hording
-
Bihar: ‘టైగర్ జిందా హై’.. రబ్రీ ఇంటి ముందు హోర్డింగ్ కలకలం
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(RJD chief Lalu Yadav) మరోమారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ సమయంలో వందలాందిమంది ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు లాలూ విచారణకు నిరసనగా ఆందోళన చేపట్టారు. #WATCH | Bihar | Posters in support of RJD chief and former Bihar CM Lalu Yadav put up outside his residence in Patna The posters read, "Na jhuka hun, na jhukunga, Tiger abhi Zinda hai." pic.twitter.com/r3I9WJICd9— ANI (@ANI) March 20, 2025ఇదిలావుంటే ఇప్పుడు ఒక హోర్డింగ్(Hoarding) కలకలం సృష్టిస్తోంది. ఇది ఈడీ అధికారులను ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు. ఈ హోర్డింగ్‌ను లాలూ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఈ హోర్టింగ్పై ‘టైగర్ జిందా హై’(టైగర్ బతికేవుంది) అని రాసివుంది. అలాగే ‘నా ఝుకాహూ, నా ఝుకూంగా’ (తగ్గేదే లే) అని ఉంది. ఈ హోర్డింగ్‌లో ఒకవైపు లాలూ యాదవ్ ఫొటో ఉంది. మరోవైపు ఒక వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి కొందరు లాగుతున్నట్లు ఫొటోవుంది. ఆ ఫొటోలో వ్యక్తి లాలూ అని, అతనిని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు పీఎంఓ, ఆర్ఎస్ఎస్లు తాళ్లతో లాగుతున్నాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. లాలూ యాదవ్‌కు సంబంధించిన ఈ పోస్టర్‌ను ఆర్జేడీ నేతలు నిషాంత్ మండల్, రాజూ కోహ్లీ రూపొందించారు. ఈ హోర్డింగ్‌లో బీజేపీ దిగ్గజ నేతలను పోలిన చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాలూ యాదవ్ ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ఈ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ -
కూలిన హోర్డింగ్..సీఎం మమతా బెనర్జీ ప్రోగ్రాంలో అపశృతి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యే ఓ సాంస్కృతిక వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎంట్రన్స్ గేటు విరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలపై స్థానిక పోలీసు అధికారులు స్పందిస్తూ..అలీపూర్ ప్రాంతంలోని ధోనో ధన్యో ఆడిటోరియం ఎంట్రన్స్ గేటు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగ్రాతుల్ని సమీప ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పోలీసు అధికారులు..ఇది ప్రమాదమా లేక భద్రతా లోపమా అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనతో ఆడిటోరియం సమీపంలోని మరికొన్ని హోర్డింగ్‌లను తొలగించారు.VIDEO | Injuries reported after temporary gate collapses at West Bengal CM Mamata Banerjee's event in Kolkata. The event was organised by the Information and Cultural Affairs Department at Dhanadhanya Auditorium to mark the 44th death anniversary of legendary actor Uttam Kumar. pic.twitter.com/luQkQpmXQs— Press Trust of India (@PTI_News) July 24, 2024 ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ 44వ వర్ధంతిని పురస్కరించుకుని ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ ధోనో ధన్యో ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. -
ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
ముంబై: మహారాష్ట్ర రాజధానిలో ఇటీవల కుప్పకూలిన హోర్డింగ్ ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఘాట్కోపర్ వద్ద కూలిన బిల్ బోర్డ్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా శిథిలాలను తొలగిస్తుండగా మరో రెండు మృతుదేహాలు లభ్యమయ్యాయి. రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ మనోజ్ చన్సోరియా(60), ఆయన భార్య అనిత(59)గా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.కాగా ముంబైలోని ఘాట్కోపవర్ వద్ద ఈదురుగాలులతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంప్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 100 మంది హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఈ వృద్ధ దంపతులు కూడా ఉన్నారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.ముంబయి ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే మార్చిలో పదవీ విరమణ పొందారు. తర్వాత వారు ముంబైని వీడి, జబల్‌పుర్‌కు మారారు. వీసా పనుల నిమిత్తం వారు ముంబై వచ్చారు. పని పూర్తవడంతో జబల్‌పుర్‌కు తిరిగి ప్రయాణం చేస్తుండగా కారులో పెట్రోల్ కొట్టించేందుకు బంక్ వద్ద ఆగారు. ఆ సమయంలో హోర్డింగ్ రూపంలో మృత్యువు వారిని కబళించింది.అమెరికాలో నివసిస్తున్న వారి కుమారుడు తల్లిదండ్రులకు కాల్ చేయగా.. సమాధానం రాకపోవడంతో సాయం కోసం బంధువులను సంప్రదించాడు. వారు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయగా చివరి లోకేషన్ ఘాట్కోపర్ పెట్రోల్ పంప్ వద్ద చూపించింది.బందువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించగా.. దంపతుల మృతదేహాలు వెలుగుచూశాయి. శిథిలాల నుండి అన్ని మృతదేహాలను బయటకు తీయడంతో ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ 40x40 అడుగుల కంటే పెద్ద హోర్డింగ్‌లను అనుమతించనప్పటికీ, ఈ హోర్డింగ్ మూడు రెట్లు పెద్దది. 120x120 అడుగుల విస్తీర్ణం, 250 టన్నుల బరువు కలిగి ఉంది. బిల్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కేసు నమోదైంది. భిండేపై గతంలో అత్యాచారం సహా 20కి పైగా పోలీసు కేసులు ఉన్నట్లు తేలింది.కాగా పెట్రోల్ పంప్ మీద కూలిన హోర్డింగ్‌కు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈదురుగాలులతో పెట్రోల్ పంప్ ముందు నెమ్మదిగా వెళ్తున్న ఓ కారులోనుంచి ఈ వీడియో రికార్డ్ చేశారు. రోడ్డుపై భారీ వర్షం, గాలులు వీస్తుండగా కారులోని విండో నుంచి వీడియో తీశారు. ఇంధనం కోసం, వర్షం నుంచి తప్పించుకోవడానికి అనేక కార్లు, ట్రక్కులు, బైక్‌లు పెట్రోల్ పంపు వద్ద నిలిపి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో బిల్బోర్డ్ అమాంతం పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది. -
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్(చెక్ బౌన్స్) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్‌లు,బ్యానర్లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్కోపర్లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్ బోర్డ్ పక్కనే ఉ న్న పెట్రోల్ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
ముంబై, సాక్షి: ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్కోపర్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈదుర గాలుల ధాటికి 100 అడుగుల ఎత్తైన భారీ ఇనుప హోర్డింగ్ కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. వంద మంది దాకా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.Breaking : Death Toll in the Mumbai Hoarding collapse rises to 8. 30 still feared trapped. How is the crushing of 8 people , under a 100 ft hoarding , in India's financial capital NOT a news priority on Prime Time TV ? pic.twitter.com/G29jzn47IH— Shreya Dhoundial (@shreyadhoundial) May 13, 2024 #WATCH | Ghatkopar hoarding collapse incident | Latest visuals from the accident spot; rescue and search operation underway8 people have died and approximately 20-30 are trapped under the hoarding which collapsed in Maharashtra's Ghatkopar. pic.twitter.com/OFCajrg7iT— ANI (@ANI) May 13, 2024 సోమవారం సాయంత్రం 4గం.30 ప్రాంతంలో.. గాలుల ధాటికి ఘాట్కోపర్లోని సమతా నగర్లో భారీ హోర్డింగ్ కూలి రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీంలు రంగంలోకి దిగారు. 14 మంది మృతదేహాల్ని వెలికి తీశాయి. కూలిన హోర్డింగ్ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.#WATCH | Mumbai: The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. There were a total of 88 victims, out of which 74 were rescued injured: NDRF(Morning visuals of the rescue operations from the spot) pic.twitter.com/vggAIlfY3g— ANI (@ANI) May 14, 2024 ఇక దాదర్, కుర్లా, మాహిమ్, ఘాట్కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది.#WATCH | Ghatkopar hoarding collapse incident | Maharashtra CM Eknath Shinde says, "...Rescuing the people is our priority. Government will take care of the treatment of those who are injured in the incident. Rs 5 lakh will be given to the family of those who have lost their… pic.twitter.com/uMPQjJLQ90— ANI (@ANI) May 13, 2024 వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.ముంబయి విమానాశ్రయంలో దృగ్గోచరత పడిపోవడంతో గంటా ఆరు నిమిషాల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. సుమారు 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5.03 గంటలకు రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
చుక్కేసి.. హోర్డింగ్ ఎక్కేసి.. పైన పక్కేసి.. గురక పెట్టేసి..
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: తాగిన మైకంలో హోర్డింగ్ ఎక్కిన యువకుడు అక్కడే నిద్రపోయిన ఘటన నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ వద్ద చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన మేస్త్రీ పని చేసే రవీందర్ అలియాస్ రవి ఆదివారం మద్యం ఎక్కువ మోతాదులో తీసుకుని అక్కడే ఉన్న హోర్డింగ్ ఎక్కి నిద్రపోయాడు. హోర్డింగ్‌పై రవీందర్‌ను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు, మూడో టౌన్ పోలీసులు చేరుకున్నారు. వారి సూచన మేరకు స్థానికులు హోర్డింగ్ ఎక్కి రవీందర్‌ను కిందికి దింపారు. ఇవి చదవండి: 'వీఓఏ' కదా అని అందరూ నమ్మారు.. తిరిగి చూస్తే షాక్! -
నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయకుంటే చస్తా!
ఇండోర్ : ఇష్టమైన వాడితో పెళ్లి జరిపించకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఓ మైనర్ హోర్డింగ్పైకి ఎక్కి కూర్చుంది. ప్రియుడు వచ్చి బ్రతిమాలితే గానీ కిందకు దిగలేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని పర్దేశీ పురాకు చెందిన ఓ మైనర్ ఓ యువకుడిని ఇష్టపడింది. అతడ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే ఇందుకు ఆమె తల్లి ససేమీరా అంది. దీంతో ఆగ్రహించిన మైనర్ అక్కడికి దగ్గరలోని హోర్డింగ్పైకి ఎక్కింది. ( వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం ) నచ్చిన వాడితో పెళ్లి చేయకుంటే పైనుంచి కిందకు దూకి చస్తా! అంటూ బెదిరింపులకు దిగింది. తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ మూగిన జనం.. ఆఖరికి పోలీసులు కూడా బ్రతిమాలినా పట్టు వీడలేదు. మొబైల్ ఫోన్‌ను చూసుకుంటూ పైనే కూర్చుండిపోయింది. చివరకు మైనర్ ఇష్టపడుతున్న యువకుడు రంగంలోకి దిగక తప్పలేదు. అతడు అక్కడికి వచ్చి మైనర్‌కు నచ్చ చెప్పాడు. అతడి మాట విని బాలిక కిందకు దిగింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
హోర్డింగ్ మీద పడి యువతి మృతి
తూర్పుగోదావరి: కాకినాడలో హోర్డింగ్ కూలి పడి యువతి మరణించడంతో నగరంలోవిషాదం నెలకొంది. ఎస్ఆర్కే సెంటర్ జ్యోతుల మార్కెట్ వద్ద గల షాపింగ్ మాల్ పై ఉన్న హోర్డింగ్ హఠాత్తుగా కూలి అటుగా వస్తున్న యువతిపై పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. మృతురాలు కాకినాడ గ్రామీణం మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి శాంతి (20)గా గుర్తించారు. మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
హోర్డింగ్ ఎక్కి వ్యక్తి హల్చల్
మద్దిలిపాలెం : విశాఖ నగరంలోని మద్దిలిపాలెం బస్ డిపో వద్దనున్న హోర్డింగ్ ఎక్కి ఓ వ్యక్తి శనివారం హల్ చల్ చేస్తున్నాడు. పై నుంచి దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడు. సదరు వ్యక్తి నగరంలోని అరినోవా ప్రాంతానికి చెందిన రాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్స్ ను తెప్పించి రాజును కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కోఠిలో హోర్డింగ్ ఎక్కిన ఇద్దరు విద్యార్థులు
-
హోర్డింగ్ ఎక్కి విద్యార్థి జేఏసీ నేతల హల్చల్
హైదరాబాద్ : నగరంలోని ఓ హోర్డింగ్ పైకి ఎక్కి ఇద్దరు విద్యార్థి జేఏసీ నాయకులు హల్ చల్ చేశారు. చింతల విజయ్ రాజు, ఆనంద్ అనే ఇద్దరు జేఏసీ నేతలు శుక్రవారం ఉదయం కోఠి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా లోని హోర్టింగ్ పైకి ఎక్కారు. 'గత ప్రభుత్వం ఏపీఐఐసీ పేరిట సంస్థను ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించింది. పెట్టుబడి దారీ వ్యవస్థను అడ్డంపెట్టుకుని తెలంగాణ భూములను దోచుకున్నారు. పరిశ్రమల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి' అని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వారిని హోర్టింగ్ నుంచి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు.