పనాజీ: గోవాలో తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్‌లు తొలగింపుపై టీఎంసీ సీనియర్ నేత ఫిర్హాద్ హకీమ్ బీజేపీపై మండిపడ్డారు. గోవాలో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక నేతలు టీఎంసీ హోర్డింగ్‌లను తొలగించారు. దీనిపై ఫిర్హాద్ హకీమ్ స్పందిస్తూ.. కావాలనే తమ పార్టీ హోర్డింగ్‌లను బీజేపీ నేతలు తొలగించాని దుయ్యబట్టారు. గోవా ప్రజలు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ సాధించిన భారీ విజయాన్ని గోవాలో కూడా సృష్టిస్తారని అన్నారు.
టీఎంసీ హోర్డింగ్‌లు తొలగించినంత మాత్రనా గోవా ప్రజలు కోరుకునే మార్పును మార్చలేరని ట్విటర్‌లో తెలిపారు. టీఎంసీ హోర్డింగ్‌లను తొలగించే ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా.. గోవాలోని ధర్బందోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. కర్తిలోని తాత్కాలిక ప్రాంగణంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను ప్రారంభిస్తారు. అనంతరం తెలిగావ్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
The people of #Goa will recreate the historic victory of #Bengal. The fire of change has been ignited and cannot be doused by removing hoardings! #ShameOnBJP #GoenchiNaviSakal https://t.co/BO8KqrZnXG
— FIRHAD HAKIM (@FirhadHakim) October 13, 2021
Comments
Please login to add a commentAdd a comment