
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ సర్వీసెస్ ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డుమార్గంతో పోల్చుకుంటే పదిహేను గంటల సమయం, టన్నుకి 1000 రూపాయల చొప్పున ఆదా అవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి ప్రయోగాత్మకంగా శుక్రవారం ఈ నూతన కిసాన్ రైల్ సరీ్వస్‌ని ప్రారంభించారు.
ఈ రైలు పది పార్సిల్ వ్యాన్లు కలిగి ఉంటుందని, 238 టన్నుల సరుకుని రవాణా చేయగలుగుతుందని వారు తెలిపారు. ఈ సర్వీసు ప్రస్తుతానికి వారానికి ఒకసారి దేవ్‌లాలి నుంచి ప్రతిశుక్రవారం, తిరుగుప్రయాణంలో ప్రతి ఆదివారం దానాపూర్ నుంచి బయలుదేరుతుంది. (యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్ కుమార్ జోషి)
Comments
Please login to add a commentAdd a comment