
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ ఇప్పటికే థియేటర్‌లోకి వచ్చి వెళ్లిపోయి కూడా చాలారోజులు అయిపోయింది. అయితే, ఈ సినిమాలో పనిచేసిన కొందరు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమాలో పనిచేసినందుకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసం కో డైరెక్టర్‌గా పనిచేసిన స్వర్గం శివతో ఒప్పందం చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో విజయవాడ, గుంటూరు నుంచి చాలామందితో పాటు హైదరాబాద్ వెళ్లి షూటింగ్‌లో పాల్గొంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు చెప్పుకొచ్చారు.
స్వర్గం శివ తమకు రూ.1200 వంతున ఇస్తానని ఒప్పుకొని చాలా రోజులుగా డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు వద్దకు తీసుకెళ్లాలని మీడియాను కోరారు. ఇందులో దిల్ రాజు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆర్టిస్ట్ తరుణ్, ఇతరులు కోరారు. తమను మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీం తమను మోసం చేసిందని పోలీస్ స్టేషన్‌లో ఆర్టిస్టుల ఫిర్యాదు
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్ కి 350 మంది వెళ్లామని, కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్‌లో… pic.twitter.com/39etzw3mTb— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025