Kamal Haasan Indian 2 Movie Digital Rights Bought By Netflix For Shocking Price, Deets Inside - Sakshi
Sakshi News home page

Indian 2 Digital Rights: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్‌ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే

Published Tue, Jul 25 2023 7:06 AM | Last Updated on Tue, Jul 25 2023 11:38 AM

Netflix Ott Rights Kamal Haasan Indian 2 Take Heavy Budget - Sakshi

విశ్వ నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇండియన్‌– 2. రెండున్నర దశాబ్దాల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'ఇండియన్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకరే ఈ చిత్రాన్నీ కూడా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడెక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై కూడా నాలుగైదు ఏళ్లు గడుస్తోంది. పలు అవరోధాలను అధిగమించి ఇప్పటికి చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీతిసింగ్‌, ప్రియ భవానీ శంకర్‌, సముద్రఖని, బాబీసింహ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

(ఇదీ చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే: దిల్‌ రాజు)

నిర్మాణంలో జాప్యం జరిగినా చిత్రంపై మాత్రం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వ్యాపారంలోనూ ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. చిత్ర బడ్జెట్‌ రూ.200 కోట్లని సమాచారం. అయితే చిత్ర ఆడియో హక్కులను ఇంతకు ముందే సరిగమ సంస్థ రూ.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను నెట్‌ ఫ్లిక్‌ సంస్థ రూ.220 కోట్లకు పొందినట్లు తాజా సమాచారం. దీంతో ఇప్పటికే ఇండియన్‌– 2 చిత్రం నిర్మాతలకు టేబుల్‌ ప్రాఫిట్‌ తెచ్చిపెట్టిందని భావించవచ్చు.

ఇకపోతే ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్‌ రెండు భాగాలుగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కమలహాసన్‌ మరో 25 రోజులు అదనంగా కాల్‌ షీట్స్‌ కేటాయించాల్సి ఉంటుందని శంకర్‌ సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తెలుగు చిత్రం కల్కిలో కమల్‌ నటిస్తున్నారు. ఆ చిత్ర తొలి షెడ్యూల్‌ పూర్తి చేసిన తర్వాత ఇండియన్‌– 3 చిత్రంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ ఏడాది చివరలో తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement