mamatha benargee
-
పశ్చిమ బెంగాల్లో టీవీ ఛానెల్స్ బహిష్కరించిన దీదీ సర్కార్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో మూడు టీవీ ఛానెల్స్‌పై సీఎం మమతా బెనర్జీ నిషేధం విధించారు.అభయ ఘటన అనంతరం జరగుతున్న పరిణామలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా పలు టీవీ ఛానెల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎవరు సదరు ఛానెల్స్ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంలాంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు.Statement in connection with the recent media developments pic.twitter.com/e5qvjd4oBm— All India Trinamool Congress (@AITCofficial) September 1, 2024కేంద్రం బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ..టీవీ ప్రమోటర్లు ఈడీ,సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ జమీందార్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారిని అర్ధం చేసుకున్నామని ఎద్దేవా చేశారు. ఈ మేరకు దీదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.టీవీ చర్చలో రచ్చకొద్ది రోజుల క్రితం ఏబీపీ ఆనంద టీవీలో చర్చ జరిగింది. ఆ చర్చలో అభయ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్.. బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ దస్తిదార్.. ఎమ్మెల్యే అగ్ని మిత్ర పాల్‌ను ‘శారీ మేకర్’ అంటూ వ్యాఖ్యానించారు. అందుకు నా వృత్తిపై నాకు గర్వంగా ఉందన్న అగ్నిమిత్ర పాల్.. మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తోందని, మహిళల కష్టాలను పట్టించుకోదని ఆరోపించారు. చివరగా శారీ మేకర్ వ్యాఖ్యలపై ఎంపీ దస్తిదార్, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దస్తిదార్ క్షమాపణలు చెప్పి వివాదానికి పులిస్టాప్ పెట్టారు. తాజా పరిణామాలతో దీదీ పశ్చిమ బెంగాల్లో మూడు టీవీ ఛానెల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారంగా ప్రకటన చేశారు. -
ఆర్జీ కార్ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
కోల్‌కతా: ఆర్జీకార్ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రజలు, వైద్యులు, న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రతిపక్షాలు సైతం దీదీ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఆ డిమాండ్‌పై టీఎంసీ నేతలు బీజేపీది పితృస్వామ్య పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీదీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణాలు జరిగినప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘ బీజేపీ నేతలు ముఖ్య మంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో చాలా దారుణాలే జరిగాయి. కానీ పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీనే ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు’ అని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రశ్నించారు. బీజేపీదీ పితృస్వామ్య పాలన ఇలాగే ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ-ఏబీవీపీ పన్నాగం పన్నాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న అనుమానితులు కాల్పులు జరిపేందుకు కుట్రపన్నారు. పరీక్షల సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయమంటే చేస్తారా? అని భట్టాచార్య ప్రశ్నించారు. రాబందు రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుంది’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీఎంసీ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ స్పందించింది. ర్యాలీలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది. తమ పార్టీ సభ్యులు ఏదైనా నిరసనలకు హాజరైతే, అది వారి వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. -
నమ్మకం కోల్పోయాం.. దీదీపై బాధిత కుటుంబం ఆగ్రహం
కోల్‌కతా: అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తండ్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు. తమ కుమార్తె హత్య పట్ల మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.మమతవైఖరిని బాధితురాలి తల్లి సైతం తప్పుపట్టారు. వైద్యుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. కాగా, హత్యకు గురైన వైద్యురాలి పేరు, గుర్తింపును బయటపెట్టడంతోపాటు ఈ ఘటనపై ప్రజల్లో వదంతులు వ్యాప్తి చేసినందుకు బీజేపీ మాజీ ఎంపీ లాకెట్ చటర్జీతోపాటు మరో ఇద్దరు డాక్టర్లు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామికి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. -
Mamata Banerjee: ఘోరంగా అవమానించారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/పటా్న: నీతి ఆయోగ్ సమావేశం రాజకీయ దుమారానికి కారణంగా మారింది. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన ఈ భేటీలో తనకు ఘోర అవమానం జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండిపడ్డారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భేటీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలో, ఆ తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇతర సీఎంలకు 10 నుంచి 20 నిమిషాలు సమయమిచ్చి తనకు మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు. ‘‘కేంద్రంపై పెద్దగా ఆశలు లేకపోయినా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో భేటీకి వచ్చా. విపక్ష పాలిత రాష్ట్రాల నుంచి హాజరైన ఏకైక సీఎంను నేనే. ఆంధ్రప్రదేశ్ సీఎంకు 20 నిమిషాలిచ్చారు. గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్ తదితర సీఎంలకు కూడా 10 నుంచి 12 నిమిషాల దాకా ఇచ్చారు. నన్ను మాత్రం ఐదు నిమిషాల కంటే మాట్లాడనివ్వలేదు. పైగా ఆ ఐదు నిమిషాల్లోనూ పదేపదే బెల్లు కొడుతూ దారుణంగా అవమానించారు. భేటీని పర్యవేక్షించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పదేపదే బెల్లు కొట్టారు. పక్కనే కూర్చున్న మోదీ, కేంద్ర హోం మంత్రి సూచన మేరకే ఆయనలా చేశారు. దీనికి నిరసనగా వాకౌట్ చేశా’’ అని వివరించారు. ఇకపై నీతి ఆయోగ్ భేటీలకు ఎప్పటికీ హాజరు కాబోనని ప్రకటించారు. మైక్ కట్ చేయలేదు: నిర్మల మమత ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆమెకు కేటాయించిన సమయం మేరకు పూర్తిగా మాట్లాడారని పేర్కొంది. ‘‘నిజానికి అక్షరక్రమంలో మమత లంచ్ అనంతరం మాట్లాడాల్సింది. కానీ ఆమె అర్జెంటుగా కోల్‌కతా తిరిగి వెళ్లాల్సి ఉందన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతకుముందే ఏడో వక్తగా అవకాశమిచ్చాం. మమతకు కేటాయించిన సమయం పూర్తయిందని కేవలం అందరి ముందూ ఉన్న స్క్రీన్లపై కని్పంచింది. అంతే తప్ప టైం అయిపోయిందంటూ ఎవరూ బెల్ కూడా మోగించలేదు’’ అని వివరణ ఇచి్చంది. మమత పూర్తి సమయం మేరకు మాట్లాడారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మధ్యలో మైక్ కట్ చేయడం నిజం కాదు. ఎవరెంతసేపు మాట్లాడుతున్నదీ మా ముందున్న స్క్రీన్లపై కనిపిస్తూనే ఉంది. కొందరు సీఎంలు కేటాయించిన సమయం కన్నా ఎక్కువగా మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు అదనపు సమయం కేటాయించాం. అంతే తప్ప ఎవరికీ, ముఖ్యంగా బెంగాల్ సీఎంకు మైకు కట్ చేయలేదు’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్రానిది రాజకీయ వివక్ష విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం దారుణమైన రాజకీయ వివక్ష కనబరుస్తోందని మమత ఆరోపించారు. ‘‘ఈ వివక్ష కేంద్ర బడ్జెట్లో కూడా కొట్టొచి్చనట్టు కని్పంచింది. ఈ వైనాన్ని భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే లేవనెత్తా. వారికి కొన్ని రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటే ఉండొచ్చు. వాటికి ఎక్కువ నిధులు కేటాయించడంపైనా నాకు అభ్యంతరం లేదు. కానీ బెంగాల్ తదితర రాష్ట్రాలపై మాత్రం ఎందుకిలా వివక్ష చూపు తున్నారని ప్రశ్నించా. దీనిపై సమీక్ష జరగాలని డిమాండ్ చేశా. అన్ని రాష్ట్రాల తరఫునా భేటీలో మాట్లాడా’’ అని తెలిపారు. ‘‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలూ లేవు. దానికి అధికారాలన్నా ఇవ్వాలి. లేదంటే ప్రణాళిక సంఘాన్నే పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఉపాధి హామీ వంటి పలు కీలక కేంద్ర పథకాల అమలును బెంగాల్లో మూడేళ్లుగా నిలిపేయడాన్ని భేటీలో ప్రస్తావించా. స్వపక్షం, విపక్షాల మధ్య కేంద్రం ఇలా వివక్ష చూపుతుంటే దేశం ఎలా నడుస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అందరి మేలూ పట్టించుకోవాలి’’ అన్నారు. అధికార, విపక్షాల పరస్పర విమర్శలు కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు మమతకు సంఘీభావం ప్రకటించాయి. విపక్ష నేత అ న్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ముఖ్యమంత్రినే ఇంతగా అవమానించడం దారుణమని మండిపడ్డాయి. దీన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేమని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్టాలిన్ (తమిళనాడు) సహా విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచి్చంది. కేవలం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచేందుకే ముందుగా నిర్ణయించుకుని మరీ మమత ఇలా వాకౌట్ చేశారని కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్, ప్రహ్లాద్ జోషీ తదితరులు విమర్శించారు. బెంగాల్ పీసీసీ చీఫ్ అ«దీర్ రంజన్ చౌధరి మాత్రం మమత కావాలనే డ్రామా చేశారంటూ కొట్టిపారేయడం విశేషం.‘‘సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ అంటే ఇదేనా? సీఎంతో ప్రవర్తించే తీరిదేనా? మన ప్రజాస్వామ్యంలో విపక్షాలు కూడా అంతర్గత భాగమని కేంద్రంలోని బీజేపీ సర్కారు అర్థం చేసుకోవాలి. శత్రువుల్లా చూడటం ఇకనైనా మానుకుంటే మంచిది’’ – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‘‘మన దేశంలో పతాక శీర్షికలకు ఎక్కడం చాలా తేలిక. ఏకైక నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ఏకైక విపక్ష సీఎం నేనే అని ముందుగా చెప్పాలి. బయటికొచ్చి, ‘నా మైక్ కట్ చేశారు. అందుకే బాయ్‌కాట్ చేశా’ అని చెప్పాలి. ఇక రోజంతా టీవీలు దీన్నే చూపిస్తాయి. పని చేయాల్సిన, చర్చించాల్సిన అవసరం లేదు. ఇదీ దీదీ తీరు!’’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ -
కూలిన హోర్డింగ్..సీఎం మమతా బెనర్జీ ప్రోగ్రాంలో అపశృతి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యే ఓ సాంస్కృతిక వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎంట్రన్స్ గేటు విరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలపై స్థానిక పోలీసు అధికారులు స్పందిస్తూ..అలీపూర్ ప్రాంతంలోని ధోనో ధన్యో ఆడిటోరియం ఎంట్రన్స్ గేటు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగ్రాతుల్ని సమీప ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పోలీసు అధికారులు..ఇది ప్రమాదమా లేక భద్రతా లోపమా అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనతో ఆడిటోరియం సమీపంలోని మరికొన్ని హోర్డింగ్‌లను తొలగించారు.VIDEO | Injuries reported after temporary gate collapses at West Bengal CM Mamata Banerjee's event in Kolkata. The event was organised by the Information and Cultural Affairs Department at Dhanadhanya Auditorium to mark the 44th death anniversary of legendary actor Uttam Kumar. pic.twitter.com/luQkQpmXQs— Press Trust of India (@PTI_News) July 24, 2024 ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ 44వ వర్ధంతిని పురస్కరించుకుని ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ ధోనో ధన్యో ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. -
కేంద్ర బృందాల దర్యాప్తు.. శ్వేత పత్రం విడుదల చేయాలని దీదీ డిమాండ్
కోల్‌కతా : కేంద్ర బృందాలు జరిపిన దర్యాప్తుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అధికార పార్టీ టీఎంసీ అవినీతి చేసిందంటూ ప్రధాని మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి జిల్లా మొయినాగురిలో దీదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో అవినీతి ఆరోపణలంటూ రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు కేంద్రం 300 కేంద్ర బృందాలను పంపింది. కానీ వారు ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేదని దుయ్యబట్టారు. ఉపాధి హామి నిధులు ఏమయ్యాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపై ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలు ఉపాధి హామీ పథకం కింద పనిచేశారు. కానీ డబ్బులు చెల్లించ లేదని.. ఆ పథకం నిధులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే ‘బెంగాలీ వ్యతిరేక పార్టీ’ బీజేపీ ‘బెంగాలీ వ్యతిరేక పార్టీ’ అని అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) ముసుగులో గిరిజనులు, దళితులు, ఓబీసలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు .బెంగాల్లో ఎన్ఆర్సీని అనుమతించబోమని ఆమె తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీతో పోరాడుతున్నది టీఎంసీ మాత్రమేనన్న మమతా.. సీపీఎం, కాంగ్రెస్‌లు మాత్రం కమలం గెలుపు కోసం కలిసి పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌ని కాపాడాలంటే టీఎంసీ గెలవాలని సీఎం మమతా బెనర్జీ ఓటర్లను కోరారు. -
బీజేపీకి అనుకూలంగా ఈసీ: మమత
కూచ్ బెహార్/అలీపూర్‌ద్వార్: ఎన్నికల కమిషన్(ఈసీ) కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. ముర్షిదాబాద్ డీఐజీని ఈసీ తొలగించడం వెనుక బీజేపీ హస్తముందన్నారు. ఎన్నికల వేళ ముర్షిదాబాద్, మాల్దాల్లో ఒక్క హింసాత్మక ఘటన జరిగినా ఈసీదే బాధ్యతని ఆమె హెచ్చరించారు. అవసరమైతే ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరశన దీక్ష చేపడతానని హెచ్చరించారు. గతంలో సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దర్యాప్తు విభాగాలను కేంద్రం టీఎంసీపైకి ఉసిగొల్పుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపుతామంటూ బీజేపీ బెదిరిస్తోందంటూ ఆమె..‘ఎలా పోరాడాలో నాకు తెలుసు, నేనేమీ పిరికిదాన్ని కాదు’అని మమత వ్యాఖ్యానించారు. -
Lok sabha elections 2024: బెంగోల్ కొట్టేదెవరో?
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగాల్ బెబ్బులి మమత దెబ్బకు రాష్ట్రంలో 34 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు తెరపడటమే గాక కాంగ్రెస్ ప్రాభవమూ కొడిగట్టింది. ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేస్తూ బీజేపీ క్రమంగా బెంగాల్లో పాగా వేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 సీట్లను కొల్లగొట్టి మమతకు పక్కలో బల్లెంలా మారింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ 77 సీట్లతో సత్తా చాటింది. కొంతకాలంగా రాష్ట్రం తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికగా మారిపోయింది. బెంగాల్లో ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ తృణమూల్ అధినేత్రి మమత అన్నట్టుగా సాగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి... స్టేట్‌స్కాన్ 42 స్థానాలతో లోక్‌సభ సీట్లపరంగా దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది జాతీయ పారీ్టలను ఊరించే విషయం. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య, సోమ్‌నాథ్ చటర్జీ వంటి ఉద్ధండులను అందించిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం లోక్‌సభలోనూ, బెంగాల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది! గత ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరుతో పరిశీలకులే నోరెళ్లబెట్టారు. రాష్ట్రంలో ఎన్నడూ రెండు స్థానాలు దాటని కమలనాథులు. మొత్తం స్థానాల్లోనూ పోటీ చేసి ఏకంగా 18 సీట్లలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. దాంతో తృణమూల్ 34 నుంచి 22 సీట్లకు పడిపోయింది. ఈ ట్విస్టులకు తోడు సంక్లిష్ట రాజకీయాలకు, ఎన్నికల హింసకు పెట్టింది పేరైన బెంగాల్లో ఈసారి కూడా పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. తృణమూల్‌కు సవాల్... అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌కు గత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నువ్వానేనా అనేంతగా సవాల్ విసింది. 2014తో పోలిస్తే దీదీ ఏకంగా 12 సీట్లను కోల్పోయారు. కాషాయదళం 18 సీట్లను ఎగరేసుకుపోయింది. ఇరు పారీ్టల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే! కానీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి భిన్న ఫలితాలొచ్చాయి. తృణమూల్ ఏకంగా 215 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. కాకపోతే బీజేపీ బలం 3 అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా 77 స్థానాలకు ఎగబాకింది. దాంతో కాంగ్రెస్, లెఫ్ట్ పారీ్టలే ప్రధానంగా నష్టపోయి పూర్తిగా సున్నా చుట్టాయి. 2016లో 44 సీట్లు సాధించిన కాంగ్రెస్, 32 సీట్లు నెగ్గిన లెఫ్ట్ పారీ్టలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది! అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలం 4 నుంచి 2 సీట్లకు పడిపోయింది. లెఫ్ట్ ఉన్న 2 సీట్లనూ కోల్పోయింది. ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోరాడుతున్న మమత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుండటం విశేషం. మోదీ సర్కారు తమ పారీ్టపై, రాష్ట్రంపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. తమ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ హిందుత్వ నినాదం నేపథ్యంలో ముస్లిం ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకునేలా ప్రయతి్నస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు వంటి అ్రస్తాలను మోదీపై ఎక్కుపెడుతున్నారు. బీజేపీ పై చేయి సాధించేనా? పశ్చిమబెంగాల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథుల్లో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఫుల్ జోష్ నింపాయి. రాష్ట్రంలో 2 స్థానాలకు మించి ఎప్పుడూ గెలవని బీజేపీకి ఏకంగా 18 సీట్లు దక్కాయి. కాషాయదళం కేంద్రంలో తొలిసారి 300 సీట్ల మైలురాయిని అధిగమించడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తృణమూల్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచి్చంది. 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇదే జోరుతో ఈసారి మరిన్ని లోక్‌సభ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ వ్యూహం. బెంగాలీ హిందూ ఓట్లపై కమలం పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. అయోధ్య రామమందిర కల సాకారం, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. మమతా ప్రభుత్వ అవినీతి, విపక్షాలపై తృణమూల్ గూండాయిజం, దాడులను కూడా లేవనెత్తుతోంది. మమత ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, త్రిముఖ పోరు నెలకొంది. ఇండియా కూటమికి తృణమూల్ మొండిచెయ్యి, కాంగ్రెస్, లెఫ్ట్ నిరీ్వర్యమవడం తమకు కలిసొస్తుందనేది కమలనాథుల అంచనా. గత ఎన్నికల్లో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సాధించిన గణనీయ విజయాలను మిగతా చోట్లా రిపీట్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలు ఇన్ఫ్రా, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ భారీగా నిధులు విదల్చడం దీనిలో భాగమే. మెజారిటీ స్థానాలతో దీదీపై పైచేయి సాధించాలని కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో మోదీ కూడా బెంగాల్‌పై ఫోకస్ పెంచారు. సర్వేలు ఏమంటున్నాయి... బెంగాల్లో పోటీ బీజేపీ, తృణమూల్ మధ్యేనని, ఇతర పారీ్టలది ప్రేక్షక పాత్రేనని సర్వేలు చెబుతున్నాయి. టీఎంసీ ఈసారి కూడా 21–22 సీట్లను దక్కించుకోవచ్చని పలు సర్వేలు లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 19–20 స్థానాలు రావచ్చంటున్నాయి. అంటే 2019 కంటే కాస్త మెరుగుపడనుంది. కాంగ్రెస్ రెండు సీట్లలో ఒకటి కోల్పోవచ్చని అంచనా. సీఏఏ గేమ్ చేంజర్..! కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఈ ఎన్నికల్లో బెంగాల్లో బాగా ప్రభావం చూపేలా ఉంది. బెంగాల్ విభజన తర్వాత బంగ్లాదేశ్ నుండి భారీగా వలస వచి్చన దళిత ప్రాబల్య మథువా సామాజిక వర్గం దశాబ్దాలుగా పౌరసత్వం కోరుతూనే ఉంది. సీఏఏ నేపథ్యంలో వారంతా గంపగుత్తగా బీజేపీకి జై కొట్టేలా కని్పస్తున్నారు. వీరు ఉత్తర 24 పరగణాలు, నాదియా, మాల్దాతో పాటు పలు ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. సీఏఏ నుంచి ముస్లింలను మినహాయించడం తెలిసిందే. బంగ్లా నుంచి ముస్లింల వలసలకు మమత సర్కారు గేట్లెత్తేసిందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. మరోవైపు సీఏఏను మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఎన్నికల లబ్ధి కోసం తెచి్చన ఈ చట్టం అమలును బెంగాల్లో అడ్డుకుని తీరతానంటున్నారు. అవినీతికి లైసెన్స్, దోపిడీకి ఫ్రీ పాస్ కావాలని తృణమూల్ సర్కారు కోరుకుంటోంది. రాష్ట్రంలో టీఎంసీ సిండికేట్ రాజ్ నడుస్తోంది. అందుకే దోపిడీలకు, అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై విచారణ కోసం వచి్చన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై టీఎంసీ దాడులు చేయిస్తోంది. –జల్పాయ్గురి సభలో ప్రధాని మోదీ జూన్ 4న ఎన్నికల ఫలితాలొచ్చాక విపక్ష నేతలందరినీ జైలుకు పంపుతామంటూ మోదీ బెదిరిస్తున్నారు. ఒక ప్రధాని అనాల్సిన మాటలేనా ఇవి! కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి చాలామంది నేతలను బీజేపీ ఇప్పటికే జైల్లో పెట్టింది. మొత్తం హిందుస్థాన్నే జైలుగా మార్చేసింది. సీబీఐ, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీ సోదరులు. ఐటీ, ఈడీ ఆ పారీ్టకి నిధులు సమీకరించే సంస్థలు. మీకు గెలిచే సత్తా, నమ్మకముంటే మా నాయకులను అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? ఈ ఎన్నికల తర్వాత కూడా బెంగాల్లో ఉండేది మా ప్రభుత్వమే. మేం తలచుకుంటే మీ నాయకులందరినీ ఊచలు లెక్కపెట్టిస్తాం. – కృష్ణనగర్ ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha elections 2024: తృణమూల్ ఒంటరి పోరు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం తమ అభ్యర్థులను ప్రకటించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు తేల్చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం జరిగినా అది ఉత్తదేనని స్పష్టమైంది. ఈసారి ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను తృణమూల్ పక్కనపెట్టింది. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌తోపాటు తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించిన రచనా బెనర్జీ వంటి కొత్తముఖాలకు అవకాశం కలి్పంచింది. 2022 ఉప ఎన్నికలో అసన్సోల్ నుంచి గెలిచిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాకు మరోసారి టికెటిచ్చారు. బసీర్హాత్లో సినీ నటి, సిట్టింగ్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను తప్పించి మాజీ ఎంపీ హజీ నూరుల్ ఇస్లాంను బరిలో దించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సందేశ్‌ఖాలీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. 23 మంది సిట్టింగుల్లో 16 మందికి టికెట్లు దక్కాయి. ఇద్దరు రాష్ట్ర మంత్రులు సహా 9 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ బరిలో దిగబోతున్నారు. గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన వివాదాస్పద ఎంపీ మహువా మొయిత్రాకు టికెట్ లభించింది. కృష్ణనగర్ నుంచే ఆమె మళ్లీ బరిలో దిగుతున్నారు. ఇక బహ్రాంంపూర్ నుంచి ఐదుసార్లు నెగ్గిన కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై యూసుఫ్ పఠాన్ బరిలో దిగుతున్నారు. మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బర్దమాన్–దుర్గాపూర్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. టికెట్లు రాని నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కలి్పస్తామని తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఆదివారం కోల్‌కతాలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, బీజేపీతోపాటు కాంగ్రెస్, సీపీఎం కూడా ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రెండు సీట్లే ఇస్తామని మమత గతంలో ఆఫర్ చేయడం, దానిపై ఆ పార్టీ స్పందించకపోవడం తెలిసిందే. మోదీకి భయపడే: కాంగ్రెస్ బెంగాల్లో ఏకపక్షంగా మొత్తం లోక్‌సభ స్థానాలకూ తృణమూల్ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఇది ఏకపక్ష పోకడ అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. మమత బీజేపీకి సరెండరయ్యారని కాంగ్రెస్ ఎంపీ అ«దీర్ రంజన్ చౌధరి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ మళ్లీ ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తారోనని భయపడే విపక్ష ఇండియా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. మరోవైపు, తృణమూల్ జాబితా తమ పార్టీ మాజీలతో, బెంగాలేతరులతో నిండిపోయిందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. -
టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనా మా చేసినట్లు చెప్పారు. రాజకీయాలు తనకు ఇష్టం లేని అంశమని చెప్పారు. జాదవ్‌పూర్ నుంచి మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికైన మిమి గురువారం టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. ఈ నెల 13వ తేదీనే పదవికి రాజీనామా లేఖను పంపినట్లు అనంతరం తెలిపారు. తనకు రాజకీయాలు పడవని అనుభవం ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. అయితే, రాజీనామాను సీఎం మమత అంగీకరించిందీ లేనిదీ మిమి తెలుపలేదు. టీఎంసీ అంగీకరించాక నిబంధనల మేరకు లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖను అందజేస్తానన్నారు. మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుంది. -
Mamata Banerjee: జమిలి ఎన్నికలను అంగీకరించం
కోల్‌కతా: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని తాము అంగీకరించబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. మన దేశ సమాఖ్య నిర్మాణం ప్రకారం ’ఒక దేశం– ఒకే ఎన్నిక’ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల విధానం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితేన్ చంద్రకు ఈ మేరకు మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ అంశాన్ని హేతుబద్ధతతో పరిశీలించాలని ఆమె ఎన్నిల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘జమిలి ఎన్నికల యోచన సమాఖ్య నిర్మాణ కోణంలో చూస్తే సాధ్యం కాదు, ఆమోద యోగ్యం కాదు. సరైన విధానం కూడా కాదు. అందుకే, నేను ఈ విధానాన్ని ఆచరణాత్మక కోణంలో అంగీకరించను. ఈ అంశాన్ని చాలా చాలా హేతుబద్ధంగా ప్రత్యేకంగా పరిశీలించాలని కూడా భారత ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాను’అని ఆమె గురువారం సెక్రటేరియట్ వద్ద విలేకరుల సమావేశంలో అన్నారు. ‘ఇది కేవలం టీఎంసీ అభిప్రాయం మాత్రమే కాదు, ఇండియా కూటమి పార్టీలది కూడా. ఈ యోచనను పరిశీలించేటప్పుడు కేంద్ర, రాష్ట్ర విధానాలు, కేంద్రం, రాష్ట్ర నిర్మాణాలు వంటి వాటిని కూడా చూడాలి’అని ఆమె పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. -
‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది.. ఆమె గెలిచి వస్తుంది’
ఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ క్రమంలో సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపీలందరూ ఆమెకు మద్దతుగా సభ నుంచి వాకౌట్ చేశారు. #WATCH | "This is vendetta politics of BJP. They killed democracy....It is injustice. Mahua will win the battle. The people will give justice. They (BJP) will be defeated in the next election," says TMC chairperson Mamata Banerjee. pic.twitter.com/Y88F8YhNwK — ANI (@ANI) December 8, 2023 ఇక ఈ వ్యహారంపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీవి ప్రతీకార రాజకీయాలని మండిపడ్డారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని దుయ్యబట్టారు. బీజేపీ తమ పార్టీ ఎంపీపై వ్యవహరించిన తీరు చాలా అన్యాయమని అన్నారు. మహువా మెయిత్రా మళ్లీ గెలిచి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో తనకు ప్రజలు న్యాయం చేస్తారని చెప్పారు. బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తుందని మండిపడ్డారు. -
కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే..
బెంగళూరు: కాంగ్రెస్ కూటమి సమావేశానికి హాజరైన ప్రతిపక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది మరోవ్యూహం. బెంగాళ్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో ఫైట్ చేయడానికి దీదీకి జాతీయ స్థాయిలో ఒక కూటమి అవసరం. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం తానే అని మమతా ప్రొజెక్టు చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. దీదీకి పీఠంపై కన్ను.. బెంగాల్లో లోక్‌సభ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తే తాను ప్రతిపక్షాల తరుపున ప్రధాని రేస్‌లో ఉంటానని మమత అనుకుంటున్నారు. ప్రస్తుతం బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. కేవలం నాలుగైదు జిల్లాల్లోనే ఉన్న కాంగ్రెస్‌తో తనకు ప్రమాదం లేదని మమత భావిస్తోంది. అందుకే కాంగ్రెస్‌తో కూటమిలో చేరితే అటు ముస్లిం ఓట్లను సాధించడంతో పాటు లెఫ్ట్ పార్టీలను ఒంటరి చేయవచ్చనేది దీదీ ప్లాన్. పెద్దన్నది పెద్ద ప్లానే.. ఇక ఎవరి వ్యూహాలు వారికి ఉంటే కాంగ్రెస్ మాత్రం అందరికి మించిన ప్లాన్ వేసింది. కర్ణాటక గెలుపుతో వచ్చిన పాజిటివ్ వేవ్‌కు తోడుగా కూటమిని ఏర్పాటు చేస్తే బలం మరింత పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి ద్వారా తాము బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నామని ప్రజలను నమ్మించడం కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఎవరితో ఎన్ని విభేధాలున్నా.. కాంగ్రెస్ ఇప్పుడు కూటమి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కూటమితో మరోసారి జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టగలమని క్యాడర్‌కు ధైర్యం ఇస్తే .. రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పనికొస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. టార్గెట్ 2024 లోక్‌సభ ఎన్నికలని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అసలు లక్ష్యం మాత్రం 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని సుస్పష్టం. అందుకే కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. ఐక్యత అనేది అసాధ్యమని తేలిపోతోంది. -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర
కోల్‌కతా: ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆరోపించారు. 24 పరగణ జిల్లాలో శనివారం ఆమె పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముస్లిం ఓట్లను చీల్చే బీజేపీ కుట్రలో పావులుగా మారొద్దని రాష్ట్రంలోని ముస్లింలకు మమత పిలుపునిచ్చారు. ‘బీజేపీ మద్దతుతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక పార్టీ, బెంగాల్లో ఆ పార్టీ మిత్రపక్షమైన మరో పార్టీ ముస్లిం ఓట్లను చీల్చాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి కుయుక్తులను తిప్పికొట్టండి’ అని ఆమె పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం, అబ్బాస్ సిద్ధిఖీల ఐఎస్ఎఫ్లను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో మమత చేసిన ఇదే తరహా వ్యాఖ్యలను ఎంఐఎం, ఐఎస్ఎఫ్ ఇప్పటికే తోసిపుచ్చాయి. ఐఎస్ఎఫ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. మతం పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని హిందువులను కూడా మమత కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. మీ ప్రాంతాల్లో బయటివారు కనిపిస్తే వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను హిందుత్వాన్ని విశ్వసించే వ్యక్తినని మమత మరోసారి గుర్తు చేశారు. దళితుల ఇళ్లల్లో ఆ భోజనం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటు న్నారని, అయితే ఆ భోజనాన్ని ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి తెప్పించుకుంటు న్నారని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను బ్రాహ్మణ మహిళను అని, అయితే, తనకు అన్ని సమయాల్లో సహాయకారిగా ఉండి, వంట చేసి పెట్టేది ఒక ఎస్సీ మహిళ అని వివరించారు. వీడియోపై వివాదం మమత వీల్ చెయిర్లో కూర్చుని గాయమైన తన కాలును పైకి, కిందకు కదిలిస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సానుభూతి ద్వారా ఓట్లు పొందాలని మమత ఈ డ్రామాలు చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని టీఎంసీ బదులిచ్చింది. -
చర్చలకు సీఎం ఆసుపత్రికి రావాలి
న్యూఢిల్లీ/కోల్‌కతా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమకు రక్షణ కల్పించాలని వైద్యులు, జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైద్యులను బుజ్జగించేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తమ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రే స్వయంగా కోల్‌కతాలోని నీల్‌రతన్ సిర్కర్(ఎన్ఆర్ఎస్) వైద్యకళాశాలకు రావాలని కోరారు. ‘సీఎంతో సమావేశానికి మా ప్రతినిధులను పంపడం లేదు. ఎందుకంటే వారి భద్రత విషయంలో మాకు భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి మా వైద్యుడిపై ఓ రోగి బంధువులు దాడి చేసిన ఎన్ఆర్ఎస్ ఆసుపత్రికి సీఎంను ఆహ్వానిస్తున్నాం’ అని ఓ డాక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంవైపు నుంచి ప్రయత్నాలు నిజాయితీగా సాగడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బెంగాల్లో 300 మందికిపైగా డాక్టర్లు రాజీనామా చేశారు. వీరికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు సంఘీభావం తెలియజేశారు. కేంద్రం ఆందోళన.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ హింస, డాక్టర్ల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు ఘటనలపై వేర్వేరుగా నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘మాకు అందిన నివేదికల ప్రకారం 2016లో పశ్చిమబెంగాల్లో 509 హింసాత్మక ఘటనలు నమోదుకాగా, 2018 నాటికి ఆ సంఖ్య 1,035కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏకంగా 773 హింసాత్మక ఘటనలు జరిగాయి. అదేసమయంలో ఇలాంటి దుర్ఘటనల్లో చనిపోయినవారి సంఖ్య 2018 నాటికి అది 96కు పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 26 మంది హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని కేంద్ర హోంశాఖ తెలిపింది. బెంగాల్లో హింసను అరికట్టడానికి ఏమేం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ప్రత్యేక చట్టం రూపొందించండి.. ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టాలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాలకు సూచిస్తూ లేఖ రాశారు ఈ లేఖకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రూపొందించిన ‘వైద్యసేవల సిబ్బంది, వైద్యసంస్థల రక్షణ ముసాయిదా బిల్లు–2017’ను జతచేశారు. భారత వైద్యులు ప్రపంచంలోనే అత్యున్నత నిపుణులుగా గుర్తింపు పొందారనీ, వారు తీవ్రమైన ఒత్తిడిలో, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. విధుల్లో చేరండి: మమత పశ్చిమబెంగాల్లో ఆందోళన చేస్తున్న వైద్యుల అన్ని డిమాండ్లను అంగీకరిస్తున్నామని, అవసరమైతే ఇంకా మరిన్ని డిమాండ్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం మమత చెప్పారు. ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ‘వైద్యులు, జూనియర్ డాక్టర్లు గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవల చట్టం(ఎస్మా)ను ప్రయోగించలేదు. చర్యలు తీసుకోవడం ద్వారా జూనియర్ డాక్టర్ల కెరీర్‌ను నాశనం చేయాలని మేం భావించడం లేదు. వైద్యులతో శుక్రవారం చర్చించేందుకు నేను 5 గంటలు ఎదురుచూశా. శనివారం నా అధికారిక కార్యక్రమాలు అన్నింటిని రద్దుచేసుకున్నా.ఒకవేళ నాతో చర్చించడం ఇష్టం లేకపోతే గవర్నర్ లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా పోలీస్ కమిషనర్‌తో నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు’ అని స్పష్టం చేశారు. -
బెంగాల్లో వేడెక్కిన రాజకీయం
కోల్‌కతా/బశీర్హట్/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది, వ్యతిరేక గళం విన్పించేది ఒక్క తానేనని, ఈ నేపథ్యంలో తన గొంతు నొక్కాలని ఆ పార్టీ భావిస్తోందని అన్నారు. తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర విజయవంతం కాదని చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బెంగాల్లో హింసను ప్రేరేపించేందుకు కేంద్రం, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వివిధ సామాజిక మాధ్యమ వెబ్సైట్ల ద్వారా తప్పుడు వార్తలు వ్యాపింపజేసేందుకు కోట్లకు కోట్ల డబ్బును వ్యయం చేస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లినా, దాడులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉంటుందో కేంద్రానికి కూడా అంతే సమాన బాధ్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కేంద్ర హోం శాఖ సలహా ఇవ్వడం.. అప్రజాస్వామిక, అనైతిక, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లో బీజేపీ చేస్తున్న పకడ్బందీ కుట్రగా టీఎంసీ సెక్రటరీ జనరల్, బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అభివర్ణించారు. ఈ మేరకు మంత్రి అమిత్ షాకు సోమవారం లేఖ రాశారు. నిజానిజాలేమిటో పరిశీలించకుండానే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక తీసుకోకుండానే కేంద్ర హోంశాఖ ఓ నిర్ధారణకు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, హోం శాఖ తన సలహాను తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా టీఎంసీ ఆరోపణలు ఆధార రహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. బీజేపీ నిరసన ర్యాలీలు శనివారం ఘర్షణలు జరిగిన బశీర్హట్ (సందేశ్‌ఖలి) ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ కార్యకర్తల హత్యను, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి నిరసనగా బీజేపీ 24 పరగణాల జిల్లాల బశీర్హట్ సబ్ డివిజన్లో బ్లాక్ డేతో పాటు 12 గంటల షట్‌డౌన్ పాటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మోదీతో గవర్నర్ భేటీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వివరించినట్లు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తెలిపారు. భేటీ వివరాలు వెల్లడించలేనని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై తన సమావేశాల్లో చర్చించలేదని స్పష్టం చేశారు. -
నీతి ఆయోగ్ భేటీ వృథా
కోల్‌కతా: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతిఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగ. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఈ వ్యవస్థ కంటే అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను బలోపేతం చేయడం అవసరం. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమతౌల్యాన్ని తగ్గించేలా నిధులు కేటాయించే అధికారాన్ని నీతి ఆయోగ్‌కు ఇవ్వాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కూడా సుప్రీంకోర్టులోని కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘జడ్జీల ఎంపిక కోసం సుప్రీంకోర్టులో కొలీజియం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఎన్నికల సంఘంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు. -
మమతకు అసెంబ్లీ గండం
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దీదీ కోటలో బీజేపీ బలం పుంజుకోవడమే కాక క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుంటోందని, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటోందని వెల్లడిస్తున్నాయి. తాజా ఫలితాలను విశ్లేషిస్తే 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించిందని తేలింది. 22 సీట్లు దక్కించుకున్న తృణమూల్ 164 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీన్ని బట్టి 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అగ్ని పరీక్షేనని, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఈ సారి ఓట్ల శాతం 43.3కు పెరిగినా సీట్లు తగ్గడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో17 శాతం ఓట్లతో 2 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 40.2శాతం ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించడంతో ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగాయి. రాజధాని ,చుట్టుపక్కల ఉన్న ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో( కోల్‌కతా సౌత్, నార్త్, జాదవ్‌పూర్, బరసాత్, డమ్‌డమ్) తృణమూల్ ఎంపీలే ఉన్నారు. వీటి పరిధిలో 35 శాసన సభ స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో వీటిలో ఐదు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పై చేయి సాధించారు. రాష్ట్ర మంత్రులు సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ,సుజిత్‌బోస్, జ్యోతిప్రియలు తమ సొంత నియోజకవర్గాల్లోనే తృణమూల్‌కు మెజారిటీ తీసుకురాలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మమత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉందని పలువురు తృణమూల్ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.దాంతో బూత్ స్థాయి నుంచి ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుడుతోంది.నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.డజనుకు పైగా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో తృణమూల్ బాగా వెనకబడి ఉందని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ తృణమూల్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ ఒకవైపు బలపడుతోంటే, అంతర్గత కలహాలు, నేతల విభేదాలు తృణమూల్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. కొందరు బహిరంగంగానే మమతపై ధ్వజమెత్తుతోంటే, మరికొందరు లోపాయికారీగా ప్రత్యర్థులకు సహకరించడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
రంగస్థలంలో హేమాహేమీలు
ఆరో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ విడత ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ఒకరిపై మరొకరు ఆధిక్యం సాధించడానికి మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ మరీ ఓటర్లను ఆకర్షించడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం మరో దశ ఎన్నికలు మాత్రమే ఉండడంతో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఇతర ప్రధాన పార్టీలూ అన్ని అస్త్ర శస్త్రాలను బయటకు తీశాయి. ఈసారి ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీ రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతిపరుడని ఆరోపించడం, 1984 సిక్కు అల్లర్లను ప్రస్తావించడంతో ప్రచారం హద్దులు మీరింది. నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న మోదీ, అమిత్ షాలు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రచారం నిర్వహించారు. ఈసారి బరిలో ఎందరో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలుగా మారిన క్రీడాకారులు, నటులు, గాయకులు, వారసులు, కోట్లకు పడగలెత్తిన వాళ్లు, నేరచరితులు ఇలా ఎందరో ఉన్నారు. ధనబలం, కండబలం ఉన్నవారిదే ఎన్నికల్లో పై చేయి అని స్పష్టంగా తెలుస్తోంది. -
రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు
బంకురా/పురూలియా/అజాంగఢ్/అలహాబాద్: ప్రధానిగా తనను అంగీకరించబోనని చెప్పడం ద్వారా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రధానిగా గుర్తించని మమత.. ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రధానిగా గుర్తించడాన్ని గౌరవంగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మమత భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని స్పష్టం చేశారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, మమతా బెనర్జీతో పాటు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మీ చెంపదెబ్బలే నాకు దీవెనలు.. మమతా బెనర్జీ వాడుతున్న భాషను చూస్తేనే ఆమె ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థమవుతుందని మోదీ తెలిపారు. ‘మమతా దీదీ నన్ను చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్లు విన్నాను. నేను మిమ్మల్ని(మమత) అమితంగా గౌరవిస్తున్నా. దీదీ(అక్కా) అని పిలుస్తున్నా. కాబట్టి మీరు కొట్టే చెంపదెబ్బలు నాకు దీవెనల వంటివి. మమతా బెనర్జీకి నిజంగా ధైర్యముంటే ముందుగా బెంగాల్లో చిట్‌ఫంట్ నిర్వాహకులు, ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారి చెంపలు వాయించాలి. అప్పుడే టీఎంసీ అంటే తృణమూల్ దోపిడీదారుల(టోలాబాజ్) పన్ను అనే అపప్రద తొలగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ చెంపదెబ్బలతో పాటు తనను రాళ్లతో కొట్టడం గురించి మాట్లాడుతున్నారని మోదీ విమర్శించారు. ప్రతిపక్షాల దూషణలు తనకు అలవాటు అయిపోయాయనీ, ప్రపంచంలోని డిక్షనరీలన్నింటిలో ఉన్న తిట్లను కూడా అరిగించుకునే శక్తి వచ్చిందని చెప్పారు. ‘ఉపాధి’ కూలీలనూ వదిలిపెట్టలేదు.. పశ్చిమబెంగాల్లో పేరుకే టీఎంసీ ప్రభుత్వం నడుస్తోందనీ, అసలు వ్యవహారాలన్నింటిని తెరవెనుక సిండికేట్ నడిపిస్తోందని మోదీ ఆరోపించారు. ‘ఈ దోపిడీదారుల కారణంగా రాష్ట్రంలోని టీచర్ల నుంచి మేధావుల వరకూ, వ్యాపారుల నుంచి నిరుపేదల వరకూ అందరూ వేధింపులు ఎదుర్కొంటున్నారు. వీరు చివరికి జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కూలీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ కార్మికుల జాబ్‌కార్డులను కూడా లాక్కుంటున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించేందుకు కేంద్రం భారీగా నిధులను అందజేస్తుంటే వాటిని కూడా ఈ దోపిడీదారులు లూటీ చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత తన అధికార దాహంతో పశ్చిమబెంగాల్‌ను సర్వనాశనం చేశారనీ, ఇప్పుడు అధికారాన్ని కోల్పోతానన్న భయంతో మరింత నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. కిచిడీ కూటమికి ఓటేస్తే అంతే.. విపక్షాలు ఏర్పాటుచేసిన మహాకూటమికి ఓటేస్తే దేశభద్రత ప్రమాదంలో పడుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ కిచిడీ కూటమికి ఓటేస్తే దేశంలో అరాచకత్వం, అస్థిరత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బీజేపీ అధికారంలోని రాకముందు ఉగ్రదాడులు అనగానే అజాంగఢ్(యూపీ) పేరు వినిపించేది. ఎందుకంటే ఉగ్రమూకలకు సాయంచేసే వ్యక్తులకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నేతల ఆశీస్సులు ఉండేవి. వీరు అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి కులం, మతం, జాతి వంటి అంశాలను పరిశీలించేవారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉగ్రవాదాన్ని జమ్మూకశ్మీర్, సరిహద్దులోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగాం. ఈ సరికొత్త భారతం ఉగ్రవాదులను వారి ఇళ్లలో దూరి హతమారుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. కాళీమాతకు భయపడండి టీఎంసీ నేతల అకృత్యాలపై తాను మాట్లాడితే మమతా బెనర్జీకి కోపం వస్తోందని మోదీ అన్నారు. కానీ తాను ఈ కోపానికి భయపడబోననీ, ఎందుకంటే 130 కోట్ల మంది భారతీయుల ప్రేమ తనతో ఉందని వ్యాఖ్యానించారు. ‘పశ్చిమబెంగాల్లో చిట్‌ఫండ్ మోసాల కారణంగా సర్వస్వం కోల్పోయిన పేదలు, నిరుద్యోగ యువకులు ఆగ్రహించడంపై మమత భయపడాలి. దుర్గామాత భక్తులు పూజ చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల కాళీమాత ఆగ్రహిస్తుందని మమత భయపడాలి. టీఎంసీ నేతలు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ద్వారా యథేచ్ఛగా సంపాదిస్తున్నారు. కానీ కార్మికులకు మాత్రం కనీస వేతనం చెల్లించడం లేదు’ అని ప్రధాని విమర్శించారు. ఓవైపు మమత తన మేనల్లుడి రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు మంత్రులు, టీఎంసీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారనీ, ఆ పార్టీ కార్యకర్తలు బలవంతపు వసూళ్లకు దిగుతున్నారన్నారు. ఫొని తుపాను సందర్భంగా తాను ఫోన్‌చేసినప్పటికీ మమత స్పందించలేదన్నారు. మే 23తో బెంగాల్లో మమత పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు. -
పార్లమెంట్‌పైనా ప్రభావం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో సీబీఐ, పోలీసు శాఖల మధ్య తలెత్తిన వివాదం ప్రభావం సోమవారం పార్లమెంట్ కార్యకలాపాలపై పడింది. మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చేపట్టిన ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. అయితే, ఆ రాష్ట్రంలోని అసాధారణ పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్య తీసుకునే కేంద్రానికి అధికారం ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షం మూకుమ్మడి దాడి రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని లోక్‌సభలో టీఎంసీ సహా ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేయగా..ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉందంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ డిమాండ్‌ను తిరస్కరించారు. అనంతరం టీఎంసీ నేత సౌగత రాయ్ మాట్లాడుతూ.. ‘పశ్చిమబెంగాల్లో రాజకీయంగా పాగా వేసేందుకు కేంద్రం సీబీఐని వాడుకుంటోంది. ఇలాంటి ప్రయత్నాలను మేం తీవ్రంగా ప్రతిఘటిస్తాం’ అని అన్నారు. ‘ప్రతిపక్షాల అణచి వేతకు, నియంతృత్వ పాలన సాగించేందుకు సీబీఐను కేంద్రం అడ్డుపెట్టు కుంటోందని, ఈ చర్యలకు భయపడబోం’ అని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మమతా ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా తప్పు చేస్తోందనీ, కుంభకోణాలపై సీబీఐ నాలుగేళ్లుగా ఎందుకు దర్యాప్తు చేయలేదని సీపీఎం నేత బదరుద్దోజా ఖాన్ ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతుండగా టీఎంసీ సభ్యులు చప్పుట్లు, నినాదాలతో అంతరాయం కలిగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుతగలడంతో చైర్మన్ వెంకయ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు. సమాఖ్య వ్యవస్థకు విఘాతం పశ్చిమబెంగాల్లో నెలకొన్న అనూహ్య పరిణామాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ విషయమై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ‘పశ్చిమబెంగాల్లో జరిగిన ఘటన దేశ చరిత్రలోనే అసాధారణమయింది. అక్కడ రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే అధికారం కేంద్రానికి ఉందని రాజ్యాంగం చెబుతోంది’ అని ఆయన అన్నారు. ‘చట్ట ప్రకారం తమ విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన సీబీఐ అధికారులను అడ్డుకోవటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలు అరాచకానికి దారితీస్తాయి’ అని అన్నారు. రాజీవ్‌కుమార్ అధికారులకు సహకరించడం లేదన్నారు. తూర్పు భారతంలోని లక్షలాది మంది పేదలను మోసం చేసిన శారదా చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించిన బాధితులు ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ ప్రజలే. దీనిపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో మనీల్యాండరింగ్, నల్లధనం, రాజకీయ నేతల ప్రమేయం వంటి అంశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తంపైనా సీబీఐ దర్యాప్తు చేస్తోంది’ అని రాజ్‌నాథ్ తెలిపారు. -
మధ్యతరగతి ఆశలు ఛిద్రం
దుర్గాపూర్/ఠాకూర్‌నగర్: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తల హత్యాకాండకు పాల్పడుతున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల ఆశల్ని చిదిమేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో సీఎం మమతా బెనర్జీకి గుబులు మొదలైందని అన్నారు. ఆమె పాదాల కింద నేల క్రమంగా కదిలిపోతోందని చురకలంటించారు. దుర్గాపూర్, ఠాకూర్పూర్లలో శనివారం జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో మమతా ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ అంటే తృణమూల్ తోలాబ్జి టాక్స్(ట్రిపుల్ టీ)గా నిలిచి పోయిందని ఎద్దేవా చేశారు. బెంగాలీలో తోలాబ్జి అంటే వ్యవస్థీకృత బలవంతపు వసూళ్లు అని అర్థం. ఇతర దేశాల్లో మతపర వేధింపులు ఎదుర్కొని మన దేశంలో శరణు కోరేవారికి న్యాయం, గౌరవం కల్పించాలంటే పౌరసత్వ బిల్లుకు చట్టరూపం తేవాల్సిందేనని పునరుద్ఘాటించారు. కమ్యూనిస్టుల బాటలోనే మమత.. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు మమత గతంలో పాలించిన కమ్యూనిస్టుల బాటలోనే నడుస్తున్నారని దుర్గాపూర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ విమర్శించారు. బెంగాల్లో రూ.90 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, వాటిని అమలుచేయాలనే ఆసక్తి తృణమూల్ సర్కార్‌కు కొరవడిందని, వారు ఆ పనుల్లో వాటా కోరుకుంటున్నారన్నారు. బెంగాల్‌కు వలసొచ్చిన మతువా అనే ఎస్సీ వర్గం ఠాకూర్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ..పౌరసత్వ బిల్లుకు చట్టరూపం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తూర్పు పాకిస్తాన్‌కు చెందిన మతువాలు 1950లలో బెంగాల్‌కు వలసొచ్చారు. సుమారు 30 లక్షల జనాభా ఉండే ఈ వర్గం కనీసం ఐదు లోక్‌సభ స్థానాల్లో ప్రభావం చూపగలదు. అయితే, వారిలో ఇంకా చాలా మందికి భారత పౌరసత్వం దక్కలేదు. ఈ నేపథ్యంలో మతువాలను బీజేపీకి ఓటుబ్యాంకుగా మలిచేలా మోదీ పౌరసత్వ బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. ఠాకూర్‌నగర్ సభకు ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగినంత పనైంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, పిల్లలు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మద్దతుదారులు బారికేడ్లు బద్దలుకొట్టి మరింత లోనికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో కొంత గందరగోళం నెలకొంది. ఉన్న చోటే ఉండాలని, ముందుకు రావొద్దని మోదీ వారించినా కొందరు కార్యకర్తలు కుర్చీలు విసిరేస్తూ నానా హైరానా సృష్టించారు. బెంగాల్లో బల ప్రదర్శన! పోటాపోటీ ర్యాలీలకు తృణమూల్, బీజేపీ రెడీ మమతా బెనర్జీ గత నెలలో బీజేపీయేతర పార్టీలతో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ, అమిత్‌షాలతో బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు తమ అగ్ర నాయకులతో ర్యాలీలు నిర్వహించాలని కమలనాథులు ప్రణాళికలు రచించారు. అయితే ఈ ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి తృణమూల్ తన వంతు ప్రయత్నాల్ని చేస్తోంది. ఒకవైపు మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను కూడగడుతున్న మమతా బెనర్జీ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. బీజేపీ ప్రతిపాదించిన ర్యాలీలు, సభలకు అనుమతులను నిరాకరిస్తున్నారు. బీజేపీ సభలకు తృణమూల్ అడ్డుపుల్లలు.. విపక్షాల మహాగట్బంధన్ ర్యాలీకి ఏమాత్రం తీసిపోకుండా బెంగాల్ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని 32 లోక్‌సభ నియోజకవర్గాల్లో 300 ర్యాలీలు చేపట్టాలని ప్రణాళికలు వేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి హేమాహేమీలు ఈ ర్యాలీల్లో పాల్గొంటారు. జనవరి 23న జర్గ్రామ్, సురి ర్యాలీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనాల్సి ఉండగా, ఆమె హెలికాప్టర్ ప్రభుత్వ హెలిప్యాడ్‌లో దిగేందుకు అనుమతించడంలో జాప్యం జరిగింది. దీంతో స్మతి పర్యటన రద్దయింది. ఈస్ట్ మిడ్నపూర్లోని కాంతి దగ్గర బీజేపీ మద్దతుదారుడి పొలంలో అమిత్‌షా ర్యాలీకి ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం పక్కనున్న భూస్వాములతో ర్యాలీకి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ‘బెంగాల్ నుంచి తృణమూల్‌ను తరిమికొట్టడానికి అనుక్షణం పోరాడతా. నా హెలికాప్టర్ దిగేందుకు ప్రభుత్వం అనుమతించకపోతే హెలికాప్టర్ నుంచే ప్రసంగిస్తా. మా రథయాత్రను అడ్డుకుంటే కాలినడకనే ఊరేగుతాం’అని అమిత్ అన్నారు. -
దోపిడీని ఆపినందుకే మహాకూటమి
సిల్వస్సా/గాంధీనగర్/ముంబై: దేశాన్ని దోచుకోకుండా ఆపినందుకే ప్రతిపక్షాలన్నీ ఏకమై ‘మహాకూటమి’గా ఏర్పడ్డాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమి దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి అని మండిపడ్డారు. కోల్‌కతాలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన విపక్షనేతలపై పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సాలో శనివారం ప్రధాని మోదీ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు. ‘ప్రజాధనం దోపిడీకి, అవినీతిని అడ్డుకునేందుకు నేను తీసుకున్న చర్యలపై కొందరికి కోపం వచ్చింది. భయంతో వారంతా ఒక్కటయ్యారు’ అని మండిపడ్డారు. ‘మా పార్టీకి ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది. దీంతో రక్షించండంటూ ఆ పార్టీ నేతలు కేకలు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను చంపేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగకుండా టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం ప్రైవేట్ రంగంలో దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌లోని హజీరాలో ఎల్ అండ్ టీ కంపెనీ ఏర్పాటు చేసిన కే9 వజ్ర–హొవిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2017లో కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన రూ.4,500 కోట్ల ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థ 42 నెలల్లో 100 కే9 యుద్ధట్యాంకులను అందించాల్సి ఉంది. ఇప్పటికే 10 ట్యాంకులను సైన్యానికి అందించింది. వీటి తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఆ సంస్థ దక్షిణ కొరియా హన్వ్హా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, 50 టన్నుల బరువుండే కే9 ట్యాంకు 47 కేజీల బరువైన బాంబును 43 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలపైకి పేల్చగలదు. మాతృమూర్తితో ప్రధాని ప్రధాని మోదీ శనివారం ఉదయం తన తల్లి హిరాబా(90)ను కలుసుకున్నారు. రైసన్ గ్రామంలో సోదరుడు పంకజ్ ఇంట్లో ఉంటున్న మాతృమూర్తితోపాటు ఇతర కుటుంబసభ్యులతో మోదీ ముచ్చటించారు. సినిమా మాదిరిగా దేశమూ మారుతోంది భారతీయ సినిమా ఇతివృత్తం కాలానుగుణంగా మారుతోందని మోదీ అన్నారు. ముంబైలో ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా’ ప్రారంభించిన అనంతరం పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరైన సభనుద్దేశించి మాట్లాడారు. ‘సినిమాలు, సమాజం పరస్పర ప్రతిబింబాలు. గతంలో పేదరికం, అసహాయతనే ఎక్కువగా చూపేవారు. నేడు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలనూ చూపుతున్నారు. లక్షల్లో సమస్యలుంటే కోట్లాది పరిష్కారాలు చూపుతున్నారు’ అని అన్నారు. ఈ మ్యూజియంలో రెండో ప్రపంచ యుద్ధంలో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టే 30 గంటల నిడివి గల డిజిటైజ్డ్ ఫుటేజీ ఉందని వెల్లడించారు. -
బీజేపీలో చేరిన తృణమూల్ ఎంపీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్రా ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన తరువాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్యం లేదని, పోలీసు రాజ్యం నడుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ మార్పు తెస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం విష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌమిత్రా ఖాన్ పార్టీని వీడడాన్ని తృణమూల్ తక్కువచేసి చూపే ప్రయత్నం చేసింది. ఆయన్ని ఇది వరకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. సౌమిత్రా ఖాన్ చాన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కదన్న సంగతి ఆయనకు కూడా తెలుసని వెల్లడించింది. తాజా పరిణామంపై బీజేపీ స్పందిస్తూ.. బెంగాల్లో తృణమూల్ పతనం ప్రారంభమైందని పేర్కొంది. -
ప్రధాని అభ్యర్ధి ఎవరో ఇప్పుడే ప్రకటించం
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్’ ప్రధాని అభ్యర్ధిగా ఎవరి పేరును ప్రకటించడం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ముందుగానే చేసే అటువంటి ప్రకటన ప్రాంతీయ పార్టీలున్న తమ కూటమిలో విభేదాలకు బీజం వేస్తుందని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలన్న లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. శుక్రవారం కోల్‌కతాలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)నేత ఒమర్ అబ్దుల్లాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘దేశ క్షేమం కోసం బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే అభ్యర్ధిని బరిలోకి దించుతాయి. బీజేపీ నియంత పాలనకు వ్యతిరేకంగా త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒమర్ అన్నారు.