కోల్‌కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ మమతా బెనర్జీ పాలన కంటే గతంలో పాలించిన కమ్యూనిస్టు పార్టీల పాలనే బాగుండేదని ఎద్దేవా చేశారు. మంగవారం కోల్‌కతాలో బీజేపీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తృణమూళ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.
బెంగాల్‌లో మమతా పాలనలో అక్రమ వలసలు, గోవుల ఆక్రమ రవాణా పెరిగిపోయని మండిపడ్డారు. బెంగాల్‌లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మమతా బెనర్జీ ఆగడాలకు స్వస్తి పలుకుతామని అన్నారు. దీదీ పాలన కంటే 34 ఏళ్లు పాలించిన కమ్యూనిస్టుల పాలన బాగుండేదని అమిత్ షా అన్నారు. ఇదే విషయాన్ని బెంగాల్ ప్రజలు సైతం అనుకుంటున్నారని తెలిపారు.
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడం బీజేపీ నిబద్దతకు నిదర్శనమని తెలిపారు. ఎట్టిపరిస్థిల్లో సీఏఏను అమలు చేసి తీరుతామని తెలిపారు. బెంగాల్ మమతా బెనర్జీ సీఏఏ విషయంలో ప్రజలను మరింత గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు-2019.. పాకిస్తాన్, బంగ్లాదేశ్,ఆఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎందుర్కొని భారత్‌కు వచ్చే ముస్లియేతరలకు భారత పౌరసత్వం కల్పించనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment