
మాట్లాడుతున్న సుగుణాకర్‌రావు
హుజూరాబాద్‌రూరల్: దేశంలో జాతీయ ప్రధాన రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని భారతీయ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు అన్నారు. పెద్దపాపయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటసాయి గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి మోదీ ఆదేనుసారంగా భారత రోడ్డు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2019–20 ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి వరంగల్ నుంచి జగిత్యాల వరకు రోడ్డు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
భూసేకరణలో ప్రభుత్వ యంత్రాంగం మిషన్ భగీరథ, కేబుల్ లైన్ ఉందన్న నెపంతో రోడ్డు ఒకవైపు మాత్రమే భూసేకరణ చేపట్డ్టడంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లు, స్థలాలు కోల్పోయే అవకాశముందన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సీడ్ విత్తనోత్పత్తికి హుజూరాబాద్ అనువైన ప్రాంతంగా పేర్కొంటున్నా.. ప్రభుత్వం విత్తనోత్పత్తి కేంద్ర ఏర్పాటుకు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు.కార్యవర్గ సభ్యులు మాసాడి ముత్యంరావు, కేసిరెడ్డి విజేందర్‌రెడ్డి, నర్ర శ్రీనివాస్‌రెడ్డి, రావుల వేణు, ప్రభాకర్, ఎం.నగేష్, లక్ష్మణ్‌రావు, కరుణాకర్ పాల్గొన్నారు.