Sugunakara Rao
-
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి
సాక్షి, కరీంనగర్: కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం పదవి నుంచి కేసీఆర్‌ను వెంటనే తొలగించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు. కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పి.. రాష్ట్రంలోని ఇతర గ్రామాల ప్రజల్ని విస్మరించడం వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 1నుంచి వారం రోజుల పాటు ఇంటింటికి తిరిగి పార్టీ సభ్యత్వం చేపడతామని సుగుణాకర్ రావు తెలిపారు. -
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం
నిజామాబాద్: కాంగ్రెస్ ప్రలోభాలకు గురయ్యే పార్టీగా మారిపోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదగడం ఎంతైనా అవసరమని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పొల్సాని సుగుణాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. మార్చి 22న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలోని పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీకి వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ గెలుపొందిన కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార టీఆర్ఎస్లో చేరుతున్నారని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేది ఒక్క బీజేపీ ప్రజాప్రతినిధులేనని తెలిపారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జాతీయకార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, లోక భూపతిరెడ్డి, టక్కర్ హన్మంత్‌రెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, యెండల సుధాకర్, స్వామి యాదవ్, శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం కామారెడ్డి క్రైం: జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి పొలసాని సుగుణాకర్‌రావు అన్నారు. ఆయన శనివారం కామారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 7 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలోనూ బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుందన్నారు. విద్యావంతులందరూ మోదీ నాయకత్వం వైపే మొగ్గుచూపుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ గెలిచినా, టీఆర్ఎస్ గూటికే చేరుతుందన్నారు. టీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. చట్టసభల్లో ప్రజల పక్షాన ప్రశ్నించే గళం బీజేపీయేనన్నారు. పట్టభద్రులు అందరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నరాజులు, పార్లమెంట్ కో–కన్వీనర్ మోహన్‌రావు, నాయకులు ఏకే బాలాజీ, సాయిరెడ్డి, భానుప్రకాశ్, ప్రదీప్‌కుమార్, గంగాధర్, కడెం శ్రీకాంత్, పూసల రమేశ్, చంద్రంయాదవ్, సురేష్, నాగరాజు పాల్గొన్నారు. -
ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టాలి
హుజూరాబాద్‌రూరల్: దేశంలో జాతీయ ప్రధాన రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని భారతీయ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు అన్నారు. పెద్దపాపయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటసాయి గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి మోదీ ఆదేనుసారంగా భారత రోడ్డు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2019–20 ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి వరంగల్ నుంచి జగిత్యాల వరకు రోడ్డు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. భూసేకరణలో ప్రభుత్వ యంత్రాంగం మిషన్ భగీరథ, కేబుల్ లైన్ ఉందన్న నెపంతో రోడ్డు ఒకవైపు మాత్రమే భూసేకరణ చేపట్డ్టడంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లు, స్థలాలు కోల్పోయే అవకాశముందన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సీడ్ విత్తనోత్పత్తికి హుజూరాబాద్ అనువైన ప్రాంతంగా పేర్కొంటున్నా.. ప్రభుత్వం విత్తనోత్పత్తి కేంద్ర ఏర్పాటుకు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు.కార్యవర్గ సభ్యులు మాసాడి ముత్యంరావు, కేసిరెడ్డి విజేందర్‌రెడ్డి, నర్ర శ్రీనివాస్‌రెడ్డి, రావుల వేణు, ప్రభాకర్, ఎం.నగేష్, లక్ష్మణ్‌రావు, కరుణాకర్ పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
సామర్లకోట : సామర్లకోట ఇరిగేషన్ విభాగం పరిధిలోని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. శనివారం ఈ ప్రాంతంలో రైతుల సమస్యలపై ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా వ్యవహరించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమస్యలను సావధానంగా విన్న ఆయన సోమవారం సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ ఈఈ విజయకుమార్, డీఈ నరసింహారావు సోమవారం వీకే రాయపురం, సామర్లకోటల్లో పర్యటించారు. సామర్లకోట లాకుల వద్ద పెరిగిపోయిన గుర్రపుడెక్కను పరిశీలించారు. అలాగే వ్యవసాయ క్షేత్రం నుంచి వీకే రాయపురం శివారులోని సత్యవరపు పేటకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ఆ మార్గాన్ని వ్యవసాయక్షేత్రం అధికారులు మూసివేయడంతో దానిపై సర్వే చేయాలని ఈఈ విజయకుమార్ జేఈ సునీతను ఆదేశించారు. తూటేరు డ్రెయిన్ మూసుకుపోవడం వల్ల పొలాలకు నీరు అందడం లేదని అన్నదాతలు వివరించారు. దీంతో గోదావరి కాలువ ఆధునికీకరణలో భాగంగా తూటేరు డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని ఈఈ హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ క్షేత్ర ముఖద్వారం నుంచి రామేశ్వరం ఎగువ, దిగువ కాలువకు నీరు వచ్చే తూము గుర్రపుడెక్క పేరుకుపోవడంతో మూసుకుపోయిందని రైతులు వివరించారు. ఆ ప్రదేశాన్ని అధికారులకు చూపించారు. డెక్కను తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం వీకే రాయపురంలో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వీకేరాయపురంలో ఎగువ, దిగువ కాలువలకు పుష్కలంగా నీరు వచ్చేలా చూడాలని, ఏలేరుకాలువపై వంతెన నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే బోయనపూడి వద్ద ఏలేరు కాలువకు పడిన గండి వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మించాలని కోరారు. ఈ సమస్యలపై ఎస్ఈకి నివేదిక అందించి, పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఈలు సునీత, అజహర్, వీకే రాయపురం సర్పంచ్ కుర్రా శ్రీనివాసు, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు.