kisan
-
Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్)గా జరుపుకుంటారు. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉపకరించేలా ప్రభుత్వం అందిస్తున్న కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ ఆరు వేలు ఆర్థిక సహాయంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందిస్తారు. ఈ మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది.2. ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన (పీఎం-కేఎంవై) ఈ పథకం లక్ష్యం రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ప్రతీనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకూ ఈ పథకంలో చెల్లిస్తే, వారికి 60 ఏళ్లు వచ్చాక ప్రతీనెలా రూ. 3,000 పెన్షన్ రూపంలో పొందవచ్చు.3. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ఈ పథకం కింద, రైతులు నారు వేయడం లేదా విత్తనం నాటడం నుండి పంట కోసే వరకు పంటల రక్షణ కోసం బీమాను అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి ఇది రైతులకు సహాయపడుతుంది.4. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్బీహెచ్ఎం) తేనెటీగల పెంపకానికున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించడమే ఈ పథకం లక్ష్యం. ‘తీపి విప్లవం’ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తేనెటీగల పెంపకందారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.5. నమో డ్రోన్ దీదీప్రభుత్వం ఇటీవలే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందజేస్తున్నారు. గ్రామాల్లో నివసించే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.6. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ)ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు వారి వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. అలాగే రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది.ఇది కూడా చదవండి: తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్ -
Uttar Pradesh: రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్.. తప్పిన ముప్పు
ఉత్తరప్రదేశ్‌లో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు వెళుతున్న అభ్యర్థులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు.కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిరోజ్‌పూర్ నుండి ధన్‌బాద్ వెళ్తోంది. ఈ రైలు బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. అకస్మాత్తుగా దాని కప్లింగ్ విరిగిపోయింది. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా, వాటిలో ఎనిమిది కోచ్‌లు వేరయ్యాయి. స్టేషన్ నుంచి రైలు కొంత దూరం వెళ్లిన తరువాత వెనుకనున్న ఎనిమిది బోగీలు విడిపోయాయని అధికారులు తెలిపారు. రైలులో కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన మరవకముందే ఈ రైలు ప్రమాదం చోటుచేసుకోవడం రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. -
గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్
సాక్షి, అమరావతి: సాగులో సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా కూలీల వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) అందిస్తున్న కిసాన్ డ్రోన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 60 మంది నిరుద్యోగ యువత, పొదుపు సంఘాలకు శిక్షణ ఇచ్చి డ్రోన్లను అందజేసింది. రానున్న వ్యవసాయ సీజన్లో మరో 65 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.తొలి దశలో రాష్ట్రంలో 160 డ్రోన్స్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. డిమాండ్‌ను బట్టి మరింత మందికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది 60 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. ఈ ఏడాది మరో 65 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై.. 18–50 సంవత్సరాల మధ్య వయసు వారు శిక్షణకు అర్హులు.మహిళలకు 15 రోజుల శిక్షణఆసక్తి, అర్హత ఉన్న వారికి 15 రోజులపాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 70 మంది గ్రామీణ యువతతోపాటు 12 మంది పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి కాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు.రూ.15 లక్షల విలువైన డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనంలైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నారు. యూనిట్ వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే చాలు. ఎలక్ట్రిక్ వెహికల్‌పై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 20 వేల ఎకరాల్లో పిచికారీ లేదా ఐదేళ్ల తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం అభ్యర్థుల పేరిట బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకు ఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.జూన్‌లో అర్హుల గుర్తింపు2024–25 సీజన్లో మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి అర్హులైన వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వారికి దశల వారీగా శిక్షణ ఇచ్చిన తర్వాత ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.స్వయం ఉపాధి పొందుతున్నాంనేను బీ ఎస్సీ కంప్యూటర్స్ చేశా. ఇఫ్కో ద్వారా మద్రాస్ ఐఐటీలో డ్రోన్ పైలట్‌గా శిక్షణ పొందా. ఇఫ్కోతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించగా.. ఆ సంస్థ నాకు రూ.15 లక్షల విలువైన కిసాన్ డ్రోన్, ఎలక్ట్రికల్ వాహనం ఇచ్చింది. రైతు పొలాల్లో అద్దె ప్రాతిపదికన పురుగు మందులు, నానో ఎరువులు పిచికారీ చేసినందుకు ఎకరాకు రూ.300 తీసుకుంటున్నా. – కయ్యూరు మహేష్, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లాఖర్చు తగ్గుతోందిఇఫ్కో ద్వారా శిక్షణ పొంది కిసాన్ డ్రోన్ తీసుకున్నాం. గతంలో ఎకరాకు పిచికారి చేయాలంటే రూ.500 నుంచి రూ.600 వరకు కూలీలకు చెల్లించాల్సి వచ్చేది. కూలీలు దొరక్క చాలా ఇవ్వండి పడేవాళ్లం. కిసాన్ డ్రోన్‌తో 25 ఎకరాల వరకు పిచికారి చెయగలుగుతున్నాం. ఇప్పుడు కేవలం 4–5 నిముషాల్లో ఎకరా విస్తీర్ణంలో పిచికారీ పూర్తవుతోంది. వృథా కూడా ఏమీ ఉండటం లేదు. ఎకరాకు రూ.300 వరకు ఆదా అవుతోంది. – కొక్కిరాల వెంకట సుబ్బారావు, దుగ్గిరాల, బాపట్ల జిల్లారైతు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంనిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. గతేడాది 60 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కిసాన్ స్టూడియో, కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ కాల్ సెంటర్)’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి లో కిసాన్ అవుట్‌బౌండ్ కాల్ సెంటర్‌తో పాటు కిసాన్ స్టూడియోలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం జాతికి అంకితం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఓ కాల్ సెంటర్ ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లోనూ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పరిశీలించారు. వారిచ్చిన సూచనలతోనే కేంద్రం జాతీయ స్థాయిలో కాల్ సెంటర్, స్టూడియోలను కేంద్రం తీసు కొచ్చిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదీ కేంద్ర కాల్ సెంటర్ ఈ కేంద్రం ద్వారా నిపుణులైన సిబ్బంది రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. సీనియర్ అధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఇందులో ఉంటారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ కాల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ప్రధాన పంటలు సాగయ్యే ప్రాంతాల రైతులకు ఈ కాల్ సెంటర్ మార్గదర్శకంగా నిలుస్తుంది. రైతుల కు ఫోన్ చేసి పంటల స్థితిగతులు, అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వాటి తీవ్రతను బట్టి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపిస్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై రైతుల సూచనలు తీసుకుని అమలు చేస్తారు. కార్పొరేట్ స్థాయిలో గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 67 మంది సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ రైతులకు సాగులో, క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారానికి చక్కని వేదికగా నిలిచింది. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లో బృందాలను గ్రామాలకు పంపి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల మన్నననలు చూరగొంది. ఛానల్ ద్వారా సీజన్లో పంటలవారీగా అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలతో కూడిన వీడియోలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలతో రైతులకు దగ్గరైంది. ఐసీసీ ద్వారా 8.26 లక్షల కాల్స్, 12,541 వాట్సప్ సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఆర్బీకే ఛానల్ ను 2.81 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకోగా, 57.12 లక్షల మంది వీక్షించారు. వ్యవసాయ అను బంధ రంగాలకు చెందిన 1,698 వీడియోలను అప్లోడ్ చేసుకొన్నారు. ఐసీసీ సేవలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నో రాష్ట్రాలు వాటి ప్రతినిధులను పంపి అధ్యయనం చేశాయి. బ్రిటిష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, యూఎన్వోకు చెందిన ఎఫ్ఏవో కంట్రీ హెడ్ చి చోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ప్రముఖులు ఈ కేంద్రం పనితీరును ప్రశంసించారు. మన విధానాలు కేంద్రం అనుసరిస్తోంది సీఎం జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. పలు రాష్ట్రాలు కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి. గన్నవరంలోని ఐసీసీ కాల్ సెంటర్ నాలుగేళ్లుగా రైతుల సేవలో తనదైన ముద్ర వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఏపీ స్ఫూర్తితో కేంద్రం కేసీసీను తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఐసీసీ కాల్ సెంటర్‌ను మరింత పటిష్ట పరిచి సేవలను మరింత విస్తృతం చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఏడాదిలో ఆరు నెలలు.. 'గోపాలకుల వనవాసం'!
ఈ జీవిత పోరాటంలో ఒక్కొక్కరి జీవనం ఒక్కోవిధంగా కొనసాగుతూంటుంది. వాటిలో ఎన్నో మార్పులు, చేర్పులు కూడా జరుగుతూంటాయి. కొన్ని సమయాల్లో జీవించడానికి వలసలు వెళ్లాల్సివస్తుంది. కొందరైతే ఊర్లు, దేశాలు, ఏకంగా ఖండాలే దాటి వెళ్తున్నారు. అది కూడా బస్సులు, రైల్లు, విమనాల్లోనో ప్రయాణిస్తున్నారు. జీవన శైలిలో ఇది ఒకెత్తు అయితే, మరో ఎత్తు.. మూగ జీవాలకై.. గిరిజన తండా వాసులు పడే తంటాలు. ఎండనకా, వాననకా, రాళ్లనకా, ముళ్లనకా వారివి కాలినడక ప్రయాణాలు. ఇలా ఒకరోజు రెండురోజులు కాదు.. ఏకంగా ఏడాదిలో ఆరుమాసాలు. ఇంటివాకిలిపై, పిల్లాజల్లలపై మనసున్నా గానీ, ఎంచుకున్న మార్గాన్ని వీడక, మూగప్రాణుల కడుపు మేతకై ఈ ఆడపడుచుల ప్రయాణాన్ని గురించి ఓసారి చూద్దాం! రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల, వీర్నపల్లి గిరిజన తండాలకు చెందిన 25 కుటుంబాలు ఆరు నెలలపాటు ఇల్లు విడిచి, ఊరును వదిలి వనవాసం చేస్తూ... ఆవులను మేపుతుంటారు. స్థానికంగా గడ్డి లేకపోవడంతో ఊరు వదిలి మన్నెం(వలసపోవడం) అనివార్యమైంది. మద్దిమల్ల నుంచి అటవీమార్గంలో ఆవులను మేపుతూ.. కోరుట్ల, మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్ శివారులోకి వెళ్లి.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆవులను మేపుతారు. ఎక్కడ రాత్రి అయితే అక్కడే ఆవులతోపాటు నిద్రిస్తారు. అక్కడే వంట చేసుకుని తింటారు. ఎవరైనా పెద్ద రైతులు తమ పొలాల్లో సేంద్రియ ఎరువుల కోసం ఈ ఆవుల మందలను వారం, పది రోజులు పెట్టించుకుని డబ్బులు ఇస్తారు. ఆవుల మూత్రం, పేడ పొలాలకు సేంద్రియ ఎరువులుగా పనికి వస్తాయి. అందుకే రైతులు ఎక్కువగా ఆవుల మందలను పొలాల్లో పెట్టిస్తారు. అలా వచ్చిన డబ్బులతోనే గిరిజనులు బియ్యం కొనుక్కుని, కట్టెల పొయ్యిపై వంట చేసుకుని తింటారు. కొన్ని ఆవులను, కోడెలను ఒక్కోదాన్ని రూ.15వేల నుంచి రూ.30 వేలకు స్థానిక రైతులకు, పశువుల సంతల్లో అమ్ముతారు. కోడెలు రైతులకు ఎవుసానికి అక్కరకు వస్తుంటాయి. ఇలా ఆరు నెలలపాటు వనవాసం చేసి వర్షాకాలంలో ఇల్లు చేరుతారు. ఆవుల మందలే ఆధారం.. గిరిజనులకు ఆవుల మందలే ఆధారం. ఒకప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఆవులు ఉండేవి. ఇప్పుడు వాటిని మేపేందుకు చెల్కలు లేక, అడవుల్లోకి వెళ్లకుండా కంచెలు వేయడంతో ఆవుల సంఖ్య తగ్గింది. మరోవైపు వన్యప్రాణుల భయం వెంటాడుతుండడంతో అడవుల్లోకి వెళ్లడం తగ్గిపోయింది. మైదాన ప్రాంతాలన్నీ పొలాలుగా మారడంతో పశుపోషణ భారమైంది. అయినా.. కొందరు గిరిజనులు ఆవులను పోషిస్తూ.. వాటితో వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టడం, పిల్లలను చదివించడం, ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆవుల మందల సంఖ్య తగ్గిపోయింది. అయినా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఓ వంద కుటుంబాల వరకు ఆవులే ఆధారంగా ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇవి చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా! -
ప్రతిష్టాత్మక అగ్రి షో ‘కిసాన్ 2024’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్‌తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్‌లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్‌ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు." 3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్
-
నర్సరీ పెట్టు.. కాసులు పట్టు
కడప అగ్రికల్చర్: తక్కువ పెట్టుబడితో అనతికాలంలో అధిక ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ నర్సరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ కిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చేయూతగా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. మల్బరీ సాగుకు అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు నర్సరీ సాగుకు ముందుకు రావాలని సూచిస్తోంది. జిల్లాలో మల్బరీ సాగుకు మొక్కల కోసం ముందుగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు అందించేందుకు ప్రోత్సహిస్తోంది. ఎకరాకు నర్సరీకి 1,60,000 మొక్కలు... మల్బరీకి సంబంధించి ఒక ఎకరా కిసాన్ నర్సరీలో 1,60,000 మొక్కలను నాటితే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నర్సరీలో 4 నుంచి 5 నెలలపాటు మల్బరీ మొక్కలను పెంచి తరువాత రైతులు మొక్కలను విక్రయించాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను రైతు తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నర్సరీలో ఒక్కో మొక్కకు రైతు రూ. 2 చెల్లించి కొనుగోలు చేయాలి. తెచ్చుకున్న మొక్కలను తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎకరాకు సాగుకు మొక్కలను నాటేదాన్ని బట్టి 4500 నుంచి 10 వేల మొక్కల వరకు నాటి సాగు చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీ ఇలా.. నర్సీరీ మొక్కల సాగుకు ప్రభుత్వం ఒక యూనిట్‌కు రూ.1,50,000 అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీతో రూ.1,35,000 ఉచితంగా అందిస్తుంది. అలాగే ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీతో రూ.1,12,500 ఉచితంగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. నర్సరీ సాగు పూర్తయ్యాక (ఓసీ, బీసీ రైతులకు) రైతుకు ఒక్కో మొక్కను 2 రూపాయలతో విక్రయిస్తే రూ.2,40,000 రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.1,12,500 కలుపుకుని మొత్తం రూ.3,12,500 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను నికరంగా రైతుకు రూ.2,02,500 లాభం వస్తుందని మల్బరీ అధికారులు తెలిపారు. అలాగే (ఎస్సీ, ఎస్టీ రైతులకు) సంబంధించి రైతు రాబడి రూ.2,40,000, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,35,000 కలుపుకుని మొత్తం రూ.3,75,000 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను రైతుకు నికరంగా రూ.2,25,000 లాభం వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నర్సరీల ద్వారా... మల్బరీ నర్సరీ మొక్కల సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో రెండు నర్సరీ కేంద్రాలలో పెంపకాన్ని చేపడుతున్నారు. ఇందులో ఒకటి కడప నగర శివార్లలోని ఊటుకూరు కేంద్రంలో ఒక దానిని, మైదుకూరు మండలం వనిపెంట పట్టు పరిశ్రమలశాఖ క్షేత్రంలో మరొక మల్బరీ నర్సరీ సాగును చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2 లక్షల మల్బరీ మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో ఊటుకూరు క్షేత్రంలో ఇప్పటికే 1,50,000 మొక్కలను నాటించారు. త్వరలో వనిపెంట నర్సరీలో కూడా నాటించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు నర్సరీల ద్వారా రైతులకు కావాల్సిన మొక్కలను అందజేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్క రూ. 2కు అందజేస్తారు. వ్యాధి రహిత పట్టు పురుగుల పెంపకం.. వ్యాధి రహిత పట్టు పురుగులను( చాకీ పురుగుల పెంపకం) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసూరులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లు తెప్పించి పెంచుతోంది. ఇందులో 100 గుడ్లను 13 వందలకు తెప్పించి వనపెంటలోని సీడ్ఫామ్లో పెంచుతారు. అక్కడ 13 రోజుల తరువాత పగిలి చాకీ పురుగులు బయటకు వస్తాయి. వాటికి ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా 3 రోజులపాటు 6 మేతలను అందిస్తారు. ఈ తరుణంలో వాటికి మొదటి జ్వరం వస్తుంది. తరువాత 2వ మేతను రెండున్నర రోజులు అందిస్తారు. తర్వాత 2వ జ్వరం వస్తుంది. తరువాత రైతులకు ఈ చాకీ పురుగులను సరఫరా చేస్తారు. ఇందులో 100 పట్టు గుడ్ల రేటు రూ.1300 కాగా 100 పట్టు పురుగులను 9 రోజులపాటు పెంచి ఇచ్చినందుకు ఈ ఖర్చు అవుతుంది. ఇలా రైతుకు 100 చాకీ పురుగులను అందించాలంటే రూ.2600 రైతు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత చాకీ పురుగులను కడపతోపాటు గిద్దలూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది 4 వందల ఎకరాలు ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగును లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం కడప ఊటుకూరుతోపాటు వనిపెంట నర్సరీలో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టాము. ఇప్పటికే ఊటుకూరు నర్సరీలో 1,50,000 మొక్కలను సాగు చేశాము. మిగతా వాటిని కూడా త్వరలో నాటి కావాల్సిన రైతులకు అందిస్తాము. – అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి. -
ఓటు బ్యాంకు కోసం కాదు.. నయా భారత్ కోసమే సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: ‘ఓటు బ్యాంకు కోసం కాదు. నయా భారత్ కోసమే సంస్కరణలు చేపడుతున్నాం. ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రయతి్నస్తున్నాం’అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పేదల ఆరోగ్యం కోసమే ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టామని అన్నా రు. ఎగుమతుల్లో భారత్ చరిత్ర సృష్టించిందని చెప్పారు. మెడికల్, టెక్నికల్ విద్యను మాతృభాషలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో మంగళవారం జరిగిన ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’కార్యక్రమానికి అనుసంధానంగా తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ లబి్ధదారులతో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ పరిశోధనా క్షేత్రంలో వర్చువల్‌గా కార్యక్రమం జరిగింది. 3 వేల మంది లబి్ధదారులతో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని వర్చువల్ పద్ధతిలో మోదీ విడుదల చేశారు. రైతుల ఖాతా ల్లోకి నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉం డాల్సిందేనని.. దీంతో ప్రజలకు మేలు జరుగుతుందని, అవి నీతి తగ్గుతుందని చెప్పారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయమని, సర్జికల్ స్ట్రైక్ చేయడం పట్ల గర్వపడుతున్నా మని చెప్పారు.భారత స్టార్టప్‌లపై చర్చ జరుగుతోందన్నారు. ధాన్యం సేకరణకు రూ. 26,600 కోట్ల ఖర్చు: కిషన్‌రెడ్డి 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లను ఏకకాలంలో జమ చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎరు వుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఎరువుల దుకాణాల వద్ద క్యూ కట్టేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నా రు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ. 4 లక్షల కోట్ల వరకు పెంచామన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గతంలో కొన్ని రకమైన పంటలకు మాత్రమే మద్దతు ధర ఉండేదని, నేడు 23 రకాల పంటలకు ఇస్తున్నామని చెప్పారు. భూ రికార్డుల ఆధునీకరణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నా రు. నానో యూరియా దిగుబడి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 2014లో రూ. 3,400 కోట్లను ఖర్చు చేస్తే ప్రస్తుతం రూ. 26,600 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. రామగుండం ఫ్యాక్టరీని కేసీఆర్ అడ్డుకుంటున్నారు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభం కావాల్సి ఉందని, ప్రారంభమైతే బీజేపీ నేతలకు పేరొస్తుందని కాలుష్యం పేరుతో ఫ్యాక్టరీకి నోటీసులిప్పించి అడ్డుతగులుతున్నారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అందనివ్వట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. కేసీఆర్ ఎన్ని రోజులు ఫామ్ హౌస్‌లో ఉంటారో.. ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ‘డబ్బా ఇల్లు వద్దన్నారు. 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారు’అని రాష్ట్ర సర్కారును ప్రశ్నించారు. పేదల కోసం ఎన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికైనా రాష్ట్రానికి నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. -
ఖరీఫ్‌కు ముందే ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతులు ఖరీఫ్‌కు సమాయత్తమవుతుండగా ముందుగానే పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి గాను ‘వైఎస్సార్ రైతు భరోసా’ నగదు అందజేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి అర్హులైన అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో 1,12,843 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.84.63 కోట్లు జమ కానుంది. పల్నాడు జిల్లాలో 2,43,492 మంది రైతులకుగాను రూ. 182.62 కోట్ల జమ కానున్నాయి. బాపట్ల జిల్లాలో 1,63,692 మంది రైతులకు రూ. 122.76 కోట్ల లబ్ధి కలగనుంది. ముందస్తుగా సాయం... ఖరీఫ్ సాగులో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఇందులో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా సోమవారం పీఎం కిసాన్తో కలిపి రూ.7,500 జమ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓలు, సచివాల య అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. అర్హులందరికీ వర్తించేలా... వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు, దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ధీమాతో సాగుకు సై... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసేలా విత్తు మొదలు పంట విక్రయించే వరకు అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తోంది. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తుండటంతో రైతులు ధీమాతో సాగుకు సై అంటున్నారు. (చదవండి: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
అన్నదాతకు సలాం..!!
-
500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు.. వేలాదిగా మోహరించిన పారా మిలటరీ బలగాలు.. ఆందోళనకారులపై ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్న లాఠీలు..పరిస్థితి చేయిదాటితే నిలువరించేందుకు వాటర్ కేనన్లు, బాష్పవాయు గోళాలు.. 100 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభించిన రైతులతో కేంద్రప్రభుత్వం 11 విడతల్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంతేగాక సుప్రీంకోర్టు జోక్యంతో ఏర్పాటైన కమిటీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు అంగీకరించలేదు. దీంతో వ్యవసాయ చట్టాల విషయంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎముకలు కొరికే చలిలో, భారీ వర్షంలోనూ ఆందోళనలను కొనసాగించిన రైతులు, ఇప్పుడు ఉత్తరాదిన మండిపోయే ఎండల్లోనూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గత 100 రోజులుగా రైతుల ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నవంబర్ 26న రైతులు తమ నిరసన ప్రారంభించిన రోజు ఏ విధంగానైతే వాతావరణం ఉందో, ఇప్పటికీ అలాగే ఉంది. ట్రాక్టర్లు, ట్రాలీలు, లంగర్లు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు, తాత్కాలిక ఆసుపత్రులు, గుడారాలు 100 రోజులు అయినప్పటికీ అలానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆందోళన ప్రారంభించిన రైతుల సంకల్పం ఎక్కడా చెక్కుచెదరలేదు. గతేడాది నిరసన ప్రారంభమైనప్పుడు దేశ రాజధానిలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు ఇప్పుడు నిరసన వేదికకు 4–5 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ అనంతరం 14 మంది పంజాబ్ రైతుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. మూడు నెలల్లో తీవ్రమైన చలి కారణంగా రైతు ఉద్యమంలో 108 మంది రైతులు కన్నుమూశారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన శనివారానికి (మార్చి 6వ తేదీ) 100 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత సజీవంగా ఉంచేందుకు ఢిల్లీ వెలుపల ఉన్న కుండ్లి–మనేసర్–పాల్వాల్ వెస్ట్రన్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదు గంటలపాటు అడ్డుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా గతంలోనే ప్రకటించింది. శనివారం రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించేందుకు ఇళ్ళు, కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగురవేయాలని ఎస్కేఎం కోరింది. ఈ చర్యతో ప్రభుత్వం మళ్ళీ తమతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. జనవరి 26న రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు జరిగాక రైతు ఉద్యమంలో మార్పు మొదలైంది. విధ్వంసానికి వ్యతిరేకంగా పలు సంఘాలు రైతు ఉద్యమం నుంచి దూరమవుతున్నట్లుగా ప్రకటించాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు విధ్వంసాన్ని తప్పుబట్టాయి. ఆ సమయంలో రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ రంగంలోకి దిగారు. రైతులు తమ డిమాండ్లను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి 500 రోజులు పట్టినా ఆందోళనలను ఆపే ప్రసక్తిలేదని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఎంఎస్పీ దిలావ్ అభియాన్‌కు శ్రీకారం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా కిసాన్ దివస్‌గా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త నిరసనలలో మహిళలు ఎక్కువగా పాల్గొంటారని రైతు సంఘాలు తెలిపాయి. మార్చి 15వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా గుర్తించనున్నాయి. ఈ రోజును కార్పొరేటీకరణ వ్యతిరేక దినంగా పాటించాలన్న కార్మిక సంఘాల పిలుపునకు ఎస్కేఎం మద్దతు ప్రకటించింది. వీటికితోడు దేశమంతటా కనీస మద్దతు ధరపై ప్రజల్లోనూ అవగాహనను పెంచేలా ఎంఎస్íపీ దిలావ్ అభియాన్ వంటి వినూత్న కార్యక్రమానికి ఎస్కేఎం శ్రీకారం చుట్టనుంది. మొదట ఈ విభిన్న కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేశారు. -
పంజాబ్‌లో కిసాన్ మహా పంచాయత్
జాగ్రాన్(లూధియానా): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లోనే జరిగిన కిసాన్ మహా పంచాయత్‌కు తాజాగా పంజాబ్ వేదికగా మారింది. లూధియానా జిల్లాలోని జాగ్రాన్ మార్కెట్లో గురువారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో 40 రైతు సంఘాలు బలప్రదర్శన నిర్వహించాయి. 30 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలివచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 40 రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్ రాజేవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్ మహా పంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. రైతన్నల పోరాటం గురించి ఆందోళన జీవులంటూ తేలికగా మాట్లాడిన ప్రధాని∙మోదీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చారని అన్నారు. రైతులది పవిత్ర పోరాటం అంటున్నారని గుర్తుచేశారు. ‘మోదీ పెద్ద అబద్ధాలకోరు, నాటకాల రాయుడు’ అని రాజేవాల్ మండిపడ్డారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని వెల్లడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తప్పుడు చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు. ఇది ప్రజా పోరాటం కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్ వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని రాజేవాల్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, విజయం తప్పకుండా వరిస్తుందని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు తదుపరి పోరాట కార్యాచరణను రాజేవాల్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళిగా ఈ నెల 14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సర్ చోటూరామ్‌ను స్మరించుకుంటూ ఈ నెల 16న కిసాన్/మజ్దూర్ దినం పాటిస్తామని వెల్లడించారు. 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో చేపడతామని వివరించారు. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ రైతులకు సూచించారు. కాంట్రాక్టు వ్యవసాయం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వంటివి తామెప్పుడూ ప్రభుత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు. వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అవసరమైతే సవరణలు: మంత్రి రాజ్‌నాథ్ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో అవసరమైతే ప్రభుత్వం సవరణలు చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పలు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాక రాజ్‌నాథ్ మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సాధారణ రైతన్నల్లో కొత్త విశ్వాసం, ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
సోనూ సూద్ కొత్త సినిమా.. ‘కిసాన్’
ముంబై : బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోమవారం తన కొత్త సినిమా ప్రాజెక్టును ప్రకటించాడు. సోనూ సూద్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కిసాన్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఈ నివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రిమ్ గర్ల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాజ్ శాండిల్యా నిర్మాతగా వ్యవహరించనున్నారు. మిగతా చిత్ర యూనిట్‌ను ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో వెల్లడించారు. ఓ వైపు ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూ కిసాన్ సినిమా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆ సేవలు అభినందనీయం: సోనూ సూద్ IT’S OFFICIAL... SONU SOOD IN #KISAAN... #SonuSood will head the cast of #Kisaan... Directed by E Niwas... Raaj Shaandilyaa - who made his directorial debut with #DreamGirl - will produce the film... Balance cast will be announced shortly. pic.twitter.com/5MTpWHHKNb — taran adarsh (@taran_adarsh) January 4, 2021 సోనూసూద్ కొత్త సినిమాకు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. అనంతరం సోనూ సూద్ స్వందిస్తూ అమితాబ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా లాక్డౌన్లో వలస కార్మికులకు సాయం చేసిన సోనూసూద్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. సాయం అని కోరిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నానంటూ సోనూ సూద్ తన సేవలను కొనసాగిస్తున్నారు. అలాగే ఇటీవల సోనూసూద్ లాక్డౌన్లో ఎదురైన సవాళ్లను, అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రాశారు. ‘నేం ఆపద్భాందవుడిని కాను’(IAmNoMessiah) అనే అనే పేరుతో దీనిని విడుదల చేశారు. -
నిరంతరం రైతన్నకు మేలు
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రైతులకు ఇబ్బందులు లేకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఆయన శనివారం గుజరాత్లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కాలానుగుణంగా ప్రయత్నాలను మరింత పెంచాల్సి ఉందని మోదీ అన్నారు. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవడానికి అవకాశం కల్పించడం, వేలాది రైతు ఉత్పాదక సంస్థలను సృష్టించడం, మధ్యలోనే ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, పంటల బీమా పథకాన్ని మెరుగుపర్చడం, 100 శాతం వేప పూత యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, సాయిల్ హెల్త్ కార్డులు.. వీటన్నింటి లక్ష్యం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడమేనని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఇలాంటి చర్యలతో రైతాంగానికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. మన రైతన్నలకు మేలు చేసే చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అక్కడ సౌకర్యాలు కల్పిస్తే.. గుజరాత్ ప్రభుత్వం అమలు చేయనున్న కిసాన్ సూర్యోదయ యోజన(కేఎస్‌వై)ను ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయ రంగానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తారు. గిర్నార్ కొండపై ఏర్పాటు చేసిన రోప్‌వే ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల ఈ రోప్‌వే రాష్ట్రంలో పర్యాటకులను ఆకట్టుకుంటుందని అధికారులు చెప్పారు. ఇది ఆసియాలోనే పొడవైన రోప్‌వే. పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని చెప్పారు. ప్రపంచానికి దారి చూపుతున్న భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో ఆరో స్థానానికి చేరిందన్నారు. గత ఆరేళ్లలోనే ఈ ఘనత∙సాధ్యమైందన్నారు. ‘ఒక సూర్యుడు.. ఒక ప్రపంచం.. ఒక గ్రిడ్’ విషయంలో ప్రపంచానికి భారత్ దారి చూపుతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. కిసాన్ సూర్యోదయ యోజన కింద వ్యవసాయానికి సూర్యోదయం నుంచి ఉదయం 9.30 గంటలకు వరకు కరెంటు సరఫరా చేస్తారని, దీనివల్ల లక్షలాది మంది రైతుల్లో పెనుమార్పులు రావడం ఖాయమన్నారు. పగటి పూటే కరెంటు సరఫరా ఉంటుంది కాబట్టి సూక్ష్మ సేద్యం ప్రారంభిస్తే వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తాయని రైతులకు సూచించారు. -
ఢిల్లీకి వ్యవసాయోత్పత్తులు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఈ నెల 9న ప్రయోగాత్మకంగా అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్‌కు కిసాన్ రైలు నడిపిన విషయం తెలిసిందే. చీనీ, మామిడి, బొప్పాయి, కర్భూజా, టమాట తదితర ఉత్పత్తులకు ఇక్కడ లభిస్తున్న ధరతో పోల్చుకుంటే ఢిల్లీ అజాద్‌పూర్ మండీలో అధిక ధరలు లభించాయి. దీంతో ఈ నెల 19న రెండో కిసాన్ రైలు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి జిల్లాలో పండిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా పంపితే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని రకాల ఉత్పత్తులు ప్రయోగాత్మకంగా పంపి మార్కెటింగ్ పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. వేరుశనగ, పప్పుశనగ, కందులు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జ, కొర్రలు, అండుకొర్రలు, ఆముదాలు తదితర అన్ని రకాల ఉత్పత్తులు ఐదారు కిలోలు చొప్పున పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చిన కిసాన్‌రైలులో నలుగురు వ్యవసాయశాఖ అధికారులు కూడా ఉన్నారు. రెండో సారి వెళ్లే రైలులో ఇద్దరు అధికారులను పంపించి వ్యవసాయ ఉత్పత్తులకు లభిస్తున్న గిట్టుబాటు ధరలు, అక్కడి ప్రజల వినియోగంపై అధ్యయం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా రాజస్తాన్, గుజరాత్లో పండే వేరుశనగ, పెద్ద సైజు కాబూలీ రకం పప్పుశనగ వాడుతున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి వారికి పరిచయం చేస్తే కొంత వరకు ధరలు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనుకున్న ఫలితాలు వస్తే భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులు కూడా తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెబుతున్నారు. కిసాన్‌రైలుకు అడ్డంకులు భవిష్యత్తులో తమ వ్యాపారాలు, కమీషన్లకు గండిపడకుండా ఉండేందుకు దళారులు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. తమ లారీలు, ట్రక్కులు, ఇతరత్రా సరుకు రవాణా వాహనాలకు బాడుగలు లేకుండా పోతుందని భావించిన కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మధ్య దళారీలు కిసాన్ రైలును ఎలాగైనా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 19న ఢిల్లీకి కిసాన్ రైలు ఢిల్లీకి రెండో విడత కిసాన్ రైలు ఈ నెల 19న బయలుదేరుతుందని కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. తొలుత 16న పంపించేందుకు ఏర్పాట్లు చేశామని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 19కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంటకోతకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పాటు పంట ఉత్పత్తులు తడిసి నాణ్యత కోల్పోయి రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదముండడంతో కిసాన్ రైలు ప్రయాణాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. చదవండి: త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం -
ఈనెల 9న ఢిల్లీకి కిసాన్ రైలు
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు కిసాన్ రైలు మంజూరైందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు ఉద్దేశించిన ఈ రైలు అనంతపురం - ఢిల్లీ మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చే కిసాన్ రైలును ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.(చదవండి: 9న ఢిల్లీకి కిసాన్ రైలు ) కాగా అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల నుంచి అక్టోబర్ నుంచి ప్రతిరోజూ కిసాన్‌రైలు నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. అనంత నుంచి హస్తినకు వెళుతున్న తొలి కిసాన్‌రైలులో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్‌కోచ్ బోగీ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: కిసాన్ రైలు) ఇక రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ రైలు సేవల ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డుమార్గంతో పోల్చుకుంటే ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆగష్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే. -
9న ఢిల్లీకి కిసాన్ రైలు
సాక్షి, అనంతపురం: ‘అనంత’ నుంచి ఢిల్లీకి ఈ నెల 9న కిసాన్ రైలు ప్రారంభమవుతుందని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంత ఉద్యాన రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాజధాని నుంచి జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిసాన్‌రైలు అంశంపై బుధవారం స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో పీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ పి.పద్మలత, ఏడీలు జి.సతీష్, జి.చంద్రశేఖర్, మార్కెటింగ్‌శాఖ ఏడీ ఎ.నారాయణమూర్తి, సెర్ఫ్ అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి రైల్వే వ్యాగన్‌ను సీఎం ప్రారంభించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల నుంచి అక్టోబర్ నుంచి ప్రతిరోజూ కిసాన్‌రైలు నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. అనంత నుంచి హస్తినకు వెళుతున్న తొలి కిసాన్‌రైలులో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్‌కోచ్ బోగీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఒక బృందం ముందే ఢిల్లీకి చేరుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఉద్యాన రైతులు, అధికారులు సహకరిస్తే ‘అనంత’ కిసాన్‌రైలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమీక్ష అనంతరం రైల్వేస్టేషన్లో వసతులు పరిశీలించారు. అనంతరం కక్కలపల్లి టమాట మండీని పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. -
ఎంపీ తలారి లేఖకు స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతికి కిసాన్ రైలు నడపాలన్న పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తలారి వినతిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డు.. దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ముఖ్య అధికారిని ఆదేశించింది. రైల్వే అధికారులు సోమవారం అనంతపురం వెళ్లి ఉద్యాన శాఖాధికారులతో చర్చలు జరిపి సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి కిసాన్ రైలు అనంతపురం–ఢిల్లీ మధ్య నడవనుంది. (టీడీపీ ఇన్చార్జ్పై కలెక్టర్ సీరియస్) ► అనంతపురం జిల్లా నుంచి పండ్లు, కూరగాయలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని మార్కెట్లకు రవాణా అవుతుంటాయి. ► రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరాలంటే ఐదారు రోజులు పడుతుంది. దీంతో చాలా ఉత్పత్తులు చెడిపోతున్నాయి. ► అనంత ఎంపీ రంగయ్య.. సీఎం జగన్ సూచనతో కిసాన్ రైలును కేటాయించాలని ఇటీవల ప్రధాని, రైల్వే మంత్రికి లేఖ రాశారు. -
కిసాన్ రైలుతో రైతులకు ఎంతో మేలు
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ సర్వీసెస్ ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డుమార్గంతో పోల్చుకుంటే పదిహేను గంటల సమయం, టన్నుకి 1000 రూపాయల చొప్పున ఆదా అవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి ప్రయోగాత్మకంగా శుక్రవారం ఈ నూతన కిసాన్ రైల్ సరీ్వస్‌ని ప్రారంభించారు. ఈ రైలు పది పార్సిల్ వ్యాన్లు కలిగి ఉంటుందని, 238 టన్నుల సరుకుని రవాణా చేయగలుగుతుందని వారు తెలిపారు. ఈ సర్వీసు ప్రస్తుతానికి వారానికి ఒకసారి దేవ్లాలి నుంచి ప్రతిశుక్రవారం, తిరుగుప్రయాణంలో ప్రతి ఆదివారం దానాపూర్ నుంచి బయలుదేరుతుంది. (యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్ కుమార్ జోషి) -
పట్టాలపైకి తొలి కిసాన్ రైలు
ముంబై : రైతుల దిగుబడులకు మార్కెటింగ్ ఊతమిచ్చేలా కిసాన్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రకు చెందిన నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల రవాణాకు కిసాన్ రైలు ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు తమ దిగుబడులకు సరైన ధర పొందేలా తక్కువ చార్జీలతోనే ఈ రైలు సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆహారోత్పత్తుల సరఫరా కోసం భారత రైల్వేలు 96 రూట్లలో 4610 రైళ్లను నడుపుతున్నాయని చెప్పారు. రైతులు స్వయంసమృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు చర్యలు చేపడుతున్నారని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దియోలలి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరే కిసాన్ రైల్ మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు దనాపూర్ చేరుకుంటుంది. ఇక తిరుగుప్రయాణంలో భాగంగా ప్రతి ఆదివారం రాత్రి 12 గంటలకు దనాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.45 గంటలకు దియోలలి చేరుకుంటుంది. ఈ రైలు ఒక ట్రిప్‌లో 31.45 గంటల ప్రయాణంలో 1519 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. కిసాన్ రైలు నాసిక్ రోడ్, మన్మాడ్, జల్గావ్, భుసావల్, బుర్హాన్పూర్, ఖండ్వా, ఇటార్సి, జబల్పూర్, సత్నా, కట్ని, మాణిక్పూర్, ప్రయాగరాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్ స్టేషన్లలో ఆగుతుంది. కాగా, కిసాన్ రైల్ రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని, స్ధానిక రైతులు, వ్యాపారులు, మార్కెట్ కమిటీలతో కలిసి రైల్వేలు రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాయని కేంద్ర రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : రైతు పెన్షన్ స్కీమ్‌కు శ్రీకారం.. -
కిసాన్ రైలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు. రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు. కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది. -
రైతు పెన్షన్ స్కీమ్‌కు శ్రీకారం..
రాంచీ : రైతులకు పెన్షన్ అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో ప్రారంభించారు. ఈ పధకం జార్ఖండ్‌ను భారత్‌తో పాటు ప్రపంచానికి అనుసంధానం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ పధకం కింద ప్రస్తుతం 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన సన్న, చిన్నకారు రైతులు వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెలకు రూ 3000 పెన్షన్ అందుకుంటారు. రానున్న మూడేళ్లకు రూ 10,774 కోట్లను ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన పధకానికి కేటాయించారు. కాగా రాంచీలో మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ సచివాలయ భవనానికి శంకుస్ధాపన చేశారు. -
పీఎంకేవై కింద 12,305 కోట్ల పంపిణీ
న్యూఢిల్లీ: అర్హులైన రైతులకు పీఎం కిసాన్ పథకం(పీఎంకేవై) కింద ఇప్పటి వరకూ రూ. 12,305 కోట్లు పంపిణీ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద అందించే రూ. 6,000 మూడు దఫాల్లో చెల్లించనున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 14.5కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. భూపరిమితితో నిమిత్తం లేకుండా సహాయం అందిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 87,215.50 కోట్ల భారం పడనున్నదని తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిషేధించినట్టు నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ నష్టపరిహారం వసూలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రబీ సీజన్లో వరి చేలల్లో మిగిలిపోయిన పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి చర్యల కారణంగా ఆ ప్రభావం ఢిల్లీపై పడుతోంది. -
రైతుల కోసం ‘ఉద్యమం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కిసాన్ కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం ఉద్యమ కార్యాచరణను రూపొందించి, రైతుల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అమలుతోపాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భూరికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు మొత్తం 9 అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఇంతవరకు రుణమాఫీ చేయలేదని, ధాన్యం కొనుగోళ్లు చేసి ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని కిసాన్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ అంశాలన్నింటిపై రైతులతో కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలోని 6 లక్షలకుపైగా రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందలేదని, వీరికి రైతుబంధు కూడా అమలు కావడం లేదని, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 35వేల మంది రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళనతో పాటు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందునే ఈ ఇబ్బందులు వచ్చాయని, లోపభూయిష్ట విధానాలతో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రైతు సమస్యలపై పోరాటాలు చేయాలని తాము నిర్ణయించామని, పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర చైర్మన్ అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయిందని, ధాన్యం కొనుగోలుకు ఎన్ని గన్నీబ్యాగులు అవసరమవుతాయో కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 15–20 రోజులపాటు అసలు ధాన్యమే కొనుగోలు చేయలేదని, ధాన్యం కొనుగోలు చేసిన రెండు నెలల తర్వాత కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావస్తున్నా రబీ కొనుగోళ్లకు రూ.2వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం చెల్లింపులు రాకపోవడంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా రుణమాఫీ చేయలేదని, ఈ అంశాలన్నింటిపై ఉద్యమించాలని కిసాన్ కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్య నిధులపై శ్వేతపత్రం: శశిధర్‌రెడ్డి కిసాన్ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల నిధుల కింద కేంద్రం రాష్ట్రానికి రూ.1,500 కోట్ల సాయం చేసిందని, ఈ మొత్తాన్ని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోయిన రైతులకు ఎంత చెల్లింపులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాల గురించి వివరాలు చెప్పేందుకు రాష్ట్రం సహకరించడం లేదని కేంద్ర బృందం చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన చెప్పారు.