కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి సిర్కార్ రాసిన లేఖ ద్వారా.. అంతర్గతంగా టీఎంసీలో సీఎం మమత అవినీతి, నియంతృత్వ విధానాన్ని తెలియాజేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
సిర్కార్ లేఖ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో అన్ని సంస్థల్లో కోట్లాది అవినీతి జరిగినట్లు తెలుస్తోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సీఎం దీదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీఎం మమత ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తోందని అన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగదని స్పష్టమవుతోందని తెలిపారు.
‘‘జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సీఎం మమత ప్రభుత్వంలో లేదు. అయినా ఇంకా టీఎంసీ నేతలు నిరసనకారులను వేధిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకా మమతా బెనర్జీ సీఎంగా ఎందుకు కొనసాగుతున్నారు? ఆమె ఇంకా ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయటం లేదు? ఆమె రాజీనామా చేయకుండా కోల్‌కతా సీపీని, ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌ను ఎందుకు రక్షిస్తున్నారు?’ అని అన్నారు.
#WATCH | On TMC Rajya Sabha MP Jawhar Sircar resigning as party MP, BJP leader Shehzad Poonawalla says, "If someone should give the resignation it should be West Bengal CM Mamata Banerjee...TMC government and Mamata Banerjee institutionalised corruption and in his letter, he… pic.twitter.com/tY1d4E59Nu
— ANI (@ANI) September 8, 2024
మరోవైపు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment