Trunamal congress party
-
కాంగ్రెస్‌కు షాక్.. అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థుల పోటీ!
కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి కూటమిలో కీలకమైన భాగస్వామ్య పార్టీగా వ్యవహరిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున బెర్హంపూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరీ గెలుపొందిన విషయం తెలిసిందే. బెర్హంపూర్ సెగ్మెంట్లో కూడా టీఎంసీ తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడుతామని యోచిస్తున్నట్లు సమాచారం. ‘ఇండియా కూటమీ’ లో భాగస్వామ్య పార్టీ అయిన టీఎంసీ.. మొదటి నుంచి పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లను ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. అయితే అనూహ్యంగా అన్ని స్థానాల్లో(42) టీఎంసీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎంసీ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్, ‘ఇండియా కూటమి’లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీ 22, బీజేపీ18, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: ‘జమిలి ఎన్నికలు.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు వ్యతిరేకం’ -
ప్రశాంత్ కిషోర్ వల్లే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నికల్లో ఓటముల పరంపర కొనసాగుతుండటంతో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడటంపై తృణముల్ కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాల కీలక పాత్ర ఉందని అన్నారు. ఈ సందర్భంగానే టీఎంసీ పార్టీలో చేరడం మర్యాదగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా టీఎంసీపైనే ఉందన్నారు. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోభం ముంగిట్లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీపై విమర్శలు చేయడం ఇష్టం లేదన్నారు. అలాగే, కాంగ్రెస్‌లో తప్పులు ఎక్కడ జరిగాయో.. తాను ఎందుకు బయటకు వచ్చానో త్వరలో చెబుతానని అన్నారు. మరోవైపు.. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హాను బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు. మరో ఉప ఎన్నిక బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా జరుగుతుండటంతో కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నట్టు మమతా బెనర్జీ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
‘హోర్డింగ్స్‌లా గోవా ప్రజల మార్పును తొలగించలేరు’
పనాజీ: గోవాలో తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్‌లు తొలగింపుపై టీఎంసీ సీనియర్ నేత ఫిర్హాద్ హకీమ్ బీజేపీపై మండిపడ్డారు. గోవాలో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక నేతలు టీఎంసీ హోర్డింగ్‌లను తొలగించారు. దీనిపై ఫిర్హాద్ హకీమ్ స్పందిస్తూ.. కావాలనే తమ పార్టీ హోర్డింగ్‌లను బీజేపీ నేతలు తొలగించాని దుయ్యబట్టారు. గోవా ప్రజలు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సాధించిన భారీ విజయాన్ని గోవాలో కూడా సృష్టిస్తారని అన్నారు. టీఎంసీ హోర్డింగ్‌లు తొలగించినంత మాత్రనా గోవా ప్రజలు కోరుకునే మార్పును మార్చలేరని ట్విటర్లో తెలిపారు. టీఎంసీ హోర్డింగ్‌లను తొలగించే ఓ వీడియోను ట్విటర్లో షేర్చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా.. గోవాలోని ధర్బందోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. కర్తిలోని తాత్కాలిక ప్రాంగణంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను ప్రారంభిస్తారు. అనంతరం తెలిగావ్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. The people of #Goa will recreate the historic victory of #Bengal. The fire of change has been ignited and cannot be doused by removing hoardings! #ShameOnBJP #GoenchiNaviSakal https://t.co/BO8KqrZnXG — FIRHAD HAKIM (@FirhadHakim) October 13, 2021 -
త్వరలో ఢిల్లీకి మమతా.. సోనియా గాంధీని కలువనుందా?
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలలో భాగంగా అపాంట్మెంట్ దొరికితే.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కొవింద్ను కలుస్తానని పేరొన్నారు. అదే విధంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి, పలువురు నేతలను కాలవనున్నాను’ అని మమతా బెనర్జీ గురువారం పేరొన్నారు. మమత ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 2024లో బీజేపీని ఎదుర్కొవడానికి పలు ప్రతిపక్ష పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమీలో ఆమె భాగస్వామ్యం కానున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మమతాబెనర్జీ జూలై 25న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వార్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్టు13 వరకు జరుగుతాయి. ఇటీవల బీజేపీ వ్యకతిరేక కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్సీపీ నేత శరద్ పవర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో మమత పర్యటనపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
డైమండ్ హార్బర్: పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్లో పట్టు పెంచుకోవడం కోసం నడ్డా రాష్ట్రానికి వచ్చారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి గురువారం ఉదయం డైమండ్ హార్బర్‌కి వెళుతుండగా మార్గం మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ముకుల్ రాయ్ మరికొందరు నేతలు గాయపడ్డారు. ఇక కైలాస్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ నడ్డాకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తృణమూల్ పాలనలో బెంగాల్ లో అరాచకత్వం రాజ్య మేలుతోం దన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరో వైపు ముఖ్యమంత్రి మమత ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు తమపై తామే దాడులు చేసుకొని తృణమూల్ కాంగ్రెస్‌పై నేరాన్ని నెట్టేస్తున్నారని అన్నారు. సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లు చుట్టూ ఉండగా వారికెందుకు భయమని ప్రశ్నించారు. దుర్గమ్మ ఆశీస్సులున్నాయి: నడ్డా తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని నడ్డా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువ య్యాయని, గూండారాజ్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లి పోయిందని ధ్వజమెత్తారు. ఆ దుర్గమ్మ దయవల్లే తనకేమీ కాలేదని వ్యాఖ్యానించారు. ‘‘కాన్వాయ్‌పై జరిగిన దాడితో దిగ్భ్రాంతికి లోనయ్యాం. రాను రాను పశ్చిమ బెంగాల్లో అసహనం పెరిగిపోతోం ది. గూండాలు రాజ్యమేలుతున్నారు. భద్రత కల్పిం చడంలో అధికార యంత్రాంగం విఫలమైంది’’ అని కార్యకర్తల సమావేశంలో దుయ్యబట్టారు. గాయపడిన విజయ వర్గీయ, ఆయన కారు డ్రైవర్ దాడిలో పగిలిన కారు అద్దం -
భారత్ బంద్‌పై మమతా బెనర్జీ ట్విస్ట్
పశ్చిమ బెంగాల్: భారతీయ జనతా పార్టీ(బిజెపి) తన తుపాకులకు శిక్షణ ఇచ్చి పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చడానికి ప్రయత్నిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో సోమవారం(డిసెంబర్ 7) ఏర్పాటు చేసిన ఓ సభలో మమతా మాట్లాడారు. బెంగాల్ రాష్ట్రంలో బిజెపి చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. బిజెపి పార్టీ ఇక్కడ అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తుంది, గుర్తుంచుకోండి బెంగాల్ ప్రభుత్వం అల్లర్లు జరగటానికి అనుమతించదు అని అన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డబ్బు సంచులతో ఆ ప్రభుత్వాలను కూల్చాలని చూసే బీజేపీ తరహా పార్టీ మాదు కాదు అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాషాయ పార్టీకకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయేది లేదన్నారు. బీజేపీ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయగలరని భావిస్తే చాలా తప్పు.. నిప్పుతో, తృణమూల్ కాంగ్రెస్ ఆటలు అడకండి అని మమతా అన్నారు. (చదవండి: రైతుల ఆందోళనలకు ఉద్ధవ్ మద్దతు) గాంధీ హంతకులకు పశ్చిమ బెంగాల్ ఎన్నటికీ తలవంచదు, ఈ రాష్ట్రంపై ఇతరుల నియంత్రణను ఎప్పటికి ఒప్పుకోదు అని మిడ్నాపూర్ సభలో అన్నారు. అంతేకాదు, బీజేపీ అధికార దుర్వినియోగం పట్ల మౌనంగా ఉండటం కంటే జైల్లో ఉండటానికైనా తాను సిద్దమేనని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో హిందూ-ముస్లిం మరియు ఇతర వర్గాల మధ్య చీలికను సృష్టించాలని భావిస్తుంది. మేము అలాంటి వాటిని అసలు సహించం అన్నారు. అవినీతి నేతలే బీజేపీతో చేతులు కలుపుతున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. సీపీఐ(ఎం) గూండాలు రాష్ట్రంలో బీజేపీకి కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా రేపు జరిగే భారత్ బంద్ కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నా. 'కేంద్రం తక్షణమే కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి లేదా ప్రభుత్వం నుంచి దిగిపోవాలి. రైతుల హక్కులను కాలరాసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండకూడదు'అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేపు(డిసెంబర్ 8) రాష్ట్రంలో జరిగే భారత్ బంద్‌కు మాత్రం తాము మద్దతునివ్వట్లేదని ప్రకటించారు. -
మమత సర్కార్‌పై గవర్నర్ విమర్శలు
కోల్కత్తా : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయకపోవడంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైద్య అధికారులపై ఒత్తిడి చేశారని విమర్శించారు. కోవిడ్ నియంత్రకు దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడోదశ ప్రయోగాన్ని బుధవారం ఐసీఎంఆర్ వద్ద గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో వైద్య పరంగా వృద్ధిని సాధించామని, దురదృష్టవశాత్తు బెంగాల్ దీనిలో భాగస్వామ్యం కాలేకపోయిందని అన్నారు. వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, ఆరోగ్యమంత్రిత్వ శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రూ. 2,000 కోట్ల విలువైన నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలను మంత్రి ఫిర్హాద్ హకీమ్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ హోదాలో ఉండి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అవకతవకలపై దర్యాప్తు కోసం ఆగస్టులో ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2019 జూలైలో బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధంఖర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా పార్లమెంట్లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యసభలో ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని కల్పించి డిప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారని సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారని గందరగోళానికి కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు విపక్ష ఎంపీలపై అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి వెంకయ్యనాయుడు సోమవారం ఆమోదం తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్సీ), డోలాసేన్ (టీఎమ్సీ), రాజీవ్ వాస్తవ్ (కాంగ్రెస్) , రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్) , కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) సభాసాంప్రదాయాలను సభ్యులు పాటించలేదని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. వారం రోజుల పాటు ఈ తీర్మానం అమల్లో ఉండనుంది. మరోవైపు చైర్మన్ నిర్ణయంపై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్న బిల్లులపై కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందునే తాము నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నారు. ఆదివారం బిల్లులపై ఓటింగ్ సందర్భంగా సభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. (పెద్దల సభలో పెను దుమారం) సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. దీంతో సభ్యుల తీరుపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసభాపతిని అగౌరపరిచే విధంగా వ్యవహరించిన సభ్యులను సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సోమవారం సభాకార్యక్రమాలు తిరిగి ప్రారంభం అయిన వెంటనే వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం మరోవైపు డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. 12 పార్టీలు కలిసి 50 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఆమోదయోగ్యం కాదన్న చైర్మన్.. దానిని తిరస్కరించారు. -
ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ
తొమ్మిదేళ్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మమతా బెనర్జీ. ఏడాదిగా పశ్చిమ బెంగాల్ గవర్నరుగా ఉన్నారు జగదీప్ ధన్ఖర్. నాలుగేళ్లు పెద్ద ఆమె కన్నా ఆయన. మమతకు 65. ఆయనకు 69. అయితే మనిషిలో ఆ పెద్దరికం లేదు! ప్రజాదరణ ఉన్న ఆ నాయకురాలికి అధికార పార్టీ ఆదరణ ఉన్న ఈ నాయకుడు ఏడాది కాలంగా అడ్డుపడుతూనే ఉన్నాడు. అడ్డు పడుతున్నందుకు పెద్దరికం లేదనడం కాదు. పదవికి ఉండే పెద్దరికం.. దాన్ని నిలుపుకోవాలి కదా? అది లేదు! సీఎంని వెక్కిరిస్తాడు. వెటకరిస్తాడు. ఆమె తుమ్మితే ఈయన ‘హాచ్చ్’ మని ఇమిటేట్ చేస్తాడు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్న ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ అయిపోయాడు. మమతను ఆయన చికాకు పెట్టడం ఎలా ఉంటుందో చూడండి. తృణమూల్ పార్టీ వాళ్లు నిన్న ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో మమతా బెనర్జీ ‘నీట్’, జేఈఈ విద్యార్థులకు ‘మై హూ నా’ (నేనున్నాను) అని అభయం ఇస్తుంటారు. పరీక్షలను వాయిదా వేయిస్తానని ఆ భరోసా. వెంటనే గవర్నర్ అందుకున్నాడు. ఆ పోస్టర్ ని ట్యాగ్ చేస్తూ ‘మై భీ హూ నా’ (నేను కూడా ఉన్నాను) అని రీట్వీట్ చేశాడు! దేనికి అతడు ఉన్నది అంటే.. పరీక్షల్ని జరిపించడానికి!! గవర్నర్ మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉండకూడదు. మమత మాత్రమే తన పని తను చేస్తున్నారు. In this time of constant uncertainty and anxiousness, @BJP4India led govt is pushing our students into further distress. To timely address this burning issue, @MamataOfficial came forward to fight for providing a safe environment to the students. She is truly everyone's leader! pic.twitter.com/3KaoJuEZqx — All India Trinamool Congress (@AITCofficial) August 27, 2020 -
మమత పెద్ద మనసు వారి కోసం ప్రత్యేకంగా...
కోల్కత్తా: కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పనుల కోసం సొంత ఊరిని వదిలి ఉపాధిని వెతుకుంటూ వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగం లేక ఏం చేయాలో తోచక చాలా కష్టాలు పడ్డాయి. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ అయిపోతుందా ఇంటికి వెళ్లి అయిన వారిని చూసుకుందాం అని ఆశపడిన వారికి లాక్‌డౌన్‌ను మూడు సార్లు సడలించడంతో నిరాశే మిగిలింది. అందుకే చాలా మంది వలస కార్మికులు కాలినడకనే వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇంటిని చేరకుండానే ప్రాణాలు కూడా కోల్పొయారు. అయితే వలస కార్మికులను ఇంటికి చేర్చడం కోసం కేంద్రప్రభుత్వం శ్రామిక్‌రైళ్ల పేరిట ప్రత్యేక రైళ్లను మే1 వతేదీ నుంచి అందుబాటులోనికి తెచ్చింది. అయితే వీటితో పాటు వలస కార్మికుల కోసం 105 ప్రత్యేక రైళ్లను కూడా నడిపించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేక ట్రైన్లు వివిధ ప్రాంతాల నుంచి త్వరలో ప్రారంభం కానున్నాయి అని మమత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్ బెంగాల్ ప్రభుత్వం వలస కార్మికుల రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించబోము అని పేర్కొంది అని ఆరోపించిన ఒక్కరోజు తరువాతే మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం. Towards our commitment to helping all our people stuck in different parts of the country and who want to return back to Bengal, I am pleased to announce that we have arranged 105 additional special trains. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) May 14, 2020 ఇదేవిషయం కేంద్రహోం మంత్రి అమిషా కూడా మమతకు చాలా సార్లు లేఖ రాశారు. వలస కార్మికులు కూడా మీ ప్రజలే. వారిని ఇంటికి తిరిగి రానివ్వండి. ఆర్ధిక వ్యవస్థ బాగుపడి వారికి ఉద్యోగాలు దొరుకుతాయి దీనిని రాజకీయం చేయ్యొద్దు అంటూ కూడా అమిత్ షా చాలా సార్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్ర సర్కార్‌కి మధ్య యుద్దమే నడిచింది. అయితే కరోనా కట్టడి విషయంలో కేంద్రం చేపడుతున్న అనేక చర్యలను దీదీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
బెంగాల్ హింస ఎందుకు కొనసాగుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసాకాండ ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది. ఏ ఎన్నికల సందర్భంగానైనా ఆ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగడం, ఎన్నికల అనంతరం ఆగిపోవడం సాధారణ విషయం. ఈసారి ఎందుకు అలా జరగలేదు ? పైగా ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసలోకన్నా అనంతరం కొనసాగిన హింసాకాండలోనే ఎక్కువ మంది మరణించారు. అక్కడ రాజకీయాలే హింసాత్మకం అయితే ఎందుకు సామాన్య పౌరులు వాటికి దూరం కావడం లేదు ? పైగా ఎంత హింసాకాండ జరిగిన ఎన్నికల సందర్భంగా పోలింగ్ ఎక్కువగా ఉంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 81.85 శాతం పోలింగ్ జరిగింది. ఎందుకు? స్థానిక ప్రజాస్వామ్య బలంగా ఉండడం పశ్చిమ బెంగాల్లో వామపక్షాల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే, అంటే 1978లో మూడంచెల పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో, సమితి స్థాయిలో, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం. ఇక్కడే ఇతర రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు తేడా ఉంది. ఇతర పార్టీలతో, పార్టీ చిహ్నాలతో ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్లో పార్టీ గుర్తులపైనే ఎన్నికలు జరుగుతాయి. ఈ కారణంగా పార్టీల బలాబలాలు సమాన స్థాయిలో ఉన్నప్పుడు దిగువ స్థాయి నుంచే అల్లర్లు పుట్టుకొస్తాయి. తణమూల్‌కు సమాన స్థాయిలో బీజేపీ ఎదుగుతూ వచ్చిన విషయం తెల్సిందే. అభివద్ధి కార్యక్రమాలతో విభేదాలు తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లనిర్మాణం, బాల్య వివాహాల నివారణకు పెళ్లీడు వచ్చాక పెళ్లి చేస్తే పెళ్లి కూతురుకి పాతిక వేల రూపాయలను పారితోషికంగా ఇవ్వడం లాంటి పథకాలను అమలు చేస్తోంది. తణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు అన్నదమ్ముల పేరు మీద ఒకటికన్నా ఎక్కువ ఇంట్లను పొందడం, ఇప్పటికీ పంచాయతీ స్థాయిలో బలంగా ఉన్న కమ్యూనిస్టులకు ఒక్క ఇల్లు కూడా దక్కక పోవడం, పెళ్లి కూతురికి పాతికవేల పారితోషకం మంజూరుకు తణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఐదువేల రూపాయలు లంచం తీసుకోవడం విపక్ష కార్యకర్తల్తో కక్షలను రేపాయి. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీలను పోటీ చేయకుండా అడ్డుకోవడం ద్వారా దాదాపు 40 శాతం సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకొంది. అప్పటి నుంచి సీపీఎం, బీజేపీ పార్టీ కార్యకర్తల్లో రగులుతున్న కోపం లోక్‌సభ ఎన్నికల్లో హింసాకాండకు దారితీసింది. అనూహ్యంగా సీపీఎం, సీపీఐ కార్యకర్తలు బీజేపీతో చేతులు కలపడంతో ఇరు పక్షాల మధ్య దాడులు ఎక్కువయ్యాయి. ఇలా కక్షలు, కార్పణ్యాలు పంచాయతీ స్థాయికి పాకడంతో అల్లర్లు సద్దుమణగడం లేదు. -
మోదీకి 10 వేల ‘వందేమాతరం’ పోస్టుకార్డులు
కోల్‌కతా : బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టు కార్డుల యుద్ధం కొనసాగుతోంది. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పది లక్షల జైశ్రీరాం నినాదాలతో కూడిన పోస్టు కార్డులను పంపాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము కూడా ప్రధాని నరేంద్ర మోదీకి 10 వేల పోస్టుకార్డులు పంపుతామని టీఎంసీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ‘వందేమాతరం’ , ‘జై హింద్’,, జై బంగ్లా’ నినాదాలతో కూడిన 10 వేల పోస్ట్ కార్డులు ప్రధాని మోదీకి పంపారు. (చదవండి : దీదీకి తప్పని జై శ్రీరాం సెగ..) ‘ బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దూషిస్తూ.. జైశ్రీరామ్ నినాదాలలతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఒకరి వాహనాన్ని అడ్డుకొని జైశ్రీరామ్ అనడం ఎంతవరకు సమంజసం? బీజేపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలపై దాడులు చేస్తున్నారు. మేము వారిలా(బీజేపీ కార్యకర్తలు) ప్రవర్తించం. ప్రధానమంత్రి వాహనాన్ని అడ్డుకోబోము. కేవలం పోస్టుకార్డులతో మా నిరసనను తెలుపుతాం. వందేమాతరం, జై హింద్, జై బంగ్లా అనే నినాదాలు రాసిన 10వేల పోస్టు కార్డులను మోదీకి పంపుతాం’ అని టీఎంసీ నాయకురాలు దేబశ్రీ బెనర్జీ మీడియాకు తెలిపారు. కాగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో 42 స్ధానాలకు గాను బీజేపీ తొలిసారిగా 18 స్ధానాల్లో గెలుపొంది పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ.. ఈ ఎన్నికల్లో 22 స్థానాలను మాత్రమే సాధించింది. -
మమత బెనర్జీకి అమిత్ షా హెచ్చరిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో దుర్గాదేవి నిమజ్జనానికి, పాఠశాలల్లో సరస్వతి పూజకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మమతా బెనర్జీపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు చేస్తే.. మమత అధికారాన్ని రోజుకో మెట్టు తగ్గిస్తామని హెచ్చరించారు. కోల్‌కతాలో శనివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో షా పాల్గొన్నారు. తృణమూల్‌ను కూకటి వేళ్లతో పెకలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘దుర్గాపూజ తర్వాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతివ్వరు. బెంగాల్‌లోని చాలా పాఠశాలల్లో సరస్వతి పూజ జరుపుకోకుండా అడ్డుకున్నారు. ఇలాంటివి జరగాల్సిందేనా? బీజేపీ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఉత్సవాలన్నీ ఘనంగా జరుపుతాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు. చొరబాటుదారులకు స్వాగతమా? మైనారిటీలను తృప్తిపరిచేందుకు, ఓటుబ్యాంకు రాజకీయాలు చేసేందుకు మమత సర్కారు ప్రయత్నిస్తోందని షా ఆరోపించారు. ‘రాష్ట్రంలోకి రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులకు స్వాగతం పలుకుతారు. దీని ద్వారా ప్రజలకు మీరేం చెప్పదలచుకున్నారు? మైనారిటీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పరిమితి ఉంటుంది’ అని షా విమర్శించారు. ర్యాలీలో తన ప్రసంగం ప్రత్యక్షప్రసారం కాకుండా టీవీ చానళ్లకు మమత హెచ్చరికలు జారీచేశారన్నారు. ‘మా పార్టీ కార్యకర్తలపై నాకు అచంచల విశ్వాసముంది. వారు ప్రతి గల్లీ, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికీ వెళ్లి తృణమూల్ ఏం చేస్తోందో ప్రజలకు వివరిస్తారు’ అని స్పష్టం చేశారు. ఎన్నార్సీపై నోరు మెదపరే? అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)పై తమ విధానమేంటో మమత, రాహుల్‌లు సమాధానం ఇవ్వాలన్నారు. వీరిద్దరూ దేశం కోసం ఆలోచిస్తున్నారా? లేక ఓటుబ్యాంకు కోసమేనా అని ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ ఎన్నార్సీపై తన అభిప్రాయాన్ని ఎందుకు వెల్లడించడం లేదు. ఆయనకు దేశభద్రత కన్నా ఓటు బ్యాంకే ముఖ్యమా?’ అని విమర్శించారు. అయితే, షా ర్యాలీ ఫ్లాప్ షో అని తృణమూల్ పేర్కొంది. ఎన్నార్సీ అమలు తీరుపైనే వ్యతిరేకం: కాంగ్రెస్ కోల్‌కతా: జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)కి తాము వ్యతిరేకం కాదని, అస్సాంలో అది అమలైన తీరును మాత్రమే తప్పు పడుతున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఎన్నార్సీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఈ సర్వే గందరగోళంగా జరిగిందనటానికి మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ కుటుంబ సభ్యులతోపాటు ప్రముఖుల పేర్లు జాబితాలో గల్లంతు కావడమే ఉదాహరణ’ అని అన్నారు. ‘మేం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదు. ఎన్సార్సీని అమలు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని మోదీ ప్రభుత్వమే 2017లో సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి’ అని అన్నారు. -
బీజేపీ హఠావో.. దేశ్ బచావో
కోల్‌కతా: బీజేపీ హఠావో.. దేశ్ బచావో అంటూ బీజేపీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదం, హింస, ద్వేషపూరిత వాతావరాణాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి దేశాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. తృణమూల్ పార్టీ అమరవీరుల వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిడ్నాపూర్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో టెంట్ కూలి 90 మంది ప్రజలు గాయపడ్డ ఘటనపై ఆమె స్పందిస్తూ.. టెంట్ సరిగ్గా నిర్మించడం రాని వారు దేశాన్ని ఎలా నిర్మిస్తారంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం చేసి బెంగాల్ వేదికగా జనవరిలో మెగా ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఈ ర్యాలీ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తామని ఆమె ప్రకటించారు. బెంగాల్లో తృణమూల్‌ను కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం చేతులు కలిపాయన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు చందన్ మిత్రా, సీపీఐ(ఎమ్) మాజీ ఎంపీ మోయినుల్ హసన్ తృణమూల్‌లో చేరారు. -
కాంగ్రెస్ పార్టీకి మమత బంపర్ ఆఫర్!
కోల్‌కతా: బీజేపీలాంటి మతతత్వ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా రానున్న పార్లమెంట్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో జరుగునున్న ఐదు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో నాలుగు స్థానాలను తృణమూల్ కైవసం చేసుకోనుంది. ఐదో స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన అభిషేక్ మను సింఘ్వీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని మమత బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఐదో స్థానం కోసం వామపక్షాల అభ్యర్థి రాబిన్దేవ్, కాంగ్రెస్ అభ్యర్థి సింఘ్వీ మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మమత ఇచ్చిన ఆఫర్ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే, బీజేపీ, తృణమూల్ పార్టీలను ఓడించేందుకు వామపక్షాలతో కలిసి మరోసారి కూటమిగా ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదే విషయాన్ని బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ప్రకటించారు. ఇందులోభాగంగా ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కూడా ఆయన ప్రతిపాదించారు. అయితే, కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఈ సమీకరణాలు అంతగా ఫలించినట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపడంతో లెఫ్ట్‌ను కాంగ్రెస్ పార్టీని దూరం చేసి.. తమవైపు తిప్పుకునేందుకు మమత పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇటీవలి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పాతికేళ్ల వామపక్ష సర్కారును బీజేపీ గద్దె దించడం.. ఇక తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడమేనని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కమలదళానికి చెక్ పెట్టేందుకు రాజకీయ పొత్తులకు మమత తెరతీస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి 23న రాష్ట్రంలోని ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
‘ఆమె’ కోసం దేశవ్యాప్తంగా గాలింపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు.. మావోయిస్ట్ ప్రభావితం ప్రాంతం మిడ్నాపూర్‌లో కూడా కీలక పోలీసాఫీసర్. కానీ ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ . దీంతో సీఐడీ ఆమె కోసం దేశమంతా జల్లెడ వేసి మరీ వెతుకుతోంది. కానీ ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. ఆమెనే భారతీ ఘోష్. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో భారతీ ఘోష్ బుక్కయ్యారు. దీంతో అప్పటి నుంచి భారతీ ఘోష్, ఆమె భర్త ఎంఏవీ రాజు, వ్యక్తిగత గార్డుగా ఉన్న కానిస్టేబుల్ తో సహా ఆదృశ్యమైపోయారు. ఘోష్ కేవలం ఆడియో మెసేజ్‌ల ద్వారా మీడియాను కాంటాక్ట్ అవుతున్నారు. కానీ ఆ మెసేజ్‌లు ఎక్కడి నుంచి పంపుతున్న ప్రాంతాన్ని మాత్రం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈ మాజీ పోలీస్ ఆఫీసర్ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించవద్దంటూ.. సీబీఐ విచారణ జరుపాలంటూ విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు పట్టుబడుతున్నాయి. డీమానిటైజేషన్ అనంతరం జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో బంగారు లావాదేవీలపై సమాచారంతో పాటు, సీనియర్ మావోయిస్ట్ నేత కిషన్‌జీ అలియాస్ కోటేశ్వరరావు మరణానికి సంబంధించి కీలక సమాచారం కూడా ఆమె వద్ద ఉన్నాయి. అంతేకాక ఘోస్ తన వద్ద ఉన్న కోట్ల రూపాయల నగదును కూడా లెక్కలో చూపలేదని, వాటిని సీజ్ చేసినట్టు సీఐడీ డీఐజీ(ఆపరేషన్స్) నిషాత్ పర్వేజ్ తెలిపారు. పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన ఘటల్ సబ్ డివిజనల్ కోర్టులో ఫిబ్రవరి 1న చందన్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు భారతీ ఘోష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ పోలీసాఫీసర్‌కు వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదు అయింది. రద్దయిన నోట్ల ద్వారా మొత్తం 375 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసాఫీసర్‌కి విక్రయించినట్లు చందన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే వాటికి సంబంధించిన నగదు చెల్లించలేదని తన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో గత నెల 7న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఉత్తర 24 పర్గనాస్ నివాస్ యునల్ అలీ మండల్ అనే వ్యక్తి కూడా ఘటల్ కోర్టులో ఘోష్‌కు వ్యతిరేంగా ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఫిర్యాదుల అనంతరం భారతీ ఘోష్‌కు చెందిన నివాసాలపై పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో సీఐడీ తనిఖీలు చేపట్టింది. రూ.300 కోట్ల విలువైన 50 ఒరిజినల్ ల్యాండ్ సేల్ డీడ్స్, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, గోల్డ్ జువెల్లరీ, దిగుమతి చేసుకున్న 57 విస్కీ బాటిళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘోష్ లాకర్స్‌లో 1.1 కేజీల గోల్డ్, 2 కోట్ల నగదు, కోల్‌కత్తాకు దగ్గర్లో మదుర్దహలో రూ.2.4 కోట్ల ఫ్లాట్‌ను సీజ్ చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు. వీరిలో ఘటల్‌కు చెందిన సబ్ ఇన్పెక్టర్ రాథ్, అసిస్టెంట్ ఎస్ఐ దాస్, ఇద్దరు పోలీసు అధికారులు, ఘటల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ చిత్త పాల్లు ఉన్నారు. అయితే ఘోష్ తరఫు న్యాయవాది పినాకి భట్టాచర్య మాత్రం సీఐడీపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఘోష్ 1994 నుంచి 2017 వరకూ అన్ని రకాల ఫ్లాట్స్‌ను, లాకర్ గోల్డ్‌ను లెక్కల్లో చూపారని, ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. కోర్టులో సీఐడీ కేసు గెలవదని తేల్చి చెబుతున్నారు. ఘోష్ కొనుగోలు చేసిన భూమి అంతా.. ప్రభుత్వ అనుమతితో, చట్టబద్ధంగానే జరిపినట్టు తెలిపారు. కాగా భారతీ ఘోష్ పోలీసాఫీసర్‌గా పలు అంతర్జాతీయ మిషన్లకు సేవలందించారు. ఐపీఎస్‌గా కూడా ప్రమోట్ అయ్యారు. మమతా సీఎం అయ్యాక ఘోస్‌కు సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా ప్రమోషన్ వచ్చింది. డిసెంబర్ 25న 3వ బెటాలియన్ రాష్ట్ర సాయుధ దళాలకు కమాండింగ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రెండు నెలల తర్వాత ఘోష్ పై సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ సుముఖంగా లేదు. -
‘తృణమూల్‌ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ల కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బహిరంగంగా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. గత సోమవారం పశ్చిమబెంగాల్ లోని బసీర్హాట్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు తృణమూల్ తీరుకు అద్దం పడుతున్నాయని, ఆ పార్టీ డీఎన్ఏలోనే దౌర్జన్యాలకు పాల్పడడం ఉందన్నారు. సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ తాను అభిషేక్ హింసాత్మక వ్యాఖ్యలతో ఆశ్చర్యపోలేదని, తృణమూల్ అనుసరించే విధానం అలాంటిదేనని అన్నారు.