budject
-
ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొన్నదో తెలిస్తే
విశ్వ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇండియన్– 2. రెండున్నర దశాబ్దాల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకరే ఈ చిత్రాన్నీ కూడా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడెక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై కూడా నాలుగైదు ఏళ్లు గడుస్తోంది. పలు అవరోధాలను అధిగమించి ఇప్పటికి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియ భవానీ శంకర్, సముద్రఖని, బాబీసింహ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే: దిల్ రాజు) నిర్మాణంలో జాప్యం జరిగినా చిత్రంపై మాత్రం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వ్యాపారంలోనూ ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లని సమాచారం. అయితే చిత్ర ఆడియో హక్కులను ఇంతకు ముందే సరిగమ సంస్థ రూ.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్ సంస్థ రూ.220 కోట్లకు పొందినట్లు తాజా సమాచారం. దీంతో ఇప్పటికే ఇండియన్– 2 చిత్రం నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని భావించవచ్చు. ఇకపోతే ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ రెండు భాగాలుగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కమలహాసన్ మరో 25 రోజులు అదనంగా కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉంటుందని శంకర్ సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తెలుగు చిత్రం కల్కిలో కమల్ నటిస్తున్నారు. ఆ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్– 3 చిత్రంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ ఏడాది చివరలో తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
హెల్త్ కేర్ రంగానికి ‘జీఎస్టీ’ ఊరట ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) భారం తగ్గించాలని హెల్త్‌కేర్ ఇండస్ట్రీ వేదిక– నట్హెల్త్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే చిన్న నగరాలు, పట్టణాలలో ప్రజలకు మెరుగైన బీమా కవరేజీని కల్పించే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు 2023–24 బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని నట్హెల్త్ ప్రెసిడెంట్ శ్రావణ్ సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రీ–బడ్జెట్ నివేదిక పత్రంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఇతర రంగాల తరహాలో ఆరోగ్య సంరక్షణ రంగం జీఎస్టీ పరివర్తన ప్రయోజనాలను పొందలేకపోయింది. ►వాస్తవానికి, జీఎస్టీ ముందు కాలంతో పోలిస్తే, అనంతర కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పన్నులు పెరిగాయి. ►పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను క్లెయిమ్ చేసుకునే అవకాశంతో అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ( ప్రభుత్వ, ప్రైవేట్) అవుట్‌పుట్ హెల్త్‌కేర్ సేవలపై 5 శాతం మెరిట్ రేటును విధించాలి. అలాగే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కోసం అవుట్‌పుట్ సేవలపై 5 శాతం జీఎస్టీ రేటును దీనిపై ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఐచ్ఛిక డ్యూయల్ రేట్ స్ట్రక్చర్‌ను విధించవచ్చు. ►ప్రస్తుతం ఆరోగ్య సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉంది. అయితే ఈ సేవలపై 5 మెరిట్ రేటును విధించవచ్చు. దీనివల్ల హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి వీలుకలుగుతుంది. తద్వారా వారి ఎంబెడెడ్ (ఉత్పత్తి లేదా సేవ మూల ధర ను పెంచే పన్ను) పన్నుల భారం తగ్గుతుంది. ►ప్రొవైడర్లు, ప్రొక్యూర్మెంట్ సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ బకాయిలనూ క్లియర్ చేయాలి. ►ప్రజలు నాణ్యమైన, క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు తగిన రీతిన పొందడానికి మౌలిక సదుపాయాల సామర్థ్యాల పెంపు, విస్తరణ అవసర. టైర్–1, టైర్–2 నగరాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరం. ఇది హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ►ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పూర్తి స్థాయిలో విస్తరణ మరో కీలక అంశం. ►ఇన్సూరెన్స్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కింద ప్రొవైడర్లు అలాగే సప్లయర్ల కోసం అన్ని పేమెంట్ బ్యాక్‌లాగ్‌లు క్లియర్ చేయాలి. అది హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి, లభ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ►ఆరోగ్య రంగానికి బడ్జెటరీ కేటాయింపులు భారీగా పెరగాలి. -
బడ్జెట్ చుట్టూనే ఇన్వెస్టర్ల చూపులన్నీ..
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఇప్పుడు బడ్జెట్ కోసం వేచి చూస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ గురువారం(ఫిబ్రవరి 1)న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు, ఈ వారం వెలువడే బ్లూచిప్ కంపెనీల క్యూ3 ఫలితాలు, తయారీ రంగ గణాంకాలు స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై తగిన ప్రభావం చూపనున్నాయి. బడ్జెట్ రోజే తయారీ రంగానికి సంబంధించి పీఎమ్ఐ గణాంకాలు వెల్లడి కానుండటం కీలకం. ‘‘ప్రస్తుతం స్టాక్ విలువలు అధిక స్థాయిల్లో ఉండటంతోపాటు, త్వరలో జరిగే పరిణామాలు దూకుడుతో కూడిన కొనుగోళ్లకు బ్రేక్ వేయొచ్చు. కీలకమైన బడ్జెట్, ఆర్థిక గణాంకాల నేపథ్యంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండొచ్చు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ అన్నారు. ‘‘జీఎస్టీ తర్వాత ఇది మొదటి బడ్జెట్. అలాగే, ప్రస్తుత ప్రభుత్వానికి చివరి పూర్తి సంవత్సరపు బడ్జెట్ కావడంతో అంచనాలు అధికంగా ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణతోపాటు మౌలిక, గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైవేటు క్లయింట్గ్రూపు హెడ్ వీకే శర్మ తెలిపారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే రోజే ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ఫిబ్రవరి 1(గురువారం) మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ జనవరి నెలకు సంబంధించిన భారత సేవల రంగం పనితీరును ప్రతిబింబించే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలను వెల్లడిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో 52.6గా ఉన్న పీఎమ్ఐ సూచీ గత నెలలో 54.7కు పెరిగాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, చైనా, యూరోజోన్, అమెరికా జనవరి నెల తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు ఈ గురువారం (ఫిబ్రవరి 1న) వస్తాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశాలు ఈ నెల 30న ఆరంభమవుతాయి. నేడు హెచ్డీఎఫ్సీ ఫలితాలు: ఇక కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాల విషయానికొస్తే, నేడు(సోమవారం) హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, టెక్ మహీంద్రాలు క్యూ3 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 30) ఐఓసీ, ఈ నెల 31న(బుధవారం) ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్ టీ, ఎన్టీపీసీ, వేదాంత కంపెనీలు, శుక్రవారం (ఫిబ్రవరి 2న) బజాజ్ ఆటో, హిందాల్కో కంపెనీల క్యూ3 ఫలితాలు వస్తాయి. నేటి నుంచి గెలాక్సీ ఐపీఓ గెలాక్సీ సర్ఫాక్టంట్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి నుంచి ప్రారంభమవుతోంది. రూ. 1.470–1,480 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా రూ. 937 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కనీసం 10 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న ముగిసే ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 63.31 లక్షల షేర్లను జారీ చేయనున్నారు. వచ్చే నెల 8న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. రెండు లిస్టింగ్‌లు.. ఈ వారంలో రెండు కొత్త కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. నేడు(సోమవారం) న్యూజెన్ సాఫ్ట్వేర్ షేర్లు లిస్టవుతాయి. ఈ నెల 16–18 మధ్య రూ.240–245 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 8 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఇక అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ నెల 30న(మంగళవారం) స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. ఈ నెల 17–19 మధ్య రూ.855–859 ప్రైస్‌బాండ్‌తో వచ్చి న ఈ ఐపీఓ 165 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ వారం ఈవెంట్స్ జనవరి 29 పార్లమెంట్ బడ్జెట్ సమాశాలు ఆరంభం, ఆర్థిక సర్వే, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా క్యూ3 ఫలితాలు జనవరి 30 ఐఓసీ ఫలితాలు జనవరి 31 ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, వేదాంత ఫలితాలు ఫిబ్రవరి 1 బడ్జెట్, తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు ఫిబ్రవరి 2 బజాజ్ ఆటో, హిందాల్కో క్యూ3 ఫలితాలు -
కేసీఆర్ మార్క్ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాబోయే బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఆలోచనలను ప్రజల కళ్లకు కట్టేలా చూపించిందని, ఈసారి వ్యవసాయానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మంచిస్థానం సంపాదించామని చెప్పారు. బడ్జెట్‌పై కసరత్తు మొదలైందని, అన్ని విభాగాల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందినట్లు వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనాలు, ఈ ఏడాది ఖర్చులపై చర్చించారు. బడ్జెట్, బడ్జెటేతర పనులు కలుపుకుంటే అనుకున్న దానికన్నా ఈ ఏడాది ఎక్కువే ఖర్చు చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో ఖర్చు భారీగా పెరిగిందని చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే బడ్జెట్‌పై చర్చలు జరుగుతున్నాయని, వచ్చిన ప్రతిపాదనలన్నీ క్రోడీకరించి, శాఖల వారీగా త్వరలోనే సమీక్షిస్తామని తెలిపారు. మార్చి 12న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని, అప్పటికే కేంద్ర బడ్జెట్‌పై స్పష్టత వస్తుందని అన్నారు. కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలి మిషన్ భగీరథకు రూ.19,405 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా కేంద్రం పట్టించు కోవడం లేదని, ఈ నిధులు మంజూరు చేయాలని ఈటల కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. హార్టికల్చర్ వర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, ఎయిమ్స్, స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు కేంద్రం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు మంజూరు చేయాలని ఇటీవల జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్టు చెప్పారు. కేటాయించిన ప్రతి రూపాయి ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజన చేయాలని, పనిచేసే చోట ఉద్యోగులుండేలా చూడాలని హెచ్ఓడీలను ఆదేశించారు. ఆ పార్టీలకు సీట్లపైనే ప్రేమ కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలపై ప్రేమ లేదని, ఎన్నికలు, సీట్లు, అధికారంపైనే ప్రేముందని ఈటల విమర్శించారు. మిగులు విద్యుత్ ఉండటం వల్లే తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నారన్న బీజేపీ నేతలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నారు. తాము తీసుకున్న చర్యల వల్లే కరెంటు ఇవ్వగలుగుతున్నారని అంటున్న కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. -
లక్ష కోట్లు పెరగనున్న సాగు రుణ లక్ష్యం!
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2018–19 వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రుణ లక్ష్యాలు పెరుగుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.10 లక్షల కోట్లు. 2018–19లో ఈ రుణ లక్ష్యాన్ని మరో లక్ష కోట్ల రూపాయలు పెంచవచ్చన్నది అంచనా. ఇదే జరిగితే రాబోయే బడ్జెట్లో రుణ లక్ష్యం రూ.11 లక్షల కోట్లకు పెరిగే అవకాశముంది. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయించిన రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంలో సెప్టెంబర్ 2017 నాటికి రూ.6.25 లక్షల కోట్ల రుణాలే మంజూరయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ♦ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి సాధన విషయంలో ‘రుణ లభ్యత’కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రైవేటు రుణ దాతల వద్ద రుణాలు రైతులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో, తగిన వడ్డీ రేటున్న వ్యవస్థీకృతమైన పటిష్ట రుణ వ్యవస్థను రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. -
బడ్జెట్లో ‘ఐటీ’ ఊరట!
న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను(ఐటీ) భారం నుంచి ప్రజలకు ఊరటకలిగించే అవకాశం ఉందా? కార్పొరేట్లు, నిపుణులు ఈ దిశగా చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆదాయపన్ను రేట్లు, శ్లాబుల్లో మార్పులు చేయవచ్చని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) అనే కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించిన సర్వేలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డివిడెండ్లపై ప్రస్తుత పన్నులో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని ఈ సర్వే పేర్కొంది.ప్రజల వినియోగాన్ని మరింత పెంచేందుకు వీలుగా పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని బడ్జెట్‌కు ముందు ఈవై నిర్వహించిన ఈ సర్వేలో 69 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ నెలలోనే జరిగిన ఈ సర్వేలో 150 మంది కంపెనీల సీఎఫ్‌వోలు, పన్ను అధికారులు, ఆర్థిక శాఖ సీనియర్ నిపుణులు పాల్గొన్నారు. ఉద్యోగులపై పన్ను భారం తగ్గించేందుకు కాలం చెల్లిపోయిన మినహాయింపుల స్థానంలో ప్రామాణిక తగ్గింపును ప్రవేశపెట్టే అవకాశం ఉందని 59 శాతం మంది చెప్పారు. కార్పొరేట్ పన్నును ఆర్థిక మంత్రి 25 శాతానికి తగ్గించొచ్చని, సర్చార్జ్ను కొనసాగించొచ్చని 48 శాతం మంది చెప్పారు. డివిడెండ్ పంపిణీపై ప్రస్తుతమున్న పన్నులో మార్పు చేస్తారని ఆశించడం లేదంటూ 65 శాతం మంది చెప్పడం గమనార్హం. కార్పొరేట్ రంగంపై భారం తగ్గించేందుకు గాను పన్ను రేటును 10 శాతం తగ్గించాలని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘‘పన్ను విధానాల్లో స్థిరత్వం, క్రమబద్ధత, మోస్తరు పన్నులు ఉండాలన్న దానిపై భారత పారిశ్రామిక రంగంలో ఏకాభిప్రాయం ఉందని ‘2018 బడ్జెట్ ముందస్తు సర్వే’ తెలియజేస్తోంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారీ మార్పుల పట్ల తక్కువ అంచనాలే ఉన్నాయి’’ అని ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సుధీర్ కపాడియా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న మోదీ సర్కారు తన చిట్టచివరి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సెజ్‌లకు పన్ను రాయితీలు కొనసాగాలి... ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని యూనిట్లకు ప్రస్తుతమున్న పన్ను రాయితీలను కొనసాగించాలని వాణిజ్య శాఖ డిమాండ్ చేస్తోంది. ఎగుమతులు, ఉద్యోగాల కల్పనకు ఇది అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు వాణిజ్య శాఖ ఓ లేఖను కేంద్ర ఆర్థిక శాఖకు రాసింది. సెజ్‌లపై ఉన్న కనీస ప్రత్యామ్నాయ పన్నును సైతం తొలగించాలని కోరడం గమనార్హం. నూతన సెజ్ యూనిట్లు 2020 మార్చి 31లోపు ప్రారంభమయ్యే వాటికే ఆదాయపన్ను ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2016–17 బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నిబంధన సెజ్‌ల అబివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని, దీన్ని రద్దు చేయాలన్నది వాణిజ్య శాఖ డిమాండ్. లేకుంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని లేఖలో వివరించింది. ప్రస్తుతం సెజ్‌ల నుంచి ఎగుమతులపై మొదటి ఐదేళ్లలో పూర్తిగా ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు 50 శాతం పన్ను రాయితీ పొందొచ్చు. ద్రవ్యలోటుకు చెక్ పెట్టాలి ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మరింత పటిష్ట చర్యల్ని కేంద్ర ఆర్థిక బడ్జెట్లో భాగంగా ప్రకటించాలని ప్రముఖ ఆర్థిక నిపుణుడు టీఎన్ శ్రీనివాసన్ సూచించారు. యేల్ యూనివర్సిటీలో గౌరవ ఎకనమిక్స్ ప్రొపెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసన్ మాట్లాడుతూ... ఉద్యోగాల క్షీణతకు డీమోనిటైజేషన్, జీఎస్టీతో ముడిపెట్టడంలో అర్థరహితమని చెప్పారు. ‘‘ద్రవ్యలోటును ఆర్థిక మంత్రి తనకు సాధ్యమైనంత వరకు కళ్లెం వేయాలి. అలాగే, ప్రాజెక్టులు సకాలంలో, సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా చర్యలు అవసరం’’ అని శ్రీనివాసన్ సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18)లో ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి పరిమితం చేయాలన్నది కేంద్ర సర్కారు విధించుకున్న లక్ష్యం. -
ఈ బడ్జెట్లో ఉద్యోగాలపైనే ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిబ్రవరి 1న ఆర్థ్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఉద్యోగ అవకాశాల సృష్టికి ఉపయోగపడేదిగా ఉండవచ్చని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి అంచనా వేశారు. జనాకర్షక బడ్జెట్ 2019లో ఉండవచ్చని, ఈ ఏడాది మాత్రం ఉద్యోగ సృష్టి చర్యలను చేపట్టే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఉద్యోగ అవకాశాలనేవి కార్పొరేట్లకు పన్ను రాయితీలు కల్పించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని, కాబట్టి ఈ బడ్జెట్లో దీనిపై దృష్టిసారించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫినాపోలిస్ నాలెడ్జ్ సిరీస్ ఆధ్వర్యంలో ‘‘2018 కేంద్ర బడ్జెట్; అభివృద్ధి, ఎంప్లాయిమెంట్‌కు ఊతమిస్తుందా?’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ అండ్ గాంధీ చార్టర్ట్ అకౌంట్ పార్టనర్ అజయ్ గాంధీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్లో వేతనజీవులకు కొంత పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలున్నాయన్నారు. ‘‘రూ.10 లక్షలు, రూ.20 లక్షల పన్ను శ్లాబులను పొడిగించడమో లేక అదనంగా మరో శ్లాబ్ పెట్టడమో చేయవచ్చని అంచనా వేశారు. ‘‘2019లో ఎన్నికలుండటం మూలంగా ఆ బడ్జెట్లోనే జనాకర్షక పథకాలుండే అవకాశముంది. ఈసారి సామాన్యులకు నిరాశే మిగలవచ్చు’’ అని చర్చలో పాల్గొన్న బిజినెస్ స్టాండర్డ్ ఎడిటోరియల్ డైరెక్టర్ ఏకే భట్టాచార్య చెప్పారు. ప్రభుత్వం ఆర్థికపరమైన జాగ్రత్తలకు కట్టుబడి ఉన్నా... వ్యయం ద్వారానే ఉద్యోగాలను సృష్టించటం, వృద్ధిని వేగవంతం చేయటం సాధ్యమవుతుందని చార్టెడ్ అకౌంటెంట్ ఎంఆర్ విక్రమ్ అభిప్రాయపడ్డారు. -
సెలవు తీసుకుంటున్నారా...?
విదేశాల్లోనయితే ఉద్యోగులు ఏటా కొన్ని రోజులు సెలవు పెట్టి వెళ్లడం సర్వ సాధారణం. కంపెనీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉద్యోగులకు సెలవు కాలంలో అదనపు వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ హెరాల్డ్‌లో నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఏటా 40 రోజులు సెలవుపై వెళ్లడం తప్పనిసరి. ఈ కాలంలో వారికి సాధారణ వేతనం కంటే 50 శాతం అదనంగా చెల్లిస్తారు. కానీ, మనదేశంలో పరిస్థితులు భిన్నం. నిత్య జీవితపు ఒత్తిళ్లను పక్కన పెట్టి కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లొద్దామన్నా... సెలవు దొరకడం కష్టం. ఒకవేళ సెలవు దొరికినా... ఏదైనా టూర్‌కు వెళ్లి వద్దామనుకుంటే అందుకు సరిపడా నిధులుండవు. ఎక్కువ మందికి ఎదురయ్యేవి ఈ పరిస్థితులే. మన దేశంలో ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా ఎక్కువే. ఇక ఈ ప్రపంచంలో సెలవుల భాగ్యం నోచుకుని వారిలో భారతీయులు నాలుగో స్థానంలో ఉన్నట్టు ‘ఎక్స్పీడియా వెకేషన్ డిప్రీవియేషన్ రిపోర్ట్ 2016’ చెబుతోంది. ఇటీవలే ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన సర్వేలోనూ మూడింట రెండొంతులు తమకు తగినంత విరామందొరకడం లేదనే చెప్పారు.మన దేశంలో ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న వారు ఎక్కువగా సెలవులకు దూరమవుతున్నారు. 30 ఏళ్లలోపు వారిలో ఇది 64 శాతం ఉంటే 41–50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇది 71 శాతంగా ఉంది. ఒకవేళ వీలు దొరికి సెలవు చిక్కి ఎటైనా వెళ్లినా గానీ, వారు కార్యాలయానికి సంబంధించిన మెయిల్స్‌ను తరచూ చెక్ చేసుకోవడంతోపాటు, తమ ఫోన్‌కు వచ్చే ఆఫీసు సంబంధిత కాల్స్‌ను రిసీవ్ చేసుకుని సమాధానం చెప్పాల్సి వస్తుందట. కానీ, మనస్తత్వ శాస్త్రవేతల విశ్లేషణ ప్రకారం కేవలం ఉద్యోగం, పనే కాదు!! విరామం, విశ్రాంతి కూడా అవసరమే. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఉద్యోగికి తగినంత విశ్రాంతి లభిస్తే పని మీద ఎక్కువ దృష్టి సారించగలరనేది వారి మాట. ఎందుకని...? మన దేశంలో ఉద్యోగులు ఎక్కువ రోజుల పాటు సెలవు తీసుకునే సాహసం దాదాపు చేయరు. అన్నేసి రోజులు సెలవు పెట్టి యాజమాన్యం ఆగ్రహానికి గురి కావడం ఎందుకన్న ధోరణే అందుకు కారణమన్నది నిపుణుల మాట. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు సెలవు తీసుకోవడాన్ని నిరుత్సాహపరిచే విధానాలు కూడా అమలవుతుంటాయి. అయితే, మరింత మంది యువత ఉద్యోగాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ ధోరణి మారాల్సి ఉందని పీపుల్ స్ట్రాంగ్‌కు చెందిన దేవాశిష్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతలు, ప్రణాళిక సెలవు సంపాదించారనుకోండి... ఆ తర్వాత దృష్టి సారించాల్సింది ప్రణాళికపైనే. తగిన ప్రణాళిక, షెడ్యూల్‌తో సెలవులను పూర్తిగా ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, కిరణ్ దంపతులు ఏటా ఓ పది రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లడం తప్పనిసరిగా చేస్తుంటారు. అందుకోసం వారు టికెట్లు, హోటల్ రూమ్‌ను చాలా ముందుగానే బుక్ చేసుకుంటారు. దీంతో తక్కువ చార్జీలకే బుకింగ్ పూర్తి చేయడం ద్వారా వారు తగినంత ఆదా చేసుకుంటున్నారు. వీరి టూర్ బడ్జెట్ రూ.60,000. దీంతో ఎక్కడికి వెళ్లాలి, ఏ మార్గంలో వెళ్లాలి. అక్కడ ఏమేం చూడాలి, స్థానికంగా విడిది, భోజనం, ప్రయాణం ఇవన్నీ కూడా కచ్చితమైన ప్రణాళిక మేరకు ప్లాన్ చేసుకుని బడ్జెట్‌లోపే వెకేషన్ పూర్తి చేస్తామని వారు తెలియజేశారు. బడ్జెట్ కీలకం ప్రయాణానికి కావాల్సింది బడ్జెటే. వాస్తవానికి మన దేశంలో ఎక్కువ మంది పొదుపరులే. కానీ ఎటైనా వెళ్లాలనుకుంటే మాత్రం డబ్బులకు కటకట కనిపిస్తుంది. 34 శాతం మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణం సెలవు పెట్టి ఎటైనా వెళ్లి రావడం అన్నది వారి దృష్టిలో ముఖ్యం కాకపోవడం ఒకటైతే, రెండోది పొదుపు చేయకపోవడం. అందుకే వెకేషన్‌కు బడ్జెట్ నిర్ణయించుకుని ప్రతీ నెలా కొంత మొత్తం పక్కన పెడుతూ వెళ్లడమే దీనికి పరిష్కారం. ఇందుకోసం సిప్ మంచి మార్గం అంటున్నారు ఆర్థిక సలహాదారులు. బడ్జెట్‌కు అనుగుణంగా నెలకు రూ.2,000 నుంచి వీలైనంత షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వీటిని నగదుగా మార్చుకోవచ్చు. పైగా ఆటుపోట్లు లేకుండా స్థిరమైన రాబడులు ఇస్తాయి ఇవి. ఏడాది, ఆలోపు అవసరాల కోసం స్టాక్స్‌లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కారణంగా అసలు లక్ష్యం నెరవేరకపోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మీ స్వల్ప కాలిక అవసరం కోసం పొదుపు చేస్తున్నారే గానీ, రాబడుల కోసం ఇన్వెస్ట్ చేయడం లేదు. అందుకే రిస్క్ సాధనాలను ఎంచుకోవడం తగదు. ఒకవేళ హాలిడే ప్లాన్‌కు మూడు, నాలుగేళ్ల సమయం ఉంటే అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఎక్కువ వ్యవధి ఉంటుంది కనుక, రిస్క్ ఉన్నప్పటికీ పొదుపుతోపాటు మెరుగైన రాబడులూ అందుకోవచ్చు. -
కేంద్రానికి ద్రవ్యలోటు ‘సెగ’
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ లక్ష్యంలో ద్రవ్యోలోటు ఆగస్టు నెలాఖరుకు 96.1 శాతానికి చేరింది. వివరాల్లోకి వెళితే, 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యం రూ.5,46,532 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.2%. దీనర్థం జీడీపీలో ద్రవ్యలోటు 3.2% దాటకూడదన్నమాట (గతేడాది లక్ష్యం 3.5%) అయితే ఆర్థిక సంవత్సరం ఆగస్టు నాటికే ద్రవ్య లోటు రూ.5.25 లక్షల కోట్లకు చేరింది. అంటే 2017–18 బడ్జెట్ అంచనాల్లో ఇది 96.1% అన్నమాట. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ నిష్పత్తి 76.4%. ఇది ఆందోళనకరమైన అంశమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మున్ముందు పెరిగే రాబడులతో 2017–18 లక్ష్యాలకు అనుగుణంగానే ద్రవ్యలోటు ఉంటుందన్న విశ్వాసాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వృద్ధి లక్ష్యంగా వ్యయాల పెంపునకు ద్రవ్యలోటు లక్ష్యాలను కేంద్రం పెంచవచ్చన్న వార్తలపై కొన్ని వర్గాల్లో ఇప్పటికే ఆందోళన వ్యక్తం అవుతోంది. -
బడ్జెట్‌తో సంబంధం లేకుండా వేతనాలు
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఎయిడెడ్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు బడ్జెట్‌తో సంబంధం లేకుండా మొదటి తేదీన జీతాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ మార్గదర్శకాలు రూపొం దిస్తుందని యూటీఎఫ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పని చేస్తున్న ఎయిడెడ్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు క్వార్టర్ల వారీగా బడ్జెట్ విడుదల చేయడం, ఇది జిల్లాలకు చేరి డీఈవో కార్యాలయాలు, ఖజాన శాఖల్లో ఆమోదం పొంది సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ అయ్యేందుకు రెండు, మూడు నెలలు సమయం పట్టేందన్నారు. ఈ సమస్యను ఉపాధ్యాయ సంఘాలు అనేక దఫాలు ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లాయన్నారు. సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడమే తప్ప ఆచరణ జరగలేదన్నారు. దీనిపై సోమవారం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి, పీడీఏ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆర్థిక కార్యదర్శి రవిచంద్ర దష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పెన్షన్లు ఈ–పేమెంట్ ద్వారా చెల్లించే ప్రతిపాదనకు మార్గదర్శకాలు విడుదల అవుతాయని ఆయన తెలిపారు.