కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యే ఓ సాంస్కృతిక వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎంట్రన్స్ గేటు విరిగిపడి పలువురికి గాయాలయ్యాయి.
ఈ ఘటనలపై స్థానిక పోలీసు అధికారులు స్పందిస్తూ..అలీపూర్ ప్రాంతంలోని ధోనో ధన్యో ఆడిటోరియం ఎంట్రన్స్ గేటు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగ్రాతుల్ని సమీప ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పోలీసు అధికారులు..ఇది ప్రమాదమా లేక భద్రతా లోపమా అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనతో ఆడిటోరియం సమీపంలోని మరికొన్ని హోర్డింగ్‌లను తొలగించారు.
VIDEO | Injuries reported after temporary gate collapses at West Bengal CM Mamata Banerjee's event in Kolkata.
The event was organised by the Information and Cultural Affairs Department at Dhanadhanya Auditorium to mark the 44th death anniversary of legendary actor Uttam Kumar. pic.twitter.com/luQkQpmXQs— Press Trust of India (@PTI_News) July 24, 2024
ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ 44వ వర్ధంతిని పురస్కరించుకుని ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ ధోనో ధన్యో ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment