గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie). స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు.
(ఇది చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)
తాజాగా రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ స్టోరీగానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఫైట్స్, డైలాగ్స్ మెగా ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్, ఎస్‌జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయే వరకు ఐఏఎస్' అనే డైలాగ్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్ కి సర్..' అనే డైలాగ్ ఎస్‌జే సూర్యతో చెప్పే డైలాగ్ మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్ ట్రైలర్‌లో ఫైట్స్, విజువల్స్‌లో డైరెక్టర్ శంకర్ మార్క్ కనిపిస్తోంది.
(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!)
ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో కోలీవుడ్‌లోనూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment