గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. శంకర్ డైరెక్షన్ విజన్ టీజర్, సాంగ్స్ చూస్తేనే తెలుస్తోందన్నారు. ఈ సినిమాలో అన్ ప్రిడిక్టబుల్ సీన్స్ చాలా ఉంటాయని తెలిపారు. ప్రసాద్ ల్యాబ్‌కెళ్లి రెండు రీల్స్ చూశా.. అవీ చూశాక తొడ గొట్టాలని అనిపించిందన్నారు. ఈ నెల 10 తేదీ వరకు మీలాగే మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని దిల్ రాజు అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ..'ఒక తమిళ్ సినిమాని పాన్ ఇండియా చేసిన శంకర్ గారికి, తెలుగు సినిమాని గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు. మా లాంటి వారికి ఎంతో ధైర్యాన్నిచ్చారు. శంకర్ విజన్ ఒక్కో స్టెప్‌గా చూపిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం 40 నుంచి 50 శాతం వరకే చూపించాం. నిన్ననే ప్రసాద్ ల్యాబ్‌లో రెండు రీల్స్ చూసి తొడ గొట్టాలనిపించింది. జెంటిల్‌మెన్, భారతీయుడు, శివాజీ లాంటి శంకర్ సినిమాలు కమర్షియల్ హిట్స్. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరుగుతుంది. మా సినిమాకు లాభాలు కచ్చితంగా వస్తాయని' అన్నారు.
(ఇది చదవండి: 'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి)
కాగా.. శంకర్- రామ్ చరణ్ డైరెక్షన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment