కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్‌ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. సందేశ్‌ఖాలీ కేసులో షాజహన్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో టీఎంసీ ఆయన్ను సస్పెండ్ చేసింది.
గత ఎన్నిరోజులుగా పరారీలో ఉన్న షాజహన్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సందేశ్‌ఖాలీలోని భూములు లాక్కొని.. అక్కడి మహిళలపై లైగింక దాడులకు పాల్పడినట్లు షాజహన్ ఖాన్‌తో ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు సందేశ్ ఖాలీ గిరిజన మహిళలు షాజహన్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికలు సమయంలో ఈ నిరసనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ.. నిన్న ప్రధానిమోదీ బెంగాల్ పర్యటన అనంతరం తమ నేత అరెస్ట్ కావటం ఆవెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం.
ఇక.. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, మంత్రి బ్రత్య బసు మీడియా సమావేశంలో తమ పార్టీ నేత షాజహన్ ఖాన్‌పై సస్పెన్షన్ విధించినట్లు మీడియాకు తెలిపారు. ‘సందేశ్‌ఖాలీ కేసు విషయంలో మేం చట్టప్రకారం నడుచుంటాం. కానీ.. ఈ విషయంలో బీజేపీ కావాలని మాకు అడుగడుగునా అడ్డుపడుతోంది. బీజేపీకి మేము సవాల్ విసురుతున్నాం. మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సందేశ్‌ఖాలీ విషయం మాకు కేంద్రానికి మధ్య.. బీజేపీకి టీఎంసీ మధ్య విషయం. ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి మాటలు చెప్పేదైతే.. టీఎంసీ చెప్పిన మాటలను ఆచరిస్తుంది’అని డెరెక్ ఓబ్రియన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment