
హోర్డింగ్‌పైకి ఎక్కి కూర్చున్న మైనర్
ఇండోర్ : ఇష్టమైన వాడితో పెళ్లి జరిపించకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఓ మైనర్ హోర్డింగ్‌పైకి ఎక్కి కూర్చుంది. ప్రియుడు వచ్చి బ్రతిమాలితే గానీ కిందకు దిగలేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని పర్‌దేశీ పురాకు చెందిన ఓ మైనర్ ఓ యువకుడిని ఇష్టపడింది. అతడ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే ఇందుకు ఆమె తల్లి ససేమీరా అంది. దీంతో ఆగ్రహించిన మైనర్ అక్కడికి దగ్గరలోని హోర్డింగ్‌పైకి ఎక్కింది. ( వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం )
నచ్చిన వాడితో పెళ్లి చేయకుంటే పైనుంచి కిందకు దూకి చస్తా! అంటూ బెదిరింపులకు దిగింది. తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ మూగిన జనం.. ఆఖరికి పోలీసులు కూడా బ్రతిమాలినా పట్టు వీడలేదు. మొబైల్ ఫోన్‌ను చూసుకుంటూ పైనే కూర్చుండిపోయింది. చివరకు మైనర్ ఇష్టపడుతున్న యువకుడు రంగంలోకి దిగక తప్పలేదు. అతడు అక్కడికి వచ్చి మైనర్‌కు నచ్చ చెప్పాడు. అతడి మాట విని బాలిక కిందకు దిగింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment