Mamata Benarji
-
ఇది రాజకీయ ఎత్తుగడల వైఫల్యం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుండ్రంగా వేసిన ఖాళీ తెల్లని కుర్చీల ముందు కూర్చుని, వైద్యులతో భేటీ కోసం ‘వేచి వేచి వేచి’ చూసిన చిత్రం చాలా ఆసక్తిని పుట్టించింది. ప్రత్యేకించి దాని తర్వాత ముఖ్యమంత్రి చేతులు జోడించి, నిరసన తెలుపుతున్న వైద్యు లతో చర్చించే విషయమై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడంలో జరిగిన వైఫల్యానికి క్షమాప ణలు చెప్పడం... నాటకీయంగా ఉద్వేగభరితంగా తాను ‘రాజీ నామాకు సిద్ధంగా ఉన్నాను’ అనే ఎత్తుగడను వేయడం మరీ విశేషం.వాస్తవానికి, ఆ క్షణమాత్రపు దృశ్యంలో ప్రదర్శితమైన ప్రహసనం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. విశేషం ఏమంటే, ఇదే ప్రత్యక్ష ప్రసారం విషయంలోనే ఆ చర్చలు ప్రారంభం కావడానికి ముందే విఫలమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపైనా... దాని వెంబడే చోటు చేసుకున్న తప్పుడు చర్యలు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాల పైనా గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న వైద్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో తమ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని ముందస్తు షరతు పెట్టారు. సుప్రీంకోర్టు ఈ కేసును ప్రత్యక్ష ప్రసారం చేయగలిగినప్పుడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దానిపై విభేదించడానికి ఎటువంటి కారణం లేదని వాదిస్తూ, వారు ఈ డిమాండ్‌పై ఇప్పటికీ మొండిగా ఉన్నారు. అదే సమయంలో చర్చలను రికార్డ్ చేసి, సుప్రీంకోర్టు అను మతితో తర్వాత విడుదల చేయాలనే ప్రతిపాదనను వైద్యులు అంగీకరించలేదు.మమతా బెనర్జీ ఈ పనిని నిరసనల ప్రారంభంలోనే ఎందుకు చేయలేదని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ముడిచిన చేతులు, మధురమైన స్వరం, ప్రతిష్టంభనను ఛేదించలేక పోయినందుకు క్షమాపణ చెప్పడం, వైద్యుల కోసం రెండు గంటలకు పైగా వేచి ఉండటాన్ని నొక్కి చెప్పడం... బహుశా నేరం జరిగిన కొన్ని గంటలు లేక రోజులలో ఇదే విధానం పాటించి ఉంటే, ఇంత సంక్షోభం ఏర్పడేది కాదు. ఉద్య మాలలో పుట్టి, రూపుదిద్దుకున్న ఈ రాజకీయ నాయకురాలు ఇలా సహజ ప్రవృత్తి రాహిత్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కోల్‌కతా పోలీసు చీఫ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినప్పటికీ రాబోయే పండుగ సీజన్ కారణంగా తాను దానిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించడం మరింత అయోమయం కలిగించింది. ఆమె ప్రకటనపై స్పందిస్తూ ఒక యువ వైద్యుడు ఇలా అన్నాడు: ‘ప్రస్తుతం పండుగల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’ (ప్రభుత్వం అనంతరం కోల్‌కతా నగర కమిషనర్‌ను మార్చింది.) ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించడంలో భార తీయ జనతా పార్టీ రాష్ట్రంలో అందరికంటే ముందు ఉండ వచ్చు; కానీ, మణిపుర్ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ ఏ సహజ ప్రవృత్తినీ ప్రదర్శించకపోవడం గురించి ఇలాంటి ప్రశ్న లనే ఆ పార్టీ నాయకత్వంపై సంధించవలసి ఉంటుంది.మళ్ళీ, స్పష్టంగా చెప్పాలంటే, 2023 మే నుండి హింసా త్మక జాతి ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించిన మణి పుర్ రాష్ట్రానికీ, పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జి కర్ హాస్పిటల్ కేసుకూ మధ్య నేను వాచ్యార్థంగా కూడా ఎలాంటి పోలికలను చూపడం లేదు. చిన్న, పెద్ద సంక్షోభ సమయాల్లో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారనే దానికే ఈ సారూప్యత పరి మితం. ఇంగితజ్ఞానం చాలా అవసరమైనప్పుడే అది వారికి లేకుండా పోయినట్లు కనిపిస్తుంది.మణిపుర్లో ఎన్. బీరేన్ సింగ్‌ను ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగించడానికి బీజేపీ మొండిగా నిరాకరించడం ఏ రకంగానూ వివరించలేనిది. రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఆందో ళనకరంగా ఉందంటే, చాలామంది దీనిని అంతర్యుద్ధంతో పోల్చారు. అక్కడ మైతేయి, కుకీ సమాజాల మనుషులు ఒకరు ఆధిపత్యం వహించే భౌగోళిక ప్రాంతాలలోకి మరొకరు ప్రవేశించలేరు. జాతి సమూహాలను స్పష్టంగా వేరు చేసే ‘బఫర్ జోన్’ను ప్రమాదవశాత్తూ దాటిన కారణంగా సైన్యా నికి చెందిన ఒక మాజీ సైనికుడు వారం క్రితం హత్యకు గుర య్యాడు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చని పోయిన 11 మందిలో మహిళలు కూడా ఉన్నారు. రెండు వర్గాల ప్రజలు, రైతులు, విద్యార్థుల చేతుల్లో వేల సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి.ప్రతి ఒక్కరికి దేశభక్తి పరీక్షలను నిర్వహించే కీ–బోర్డ్ జాతీయవాదులు, స్వల్పంగా అసమ్మతి వ్యక్తం చేసే ప్రజలను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి వెనుకాడరు. అలాంటిది ఒక మాజీ సైనికుడు అయిన హవల్దార్ లిమ్ఖోలాల్ మాతే భార్య ‘నా భర్త భారతదేశం కోసం పోరాడాడు, కానీ తనను ఒక జంతువులా చంపేశారు’ అని ఏడుస్తూ చెప్పిన ప్పుడు, జాతీయవాదానికి స్వీయ నియమిత మధ్యవర్తులందరూ ఎక్కడ ఉన్నారు? మణిపుర్లో రాజకీయ పార్టీలు పతనమయ్యాయి. ఈ గొడవలో ముఖ్యమంత్రి పాత్రపై విచారణ జరిపించాలని కోరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీకి చెందిన వారే. హింస బయటినుంచి ఉన్నప్పుడు, ఉదాహరణకు తిరుగుబాట్లు లేదా యుద్ధ సమయంలో రాజకీయ నాయ కత్వం కొనసాగింపును నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది తనపై తాను యుద్ధంలో ఉన్న రాష్ట్రం. ఇది శాంతి భద్రతల వైఫల్యం. కానీ ఇది అన్నింటికంటే, రాజకీయాల వైఫల్యం. ముఖ్యమంత్రిని తొలగించడం అనేది స్పష్టంగా సరైన పని కావడమే కాకుండా, ఘర్షణ పడుతున్న పార్టీలను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి మణిపుర్ వరకు, తప్పక చేయ వలసిన చర్యే చాలాసార్లు సరైనది అవుతుంది. కానీ అలా చేయకపోగా దాన్ని ప్రతిఘటించడమే ఇక బాగు చేయలేని పరిస్థితికి నెట్టినట్టు అవుతోంది.బర్ఖా దత్‌వ్యాసకర్త ప్రముఖ జర్నలిస్టు, రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘సీఎం మమత చర్యలు తీసుకొని ఉంటే.. నా బిడ్డ బతికేది’
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితురాలికి న్యాయం చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. తన కూతురికి జరిగిన దారుణ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ల డాక్టర్లు తన బిడ్డలలాంటి వారని అన్నారు. సీఎం మమతా బెనర్జీ 2021లోనే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై చర్యలు తీసుకొని ఉంటే.. ఇవాళ తన కుమార్తె బతికే ఉండేదని అన్నారు.‘‘ సీబీఐ తన పని తాను చేస్తోంది. సీబీఐ విచారణ గురించి నేను ఏం మాట్లాడలేను. ఈ హత్యతో సంబంధం ఉన్నవాళ్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన వారందరూ విచారణలో ఉన్నారు. తీవ్రమైన బాధతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారంతా నా పిల్లలలాంటి వారు, వారిని చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. నిందితులకు శిక్ష పడిన రోజు మనం విజయం సాధించినట్టు. 2021లో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడే సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమత బెనర్జీ చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు నా కూతురు బతికే ఉండేది’’ అని అన్నారు."My daughter would have been alive...": RG Kar Medical College victim's father#RGKarMedicalCollege #victimfather #RGKarMedicalCollegecase #kolkataincident #newsupdate #CareForElders #StopInjustice #राष्ट्रीय_बेरोजगार_दिवस #Iran pic.twitter.com/XovHWLcdTU— The Savera Times (@thesavera) September 18, 2024credits: The Savera Timesమరోవైపు.. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటు వేయాలన్న వైద్యుల డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అంగీకరించింది. అనంతరం కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డాక్టర్ల ప్రతినిధి బృందం మధ్య జరిగిన సమావేశం అనంతరం జూడాల డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు ఇంకా తమ సమ్మెను విరమించకపోవటం గమనార్హం.చదవండి: జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం -
మమతా బెనర్జీ ప్రభుత్వంలో కోట్లలో అవినీతి: బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి సిర్కార్ రాసిన లేఖ ద్వారా.. అంతర్గతంగా టీఎంసీలో సీఎం మమత అవినీతి, నియంతృత్వ విధానాన్ని తెలియాజేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.సిర్కార్ లేఖ ద్వారా పశ్చిమ బెంగాల్లో అన్ని సంస్థల్లో కోట్లాది అవినీతి జరిగినట్లు తెలుస్తోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సీఎం దీదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీఎం మమత ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తోందని అన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగదని స్పష్టమవుతోందని తెలిపారు.‘‘జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సీఎం మమత ప్రభుత్వంలో లేదు. అయినా ఇంకా టీఎంసీ నేతలు నిరసనకారులను వేధిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకా మమతా బెనర్జీ సీఎంగా ఎందుకు కొనసాగుతున్నారు? ఆమె ఇంకా ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయటం లేదు? ఆమె రాజీనామా చేయకుండా కోల్‌కతా సీపీని, ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌ను ఎందుకు రక్షిస్తున్నారు?’ అని అన్నారు.#WATCH | On TMC Rajya Sabha MP Jawhar Sircar resigning as party MP, BJP leader Shehzad Poonawalla says, "If someone should give the resignation it should be West Bengal CM Mamata Banerjee...TMC government and Mamata Banerjee institutionalised corruption and in his letter, he… pic.twitter.com/tY1d4E59Nu— ANI (@ANI) September 8, 2024మరోవైపు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. -
ఈ రోజు ఆమెకు అంకితం: సీఎం మమత
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగ ఆవిర్భావ దినోత్సవాన్ని కోల్‌కతా హత్యాచార ఘటనలో బలైన జూనియర్ డాక్టర్‌కు అంకితం ఇస్తున్నట్లు బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.আজ তৃণমূল ছাত্র পরিষদের প্রতিষ্ঠা দিবসটিকে আমি উৎসর্গ করছি আমাদের সেই বোনটিকে, যাঁকে আমরা কয়েক দিন আগে আর জি কর হাসপাতালে মর্মান্তিকভাবে হারিয়ে শোকাহত। আর জি করে আমাদের সেই যে বোনকে নির্মমভাবে নির্যাতন করে হত্যা করা হয়েছিল, তাঁর পরিবারের প্রতি আন্তরিকতম সমবেদনা জানিয়ে এবং…— Mamata Banerjee (@MamataOfficial) August 28, 2024‘ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగ ఆవిర్భావ దినోత్సవాన్ని నేను కోల్‌కతా హత్యాచార ఘటనలో బలైన సోదరికి అంకితమిస్తున్నా. ఆమె మృతికి సంతాపం తెలియాజేస్తున్నా. ఆ సోదరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితురాలి కుటుంబ సభ్యులకు సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అలాగే భారతదేశం అంతటా ఇటువంటి అమానవీయ చర్యలకు గురైన మహిళందరికి సానుభూతి తెలియజేస్తున్నా.. క్షమించండి’ అని పేర్కొన్నారు.జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు మార్చ్ అడ్డుకోవటం కోసం.. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక..పోలీసులు తీరుపై నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బెంగాల్లో వ్యాప్తంగా 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చి కొనసాగిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయి హైఅలెర్ట్ ప్రకటించారు. -
కోల్‌కతాలో హైఅలర్ట్.. మూడు వలయాలుగా 6 వేలమంది పోలీసులు!
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన.. దేశాన్ని కుదిపేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం 'నబన్న అభిజన్' (మార్చ్ టు సెక్రటేరియట్) పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ భారీ ర్యాలీ జరగనుంది. అయితే హింస చేలరేగే అవకాశం ఉండడంతో కోల్‌కతా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద సుమారు 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల ముసుగులో.. అరాచక శక్తులు ర్యాలీలో పాల్గొన వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.#BreakingNews : कोलकाता डॉक्टर रेप-हत्या पर बड़ी खबर, भारी संख्या में छात्र आज करेंगे प्रदर्शन#KolkataDoctorDeathCase #KolkataDoctorDeath #CBI #KolkataDeathCase | @Nidhijourno @anchorjiya pic.twitter.com/mDjspQ4ons— Zee News (@ZeeNews) August 27, 2024క్రెడిట్స్: Zee News సామాన్య ప్రజలను రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 19 పాయింట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లు పలు పాయింట్ల వద్ద ఎప్పటికప్పుడు పోలీసు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కోల్‌కతా, హౌరాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. యువ వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. ఆగస్టు 14 అర్ధరాత్రి చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రతకు ప్లాన్ చేశారు. మరోవైపు.. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అడ్డుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. -
దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్
ఢాకా: తమ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత -
సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’
కోల్‌కతా: నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మమత చేసిన వ్యాఖ్యలపై వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.‘విదేశి వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి ఆశ్రయం కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. విదేశాల నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని సూచిస్తుంది. సీఎం మమత వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ ఆర్టికల్ 167 ప్రకారం వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.’అని రాజ్‌భవన్ మీడియా సెల్ ‘ఎక్స్’లో పేర్కొంది.HG has sought a report under Article 167 on the reported comment made by Chief Minister publicly on 21.07.2024:“…But I can tell you this, if helpless people come knocking on the doors of Bengal, we will surely provide them shelter.”Close on its heels came Government of India’s…— Raj Bhavan Media Cell (@BengalGovernor) July 22, 2024బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. -
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ తరఫున సీఎం మమత ప్రచారం!
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వదలుకున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో.. ఉపఎన్నికలో భాగంగా ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా గాంధీకి ఇదే మొదటి లోక్‌సభ ఎన్నిక కావటం గమనార్హం. అయితే ప్రియాంకా గాంధీ బరిలోకి దిగే వయనాడ్‌లో టీఎంసీ సుప్రీం నేత, సీఎం మమత ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌధరీకి మమతా బెనర్జీ మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు బాధ్యతగా బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి శుక్రవారం అధీర్ రంజన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల అంతర్గత సమావేశాల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. మమతా బెనర్జీకి తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే తాను విభేదించినట్లు చూడాలని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.కాగా, బెంగాల్లో సీఎం మమతను విభేదించే అధీర్ రంజన్ రాజీనామా చేయటంతో దీదీ.. ప్రియాంకా గాంధీ ప్రచారానికి సిద్ధమైనట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఇక.. లోక్‌సభలో ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ మొత్తం 42 స్థానాలకు గాను 29 సీట్లును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అధీర్ రంజన్ సైతం ఈసారి టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారీ కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలతో కలసి బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. -
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడనని అన్నారు. ‘‘నన్ను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం. కాంగ్రెస్ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు. ..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్‌ను ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.అంతకు ముందు అధీర్ రంజస్ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్‌లోని పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్ రంజన్ ఆరోపణలు చేశారు.అయితే ఆధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్ రంజన్ బహరాంపూర్ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది. -
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం. -
‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్ చేయాలి’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. సందేశ్‌కాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందుగుడు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ, సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవని తెలిపారు. ‘సందేశ్‌కాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవి. అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పడే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది. సందేశ్‌కాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం మమత బాధ్యత వహించాలి. సీఎం మమతను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని సువేందు డిమాండ్ చేశారు.Paschim Medinipur, West Bengal | Bengal Assembly LoP Suvendu Adhikari says, "All the weapons found in Sandeshkhali are foreign. Explosives like RDX are used in horrific anti-national activities. All these weapons are used by international terrorists. I demand to declare Trinamool… pic.twitter.com/IOfFUknMFL— ANI (@ANI) April 27, 2024 శుక్రవారం సందేశ్‌కాళీలో సీబీఐ జరిపిన సోదాల్లో టీఎంసీ సస్పెండెడ్ నేత షాజహాన్ షేక్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, ఒక పోలీసు తుపాకీ లభించింది. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులపై టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వేళ (శుక్రవారం) సీబీఐ పలు చోట్ల సోదాలు చేపట్టింది’ అని ఆరోపణలు చేసింది.జనవరిలో ఈడీ అధికారులుపై టీఎంసీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి శుక్రవారం సీబీఐ పలు చోట్లు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులు ఫ్రిబవరి 29న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం.. ఐదుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం సృష్టించటంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. సుమారు 500 మందికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ భారీ తుపాను, వడగళ్లతో జలపాయిగురి జిల్లాలో అనేక ఇళ్లు కూలిపోయాయి. తీవ్ర తుపాను కారణంగా రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. తుపాను పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీ బాగ్దోగ్రా ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. తుపాను సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని సీఎం తెలిపారు. Several homes damaged, trees uprooted due to storm in West Bengal's Jalpaiguri pic.twitter.com/3wBeikxOHJ — NDTV (@ndtv) March 31, 2024 జిల్లా ఉన్నతాధికారులు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారని తెలిపారు. బాధితులకు వైద్యసిబ్బంది చికిత్స అందిస్తోందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చోట అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలపాయిగురితో పాటు పక్కనే ఉన్న అలియుపుర్‌దువార్ కూచ్ బెహార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుపాను, వడగళ్ల ప్రభావం స్వల్పంగా చూపిందని కానీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. Sad to know that sudden heavy rainfall and stormy winds brought disasters today afternoon in some Jalpaiguri-Mainaguri areas, with loss of human lives, injuries, house damages, uprooting of trees and electricity poles etc. District and block administration, police, DMG and QRT… — Mamata Banerjee (@MamataOfficial) March 31, 2024 -
CAA: ‘బెంగాల్లో నిర్బంధ శిబిరాలను అనుమతించం’
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తోందని మండిపడ్డారు. అస్సాంలో ఉన్న విధంగా పశ్చిమ బెంగాల్‌కు నిర్బంధ శిబిరాలు అవసరం లేదని అన్నారు. ‘సీఏఏ అనేది ఎన్ఆర్సీ వంటిదే. అందుకే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్సాం ఉన్నట్లు మాకు నిర్బంధ కేంద్రాలు అవసరం లేదు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాము భూస్వాములం కాదని.. అప్రమత్తంగా ఉండే సంరక్షకులమని తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎవరినీ వెళ్లగొట్టమని అన్నారు. శరణార్థులంతా ఇక్కడే శాశ్వతంగా స్థిరపడవచ్చని సీఎం మమత అన్నారు. బీజేపీ హిందూ మతాన్ని వక్రీకరిస్తోందని.. స్వామి వివేకనంద బోధనలు నుంచి హిందుత్వాన్ని వేరు చేస్తోందని మండిపడ్డారు. సీఏఏతో భారత ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సీఎం మమత దుయ్యబట్టారు. ఇక.. 2019లో విదేశీయులతో కూడిన నిర్బంధ కేంద్రాలను అస్సాం ప్రభుత్వ నోటీఫై చేసిన విషయం తెలిసిందే. వారికి శాశ్వత కేంద్రాల ఏర్పాటు చేసే వరకు జైళ్లను కూడా ఉపయోగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజధాని దిస్పూర్కు సుమారు 130 కిలోమిటర్ల దూరం మాటియా అనే అతిపెద్ద నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నిర్బంధ కేంద్రంపై గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకేసారి మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీ నాయకులే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా.. సోదరుడు బాబున్ బెనర్జీ కీలకమైన హౌరా లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి సీఎం మమతా మరోసారి హౌరా స్థానం నుంచి అవకావం కల్పించారు. దీనిపై దీదీ సోదరుడు బాబున్ బెనర్జీ విమర్శించారు. ‘హౌరాకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో నేను సంతోషంగా లేను. ఆయన ఎంపిక సరైంది కాదు. అక్కడ చాలా సమర్థులైన నేతలు ఉన్నారు. వారందిరినీ కాదని ప్రసూన్ తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేయటం సరికాదు’ అని బాబున్ అన్నారు. మరోవైపు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. మమాతా బెనర్జీతో ఉన్నానని, దీదీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అడ్డం తిరుగుతున్న బాబున్ బెనర్జీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘నేను, నా కుటుంబం.. బాబున్ బెనర్జీతో సంబంధాలను వదులుకున్నాం. ప్రతి ఎన్నికల ముందు బాబున్ ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకువస్తాడు. అత్యాశ గల వ్యక్తులను నేను ఇష్టపడను.. కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అందుకే నేను హౌరా స్థానంలో ప్రసూన్‌కు టికెట్ కేటాయించా. సోదరుడు బాబున్తో అన్ని సంబంధాలు తెంచుకున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బాబున్ బెనర్జీ ఎప్పుడూ తన సోదరి సీఎం మమత బెనర్జీని విభేదిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో కూడా బాబున్ బెనర్జీ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించటంతో సీఎం మమతా ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో మరో రెండు మెట్రో కారిడార్లు -
సందేశ్‌ఖాలీ కేసు: షాజహాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్‌ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. సందేశ్‌ఖాలీ కేసులో షాజహన్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో టీఎంసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత ఎన్నిరోజులుగా పరారీలో ఉన్న షాజహన్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సందేశ్‌ఖాలీలోని భూములు లాక్కొని.. అక్కడి మహిళలపై లైగింక దాడులకు పాల్పడినట్లు షాజహన్ ఖాన్‌తో ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు సందేశ్ ఖాలీ గిరిజన మహిళలు షాజహన్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమయంలో ఈ నిరసనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ.. నిన్న ప్రధానిమోదీ బెంగాల్ పర్యటన అనంతరం తమ నేత అరెస్ట్ కావటం ఆవెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం. ఇక.. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, మంత్రి బ్రత్య బసు మీడియా సమావేశంలో తమ పార్టీ నేత షాజహన్ ఖాన్‌పై సస్పెన్షన్ విధించినట్లు మీడియాకు తెలిపారు. ‘సందేశ్‌ఖాలీ కేసు విషయంలో మేం చట్టప్రకారం నడుచుంటాం. కానీ.. ఈ విషయంలో బీజేపీ కావాలని మాకు అడుగడుగునా అడ్డుపడుతోంది. బీజేపీకి మేము సవాల్ విసురుతున్నాం. మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సందేశ్‌ఖాలీ విషయం మాకు కేంద్రానికి మధ్య.. బీజేపీకి టీఎంసీ మధ్య విషయం. ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి మాటలు చెప్పేదైతే.. టీఎంసీ చెప్పిన మాటలను ఆచరిస్తుంది’అని డెరెక్ ఓబ్రియన్ అన్నారు. -
‘బైనాక్యూలర్లో చూసినా కాంగ్రెస్‌కు మూడో సీటు కనిపించటం లేదు’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకంలో విషయంలో చర్చల వేగం పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో శివసేన( యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రేతో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో కూడా సీట్ల పంపకం గురించి మరోసారి సీఎం మమతా బెనర్జీ టీఎంసీతో చర్చలు జరుపుతారన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లను కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల నేపథ్యంలో టీఎంసీకి చెందిన ఓ కీలక నేత స్పందించారు. ‘బైనాక్యూలర్లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ కనిపించటం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి మూడో సీటును మేము గుర్తించలేకపోతున్నాం. ఏదేమైనా కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే త్వరలోనే ప్రకటిస్తాం’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రెండు సీట్లను మాత్రమే కేటాయిస్తామని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఇక.. కాంగ్రెస్ పార్టీ మరిన్ని సీట్ల కేటాయింపుకు పట్టుపట్టినా మమతా బెనర్జీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాము కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బెంగాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే పలుమార్లు రాహుల్ గాంధీ.. సీఎం మమతా బెనర్జీకి అనుకూలంగా మాట్లాడటంతో మళ్లీ సీట్ల పంపకంపై ఆశలు చిగురించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో చోటు చేసుకుంటున్న సీట్ల పంపకాల పరిణామాలతో బెంగాల్ కూడా సీట్ల పంపకం చర్చకు వచ్చింది. ఇక.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్‌తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో దాదాపు ఆరు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కాంగ్రెస్‌కు రిలీఫ్.. సీఎం మమత కీలక నిర్ణయం! -
Sandeshkhali: బెంగాల్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అశాంతి విషయంలో కోల్‌కతా హైకోర్టు సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసును మంగళవారం కోల్‌కతా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సందేశ్‌కాలీ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సమర్థించకూడదని పేర్కొంది. సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేత సువేందు అధికారి అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం స్పదించారు. సందేశ్‌కాళీ ప్రాంతంలోని మహిళలు చేసిన ఆరోపణలను హైకోర్టు గుర్తించిందని తెలిపారు. ‘మేము అక్కడి మహిళలకు సంబంధించి బాధలను చూశాం. ఆ ప్రాంతంలోని మహిళలు సమస్యలపై నిరసన తెలిపారు. అక్కడ కొంత భూమి ఆక్రమణకు గురైంది. ఈ కేసులో ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్రం ప్రభుత్వం కూడా విషయాన్ని సమర్ధించదు. ఆయన లొంగిపోవాలి. ఆయన చట్టాన్ని ధిక్కరించడం సాధ్యం కాదు’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘నేరాలకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన రక్షించబడుతున్నాడో? లేదో? మాకు తెలియదు. రాష్ట్ర పోలీసులు మాత్రం పలు ఘటనల్లో కీలకంగా ఉన్న షాజాహాన్ షేక్‌ను అరెస్ట్ చేయలేకపోయారు’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. చదవండి: Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు -
సీఎం మమతాకు మద్దతుగా! ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల సమస్యను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ.. సీఎం మమతా బెనర్జీ గతంలో చేసిన డిమాండ్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘నేను పశ్చిమ బెంగాల్లో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల దుస్థితి తెలపాడానికి లేఖ రాస్తున్నా. నేను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా బెంగాల్‌లోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్మికుల పరిస్థితి స్వయంగా గమనించారు. వారు కూడా పెద్ద ఎత్తున నా యాత్రలో పాల్గోని తమ సమస్యలపై వినతిపత్రం అందించారు కూడా. ..పశ్చిమ బెంగాల్లో ఉపాధి హామి కార్మికుల ఇబ్బందులను తెలుపుతూ పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సమితి నాయకులు నాకు వినతిపత్రం అందజేశారు. వారు రాసిన లేఖ ప్రతిని కూడా మీకు జత చేశాను. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద విడుదల చేసే నిధులను నిలిపివేయటంతో లక్షలాది పశ్చిమ బెంగాల్ సోదరీ సోదరీమణులు వేతనాలు అందక ఆర్థికంగా చితికి పోతున్నారు.’అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. ఇక.. మమతా బేనర్జీ టీఎంసీ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రం నిధులు విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశాయి. అఖరికి ఫిబ్రవరి 21 వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు 21 లక్షల ఉపాధిహామీ పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు అందజేస్తుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. గత ఏదాడి డిసెంబర్లో కూడా సీఎం మమతా.. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి ప్రధాని మోదీతో భేటీ అయి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ టీఎంసీ పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తుందని సీఎం మమతా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతాను బుజ్జగించే పనిలో భాగంగా తాజాగా అక్కడి గ్రామీణ ఉపాథి హామీ పథకం కార్మికుల నిధులకు విడుదలకు కేంద్రం చేస్తున్న జాప్యం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. -
‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులకు వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన తెలుపుతున్నారు. టీఎంసీ సంబంధించిన ఓ నేత తమ ప్రాంతపు మహిళలను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నాడని అక్కడి గిరిజన మహిళుల రోడ్లెక్కి మరీ తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. మమతా తన పార్టీ కార్యకర్తలతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని ప్రోత్సహిస్తూ.. హిందూ మారణహోమానికి తెరలేపుతోందని ఆరోపించారు. ‘మమతా బెనర్జీకి కేవలం హిందూ మారణహోహమమే తెలుసు. తన పార్టీ కార్యకర్తలు హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని అనుమతిస్తున్నారు. సందేశ్ కాళీ ప్రాంతంలో హిందూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరూ? ఇప్పటి వరకు షేక్ షాజాహాన్ ఎవరనీ చర్చించుకుంటున్నారు?. షేక్ షాజాహాన్ ఎక్కడ ఉన్నాడో? సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. #WATCH | On Sandeshkhali violence, Union Minister Smriti Irani says, "In Sandeshkhali, some women narrated their ordeals to the media... They said TMC goons visited door to door to identify the most beautiful woman in every house. Who is young. The husbands of identified women… pic.twitter.com/hXARkKp1sj — ANI (@ANI) February 12, 2024 టీఎంసీ ఆఫిసులోనే టీఎంసీ కార్యకర్తలు మహిళలపై రాత్రికి రాత్రి అఘాయిత్యాలకు పాల్పడటానికి అనుమతించటం మాటల్లో చెప్పలేనిదని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇలాంటీ దారుణాలు జరుగుతుంటే పౌరులు ఎట్టిపరిస్థితుల్లో మూగ ప్రేక్షకుల వలె ఉండరని టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే గిరిజన కూలాలు, తెగలను వాడుకుంటోందని దుయ్యబట్టారు. ఇక.. మమతా బెనర్జీ రాష్ట్ర హోం డిపార్టుమెంట్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవటంపై దేశంలో న్యాయం కోసం యాత్ర చేసేవారు కూడా స్పందించకపోవటం దారుణమని కాంగ్రెస్‌ను విమర్శించారు. హిందూవులపై దాడిల విషయంలో ప్రభుత్వం ప్రమేయం ఉందని స్మృతి ఇరానీ ఆరోపించారు. మరోవైపు.. సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులపై అక్కడి ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి కారణాలు తెలుసుకొని, పరిస్థితి చక్కదిద్దటానికి టీఎంసీ సీనియర్ నేత పార్థ భౌమిక్ రేపు(మంగళవారం) ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. చదవండి: ‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్ -
మమతా వర్సెస్ మోదీ: బెంగాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు!
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు అధిక సీట్ల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గతంతో పోల్చితే ఈసారి కొంత మెరుగైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్’ ఎన్నికల ఫలితాల అంచనాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. 2019లో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి దాని కంటే ఒక సీటు అదనంగా గెలుస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ఇక.. బెంగాల్లో అధికారంలో టీఎంసీ ఈసారి కూడా 22 స్థానాలకే పరిమితమవుందని వెల్లడించింది. గత పార్లమెంట్లో టీఎంసీ 22 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. అయితే 2024 పార్లమెంగ్ ఎన్నికల్లో సైతం 22 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది. ఇక.. కాంగ్రెస్ ఈసారిగా కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచి.. మూడు స్థానంలో నిలవనున్నట్లు తెలిపింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓటు షేరు విషయంలో కూడా ఎన్డీయే కూటమి గతం పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 40 శాతం.. ఈసారి కూడా సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఓటు షేరు విషయంతో ఇండియా కూటమి బెంగాల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల సాధించిన 57 శాతానికి 4 శాతం తగ్గి.. 53 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు గమనిస్తే.. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బెంగాల్ ప్రజలు నమ్మకం కలిగి ఉండరని తెలుసుస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక వ్యవహరించే టీఎంసీ అధినేత్రి.. బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 42 పార్లమెంట్ స్థానాలు ఉన్న బెంగాల్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కీలకంగా మారనున్న విషయం తెలిసిందే. -
‘బీజేపీకి మమతా బెనర్జీ భయపడుతున్నారు’
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ రాష్ట పీసీసీ చీఫ్, ఎంపీ అధీర్ రంజన్ చౌధరీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు పార్లమెంట్లో ఎన్నికల్లో కనీసం 40 సీట్లు కూడా వసస్తాయో? రావో? అనుమానమని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ‘బీజేపీ, మమతా బెనర్జీకి కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ఇష్టం లేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ టీఎంసీకి అధినేత్రి అయి ఉండి ఇలా ఉండటం దురదృష్టకరం. మమతా బెనర్జీ తనకు తానుగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరారు. మమతా బీజేపీకి భయడుతోంది. మరీ ఎందుకు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు’ అని అధీర్ రంజన్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. కాంగ్రెస్‌తో ఏం కాదని బీజేపీ అంటోంది. మమతా బెనర్జీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలవటం అనుమానం అంటున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకియాలు చేస్తోందని బీజేపీ, మోదీ అంటున్నారు. మమతా కూడా అవే మాటాలు వ్యాఖ్యాస్తున్నారు’అని దుయ్యబట్టారు. బీజేపీ, మమతా ఎందుకు ఒకే రాగం పడుతున్నారో? చెప్పాలని నిలదీశారు. మమతాకు ఎప్పుడూ రాష్ట్రం తరువాతేనని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముందు దేశం ప్రాధాన్యత అని.. ఆ తర్వాతే ఏదైనా అని తెలిపారు. చదవండి: కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్.. అక్కడ గెలిచే దమ్ముందా! -
కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్.. అక్కడ గెలిచే దమ్ముందా!
కోల్‌కతా: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలకు కనీసం 40 సీట్లు అయినా గెలుస్తుందో? లేదో? అనే అనుమానం కలుగుతోందని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ శుక్రవారం ముర్షిదాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ 300 సీట్లకు కనీసం 40 సీట్లలో అయినా గెలుస్తుందో? లేదో? అనుమానం కలుగుతోంది. ఎందుకు కాంగ్రెస్‌కు అంత అహంకాంరం? మీరు బెంగాల్ రండి. అప్పుడు మనమంతా ‘ఇండియా కూటమి’. మీకు దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపోవటం ఖాయం!’ అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘మేము యూపీలో గెలవము. మీరు రాజస్థాన్‌లో గెలవరు. ముందు రాజస్థాన్‌కు వెళ్లి అక్కడ గెలవండి. మీరు వారణాసి, అలహాబాద్‌లో గెలిచి మీ ధైర్యం చూపండి. మీ పార్టీ శక్తి, సామర్థ్యాలు ఏంటో నిరూపించుకోండి!’ అని సవాల్ విసిరారు మమతా బెనర్జీ. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై మమతా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ బెంగాల్ బీడీ కార్మికులతో మాట్లాడిన విషయంపై ప్రస్తుతం కొత్త స్టైల్ నడుస్తోందని.. అది ఫొటోషూట్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు కానీసం చాయ్ దుకాణం దగ్గరు వెళ్లని వారు.. నేడు మాత్రం బీడీ కార్మికుల వద్దకు వెళ్లారని అటువంటివారు బెంగాల్లో వలస పక్షులని మండిపడ్డారామె. ఇండియా కూటమి నుంచి వైదొలిగిన మమతా బెనర్జీ.. బెంగాల్లో తాము ఒంటరి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ రెండు సీట్లు కేటాయిస్తామని తెలిపిన మమతా.. తర్వాత ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. -
‘కాంగ్రెస్ పనికి రాని పార్టీ.. కూటమి అసహజమైంది’
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో కీలకంగా వ్యవహిరించే కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ షాక్ ఇచ్చింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్, ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్న కాంగెస్ పార్టీ ఓ పనికిరాని పార్టీ.. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ అసహజమైంది’ అని కర్ణాటక బీజేపీ నేత ఆర్.అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ కూటమి చాలా అసహజమైంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు.. టీఎంసీ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయి. కొన్ని రోజులు క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ, సీపీఎం కర్యర్తులు ఘర్షణకు దిగారు. ఆ విషయం సీఎం మమతాకు తెలుసు’ అని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి మండిపడ్డారు. ‘ప్రతిపక్ష కాంగ్రెస్ ఇండియా కూటమి ముక్కలైంది. సీఎం మమతా బెనర్జీ, నితేష్ కుమార్, అఖిలేష్ లాంటి నేతలు లేకుండా ఉంటే.. అదేం కూటమి?. మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది’ అని కర్ణాటక బీజేపీ నేత బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కొన్ని పార్టీలు ఈడీ, సీబీఐకి బయపడి ‘ఇండియా కూటమి’లో చేరాయి. మమతా చేసిన ఒంటరి పోరు ప్రకటనే దీనికి నిదర్శనం. కాంగ్రెస్ మమతా పెద్ద షాక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ భారత్ నాయ్య యాత్ర పేరుతో కనీసం కూటమిలోని విపక్షాలను ఏకం చేయలేకపోయారు. దేశం మొత్తాన్ని ఎలా ఏకం చేస్తారు? ’ అని బీజేపీ నేత రాహుల్ సిన్హా ఎద్దేవా చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము ఒంటరిగానే పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. పంజాబ్‌లో ఉన్న 13 పార్లమెంట్ స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక.. ప్రతిపక్షాల కూటమిలో కీలకంగా వ్యవహరిస్తాయనుకున్న టీఎంసీ, ఆప్ పార్టీలు మొదట కూటమికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహించాలని ప్రతిపాదించటం గమనార్హం. అటువంటి పార్టీలే తాము తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించటంలో ఆయా పార్టీల్లో, కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. చదవండి: మమతా లేని ఇండియా కూటమిని ఊహించలేము: కాంగ్రెస్ -
కాంగ్రెస్‌కు షాక్.. అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థుల పోటీ!
కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి కూటమిలో కీలకమైన భాగస్వామ్య పార్టీగా వ్యవహరిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున బెర్హంపూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరీ గెలుపొందిన విషయం తెలిసిందే. బెర్హంపూర్ సెగ్మెంట్లో కూడా టీఎంసీ తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడుతామని యోచిస్తున్నట్లు సమాచారం. ‘ఇండియా కూటమీ’ లో భాగస్వామ్య పార్టీ అయిన టీఎంసీ.. మొదటి నుంచి పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లను ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. అయితే అనూహ్యంగా అన్ని స్థానాల్లో(42) టీఎంసీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎంసీ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్, ‘ఇండియా కూటమి’లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీ 22, బీజేపీ18, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: ‘జమిలి ఎన్నికలు.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు వ్యతిరేకం’ -
‘మమతా కంటే.. లెఫ్ట్ పార్టీల పాలన మేలు’
కోల్‌కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ మమతా బెనర్జీ పాలన కంటే గతంలో పాలించిన కమ్యూనిస్టు పార్టీల పాలనే బాగుండేదని ఎద్దేవా చేశారు. మంగవారం కోల్‌కతాలో బీజేపీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తృణమూళ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. బెంగాల్లో మమతా పాలనలో అక్రమ వలసలు, గోవుల ఆక్రమ రవాణా పెరిగిపోయని మండిపడ్డారు. బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మమతా బెనర్జీ ఆగడాలకు స్వస్తి పలుకుతామని అన్నారు. దీదీ పాలన కంటే 34 ఏళ్లు పాలించిన కమ్యూనిస్టుల పాలన బాగుండేదని అమిత్ షా అన్నారు. ఇదే విషయాన్ని బెంగాల్ ప్రజలు సైతం అనుకుంటున్నారని తెలిపారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడం బీజేపీ నిబద్దతకు నిదర్శనమని తెలిపారు. ఎట్టిపరిస్థిల్లో సీఏఏను అమలు చేసి తీరుతామని తెలిపారు. బెంగాల్ మమతా బెనర్జీ సీఏఏ విషయంలో ప్రజలను మరింత గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు-2019.. పాకిస్తాన్, బంగ్లాదేశ్,ఆఫ్గానిస్తాన్ల్లో మతపరమైన వేధింపులు ఎందుర్కొని భారత్‌కు వచ్చే ముస్లియేతరలకు భారత పౌరసత్వం కల్పించనున్న విషయం తెలిసిందే.