![Hyderabad to witness Telanganas Largest Agri Show KISAN 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/kisan.jpg.webp?itok=4Pc67nET)
హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. కిసాన్ అగ్రి షో 2025 (KISAN Agri Show 2025) నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. కిసాన్ అగ్రి షో-2025 మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుండి 9 వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుంది. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన సిద్ధంగా ఉంది.
మూడు రోజుల పాటు ఈ భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. 150 పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో వ్యవసాయ ప్రదర్శన మొదటి రెండు ఎడిషన్‌లు విజయవంతమైన నేపథ్యంలో మూడవ ఎడిషన్‌కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.
ఈ ఎగ్జిబిషన్‌నలో వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఇతర విభాగాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి కిసాన్ అగ్రి షో విలక్షణ వేదికగా నిలవనుంది. వ్యవసాయ రంగంలో విజ్ఞాన మార్పిడికి కేంద్రం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment