని మోసం చేసిన యువకుడిపై యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మోసపోయిందని తండ్రి యలమంచిలి రూరల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సన్నిబాబు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ యవతిని (16)ను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన బొద్దపు నానాజీ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నుంచి దశలవారీగా రూ.11 లక్షల కాజేసాడు. ఇంటిలో పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కూతురిని ప్రశ్నించగా విషయం బయట పడింది. దీంతో తండ్రి రూరల్ పోలీసులను ఆశ్రయించి యలమంచిలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నానాజీతో కలిసి అతని పిన్నమ్మ కరణం వెంకట లక్ష్మి, తల్లి బొద్దపు పాప, చెల్లి లల్లీలు కూడా తమ కుమార్తెను ఏమార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్ యలమంచిలి రూరల్ స్టేషన్‌కు వచ్చి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన సూచన మేరకు పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. మొదట రూ.2 లక్షల వరకు ఫోన్ పే ద్వారా.. తర్వాత రూ.6 లక్షలు నేరుగా నగదు రూపంలో ఇచ్చినట్లు, మిగిలిన డబ్బు దశలవారీగా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. నలుగురిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: నమ్మించి.. రియల్టర్ కిడ్నాప్) -
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఓ ఎంఐఎం కార్పొరేటర్ని పోలీసులు విచారించనున్నారు. సదరు కార్పొరేటర్ని విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ మాజీ మేయర్‌గా ఆ కార్పొరేటర్ సేవలందించారు. ఈ కేసులో నిందితులకు సహకారం చేశాడని కార్పొరేటర్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. కారులో మొయినాబాద్ వరుకు కార్పొరేటర్ వెళ్లినట్టు, నిందితులకు సహకరించినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. చదవండి: ఉత్తర ప్రదేశ్‌లో అమానుషం.. కస్టడీలో ఉన్న వ్యక్తికి కరెంట్ షాక్, లాఠీ దెబ్బలు -
పోక్సో చట్టం కింద పూజారికి పదేళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికను మోసగించి మాయమాటలతో వివాహం చేసుకుని లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని పొక్సో నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. జైలుశిక్షతోపాటు రూ.20వేల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పుల్లకందం సతీష్‌కుమార్ విజయనగరం జిల్లా జియ్యమ్మవలసకు చెందినవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో పూజారి. బాధిత బాలిక విశాఖలోని గాజువాక నియోజకవర్గ పరిధి పెదగంట్యాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివేది. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్ 30న బాలిక తమ బంధువుల ఇంట్లో వివాహానికి విజయనగరం వెళ్లింది. పెళ్లిలో సతీష్‌కుమార్ బాలికను చూశాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. బాలిక విజయనగరంలోని సతీష్ ఇంటికి వెళ్లగా ఇద్దరూ గుడిలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం అన్నవరంలో కొన్ని రోజులు గడిపారు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తగిన సమాచారంతో సతీష్‌ని, బాధితురాలిని పట్టుకున్నారు. అనంతరం వివాహానికి సహకరించిన సతీష్ తల్లి పుల్లకందం గిరిజ, సోదరుడు పుల్లకందం సంతోష్‌కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో లైంగికదాడికి సహకరించిన వారిద్దరికీ ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమానా విధించారు. సతీష్, అతని సోదరుడు, తల్లిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. (చదవండి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం) -
మైనర్ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...
పాట్నా: రాను రాను మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటున్నాం. చదువుకున్నవాళ్లు సైతం కామంధులై అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. అచ్చం అలానే బీహార్‌లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బీహార్‌లోని జాముయ్‌లో ఒక మైనర్ కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్ సెంటర్ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మైనర్ తల్లిదండ్రులు కోచింగ్ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతోనే కోచింగ్ సెంటర్ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్లో పోలీసులు..) -
మైనర్‌పై 59 ఏళ వ్యక్తి అఘాయిత్యం
శివాజీనగర: సీఎం సొంతూరిలో దారుణం జరిగింది. 59 ఏళ్ల వ్యక్తి 11 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హావేరి శిగ్గాంవి తాలూకా బంకాపుర వద్ద జరిగింది. నిందితుడు నాగప్ప బాడదను బంకాపుర పోలీసులు మంగళవారం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికల మృతి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మీర్జాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇందు (14), సుజాత (13) సోమవారం సాయంత్రం రాజోలుబండ కాలువలో ఈతకు దిగి నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోవడంతోనే నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం గ్రామీణ ఎమ్మెల్యే బసవనగౌడ మృతుల కుటుంబాలను పరామర్శించి రూ. 20 వేలు పరిహారం అందించారు. (చదవండి: కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి) -
బాలికపై సాముహిక అత్యాచారం... ఆపై వీడియో తీసి...
సాక్షి, బెంగళూరు: మహిళలు, బాలికల భద్రతకై ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటకీ ఈ అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. మైనర్లు, చిన్నపిల్లలు అని చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బెదిరించడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బెంగళూరులో 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి తన స్నేహితులకు షేర్చేశాడు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని బెదిరిస్తూ తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఆ బాలిక పై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని యలహంకలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు ఆ నిందితుడి ఆగడాలు భరించలేక ఏడుస్తూ ఇంటికి రావడంతో.. తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పమని ఆమెను బలవంతం చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరొక నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: పరీక్షలు రాయాలి.. బెయిల్ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య) -
స్కూల్‌కి వెళ్తున్న మైనర్‌ను ఫాలో చేసి.. టాయిలెట్స్‌లోకి లాకెళ్లి..
సాక్షి, ముంబై: దేశంలో మైనర్లు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వారిని వేధింపులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. లైంగిక దాడులు, వేధింపులను ఆపేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లోని టాయిలెట్స్‌లోకి లాక్కెళ్లి మైనర్(11)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శివాజీనగర్ ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో మైనర్(11) చదువుకుంటోంది. ప్రతీ రోజు స్కూల్‌కు వెళ్లినట్టుగానే పాఠశాలకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆమెను ఫాలో చేశాడు. స్కూల్ దగ్గరకి చేరుకోగానే ఆమెతో గొడవకు దిగి.. బలవంతంగా మైనర్‌ను టాయిలెట్స్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఈ క్రమంలో బాలిక తల్లి వెంటనే శివాజీనగర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. -
పోలీసు ఓవరాక్షన్.. విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి..
వాషింగ్టన్: సెక్యూరిటీగా పని చేసే ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె మెడపై మెకాలును నొక్కి పెట్టి మైనర్‌ను హింసించాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విస్కాన్సిన్లోని కెనోషా పాఠశాలలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో విద్యార్థిని(12) మరో బాలుడితో గొడవ పడుతోంది. అది చూసిన ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి షాన్ గుట్షో అక్కడికి వెళ్లాడు. గొడవలో ఆమె ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆమె సదరు పోలీసులను వెనక్కి నెట్టి వేసింది. తిరిగి లేచిన అతడు విద్యార్థిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఆవేశంతో ఊగిపోతుండగా.. విద్యార్థిని నియంత్రించే క్రమంలో షాన్ గుట్షో దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని స్కూల్ యాజమాన్యం విడుదల చేసింది. విద్యార్థిని కింద పడేసి ఆమె కదలకుండా చేతులు కట్టేసి, ఆమె మెడపై మోకాలితో నొక్కి పెట్టి నియంత్రించాడు. దాదాపు అర నిమిషంపాటు ఇలా మోకాలు ఉంచటంతో విద్యార్థిని గాయపడింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి గుట్షోపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాలిక తండ్రి స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడి కారణంగా తన కూతురికి గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటన తర్వాత అతడు తన సెక్యూరిటీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. -
మైనర్‌పై ఐదేళ్లుగా కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు.. తండ్రితో సహా..
సాక్షి, ముంబై: దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వావివరుసలు మరచి చిన్నారులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కన్న కూతురిపైనే తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు(11) కుటుంబం బీహార్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. సదరు మైనర్ తాను చదువుతున్న పాఠశాలలో జరిగిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమంలో తన గోడును వెల్లడించింది. తాను ఐదేళ్లుగా కన్న తండ్రి, ఇంటి సభ్యులతో లైంగికంగా వేధించబడుతున్నట్టు తెలిపింది. 2017 నుంచి తండ్రి లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా.. తండ్రి, సోదరుడు వేరు వేరు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 2020లో ఆమె సోదరుడు బాధితురాలిపై లైంగిక దాడి చేయగా.. తాత, మామ కూడా మైనర్‌ను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది సామూహిక లైంగిక దాడి కాదని, మైనర్‌పై లైంగిక దాడులన్నీ వేర్వేరు సందర్బాల్లో జరిగాయని ఎస్సై అశ్విని సాత్పుతె పేర్కొన్నారు. ఈ క్రమంలో మైనర్ కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన మైనర్ కూతురు
-
ఆకతాయిల వేధింపులు.. సిగరెట్ తాగమని చెట్టుకు కట్టేసి..
బెంగళూరు(కర్ణాటక): చిన్న పిల్లలపై కొందరు అల్లరి మూకలు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్ తాగాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా.. పాఠశాల ఆవరణలోనే చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆధ్వర్యంలో నడుపుతున్న పాఠశాలలో 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది విద్యార్థులను క్యాంపస్‌లో ప్రవేశించిన ఆరుగురు సభ్యుల ముఠా తరచుగా బెదిరింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో గత శనివారం కూడా.. చిన్న పిల్లలను పట్టుకుని సిగరెట్ తాగాలని వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా పాఠశాల సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి సిగరెట్లు తేవాలని చిన్న పిల్లలను బెదిరించారు. కాగా, నిందితులు... సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. పాఠశాలకు సమీపంలోని గ్రామానికి చెందిన వారు కావడంతో యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు పలుమార్లు ఉపాధ్యాయులను కూడా బెదిరించారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ క్రమంలో కొంత మంది స్థానికులు.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్న క్లిప్పింగ్‌లను స్థానిక కార్పోరేటర్‌కు పంపించారు. కార్పోరేటర్.. పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న పిల్లల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. కాగా, దీనిపై స్పందించిన డీసీపీ దేవరాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్ గస్తీని పెంచుతామన్నారు. చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి..
గువాహటి: అశ్లీల వీడియోలు చూసేందుకు అలవాటుపడ్డ ముగ్గురు చిన్నారులు తమతో కలిసి వాటిని చూసేందుకు నిరాకరించిందని ఆరేళ్ల బాలికను అమానుషంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన ఆ ప్రాంతంలో ఎన్నో కుటుంబాలకు ఓ హెచ్చరికలా మారింది. నిందితుల్లో ఇద్దరి వయసు 11 ఏళ్లు ఉండగా, మరొకరి వయసు 8 ఏళ్లే. జిల్లాలోని కలియాబోర్ ప్రాంతంలోని ఓ క్వారీ వద్ద టాయిలెట్లో బాలిక మృతదేహం బయటపడటంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు బాధితురాలి ఇంటి సమీపంలో నివసించేవారు. వారు గత కొంత కాలం మొబైల్లో అశ్లీల వీడియోలు చూస్తూ వాటికి బానిసగా మారారు. మంగళవారం కూడా అశ్లీల వీడియోలను చూస్తూ బాధితురాలిని ఏదో పని ఉందని చెప్పి క్వారీ వద్దకు రప్పించారు. అక్కడ వారు ఆ క్లిప్‌లను తనని చూడాలని బలవంతం చేశారు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో కోపంతో ఆ ముగ్గురు ఆమెను రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపారు. బాలిక మృతదేహం బయటపడటంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినందుకు నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశారు. ఆ ముగ్గురు యువకులు బాధితురాలిపై లైంగిక వేధింపులకు ప్రయత్నించారన్న అనుమానం, దీనిపై ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ముగ్గురు బాలల్లో ఒకరు ఆన్లైన్ తరగతుల కోసం అతని తండ్రి నుంచి స్మార్ట్ఫోను తీసుకుని మిగతా ఇద్దరితో కలిసి అందులో నీలిచిత్రాలు చూడటం మొదలెట్టి వాటికి బానిసగా మారారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. చదవండి: బాలికతో క్రికెట్ కోచ్ అసభ్యకర ప్రవర్తన..భుజాలు, ఇతర భాగాలను తాకుతూ.. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
నాగ్‌పూర్: ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న మహిళలపై సామూహిక అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారతదేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు నాగపూర్‌లోని మాదవ్ నగరి ప్రాంతానిక చెందిన ఒక మైనర్ బాలిక్ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రాత్రి 8 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు. (చదవండి: "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది") ఈ క్రమంలో ఆ యువకులు ఆ బాలుడుని కొట్టి ఆ అమ్మాయిని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు ఒక నిందుతుడిని అరెస్ట్ చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే థానేలోని డోంబివ్లి, సకినాకాలో జరిగిన వరుస అత్యాచార ఘటనలన మరువక మునుపే మరి కొద్ది రోజులకే మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకోవటం అత్యంత బాధాకరం. (చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!) -
మైనర్‌పై అత్యాచారం: 9 రోజుల్లో తీర్పు.. 20 ఏళ్ల శిక్ష
జైపూర్: మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి రాజస్తాన్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 9 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధించింది. 9 ఏళ్ల బాలికపై కమలేశ్ మీనా (25) సెప్టెంబర్ 26న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన పోలీసులు ఘటన తర్వాతి ఉదయమే నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం కేవలం 18 గంటల్లోనే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖ లు చేశారు. చలాన్ నమోదైన అయిదు పని దినాల్లో జైపూర్ మెట్రోపాలిటన్ సిటీ పోక్సో 3వ నంబర్ కోర్ట్ తీర్పు ప్రకటించింది. దోషిగా తేలిన కమలేశ్‌కు రూ. 2 లక్షల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధిం చింది. జరిగిన ఘటన తీవ్రమైనది కావడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు జైపూర్ డిప్యూటీ కమిషనర్ హరేంద్ర కుమార్ చెప్పారు. -
టిక్‌టాక్ స్టార్ల మధ్య రచ్చ.. లైంగికంగా వేధించి.. ఆపై
ముంబై: ఇద్దరు మైనర్ టిక్‌టాక్ స్టార్ల మధ్య గొడవ లైంగిక వేధింపులకు దారితీసింది. నాతో కలిసి ఉండకపోతే.. నీ వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ సదరు టిక్‌టాక్ స్టార్.. మైనర్ బాలికను వేధించాడు. ప్రస్తుతం ఈ ఘటన మహరాష్ట్రాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు..ముంబైలోని 16 ఏళ్ల యువకుడు టిక్ టాక్ వీడియోలను చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి 17 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరు కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తుండేవారు. కాగా, 2020 లో టిక్‌టాక్ బాన్కాక ముందు నుంచే వీరిద్దరు కలసి పనిచేసేవారు. వీరిద్దరికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో, వీరిద్దరు కలిసి అనేక వీడియోలను చేశారు. కొంత కాలం వీరి స్నేహం బాగానే సాగింది. ఆ తర్వాత.. వీరిమధ్య కొన్ని మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో గతవారం.. 17 ఏళ్ల యువతి, తాను సొంతంగా వేరే బిజినెస్ చేయాలనుకుంటున్నట్లు యువకుడికి తెలియజేసింది. దీంతో, ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తనతోనే కలిసి ఉండాలని కోరాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అతను, యువతిని ప్రతిరోజు మానసికంగా హింసించేవాడు. ఆమె వ్యక్తిగత వీడియోలు తన దగ్గర ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతొ ఆమె.. అతని వేధింపులకు విసిగి పోయింది. ఒకరోజు రాత్రి యువకుడు.. యువతి ఇంటికి తన మిత్రులతో కలిసి వెళ్లి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమెను విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ అనుకోని సంఘటనతో భయపడిపోయిన ఆ యువతి తన తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో వారు, ముంబైలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ యువకుడు, అతని మిత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
‘అత్యాచారం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసి, బిడ్డకు జన్మనివ్వడానికి కారణమైన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2016 లో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిని కేసులో దోషిగా తేలి, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న క్యాథిలిక్ చర్చి ఫాదర్ రాబిన్ వడక్కుం చెర్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ బాధితురాలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఇది తన సొంత నిర్ణయమని, కేరళలోని కొట్టియూర్‌కు చెందిన బాధితురాలు పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ అప్పీల్‌నుసుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటూ కేరళ హైకోర్టులో రాబిన్ దాఖలు పిటిషన్‌ను తిరస్కరించిన అయిదు నెలల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. 2016 లో రాబిన్ మైనర్ బాలిక (16)ను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరిలో రాబిన్ వడక్కుం చెర్రిన కొచ్చిలో అరెస్టు చేశారు. తనకు సంబంధం లేదని, తాను అమాయకుడిననీ రాబిన్ మొదట్లో బుకాయించాడు. కానీ డీఎన్ఏ టెస్టులో నిజాలు నిగ్గు తేలడంతో రెండేళ్ల తర్వాత అతడిని దోషిగా నిర్ధారించింది. 2019లో రాబిన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న రాబిన్ తన వల్ల బాధితురాలికి జన్మించిన చిన్నారి సంరక్షణ బాధ్యతలను జైలు శిక్ష కారణంగా చూసుకోలేకపోతున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ హైకోర్టుకు లేఖ రాశాడు. ఇందుకు తనకు రెండు నెలలు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. అయితే రాబిన్ ప్రతిపాదనను కేరళ హైకోర్టు తిరస్కరించింది. శిక్షనుంచి తప్పించుకునేందుకు అతను ఈ ఎత్తుగడ వేశాడని వ్యాఖ్యానించింది. అంతేకాదు దీనికి అంగీకరిస్తే ఇకపై ప్రతి అత్యాచార దోషి, శిక్షలు తప్పించుకునేందుకు బాధితురాలిని పెళ్లి చేసుకుంటాననే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంప్రదాయన్ని తాము ప్రోత్సహించమని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
పదిలో రెండుసార్లు ఫెయిల్.. హ్యాకింగ్ పాఠాలు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిన్గ్రులి జిల్లాలో ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసి, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుడటంతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ నిందితుడు మధ్యప్రదేశ్‌లోని మోర్వా పట్టణానికి చెందినవాడు. అతడి పుట్టిన రోజున తల్లిదండ్రులు ఓ ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. నిందితుడు పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. హ్యాకింగ్‌లో శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ, రోజుకు 15 గంటలపాటు యూట్యూబ్ వీడియోలు చూస్తూ హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు. కెనడియన్ ఫోన్ నెంబర్‌తో ఓ వాట్సాప్ సృష్టించాడు. అతను ఒక ప్రవాస భారతీయ అమ్మాయిగా నటిస్తూ.. చుట్టుపక్కల వాళ్లతో, పరిచయం ఉన్న వారితో చాట్ చేసేవాడు. అదే సమయంలో వారి కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, చిత్రాలు, వీడియోలతో సహా డేటాను తస్కరించి, అందులో ఏవైనా అశ్లీల వీడియోలు ఉంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కాగా ఈ విషయంపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే తాజాగా ఓ పొరుగు వ్యక్తి నిందితుడిపై ఫిద్యాదు చేశాడు. దీంతో అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడని’’ మోర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ త్రిపాఠి తెలిపారు. -
మైనర్ల పేరుతో పీఓఎమ్ఐఎస్ ఖాతా తెరవొచ్చు
జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఏడాదికి 6.6 శాతం వడ్డీ రేటును పొందనున్నారు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం(పీఓఎమ్ఐఎస్) అనేది పొదుపు పథకం. దీనిలో మీరు పెట్టుబడి పెట్టిన నిర్ధిష్ట మొత్తంపై ప్రతి నెలా స్థిర వడ్డీని పొందవచ్చు. మీ దగ్గరలోని పోస్టాఫీసులో పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతా తెరవవచ్చు. అలాగే, ముగ్గురు వయోజనులు ఉమ్మడిగా కూడా ఖాతాను తెరవవచ్చు. మీరు కనుక మీ పిల్లల పేరు మీద కొత్త మొత్తం పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మీ మైనర్ల పేరిట పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. డిపాజిట్లు ఈ ఖాతాతెరవడానికి అవసరమైన కనీస మొత్తం ₹1,000, గరిష్టంగా ₹4.5 లక్షలను మాత్రమే సింగిల్ హోల్డర్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో పరిమితి ₹9 లక్షలు మించి పెట్టుబడి పెట్టలేరు. ఉమ్మడి ఖాతా హోల్డర్లు సమాన వాటాను ప్రతి నెల పొందుతారు. వడ్డీ రేట్లు ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తరువాత వడ్డీ చెల్లించడం మొదలు అవుతుంది. ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీని క్లెయిం చేసుకోనట్లయితే, అటువంటి వడ్డీ ఎలాంటి అదనపు వడ్డీనిపొందలేరు. అంతేగాక, ఫిక్సిడ్ లిమిట్లకు మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే రీఫండ్ చేయబడుతుంది. డిపాజిట్ చేయబడ్డ అదనపు మొత్తంపై పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కు వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది. మీరు ఆటో క్రెడిట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతినెల వడ్డీని మీ సేవింగ్స్ ఖాతాలోకి పొందవచ్చు. అయితే ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే ఈ వడ్డీ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ వర్తించదు. మెచ్యూరిటీ: మీరు పోస్టాఫీసులో ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత ఖాతాను క్లోజ్ చేయవచ్చు. అయితే, ఒకవేళ మీరు పీఓఎమ్ఐఎస్ అకౌంట్ మెచ్యూరిటీకి ముందే మరణించినట్లయితే, దానిని క్లోజ్ చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్ నామినీ లేదా లీగల్ వారసులకు రీఫండ్ చేయబడతాయి. అలాంటప్పుడు, వడ్డీని మునుపటి నెల వరకు మాత్రమే చెల్లిస్తారు. ఖాతా తెరచేటప్పుడు, మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరునైనా నామిని కింద నమోదు చేయాలి, తద్వారా ఒకవేళ మీరు ఖాతా కాలవ్యవధిలో మరణించినట్లయితే, వారు ఈ ప్రయోజనాలను క్లెయిం చేసుకోవచ్చు. డిపాజిట్ తేదీ నుంచి గడువు ముగియడానికి ఒక సంవత్సరం ముందు ఎలాంటి డిపాజిట్ విత్ డ్రా చేయరాదని మీరు గుర్తుంచుకోవాలి. అయితే, ఒక సంవత్సరం తర్వాత, మూడు సంవత్సరాలకు ముందు ముందస్తుగా ఖాతా క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 2 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీకు చెలిస్తారు. ఒకవేళ ఖాతా మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 1 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమ చేస్తారు. చదవండి: చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా? -
మైనర్‌తో బూట్లు నాకించి.. సిగరెట్ తాగించి..
భోపాల్ : రెండు వేల రూపాయల విషయంలో చోటుచేసుకున్న గొడవలో ఓ మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు వ్యక్తులు అతడ్ని విచక్షణా రహితంగా కొట్టి.. అమానుషంగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం జబల్పూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల మైనర్‌కు అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో 2 వేల రూపాయల విషయంలో గొడవైంది. ఈ నేపథ్యంలో వారు మైనర్‌ను నయాగావ్ ఏరియాలోని పొలంలోకి తీసుకెళ్లారు. అనంతరం విచక్షణా రహితంగా కొట్టారు. బూట్లు నాకించారు. బలవంతంగా సిగరెట్ కూడా తాగించారు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో మైనర్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రోజున మైనర్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి : మీ ఇంట్లో భూతం ఉంది.. ఎద్దుతో తరిమేస్తాం! ఇష్టం లేని పెళ్లి.. కాబోయే భర్తను చంపమని.. -
నీ న్యూడ్ ఫొటోలు పంపు.. లేకపోతే..
బెంగళూరు : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని అగ్రహార దసరహల్లి ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు గత జనవరి నెలలో ఇన్స్టాగ్రామ్ ద్వారా కార్తిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు ఇద్దరి మధ్య చాటింగ్‌లు నడిచాయి. ఆ తర్వాతి నుంచి బాలికను న్యూడ్ ఫొటోలు పంపాలంటూ అతడు వేధించసాగాడు.( పోర్న్ రాకెట్: వాళ్లే ఈ నటి టార్గెట్!) ఆమె స్పందించకపోయే ‘నీ న్యూడ్ ఫొటోలు పంపు! లేకపోతే చెయ్యి కోసుకుంటా’ అని బెదిరించసాగాడు. దీంతో భయపడిపోయిన బాలిక అతడికి తన న్యూడ్ ఫొటోలు కొన్ని పంపింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కార్తిక్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( నేవీ అధికారి సజీవదహనం: ఆ 6 రోజులు ఏం జరిగింది? ) -
వారి మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు
చండీగఢ్: హిందూ వివాహ చట్టం ప్రకారం తోబుట్టుల మధ్య వివాహం చట్ట విరుద్దమని పంజాబ్ హర్యానా హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లో అమ్మాయి మేజర్ అని తెలిపినప్పటికీ ఇది న్యాయ సమ్మతం కాదని కేసును విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పిటిషనర్ తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 366 ఏ(మైనర్ అమ్మాయిని అనుమతి లేకుండా తీసుకెళ్లడం) వంటి సెక్షన్లు ఖన్నాసిటిలోని రెండవ ఠాణాలో నమోదయ్యాయని, వాటిపై ముందస్తు బెయిల్ మంజూర్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జీవిత రక్షణ,స్వేచ్ఛ కోసం పిటిషనర్‌తో కలిసి బాలిక క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు అతని తరుపు న్యాయవాది అరవింద్ సింగ్ సాంగ్వాన్ కోర్టుకు నివేదించాడు. ఈ ముందస్తు బెయిల్‌ను ప్రభుత్వ తరుపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. పిటిషన్ పరీశీలించిన న్యాయమూర్తి వారిద్దరూ కలిసి ఉంటున్నారని అంటున్నారు, కానీ నివేదికనూ చూస్తే తనకు కేవలం 17 సంవత్సరాల మాత్రమే ఉన్నాయని అన్నారు. బాలిక పుట్టిన తేదీ 2003 ఆగస్ట్ అని,సెప్టెంబర్ 3,2020 నాటికీ 17 సంవత్సరాల 14 రోజులని న్యాయమూర్తి అన్నారు. కేవలం మగ సోదరులని మాత్రమే వాళ్ల తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని, మైనర్ని వేధిస్తున్నారని బాలిక ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ దీనికి జతపర్చాడు. అందుకోసం తనతో కలిసి జీవించాలని బాలిక నిర్ణయించుకుందని వాదించాడు. తన సొంత తల్లిదండ్రుల నుంచి ప్రాణానికి హాని ఉందన్నారు. తనను వేధించకుండా చూడాలని వేసిన పిటిషన్‌ని, కోర్టు సెప్టెంబర్ 7 న కొట్టివేసింది. ప్రభుత్వం ఇద్దరికి రక్షణ కల్పించాలని ఆదేశిందని న్యాయమూర్తి అన్నారు. ఏది ఏమైన చట్ట ఉల్లంఘన కోసం చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి ఈ ఉత్తర్వూ ఇవ్వరాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్లో తాను బాలికకూ సోదరుడినవుతాననే విషయాన్ని వెల్లడించలేదని ,అందువల్ల 18 సంవత్సరాలు నిండిన తరువాత కూడా వారు చేసుకున్న పెళ్లి చట్ట సమ్మతం కాదని అంది." పిటిషనర్ హిందూ వివాహ చట్టం క్రింద నిషేధించబడిన 'సపిందా'లో (ఇద్దరు వ్యక్తుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉంటే వారి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది) వస్తారని, ఒకరితో ఒకరు వివాహం చేసుకోలేరని అని ప్రభుత్వ న్యాయవాది" వాదనలతో కోర్టు ఏకీభవించింది., ఇది అనైతికం, సమాజంలో ఆమోద యోగ్యం కాదని పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
పబ్జీ: ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో..
జైపూర్: రాజస్తాన్‌లో పబ్జీ ఆట ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్జీ ఆడడానికి తన స్నేహితుడు ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో ఒక బాలుడు అతనిని కొట్టి చంపాడు. రాజ్‌సమంద్ జిల్లా జైత్పురకి చెందిన 14 ఏళ్ల బాలుడు, అతని స్నేహితుడు హమీద్(17)కి పబ్జీ గేమ్ అంటే పిచ్చి. హమీద్ ఫోన్లో ఆ గేమ్ ఉండడంతో ఇద్దరూ తరచూ ఆడేవారు. ఈ నెల 9న హమీద్ పొలానికి వెళ్లి, తిరిగి రాలేదు. పబ్జీ ఆడడానికి ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో బాలుడైన అతడి స్నేహితుడే బండరాయితో మోదడంతో హమీద్ ప్రాణం కోల్పోయాడని పోలీసు విచారణలో తేలింది. చదవండి: పబ్జీలో లీనం.. ప్రాణాలు తీసింది! -
నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయకుంటే చస్తా!
ఇండోర్ : ఇష్టమైన వాడితో పెళ్లి జరిపించకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఓ మైనర్ హోర్డింగ్పైకి ఎక్కి కూర్చుంది. ప్రియుడు వచ్చి బ్రతిమాలితే గానీ కిందకు దిగలేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని పర్దేశీ పురాకు చెందిన ఓ మైనర్ ఓ యువకుడిని ఇష్టపడింది. అతడ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే ఇందుకు ఆమె తల్లి ససేమీరా అంది. దీంతో ఆగ్రహించిన మైనర్ అక్కడికి దగ్గరలోని హోర్డింగ్పైకి ఎక్కింది. ( వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం ) నచ్చిన వాడితో పెళ్లి చేయకుంటే పైనుంచి కిందకు దూకి చస్తా! అంటూ బెదిరింపులకు దిగింది. తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ మూగిన జనం.. ఆఖరికి పోలీసులు కూడా బ్రతిమాలినా పట్టు వీడలేదు. మొబైల్ ఫోన్‌ను చూసుకుంటూ పైనే కూర్చుండిపోయింది. చివరకు మైనర్ ఇష్టపడుతున్న యువకుడు రంగంలోకి దిగక తప్పలేదు. అతడు అక్కడికి వచ్చి మైనర్‌కు నచ్చ చెప్పాడు. అతడి మాట విని బాలిక కిందకు దిగింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇల్లు చూసుకోమంటే.. చంపేశారు!
సాక్షి, ముంబై: జల్గావ్ జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు పిల్లల దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్గావ్ జిల్లా రావేర్ పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న భోర్‌ఖేడా గ్రామ సమీపంలోని ఓ పొలంలో పనులు చేసుకుంటూ మహతాబ్, రుమాలీబాయి బిలాల్ అనే దంపతుల తమ ఐదుగురి పిల్లలతో అక్కడే చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బిలాల్ దంపతుల బంధువులు దశదిన కర్మలో పాల్గొనేందుకు స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌కు పెద్ద కుమారుడితో పాటు వెళ్లారు. మిగతా పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. మూడేళ్ల వయసున్న చిన్న కుమార్తె, మరో 11 ఏళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, 13 ఏళ్ల వయసున్న ఇంకో కుమార్తెను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో తమ తమ్ముళ్లు, చెల్లెళ్లు ఒక్కరే ఉంటారని, గ్రామానికి ఇల్లు దూరంగా ఉండటంతో వారిని చూసుకోవాలని బిలాల్ పెద్ద కుమారుడు అతని మిత్రులకు చెప్పాడు. ఇదే అదనుగా చూసుకున్న నిందితులు 13 ఏళ్ల వయసున్న బాలికపై కన్నేశారు. మద్యం తాగి వచ్చి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. (చదవండి: మిథున్ చక్రవర్తి కుమారుడిపై అత్యాచారం కేసు) విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బాలికతో పాటు మిగతా వారిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి మృతదేహాలను పక్కనే ఉన్న పొలంలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితులు ముఖేశ్ సన్యాల్, రాజు అలియాస్ గుడ్డు, సునీల్ సీతారాంలతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, అంతవరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో గొడ్డలి, రక్తంతో తడిసిన నిందితుల దుస్తులు, రెండు నాటుసారా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలికపై సాముహిక అత్యచారం? ఈ ఘటనలో నిందితులు మైనర్ బాలికపై సామూహిక అత్యచారం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టంలో మైనర్ బాలికపై అత్యచారం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే పూర్తి రిపోర్టు వస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. రూ.రెండు లక్షల సాయం... - గులాబ్రావ్ పాటిల్, జిల్లా ఇన్చార్జి మంత్రి బాధిత కుటుంబ సభ్యులతో జల్గావ్ ఇంచార్జ్ గులాబ్ రావ్ పాటిల్ భేటీ అయ్యారు. బిలాల్ కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. అదవిధంగా ఈ కేసు దర్యాప్తు సరైన దిశలో కొనసాగుతుందని తెలిపారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
విద్యార్థుల స్మార్ట్ఫోన్లకు అశ్లీల సందేశాలు
కర్ణాటక, బనశంకరి: మొబైల్ ఫోన్ వినియోగించే మైనర్ బాలురకు అశ్లీల ఫోటోలు, వీడియోల లింక్ పంపించి వ్యసనపరులుగా చేయడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బు దండుకునే ముఠా సిలికాన్ సిటీ ఉన్నట్లు అనుమానం వ్యక్తమౌతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో బెంగళూరు పేరుపొందిన 70 కుపైగా పాఠశాలలకు చెందిన విద్యార్థుల నెంబర్లను గ్రూప్‌లో చేర్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ గ్రూప్‌లో అశ్లీల సంభాషణలు, అశ్లీల వీడియోలు , పోటోలు కలిగిన ఆన్లైన్ లింక్ అప్లోడ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బెంగళూరు పశ్చిమ విభాగ సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఫ్రెండ్ యువర్ లవ్ 2083 పేరుతో గల వాట్సాప్ గ్రూప్‌లో పాఠశాల విద్యార్థుల ఆన్లైన్ బోధనకు వినియోగించే ఫోన్ నంబర్లు యాడ్ చేసి ఉన్నాయి. మహిళ ఫిర్యాదుతో కదలిక లాక్డౌన్ అనంతరం పాఠశాలలకు దూరంగా ఉంటున్న విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్లో బోధనను ప్రారంభించాయి. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు విద్యార్థుల నంబర్లను సంపాదించి గాలం వేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన మైనర్ పిల్లల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల దశ్యాలు కలిగిన లింక్ ఉన్నట్లు చంద్రాలేఔట్‌కు చెందిన మహిళకు తెలిసింది. ఆమె గ్రూప్‌లోని బాలల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చింది. కానీ వీరందరూ పోలీసులకు పిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో సదరు మహిళే పశ్చిమ విభాగ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా 2018లో రాష్ట్రంలో 113 మంది బైనర్ విద్యార్థులు అశ్లీల చిత్రాల వీడియోలు వీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మహిళా మక్కళ సంక్షేమశాఖ నివేదిక అందించింది. హైకోర్టు సూచన మేరకు 7 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి విచారణ చేపట్టింది. దుండగుల కుట్ర ఇదేనా విద్యార్థులను అశ్లీల ఫోటోలను వీక్షించే అలవాటుకు బానిసలు చేయడం అనంతరం దశలవారీగా మానసికంగా తమ ఆధీనంలోకి తీసుకోవడం ఈ దుష్టుల కుట్రగా తెలుస్తోంది. ఆ తరువాత విద్యార్థులకు ప్రైవేటు ఫోటోలు, వీడియోలు తీసుకుని వాటిని వారి తల్లిదండ్రులకు పంపించి బ్యాంక్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు సమాచారం తెలుసుకుని నగదు దోచేయడం, ఇతరత్రా బ్లాక్ మెయిలింగ్‌లకు పాల్పడడం ఈ ముఠాల పన్నాగమని పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టాం విద్యార్థుల చేతికి మొబైల్ ఇచ్చే ముందు అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే ఆన్లైన్ లింక్ తెరవరాదని చెప్పాలి. విద్యార్థులకు ఆశ్లీల చిత్రాలు, వీడియోలు పంపించిన కేసును తీవ్రంగా పరిగణించి విచారణ చేపడుతున్నాం. ఇలాంటి కేసులు మీ దృష్టికి వస్తే స్థానిక సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.– సీసీబీ జాయింట్పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ -
డ్రంకన్ డ్రైవ్.. వృద్ధులు, మైనర్లు
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్న వారిలో వయో వృద్ధులు, మైనర్లు కూడా ఉంటున్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య నెలనెలకు పెరుగుతుండటం ట్రాఫిక్ పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్పరిధిలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన 4,145 మందిలో 14 మంది వయోవృద్ధులు, ఆరుగురు మైనర్లు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే వీరి సంఖ్య కాస్తా తక్కువగానే ఉన్నా ఈ వయసులో వీరు మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కౌన్సెలింగ్ చేయడంతో పాటు జైలుశిక్షలు పడేలా చేసేందుకు న్యాయస్థానంలో చార్జిషీట్లు పకడ్బందీగా దాఖలు చేసి తదనుగుణంగా చర్యలు ఉండేలా చూసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో ట్రాఫిక్ పోలీసులు మాదాపూర్ టాప్...కూకట్పల్లి సెకండ్ 55 రోజుల్లో 4,145 డ్రంకన్ డ్రైవ్ కేసులు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదుచేశారు. వయసుల వారీగా చూసుకుంటే అత్యధికంగా 21 నుంచి 30 ఏళ్ల మధ్యవయసు వారే 2,053 మంది, ఆ తర్వాత 1,364 కేసులతో 31 నుంచి 40 ఏళ్ల వయస్సువారు, 41 నుంచి 50 ఏళ్ల వారు 487 మంది, 51 నుంచి 60 ఏళ్ల వారు 122 మంది, 18 నుంచి 20 ఏళ్ల వారు 99 మంది, 61 నుంచి 70 ఏళ్ల వారు 14 మంది ఉంటే ఆరుగురు మైనర్లు ఉన్నారు. బ్లడ్ ఆల్కాహలిక్ కౌంట్(బీఏసీ) 31 నుంచి 600 వరకు బ్రీత్ అనలైజర్ పరీక్షల ద్వారా తేలింది. మాదాపూర్, అల్వాల్, కూకట్పల్లి, శంషాబాద్‌లో అత్యధికంగా బీఏసీ స్థాయి 100 ఎంఎల్‌కు 550 ఎంజీగా నమోదైంది. అయితే ట్రాఫిక్ ఠాణాల వారీగా డ్రంకన్ డ్రైవ్ కేసులు చూస్తే అత్యధికంగా మాదాపూర్‌లో 981, కూకట్‌పల్లిలో 683 కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం 4,145 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 662 మందికి మూడు నుంచి 30 రోజుల పాటు జైలు శిక్ష పడిందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ బుధవారం తెలిపారు. అలాగే 790 మంది డ్రంకన్ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు లేఖలు రాశామని చెప్పారు. -
చేవెళ్ల బస్‌స్టాండ్‌లో విషాద సంఘటన..
-
మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి..
సాక్షి, చేవేళ్ల: చేవెళ్ల బస్‌స్టాండ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన యువకుడు అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడిపోయాడు. మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి చక్రాల కిందపడి పోయాడు. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అధిక రద్దీ కారణంగా మైనర్ బాలుడు చనిపోయాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే రద్దీగా ఉన్న బస్సులను ఎక్కవద్దని, బస్సు ఫుట్‌బోర్డు పై నిలబడొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు, ప్రజలకు సూచించారు. One minor has died in an accident at Chevella bus stand while climbing on Bus footboard. Cyberabad Traffic Police request the students/ public not to take running buses and do not stand on the footboard. pic.twitter.com/0zSXK2YXw4— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) -
పవన్ కుమార్ మైనర్ కాదు
-
‘నిర్భయ’ దోషి ఆనాడు మైనర్ కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నాటి ‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ఒకరు ఆ ఏడాది తాను మైనర్‌నంటూ చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దోషి పవన్ కుమార్ గుప్తా తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఘటన జరిగే నాటికి పవన్ కుమార్ మైనర్ అని, దీనికి సంబంధించి మరిన్ని నివేదికలు సమర్పించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. అందుకు జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ అంగీకరించి కేసును జనవరి 24కు వాయిదా వేశారు. అయితే తర్వాత బాధితురాలి తల్లిదండ్రుల తరఫున వాదిస్తున్న లాయర్లు దీనిపై అభ్యంతరం లేవనెత్తారు. గతంలో ఇదే విషయంపై ట్రయల్‌కోర్టులో విచారణ జరిగిందని, ఘటన జరిగే నాటికి పవన్ కుమార్ మైనర్ కాదని తేలిందని వారు చెప్పారు. దీనిపై విచారించేందుకు లాయర్ ఏపీ సింగ్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. మధ్యాహ్నానికి వాయిదా వేసి, లాయర్‌కు సమాచారం ఇచ్చి వేచి చూసినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో కోర్టు ఎదుట హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ లాయర్‌కు రూ.25వేల జరిమానా విధించింది. -
ప్రియుడి కోసం బాలిక హంగామా
చిత్తూరు,పలమనేరు : తన ప్రేమికుడు వస్తేగానీ ఇంట్లో బంధించిన కుటుంబ సభ్యులను వదలనంటూ ఓ బాలిక నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన గురువారం సాయంత్రం పలమనేరులో చోటుచేసుకుంది. పట్టణ సీఐ శ్రీధర్ కథనం.. స్థానిక నాగులురాళ్లువీధిలో కాపురముంటున్న ఓ దంపతులకు ఇరువురు కుమార్తెలున్నారు. వీరి చిన్నమ్మాయి (మైనర్) గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా స్థానికం ఉన్న కొరియర్ బాయ్ రెహమాన్‌ను ప్రేమించానంటూ ఇంటినుంచి అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్‌పై పోలీసులు కిడ్నాప్, ఫాక్సో కేసు నమోదు చేశారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. తన కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆందోళన చెందిన బాలిక తండ్రి కుమార్తెను కళాశాలకు పంపడం మానేశారు.కేసు నమోదయ్యాక సైలెంట్‌గా ఉన్న ప్రేమికుడు మళ్లీ బాలిక ఉంటున్న వీధిలో తిరగడం మొదలెట్టాడు. ఇది గమనించిన బాలిక గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న తన తల్లి, అక్కను లోనఉంచి హాలుకు తాళం వేసింది. తాను వరండాలో ఉంటూ గేటు వేసుకుంది. లోపల నుంచి బిగ్గరగా అరుస్తూ నానా హంగా మా చేసింది. విషయం పోలీసులకు తెలిసింది. దీంతో పట్టణ సీఐ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఐసీడీఎస్ సిబ్బందితో కలసి బాలిక ఇంటికి వెళ్లారు. తాము న్యాయం చేస్తామంటూ ఎంత చెప్పినా బాలిక ఖాతరు చేయకుండా తనకు ప్రియుడే ముఖ్యమంటూ, తల్లిదండ్రులు ఏడాదిగా వేధిస్తున్నారని అరచి గోల గోల చేసింది. తాము ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పిస్తామంటూ తహసీల్దార్ బతిమలాడినా ఆ బాలిక బయటకు రాలేదు. లవర్ వస్తేగానీ రానంటూ గట్టిగా చెప్పింది. ఎట్టకేలకు ప్రియుడి తండ్రి వచ్చి తానున్నానంటూ బాలికను బయటకు రప్పించాడు. బాలిక స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న అధికారులు బాల్య వివాహాలు చట్టవిరుద్ధమంటూ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనార్టీ తీరేదాకా తిరుపతి జువనైల్ హోమ్‌కు తరలించాలని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అయితే తమ కుమార్తెను తాము వేధించడం లేదని ఎప్పుడు చూసినా ప్రేమ, ప్రేమ అంటోందని ఆ భయంతో కళాశాలకు ఇద్దరు కుమార్తెలనూ పంపడం ఆపేశామని బాలిక తల్లి కన్నీటిపర్యంతమైంది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. -
అనంతపురం జిల్లాలో మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య
-
మైనర్‌పై టీడీపీ నేత కుమారుడి లైంగిక దాడి
సాక్షి, గుంటూరు : ‘మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుంది.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాం.. ఇలాంటి వారిని మహిళలు రోడ్లపైకి ఈడ్చి బుద్ధి చెప్పాలి..’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన సమయంలో గుంటూరు వచ్చిన ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో హెచ్చరికలు చేయడంతో అంతా నిజమని నమ్మారు. అయితే ఆయన హెచ్చరించిన వారం రోజులకే అదే దాచేపల్లిలో ఓ మైనర్ బాలికపై టీడీపీ మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా గర్భవతిని సైతం చేసిన దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారే తప్ప, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. మంత్రి నియోజకవర్గంలో మరో అమానుషం.. తాజాగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరులో 11 ఏళ్ల మైనర్ బాలికపై అధికార పార్టీ నేత తనయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడ్డ మృగాడిని కఠినంగా శిక్షించాల్సిన అధికార పార్టీ నేతలే నిరుపేద బాధిత కుటుంబాన్ని డబ్బుతో మభ్యపెట్టి కేసు లేకుండా చేశారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కులం పరువు పోతుందంటూ కొందరు అధికార పార్టీ నేతలు పంచాయితీ చేసి బాలిక కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చేలా మాట్లాడి కేసు లేకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు అత్యాచార ఘటన గురించి వివరాలు తెలిసినప్పటికీ అధికార పార్టీ నేత తనయుడు కావడంతో రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. దీనిపై ఈనెల 13న‘మైనర్ బాలికపై టీడీపీ నేత తనయుడి లైంగిక దాడి’ శీర్షికతో ప్రచురించిన వార్తకు స్పందించిన ఎస్పీ వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరు వెళ్ళిన సమయంలో బాలిక తల్లిదండ్రులను పిలిపించి విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. అమానుష ఘటన వివరాలివీ... అమృతలూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న 11 ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శరణు విశ్వతేజ అనే యువకుడు ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి రామమందిరం వద్దకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. విష్ణుతేజ తండ్రి నాగేశ్వరరావు అధికార పార్టీ ముఖ్యనేత. గతంలో ఆయన కూచిపూడి నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మృగాడి బెదిరింపులతో విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు బాలిక భయపడింది. ఇది జరిగిన రెండు రోజులకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండగా అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఫిర్యాదు చేసేందుకు కుమార్తెతో కలసి పోలీసు స్టేషన్‌కు వెళుతుండగా, మృగాడి బంధువులు ఆమెను అడ్డుకుని కుల పెద్దలు, అధికార పార్టీ నేతలతో పంచాయితీ పెట్టారు. బాలిక కుటుంబం పూరిగుడిసెలో నివాసం ఉంటూ కటిక బీదరికంతో ఇబ్బందులు పడుతుండటాన్ని ఆసరాగా తీసుకుని బాలికపై అమానుషానికి వెలకట్టేందుకు వెనుకాడలేదు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు తెలిసినా... అత్యాచార ఘటన విషయం పోలీసులకు తెలిసినప్పటికీ వారిద్దరూ రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. బాలిక కుటుంబానికి మాత్రం కేవలం రూ.4 లక్షలు చెల్లించారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’ దీనిని వెలుగులోకి తెచ్చింది. రూరల్ ఎస్పీ చొరవతో... విషయం తెలుసుకున్న రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరుకు వెళ్ళిన సమయంలో బాలికను, ఆమె తల్లిని పిలిపించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలికను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో బాలిక, ఆమె తల్లితో డీఎస్పీ స్నేహిత మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. అధికార పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నష్టపరిహారం పేరుతో డబ్బులు ఇచ్చి తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అమృతలూరు అధికార పార్టీ నేతలు సైతం ఇదే మార్గాన్ని ఎంచుకుని డబ్బుతో ఆడపిల్లపై అమానుషానికి పాల్పడితే దానికి వెలకట్టే దుశ్చర్యకు పాల్పడ్డారు. విషయం బయట పడడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసు అధికారులపై ఒత్తిడి పెంచే యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. -
దారుణం: చిన్నారిపై మైనర్ అకృత్యం, హత్య
నొయిడా, ఉత్తరప్రదేశ్: యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల బాలికపై ఓ మైనర్ అత్యాచార యత్నం చేశాడు. ఆపై నిజం బయట పడుతుందని ఆ చిన్నారిని హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని బిస్రఖ్ ప్రాంతంలో గల దేవాలయం సమీపంలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నొయిడాలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి పక్కింట్లో నివాసముండే 13 ఏళ్ల మైనర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారి ఆచూకీ తెలియక సతమతమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం లభించింది. శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం నిందితుడు బాలికను తీసుకొని వెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. మైనర్‌ను విచారించగా నిజం ఒప్పు కున్నాడనీ, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద పోర్న్ చిత్రాలు లభించాయని తెలిపారు. -
అశ్లీల చిత్రాలతోనే పిల్లలు తప్పుదారి
చిత్తూరు అర్బన్: పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపే గారాబం సమాజంపై ప్రభావాన్ని చూపిస్తోందని చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. చిన్న పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడంతో అందులో అశ్లీల చిత్రాలు చూస్తూ తప్పుదారిలో వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో ఓ బాలికపై ఐదుగురు మైనర్లు రెండు నెలలుగా అత్యాచారం చేయడంపై ఎస్పీ శుక్రవారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. అరెస్టయిన మైనర్ల వద్ద ఉన్న సెల్ఫోన్లు చూస్తే తామే షాక్‌కు గురయ్యామన్నారు. ఇంగ్లిష్ పదాలు టైపు చేయడానికి కూడా చేతగాని పిల్లలు గూగుల్ వాయిస్ సెర్చ్‌లో అశ్లీల చిత్రాలు చూసి, వాటి ప్రేరణతో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలిందన్నారు. ఆడ పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలను నివారించడానికి పోలీసు శాఖ ఎన్ని చర్యలు చేపడుతున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం శోచనీయమన్నారు. నిందితులు ఎంతటివారైనా చట్టరీత్యా చర్యలు చేపట్టి శిక్షలు పడేలా చేస్తున్నట్టు వివరిం చారు. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం, అవసరం లేకున్నా వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్లే నేరప్రవృత్తిలోకి వెళుతున్నారని తెలిపారు. త్వరలోనే కలెక్టర్‌తో కలిసి స్వచ్ఛంద సేవాసంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆడపిల్లల రక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అత్యాచారం బాధితురాలికి మహిళా కమిషన్ :సభ్యురాలి పరామర్శ గంగవరం: పుంగనూరు భగత్‌సింగ్ కాలనీలో అత్యాచారానికి గురై పలమనేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ భాను పరామర్శించారు. బాధితురాలు, తల్లితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుతం సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం గమనిస్తుండాలని చెప్పారు. ముఖ్యంగా బాలికలకు తల్లిదండ్రులు అన్ని విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులు కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాకు చెందిన వారని, వారిని ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని చెప్పారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయనున్నట్టు చెప్పారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు బాలురిని తిరుపతి జువైనల్ హోంకు తరలించినట్లు వివరించారు. -
బాలికపై అత్యాచారయత్నం
-
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్టు
సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్ బాలికకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గుంటూరు ప్రభుత్వాసుపత్రి ముందు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. న్యాయం కోసం నినదిస్తున్న ఎమ్మెల్యే రోజాను మహిళా పోలీసులు ఈడ్చుకెళ్లారు. అంతకుముందు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని రోజా చెప్పారు. మనం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో బతుకుతున్నామా? లేక అడవిలో ఉన్నామా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మగాళ్లు అంటేనే బాలిక భయపడి ఏడుస్తోందని చెప్పారు. ఆసుపత్రి సూపరిటెండెంట్ గది లోపలికి వచ్చినా హడలిపోతోందని, మనషులకు ఇంత చీప్ మెంటాలిటీ ఉంటుందని తెలిసి కుమిలిపోతోందని తెలిపారు. మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తారని చిన్నారి మనసులో ముద్రించుకుపోయిందని వివరించారు. ఇంతవరకూ నిందితుడిని అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ‘పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాలికను పరామర్శించని చంద్రబాబు పెళ్లి వేడుకకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఇందుకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. దాచేపల్లిలో ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే తునిలో టీడీపీ నాయకుడు ఒకరు బాలికపై అత్యాచారానికి యత్నించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన చింతమనేనిపై చర్యలు లేవు. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోలేదు. మహిళా వ్యతిరేక నేరాల్లో ఐదుగురు టీడీపీ నాయకులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) రిపోర్టులో పేర్కొంది. కేసుల్లో ఇరుక్కున్న నేతలకు పదవులు అప్పగిస్తూ చంద్రబాబు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. చంద్రబాబుకు ఆడవాళ్లు ఉసురు కచ్చితంగా తగులుతుంది. ఒక ముఖ్యమంత్రి, డీజీపీ ఉన్న చోట ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్ర డీజీపీ ఓ రబ్బరు స్టాంప్‌లా ప్రవర్తిస్తున్నారు. ఒక ముసలివాడు అమ్మాయిని గంటపాటు రేప్ చేసి వెళ్తుంటే మన పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నార’ని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. -
మృగాళ్ల పాపం : 11 ఏళ్లకే తల్లిగా..
రాజ్‌కోట్ : మహిళా దినోత్సవాలు, స్త్రీ సాధికారత మీద ఉపన్యాసాలు కేవలం అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి. ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పురాక నిర్భయలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న దారుణమే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే ఇరుగుపొరుగు ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే, ఆ అమ్మాయి పనిచేస్తున్న ఇళ్లల్లోని ఓ ఆరుగురు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. గత 9 నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. అయితే, నిజం చెబితే తనను ఏదైనా చేస్తారేమో అనే భయంతో ఆ బాలిక ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. అయితే, క్రమంగా బాలిక ఆరోగ్యంలో మార్పులు రావడం గుర్తించిన ఆమె తల్లి మార్చి 8న ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే 8 నెలల గర్భవతి అని నిర్దారణ అయింది. ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఆమె తల్లి ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు 60 ఏళ్ల వృద్దులతోపాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలిసింది. తల్లి క్షేమం.. చావుబతుకుల్లో చిన్నారి ఇదిలా ఉండగా, ఆ బాధిత బాలిక ఈ నెల 17న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలికను కాపాడటానికి సిజేరియన్ చేయాల్సి వచ్చిందని రాజ్‌కోట్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు కమల్ గోస్వామి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి క్షేమంగా ఉందని, ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. వెన్నెముక లోపం, పక్షవాతం రావడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆమె బతకాలి.. కానీ మాకొద్దు తమ బిడ్డ జన్మనిచ్చిన శిశువు బతకాలని కోరుకుంటున్నామని, అయితే, ఆ శిశువును మాత్రం తాము చేరదీయలేమని బాధితురాలి బంధువులు చెబుతున్నారు. -
అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రిమాండ్
ములుగు(గజ్వేల్): మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ములుగు మండలం బహిలంపూర్ గ్రామానికి చెందిన యువకుడు కురుమ అయిలయ్యను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గౌరారం సీఐ శివలింగం తెలిపారు. సోమవారం ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ శ్రీశైలంతో కలసి సీఐ మాట్లాడుతూ..ఈ నెల 14న రాత్రి 10 గంటలకు అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల వయస్సు గల ఓ మైనర్ బాలిక తన చిన్నాన్న ఇంటికి వెలుతుంది. ఇది గమనించిన అయిలయ్య వెనుకాల నుంచి వెళ్లి బాలిక నోరు మూసి పక్కనే వున్న ఓ పాడుబడిన ఇంటిలోకి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న ఆమె సోదరుడు ఘటనా స్థలానికి వచ్చి అయిలయ్యను పట్టుకోవడానికి యత్నించగా చేతిని కొరికి పారిపోయాడు. పరారీలో వున్న నిందితుడు అయిలయ్యను సోమవారం బహిలంపూర్లో అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఏడేళ్ల దళిత బాలికపై అత్యాచారం
జైపూర్(చెన్నూర్): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 40 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 19న గ్రామంలో నూతనంగా నిర్మించిన హన్మాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న సదరు వ్యక్తి బాలి కను బలవంతంగా సమీపంలోని గుడిసెలోకి తీసుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డట్టు సమాచారం. బాలిక కొద్దిసేపటి తర్వాత ఏడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. నిందితుడు గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధికి దగ్గరి బంధువు కావడంతో ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని బాలిక తల్లిదండ్రులను బెదిరించినట్లు సమాచారం. గుట్టుచప్పు డు కాకుండా బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి నట్లు తెలిసింది. జైపూర్ ఎస్సై ఆంజనేయులును వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. దీంతో ఏసీపీ సీతారాములు దృష్టికి సాక్షి తీసుకువెళ్లగా.. వెంటనే గ్రామానికి పోలీసులను విచారణ చేపడుతామని చెప్పారు. -
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి..
పట్నా : ఆరుగురు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. బిహార్ లో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. జనవరి 31 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగు చూసింది. ఈ సంఘటన బోజ్ పుర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, రేప్ దృశ్యాలను మొబైల్ లో రికార్డు కూడా చేశారు. అక్కడితో ఆగకుండా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు. గ్యాంగ్ రేప్ వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం బాధితురాలి తండ్రికి తెలిసింది. బాధితురాలి తండ్రి పాట్నాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరా మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆరుగురు యువకులు తన కూతురిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు బర్హరా పోలీస్ స్టేషన్ సమీపంలో బహిర్భూమికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికని వైద్యపరీక్షల కోసం సదర్ ఆసుపత్రికి తరలించినట్టు అరా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పూనమ్ కుమారి చెప్పారు. నిందితుల్లో ఒకడైన క్రిష్ణా యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పూనమ్ తెలిపారు. -
నిర్భయ కంటే దారుణమైన ఘటన.. అట్టుడుకుతున్న కురుక్షేత్ర
ఛండీగఢ్ : ఢిల్లీ నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను పైశాచికంగా కబళించిన మృగాలు.. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చి ఓ కాలువలో పడేశారు. శనివారం సాయంత్రం ఘటన వెలుగులోకి రాగా.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇప్పుడు ఆ ప్రాంతమంత నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోతుంది. బాధిత కుటుంబ కథనం ప్రకారం... కురుక్షేత్ర జిల్లా ఝాంసా గ్రామంలో బాలిక కుటుంబం నివసిస్తోంది. ఆమె తండ్రి ఓ టైలర్. బాలిక గ్రామంలో ఉన్న ఓ పాఠశాలలో 10 తరగతి చదువుతోంది. అదే గ్రామంలో ఉంటున్న ఓ యువకుడి(20)ని ప్రేమించిన బాలిక కొద్దిరోజుల క్రితం అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే బాలిక హత్యాచారానికి గురైంది. జింద్ జిల్లా బుద్ధ ఖేర్ గ్రామంలోని కాలువ ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన వెలుగు చూసింది. బాలిక మృతదేహాన్ని రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి ఫోరెన్సిక్ విభాగానికి తరలించి శవ పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సదరు యువకుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఘటనకు అతడికి సంబంధం ఉన్నట్లు ఇప్పటిదాకా రుజువులేవీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. అత్యంత కిరాతకంగా... ఇక బాలిక మృతదేహానికి పరీక్షలను నిర్వహించిన డాక్టర్ ఎస్కే దత్తార్వాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత పైశాచికంగా ఆ బాలికను అత్యాచారం చేసి చంపారని ఆయన చెబుతున్నారు. మొత్తం బాలిక శరీరంపై ముఖం, తల, ఛాతీ, చేతులు ఇలా వివిధ భాగాల్లో 19 గాయాలున్నాయని.. నిందితులు ఆమె ఛాతీపై కూర్చోవటంతో ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ‘‘దాదాపుగా ఆమె శరీరవయవాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. మర్మాంగాల్లో వస్తువులను చొప్పించటంతో బాలిక పేగులు దెబ్బతిన్నాయి. మృగాల కంటే హీనంగా బాలికను అత్యాచారం చేశారు. నిర్భయ ఘటన కంటే ఇది మరీ ఘోరంగా ఉంది’’ అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కాగా హరియాణాలో గడిచిన 48 గంటల్లో ఇప్పటివరకూ మూడు అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కురుక్షేత్రలో ఆందోళన... ఘటన వెలుగులోకి రావటంతో మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఆందోళనకారులు శాంతించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పిలుపునిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆయన అన్నారు. బాలిక తండ్రి ఫోటో ‘‘నా కూతురికి న్యాయం చేకూరాలి. ఆమె అతి దారుణంగా చంపబడింది. భవిష్యత్తులో మరే తండ్రికి ఇలాంటి దుస్థితి కలగకుండా.. నిందితులను కఠినంగా శిక్ష విధించాలి’’ అని బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కేసును సీబీఐకి అప్పగించి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని.. నిర్భయ ఫండ్ నుంచి 50 లక్షలు బాలిక తల్లిదండ్రులకు అందజేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు బాలిక మృతదేహాంతో కుటుంబ సభ్యులు నిరసన చేపట్టగా.. చివరకు హర్యానా మంత్రి కేకే బేడీ కాలపరిమితితో కూడిన దర్యాప్తునకు హమీ ఇవ్వటంతో ఆందోళన విరమించి బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేసేదాకా శాంతియుత నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్తగా భారీ ఎత్తున్న భద్రతా దళాలను అక్కడ మోహరించారు. మరొక ఘటన.. పానిపట్‌లో మరో దళిత మైనర్‌ను కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక(11) ను ఎత్తుకెళ్లిన దుండగులు ఘటన అనంతరం సమీపంలోని ఓ చెత్త కుప్పలో బాలిక శవాన్ని పడేశారు. ఆనవాళ్లు దొరక్కుండా బాలిక బట్టలను కాల్చి పడేశారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి పక్కన ఉండే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పానిపట్ ఎస్పీ వెల్లడించారు. కాగా, గత నెలలో హిస్సార్‌లో ఆరేళ్ల బాలికను అతికిరాతంగా అత్యాచారం చేసి చంపగా.. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. -
ఇంకా 12గంటలే మిగిలి ఉంది
లాహోర్ : ఏడేళ్ల చిన్నారి జైనబ్‌ని ఓ మానవ మృగం క్రూరంగా కబలించివేసిన ఘటన పాకిస్థాన్‌ను అట్టుడికిస్తోంది. రోజులు గడుస్తున్నా.. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని 36 గంటల్లో అరెస్ట్ చేసి తీరాలని శుక్రవారం లాహోర్ హైకోర్టు కసుర్ పోలీసులకు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే ఒకరోజు గడిచిపోగా.. నేడు సీసీ పుటేజీ సాయంతో నిందితుడి ఊహాచిత్రాలను కసూర్ పోలీసులు విడుదల చేశారు. చిన్నారిని ఓ వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించిన అధికారులు.. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుని తీరతామని చెబుతున్నారు. జనవరి 4న ఏడేళ్ల వయసున్న జైనబ్ అన్సారీ తన ఇంటికి దగ్గర్లో ఉన్న అత్త ఇంటికి వెళ్తుండగా అపహరణకు గురైంది. ఐదు రోజుల తర్వాత చెత్తకుప్పలో కూలీలు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు.. అతి పైశాచికంగా హింసించి చంపాడని వైద్యులు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడించారు. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చిన్నారి అంత్యక్రియల్లో అశేష జనవాహిని పాల్గొంది. ప్రజలు దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీలు చేపట్టారు. ఇక గత ఏడాదిలో కసూర్‌లో ఇలాంటి కేసులు 12 నమోదు కావటంతో ప్రజల్లో ఆగ్రహాం తారాస్థాయికి చేరుకుంది. నిందితుడిని ఊరితీయాలంటూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకతీతంగా ఆందోళన చేపట్టారు. పంజాబ్ ప్రొవిన్స్‌లో అది కాస్త హింసాత్మకంగా మారటంతో పోలీసులు కాల్పులు జరపగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. లాహోర్ హైకోర్టు కసూర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గడువులోపు నిందితుడిని అరెస్ట్ చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. -
జైనబ్ కేసు: సీసీ పుటేజీ
-
దారుణం : ఓటు వేయలేదని గ్యాంగ్‌రేప్.. హత్య
రాంచీ : జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో తన భార్యకు మద్ధతు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఒక కుటుంబంపై పగ పెంచుకుని దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే... పాకూరు జిల్లా లిట్టిపారా గ్రామ పంచాయితీలో ‘ముఖియా’ పదవి కోసం కొన్నాళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ప్రేమ్‌లాల్ హంసద అనే వ్యక్తి భార్య ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఓటు వేయలేదు. దీంతో వారి మూలంగానే తన భార్య ఓడిపోయిందన్న కోపంతో ప్రేమ్‌లాల్ రగిలిపోయాడు. జనవరి 8న బహిర్భూమికని వెళ్లిన బాలికను తన సోదరుల సహకారంతో అపహరించాడు. ఆపై వారంతా కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ప్రాణాలు తీశారు. చివరకు బాలిక మృత దేహాన్ని సమీపంలోని బ్లెవాన్ అటవీ ప్రాంతంలో పడేశారు. బాలిక కనిపించకుండా పోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు బాలిక శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆపై నిందితులపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయటంతో వారిని అరెస్ట్ చేశారు. తీవ్ర విమర్శలు... నిందితులు రాజకీయంగా కాస్త పలుకుబడి ఉన్నవారు కావటంతో తొలుత కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు తటపటాయించారు. అయితే ప్రతిపక్షాల ఆందోళన, తల్లిదండ్రుల నిరసన ప్రదర్శనతో పోలీసులపై విమర్శలు గుప్పించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి.. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఎలాంటి తమపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని.. సాక్ష్యాలు సేకరించటంలో జాప్యం మూలంగానే అరెస్ట్ ఆలస్యం అయ్యిందని పాకూరు జిల్లా ఎస్పీ శైలేంద్ర బర్న్వాల్ వెల్లడించటం విశేషం. నిందితులు ప్రేమ్‌లాల్, శ్యామూల్, కథి, శిశు హందలు నేరాన్ని ఒప్పుకోవటంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు వారు వివరించారు. -
ఫేస్బుక్ సాక్ష్యంతో ఆమెకు విడాకులు
సాక్షి, జైపూర్ : సోషల్ మీడియా.. ఆధునిక కాలంలో ఉపయోగించుకునేవారి రీతిని బట్టి.. వారికి ఆయావిధాలుగా సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఫేస్బుక్ మాత్రం ఎవరికి ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతోంది. తమతమ అభిప్రాయాలను వెలువరించేందుకే కాకుండా.. సాక్ష్యాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా రాజస్తాన్‌లో ఒక యువతి.. ఫేస్బుక్ కామెంట్లు, ఫొటోలును ఆధారంగా చూపి.. న్యాయం పొందింది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌కు చెందిన సుశీల భిష్ణోయ్ (19) కు బాల్య వివాహం చేశారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. సుశీల వాదనను అమె భర్త పూర్తిగా వ్యతిరేకించాడు. అంతేకాక బాల్య వివాహం జరగలేదు అంటూ కోర్టుకు వివరించారు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు.. బాల్య వివాహం జరిగిందనడానికి ఆధారాలుంటే సమర్పించాలని సుశీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సుశీల, సామాజిక కార్యకర్త కృతి భారతితో కలిసి ఆధారాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సరిగ్గా ఈ సమయంలో.. భర్త ఫేస్బుక్లో పెళ్లి సమయంలో పెట్టిన ఫొటో.. దానికి వచ్చిన కామెంట్లపై సామాజిక కార్యకర్త... సుశీలను అడిగారు. వెంటనే ఇద్దరూ కలిసి భర్త ఫేస్బుక్లో పెళ్లినాటి ఫొటో.. ఆ సమయంలో వచ్చిన కామెంట్లు.. తేదీ, నెల, సంవత్సరం.. వారీగా సేకరించారు. సుశీల భర్త ఫేస్బుక్లో పెళ్లి తేదీ నాడు.. గ్రీటింగ్స్ చెబుతూ వచ్చిన కామెంట్లను సాక్ష్యంగా సుశీల కోర్టులో ప్రవేశపెట్టారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేనాటికి తానింకా మైనర్ని అని.. తనను బెదిరించి, భయపెట్టిన పెళ్లి చేశారని సుశీల కోర్టుకు వివరించారు. ఫేస్బుక్ కామెంట్లను కోర్టు సాక్ష్యాలుగా అంగీకరించి.. ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ పెళ్లి జరిగేనాటికి తనకు.. తన భర్తకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమేనని సుశీల కోర్టుకు ఫేస్బుక్ కామెంట్లు, పోస్ట్‌లను సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పు తరువాత ఆమె మాట్లాడుతూ.. తనకు ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు. -
అబ్బాయికి 18, అమ్మాయికి 24 !
మైసూరు : అబ్బాయికి 18, అమ్మాయికి 24... వరుడికి ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు. అయినా వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయికి, అబ్బాయికి ఏకంగా ఆరేళ్లు తేడా ఉండటంతో వరుడి బంధువులు ఈ పెళ్లికి ఇష్ట పడలేదు. దీంతో ఇద్దరు ప్రేమికులు ఆదివారం ఓ దేవాలయలో పెళ్లి చేసుకున్నారు. సోమవారం వరుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... ఇక్కడి మండి మోహల్లాకు చెందిన ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ఒకే చోట పనిచేస్తుండటంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొద్దికాలంలో సరదాగా తిరిగారు. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసి కనీస పెళ్లి వయసు కూడా రాలేదని, పెళ్లి చేయమని తెగేసి చెప్పారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించిన ప్రేమికులు ఆదివారం నగరంలోని సయ్యాజీ రావు రోడ్డులో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వరుడి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి తమ కుమారుడు మైనర్ అని, అతడికి బలవంతంగా పెళ్లి చేశారని మండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికులను పిలిపించి విచారణ చేశారు. తమ ఇష్ట్రపకారమే పెళ్లి చేసుకున్నామని వారు చెప్పడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. అబ్బాయి మైనర్ కావడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్ హర్రర్!
చిన్న వయసులో పెద్ద నేరాలు ♦ ప్రభావితం చేస్తున్న ఇంటర్నెట్, సోషల్ మీడియా ♦ దారి తప్పుతున్న పార్టీ, పబ్ సంస్కృతి ♦ క్షణికావేశంలో కొన్ని.. భయంతో మరికొన్ని.. ♦ 2014–2017లో అరెస్టయిన వారు 8,688 మంది ♦ కొత్త నేరస్తులు 6,726 మంది 634 మంది 18 ఏళ్ల లోపువారే.. ♦ తల్లిదండ్రుల అజమాయిషీ ఉండాలంటున్న పోలీసులు పాశ్చాత్య సంస్కృతి మైనర్లను పెడదారి పట్టిస్తోంది. సమాజంలోని ఆధునిక ధోరణులు యువతను నేరాల వైపు పురిగొల్పుతున్నాయి. తల్లిదండ్రుల అజమాయిషీ లేకపోవడం, పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం, పార్టీ, పబ్ కల్చర్ సైతం మైనర్లను తీవ్రంగా ప్రభావితం చేసి నేరబాట పట్టిస్తున్నాయి. ఏటా పోలీసులకు చిక్కుతున్న నేరస్తుల్లో 70 శాతానికి పైగా కొత్తవారే. వీరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మైనర్లు ఉండడం గమనార్హం. 2014–2017 జూలై మధ్య సిటీ పోలీసులు మొత్తం 8,688 మందిని అరెస్టు చేయగా.. 6,726 మంది (77.41 శాతం) కొత్త నేరగాళ్లు. ఇందులో 634 మంది 18 ఏళ్ల లోపువారే కావడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో ⇔ ప్లస్‌టూ విద్యార్థిని చాందిని జైన్‌ని శనివారం దారుణంగా హత్య చేసిన ఆమె స్నేహితుడు, పూర్వ సహ విద్యార్థి మైనర్. ⇔ ఎల్బీనగర్ ఠాణా పరిధిలో నివసించే 14 ఏళ్ల మైనర్ గత శుక్రవారం తన ఇంటి పక్కనే ఉండే చిన్నారిపైఘాతుకానికి పాల్పడ్డాడు. ⇔ బార్కస్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు మరో మైనర్‌పై జూన్ 28న అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటపడుతుందనే భయంతో అతడిని చంపేశాడు. ⇔ ఈ ఏడాది మార్చిలో జరిగిన డ్రైవర్ భూక్యా నాగరాజు హత్య.. ఈ ఘాతుకానికి పాల్పడిన ఐఏఎస్ అధికారి ఎంవీ రావు కుమారుడు సుక్రు వయసు 19 ఏళ్లే. సాక్షి, సిటీబ్యూరో : సమాజంలో విపరీత ధోరణలు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు పరోక్షంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్న విచ్చలివిడితనం, అక్కడి సంస్కృతి పిల్లలను, యువతను ప్రభావితం చేస్తున్నాయి. చాందిని జైన్ ఉదంతాన్నే తీసుకుంటే.. పరిస్థితులు ఇక్కడ వరకు రావడానికి సోషల్ మీడియా ప్రభావమూ ఉందని తేలింది. ఫేస్బుక్ కేంద్రంగా ఏర్పాటైన ‘నేషనల్ డిప్లమాట్స్’ అనే పేజ్ అనేక మంది మైనర్లు, మేజర్లను ఏకం చేసింది. వీరంతా ఈనెల 1 నుంచి 3 వరకు నగరంలోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. పగలంతా కొన్ని రకాలైన మాక్ సెషన్స్‌తో సజావుగానే సాగినా.. రాత్రి వేళల్లో మాత్రం శృతిమించింది. సోషలైజింగ్ పేరుతో మైనర్లు, మేజర్లు కలిసి పబ్‌కు వెళ్లడం, ఎక్సేంజింగ్ పేరుతో లింగభేదం లేకుండా గదులు మార్చుకోవడం వంటి విపరీతాలు చోటు చేసుకున్నాయి. మైనర్లను పబ్స్‌లోకి అనుమతించకూడదని, మద్యం సరఫరా చేయకూడదనే నిబంధన ఉన్నా.. ఈ మూడు రోజులూ అవి ఎక్కడా అమలుకాలేదు. ఆ గెట్ టుగెదర్‌లో చాందినికి పరిచయమైన మరో మైనర్ కారణంగానే వివాదం మొదలై హత్యకు దారితీసింది. తల్లిదండ్రుల అజమాయిషీ లేకా.. నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. పెరిగిన ఖర్చులు, జీవన ప్రమాణాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఇల్లు వదిలి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక మంది మైనర్లు, యువత ఒంటరిగా మారుతున్నారు. దీనికితోడు వీరు సెల్ఫోన్లు, ఇంటర్నెట్ ఫలితంగా విశృంఖలంగా ఉంటున్న అశ్లీల సైట్లు, ఆ తరహా చాంటిగ్స్కు బానిసలుగా మారుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పరిచయాలు, మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ కొత్త ఆకర్షణలకు లోనవుతున్నారు. మరొపక్క పిల్లలపై పెద్దల అజమాయిషీ కూడా తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న మైనర్ల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట. విలాసాలు జీవితంలో భాగమనుకొని.. సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతతో పాటు మైనర్లనూ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సహ విద్యార్థులు, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారితో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా వారు భావిస్తున్నారు. మారిన జీవనశైలి, ఉద్యోగ–వృత్తి–వ్యాపారాల నేపథ్యంలో ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది దగ్గరుండి నేర్పేంత ఖాళీ తల్లిదండ్రులకు ఉండట్లేదు. వారి తర్వాత ఆ స్థాయిలో ఈ బాధ్యతలు నిర్విర్తించాల్సిన ఉపాధ్యాయులు సైతం ఆ విషయం పట్టించుకోవట్లేదు. గురుశిష్యుల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు లేకపోవడం, విద్యా సంస్థ అంటే కేవలం చదువు చెప్పి పంపించే వ్యాపార సంస్థగా మారిపోవడం కూడా మైనర్లు, యువతపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా దశ, దిశ నిర్దేశించే వారు లేకపోవడంతో లోకం పోకడ తెలియని చిన్నారులు సైతం పెడదోవపడుతూ తీవ్రమైన నేరాలు చేస్తున్నారు. ఈ పరిణామాలకు కారణాలనేకం... మైనర్లలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్న వారు, నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడిన తర్వాత వాటి ప్రభావంతో పెడదారులు పడుతున్నారని వివరిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మైనర్లలోనూ విపరీతమైన ధోరణులు పెరుగుతున్నాయని గుర్తించారు. దీంతో పాటు సినిమాలు, టీవీల ప్రభావంతో తెలిసీ తెలియని వయసులోనే ప్రేమాయణాలు, కక్షలు కార్పణ్యాలు వంటివి పెరిగిపోతున్నాయని, ఇలాంటివే అనేక సందర్భాల్లో హత్యలకు దారి తీస్తున్నాయని వివరిస్తున్నారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
కర్నూలు(లీగల్): మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఎమ్మిగనూరు తాలూకా సర్కిల్ పరిధిలోని నందవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలివీ. నందవరంలో పదవ తరగతి చదువుతున్న బాలిక 2014 జనవరి 17న పాఠశాలకు వెళ్లి తిరిగిరాకపోవడం తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 18న ఫిర్యాదు చేశారు. 23వ తేదీన బాలిక తన తల్లిదండ్రులతో వచ్చి తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘‘మా ఇంటి ఎదురుగా ఉంటున్న హరిజన శవాల శాంతిరాజు నీవంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానన్నాడు. 17వ తేదీ పాఠశాల ప్రహరీ వద్ద నిల్చున్న నన్ను ఎమ్మిగనూరు జాతరలో కొత్త బట్టలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సోదరుడైన హరిజన శవాల ఆదాం ఆటోలో తీసుకెళ్లాడు. ఎమ్మిగనూరు బస్టాండ్‌లో నన్ను బెదిరించి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌కు.. అక్కడి నుంచి గుర్తు తెలియని గ్రామం సమీపంలోని ప్రభుత్వ భవనంలోకి తీసుకెళ్లి హరిజన శవాల శాంతిరాజు 22వ తేదీ వరకు గదిలో నిర్బంధించి అత్యాచారం చేశారు. 22వ తేదీ సాయంత్రం ఎమ్మిగనూరు బస్టాండ్‌లో వదిలి నందవరానికి వెళ్లిపొమ్మని చెప్పారు.’’ అని ఫిర్యాదులో పేర్కొంది. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా మరుసటి రోజు తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై కిడ్నాప్, నిర్భయ చట్టం, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హరిజన శవాల శాంతిరాజు, హరిజన శవాల ఆదాంపై నందవరం పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.వి.శేషుబాబు తీర్పు చెప్పారు. -
మైనర్‌బాలికపై అత్యాచారయత్నం
తంగెడంచ(జూపాడుబంగ్లా): మండలంలోని తంగెడంచ గ్రామానికి చెందిన మైనర్‌బాలికపై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మోడల్ పాఠశాలలో చదువుతున్న బాలిక సెలవులకు ఇంటికి వచ్చింది.ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ అమ్మాయి కేకలు వేయడంతో తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హె డ్‌కానిస్టేబుల్ చెన్నయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
ఆదోని టౌన్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఎమ్మిగనూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు సమక్షంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన నాగేంద్ర మాయమాటలతో లోబర్చుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు బాలిక తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు ఇన్చార్జ్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 48 గంటలలోనే కేసును ఛేదించారని చెప్పారు. 2012 పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం
చీరాల(ప్రకాశం): ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని చీరాల జవహర్‌నగర్‌కు చెందిన ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు లైంగికదాడికి ఒడిగట్టాడు. కాలనీకి చెందిన బాలుడు(17) ఇంటి పక్కనే ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని(13)తో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
అత్యాచారం..హత్య : మైనర్ అరెస్ట్
చెన్నై: విల్లుపురం సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని విల్లుపురం సమీప ప్రాంతానికి చెందిన రైతు నటేషన్ (48)కు కుమార్తె జీవిత (18) ఉంది. సేలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో నర్సింగ్ చేస్తోంది. సంక్రాంతి సెలవుల కోసం సొంతూరుకు వచ్చిన జీవిత 19వ తేదీన ఇంట్లో గాయాలతో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు అదే ప్రాంతానికి చెందిన కేటరింగ్ కళాశాల విద్యార్థి, జీవితను హత్య చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 'జనవరి 19వ తేదీన జీవిత ఇంటికి వెళ్లాను. ఒంటరిగా ఉండడంతో ఆమెపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించాను. అందుకు ఆమె తిరస్కరించడంతో గొంతును గట్టిగా పట్టుకున్నాను. అదే సమయంలో అమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయా' అని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో విద్యార్థి పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్టు తెలిసిందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. అరెస్టు చేసిన బాలుడిని విల్లుపురం కోర్టులో హాజరు పరచి సెంజి జువైనల్ హోమ్‌కి తరలించారు. -
బాలికలపై అత్యాచారం.. 11మంది అరెస్ట్
-
బాలికలపై అత్యాచారం.. 11మంది అరెస్ట్
ముంబై: మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బుల్దాన జిల్లా హివర్ఖేడాలోని ఆశ్రమ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సంజయ్ బావిష్కర్ ఈ ఘటన వివరాలను వెల్లడిస్తూ.. నినాదీ ఆశ్రమ పాఠశాలలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జరిగినట్లు తెలిపారు. పాఠశాల ప్రెసిడెంట్, సెక్రెటరి, జాయింట్ సెక్రటరితో పాటు పలువురు సిబ్బంది ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారని.. వీరిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కేసు విచారణ కోసం మహారాష్ట్ర డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటుచేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర డీజీపీ సతీష్ మాథుర్ మాట్లాడుతూ... ఇప్పటివరకూ 11మందిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
బాలికపై లైంగిక దాడి
కైకలూరు (కృష్ణా జిల్లా) : మద్యంమత్తులో ఉన్న యువకుడు బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కైకలూరులో శుక్రవారం జరిగింది. స్ధానిక వెలంపేట కాలనీలో ఆరో తరగతి చదువుతోన్న బాలిక దసరా సెలవులు ఇవ్వడంతో తన స్నేహితురాలితో కలిసి ఇంట్లో ఉంది. ఈ సమయంలో బీరువాల తయారీ దుకాణంలో పనిచేసే బెల్లాని నాని (22) అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటిలో దూరాడు. బాలిక స్నేహితురాలిని బయటకు పంపి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగువారు రావడంతో పరారయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి పంపారు. టౌన్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై మేనమామ అత్యాచారయత్నం
సైదాబాద్: వినాయక నిమజ్జనం చూపిస్తానని తీసుకెళ్లి వరుసకు మేనమామ అయిన వ్యక్తి ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17న జరుగగా ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. నేపాల్‌కు చెందిన తులసి(35) ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి సింగరేణి వాంబే కాలనీలో నివాసం ఉండేవాడు. పూట గడవడానికి ఆటో నడపడం, వాచ్‌మెన్‌గా పనిచేయడం, బ్యాండ్ మేళాలు వాయించడం వంటివి చేస్తుంటాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా కొంత కాలంగా తన మకాంను చర్లపల్లి మార్చాడు. సింగరేణి కాలనీలో ఉండగా పక్కనే ఉండే వరుసకు కోడలు అయ్యే నేపాల్‌కు చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కాగా ఈ నెల 17న వినాయక నిమజ్జనం చూపిస్తానని చెప్పి బాలిక(11)ను తులసి తన ఆటోలో చర్లపల్లిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అక్కడి నుంచి బాలికను తన ఆటోలోనే సింగరేణి కాలనీకి తీసుకొచ్చి వదిలేశాడు. అయితే బాలిక జరిగిన విషయాన్ని ఆలస్యంగా కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
తొలిసారిగా ఓ మైనర్‌కు కారుణ్యమరణం!
బ్రస్సెల్స్: ఎప్పటికీ నయం కాని రోగాల బారిన పడినవారు ప్రభుత్వ అనుమతితో కారుణ్యమరణం(యుథనేషియా) పొందుతారు. చాలా దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానంలో కేవలం పెద్దవారికి మాత్రమే ప్రభుత్వాలు కారుణ్యమరణానికి అనుమతిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ మైనర్‌కు కారుణ్యమరణానికి అవకాశం కల్పించింది బెల్జియం. మైనర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికీ.. ప్రత్యేకమైన కేసుగా పరిగణించి ఓ మైనర్‌కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు ఫెడరల్ యుథనేషియా అధికారి ఒకరు వెల్లడించారు. బెల్జియంలో కారుణ్యమరణానికి సంబంధించిన చట్టాన్ని 2014లో మార్చారు. దీని ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా కారుణ్యమరణానికి అనుమతించొచ్చు. ఈ చట్టం ప్రకారం మైనర్‌కు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. నెదర్లండ్స్లో సైతం మైనర్లకు కారుణ్యమరణానికి అనుమతి ఉన్నప్పటికీ.. 12 సంవత్సరాలు పైబడినవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాగా.. మొదటిసారిగా బెల్జియం ఓ మైనర్‌కు కారుణ్యమరణానికి అనుమతించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ప్రత్యేకమైన కేసుగా భావించడంలో పరిగణలోకి తీసుకునే అంశాలేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
కిడ్నాప్ కేసులో యువకుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : మైనర్ బాలిక (13)ను పెళ్లి చేసుకుంటానని నిర్బంధించిన కేసులో జగన్నాథపురం గ్రామానికి చెందిన నూతంగి నాగబాబు (25) అనే యువకుడిని శనివారం ఎస్సై వి.చంద్రశేఖర్ అరెస్టు చేసినట్టు రూరల్ పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేశామన్నారు. -
లైంగిక దాడి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు
వరంగల్ లీగల్/కొత్తగూడ : లైంగిక దాడి కేసులో ఒకరికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధి స్తూ బుధవారం మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కేబీ నర్సింహులు తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడ మండలం బక్కచింతపల్లికి చెందిన ఓ గిరిజనుడు వరంగల్‌లో నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన కూతురు మైనర్ (16) చదువు మానేసి ఇంటివద్దనే ఉంటుంది. ఈ క్రమంలో 2014 సెప్టెంబర్ 19న ఆమె పశువులను మేపేందుకు ఇంటి సమీపంలోని పంట భూముల వద్దకు వెళ్లింది. ఈ సందర్భంగా ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన అదే గ్రామానికి చెందిన జర్పు ల లింగం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వచ్చిన బాలిక జరిగిన సంఘటనను తల్లికి వివరించింది. తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు కొత్తగూడ పోలీస్‌స్టేçÙ¯Œæలో ఫిర్యాదు చేశారు. కాగా, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు సాక్ష్యాధారాల ను పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు జర్పుల లింగంకు ఐపీసీ సెక్షన్ 354 (ఏ)(1) కింద మూడేళ్ల జైలు శిక్ష, రూ. రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి కేబీ నర్సింహులు తీర్పు వెల్లడించారు. ఇదిలా ఉండగా, సాక్షులను కానిస్టేబుల్ మ్యాడద రాజ్‌కుమార్ కోర్టులో ప్రవేశపెట్టగా.. లైజన్ ఆఫీసర్‌గా వి.భద్రునాయక్ విచారణను పర్యవేక్షించారు. ప్రాసిక్యూషన్ తరపున సీని యర్ పీపీ ఎండీ సర్దార్ వాదించారు. -
భార్య ఇంట్లో లేని సమయంలో..
బంజారాహిల్స్ (హైదరాబాద్) : భార్య పనికి వెళ్లిన సమయంలో తన ఇంట్లో అద్దెకు ఉండే బాలిక(15)ను బెదిరించి లోబర్చుకొని ఎనిమిది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని బీజేఆర్ నగర్లో నివసించే మన్నెల్లి ఆశీర్వాదం(52) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతని ఇంట్లో జయానంద్ కుటుంబం అద్దెకు ఉంటోంది. అతని కుమార్తె (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి ఆశీర్వాదం తన భార్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె నగ్న దృశ్యాలు సెల్ఫోన్లో తీసి బెదిరిస్తున్నాడు. అయితే ఇటీవల ఆశీర్వాదం భార్యకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆమె బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం అంగీకరించాడు. ఈ మేరకు అతనిపై ఐపీసీ సెక్షన్ 376(2), 506, ఫోక్స్ యాక్ట్ 5, 6 కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. -
మైనర్లు వాహనాలు నడిపితే జైలుకే..
హిమాయత్ నగర్ : తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇటీవల చిన్నారి రమ్య మృతిచెందడంతో పోలీసులు చట్టాలను కఠినతరం చేశారు. ట్రాఫిక్ కమిషనర్ ఆదేశాల మేరకు నారాయణగూడ ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని వైన్స్, బార్లు, పబ్‌లకు ఇన్స్పెక్టర్ బాలాజీ గురువారం నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారకుడైతే సంబంధిత బాలుడి తండ్రికి, వాహన యజమానులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదానికి కారుకుడైతే సెక్షన్ 337, ఇతని వల్ల వాహనదారులు గాయాలపాలైతే సెక్షన్ 338, చనిపోతే సెక్షన్ 304 పార్ట్-2కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు. తదనంతరం ఆ బాలుడికి 10 ఏళ్లు జైలు శిక్షపడుతుందన్నారు. 21ఏళ్ల లోపు మైనర్ ఎవరైనా లైసెన్స్ ఉన్నా, లేకుండా మద్యం సేవించి వాహనం నడిపితే సంబంధిత వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. మరి ముఖ్యంగా ఆ బాలుడికి మద్యం అమ్మిన వైన్, బార్, పబ్‌లకు లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఎక్సైజ్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. వారి నుంచి నివేదిక వచ్చిన అనంతరం సంబంధిత దుకాణంను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాలపై ఇప్పటికే తమ ఠాణా పరిధిలోని వైన్ షాపులు, పబ్‌లు, బార్ల యజమానులకు నోటీసులను జారీ చేశామన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలను ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తాగడానికి నకిలీ లైసెన్సు!
బంజారాహిల్స్: నకిలీ గుర్తింపు కార్డుతో ఒక యువకుడు బార్లోకి ప్రవేశించి మద్యం తాగుతుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -10లోని ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో నివసించే విశేష్ అగర్వాల్ (19) ఢిల్లీలోని ఓ ప్రభుత్వ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. వారం క్రితం నగరానికి వచ్చాడు. ఎక్సైజ్ పోలీసులు, పోలీసులు గత మూడు రోజుల నుంచి అన్ని పబ్‌లు, బార్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ 21 ఏళ్లలోపు యువకులకు ప్రవేశం కల్పించరాదంటూ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మంగళవారం రాత్రి విశేష్ అగర్వాల్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లోని గ్లోకల్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్‌ను చూపించి లోనికి వెళ్లాడు. ఆ డ్రైవింగ్ లైసెన్స్‌పై పుట్టిన సంవత్సరం 1994 అని ఉండటంతో బౌన్సర్లు అనుమతించారు. సరిగ్గా రాత్రి 10 గంటలకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తన సిబ్బందితో కలిసి గ్లోకల్ బార్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విశేష్ అగర్వాల్ వద్ద గుర్తింపు కార్డు తనిఖీ చేయగా దానిపై పుట్టిన సంవత్సరం 1997 అని ఉంది. ఎలా అనుమతించారని బార్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా 1994 పుట్టినతేదీతో డ్రైవింగ్ లైసెన్స్ చూపించాడని చెప్పగా పోలీసులు తనిఖీలు చేయగా అతడి వద్ద రెండు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నట్లు తేలింది. అసలు డ్రైవింగ్ లైసెన్స్‌పై ఉన్న 1997ను 1994గా మార్ఫింగ్ చేయించి నకిలీ ఐడీ కార్డుతో లోనికి ప్రవేశించినట్లు విశేష్ అగర్వాల్ ఒప్పుకొన్నాడు. మోసం చేసినందుకు అతనిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 468, 471 కింద కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేశారు. -
బాలిక కిడ్నాప్.. అత్యాచారం
- పురుగులమందు తాగించి.. తనూ తాగిన నిందితుడు శంషాబాద్ : బాలికను అపహరించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై ఆమెకు పురుగులమందు తాగించారు. అందులో ఓ నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి కాలనీ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీ పక్కనే ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల్లో నివాసముండే ఓ ఆటో డ్రైవర్ కుమార్తె (16) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే కాలనీలో నివాసముంటూ ఫిల్టర్ నీళ్లు ఆటోలో సరఫరా చేసే జంగయ్య అలియాస్ జంగ్లీ (21)తోపాటు మరో వ్యక్తి కలిసి శనివారం రాత్రి 7 గంటలకు ఆ బాలికను నమ్మించి, బైక్‌పై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన దుండగులు, అనంతం ఆమెకు పురుగులమందు తాగించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వీరి నుంచి తప్పించుకొని వచ్చిన సదరు బాలిక సమీపంలోని రాళ్లలో పడిపోయింది. ఉదయం 10 గంటలకు కట్టెల కోసం వెళ్లిన స్థానికులు ఆమెను గమనించి ఆరాతీశారు. మెల్లగా.. తన తండ్రి ఫోన్ నంబరు చెప్పిన ఆ బాలిక వెంటనే స్పృహ కోల్పోయింది. దీంతో వారు బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడడంతో.. ఆ గది పక్కనే స్పృహ కోల్పోయి ఉన్న జంగయ్య కనిపించాడు. భయంతో అతడు కూడా పురుగుల మందు తాగినట్టు గుర్తించిన పోలీసులు అతడిని కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జంగయ్య వెంట ఉన్న మరో వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు పరారీలో ఉన్నాడు. బాలికతోపాటు నిందితుడు కూడా స్పృహలోకి రాకపోవడంతో పోలీసులు పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
'డబ్బుకోసం ఏమైనా చేస్తా'
మాన్సా: డ్రగ్స్ బారినపడి కన్నతల్లిని హత్య చేశాడు ఓ మైనర్. మత్తుపదార్థాలకు బానిసగా మారిన అతడు డ్రగ్స్ కొనుగోలుచేసేందుకు డబ్బు ఇవ్వడానికి తల్లి నిరాకరించడంతో అతడు ఇంట్లోని లైసెన్స్డ్ తుపాకీతో కాల్చి చంపాడు. మైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, తుపాకీని కుమారుడికి అందుబాటులో ఉండేలా ఉంచినందుకు తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కలవారు చెప్పిన ప్రకారం పదహారేళ్లేకే డ్రగ్స్ బానిస అయిన ఆ కుర్రాడు డబ్బులు ఇవ్వాలని ప్రతిరోజు తన తల్లిని వేధించేవాడు. చేయి కూడా చేసుకునేవాడు. ఘర్షణపడని రోజే లేదంట. అంతేకాదు.. డబ్బుకోసం తాను ఎలాంటి దారుణాలైనా చేస్తానని గట్టిగా అరిచిమరి కన్నతల్లిపై కాల్పులు జరిపి కడతేర్చాడట. కడుపులో కాల్పులు జరిపిన అనంతరం పారిపోయి తిరిగి ఇంటికి రాగా పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కనీసం 25 ఏళ్లపాటు జైలు శిక్ష వేయాలని ఇరుగుపొరుగు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రేప్ కేసు పెట్టొద్దని ఫ్యామిలీని బంధించారు
బహ్రైచ్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. కేసు పెట్టొద్దంటూ బాధితురాలి కుటుంబాన్ని గదిలో బంధించాడు. ఈ వ్యవహారంలో గ్రామపెద్ద సదరు యువకుడికి అనుకూలంగా వ్యవహరించడం విశేషం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న బహ్రైచ్ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై షిబు(24) అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. కేసు పెట్టడానికి వెళ్తున్న వారిని షిబుతో పాటు గ్రామపెద్ద షబ్బాన్ బలవంతంగా ఆపటమే కాకుండా వారిని గదిలో బంధించి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం బాధితకుటుంబాన్ని విడిపించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడితో పాటు గ్రామపెద్దపై కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
కోడలిపై మామ అఘాయిత్యం
♦ పెళ్లయిన 20 రోజులకే.. ♦ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ♦ బాధితురాలు మైనర్ కామారెడ్డి : అందమైన జీవితంపై ఎన్నో ఆశలతో ఆమె మెట్టింట్లో అడుగు పెట్టింది. కళ్లల్లో పెట్టి చూసుకునే భర్త, తండ్రిలా చూసుకునే మామ ఉన్నారనుకొని మురిసిపోయింది. కానీ, ఆమె ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయి నెల రోజులు కూడా తిరగలేదు.. తండ్రిలా చూసుకోవాల్సిన మామ కట్టు తప్పాడు. కోడలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పైగా విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. కామారెడ్డి మండలంలోని దేవునిపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు మైనర్ అని తెలిసింది. ఎస్సై సంతోష్‌కుమార్ కథనం ప్రకారం.. దేవునిపల్లికి చెందిన మంగలి రాములు (50) కుమారుడి వివాహం ఏప్రిల్ 2న జరిగింది. సంతోషంగా మెట్టినింట్లో అడుగు పెట్టిన కోడలిపై రాములు కన్నేశాడు. ఏప్రిల్ 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయింది. అయితే, మామ వేధింపులు రోజురోజుకి ఎక్కువయ్యాయి. విసిగిపోయిన బాధితురాలు జరిగిన విషయాన్ని ఫోన్లో తన తల్లికి తెలిపింది. ఆమె గురువారం దేవునిపల్లి ఠాణాలో పిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
బాలిక కిడ్నాప్: యువకుడి రిమాండ్
చాంద్రాయణగుట్ట : మైనర్ బాలికను అపహరించిన ఘటనలో ఓ యువకుడిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన పర్వీన్ బాను కుమార్తె సనా బాను(16) ఇంటి వద్దే ఉంటుంది. కాగా వీరి ఇంటికి సమీపంలోనే ఉండే సుమేర్ అలీ బేగ్ (20) అనే యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఈ నెల 2వ తేదీన ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కర్నాటక గుల్బర్గకు తీసుకెళ్లాడు. ఈ విషయమై పర్వీన్ బాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను తల్లికి అప్పగించారు. -
ఆ క్రూరుడికి జీవితఖైదు
కల్బుర్గి: 14 ఏళ్ల బాలికను పదేళ్ల పాటు రేప్ చేసిన కిరాతకుడికి బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 5 వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. నేరస్తుడి ఆస్తులను జప్తు చేసి బాధితురాలికి రూ.5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. 2002లో ఆరుద్ పట్టణ ప్రైమరీ స్కూల్ చైర్మన్ గా ఉన్న మారుతి అమ్రేప్ప తారే ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారిని వేధించడం ప్రారంభించాడు. అప్పటికే ఇద్దరు బిడ్డలకు తండ్రయిన మారుతి చిన్నారిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను కోరగా వారు చదువు మాన్పించి, మంగుళూరులో చదువుకోవడానికి పంపేశారు. మంగుళూరు వెళ్లిన మారుతి ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి తన ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు. ఆయనను కూతురు కూడా ఇష్టపడుతుందేమోనని అనుకున్న తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు. అప్పటి నుంచి బాలిక తొమ్మిది సార్లు గర్భవతి అయిన ఆమెకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. తొమ్మిదో సారి వారి ఇద్దరికి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మారుతి బిడ్డను ఉదయగిరిలోని ఆశ్రమంలో వదిలేసి వచ్చాడు. 2012లో ఆమె మరలా గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. దాన్ని వ్యతిరేకించిన ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో తల్లిదండ్రులను ఆశ్రయించిన ఆమె ఆరుద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్ కుమార్ హంచాటే నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. -
బాలికపై అత్యాచారం
- నిందితుడిపై నిర్భయ చట్టం టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసిన సంఘటన టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి పంచాయతీలో గురువారం రాత్రి జరిగింది. బొమ్మనపల్లి పంచాయతీ బిల్లుడుతండా గ్రామానికి చెందిన బానోతు వీరన్న(20) అదే గ్రామానికి చెందిన బాలిక(15)పై గురువారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితరాలు ఫిర్యాదు మేరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మా ఆయన బెయిల్‌ను రద్దు చేయండి
న్యూఢిల్లీ: తన భర్తకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఓ మైనర్ బాలిక ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త, అతని కుటుంబ సభ్యులు తనను హింసిస్తున్నారని కోర్టుకు మొరపెట్టుకుంది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 2014లో ఓ యువకుడు బాధిత బాలిక (15)ను అత్యాచారం చేశాడు. ఆ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకే అదే ఏడాది సెప్టెంబర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ రాజీపడ్డారు. బెయిల్‌పై వచ్చిన నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన తర్వాత కట్నం కోసం తన భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. బాలిక మైనర్ అయినందున చట్టప్రకారం ఈ వివాహం చెల్లదని పేర్కొంది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. -
ఔను వాళ్లిద్దరూ.. ఒక్కటయ్యారు
► బీటెక్ అబ్బాయి.. బ్యూటీషియన్ అమ్మాయి ► వరుడు మైనర్ కావడంతో 8నెలల ఎడబాటు ► బస్తీపెద్దల సమక్షంలో మరోమారు పెళ్లి చిలకలగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వరుడు మైనర్ కావడంతో 8 నెలల ఎడబాటుకు గురయ్యారు. వరుడి తల్లితండ్రులు ప్రేమవివాహాన్ని అంగీకరించకపోవడంతో భర్త కనిపించడంలేదని భార్య ఫిర్యాదు చేసింది. ప్రేమజంట మేజర్లేనని తెలుసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వివరాలు.. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన బ్యూటీషియన్ కోర్సు చేసిన ఎం.మౌనిక (22) బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన పీ.ఆదర్శ్(21) బీటెక్ చదువుతున్నాడు. ఇరువురు ప్రేమించుకుని పెద్దలకు చెప్పకుండా గతేడాది ఆగస్ట్ 16వ తేదీన యాదగిరికొండ పాత నర్సింహస్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేశారు. వివాహానంతరం వారు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. సర్టిఫికెట్లు పరిశీలించిన పోలీసు లు వరుడు ఆదర్శ్ మైనర్ అని నిర్ధారించారు. మేజర్ అయ్యేందుకు ఇంకో మూడు నెలలు వ్యవధి ఉందని తేలింది. దీంతో పోలీసులు సూచన మేరకు నూతన దంపతులు ఎవరింటికి వాళ్లు వెల్లిపోయారు. 3 నెలల తర్వాత ఆదర్శ్‌ను కలిసేందుకు మౌనిక పలు ప్రయత్నాలు చేసినా నెరవేరలేదు. దీంతో వారం రోజుల క్రితం మౌనిక తన భర్త ఆదర్శ్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, వివాహం నాటి ఫొటోలు జతచేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆదివారం ఠాణా ప్రాంగణంలో ఆదర్శ్‌తో పాటు అతని కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదర్శ్ కుటుంబసభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. ఆదర్శ్ మాత్రం తాను ప్రస్తుతం మేజర్‌నని, మౌనికతోనే కలిసి ఉంటానని స్పష్టం చేశాడు. దీంతో బస్తీపెద్దలు ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయ ప్రాంగణంలో ప్రేమజంటకు మరోమారు వివాహం జరిపించారు. -
నాకు పెళ్లి ఇష్టంలేదు.. ప్లీజ్ ఆపండి
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొలవడ అనే గ్రామం ఉంది. ఆ ఊరి నుంచి శనివారం 17 ఏళ్ల అమ్మాయి 181 అభయం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి నిశ్చయించారని, ఈ నెల 18న పెళ్లిముహూర్తం ఖరారు చేశారని, తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి ఇష్టం లేదని, పెళ్లిని ఆపించి తనకు సాయం చేయాల్సిందిగా ఆ అమ్మాయి వేడుకోంది. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. తనకు ఇష్టంలేదని ఆమె ఎంత చెప్పినా ఎవరూ ఆమె మాట వినే పరిస్థితి లేదు. దీంతో ఆమె ఫిర్యాదు చేసింది. తన కుటుంబ సభ్యులతో కలసి ఉండేందుకు ఇష్టంలేదని చెప్పింది. 181అధికారులు, మహిళా పోలీసులతో కలసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. వీరు రాగానే కుటుంబ సభ్యులు మాటమార్చేశారు. ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. అధికారులు పెళ్లి ఆహ్వాన పత్రికలను గుర్తించారు. ఆ అమ్మాయి తన ఆవేదనను అధికారులకు చెప్పింది. పదో తరగతిలో 88.11 శాతం మార్కులు వచ్చాయి. కాలేజీకి వెళ్లి చదువుకోవాలని ఆశించింది. అయితే ఇంట్లో వాళ్లు చదువు మాన్పించారు. అయినా ఆ అమ్మాయి సొంతంగా చదువుకుంటూ ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఇంతలో ఇంట్లో వాళ్లు పెళ్లి నిశ్చయించారు. 181 అధికారులు, మహిళ పోలీసులు.. ఆ అమ్మాయి పెళ్లిని అడ్డుకున్నారు. బాల్యవివాహం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. మహిళ సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని అమ్మాయికి సూచించగా, తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటానని చెప్పింది. చివరకు అమ్మాయి కుటుంబ సభ్యులు దిగివచ్చారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం పెట్టబోమని అమ్మాయి తల్లిదండ్రులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆమె ఇష్టప్రకారం చదువుకునేందుకు అంగీకరించారు. దీంతో ఆ అమ్మాయి వ్యథ సుఖాంతమైంది. -
మైనర్ పై అత్యాచారం
హైదరాబాద్ : బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. 'ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా.. నీకో విషయం చెప్తాను' అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న బాలిక(12)పై అదే ప్రాంతంలో కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హరీష్(22) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఇంటి దగ్గర దించుతామని... బాలికపై గ్యాంగ్ రేప్
నల్లగొండ : చేసిందే దారుణమైన పని... అదేదో ఘనకార్యం అయినట్లు గొప్పలుచెప్పుకోవడంతో నీచమైన కార్యం వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..... నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొండ్రపోల్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17) ఈనెల 12న మఠంపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి రాత్రి 8 గంటలకు ఈదులగూడకు చేరుకుంది. ఆ సమయంలో ఇంటికి వెళ్లడానికి వాహనాలు ఏమి లేకపోవడంతో అక్కడే నిలుచుంది. ఆ విషయాని గమనించిన సదరు బాలిక పరిచయస్తులైన ముగ్గురు యువకులు ఇంటివద్ద దించుతాం అని నమ్మబలికి బైక్‌పై ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఏమి జరగలేదన్నట్లు బాలికను ఇంటి దగ్గర విడిచిపెట్టారు. అయితే ఈ ఘటన గురించి నిందితులు తమ కళాశాలలో గొప్పలు చెప్పుకుంటుండంటంతో పసిగట్టిన ఓ యువకుడు బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
బాలికను మూడో పెళ్లి చేసుకుని హింసించాడు
హత్నూర (మెదక్) : మాయమాటలు చెప్పి బాలికను మూడో పెళ్లి చేసుకుని చిత్రహింసలకు గురి చేసిన ఓ వ్యక్తితోపాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేసి శనివారం కోర్టుకు రిమాండ్‌కు పంపారు. నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం నాగారం పంచాయతీ కొడిప్యాకకు చెందిన బాలిక(16) తల్లి చనిపోగా తండ్రి ఎల్లాగౌడ్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. బాలిక తాత సంరక్షణలో ఉంటోంది. ఇదిలాఉండగా నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన దస్తాగౌడ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లయ్యాయి. భార్యలు, పిల్లలు ఉన్నారు. అయితే అతడు తాత సంరక్షణలో ఉన్న బాధిత బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను హైదరాబాద్‌లో ఉంచాడు. ఇళ్లలో పాచిపనులు చేయిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. దీంతో బాధితురాలు రెండు రోజుల క్రితం అక్కడి నుంచి తప్పించుకుని ఎస్పీ సుమతిని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దస్తాగౌడ్, అతని తల్లి గంగమ్మతోపాటు మరో మహిళను శనివారం అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేశారు. -
బాలికపై అత్యాచారం
రేగోడ్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాచకొండ రవీందర్ మంగళవారం ఆ ఘటన వివరాలు తెలిపారు. వాటి ప్రకారం.. గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన మొగులయ్య సోమవారం సాయంత్రం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాదితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో మంగళవారం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్‌పై సైనికాధికారుల కుమారులు లైంగిక దాడి
గూర్గావ్: హర్యానాలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. గూర్గావ్లో పదకొండేళ్ల బాలికపై మాజీ సైనిక అధికారుల కుమారులు లైంగిక దాడి పాల్పడ్డారు. ఆ లైంగిక దాడిని వీడియో తీసి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. తమకు డబ్బు, ఒంటిపై ఉన్న బంగారం ఇవ్వకుంటే వీడియో బయటపెడతామని బెదిరించారు. అందుకు ఆ మైనర్ బాలిక నిరాకరించగా కొట్టి బలవంతంగా లాక్కున్నారు. ఈ విషయాన్ని బాలిక పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ నిందితుల వివరాలు తెలియజేస్తూ వారు మాజీ సైనిక అధికారుల కుమారులు అని చెప్పారు. ఆ అధికారులు లెఫ్టినెంట్ కమాండర్లుగా భారత సైన్యంలో పనిచేశారని కూడా వివరించారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించి విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. -
కన్నకూతురి పై తండ్రి అకృత్యం
-
టీవీ నటిని బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోయాడు..
ముంబై: వర్ధమాన టీవీ నటి అశ్లీల ఫోటోలను చేజిక్కించుకొని, బ్లాక్మెయిల్ చేసిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఓ టీవీ నటిపై వేధింపులకు పాల్పడిన బాలుడిని బంగూర్ నగర్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం బుల్లితెరపై ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఓ నటిపై ముంబైలోని దహిసర్ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. పలు టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించిన సదరు నటి అశ్లీల ఫొటోలను చేజిక్కించుకున్న అతడిలో దుర్బుద్ధి మొదలైంది. వాటిని ఆమె వాట్సప్‌కు పంపి బెదిరించం మొదలు పెట్టాడు. ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ బ్యాంక్ అకౌంట్లో రూ. 5 లక్షలు జమ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన సదరు నటి బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దహిసర్ తూర్పు ప్రాంతంలో నిన్న ఉదయం అతడి ఆట కట్టించారు. గతంలో కూడా ఇదే తరహాలోనే మరో ముగ్గురు నటీమణులను కూడా ఇతగాడు వేధించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా జార్ఖండ్‌కు చెందిన ఈ మైనర్ మధ్యలోనే చదువు ఆపేసి ఉద్యోగ నిమిత్తం ముంబైకు వచ్చాడని పోలీసులు తెలిపారు. గత ఆరు నెలలుగా తన స్నేహితునితో కలిసి నల్లాసోపారా ప్రాంతంలో నివసిస్తున్నాడని, సదరు నటి ఫోటోలను ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా సైట్ల నుంచే హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. -
సెల్‌ఫోన్ చోరీ: జువైనల్ హోమ్‌కు బాలుడు
యాకుత్‌పురా (హైదరాబాద్) : పక్కింట్లో సెల్‌ఫోన్ దొంగిలించిన ఓ బాలుడిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం జువైనల్ హోమ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన బాలుడు (17) పక్కింట్లో ఉండే రుబీనా బేగం ఇంట్లో ఈ నెల 7న రూ.10 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయాన్ని వెల్లడించాడు. దాంతో బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
ఆగిన ‘మైనర్’ పెళ్లి
పుల్కల్: మరికొద్ది సేపట్లో జరగాల్సిన ఓ బాల్య వివాహాన్ని ఎస్ఐ సత్యనారాయణతో పాటు సీడీపీఓ ఎల్లయ్య అడ్డుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళనకు గురయ్యారు. వివాహ వయస్సు వచ్చాకే పెళ్లి జరిపిస్తామని రాత పూర్వకంగా తెలపడంతో వ్యవహారం సద్దుమణిగింది. చౌటకూర్‌లో బుధవారం జరిగిన సంఘటన వివరాలు... పుల్కల్ మండల పరిధిలోని చౌటకూర్‌కు చెందిన ఆకుల కిష్టయ్య రెవెన్యూ శాఖలో ఉద్యోగి. తన మూడో కుమార్తెను ఇటిక్యాల్‌కు చెందిన మన్నే ఆంజనేయులకు ఇచ్చి వివాహం జరిపించేందుకు బుధవారం ముహూర్తం నిర్ణయించారు. చౌటకూర్ జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో పెళ్లిపందిరి సైతం సిద్ధం చేశారు. కాగా, పెళ్లికుమార్తెకు 18 సంవత్సరాలు నిండలేదని గుర్తుతెలియని వ్యక్తులు 1098కు సమాచారం అందించారు. దీంతో జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ బాలయ్యతో పాటు పుల్కల్ ఎస్ఐ సత్యనారాయణ, ఆర్ఐ సుకుమారి.. వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహాలు నేరమని, జరిపితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దీంతో 18 ఏళ్లు నిండి న తర్వాతే పెళ్లిచేస్తామని వధూవరుల తరపు బంధువులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం పెళ్లికుమారుడు ఆంజనేయులుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీడీపీఓ బాలయ్య మాట్లాడుతూ.. ఇప్పుడు నిలిపిన పెళ్లిని తిరిగి ఎక్కడైనా జరిపితే వరుడితో పాటు సహకరించినవారిపైనా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. -
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ఈపూరు (గుంటూరు) : బాలికపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోడేపుడివారిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన బాలిక (16) వినుకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15 న పాఠశాల నుంచి బస్సులో తిరిగి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు పుస్తకాలు కొనిస్తానని బైక్ పై తీసుకెళ్లాడు.అతని మాటలు నమ్మిన విద్యార్థిని బైక్ ఎక్కింది. ఆ తర్వాత అతను వాహనాన్ని ఎక్కడా ఆపకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో తన ఇద్దరు మిత్రులు గోపి, మరియబాబులను కూడా తీసుకొని వెళ్లాడు. అటవీ ప్రాంతంలో బాలిక పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆమెను తీసుకొచ్చి బస్టాండ్‌లో వదిలేశాడు. ఈ విషయాన్ని బాలిక గుంటూరులో ఉండే తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదివారం రాత్రి ఈపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఆ మోసగాడు అరెస్టు..
అనంతగిరి(విశాఖపట్నం): మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని భీంపూర్ ఆశ్రమ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)ని అదే పాఠశాలలో వంట పని చేస్తున్న రవి(22) అనే యువకుడు మాయమాటలు చెప్పి లొంగతీసుకున్నాడు. ఈ క్రమంలో అమ్మాయిని గర్భవతిని చేసి తనకేం సంబంధం లేదని ముఖం చాటేశాడు. దీంతో బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. -
బాలికపై గ్యాంగ్ రేప్
డిండి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా డిండి మండలం కందుకూరు గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పొలం పనులకు వెళుతున్న బాలికను వెంబడించిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనిల్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. రమేష్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
మైదుకూరు : వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం బస్వాపురం గ్రామం సమీపంలో ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దునూరు గ్రామానికి చెందిన బాలికను బస్వాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున (18), మల్లేశ్వర్‌రెడ్డి (20) బుధవారం రాత్రి తమ వెంట తీసుకెళ్లారు. బస్వాపురం గ్రామ చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు
కంకిపాడు (విజయవాడ) : దుకాణానికి వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బామర్ల శివరామకృష్ణ ప్రాసద్(64) అనే వృద్ధుడు తన ఇంటి సమీపంలోని దుకాణంలో సరుకులు కొనడానికి వచ్చిన తొమ్మిదేళ్ల బాలికతో సోమవారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం
నాగోలు (హైదరాబాద్) : మానసిక పరిస్థితి సరిగా లేని ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్లపల్లికి చెందిన ఓ కుటుంబం 4 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చి హస్తినాపురం ఇంద్రప్రస్థకాలనీలో నివాసముంటున్నారు. తల్లి, అన్న, వదినతో పాటు ఓ బాలిక(16) నివాసముంటుంది. నెల రోజుల క్రితమే బాలిక గ్రామం నుంచి అన్న వద్దకు వచ్చింది. కుటుంబసభ్యులు స్థానికంగా ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. కాగా ఇదే కాలనీకి చెందిన ఆటోడ్రైవర్లు శివ, అనిల్‌లు బాలికపై కన్నేశారు. గతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లిన వీరిద్దరూ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలికను శివ, అనిల్‌లు బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని ఔటర్రింగురోడ్డు సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ నెల 28వ తేదీన బాలికను గుర్రంగూడలో ఫ్లైటెక్ ఏవియేషన్ కళాశాల వద్ద వదిలేశారు. అయితే అప్పటికే కుటుంబ సభ్యులు బాలిక కోసం పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. గుర్రంగూడ నుంచి ఆదిభట్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన మైనర్ బాలికను బంధువులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి బాలికను తీసుకొచ్చారు. బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్ శివ, అనిల్‌లను వెంటనే అరెస్ట్ చేసి కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తురన్నారు. వీరికి మరో యువకుడు సహకారం అందించినట్లు పోలీసులు తెలిపారు. -
బాలికపై అత్యాచారం
గుంటూరు : గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. లాలాపేటలోని యానాది కాలనీకి చెందిన ఓ బాలిక(15) బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం మధ్యాహ్నం బాధితురాలు తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మైనర్ పై ఆర్మీజవాను అత్యాచారయత్నం
హైదరాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో పదమూడేళ్ల మైనర్ బాలికపై ఓ ఆర్మీ జవాను అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆర్.కే.పురంలో నివాసం ఉండే పదమూడేళ్ల బాలిక స్థానికంగా ఉండే ఓ ఆర్మీ అధికారి వద్ద ఇంటి పనిచేస్తుంది. కాగా శనివారం రాత్రి పని ముగించుకుని, దారిలో ఓ దుకాణం వద్ద సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా.. సదరు ఆర్మీ అధికారి వద్దే విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాను ఆమెను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. వెంటే ఉన్న ఆమె చెల్లెలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆర్మీజవాను పరారయ్యాడు. విషయం తెలుసుకుని.. బాలికను తీసుకుని ఆర్మీ అధికారి ఇంటికి చేరుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు కలిసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యాచారయత్నానికి పాల్పడిన ఆ ఆర్మీ జవాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై అత్యాచారం
నర్మెట్ట (వరంగల్) : ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన బాలిక(16) ఇంటర్ రెండవ ఏడాది చదువుతుంది. బాలికకు దూరపు బంధువు అయిన మేకా రమేష్(22) ప్రేమ పేరుతో తరచుగా నర్మెట్ట వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే గత నెలలో బాలికను రంగారెడ్డి జిల్లా చిలుకూరు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన రమేష్ ఈ నెలలో మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు బాలిక పోలీసులకు తెలిపింది. -
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
కృష్ణా (విజయవాడ) : పదిహేనేళ్ల బాలికను మూడు రోజులపాటు గదిలో నిర్బంధించి ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని మాచవరం కార్మికనగర్ కొండ ప్రాంతానికి చెందిన బాలికను గుణదలకు చెందిన యువకులు మాయమాటలతో మభ్యపెట్టి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం విజయవాడలోని కార్మికనగర్ కొండ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవల భర్త చనిపోవడంతో ఇళ్లలో పనికి వెళ్లే బాలిక తల్లి.. తన పదిహేనేళ్ల కుమార్తెను చదువు మాన్పించి ఇంటి వద్దనే ఉంచింది. కాగా మంగళవారం గుణదల చర్చికి వెళ్లిన బాలికను పరిచయస్తుడైన యువకుడు బెత్లెహాంనగర్లోని తన రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆమెను సాయంత్రం వరకు తన వద్దనే ఉంచుకొని ఇంటి వద్ద దింపిన యువకుడు మరుసటి రోజు తిరిగి ఆమెను రూమ్‌కి రప్పించాడు. ఆపై తన నలుగురు స్నేహితులతో కలిసి జక్కంపూడిలోని ఖాళీగా ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. వారు చెప్పినట్టు చేసేందుకు బాలిక నిరాకరించడంతో కర్రతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన వీరు నేరుగా గుణదలలోని తమ గదికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమెను గదిలోనే నిర్బంధించి పదే పదే అత్యాచారం చేశారు. మరోపక్క కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లి తమ బంధువుల ఇళ్లకు వెళ్లి వెదుకులాట ప్రారంభించింది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను ఆ యువకులు శనివారం ఇంటి వద్ద దించి పరారవుతుండగా సమీపంలోని బంధువులు గమనించి ముగ్గురినీ పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించగా మరో ఇద్దరు పరారయ్యారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం నక్కలపాలెం గ్రామానికి చెందిన నిందితులు గుణదలలో గదులు అద్దెకు తీసుకొని ఉంటూ ప్రసాదంపాడులోని చాక్లెట్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. మాచవరం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..
బెంగళూరు: పొట్టకూటి కోసం వెళ్లిన 16 ఏళ్ల బాలికను లైంగిక బానిసగా మార్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వ్యాపార భాగస్వామి ఇంట్లో బేబీ సిట్టర్‌గా పని చేస్తున్న ఆమెపై పది నెలల పాటు లైంగికంగా దాడిచేసి అమానుషంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. ఈ విషయం బయటపెడితే పేస్తానని బెదిరించి సుమారు ఏడాది పాటు ఆ బాలికకు నరకాన్ని చూపించాడు. సహనం నశించిన ఆ బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల పేద కుటుంబాన్ని.. ఓ మహిళా వ్యాపారవేత్త 2014 ఏప్రిల్‌లో బెంగళూరుకు తీసుకొచ్చింది. ఫ్యాషన్ బిజినెస్ నడిపే ఆమె తన పిల్లలను చూసుకునేందుకు బాలికను పనిలో పెట్టుకోగా, తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులుగా పని చేసుకుంటున్నారు. వ్యాపార పనుల్లో భాగంగా ఆ మహిళా వ్యాపారవేత్త బెలగావ్కి మారుతూ తనతోపాటు ఆ బాలికను కూడా తీసుకెళ్లింది. అయితే ఆ మహిళకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న సుఖవిందర్ సింగ్ ... బాలికపై కన్నేశాడు. వ్యాపార భాగస్వామి ఇంట్లో లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా పది నెలలపాటు తన దురాగతాన్ని కొనసాగించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అతని హింసను తట్టుకోలేని ఆ బాలిక తనను ఇంటికి పంపించెయ్యమని చాలాసార్లు యజమానికి మొరపెట్టుకుంది. అయినా ఆమె పట్టించుకోలేదు. పైగా పిచ్చి పిచ్చి కథలు అల్లుతున్నావని మండిపడింది. అంతేకాకుండా దొంగతనం కేసు పెట్టి ఇరికిస్తానని బెదిరించింది. దీంతో ఎలాగోలా ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. బాలికను వేధిస్తున్న ఘటన తమ దృష్టికి రావడంతో బెలగావిలోని ఇంటిపై దాడిచేసి ఆమెను రక్షించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై ఐపీసీ5 (L) , పోస్కో చట్టం 376 లోని 6 తదితర సెక్షన్ల కింద నమోదు చేసినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, ప్రాథమిక దర్యాప్తు అనంతరం బెలగావి పోలీసులకు కేసును బదిలీ చేస్తామని తెలిపారు. -
తండ్రిని కొట్టి.. కూతుర్నెత్తుకెళ్లి అత్యాచారం.. హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బాలిక తన తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లి ఆటోలో వెళుతుండగా మధ్యలో అడ్డుకున్న నలుగురు వ్యక్తులు తండ్రిని బెదిరించి అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పాశవిక లైంగిక దాడి జరిపి అనంతరం ఆమె ప్రాణాలు చిదిమేశారు. తండ్రి ఫిర్యాదు చేయడంతో గాలింపులు జరిపిన పోలీసులు శుక్రవారం బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన జరగడానికి ఆటో డ్రైవర్ ప్రమేయం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. -
ప్రేమ పేరుతో నయవంచన
మైనర్‌పై మూడు నెలలుగా అత్యాచారం యువకుడి అరెస్ట్ బంజారాహిల్స్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. ఆపై బ్లాక్మెయిల్ చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడో ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నార్సింగ్‌లో నివసించే గుంటి మహేశ్ (25) ఆటో డ్రైవర్. ఫిలింనగర్ జ్ఞానిజైల్‌సింగ్ నగర్‌బస్తీకి చెందిన మైనర్(17)ను ఏడాది క్రితం నుంచి ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నార్సింగ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై తన మాట వినకుంటే విషయాన్ని అందరికి చెబుతానని బ్లాక్మెయిల్ చేస్తూ మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాధిత బాలిక తన తల్లికి విషయాన్ని తెలపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిందితుడికి పెళ్లయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్‌పై అత్యాచార యత్నం
నిందితుడు పంచాయతీ కార్యదర్శి పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు నిర్భయ చట్టం కింద కేసు నమోదు మాకవరపాలెం: మాయమాటలతో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యదర్శి చివరికి కటకటాలపాలయ్యాడు. ఇంటికి పిలిచి మోసగించేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాన్ని పసిగట్టిన బాలిక తప్పించుకుని విషయం తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండలం పెద్దిపాలెం పంచాయతీ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రామారావు తెలిపిన వివరాలు ఇవీ. పెద్దిపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావు స్థానికంగా నివాసముంటున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలికను తన ఇంటికి పిలిచాడు. ఆమెకు ఎగ్‌పఫ్ ఇచ్చి తినమన్నాడు. అనంతరం నిన్ను పట్నం తీసుకు వెళ్తానని ఆశచూపి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక తప్పించుకుని ఇంటికి పరుగుతీసింది. అన్నం కూడా తినకుండా రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. ఉదయం ఆమెను గమనించిన తండ్రి ఎందుకు ఏడుస్తున్నావంటూ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో కుమార్తెను తీసుకుని అతను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కార్యదర్శిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెద్దిపాలెంలో ఎస్ఐ విచారణ అత్యాచార యత్నంపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రామారావు పెద్దిపాలెంలో విచారణ నిర్వహించారు. కార్యదర్శి ఉంటున్న ఇంటితోపాటు బాలిక ఇంటి చుట్టు పక్కల వారిని పిలిచి విచారణ చేశారు. వారు చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
మైనర్‌పై లైంగికదాడి
నిందితుడి అరెస్ట్ తుర్కపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం తుర్కపల్లి: మైనర్‌పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తుర్కపల్లి మండలం వీరెడ్డిపల్లిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్ (17) ఈ నెల 11వ తేదీన బహిర్భూమికి వెళ్లగా అదే గ్రా మానికి చెందిన తాటికొండ నర్సింహులు అనుసరించాడు. బాలికకు మాయమాటలు చెప్పి కరీంనగర్ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ కొండగట్టు దేవాలయం వద్ద గదిని అద్దెకు తీసుకుని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ నెల 14వ తేదీన బాలికను యాదగిరిగుట్టలో వదిలేయడంతో ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే నిందితుడు నర్సింహులును అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ తెలిపారు. -
రేపుల రాజ్యం యూపీ!
ఉత్తరప్రదేశ్ రేపుల రాజ్యంగా మారుతోంది. మరో రెండు ఘోరమైన అత్యాచారాలు వెలుగు చూశాయి. రెండు కేసుల్లోనూ రక్షకులే భక్షకులయ్యారు. తొలి సంఘటన మైనర్ బాలికల రేపు, హత్యల ఘటనతో మే 28 నుంచి అట్టుడుకుతున్న బదాయూలోనే జరిగింది. ఒక మైనర్ బాలికను దుండగులు అపహరించి, నెలరోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెది ఇస్లామ్ పూర్. తనను మొదట ఎమ్మెల్యే డ్రైవర్, ఆ తరువాత బబ్రాల్ ఎమ్మెల్యే, సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ ఖిలాడీ యాదవ్ లు అత్యాచారం చేశారని ఆ బాలిక ఆరోపిస్తోంది. నెల రోజులుగా అమ్మాయి కనిపించకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఫలితంగా అమ్మాయిని దుండగులు విడిచిపెట్టారు. ఇక రెండో సంఘటనలో, పోలీస్ నిర్బంధంలో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్లిన ఒక మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా, పలువురు కానిస్టేబుళ్లు బలాత్కరించారు. ఈ సంఘటన హమీర్ పూర్ జిల్లా లోని సుమేర్ పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఎస్ హెచ్ ఓ అరెస్టయ్యారు. కానిస్టేబుళ్లు కాలికి బుద్ధి చెప్పారు. యూపీలో ప్రతి రోజూ కనీసం పది రేపు కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మీద యువ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కి రేపులు పెద్ద తలనొప్పిగా మారాయి. -
బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితులను అరెస్టు చేయండి
రాయచూరు, న్యూస్‌లైన్ : లింగసూగూరు తాలూకా రామదుర్గకు చెందిన మైనర్ బాలిక బసమ్మపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయడంలో హట్టి పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర రైతు సంఘం, వివిధ కార్మిక సంఘాల అధ్యక్షుడు ఆర్.మానసయ్య ఆరోపించారు. గురువారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. దట్టమైన అరణ్యంలో బసమ్మపై అదే గ్రామానికి చెందిన నాగప్ప లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. అనంతరం ఓ చెట్టుకు ఆ బాలికను వేలాడదీశారని వివరించారు. అన్నతో కలిసి గొర్రెలు కాయడానికి వెళ్లిన బాలిక సాయంత్రానికి శవమైందని,బాలికను వేలాడదీసిన చెట్టును అప్పటి ఎస్ఐ ప్రకాష్మాళె నరికేయించాడన్నారు. రాత్రికి రాత్రే పోస్టుమార్టం చేయడం వంటివి కేసు మూసివేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలకు బలం చేకూర్చుతాయన్నారు. బసమ్మ ఒక్కటే కాదు, ఆ ప్రాంతంలోని గౌడూరు తండా, నిలోగల్ ఆశాల తండ , కుప్పిగడ్డలలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. బసమ్మ కేసును మూసి వేసే ప్రయత్నాలకు స్వస్తి చెప్పి తక్షణమే నిజాయితీగల అధికారితో దర్యాప్తు చేయించి, నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో కరియప్ప, లింగప్ప, పరమేశ్ తదితరులున్నారు. -
తల్లి లేని బిడ్డకు తండ్రే సహజ సంరక్షకుడు
ముంబై: తల్లి చనిపోతే బాలుడికి తండ్రే సహజ సంరక్షకుడు అవుతాడని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లి లేకపోయినా లేదా చని పోయినా వారి పిల్లలపై తండ్రికి సహజంగానే హక్కులు ఏర్పడతాయని పేర్కొంది. అమోల్ పవార్ అనే వ్యక్తి తన రెండున్నరేళ్ల కుమారుడ్ని వెనక్కి ఇవ్వడానికి తన మామ ఒప్పుకోవడంలేదని ఆరోపిస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా కోర్టు పైవిధంగా స్పందిం చింది. వివరాలిలా ఉన్నాయి. అమోల్ పవార్‌కు, రమేష్ ధాత్రే కుమార్తెకు 2010 నవంబర్‌లో పెళ్లి జరిగింది. వారికి ఒక కుమారుడున్నాడు. కాగా, 2012 మార్చిలో ధాత్రే కుమార్తె కాలిన గాయాలతో మృతిచెందింది. ఆమెను భర్తే నిప్పం టించి చంపేశాడని ఆరోపిస్తూ ధాత్రే కోర్టుకెళ్లాడు.పోలీసులు నిందితుడైన అమోల్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశా రు. కాగా రెండున్నర సంవత్సరాల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఇన్నిరోజుల పాటు తాతతో ఉన్న తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని అమోల్ కోరగా ధాత్రే నిరాకరించాడు. దాంతో తన కుమారుడిని తనకు ఇప్పించాలని అమోల్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాడు. కే సు వాదోపవాదాలు విన్న తర్వాత బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.హర్దాస్, జస్టిస్ ఎ.ఎస్.గడ్కారీ మాట్లాడుతూ వెంటనే బాలుడిని తండ్రికి అప్పగించాలని తాతను ఆదేశించారు. -
మైనర్ బాలికపై వేధింపులు: నిందితులు అరెస్ట్
గుంటురు జిల్లా బాపట్లలోని పటేల్ నగర్లో మైనర్ బాలికపై ప్రేమ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. స్థానిక పటేల్ నగర్‌లోని మైనర్ బాలికను తమను ప్రేమించాలంటూ గత కొద్దికాలంగా గోపికృష్ణ, కొండరెడ్డిలు వేధిస్తున్నారు. ఆ క్రమంలో తమను ప్రేమించకుంటే ముఖంపై యాసిడ్ పోస్తామని వారిరువురు గురువారం మైనర్ బాలికను బెదిరించారు. దాంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు వెల్లడించింది. దీంతో వారు బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ మైనర్ బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గోపికృష్ణ, కొండారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిపై నిర్భయ కేసు నమోదు చేశారు. -
ముంబై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు మైనర్?
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున ఓ మీడియా ప్రతినిధిపై జరిగిన సామూహిక హత్యాచారం కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురిలో ప్రధాన నిందితుడు మైనర్ అనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని నిందితుడి కుటుంబసభ్యులు మీడియా ముందు వెల్లడించారు. నిందితుడు `చాంద్ బాబు సత్తార్ షేక్ అలియాస్ మహ్మద్ అబ్దుల్` అమ్మమ్మ సర్నాబాయ్ అతడిని మైనర్ గా పేర్కొంటూ జనన ధృవీకరణ పత్రాన్ని మీడియాకు సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే జనన ధృవీకరణ పత్రంలో అతని వయసు 1997 ఫిబ్రవరి 26గా నమోదైంది. కానీ పోలీసులు మాత్రం చాంద్ వయసు 19 ఏళ్లుగా చెబుతున్నారు. కేవలం నిందితుడిని రక్షించడానికి కుటుంబసభ్యులు తప్పుడు ధృవపత్రం సమర్పించారని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఆమె తమ మనవుడు మంచివాడని, అతనికి 16ఏళ్లే ఉంటాయని చెబుతోంది. దీనికి సంబంధించి తాను ఈ ధృవీకరణ పత్రాన్ని కోర్టులోచూపిస్తానంటోంది. జనన ధృవీకరణ పత్రాన్ని దిద్దారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్‌కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై మహాలక్ష్మి, లోయర్పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు చాంద్ మేజర్ అత్యాచారం చేసినట్టు రుజువైతే ఏడేళ్ళ నుంచి యావజ్జీవ శిక్ష వరకు పడవచ్చు.