![Agricultural loan target - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/23/loan.jpg.webp?itok=FmXKDePw)
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2018–19 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రుణ లక్ష్యాలు పెరుగుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.10 లక్షల కోట్లు. 2018–19లో ఈ రుణ లక్ష్యాన్ని మరో లక్ష కోట్ల రూపాయలు పెంచవచ్చన్నది అంచనా. ఇదే జరిగితే రాబోయే బడ్జెట్‌లో రుణ లక్ష్యం రూ.11 లక్షల కోట్లకు పెరిగే అవకాశముంది.
♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయించిన రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంలో సెప్టెంబర్ 2017 నాటికి రూ.6.25 లక్షల కోట్ల రుణాలే మంజూరయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
♦ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి సాధన విషయంలో ‘రుణ లభ్యత’కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రైవేటు రుణ దాతల వద్ద రుణాలు రైతులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో, తగిన వడ్డీ రేటున్న వ్యవస్థీకృతమైన పటిష్ట రుణ వ్యవస్థను రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment