sankar
-
'గేమ్ ఛేంజర్' తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందాయి. ఇందిరాగాంధీ, జయలలిత, కామరాజర్, భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. నటుడు ధనుష్ ఈ చిత్రంలో ఇళయరాజాగా నటించనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఈ చిత్రం ఇప్పుడు డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇప్పుడు నటుడు రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడు శంకర్ (Shankar) చేసిన వ్యాఖ్యలే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ (Game Changer) చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత దర్శకులు శంకర్ మరో సినిమాపై అడుగులు వేస్తున్నారు.తన తదుపరి చిత్రం గురించి శంకర్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను తెరకెక్కించాలన్న కోరికను వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లో 50 ఏళ్లుగా కథానాయకుడిగా ఏకచత్రాధిపత్యాన్ని సాగిస్తున్న రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కుతుందా..? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కాగా దర్శకుడు శంకర్ ఇప్పటికే రజనీకాంత్ హీరోగా శివాజీ, రోబో, 2.ఓ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ( ఇదీ చదవండి: ఊహలకు మించి డాకు మహారాజ్ ఉంటుంది: బాలకృష్ణ)కాగా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రాన్ని సిద్ధం అవుతారని తెలుస్తోంది. అదేవిధంగా దర్శకుడు శంకర్ వెల్పారి చిత్రాన్ని తెర రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి గతంలో ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఇందులో సూర్య, విక్రమ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన రజనీకాంత్ బయోపిక్ ఎప్పుడు తెరకెక్కిస్తారు ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
'గేమ్ ఛేంజర్ ఈవెంట్లో ఆసక్తికర సన్నివేశం'.. యాంకర్ సుమపై శంకర్ ప్రశంసలు!
గేమ్ ఛేంజర్ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని కొనియాడారు. రామ్ చరణ్ ఆర్టిస్ట్ కంటే ఆయన క్యారెక్టర్ మాత్రమే ఇందులో కనపడుతుందని ప్రశంసలు కురిపించారు. నా నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్నీ కూడా గేమ్ ఛేంజర్‌లో ఉంటాయన్నారు. తమన్ బీజీఎం ఏఆర్ రెహమాన్‌ను తలపించేలా చేశారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరి నటనను శంకర్ ప్రశంసించారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథతోనే గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించినట్లు శంకర్ తెలిపారు. అయితే ఈ ఈవెంట్లో యాంకర్ సుమ, డైరెక్టర్ శంకర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అదేంటో చూసేద్దాం.గేమ్ ఛేంజర్‌లో రాజీవ్ కనకాల అద్భుతమైన నటనతో మెప్పించారని శంకర్ అన్నారు. అదే సమయంలో సుమ కనకాల మధ్యలో వచ్చిన ఆయన నా భర్త సార్ అని అన్నారు. దీనికి బదులిస్తూ ఆ విషయం నాకు తెలుసు.. మిమ్మల్ని చాలా ఏళ్లుగా చూస్తున్నాని అన్నారు. స్టేజ్‌పై వేల మంది ఆడియన్స్ ఉన్నప్పటికీ అందరినీ కంట్రోల్ చేసే సత్తా మీకుందని సుమను పొగిడారు. కానీ నా భర్త మీద మాత్రమే కంట్రోల్ లేదు సార్ సుమ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఈ ఫన్నీ సంభాషణతో అక్కడున్నవారంతా ముసిముసి నవ్వులు చిందించారు.కాగా.. శంకర్- రామ్ చరణ్ డైరెక్షన్లో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie). స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)తాజాగా రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ స్టోరీగానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఫైట్స్, డైలాగ్స్ మెగా ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయే వరకు ఐఏఎస్' అనే డైలాగ్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్ కి సర్..' అనే డైలాగ్ ఎస్జే సూర్యతో చెప్పే డైలాగ్ మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్ ట్రైలర్లో ఫైట్స్, విజువల్స్‌లో డైరెక్టర్ శంకర్ మార్క్ కనిపిస్తోంది. (ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!)ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో కోలీవుడ్‌లోనూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
గేమ్ ఛేంజర్ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?
రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ విడుదలకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కేవలం వారం రోజుల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం సాయంత్రం 5.04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను రీలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా పూర్తి రన్‌టైమ్ ఎంతో సెన్సార్ ప్రకటించింది.గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రన్‌టైమ్ 2:45 గంటలు ఉందని సెన్సార్ బోర్డ్ తెలిపింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం సాయంత్రం 2.43 నిమిషాల నిడివితో ట్రైలర్ విడుదల కానుంది. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ కావడం గ్యారెంటీ అంటూ అభిమానులు ఆశిస్తున్నారు. 'వినయ విధేయ రామ'చిత్రం తర్వాత రామ్ చరణ్– కియారా అద్వానీ రెండోసారి జోడీగా నటించారు. రెమ్యునరేషన్ తగ్గించుకున్న చరణ్.. కారణం ఇదేనా..?ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఆయన నుంచి సినిమా విడుదల కానుంది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఈ సినిమా కోసం చరణ్ తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు దర్శకుడు శంకర్ కూడా చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. చరణ్ రూ. 60 కోట్లు, శంకర్ 30 కోట్లు మాత్రమే తమ రెమ్యూనరేషన్లుగా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే, రామ్ చరణ్ ఏ సినిమాకు అయిన ఓకే చెబితే.. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే తన రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది. ఆయన అడ్వాన్సులు వంటివి తీసుకోరట. అదే ఆయనకు ఇప్పుడు మైనస్ అయిందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా 2024లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ కారణం వల్ల ముందుగా అనుకున్న తన రెమ్యునరేషన్‌ను చరణ్ తగ్గించుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం అవుతుంది. -
తమిళనాడులో 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ
సౌత్ ఇండియాలో ఈ సారి సంక్రాంతికి సినీ సంబరాలు గ్యారెంటీ అనిపిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా బరిలోకి చాలా చిత్రాలు ఉన్నా యి. తెలుగులో డాకు మహరాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు టాప్‌లో ఉన్నాయి. కానీ, తమిళ్లో నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన 'విడాముయర్చి' ప్రధానంగా రేసులో ఉంది. ఈ చిత్రం పొంగల్‌కు తెరపైకి రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదలను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది నటుడు అజిత్ అభిమానులను నిరాశ పరచే విషయమే అవుతుంది.కాగా విడాముయర్చి చిత్రం వాయిదా పడటంతో కొత్తగా మరిన్ని చిత్రాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అజిత్ సినిమా వాయిదాతో ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి మరిన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. పొంగల్ రేసులో తమిళ పెద్ద హీరోలు ఎవరూ లేకపోవడంతో శంకర్, రామ్ చరణ్‌లు అక్కడ గేమ్ ఛేంజర్స్‌గా నివలనున్నారు. అయితే, ఈ సంక్రాంతి బరిలో నటుడు జయంరవి, నిత్యామీనన్ జంటగా నటించిన 'కాదలిక్క నేనమిలై' చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. అదే విధంగా సంచలన దర్శకుడు బాలా తెరకె క్కించిన వణంగాన్ చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుంది. నటుడు అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్కామాక్షీ భారీ ఎత్తున నిర్మించారు.ఇకపోతే వీటంన్నిటిలో భారీ బడ్జెట్ సినిమాగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్‌పైనే కోలీవుడ్ అభిమానులు ఉన్నారు. సంక్రాంతి బరి నుంచి అజిత్ నటించిన విడాముయర్చి తప్పుకోవడంతో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌కు భారీ ప్లస్ అవుతుందని చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతి చిత్రాల్లో ఈ రెండు చిత్రాలపైనే భారీ అంచనాలు ఇప్పటి వరకు ఉన్నాయి. చివరి క్షణంలో అజిత్ తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్‌కు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్తో కోలీవుడ్ సినీ అభిమానులకు చరణ్ దగ్గరయ్యాడు. ఇప్పుడు అక్కడ పెద్ద సినిమాలు లేవు కాబట్టి గేమ్ ఛేంజర్‌కు భారీ ఓపెనింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. -
ఇండియా బిగ్గెస్ట్ 'రామ్ చరణ్' కటౌట్.. ఆవిష్కరించనున్న గేమ్ ఛేంజర్ టీమ్
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను విజయవాడలో ఆయన ఫ్యాన్స్ ఆవిష్కరించనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్ ఆవిష్కరించనుంది.256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఆదివారం నాడు హెలికాప్టర్‌తో కటౌట్‌కి పూలభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు హాజరు కానున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజులగా అభిమానులు కష్టపడ్డారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేలకు పైగానే ఫ్యాన్స్ రావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్ చరణ్ అభిమానులు వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగ జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. -
'దీనమ్మ దిమ్మదిరిగి బొమ్మ కనపడింది'.. గేమ్ ఛేంజర్‌పై ఎస్జే సూర్య
మెగాహీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య. ఇటీవలే సరిపోదా శనివారం మూవీతో అలరించిన ఆయన.. గేమ్ ఛేంజర్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తాను రెండు ముఖ్యమైన సీన్లకు డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నానని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఒకటి రామ్ చరణ్‌తో.. మరొకటి శ్రీకాంత్‌తో సీన్స్ కాగా.. వీటికి ఏకంగా మూడు రోజుల సమయం పట్టిందని తెలిపారు. అయితే అవుట్‌పుట్ మాత్రం 'దీనమ్మ దిమ్మదిరిగి బొమ్మ కనపడిందని'.. థియేటర్లలో పిచ్చేక్కిస్తాయని సూర్య పోస్ట్ చేశారు. 'పోతారు మొత్తం పోతారు' అంటూ తనతు ఈ అవకాశమిచ్చిన డైరెక్టర్ శంకర్‌కు, నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతికి థియేటర్లలో కలుసుకుందాం అంటూ ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.ఇటీవల విడుదల చేసిన గేమ్ ఛేంజర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఇప్పటికే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలెట్టారు. ఈ నెలలోనే ఫ్యాన్స్‌కు మరో అప్డేట్ ఇవ్వనున్నారు. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజవ్వగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరో సింగిల్‌ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని హింట్ ఇచ్చారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, ప్రకాశ్‌రాజ్, నాజర్, సముద్రఖని, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.Hi friends , I just finished dubbing of two vital scenes in #GAMECHANGER (one with our Global star @AlwaysRamCharan garu & another with Srikant garu … it took 3 whole days to finish these 2 scenes dubbing …. The out put came out like “ dheenamma dhimma thirigi bomma…— S J Suryah (@iam_SJSuryah) November 21, 2024 -
ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రూ.100 కోట్లు ఉంటేనే..భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. -
మెగా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ఆ రోజే సర్ప్రైజ్!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనుకోకుండా సంక్రాంతి బరిలో నిలిచింది. చిరంజీవి పొంగల్ బరి నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో రామ్ చరణ్ వచ్చేస్తున్నారు. రిలీజ్‌కు ఇంకా 75 రోజుల సమయం ఉండడంతో మేకర్స్ నుంచి అప్డేట్స్ రావడం మొదలైంది. ఇప్పటికే నవంబర్‌లో కచ్చితంగా అప్డేట్స్ ఉంటాయని ప్రకటించిన టీమ్.. తాజాగా టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చింది.త్వరలోనే గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ అవుతుందని ప్రకటించింది. నాలుగు రోజుల్లో దీపావళి ఉండడంతో మెగా ఫ్యాన్స్‌కు ఆ రోజే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించిన దిల్ రాజు)కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. Unleashing the explosive power worldwide in 75 Days ❤️🔥The #GameChangerTeaser fireworks to begin soon 🧨💥#GameChanger In Cinemas near you from 10.01.2025! pic.twitter.com/b5bhC0BezZ— Game Changer (@GameChangerOffl) October 27, 2024 -
దర్శకుడు శంకర్ కూతురు ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందా..?
సినిమా రంగంలో సెంటిమెంట్ ఎక్కువేనని చెప్పక తప్పదు. ఒక్క హిట్ వస్తే చాలు సినిమా పరిశ్రమ నెత్తికెక్కించుకుంటుంది. అదే ఒక్క ప్లాప్ వచ్చినా, ఐరన్‌లెగ్ ముద్ర వేసేస్తారు. దర్శకుడు శంకర్ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన అదితి శంకర్ కథానాయకిగా తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. ఆమె నటించిన మొదటి చిత్రం కార్తీకు జంటగా 'విరుమాన్'లో నటించి హిట్ అందుకున్నారు. అందులో ఆమె గాయనిగానూ పరిచయం అయ్యారు. అదే విధంగా అదితి శంకర్ నటించిన రెండవ చిత్రం మహావీరన్ (మహావీరుడు) కూడా హిట్ అయ్యింది. దీంతో ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు. ప్రస్తుతం ఆకాశ్ మురళికి జంటగా కోలీవుడ్‌లో నేశిప్పాయా అనే చిత్రంతో పాటు అర్జున్‌దాస్‌కు జంటగా మరో చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. వీటి తరువాత నటుడు అధర్యకు జంటగా ఇంకో చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నేశిప్పాయా చిత్రం ద్వారా దివంగత నటుడు మురళి రెండవ వారసుడు ఆకాశ్ మురళి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంపైనే ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నేశిప్పాయా చిత్రంతో నటి అదితి శంకర్ తన సక్సెస్‌ను కొనసాగిస్తారా? హ్యాట్రిక్ కొడతారా? అన్నదే ప్రస్తుతం జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ఇందులోని తొలంజ మనసు అనే పల్లవితో సాగే పాటను తాజాగా విడుదల చేశారు. కాగా ఇందులో ప్రభు, శరత్‌కుమార్, కుష్భూ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
చిట్టికి 14 ఏళ్లు పూర్తి.. మేకర్స్ స్పెషల్ వీడియో వైరల్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులో రోబో పేరుతో విడుదలైన ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిట్టి అనే పేరు గల రోబో ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రోబో-2ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్.అయితే ఎంథిరన్(రోబో) విడుదలై సరిగ్గా నేటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ యాజమాన్యం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. భారతీయ సినిమాని పునర్వైభవం తీసుకొచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం.. ఏ మాస్టర్ పీస్ ఎంతిరన్ 14 సంవత్సరాల వేడుక జరుపుకుంటోంది అంటూ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.The sci-fi journey that redefined Indian Cinema💥 Celebrating the 14 years of the masterpiece #Enthiran#14YearsofEnthiran pic.twitter.com/L61SIAZ59L— Sun Pictures (@sunpictures) October 1, 2024 -
డైరెక్టర్ శంకర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్. తాజాగా విడుదలైన ఇండియన్– 2 చిత్రం వరకూ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే.. అయితే ఇటీవల విడుదలై ఇండియన్– 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా ప్రస్తుతం స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో మళ్లీ సూపర్‌హిట్ బాట పట్టడానికి దర్శకుడు శంకర్ శ్రమిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత ఇండియన్– 3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే మరో భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు శంకర్ ఉన్నారు. ఏల్పారి నవల హక్కులను పొందిన శంకర్ దీన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీన్నీ మల్టీస్టారర్ చిత్రంగా రూపొందించనున్నట్లు తెలిసింది. ఆ స్టార్ హీరోలెవరో కాదు చియాన్ విక్రమ్, సూర్య అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితం నటించిన పితామగన్ అనే సంచలన విజయం సాధించింది. కాగా ఇప్పుడు నటుడు విక్రమ్, సూర్య కలిసి నటిస్తే వేల్పారి నవల మరో సంచలన చిత్రం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?
సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్ ఛేంజర్'. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్‌కు గురయ్యారు. దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్.వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానన్నారు. దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు. దేవర గురించే కామెంట్..?దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్‌గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ డేట్ ఫిక్స్ అయినట్టే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా హీరో నటిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్లో ఈ మూవీని పొలిటికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది.అయితే మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజవుతుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కానీ విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గేమ్ ఛేంజర్ విడుదలపై హింట్ ఇచ్చాడు. వచ్చే వారం నుంచే గేమ్ ఛేంజర్‌కు సంబంధించిన అన్‌స్టాపబుల్ ఈవెంట్స్ డిసెంబర్ 20 వరకు జరుగుతాయని పోస్ట్ చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ కానుందని అభిమానులు భావిస్తున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు అయినట్లే. కాగా.. ఈ చిత్రం శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.రామ్ చరణ్ బిజీ..గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవల ఈ మూవీ కోసం ఫిట్నెస్ ట్రైనర్ శివోహంతో కలిసి కసరత్తులు చేస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. From next week it will be an unstoppable Events forand releases for #GAMECHANGER till DEC 20 th 2024 ❤️🧨✨Get ready guys !!— thaman S (@MusicThaman) September 18, 2024 -
దారుణంగా ఇండియన్-2 కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. భారతీయుడు సీక్వెల్‌గా తీసుకొచ్చిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలి రెండు కలెక్షన్స్ ఫర్వాలేదనిపించినప్పటికీ... ఆ తర్వాత దారుణంగా పడిపోయాయి. వీక్ డేస్‌లో ఊహించనా కలెక్షన్స్ రాలేదు. తాజాగా ఏడు రోజుల్లో ఇండియన్-2 సినిమాకు ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఏడో రోజు ఇండియాలో కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు సాధించింది. ఇండియన్ 2 మూవీపై మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడం కలెక్షన్స్‌ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వారం రోజుల్లో రూ. 121.65కిపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలాగే కొనసాగితే ఇండియాలో రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా.. ఇండియన్ 2 సినిమాకు మొదటి రోజు రూ. 25.6 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. -
ఇండియన్-2 పై నెగెటివ్ టాక్.. మేకర్స్ కీలక నిర్ణయం!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే ఇండియన్-2 నిడివి ఎక్కువగా ఉండడం.. శంకర్ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అయితే నిడివి ఎక్కువగా ఉండడం.. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3.04 నిమిషాల రన్టైమ్తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్-2 నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్ తాజాగా ట్వీట్ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్‌కు రన్ టైన్ తగ్గించిన ఇండియన్-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. పడిపోయిన వసూళ్లుఇండియన్-2కు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇండియావ్యాప్తంగా కేవలం రూ.65 కోట్లకు పైగా వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కమల్ అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కనిపించారు. ఇందులో సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Witness the enhanced version of #Indian2 🇮🇳✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! 💥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/0reMKOvMIe— Lyca Productions (@LycaProductions) July 17, 2024 -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. నెట్టింట లీకైన వీడియో!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ పార్ట్ పూర్తయింది. ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని శంకర్ ప్రకటించారు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. షూటింగ్‌కు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సీన్‌ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. వీడియో చూస్తే రామ్ చరణ్, విలన్‌కు మధ్య కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ సన్నివేశాలు లీక్ కావడంపై అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఇండియన్-2 థియేటర్లలో రిలీజైంది. #Gamechanger Leaked scene here it's...An Airport sequence 🌟Shankar cooking something against #government 😂💥#Ramcharan #Shankar #Kollywood #Tollywood #Raayantrailer #Indian2Disaster #MaxTeaser #Encounter #leak pic.twitter.com/nrua55J8mx— Vikki (@stupid_guy_07) July 16, 2024 -
భారతీయుడు-2 మూవీపై అలాంటి ట్వీట్.. డైరెక్టర్‌పై నెటిజన్స్ ఫైర్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. 1996లో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ చిత్రంలో శంకర్ మార్క్ కనిపించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇండియన్-2 సినిమాపై ట్వీట్ చేశారు. శంకర్ సార్ నిబద్ధతకు.. కమల్ హాసన్ నటనకు భారతీయుడు-2 చిత్రం నిదర్శనమన్నారు. అద్భుతమైన బీజీఎం అందించిన అనిరుధ్ రవిచందర్‌కు నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇండియన్-3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు.అయితే ఇది చూసిన నెటిజన్స్ లోకేశ్ కనగరాజ్ ట్వీట్‌పై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి రివ్యూ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇలాంటి జోకులు వేయడం అపండి సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియన్-3 కోసం తాము సిద్ధంగా లేమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మీరు కమల్ సార్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇలా చెప్పడం తగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి కూలీ మూవీ, ఖైదీ, విక్రమ్ లాంటి సీక్వెల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండని లోకేశ్‌కు సూచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నిడివి ఎక్కువైందంటూ బాక్సాఫీస్ వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియన్-2పై పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో నెటిజన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. #Indian2 is proof of our #Ulaganayagan @ikamalhaasan sir’s commitment to his craft. Kudos to @shankarshanmugh sir for bringing grand visions to life on a massive scale with @anirudhofficial’s scintillating background score for the film! 🤗❤️Can’t wait for #Indian3 🔥🔥— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 13, 2024 -
భారతీయుడు 2 కలెక్షన్స్.. ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా లేవు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా జులై 12న ఈ మూవీ విడుదలైంది. ఇందులో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. అయితే, సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేదని తేలుతుంది.(చదవండి: : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)ఇండియన్ 2 మూవీ తొలిరోజు రూ. 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్ వర్షన్లో రూ. 16 కోట్లు వస్తే.. తెలుగులో రూ. 8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అయితే మరీ దారణంగా కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్లో మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. శంకర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ సినిమాకు బాలీవుడ్లో ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.2022లో విడుదలైన విక్రమ్ సినిమా మొదటిరోజు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, భారతీయుడు 2 మూవీ మాత్రం విక్రమ్ కలెక్షన్స్‌కు దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయింది. ఇదే క్రమంలో డైరెక్టర్ శంకర్ చివరి సినిమా రోబో 2.ఓ తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా రాబట్టింది. భారతీయుడు 2 సినిమా బాగాలేదంటూ ఇప్పటికే మోత్ టాక్ పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా తెలంగాణలో ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచారు. ఈ ప్రభావం భారతీయుడు 2 కలెక్షన్ల మీద భారీగా పడనుంది. ఒక డబ్బింగ్ సినిమాకు టిక్కెట్ల ధరలు పెంచుకోవడం ఏంటి..? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సినిమా కదా చూసేద్దామని కుటుంబంతో వీకెండ్లో సినిమా ప్లాన్ చేసుకునే వారు కూడా భారతీయుడు వైపు వెళ్లకుండా చేసేలా టికెట్ల ధరలు ఉన్నాయిని నెటిజన్లు వాపోతున్నారు. -
భారతీయుడు 2 ఎండింగ్లో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్
భారతీయుడు.. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి కాంబోలేనే భారతీయుడు 2 సీక్వెల్ రానుంది. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.'భారతీయుడు 2' సినిమా టికెట్లు ఆన్లైన్ పెట్టిన వెంటనే భారీగా అమ్ముడుపోతున్నాయి. వీటి ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. నాటికి, నేటికి సమాజంలో ఎలాంటి మార్పులు రాలేదని అందుకే పార్ట్ 2 నిర్మించామని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సమాజాన్ని పట్టిపీడించే అవినీతిపై పోరాటం గురించి పార్ట్ 1 లోనే తాను చెప్పాలనుకుంది చెప్పానని డైరెక్టర్ శంకర్ అన్నారు. పార్ట్ 2ని అందుకు భిన్నంగా తెరకెక్కించాలనే క్రమంలోనే కథ రాసేందుకు చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు.భారతీయుడు 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల సందర్భంగా కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. అందుకు అభిమానులు ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు నెట్టింట చర్చ జరుగుతుంది. పార్ట్ 3 చిత్రీకరణ కూడా ఇప్పటికే దాదాపు 70 శాతం పైగా జరిగినట్లు సమాచారం. ఎప్పుడో విడుదల కానున్న సినిమా ట్రైలర్‌ను ముందే విడుదల చేస్తున్నట్లు వార్తలు రావడంతో సినీ ప్రేమికులు సంతోషిస్తున్నారు. ఇలా భారతీయుడు 2 సినిమాలో పార్ట్ 3 ట్రైలర్‌ను విడుదల చేసి కమల్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉన్నారని తెలుస్తోంది. -
ఇదేంటి భయ్యా?.. ఇండియన్-2 టికెట్స్ అక్కడే చీపా?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పటికే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 టికెట్‌పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లోని ఒక్కో టికెట్ ధర రూ.350 రూపాయలుగా ఉంది.అయితే ఇండియన్-2 సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐌𝐚𝐧𝐚 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐓𝐫𝐨𝐥𝐥𝐬 🤗 (@mana_telugu_trolls) -
రిలీజ్ ముందు షాక్.. చిక్కుల్లో ఇండియన్-2!
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఇండియన్-2 చిక్కుల్లో పడింది. తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ చిత్రంలో వాడుకున్నారని మదురై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాను రిలీజ్ కాకుండా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.కాగా.. ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివిన డైరెక్టర్ శంకర్ గతంలో వచ్చిన భారతీయుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్‌హాసన్‌కు రాజేంద్రన్ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే తాజాగా సీక్వెల్‌గా వస్తోన్న ఇండియన్-2లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్ వాడారని రాజేంద్రన్ ఆరోపిస్తున్నారు. -
రామ్ చరణ్ దగ్గర అలాంటి పవర్: గేమ్ ఛేంజర్ డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కమల్‌హాసన్ భారతీయుడికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు అదేంటో తెలుసుకుందాం.శంకర్ మాట్లాడుతూ..'నాకు బాగా సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్‌కు ఒకటే చెప్పాలనుకున్నా. తెలుగులో స్ట్రైట్ పిక్చర్ చేయాలని ఎప్పుడు చెబుతూ ఉంటా. ఇప్పుడు ఆ అవకాశం నాకు గేమ్ ఛేంజర్ రూపంలో దొరికింది. చెర్రీ ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయన దగ్గర ఒక రకమైన బ్లాస్టింగ్ పవర్ ఉంటుంది. ఈ సినిమా చూస్తే అది మీకే అర్థమవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్‌తో షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఇంకా కేవలం 15 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తాం. రామ్ చరణ్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.' అని అన్నారు. కాగా.. శంకర్ ఇండియన్-2, పార్ట్-3 చిత్రాలతో బిజీగా ఉండటంతో గేమ్ ఛేంజర్ ఆలస్యమైంది. దీంతో ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్ థియేటర్లలో సందడి చేసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు తమన్ సంగీతం అందిస్తున్నారు. The Maverick Director @shankarshanmugh garu shares an update about #GameChanger 🔥Mega Powerstar @AlwaysRamCharan's Part has been wrapped up ❤️🔥Stay tuned for some POWER PACKED updates coming soon! 💥 pic.twitter.com/iDs88TtPP4— Sri Venkateswara Creations (@SVC_official) July 7, 2024 -
'మా సినిమాను అమ్ముతున్నాం'.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం ఇండియన్-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నేను ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. ఎందుకంటే మేము రూపొందించిన ప్రొడక్ట్ గురించి తెలియాలి. ఏ వ్యాపారి అయినా తన ప్రొడక్ట్ గురించి ప్రజలకు వివరించాలి. అలాగే మా ప్రొడక్ట్ ఇండియన్-2 అమ్ముతున్నా. మంచి క్వాలిటీగా తయారు చేశాం. ఇందులో నాకు ఎలాంటి సిగ్గు, మొహమాటం లేదు. ఇది మా పని.' అని అన్నారు. ఇది విన్న నెటిజన్స్ కమల్ హాసన్ సింప్లీసిటీని మెచ్చుకుంటున్నారు. కాగా.. ఇండియన్-2 ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషించారు. -
ఇండియన్-2 బాగాలేదా?.. అసలు కమల్ హాసన్ ఏమన్నారంటే?
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా కమల్ హాసన్ సింగపూర్‌కు వెళ్లారు. తనకు భారతీయుడు-2 కంటే భారతీయుడు-3 ఎక్కువగా నచ్చిందని అన్నారు. అయితే ఆయన చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే ఇండియన్-2 బాగాలేదా అని చర్చ మొదలెట్టారు. తాజాగా ఈ కామెంట్స్‌పై కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.కమల్ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన విషయాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. రెండో పార్ట్ కంటే మూడో పార్ట్ బాగుందని చెప్పా అంతే. అంటే ఇక్కడ పార్ట్-2 బాగాలేదని కాదు. మనం సాంబార్, రసం లాంటి వాటితో భోజనం చేస్తున్నప్పుడు ఆ తర్వాత తినే పాయసం గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. నా కెరీర్లో ఇండియన్-2 కోసమే ఎక్కువ శ్రమించా. ఈ సినిమా కోసం ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లు స్వీకరించా. కొవిడ్ లాక్డౌన్, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యంతో కొందరు నటులు మరణించడం లాంటి ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటిలోనూ దర్శకుడు శంకర్ జాగ్రత్తలు తీసుకున్నారు' అని అన్నారు. కాగా.. ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆరు నెలల్లోనే పార్ట్- 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
గేమ్ ఛేంజర్‌కు 'రామ్ చరణ్' ప్యాకప్.. ఎన్నిరోజులు కష్టపడ్డాడంటే
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే, ఈ సినిమా విడుదల ప్రకటన కోసం చరణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో #GameChanger పేరుతో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక టీజర్, గ్లింప్స్ కూడా విడుదల కాలేదు. కానీ, సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. మూడేళ్లుగా గేమ్ ఛేంజర్ షూటింగ్లో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ఎట్టకేలకు ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తియినట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాస్తవంగా అదే నిజమని కూడా చెప్పవచ్చు.. కొద్దిరోజుల క్రితమే డైరెక్టర్ శంకర్ కూడా కేవలం 10 రోజుల షూట్ మాత్రమే ఉందని చెప్పిన విషయం తెలిసిందే.గేమ్ ఛేంజర్ సెట్స్‌లో 2021 సెప్టెంబర్ 8న రామ్ చరణ్ అడుగుపెట్టాడు. అలా సుమారు మూడేళ్ల పాటు ఈ సినిమాకు ఆయన సమయం కేటాయించాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నేటితో (2024 జులై 6) 1,032 రోజులు కష్టపడ్డాడు. దీంతో డైరెక్టర్ శంకర్‌పై చరణ్ అభిమానులు తమ అసంతృప్తిని తెలుపుతున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. రామ్ చరణ్ డబుల్ రోల్లో కనిపిస్తారని టాక్ ఉంది. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలలో నటించారు. 2025లోనే ఈ సినిమా విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్‌లో జులై 7న జరిగే భారతీయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ ఛేంజర్ గురించి కీలకమైన అప్డేట్ ఇస్తారని సమాచారం ఉంది.#GameChanger shooting visuals are out now! 🎥 Charan Anna portions Done ✅ Visual wonder loading shankarraaaaa 😩🥵🤙🔥#RamCharan #ICRISAT pic.twitter.com/XMATUmqaok— 𝐇𝐮𝐬𝐬𝐚𝐢𝐧 𝐑𝐜𝐟™ (@Hussain_Rcf) July 6, 2024 -
కమల్ హాసన్ భారీ బడ్జెట్ చిత్రం.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కమల్ హాసన్ నటిస్తోన్న తాజా చిత్రం ఇండియన్- 2(భారతీయుడు-2). ఈ సినిమాను శంకర్ డైరెక్షన్లో భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ బ్యానర్స్‌పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నుంచి ‘క్యాలెండర్ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో దక్షిణాఫ్రికా మోడల్, 2017లో మిస్ యూనివర్స్ విజేత డెమి-లీ టెబో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ లిరికల్ వీడియో సాంగ్‌ను చంద్రబోస్ రాయగా.. శ్రావణ భార్గవి ఆలపించారు.కాగా.. 28 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఈ చిత్రంలో ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ తాజా అప్డేట్ ఇచ్చారు. ఇండియన్ -2 ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో గేమ్ ఛేంజర్ గురించి ఆయన మాట్లాడారు.శంకర్ మాట్లాడుతూ..'సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇండియన్ -2 రిలీజ్ కాగానే గేమ్ ఛేంజర్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాం. అన్ని ఓకే అనుకున్నాకే రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా' అన్నారు.కాగా.. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
కమల్‌హాసన్- దర్శకుడు శంకర్ కాంబినేషన్లో విడుదలైన భారతీయుడు సినిమా సౌత్ ఇండియాలో భారీ హిట్‌ను అందుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డ్స్ క్రియేట్ చేసి ఇప్పటికీ భారతీయుడు వారిద్దరి కెరియర్లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సుకన్య, కౌందమణి, సెంథిల్ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1996లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన 'భారతీయుడు' చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ దుమ్మురేపాడు. ఆ పాత్రలో ఆయన చూపిన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం చట్ట విరుద్ధం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ మరిచిపోలేము. అయితే, భారతీయుడు చిత్రాన్ని జూన్ 7న తెలుగు,తమిళంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ కూడా విడుదల కానుంది. 'భారతీయుడు'కు కొనసాగింపుగా ఇండియన్-2 కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు ఇండియన్2 రానుంది. దీంతో తొలి భాగం అయిన భారతీయుడు చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడంతో కమల్ అభిమానులను ఉత్సాహంగా ఉన్నారు.Get ready to re-live the blockbuster experience once again! 🤩#Bharateeyudu - 1 Re-Release Trailer Out TOMORROW, Stay Tuned!!💥Releasing worldwide in Telugu & Tamil on June 7th at theatres near you! 🔥@ikamalhaasan @shankarshanmugh @arrahman @mkoirala @UrmilaMatondkar… pic.twitter.com/wC36I7saE6— AM Rathnam (@AMRathnamOfl) May 26, 2024 -
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కమల్‌హాసన్- శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సౌరా అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషళ్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. గతంలో శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.An Indian rides forth with courage & valor! 🔥 Here's a promo of the 1st single #PAARAA from INDIAN-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 5️⃣ PM. 🤩🥁Rockstar @anirudhofficial musical 🎹Lyrics @poetpaavijay ✍🏻Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️#Indian2 🇮🇳… pic.twitter.com/dz2JeTiqP8— Lyca Productions (@LycaProductions) May 21, 2024 -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా ముంబైలో నిర్వహించిన ప్రైమ్ వీడియో ఈవెంట్లో వెల్లడించింది. గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టు ఆ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. అయితే థియేటర్లలో రిలీజ్ డేట్ ఇంకా వెల్లడించలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ప్రైమ్ వీడియో వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈనెల 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. An honest IAS officer battles political corruption through fair elections to change the game of governance.#GameChanger available post-theatrical release. #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/y7E1PPp7I7 — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
మెగా హీరో గేమ్ ఛేంజర్.. స్టన్నింగ్ లుక్‌లో చెర్రీ!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీతో ఆడి పాడనుంది. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. సెట్లో రామ్ చరణ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. వీడియోలో ఫుల్ ఫ్రొఫెషనల్‌గా కనిపించారు. ఇది చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో లుక్ సూపర్బ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Vizag Lo Charan Babu 🩷👌 pic.twitter.com/haMgxuyV2C — Hari SaaHo (@HariSaaho19) March 15, 2024 #RamCharan from the shoot#GameChanger pic.twitter.com/nNdddGQLYz — Haaph Boil (@haaphboil) March 15, 2024 -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరి అరెస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో గేమ్ చేంజర్ సినిమాలోని ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. అయితే దీపావళి సందర్బంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ పాటను దీపావళికి గ్రాండ్‌గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ కనిపించనుండగా.. అంజలి, సముద్రఖని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ ఫిక్స్.. సినీ చరిత్రలో ఇదే టాప్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మళ్లీ పట్టాలెక్కనుంది. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ కార్యక్రమం అంతా కూడా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: కుమార్తెను తలుచుకుని విజయ్ ఆంటోనీ భార్య ట్వీట్.. చచ్చిపోతున్నా అంటూ..) 2024 వేసవిలో గేమ్ ఛేంజర్ విడుదల కానుందని సమాచారం. అయితే, ఈ సినిమాపై మరోక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ OTT రైట్స్‌ను ZEE5 సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ డిజిటల్ హక్కుల కోసం ZEE5 ప్లాట్‌ఫామ్ అన్ని భాషలకు కలుపుకుని సుమారు రూ.250 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసినట్లు రికార్డుకెక్కనుంది. రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన అత్యధిక డీల్‌గా ఇదీ చరిత్రలో నిలిచిపోతుంది. జూ.ఎన్టీఆర్ ‘దేవర’ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. -
'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్.. సూసైడ్ లేఖతో చరణ్ అభిమాని వార్నింగ్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో సార్లు వాయిదా వేసుకుంటూ షూటింగ్ జరుపుకుంటోంది.ఈ చిత్రం ప్రకటించి ఇప్పటికే ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం ఒక్క సరైన అప్డేట్ కూడా రాలేదు. దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న రామ్ చరణ్ అభిమానులు తీవ్రంగా నిరాశ పడుతున్నారు. దీనంతటికి ప్రధాన కారణం దర్శకుడు శంకర్ అనే చెప్పవచ్చు. దిల్ రాజు గేమ్ ఛేంజర్ ప్రకటించిన వెంటనే శంకర్ కూడా షూటింగ్ ప్రారంభించాడు. కానీ ఈ సినిమా సెట్స్‌పైన ఉండగా మధ్యలో కమల్ హాసన్ 'ఇండియన్ 2'ను తీసుకొచ్చి చిత్రీకరణ ప్రారంభించారు. దీంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యం అవుతూ.. బడ్జెట్ పెరిగిపోతూ వెళ్తోంది. ఇప్పటికీ 50 శాతం కూడా పూర్తి అవలేదని సమాచారం. తాజాగా ఈ సినిమా షూట్ షెడ్యూల్‌ను రెండు నెలలుపాటు వాయిదా వేశారని సమాచారం. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చి సోషల్ మీడియా ద్వారా దిల్‌రాజు,డైరెక్టర్ శంకర్ పట్ల కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' ఆలస్యం అవుతుండటంతో చరణ్ అభిమాని సూసైడ్ లేఖ రాశాడు. మరో మూడు రోజుల్లో గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ఎప్పుడో చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటానని అల్టిమేటం జారీ చేశాడు. దీనికి కారణం దిల్ రాజు,డైరెక్టర్ శంకర్ పేర్లు రాశాడు. సూసైడ్ నోట్ లో ఏం రాశాడండే 'నేను సూసైడ్ చేసుకునేంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే... రామ్‌చరణ్ వీరాభిమానిగా గేమ్ ఛేంజర్ కోసం దాదాపు రెండేళ్లుగా ఎదరుచూస్తున్న. కనీసం రిలీజ్ డేట్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాను. దురదృష్టవశాత్తు, ప్రొడక్షన్ టీమ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్లు లేవు. సినిమా షూటింగ్ మాత్రం పలుమార్లు వాయిదా పడుతూనే ఉంది. సినిమా విడుదల తేదీ ఎప్పుడనేది మరో మూడు రోజుల్లో ప్రకటించాలి. లేదంటే, నా జీవితాన్ని ముగించేస్తాను. అదే జరిగితే నా చావుకు ప్రధాన కారకులు డైరెక్టర్ శంకర్ షణ్ముగం, దిల్ రాజు, SVC ప్రొడక్షన్స్ వారే కారణం. కాబట్టి దయచేసి మీరు, నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. లవ్ యు చరణ్ అన్నా.., నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నా తదుపరి జీవితంలో నేను మీకు మంచి అభిమానిగా ఉంటానని ఆశిస్తున్నాను, ఇట్లు బాబు గౌడ్.' అనే పేరుతో సూసైడ్ లేఖ రాశాడు. ఈ లేఖను చిత్ర నిర్మాతలకు చేరవేశాడో లేదో తెలియరాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఒక సినిమా కోసం ఇలాంటి పనులు చేయడం సబబు కాదని పలువురు కోరుతున్నారు. కొన్నిసార్లు ఇలాంటివి సరదా కోసం చేసినా వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పలువరు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా వైరల్ అవుతున్న ఈ లేఖ ద్వారా అయినా గేమ్ ఛేంజర్‌లో మార్పు వస్తుందని ఆశిద్దాం. -
టాప్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన శంకర్ కూతురు
దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ ఎదుగుదల మామూలుగా లేదు. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. కాగా తదుపరి రాక్షసన్, చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ తాజా చిత్రంలో నటించడానికి అదితి శంకర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. (ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత) ఇప్పుడు నటుడు సూర్యతో జతకట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. కాగా ఇంతకుముందు సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటించిన సూర్య ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. కాగా ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతోందనే విషయం తెలిసిందే. ఇది సూర్య నటించే 43వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా కార్తీతో నటించి విజయాన్ని అందుకున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య సూర్యతో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. మరో విషయం ఏమిటంటే నటుడు సూర్య దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఇండియన్– 2 కోసం మరో అవతారం ఎత్తనున్న కమల్ హాసన్
పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవడంలో నటుడు కమలహాసన్ తర్వాతే ఎవరైనా అని పేర్కొనవచ్చు. ఒకే చిత్రంలో పది పాత్రలు పోషించిన నటుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది విశ్వనటుడు కమలహాసన్ ఒకరే. పాత్రకు అవసరమైతే మేకప్ కోసమే గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తారాయన. అందుకు దశావతారం చిత్రమే ఒక ఉదాహరణ. అందులో పది పాత్రలు పోషించిన ఆయన ఒక్కో పాత్రలకు ఒక్కో విధంగా తయారైన తీరు అద్భుతమనే చెప్పాలి. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ఆ చిత్రంలో ఒక వృద్ధ మహిళా పాత్ర కోసం కమలహాసన్ మేకోవర్ అయిన విషయం సంచలనమనే చెప్పాలి. కాగా అదేవిధంగా అవ్వై షణ్ముకి (భామనే సత్యభామనే) చిత్రంలో నడివయసు స్త్రీ పాత్రను పోషించి నేర్పించారు. పలువురు హీరోలు స్త్రీ పాత్రలు పోషించినా పూర్తిస్థాయి మహిళా పాత్రల్లో నటించింది మాత్రం కమలహాసనే. కాగా తాజాగా ఆయన ఇండియన్– 2 చిత్రంలో మరోసారి మహిళగా అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి) 28 ఏళ్ల క్రితం కమలహాసన్ కథానాయకునిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్, శంకర్ల కాంబినేషన్లో లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పలు అద్భుతాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథలో భాగంగా కమలహాసన్ స్త్రీ పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో కమల్ స్త్రీ గెటప్ ఎలా ఉంటుందని ఆసక్తి నెలకొంది. -
ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొన్నదో తెలిస్తే
విశ్వ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇండియన్– 2. రెండున్నర దశాబ్దాల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకరే ఈ చిత్రాన్నీ కూడా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడెక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై కూడా నాలుగైదు ఏళ్లు గడుస్తోంది. పలు అవరోధాలను అధిగమించి ఇప్పటికి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియ భవానీ శంకర్, సముద్రఖని, బాబీసింహ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే: దిల్ రాజు) నిర్మాణంలో జాప్యం జరిగినా చిత్రంపై మాత్రం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వ్యాపారంలోనూ ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లని సమాచారం. అయితే చిత్ర ఆడియో హక్కులను ఇంతకు ముందే సరిగమ సంస్థ రూ.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్ సంస్థ రూ.220 కోట్లకు పొందినట్లు తాజా సమాచారం. దీంతో ఇప్పటికే ఇండియన్– 2 చిత్రం నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని భావించవచ్చు. ఇకపోతే ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ రెండు భాగాలుగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కమలహాసన్ మరో 25 రోజులు అదనంగా కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉంటుందని శంకర్ సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తెలుగు చిత్రం కల్కిలో కమల్ నటిస్తున్నారు. ఆ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్– 3 చిత్రంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ ఏడాది చివరలో తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
చైనాకు వంత పాడుతున్నారా?.. సెన్సార్ బోర్డుపై నిర్మాత సంచలన కామెంట్స్!
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో నిర్మించారు. శంకర్ నాయుడు అడుసుమిల్లి మాట్లాడుతూ..'మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. అతి త్వరలో మీ ముందుకు "భారతీయన్స్" చిత్రాన్ని తీసుకొస్తాం. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా దాడులు, బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు.' అని అన్నారు. చైనా వక్రబుద్ధిపై మాట్లాడుతూ.. 'చైనా మనతో ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దులలో ఒకటిగా ఉంది. చైనా ఎల్లప్పుడూ మన వెనుక కత్తితో దాడి చేసే శత్రువు. అత్యంత ప్రమాదకరమైన, మోసపూరిత, దుర్మార్గమైన చైనా... కొన్ని శతాబ్దాల క్రితం బ్రిటీష్ వారిలాగే సాధ్యమైన ప్రతి దేశాన్ని వలసరాజ్యం చేయడానికి ప్రయత్నిస్తూ అధికారంలో ఉండటానికి దాని స్వంత ప్రజలను సైతం చంపుతుంది. ఈ దుర్మార్గపు, నిరంకుశం గురించి మా సినిమా భారతీయన్స్లో ఎండగట్టాం.' అని అన్నారు. దురదృష్టవశాత్తు సెన్సార్ బోర్డు నన్ను సినిమాలో చైనా పేరును ఉపయోగించవద్దని కోరిందని తెలిపారు. మరింత విచారంగా గాల్వాన్ వ్యాలీ పేరును కూడా తొలగించమని అడిగారు. ఇది ఎంత అరాచకం? ఎంత అవమానకరం? గాల్వాన్ వ్యాలీని చైనాకు అప్పగిస్తున్నామా? మనం చైనాకు లొంగిపోతున్నామా? మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి. మీ అందరూ భారతీయన్స్ చిత్రానికి మద్దతు ఇవ్వాలని శంకర్ నాయుడు కోరారు. -
గేమ్ ఛేంజర్ అవ్వబోతున్న రాఖీ భాయ్?
-
సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న 'ప్రత్యర్థి'
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'ప్రత్యర్థి'. ఈ మూవీతోనే శంకర్ ముదావత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. జనవరి 6న ఈ సినిమా విడుదల కానుంది. దేవాకట్ట తెరకెక్కించిన ఆటో నగర్ సూర్య సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన శ్రీకాంత్ నరోజ్ వద్ద అసిస్టెంట్ కెమెరామెన్‌గానూ చేశారు. ఇప్పుడు ప్రత్యర్థి సినిమాతో తెలుగు ప్రేక్షకుల రానున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించారు. ఈ సినిమా బాగుందని కొత్త దర్శకుడైనా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని పలువురు కొనియాడారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని సంజయ్ సాహ నిర్మించారు. -
Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడం, ఆ ఆతర్వాత కోర్టు కేసులతో దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో కమల్ హాసన్ సెట్స్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: Rakul Preet Singh: ‘ఇండియన్ 2’ సెట్లో అడుగుపెట్టిన రకుల్) ఈ ఫోటోల్లో దర్శకుడు శంకర్, కమల్ చర్చించుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కమల్ సెట్స్‌లో అడుగు పెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అందాల భామ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటోంది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. #Indian2 from today. @Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE — Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022 -
2.ఓపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్ శంకర్ అద్భుత సృష్టిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొంది మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల 2.ఓపై వివాదం అలుముకుంది. ఈ మూవీలో మొబైల్ ఫోన్, టవర్లు, మొబైల్ సేవలపై చిత్ర రూపకర్తలు అశాస్ర్తీయ ప్రచారం చేశారని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ పోషించిన పాత్ర ద్వారా మొబైల్ ఫోన్ వాడకందారులను పర్యావరణానికి పక్షులు, జంతువులకు రేడియేషన్‌తో హాని చేసే వారిలా దూషిస్తుంటారని పేర్కొంది. మొబైల్ ఫోన్లు, టవర్లు భూమిపై జీవరాశికి, మానవాళికి ప్రమాదకరమైనవిగా దుష్ర్పచారం సాగించారని సీబీఎఫ్‌సీతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తూ సీఓఏఐ లేఖ రాసింది. టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ వీడియోతో పాటు సినిమా తమిళ వెర్షన్‌కు ఇచ్చన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని ఈ లేఖలో సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే ఈ ఫిర్యాదు వెలుగుచూడటం గమనార్హం. -
ఇక సినిమాలకు గుడ్‌బై!
సాక్షి, సినిమా: జీవితం మన చేతుల్లో ఉండదు అనడానికి చాలా ఉదాహరణలే ఉంటాయి. అదే విధంగా ఈ నాగరిక యుగంలో ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. రేపన్నది ఎక్కడో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఉత్తరాదికి చెందిన నటి శ్రియ రష్యాకు చెందిన యువకుడిని పెళ్లాడింది. ఇలా ఎవరి జీవితం ఎవరితో ముడిపడుతుందో తెలియదు. నటి ఎమీజాక్సన్ విషయాన్నే తీసుకుంటే ఎక్కడో కెనడాకు చెందిన ఈ అమ్మడు దర్శకుడు విజయ్ దృష్టిలో పడడం, మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్ పరిచయం అవడం అన్నది ఆమే ఊహించి ఉండదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌కు వెళ్లిన ఎమీజాక్సన్ తమిళంలోనే ఎక్కువ చిత్రాలను చేసింది. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశాలను రెండుసార్లు దక్కించుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో ఎమీ ఒక్కరు. ఐ చిత్రంలో విక్రమ్ సరసన నటించి అందాల మోత మోగించిన ఎమీ ప్రస్తుతం రజనీకాంత్‌తో జత కట్టిన 2.ఓ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో రోబోగా అదరగొట్టనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం విడుదలనంతరం తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఈ భామ ఆ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుండడం, కొత్త అవకాశాలు రాకపోవడం వంటివి నిరాశప రిచాయ నే చెప్పాలి. అయితే ఆంగ్ల సీరియల్లో నటిస్తున్న ఎమీ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చే నిర్ణయాన్నే తీసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భారతీయ సినిమాలకు ఇక టాటా అని, తాను ఆఫ్రికన్ దేశంలోని మొరాకోలో సెటిల్ అవ్వబోతున్నానని ఎమీ చెప్పిందన్నదే ఆ ప్రచారం. ఇదే నిజం అయితే ఆమె అభిమానులకు నిరాశకలిగించే విషయమే అవుతుంది. -
భారత్ ‘ఎ’దే వన్డే సిరీస్
సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ‘ఎ’ 64 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఓపెనర్ ఈశ్వరన్ (83; 7 ఫోర్లు), విజయ్ శంకర్ (61; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్ హుడా (59; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ‘ఎ’ 45.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. సిద్ధార్థ్ కౌల్ (3/25) ఆరంభంలోనే కివీస్‌ను దెబ్బతీయగా...షాబాజ్ నదీమ్ (4/33) మాయాజాలానికి మిడిలార్డర్ నిలబడలేకపోయింది. ఓపెనర్ వర్కర్ (108; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించినప్పటికీ అతనికి సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో కివీస్ ‘ఎ’ ఓటమి ఖాయమైంది. -
భారతీయుడు మళ్లీ వస్తాడు
‘భారతీయుడు’ మళ్లీ వస్తున్నాడు. అయితే... ఎలాంటి కథతో వస్తున్నాడనేది ఇక్కడ హాట్ టాపిక్. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సిన్మా ‘ఇండియన్’కి తెలుగు వెర్షనే ‘భారతీయుడు’. 1996లో వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, తన కన్న కొడుకునే చంపిన కథతో వచ్చిన ఆ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. దానికి సీక్వెల్ తీయాలని చాలారోజుల నుంచి ఇటు హీరో కమల్, అటు దర్శకుడు శంకర్ ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లకు కుదిరింది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ (ఇండియన్–2)ను ప్రముఖ తెలుగు నిర్మాత ‘దిల్’ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై నిర్మించనున్నారు. ‘‘ఉన్నత సాంకేతిక విలువలతో, సమకాలిన సామాజిక సమస్యతో తెలుగు–తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో ఈ సీక్వెల్‌ను రూపొందించబోతున్నాం. ‘భారతీ యుడు’ని మించేలా ఉంటుందీ సినిమా. రజనీకాంత్ ‘2.0’ పూర్తయిన వెంటనే ఈ సిన్మా మొదలవుతుంది. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
2.0 ఒరేయ్ ...అక్కు పక్షి...! పోరా...నీ టెక్కు తీస్తా!
1.0 లో వంద పాయింట్లు వచ్చాయి. శంకరన్న వంద పాయింట్లు కొట్టాడు. రజనీ ఇంకో వంద కొట్టారు. అమాంతం 200 పాయింట్లు వచ్చాయి కదా.. ఇప్పుడు 2.0 వస్తోంది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌లో 2.0 అంటే ఇంప్రూవ్డ్ వెర్షన్ అని. ఆ రోబో అన్నీ చేసేశాడు. ఇంప్రూవ్డ్ వెర్షన్లో ఇంకేం చేస్తాడో! స్క్రీన్లు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్.. టెక్నీషియన్లు, క్యాషూ, డ్యాషూ.. ఆటలు, పాటలు, ఫైట్లు, హీరోయిన్... కథ లైట్‌గా చెబుతున్నాం కానీ టూ పాయింట్ జీరో కథాకమామిషు మాత్రం.. ఫుల్ల్ల్ల్గా....! కథేంటి? మర మనిషి (రోబో)కి ఎమోషన్స్ ఉంటాయా? ఆలోచించగలుగు తుందా? ప్రేమలో కూడా పడుతుందా? మనం ‘కీ’ ఇచ్చినట్లు ఆడే రోబో మనకు సంబంధం లేకుండా పైవన్నీ చేస్తే, చూడ్డానికి ఓ థ్రిల్. ‘రోబో’ సినిమా అలాంటి థ్రిల్‌నే ఇచ్చింది. అందులో డాక్టర్ వశీ (రజనీకాంత్) ఎంతో శ్రమపడి ఓ రోబో (చిట్టి)ను తయారు చేస్తాడు. ఆ రోబోను ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలన్నది అతని ఆశయం. ఆర్మీకి ఉపయోగపడాలంటే చిట్టిలో హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. వశీ ఆ పని కూడా చేసేస్తాడు. చివరికి అతని లవర్‌తోనే చిట్టి లవ్‌లో పడుతుంది. మరోవైపు చిట్టి దేశానికి ఉపయోగపడ కూడదని, దాన్ని అంతం చేయాలని విలన్ గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. క్లుప్తంగా ‘రోబో’ కథ ఇది. మరి.. ఈ చిత్రం సీక్వెల్ ఇ‘2.0’ కథేంటి? అంటే ఇప్పటివరకూ టూకీగా కూడా కథ గురించి బయటకు రాలేదు. అయితే చెన్నై కోడంబాక్కమ్‌లో ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే... పక్షులంటే ఓ వ్యక్తి (అక్షయ్‌కుమార్)కి పిచ్చి ప్రేమ. టెక్నాలజీ పెరుగుతోన్న కొద్దీ కొన్ని పక్షులు కనిపించకుండాపోతున్నాయి. ఆ బర్డ్ లవర్ బాధ అంతా అదే. అతనికి సెల్ టవర్లు చూస్తే ఒళ్లు మండిపోతుంది. వాటి నుంచి వచ్చే రేడియేషన్ వల్లే పక్షులు అంతమవుతున్నాయని టెక్నాలజీపై పగ పెంచుకుంటాడు. సైంటిస్టులను అంతం చేయాలని, టెక్నాలజీని నాశనం చేయాలని అనుకుంటాడు. మరోవైపు... అవినీతిని అంతం చేయడానికి ఓ రోబోను కనిపెడతాడో సైంటిస్ట్ (రజనీకాంత్). ఆ సైంటిస్ట్, అతను కనిపెట్టిన రోబో, ఆ పక్షి ప్రేమికుడు... ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ ‘2.0’ కథ ఉంటుందని సమాచారం. ఇది ఆసక్తిరాయుళ్లు అల్లిన కథా లేక నిజమైనదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఈ కథలో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందని అక్షయ్ గెటప్‌ని బట్టి ఊహించవచ్చు. ఐదు గెటప్స్‌లో రజనీ! ఈ చిత్రంలో రజనీకాంత్ ఐదు గెటప్స్‌లో కనిపిస్తారని ఓ టాక్. వాటిలో రోబో ఒకటి. దీనికోసం రజనీ ఫేస్ మాస్కులు తయారు చేశారు. అదంత ఈజీ కాదు. ఏవేవో పదార్థాలు రజనీ ఫేస్‌కి అప్లై చేసి, అది ఎండిన తర్వాత తీస్తే, వచ్చేదే మాస్క్. దీనికోసం రజనీ నాలుగైదు గంటలు కేటాయించాల్సి వచ్చింది. ఈ సూపర్ స్టార్ వయసు దాదాపు 65. ఈ ఏజ్‌లో అన్నేసి గంటలు కదలకుండా కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’, ‘ఐరన్ మాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ తదితర హిట్ సిన్మాలకు పని చేసిన హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ రజనీ– అక్షయ్‌ల స్పెషల్ గెటప్స్‌కి మేకప్ చేశారు. రజనీ ఇంత శ్రమపడ్డారు కదా? ఆయన ఎంత పారితోషికం తీసుకుని ఉంటారు.. అనుకుంటు న్నారా? సినిమా సాధించే లాభాల్లో షేర్ ఇస్తారట. ఆ లెక్క రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఈవీపీ వర్డ్‌లో... చెన్నైలోని పూనమల్లిలో ‘ఈవీపీ వరల్డ్’ అనే థీమ్ వర్క్ ఉండేది. 2015లో దాన్ని మూసేశా రట. దాదాపు 150 ఎకరాలు ఉన్న ఆ పార్క్‌ని ‘2.0’ నిర్మాతలు హైర్ చేసుకున్నారు. అందులో భారీ సెట్స్ వేశారు. వాటిలో మొబైల్ ఫోన్ స్టోర్ సెట్ ఒకటి. అక్కడే మిలిటరీ ట్యాంక్స్ తయారు చేయించారట. కేవలం షూటింగ్ కోసమే కాదు.. సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరపడానికి, అక్కడే బస చేయ డానికి వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారట. వేరే ప్లేస్‌లో తీసిన సీన్స్‌లో ప్యాచ్‌వర్క్ ఉంటే.. ఈవీపీ వరల్డ్‌లో సెట్ వేసి, మ్యాచింగ్ సీన్స్ తీసేవారట. దర్శకుడు శంకర్ ఇంటికి వెళ్ల కుండా ఆల్మోస్ట్ ఈ లొకేషన్లోనే ఉండేవారట. అంత డెడికేషన్, ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు తీయలేరు. ఎప్పుడు మొదలు? ఎప్పుడు ముగింపు? డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు. 2015లో ఆయన బర్త్‌డే నాడు ‘2.0’ని ప్రారంభించారు. అప్పుడు చెన్నైలో తుఫాను కారణంగా సింపుల్‌గా ఆ వేడకను కానిచ్చేశారు. ఆ తర్వాత అదే నెల 16న రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ ఆగస్ట్‌కి మొత్తం షూటింగ్ పూర్తి చేశారు. కంటికి కనిపించేది 20 నెలలు. అంటే.. దాదాపు 600 రోజులు. కానీ, షూటింగ్‌కి పట్టిన రోజులు మాత్రం దాదాపు 300 రోజులు అట. మధ్యలో అనారోగ్యం కారణంగా రజనీకాంత్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడం వల్ల, షూటింగ్ డేస్ మినహా కొన్ని రోజులు ప్లానింగ్‌కి కేటాయించడం వల్ల ఆగస్ట్ వరకూ ఎక్స్టెండ్ అయింది. లేకపోతే ఇంకొంచెం ముందే అయ్యుండేదని టాక్. ఫస్ట్ పార్ట్‌కన్నా సెకండ్ పార్ట్ టెక్నాలజీ వైజ్‌గా రెండింతలు ఉండటం యూనిట్‌కి ఓ సవాల్. అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. చిత్రీకరణ జరిపిన రోజులుకన్నా ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ రోజులు పడుతుంది. అక్షయ్‌కుమార్ గెటప్ వెనక బోల్డంత కహానీ హిందీలో హీరోగా దూసుకెళుతోన్న అక్షయ్‌కుమార్‌కి విలన్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? రెమ్యునరేషనా? స్టోరీయా? క్యారెక్టరా? రజనీకాంత్‌తో ఢీ కొనొచ్చనా? శంకర్ డైరెక్టర్ అనా? అని చాలామంది అనుకున్నారు. యస్.. అక్షయ్‌కుమార్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇవన్నీ కారణాలు. ‘‘రజనీకాంత్‌తో దెబ్బలు తినడంలో ఓ మజా ఉంది’ అని స్వయంగా అక్షయ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇందులో విచిత్రమైన గెటప్‌లో అక్షయ్ కనిపిస్తోన్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పక్షులు పలు రకాలు కదా. ఈ పక్షి ప్రేమికుడి గెటప్‌ని కూడా పలు రకాల పక్షులను తలపించే రీతిలో ప్లాన్ చేశారట. ఉదాహరణకు కనుబొమలు ఓ పక్షిలా, చేతి గోళ్లు మరో పక్షిలా, జుత్తు ఓ పక్షిని పోలినట్లుగా, మీసాలు మరో పక్షిలా... ఇలా అక్షయ్ గెటప్‌ని మౌల్డ్ చేశారు. అక్షయ్ మేకప్‌కి నాలుగైదు గంటలు పట్టేదట. ఒక్కసారి మేకప్ వేశాక ‘నో సాలిడ్ ఫుడ్’. ‘ఓన్లీ లిక్విడ్స్’. జ్యూసులు, నీళ్లు, పాలు లాంటివి. అందుకే ఎక్కువ గంటలు షూటింగ్ చేసేవారు కాదని సమాచారం. ఇంతకీ అక్షయ్ పారితోషికం ఎంతో తెలుసా? రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఈ సినిమాకి ఆయన అక్షరాలా 50 కోట్లకు చెక్కు పుచ్చుకున్నారట. మామూలుగా హిందీలో హీరోగా నటించే సినిమాలకు అక్షయ్ 50 నుంచి 70 కోట్లు తీసుకుంటారని భోగట్టా. తెలుగు రైట్స్ కోసం పోటాపోటీ! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ విడుదల చేయనున్నారు. రైట్స్ దక్కించుకోడానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. చివరకు హక్కులు చేజిక్కించుకోవడానికి రాజకీయ నాయకుల సహాయం కూడా కొంతమంది తీసుకున్నారట. కానీ, ఈ ప్రెస్టీజియస్ మూవీని సరిగ్గా రిలీజ్ చేసి, నిలబెట్టగల సంస్థకే ఇవ్వాలని లైకా ప్రొడక్షన్స్ అనుకుందట. అందుకే 40 ఏళ్లుగా 500 చిత్రాలకు పైగా ఫైనాన్స్ చేసి, వందకు పైగా సినిమాలను పంపిణీ చేసిన ఏషియన్ ఫిలింస్‌కి ఇచ్చారు. ఫైనల్‌గా రిలయన్స్, సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలసి ఏషియన్ ఫిలింస్ ఈ చిత్రం రైట్స్‌ను దాదాపు 80 కోట్లకు దక్కించుకుంది. బడ్జెట్ ఎంత? ఈ చిత్రంలో లెక్కలేనన్ని రోబోలు, టెక్నికల్‌గా క్రియేట్ చేసిన పక్షులు కనిపిస్తాయట. అలాగే, భారీ సెట్స్ కనువిందు చేస్తాయి. బోలెడంత మంది తారాగణం. ఇండియన్ టెక్నీషియన్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేశారు. ఎక్కువమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేసిన మొదటి ఇండియన్ సినిమా ఇదే అవుతుంది. ‘ట్రాన్స్ఫార్మర్స్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన సాంకేతిక నిపుణులు ‘2.0’కి చేశారు. కెమెరామేన్ నిరవ్ షా, మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తదితర ఇండియన్ టెక్నీషియన్స్‌తో పాటు స్పెషల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడానికి మేరీ ఇ. వోగ్, స్టంట్ కొరియోగ్రాఫర్ బేట్స్, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ జాన్ హ్యూగెస్, వాల్ట్ జోన్స్ వంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేశారు. అమెరికాకు చెందిన ‘ది లెగసీ ఎఫెక్ట్స్’ యానిమేట్రానిక్స్ వర్క్ చేసింది. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ రెమ్యునరేషన్లు, సినిమా సెట్స్, లొకేషన్ ఖర్చు.. ఇలా టోటల్‌గా ఇది భారీ బడ్జెట్ సినిమా అయింది. ముందు 250 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్లోనే తీయాలనుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ముగిసేసరికి దాదాపు 450 కోట్లు అయింది. భారతీయ సినిమాల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. ఒక్క పాటకు 32 కోట్లు! ఇది చదివినవాళ్లు 10 చిన్న సినిమాలు తీసే బడ్జెట్ ఒక్క పాటకా? అనుకోకుండా ఉండలేరు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల చెన్నైలో ఓ పాట తీశారు. ఆ పాటకు అయిన ఖర్చు 32 కోట్లు అట. రజనీకాంత్–అమీజాక్సన్, కొన్ని రోబోల మీద పదీ పదిహేను రోజుల పాటు ఈ పాట తీశారట. 32 కోట్లతో సాంగ్ అంటే.. ఎంత రిచ్‌గా ఉండి ఉంటుందో? సాంగ్స్ విషయంలో శంకర్ స్పెషల్ ఫోకస్ పెడుతుంటారని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ‘జీన్స్’ సినిమాలో ‘పూవుల్లో దాగున్న..’ పాటను ప్రపంచంలోని ఏడు వింతలైన తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈఫిల్ టవర్, ఈజిప్టియన్ పిరమిడ్స్.. తదితర ప్రదేశాల్లో తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ పాట చిత్రీకరణకు 30 రోజులకు పైగా పట్టింది. ‘బాయ్స్’లో ఫ్రీజ్ టెక్నిక్‌తో ‘ఆలే.. ఆలే..’ సాంగ్ తీయడం అప్పట్లో ఓ హాట్ టాపిక్. రోబో’లో ‘కిల్లిమంజారో..’ పాటను పెరూలోని కొండల దగ్గర తీశారు. ఆ లొకేషన్లో షూట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే. ‘ఐ’లో ‘పూలనే కులికేయమంటా..’ పాటను చైనాలో తీశారు. పూల బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఆ సాంగ్ ఐ–ఫీస్ట్. ‘ఈ పాటలన్నీ ఒక ఎత్తయితే ‘2.0’ కోసం తీసిన 32 కోట్ల పాట మరో ఎత్తు అవుతుందని చెన్నై టాక్. ప్రమోషన్ అదుర్స్ సినిమా తీస్తే సరిపోదు.. దానికి సరైన పబ్లిసిటీ అవసరం. అది స్టార్ మూవీ అయినా నాన్–స్టార్ మూవీ అయినా. ఈ విషయంలో దర్శకుడు శంకర్, లైకా నిర్మాణ సంస్థకు ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే హాట్ ఎయిర్ బెలూన్ తయారు చేయించిన విషయం తెలిసిందే. 100 అడుగులు ఎత్తు ఉన్న ఈ బెలూన్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో పలు చోట్ల దర్శనమిస్తుంది. ఇప్పటికే యూఎస్‌లో పెట్టారు. 2 పాటలు! 3 చోట్ల ఆడియోలు! ఆడియో వేడుకను బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నారు. అబుదాబి, హైదరాబాద్, చెన్నైలలో ఆడియో వేడుకను ప్లాన్ చేశారు. ఆ సంగతలా ఉంచితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రెండే పాటలు ఉంటాయట. కానీ, ఏ.ఆర్. రహమాన్ ఐదు పాటలు తయారు చేసారట. అవి ఆల్బమ్ వరకే పరిమితమవుతాయని తెలిసింది. స్టోరీ పెద్దది కావడంతో పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడంవల్లే రెండు పాటలనే సినిమాలో పెట్టాలనుకున్నారట. మరి.. ఇది నిజమేనా? వేచి చూద్దాం. తెలుగు ప్రమోషన్‌కు 5 కోట్లు? జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటు న్నారు. అంతకు నెల ముందు ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచాలనుకుంటున్నారు. తెలుగు ప్రమోషనల్ కార్యక్రమాలకు 5 కోట్లు ఖర్చుపెట్టాలనుకుంటున్నా రట. ఈ ఖర్చుని లైకా ప్రొడక్షన్సే పెట్టుకుంటుందట. అదిరిపోయే స్టేడియమ్ సీన్! ఈ చిత్రంలో రజనీ– అక్షయ్ కాంబినేషన్లో వచ్చే స్టేడియమ్ సీన్స్ వన్నాఫ్‌ది హైలైట్స్ అని సమాచారం. ఢిల్లీల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియమ్లో కొన్ని రోజులు ఆ సీన్స్ తీసి, ఆ తర్వాత చెన్నైలో ప్యాచ్ వర్క్ తీశారట. లెంగ్త్ తక్కువ ఉన్న ఈ సీన్స్ కోసం 60, 70 రోజులు కేటాయించడం విశేషం. దాన్నిబట్టి కథకు ఎంత కీలకమో ఊహించవచ్చు. 100 కోట్ల పైనే హిందీ హక్కులు! ‘2.0’ హిందీ రైట్స్ బాగానే పలికింది. ఫస్ట్ పార్ట్ సుమారు 20 కోట్లకు అమ్ముడుపోతే సెకండ్ పార్ట్ అందుకు ఐదింతలు పెరగడం విశేషం. దాదాపు 100 కోట్లకు పైనే హిందీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయట. 110 కోట్లకు శాటిలైట్ రైట్స్ 450 కోట్లతో ఈ సినిమాని తీస్తే అందులో పావు శాతం సినిమా విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో వచ్చేసిందని టాక్. ఈ ప్రెస్టీజియస్ మూవీని దక్కించుకోవడానికి పలు ప్రముఖ ఛానళ్లు పోటీ పడ్డాయట. చివరికి ‘జీ టీవీ’ చేజిక్కించుకుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల శాటిలైట్ రైట్స్‌ను 110 కోట్లకు సొంతం చేసుకుందట. – డి.జి. భవాని -
ప్రపంచీకరణతో పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతం
సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శివశంకర్ రాజమహేంద్రవరం కల్చరల్ (రామమహేంద్రవరం సిటీ) : ప్రపంచీకరణతో పెట్టుబడీదారి వ్యవస్థ బలోపేతమై సామాజిక జీవితం ధ్వంసమైందని సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. సాహితీగౌతమి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రపంచీకరణపై ప్రసంగించారు. దీంతో అంతటా నైతిక అంధత్వం వ్యాపించిందన్నారు. మీటనొక్కితే విశ్వవ్యాప్త సమాచారం లభిస్తోందని అయితే సమాచారం, విజ్ఞానం వేర్వేరన్నారు. రాజధాని నిర్మాణం పేరిట వేలాది పంట పొలాలను సేకరిస్తోన్న ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని చెబుతోందని, కొన్ని ఉద్యోగాలు రావచ్చేమో కాని పరిశ్రమల వల్ల వచ్చే రూ.కోట్ల ఆదాయం ఎవరి జేబులోకి వెడుతోందని ప్రశ్నించారు. సజ్జ, జొన్నరొట్టె, రాగి సంగడికి బదులు వచ్చిన జంక్ ఫుడ్‌తో ఆరోగ్యాలు ధ్వంసమవుతున్నాయన్నారు. ప్రపంచీకరణ వలన ఉద్యోగ భద్రత, స్థిరత్వం పోయాయని, అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగికి తెల్లారేటప్పటికి ఉద్వాసన వచ్చే పరిస్థితి ఏర్పడందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం తీసేస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందన్నారు. అమెరికాలో ఉద్యోగి జీవితకాలంలో కనీసం 11 ఉద్యోగాలు మారతాడన్నారు. ప్రపంచం ఎట్లా ఉంది? ఎలా ఉండాలి? అనే అంశంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. సాహితీ గౌతమి వ్యవస్ధాపకుడు పి.విజయకుమార్, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, కమ్యూనిస్టు, హేతువాది వెలమాటి సత్యనారాయణ, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ పర్యావరణ వేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ, విద్యార్థులు హాజరయ్యారు. -
సాక్షి కార్టూన్ (11-10-2016)
సాక్షి కార్టూన్ (11-10-2016) -
సాక్షి కార్టూన్ (7-10-2016)
సాక్షి కార్టూన్ (7-10-2016) -
సాక్షి కార్టూన్ (5-10-2016)
మా సంబంధాలే బాగోలేవు! మధ్యలో నీ సంబంధం ఏంటమ్మా వెళ్లు! -
సాక్షి కార్టూన్ (4-10-2016)
దాడులెక్కడ జరిగాయో మీరే చెప్పండి! -
సాక్షి కార్టూన్ (3-10-2016)
ప్రతిపక్షాలు కూడా పొగిడేసరికి అలా సెటిలయిపోయారు! -
సాక్షి కార్టూన్ (2-10-2016)
సాక్షి కార్టూన్ (2-10-2016) -
సాక్షి కార్టూన్ (1-10-2016)
సాక్షి కార్టూన్ (1-10-2016) -
సాక్షి కార్టూన్ (30-9-2016)
సాక్షి కార్టూన్ (30-9-2016) -
సాక్షి కార్టూన్ (29-9-2016)
ఈ ఫోర్జీ సెల్‌ఫోన్ వాడుతూ ఈ ల్యాప్‌టాప్‌తోనే వ్యవసాయం చేయాలి! ఇంకా కావాలంటే ఫేస్బుక్, ట్విట్టర్లో నీ ఎకౌంట్ కూడా తెరుస్తాం! -
సాక్షి కార్టూన్ (28-9-2016)
అబ్బ! వరద బాధితుడిని కాదయ్యా! వరద నష్టం అంచనాకొచ్చిన సభ్యుడ్ని!! -
సాక్షి కార్టూన్ (27-9-2016)
పాతాళ గంగ పొంగడం కాదు! మనం నాలా మీద కట్టిన ఇల్లు కొన్నామంతే!! -
సాక్షి కార్టూన్ (26-9-2016)
ఈ ముసురు తగ్గేదాకా మా మధ్యే ఉండండి సార్! ప్లీజ్!! -
సాక్షి కార్టూన్ (21-9-2016)
మీరెందుకు భయపడుతున్నార్సార్! వారు మీ మీద కంప్లయింట్ చేయడానికి రాలేదు! -
సాక్షి కార్టూన్ (20-9-2016)
... అయితే సాక్ష్యాలు చూపించండి! -
టీడీపీ పాలనలో పెరిగిన అరాచకాలు
విజయవాడ (గాంధీనగర్) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక నగరంలో అరాచకాలు పెరిగాయని, అధికార పార్టీ నాయకులు చట్టాలను తమ చుట్టాలుగా వాడుకుంటున్నారని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. కోగంటి సత్యం అక్రమ అరెస్ట్, పౌరహక్కుల ఉల్లంఘన, సేవా కార్యక్రమాల్లో రాజకీయ జోక్యానికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. మూడో రోజు దీక్షను శంకర్ ప్రారంభించి మాట్లాడారు. నగరంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల్లో టీడీపీ నాయకులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం, పోలీసులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాల్‌మనీ కేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో ఆ కేసును నీరు గార్చారని చెప్పారు. టీడీపీ నాయకులు శ్మశానాలు, కల్యాణ æమండపాలతో పాటు దేవుడి కార్యక్రమాలను కబ్జా చేస్తున్నారని, అడ్డువచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లు చేయిస్తున్నారని విమర్శించారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగర మాజీ డెప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్, సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో పౌరహక్కులను ఉల్లంఘిస్తున్నారన్నారు. నిరసన దీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపాధ్యక్షులు పోతిన వెంకట రామారావు, మహేంద్రసింగ్ సహానీ, ఫణిరాజు, ప్రగతి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు బి. శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ నాయకులు బొక్కా ప్రభాకర్, బుద్దె రాజా, ఆర్. క్రాంతి, వాడపల్లి నానాజీ, పత్తిపాటి సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
సాక్షి కార్టూన్ (9-8-2016)
ఇవి మనల్ని ఉద్దేశించి అన్నట్లే ఉన్నాయ్ సార్! -
సాక్షి కార్టూన్ (27-7-2016)
...అయితే మనమే దోషులం! -
సాక్షి కార్టూన్ (26-7-2016)
సాక్షి కార్టూన్ (26-7-2016) -
సాక్షి కార్టూన్ (25-7-2016)
సాక్షి కార్టూన్ (25-7-2016) -
సాక్షి కార్టూన్ (24-7-2016)
ఎంత క్లోజప్ చేసి చూసినా కలిసే రోజు కనిపించడం లేదా సార్! -
సాక్షి కార్టూన్ (22-7-2016)
డ్రైవర్ రహిత వాహనాలొస్తున్నట్లు.. టీచర్ రహిత పాఠశాలలని కొత్త ప్రయోగమందాం సార్! -
సాక్షి కార్టూన్ (21-7-2016)
అక్కడ అలా గురకపెట్టి నిద్రపోవడమెందుకూ.. ఇక్కడ నిద్రరావడం లేదని గుబులు పడటమెందుకు!! -
సాక్షి కార్టూన్ (20-7-2016)
ట్రీ గార్డు లేకుండా నాటి నన్ను బలిచేయకు.. వెళ్లు! -
సాక్షి కార్టూన్ (18-7-2016)
మీరు తిరిగే ఖర్చులకు నిజంగానే స్లమ్ అవుతుందంటున్నాడ్సార్! -
సాక్షి కార్టూన్ (17-7-2016)
అబ్బ! ఆపండి సార్... మీ సొంత వాళ్లు పోయినపుడు కూడా ఇలా ఏడ్వలేదు!! -
సాక్షి కార్టూన్ (15-7-2016)
... ఆ విషయంలో మనం కూడా విచిత్రంగానే ప్రవర్తించాం కద్సార్! -
సాక్షి కార్టూన్ (14-7-2016)
మా ఆఫీసు ఆవరణలో నాటాం సార్!! -
కార్టూన్ (13-7-2016)
మీరొస్తున్నారని మాకు సమాచారం ఉంది సార్! -
సాక్షి కార్టూన్ (12-7-2016)
సాక్షి కార్టూన్ (12-7-2016) -
సాక్షి కార్టూన్ (11-7-2016)
మీరు ఏ దేశం వెళితే ఆ దేశం వేషాలు భలే వేస్తార్సార్!! -
సాక్షి కార్టూన్ (10-7-2016)
మా కాలంలో కంటికి ఆపరేషన్ చేయించుకుంటే చూపొచ్చేది!