ర్యాలీలో ప్రసంగిస్తున్న మమతా. అమరవీరుల ర్యాలీకి హాజరైన ప్రజలు
కోల్‌కతా: బీజేపీ హఠావో.. దేశ్ బచావో అంటూ బీజేపీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదం, హింస, ద్వేషపూరిత వాతావరాణాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి దేశాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. తృణమూల్ పార్టీ అమరవీరుల వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిడ్నాపూర్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో టెంట్ కూలి 90 మంది ప్రజలు గాయపడ్డ ఘటనపై ఆమె స్పందిస్తూ.. టెంట్ సరిగ్గా నిర్మించడం రాని వారు దేశాన్ని ఎలా నిర్మిస్తారంటూ ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం చేసి బెంగాల్ వేదికగా జనవరిలో మెగా ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఈ ర్యాలీ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తామని ఆమె ప్రకటించారు. బెంగాల్‌లో తృణమూల్‌ను కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం చేతులు కలిపాయన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు చందన్ మిత్రా, సీపీఐ(ఎమ్) మాజీ ఎంపీ మోయినుల్ హసన్ తృణమూల్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment