
సాక్షి, కరీంనగర్: కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం పదవి నుంచి కేసీఆర్‌ను వెంటనే తొలగించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు. కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పి.. రాష్ట్రంలోని ఇతర గ్రామాల ప్రజల్ని విస్మరించడం వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 1నుంచి వారం రోజుల పాటు ఇంటింటికి తిరిగి పార్టీ సభ్యత్వం చేపడతామని సుగుణాకర్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment