vegetables
-
ఇక పప్పులుడకవ్!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో ఆహార ధాన్యాలకు కొరత లేనప్పటికీ.. పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తులు డిమాండ్‌కు తగినట్టు సరఫరా ఉండదని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక తేల్చింది. వచ్చే ఆర్థిక ఏడాది (2025–26)తో పాటు, 2030–31 ఆర్థిక ఏడాది నాటికి ఆహార ధాన్యాలు డిమాండ్–సరఫరాతోపాటు పప్పులు, తృణధాన్యాలు, కూరగాయల డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాలతోపాటు వివిధ ఆహారోత్పత్తులు రోజువారీ తలసరి లభ్యతపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదికలో ఆసక్తికర విషయాలనువెల్లడించింది. నీతి ఆయోగ్ నివేదిక ఏం తేల్చిందంటే..నాలుగేళ్లుగా బియ్యం, గోధుమలు, తృణధాన్యాల రోజువారీ తలసరి లభ్యత పెరుగుతోంది. అయితే, పప్పుల రోజువారీ తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.రానున్న రోజుల్లోనూ పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తుల డిమాండ్–సరఫరాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో వివిధ పంటల సాగు విస్తీర్ణంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. దీనికి వాతావరణ పరిస్థితులు, నీటి పారుదల సౌకర్యాల లేమి, నేల పరిస్థితులు, తెగుళ్లు, వ్యాధులు వంటివి ప్రధాన కారణాలు. -
ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!
‘సాక్షి’ పప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. కొత్తగా ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన మీ ముందుంచుతున్నారు.జీవామృతం..కావలసిన పదార్థాలు...తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచకం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, బాగా పండిన అరటి పండ్లు 2 లేదా 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 30 – 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం... పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. వీటిని చేతితో బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఆవు పంచకం వేసి మళ్లీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 50 లీటర్లు పట్టే డ్రమ్ములో వేసుకొని 30 నుంచి 35 లీటర్ల నీటిని పోయాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని నీడలో పెట్టుకోవాలి. ఇలా భద్రపరచుకున్న ద్రావణాన్ని ఉదయం, సాయంత్రం పూటల్లో వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి చేతివైపు తిప్పుతూ మొదట 3 రోజులు కలుపుకోవాలి. నాలుగో రోజు నుంచి వాడుకోవడానికి జీవామృతం మంచి బ్యాక్టీరియాతో తయారవుతుంది. వాడే విధానం: ఇలా తయారైన జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు. వాటిపైన పిచికారీ చేయొచ్చు. ఇలా తయారుచేసుకున్న జీవామృతాన్ని 7–10 రోజుల్లోపు వినియోగించాలి.బూడిద+ పసుపు మిశ్రమంకావలసిన పదార్థాలు...దేశీ/నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి... పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న బూడిద తగినంత తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కల΄ాలి. ఈ మిశ్రమాన్ని తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.కీటకాల నివారిణి(మల్టీ పెస్ట్ కంట్రోలర్)...కావలసిన పదార్థాలు...పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచకం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత.తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు మురగబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉన్నదైతే అంత ఎక్కువ ప్రభావశీలంగా పనిచేస్తుంది.ఆచ్ఛాదన (మల్చింగ్)కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన(మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఈ ఆచ్ఛాదన ఎండి΄ోయిన ఆకులతోను, ఎండు వరిగడ్డితోను చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన 7 నుంచి 10 అంగుళాల మందాన వేయాలి. తద్వారా కుండీల్లో ఉన్న మట్టి తేమను పట్టిఉంచగలుగుతుంది. తద్వారా మట్టిలో ఉన్న వానపాములు మట్టి పైభాగానికి రావడానికి అనువైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. వాటితోపాటుగా కింది మట్టిలోని పోషకాలను మొక్కల వేళ్లకు అందుబాటులోకి తెస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.వేప కషాయంకావలసిన పదార్థాలు... తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, దేశీ ఆవు పంచకం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వే΄ాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచకం చేతితో కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న వేప కషాయాన్ని 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడబోసి దాచుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి పదిహేను రోజుకొకసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఎగ్ అమైనో ఆమ్లం (ముట్టగయం):కావలసిన పదార్థాలు:నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా(లీటరు ద్రవం పట్టే అంతది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం ΄ోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలిపి ఆ రోజు నుంచి మళ్లీ పది రోజుల వరకు వేడి తగలని నీడ ప్రదేశంలో భద్రపరచాలి. మొత్తం 28 రోజుల్లో పిచికారీకి సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూత రాలకుండా ఉండడానికి ఇది ఉపయోగ -
వీటిపై ‘శీత’ కన్నేయండి
ఈ కాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటికి ఎంతో మంచిది. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ కాలంలో తీసుకో వలసిన పండ్లు, కూరగాయలు ప్రకృతి చేసిన ఏర్పాటు వల్ల విరివిగా దొరుకుతూనే ఉంటాయి. అయితే తీసుకోకూడని ఆహారం మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే వాటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారమేంటో చూద్దాం.ఈ కాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలలో ముందు వరసలో ఉండేది...నూనెలో వేయించిన చిరుతిళ్లు...వీటికి ఉదాహరణ సమోసాలు, పకోడీలు, బజ్జీలు. చలి చలిగా ఉన్న వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సమోసాలు లాగించడానికి బాగుంటుంది కానీ అరుగుదలకే చాలా కష్టం అవుతుంది. అజీర్తి, యాసిడిటీ, కడుపు ఉబ్బరం వస్తాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండటమే మేలు.డెయిరీ ఫుడ్...మీగడ, జున్ను, పాల ఉత్పత్తులు శరీరానికి బలవర్థకమే కానీ అది ఈ సీజన్లో అంతమంచిది కాదు. పాల ఉత్పత్తులు ఒంటికి వెచ్చదనాన్నివ్వడమొక్కటే కాదు, శ్లేష్మకరం కూడా. చల్లని వాతావరణంలో సైన సైటిస్ వచ్చేలా చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులున్నవారికి సమస్యలు కలిగిస్తుంది. అందువల్ల ఈ సీజన్లో డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం అంత మంచిది కాదు. రెడ్ మీట్...చలికాలంలో రెడ్ మీట్ తీసుకోరాదు. రెడ్‌మీట్‌కు మంచి ఉదాహరణ మటన్, బీఫ్, పోర్క్. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై దు్రçష్పభావం పడుతుంది. అధికమొత్తంలో కొవ్వు ఉండటం మూలాన అరుగుదల లోపిస్తుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకోసారి అది గుండెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బండ్లమీద అమ్మే పదార్థాలు...బండ్లమీద అపరిశుభ్ర వాతావరణంలో అమ్మే పానీపూరి, చాట్ వంటి వాటిని ఎప్పుడు తీసుకున్నా మంచిది కాదు కానీ ఈ సీజన్లో తీసుకోవడం బొత్తిగా మంచిది కాదు. స్ట్రీట్‌ఫుడ్ తినడం రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపి, బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరం రకరకాల వ్యాధుల బారిన పడుతుంది. అందువల్ల స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. శీతల పానీయాలు...చల్లటి వాతావరణంలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీములూ తీసుకోవడం వల్ల వాటిని అరిగించడానికి, జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా కష్టం అవుతుంది. దానివల్ల జీర్ణవ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుంది. గొంతులో గరగర, నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. సిట్రస్ జాతి పండ్లు...విటమిన్ సీ అధికంగా ఉండే కమలా, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు తీసుకోవడం వల్ల వాటిని అరిగించే క్రమంలో కడుపులో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అసిడిటీ, గొంతు మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి.ఆవకాయ వంటి ఊరగాయలు...వింటర్లో ఊరగాయలు తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిల్వ ఉండటం కోసం ఊరగాయలలో ఉప్పు, నూనె, కారం వంటివి కొంచెం ఎక్కువమొత్తంలో వాడతారు. వాటిని అరిగించడం జీర్ణవ్యవస్థకు కాస్తంత భారమైన పనే. ఊరగాయలలో కూడా మామిడికాయలతో పెట్టిన ఆవకాయ, మాగాయ వంటివి తినడమంటే జీర్ణవ్యవస్థకు మరింత పని పెట్టినట్టే కాబట్టి వాటికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది. మసాలా పదార్థాలు...మసాలాలు దట్టించి చేసిన పదార్థాలంటే భారతీయులకు అందులోనూ తెలుగు వాళ్లకు చాలా ఇష్టం. అయితే ఈ సీజన్లో మసాలాలను దేహం అరిగించుకోలేదు కాబట్టి వాటిని కూడా దూరం పెట్టడమే మేలు. -
ఒంటికి మంచిదే..మరి పంటికి?
ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ అందులో భాగంగా పండ్లూ, పళ్లరసాలు తీసుకోవడం పెరిగింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచేదేమోగానీ పంటికి హానికరంగా పరిణమించవచ్చు. అలా ఒంటికి మంచిదైనా, పంటికి హాని చేసేవేమిటో, ఆ హానిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. పండ్లు / పండ్ల రసాలతో... తాజా పండ్లు, పళ్ల రసాలూ ఆరోగ్యానికి మంచివే. కానీ అవే ఫ్రూట్జ్యూసుల వల్ల పంటికి హాని జరగవచ్చు. ఉదాహరణకు పళ్లరసాల్లోని ఎక్కువగా ఉండే చక్కెర మోతాదులు పళ్లను దెబ్బతీవయచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణకు నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నప్పటికి కంటే చక్కెర కలిపి ఆరెంజ్‌జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.దగ్గు మందులతో... దగ్గు మందు ఔషధమే అయినా అది కూడా ఫ్రూట్ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దగ్గు మందుల్లోని గాఢత చిక్కదనం), అందులో ఉండే చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్య అధిగమించడానికి...దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో నోరు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ ఇలా నోరు కడుక్కోవాలి. గుండెకు మేలు చేసే డార్క్ చాక్లెట్లతో... పరిమితంగా తీసుకునే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకు΄ోయేలా కాస్త జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకు΄ోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉంటాయి. దాంతో పళ్ల ఎనామిల్ ΄పొర దెబ్బతినే అవకాశాల తోపాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) వచ్చే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్ చేసుకోవాలి. నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా పలుమార్లు నీళ్లతో పుక్కిలించాలి. (చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
వరిలోనే గోనె సంచుల్లో కూరగాయల సాగు!
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయంఅధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడిహెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా 30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చుఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడిసార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్పుర్లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.పదేళ్ల పరిశోధన2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.గోనె సంచుల్లో సాగు ఎలా?ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్‌తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.హెక్టారుకు 3 వేల మడులు95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. – డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),బారక్‌పుర్, పశ్చిమ బెంగాల్. -
వాళ్లకి సన్న బియ్యం.. దళితులకు కోటా బియ్యం.. పవన్ ఎంత మోసం చేశాడు...!
-
ఉడకబెట్టిన కూరలు : మెరిసే చర్మం, బోలెడన్ని పోషకాలు !
ఉడకబెట్టిన కూరగాయలు బరువు తగ్గాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడ తాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అంతేకాదు అబ్బా, బోర్! ఏం తింటాంలే, రుచీ పచీ లేకుండా అని అస్సలు అనుకోకూడదు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు, అపారమైన ప్రయోజనాలనుతెలుసుకుంటే ఆశ్చర్య పోతారు.అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనాలు, కూరగాయలను ఉడకబెట్టడం వల్ల వాటి పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. మెత్తగా ఉడికి, తినడానికి సులువుగా ఉండటంతోపాటు, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఉడకబెట్టిన కూరగాయల వల్ల లాభాలుపచ్చివి తినడం కంటే ఉడకబెట్టినవి తింటే వాటిపైన ఉండే హానికరమైన సూక్ష్మక్రిములు నశిస్తాయి. తేలిగ్గా జీర్ణమవుతాయి.అసిడిటీ సమస్యకూడా ఉండదు. హెలికోబాక్టర్ పైలోరీ వంటి బాక్టీరియాతో సహా అనేక కారణాల వల్ల కడుపు మంట సంభవించవచ్చు. అందువలన ఉడకబెట్టి తింటే కడుపు మంటను నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్టు ఎక్కువగా అందుతాయి.ఉడక బెట్టడంలోపోషకాలు పెరుగుతాయి. ఉదా. క్యారెట్లను ఉడకబెట్టడం వల్ల చర్మ ఆరోగ్యానికి గొప్పగా ఉండే బీటా కెరోటిన్‌ను సంరక్షిస్తుంది.దీంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడకబెట్టిన ఆహారం చాలా ఆక్సలేట్లను తొలగించి మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది మంచి చిట్కా.మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్త పోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. వీటన్నింటికీ మించి మేనిఛాయ మెరుగు పడుతుంది. బుజ్జాయిలకు మంచిదిఉడికించిన కూరగాయలు ఘనమైన ఆహారాన్ని తినడం ప్రారంభించే శిశువులకు గొప్ప ఎంపిక. చక్కటి పోషకాలు అందుతాయి. పిల్లలు జీర్ణం చేసుకోవడం సులభం. అంతేకాకుండా, రెడీమేడ్ బేబీ ఫుడ్స్‌తో పోలిస్తే ధర తక్కువ, పోషకాలు ఎక్కువ. ఏ యే కూరగాయలు తినవచ్చుమన రుచికి నచ్చే ఏ కూరనైనా తినవచ్చు. ఉడక బెట్టుకుని తినే కూరగాయల్లో అన్నీ ఒకే రకమైనవి కాకుండా, నీరు ఎక్కువగా ఉండే, బీరకాయ, సొరకాయ, ఉల్లి కాడలు లాంటివి కూడా చేర్చుకోవాలి. బీట్ రూట్, క్యారట్, ముల్లంగి, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ లాంటివి ఆవిరి మీద ఉడక బెట్టుకొని తినవచ్చు. ఇంకా చిలగడదుంప, బ్రకోలీతోపాటు వివిధ ఆకుకూరలను చేర్చుకోవచ్చు. రుచికి కావాలనుకుంటే సన్నగా తరిగిన కొత్తిమీదర పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, కొద్దిగా నిమ్మరసం కలుపు కోవచ్చు. బరువు తగ్గాలను కునేవారు దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ, దోసలు లాంటి స్థానంలో వీటిరి తింటే మంచి ఫలితం ఉంటుంది. -
వర్షాకాలంలో ఈ కూరగాయలు తీసుకోకపోవడమే మేలు..!
సీజన్ మారేకొద్దీ మనం డైట్ కూడా మార్చాలి. ఆ సీజన్ లో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం, కొన్నింటిని తీసుకోక΄ోవడం వంటివి చేయాలి. దీంతో ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది వర్షాకాలం. ఈ సీజన్లో కొన్ని పుడ్స్ తీసుకోకac΄ోవడమే మంచిది. అవేంటో తెలుసుకుందాం. ఫ్రూట్ సలాడ్.మార్కెట్లో చాలా మంది ఫ్రూట్స్‌ని కట్ చేసి ఇస్తారు. వీటిని తీసుకోవడం తగ్గించాలి. వారు ఎలా నిల్వ చేస్తున్నారో తెలియదు. ఇందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. నిల్వ ఉన్న ఆహారంకొన్నిసార్లు మన ఇంట్లో ఆహారం మిగిలి΄ోతుంది. దీనిని ఎక్కువ సమయం స్టోర్ చేసి తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ టైమ్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫుడ్పాయిజన్లా మారే అవకాశం ఉంది. అందుకనే ఈ ఫుడ్‌ని తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. వేపుళ్లు, జంక్ ఫుడ్చల్లని వాతావరణంలో చాలా మంది సమోసా, పకోడి వంటి ఫ్రై ఐటెమ్స్ ఎక్కువగా తింటారు. అయితే, వీటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా తక్కువగా తినాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. బయట చేసే ఈ ఫుడ్స్‌లో ఏ నూనె కలుస్తుందో తెలియదు కాబట్టి అలాంటి వాటి జోలికిపోకుండా ఉండటం చాలా ఉత్తమం. సీఫుడ్..చేపలు, ఇతర సీ ఫుడ్‌ని ఈ టైమ్‌లో తీసుకోవడం తగ్గించడం, లేదా పూర్తిగా మానడం మంచిది. ఎందుకంటే వర్షం నీటిలో ఉన్న ఈ సీ ఫుడ్స్ తీసుకుంటే డయేరియా, వాంతులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆకుకూరలు..ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఆకుకూర, క్యాబేజీ వంటి వాటి వాడకాన్ని వర్షాకాలంలో తగ్గిస్తే మంచిది. ఇందులో బ్యాక్టీరియా, ΄ారాసైట్స్ పెరగడమే ఇందుకు కారణం. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే చక్కగా కడిగి ఉడికించి వండితే రిస్క్ తగ్గుతుంది.స్పౌట్స్..మొలకల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. కానీ, వీటిలో ఈ సమయంలో బ్యాక్టీరియా, ఫంగస్ ఉండే అవకాశం ఉంది. వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని తినాలనుకుంటే చక్కగా క్లీన్ చేసి డెయిరీ ప్రొడక్ట్స్: అయిన పాలు, చీజ్, పనీర్ కూడా ఈ టైమ్‌లో తక్కువగా తీసుకోవాలి. దీనికి కారణం వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని తీసుకున్ననప్పుడు కూడా సరిగ్గా పాశ్చరైజ్డ్ అయ్యాయా, ఎక్స్పైర్ డేట్ ఎప్పటివరకూ ఉందనేది తెలుసుకుని తీసుకోవాలి. లేదంటే వీటి బదులు పెరుగు, పాలని తీసుకోవచ్చు. (చదవండి: బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!) -
టమాటా ధరలు ఢమాల్
-
ఆకుపచ్చ కూరగాయలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ..!
ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారాల్లో కీలకమైనవి. ముఖ్యంగా ఆకుకూరలు, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయాలు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను ఉంటాయి. ఈ కూరగాయలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ వీటిని వండేటప్పుడు వాటి రంగు విషయమే సమస్య ఉంటుంది. అదేంటంటే..వండేటప్పుడు వాటి శక్తివంతమైన ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఇది రెసిపీని తక్కువ ఆకర్షణీయంగా ఉండేలా చేస్తుంది. అయితే సరైన వంటపద్ధతులతో ఆకుకూరలు రంగును కోల్పోకుండా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఆకుపచ్చ కూరగాయలలో రంగు మార్పుకి కారణం..బచ్చలికూర, బ్రోకలీ వంటి కూరగాయలలో శక్తివంతమైన ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ నుంచి వస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు కీలకమైన వర్ణద్రవ్యం. క్లోరోఫిల్ అణువులు ఉష్ణోగ్రత, పీహెచ్ మార్పులకు సున్నితంగా ఉంటాయి. అందువల్లే కూరగాయలు వండినప్పుడు రంగు క్షీణతకు దారితీస్తుందని చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ ఆకుపచ్చ కూరగాయాలు ఉష్ణోగ్రతకు గురవ్వుతాయో అప్పుడు దానిలోని క్లోరోఫిల్ అణువు, మెగ్నీషియం అయాన్‌ను కోల్పోయి, ఫియోఫైటిన్గా మారుతుంది. ఫలితంగా మనకు వండిన తర్వాత ఆకుపచ్చ కూరగాయాలు మందమైన ఆలివ్ ఆకుపచ్చ రంగును పోలి ఉంటాయి. అలాగే ఆమ్ల వాతావరణంలో కూడా మరింత వేగవంతంగా రంగును కోల్పోతాయి. రంగు మారకుండా నిరోధించే పద్ధతులు..బ్లాంచింగ్: కూరగాయలు ఆకుపచ్చ రంగును కాపాడుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి బ్లాంచింగ్. ఈ పద్ధతిలో కూరగాయాలను ఉప్పునీటిలో కొద్దిసేపు ఉడకబెట్టడం జరుగుతంది. ఇక్కడ కేవలం క్లోరోఫిల్ క్షీణతను ప్రేరేపించి, మృదువుగా చేసేలా తగినంతగా ఉడికించాలి. ఈ మొత్తం ప్రక్రియకి రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధి పడుతుంది. ఆ తర్వాత షాకింగ్షాకింగ్: బ్లాంచింగ్ చేసిన వెంటనే, కూరగాయలను ఐస్-వాటర్ బాత్కు బదిలీ చేయాలి.. షాకింగ్‌గా పిలిచే ఈ ప్రక్రియలో వంట ప్రక్రియను నిలిపివేసి, శక్తిమంతమైన రంగును లాక్ చేయడంలో సహాయపడుతుంది. ఆకస్మిక ఉష్ణోగ్రత తగ్గుదల కూరగాయలను ఉడికించడం కొనసాగించకుండా వేడిని నిలిపివేస్తుంది. అలాగే వాటి ఆకృతిని, రంగును సంరక్షిస్తుంది.ఆల్కలీన్ నీటితో..వంట నీటిలో కొద్ది మొత్తంలో బేకింగ్ సోడా (ఆల్కలీన్ పదార్ధం) కలపడం వల్ల కూరగాయలు ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవచ్చు. ఆల్కలీన్ వాతావరణం క్లోరోఫిల్‌ను ఫియోఫైటిన్గా మార్చకుండా నిరోధిస్తుంది, తద్వారా ఆకుపచ్చ రంగును కోల్పోకుండా సంరక్షించొచ్చు. ఐతే ఈ పద్ధతిని బహు జాగ్రత్తగా ఉపయోగించాలి.వంట సమయాన్ని తగ్గించడంఆకుపచ్చ కూరగాయలలో రంగు కోల్పోవడానికి ప్రధాన కారణాలలో అతిగా ఉడికించడం ఒకటి. దీనిని నివారించడానికి అవసమైనంత వరకు ఉడికించాలి. అందుకోసం స్టీమింగ్ ప్రక్రియ అద్భుతమైన పద్ధతి. ఈ పద్ధతిలో కూరగాయలు వాటి రంగు, పోషకాలను కోల్పోవు. తక్కువ వ్యవధిలో కూరగాయలను అధిక వేడికి బహిర్గతం చేసి, రంగు, ఆకృతిని కోల్పోకుండా సంరక్షిస్తుంది.ఉప్పునీరు ఉపయోగించడంకూరగాయలను ఉడకబెట్టేటప్పుడు, నీటిలో ఉప్పు కలపడం వల్ల వాటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఉప్పు నీటి మరిగే బిందువును పెంచుతుంది మరియు రంగు మార్పులకు కారణమయ్యే ఆమ్లత్వానికి వ్యతిరేకంగా కొంచెం బఫర్‌ను సృష్టిస్తుంది. ఇది కూరగాయల రుచిని కూడా పెంచుతుంది.వంటల్లో ఆమ్ల పదార్థాలను నివారించడంనిమ్మరసం, వెనిగర్ లేదా టొమాటోలు వంటి పదార్థాల కారణంగా వాటి ఆమ్ల స్వభావం రీత్యా ఆకుపచ్చ కూరగాయల రంగును కోల్పోతాయి. అలాంటప్పుడు వీటిని కూర చివరిలో జోడించడం మంచిది. అలాగే ఆకుపచ్చ కూరగాయలను ఉడకబెట్టేటప్పుడు కుండను మూత పెట్టకుండా వదిలివేయడం వల్ల అస్థిర ఆమ్లాలకు గురవ్వవు.త్వరిత వంట పద్ధతులుమైక్రోవేవ్ లేదా స్టైర్-ఫ్రైయింగ్ వండితే.. తక్కువ నీరు, తక్కువ టైంలోనే అయిపోతాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయల రంగును సంరక్షించడానికి అద్భుతమైనవి. ఈ పద్ధతుల్లో పరిమితంగా వేడి నీటికి గురి అయ్యేలా చేసి రంగు కోల్పోకుండా చేయొచ్చు.(చదవండి: వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..) -
వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!
వర్షాకాలం వ్యాధుల కాలంగా చెప్పొచ్చు. అదీగాక ఈ కాలంలో వాతారవరణం అంతా చల్లబడిపోవడంతో చాలామందికి జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. దీనికి తోడు వాతావరణంలో పెరిగిన తేమ కారణంగా రోగనిరోధక వ్యవస్థ అనారోగ్య బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో ఇలాంటి కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. జీర్ణక్రియకు మద్దతు ఇచ్చేలా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ కూరగాయలని మీ డైట్లో జోడించాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే..ఈ మాన్సూన్ డైట్లో చేర్చుకోగల కూరగాయల జాబితాన ఏంటంటే..వర్షాకాలంలో ప్రయోజనకరంగా ఉండే కూరగాయలు ఏవంటే..కాకరకాయదీనిలోని చేదు లక్షణం రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.ఆనపకాయకడుపులో తేలికగా ఉంటుంది . సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.పొట్లకాయఇది మంచి డైటరీ ఫైబర్. అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. పొట్లకాయలోని పీచు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది.బచ్చలికూరబచ్చలికూరలో అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. అంతేగాక తేమతో కూడిన వాతావరణం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.మెంతి ఆకులుమెంతి ఆకులు (మేతి) యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. మెంతి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటాంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన మంచి ఆకుకూర కూడా. మునగకాయలుమునగకాయలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శ్వాసకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుల బారినపడకుండా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.క్యారెట్లుక్యారెట్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి దృష్టిని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు అంటువ్యాధుల నుంచి రక్షించడానికి, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి. బీట్రూట్బీట్రూట్లోని అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి. వర్షాకాలంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి మెరుగైన రక్త ప్రసరణకు ప్రయోజనకరంగా ఉంటుంది.గుమ్మడికాయగుమ్మడికాయలో విటమిన్ ఏ, సీ, ఈ తోపాటు ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడికాయలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అయితే దాని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలు చెక్‌పెట్టడంలో కీలకంగా ఉంటుంది.బెండకాయ దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫోలేట్, ఫైబర్ల మూలం. బెండకాయలో అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రబలంగా ఉండే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.(చదవండి: బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
సెంచరీ కొట్టిన టమాటా..
-
ఫ్రిజ్ వాసన రాకుండా, కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా చేయండి!
రిఫ్రిజరేటర్ లేదా ఫ్రిజ్ ఇపుడు అందరి ఇళ్లల్లోనూ ఒక అవసరంగా మారిపోయింది. పాలు, పెరుగు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లతోపాటు వండిన పదార్థాలను పాడుకాకుండా, తాజాగా ఉంచేందుకు ఫ్రిజ్‌ను వాడతాం. మరి ఫ్రిజ్ శుభ్రత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఫ్రిజ్‌లో బాక్టీరియా పేరుకుపోకుండా, మన ఆహారం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకుందాం.వారాలు, నెలల తరబడి ఫ్రిజ్‌ను శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. ఆహారం త్వరగా పాడవుతుంది. అలాగే రిఫ్రిజిరేటర్ బయటినుంచి కూడా క్లీన్‌గా కనిపించేలా జాగ్రత్తపడాలి.రిఫ్రిజిరేటర్‌ను ఎలా శుభ్రం చేయాలి?ముందు రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేసి, ప్లగ్ తీసి పక్కన బెట్టాలి. ఇలా చేయడం వల్ల షాక్ కొట్టకుండా ఉంటుంది.కఠినమైన రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, డిష్ సోప్‌తో శుభ్రం చేసుకోవచ్చు.ఫ్రిజ్ షెల్ఫ్‌లు, ఇతర డిటాచ్బుల్ డ్రాయర్లను, గ్లాసు ట్రే, ఎగ్ ట్రేలను తొలగించి బయట శుభ్రం చేసుకొని పొడి గుట్టతో తుడిచేయాలి. ఫ్రిజ్‌లో అమర్చేముందు వీటిపై ఆల్కహాల్ రుద్దితే కనిపించని బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోతుంది.అవసరమైతేనే డీప్ ఫ్రిజ్‌ను డి-ఫ్రాస్ట్ చేయాలి. లేదంటే ఆ ఏరియా వరకు క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన, డేట్ ముగిసిన పదార్థాలను పారేయ్యాలి. ఫ్రిజ్ డోర్‌కి ఉండే గాస్కెట్ సందుల్లో మురికి పేరుకుపోతుంది. దీన్ని కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. బయట కూడా డిష్ వాష్ లిక్విడ్‌లో ముంచిన స్పాంజి సాయంతో మురికి, మరకలు పోయేలా శుభ్రం చేసి, ఆ తరువాత మెత్తని పొడిగుట్టతోతుడిస్తే తళ తళ కొత్తదానిలా మెరుస్తుంది. ఫ్రిజ్‌లోని వస్తువులు ముట్టుకుంటే పడిపోయేలాగా కాకుండా, చిన్న చిన్న కంటైనర్లలో పళ్లు, కూరలు, తదితరాలను పొందికగా అమర్చుకోవాలి. -
తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!
కొన్ని కూరగాయలను కచ్చితంగా ఉడకించే తినడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. చాలా వరకు క్యారెట్, టమటా వంటివి పచ్చిగా తినేస్తాం. అయితే ఆ విధమైన కూరగాయలను ఉడికించి తింటేనే మనకు మంచి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. పైగా మన శరీరం కూడా సులభంగా పోషకాలను గ్రహిస్తుంది. తినే ముందు ఉడకబెట్టడం వల్ల ప్రయోజనం పొందగలిగే కూరగాయ లేవంటే..క్యారెట్లుఉడకబెట్టిన క్యారెట్లు సెల్ గోడలను విచ్ఛిన్నం చేస్తాయి. బీటా-కెరోటిన్ జీవ లభ్యతను పెంచి శరీరానికి కావాల్సిన విటమిన్ 'ఏ'ని అందిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.బచ్చలికూరబచ్చలికూర ఉడకబెట్టడం వల్ల ఆక్సాలిక్ ఆమ్లం తగ్గుతుంది. ఈ ఆక్సాటిక్ ఆమ్లం కాల్షియం, ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల ఉడికిస్తే..మరిన్ని మినరల్స్ శరీరానికి అందుతాయి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహించి, రక్తహీనతను నివారిస్తుంది.బ్రోకలీబ్రోకలీని ఉడకబెట్టినప్పుడు దానిలోని కొన్ని పదార్ధాల గాఢతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సీ, కెలు అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ, చర్మ ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.టోమాటోలు..టొమాటోలను ఉడకబెట్టడం వల్ల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ లభ్యత పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. పైగా దీనిలో శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.బీట్రూట్లుఉడకబెట్టిన దుంపలు నైట్రేట్లను సంరక్షిస్తాయి, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి , రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హృదయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వ్యాయామ పనితీరును మెరుగుపరిచి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.చిలగడదుంపలుతీపి బంగాళాదుంపలను ఉడకబెట్టినప్పుడు, బీటా కెరోటిన్ వంటి అధిక స్థాయిలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఉడికించిన చిలగడదుంపలను తీసుకోవడం వల్ల దృష్టి, రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.గ్రీన్ బీన్స్ఉడకబెట్టిన పచ్చి బఠానీలు వాటిలోని ఫైబర్‌ను జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. అంతేగాక దీనిలో విటమిన్లు ఏ, సీ, కే వంటి విటమిన్లు ఉడకబెట్టినా.. నిలుపుకుంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.ఆస్పరాగస్ఉడకబెట్టిన ఆస్పరాగస్ని తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు జీవ లభ్యతను పెంచి, ఆక్సాలిక్ యాసిడ్ వంటి యాంటీ-న్యూట్రియంట్స్ కంటెంట్‌ను తగ్గిస్తుంది. ఉడకబెట్టిన ఆకుకూర, తోటకూరలో విటమిన్ ఏ, సీ, ఇ, కే అధికంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక పనితీరుకు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.బ్రస్సెల్స్ మొలకలుఉడకబెట్టడం వల్ల చేదు తగ్గుతుంది. బ్రస్సెల్స్ మొలకలలో గ్లూకోసినోలేట్లు (క్యాన్సర్ నివారణలో ప్రయోజనకరంగా ఉంటాయి) మరింత జీవ లభ్యతను కలిగిస్తాయి. ఇందులో విటమిన్లు సీ, కే, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక పనితీరుకు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.బంగాళదుంపలుఉడకబెట్టడం వల్ల బంగాళాదుంపల్లోని గ్లైసెమిక్ సూచిక తగ్గుతుంది. ఉడికించిన బంగాళదుంపల్లో విటమిన్ సీ, బీ 6 వంటి విటమిన్ల ఉంటాయి. అవి శక్తిని అందిస్తాయి, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.ఈ ఉడికించిన ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పోషకాల శోషణను మెరుగుపరచడం తోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు. అయితే అతిగా ఉడకబెట్టడం వల్ల పోషకాల నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి ఓ మోతాదు వరకు ఉడకబెట్టి తీసుకుంటే మంచిది. -
తాజా వర్సెస్ ఫ్రోజెన్ కూరగాయాలు ఏది ఆరోగ్యానికి మంచిది..?
ఘనీభవించి కూరగాయలు కంటే ఫ్రెష్‌గా ఉన్న కూరగాయలే బెటర్ అనేది చాలామంది భావన. అప్పటికప్పుడు దొరికిన వాటిల్లోనే మంచి పోషకాలు ఉన్నాయనుకుంటాం. కానీ ఇది కరెక్ట్ కాదని చెబుతున్నారు నిపుణులు. ఘనీభవించిన ఫ్రోజెన్ కూరగాయల్లోనే ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటీ తాజా కూరగాయాల కంటే ఫ్రోజెన్ కూరగాయలే మంచివా? అదెలా అనుకుంటున్నారా..?. కానీ నిపుణులు మాత్రం శీతలీకరణం చేసిన కూరగాయల్లో పోషకాల నష్టం జరిగేందుకు ఆస్కారం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా సవివరంగా వెల్లడించారు.నిపుణులు అభిప్రాయం ప్రకారం..స్టోర్‌లో శీతలీకరణం చేసిన బఠానీలు, బ్రోకలీ, బీన్స్, క్యారెట్లు,మొక్కజొన్నలు కూరగాయలు మనం తాజాగా అమ్మకందారుడి నుంచి కొన్నంత ఆరోగ్యకరమైనవని, వాటిలో విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. పరిశోధన ప్రకారం దాదాపు పదిమందిలో ఒక్కశాతం మంది మాత్రమే తగినంత పండ్లు కూరగాయలను తింటున్నారట. కాబట్టి చాలామంది పోషకాహార నిపుణులు ఏ రూపంలోనైనా ఎక్కువ ఉత్పత్తులను తినాలని సిఫార్సు చేస్తున్నారు. ముందుగా కత్తిరించిన కూరగాయల్లో ఎక్కువ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటాయి. తాజా వాటికంటే తక్కువ ధరను కలిగి ఉంటాయి. తాజా కూరగాయాలు చాలా దూరం ప్రయాణించి ఆయ ప్రాంతాలకు రవాణ అవ్వుతాయి. అందువల్ల తేలికగా వాడిపోవటం, ముఖ్యమైన పోషకాలు కోల్పోవటం జరుగుతుంది. అదే ఘనీభవించిన కూరగాయాలు అయితే పండించిన గంటల్లోనే ఫ్రీజర్లకు పంపబడతాయి. ఫ్రోజెన్ కూరగాయలు ఎలా ఆరోగ్యకరం అంటే.వీటిలో ఫైబర్, పొటాషియం,విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరాన్ని గుండె జబ్బులు, కేన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అలాగే వీటిని తాజాదనం కోల్పోకమునుపే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులుఘనీభవంచిన కూరగాయలు గరిష్ట పరిపక్వత వద్ద పండించడం, శుభ్రం చేయడం పోషక నాణ్యత కోల్పోకుండా చేస్తారు. ఈ క్రమంలో కూరగాయలపై ఉండే బ్యాక్టీరియా నాశనం అవువుతుంది. ముఖ్యంగా ఈప్రాసెస్‌లో పోషకాలను రాజీ చెయ్యదు. ఘనీభవించిన కూరగాయల్లో విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో రంగులు, స్వీటెనర్లు కారణంగా ఆరోగ్యానకి మంచిదికాదు. అయితే అది కూరగాయాల విషయంలో కాదని చెబుతున్నారు. అలాగే ఈ క్రమంలో ఫైబర్ కోల్పోతున్నాయా..? కాయగూరలు అనే విషయం గమనించి మరీ ఘనీభవించేలా స్టోర్ చెయ్యాలి. అంతేగాదు రిఫ్రిజిరేటర్లో కూరగాయాలను ఎలా నిల్వ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యం.సరైన ఉష్ణోగ్రతల వద్ద కూలింగ్‌లో కూరగాయలు నిల్వ ఉంటున్నాయో లేదో కూడా గమనించాలి. ముఖ్యంగా ఘనీభవించిన కూరగాయలని స్థిరమైన సున్నా డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నిల్వ చేయాలనుకుంటే సుమారు 18 నుంచి 12 నెలల పాటు చెడిపోకుండా ఫ్రిజర్‌లో ఉత్తమంగా ఉండేలా చూడండి.(చదవండి: మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!) -
రెయిన్బో డైట్: రంగురంగుల ఆహారాలతో ఆరోగ్యం పదిలం..!
మనం తినే ఆహారంలో వివిధ రకాల పోషకాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అందుకే పోషకాహార నిపుణులు మనం తినే ఆహారంలో అన్ని రంగుల్లోని పండ్లు, కూరగాయలు ఉండాలంటున్నారు. ముఖ్యంగా రెయిన్బో(ఇంద్ర ధనుస్సు) డైట్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఏంటీది అనేకదా..!. ఏం లేదండీ ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లో ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకుంటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడమే గాక చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందని చెబుతున్నారు. ఈ డైట్ వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని అంటున్నారు. అలాంటి ఈ రెయిన్బో డైట్లో రంగుల వారీగా ఉండే కూరగాయాలు, పండ్లు వర్గీకరణ, వాటి ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయని మనకు తెలుసు. అలాగే రెయిన్బో డైట్ అంటే ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ, నారింజ వంటి వివిధ రంగుల్లో పండ్లు, కూరగాయలను కలిగి ఉంటుంది. అందులోని ప్రతి రంగుతో కూడిన కూరగాయాలు, పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో చూద్దామా..!రెడ్ ఫుడ్స్: ఇవి లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రంగు కూరగాయలు, పండ్లు ప్రోస్టేట్, మూత్ర నాళం, డీఎన్ఏ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. అందువల్ల ఎరుపు రంగులో ఉండే యాపిల్స్, చెర్రీస్, నారింజ, బెర్రీలు, పుచ్చకాయలు, ఎర్ర ద్రాక్ష, బీట్రూట్లు, టమోటాలు మొదలైనవి తప్పక తినమని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్ ఫుడ్స్: క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి జీర్ణక్రియకు తోడ్పడతాయి. అలాగే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలు కంటి, ఊపిరితిత్తులు, కాలేయం, కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. త్వరగా గాయాలు నయం అవ్వడంలో, చిగుళ్ల ఆరోగ్యంలో సహయపడతాయి. ఆకుపచ్చ రంగులో ఉండే అవోకాడో, ద్రాక్ష, కివి, బేరి, బ్రోకలీ, దోసకాయ, ఆస్పరాగస్, క్యాబేజీ, బీన్స్, మొదలైనవి తీసుకోవాలి.వైట్ ఫుడ్స్: దీనిలో అల్లిసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మద్దతునిస్తాయి. అలాగే గుండె జబ్బులు, కేన్సర్‌తో పోరాడుతాయి. అందుకోసం అరటిపండ్లు, వెల్లుల్లి, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, అల్లం, ముల్లంగి మొదలైనవి తినండి.పసుపు ఆహారాలు: వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మ సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసం నిమ్మకాయలు, పైనాపిల్, అత్తి పండ్లను, మొక్కజొన్న, పసుపు మిరియాలు, పసుపు టమోటాలు, మామిడి, బంగారు కివి మొదలైనవి. ఈ ఆహారాలు కళ్ళకు, రోగనిరోధక వ్యవస్థకు మంచివిపర్పుల్ ఫుడ్స్: వీటిలో ఆంథోసైనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కడుపులోని మంటను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గుండెకు, మెదడుకు, ఎముకలకు, ధమనులకు, జ్ఞానానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు కేన్సర్‌తో పోరాడటమే గాకుండా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కూడా తోడ్పడతాయి. అందుకోసం ప్లం, ప్రూనే, బ్లాక్‌బెర్రీ, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, వంకాయ, ఊదా క్యాబేజీ, బ్లూబెర్రీస్, పర్పుల్ ద్రాక్ష మొదలైనవి.ఆరెంజ్ ఫుడ్స్: వీటిలో ఉండే బీటా-కెరోటిన్‌తో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. నరాలు, కండరాల ఆరోగ్యానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి చాలా అవసరం. దీని కోసం నారింజ, గుమ్మడికాయ, బొప్పాయి, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి తీసుకోవాలి.ఎల్లప్పుడూ వివిధ రంగుల కూరగాయలు, పండ్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, అభిజ్ఞా పనితీరును పెంచుతాయి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. పాటించేమందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం మంచిది. -
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
-
మండుతున్న కూరగాయల ధరలు..
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్.. ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. సాగు నీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు రూ.20 నుంచి రూ.40 వరకు లభించేవి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలో రూ.60–80 పలుకుతున్నాయి.గ్రేటర్‌కు కష్టాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏడా దికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా. నగర పరిసర ప్రాంతాలైన వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తున్నాయి. స్థానికంగా సుమారు 19 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25 మెట్రిక్ టన్నులు వరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆపై అవసరాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. తదితర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా చార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిపి మోపెడు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా నెల రోజుల క్రితం టమోటా కిలో రూ.15 ఉంటే ప్రస్తుతం రూ.40కి చేరింది. గతంలో పచి్చమిర్చి కిలో రూ.60 ఉండగా ఇప్పుడు రూ.120కి పెరిగింది.పావు కిలో రూ. 20కి అమ్ముతున్నారు..వారపు సంతలో కూరగాయలు ఏవి అడిగినా పావుకిలో రూ.15 నుంచి రూ.20 చెబుతున్నారు. నెల క్రితం వరకు కిలో టమాటా రూ.15 ఉండేది ప్రస్తుతం కిలో రూ.40కి అమ్ముతున్నారు. పచి్చమిర్చి పావు కిలో రూ.20కి దొరికేది. ప్రస్తుతం రూ.40కి అమ్ముతున్నారు. ఇలా అన్ని ధరలు పెరగడంతో తక్కువ కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. – అనిత, ఎల్.బి.నగర్.ధర ఉన్నా ఫలితం లేదు.. ఎకరన్నరలో కూరగాయలు సాగు చేస్తున్నా. వేసవి ఎండలకు బోర్లలో నీరు అడుగంటింది. సమయానికి నీటి తడులు అందక దిగుబడి తగ్గింది. మార్కెట్లో కూరగాయలకు మంచి ధర ఉన్నా దిగుబడులు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చేతి నిండా పంట ఉన్నపుడు ధర ఉండదు. – రైతు, చించల్పేట్, నవాబుపేట్ మండలంరొటేషన్ అయితే చాలు.. ఆంధ్రప్రదేశ్ నుంచి కూరగాయలు తెస్తున్నాం. రవాణా చార్జీలు, హమాలీ, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి తక్కువ లాభంతో అ మ్ముతున్నాం. ఒక్కోసారి వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పెట్టిన పెట్టుబడి డబ్బులు రొటేషన్ అయితే చాలు అనిపించిన రోజులు ఉంటాయి. మా దగ్గర కిలో రూ.20కి కొనుగోలు చేసి వారపు సంతలో కిలో రూ.40 వరకు అమ్ముతున్నారు. – జంగారెడ్డి, హోల్‌సేల్ వ్యాపారి, దిల్సుఖ్నగర్ప్రస్తుతం కూరగాయల ధరలు ఇలా.. కిలో ధర (రూ.లో) టమాటా 40 ఉల్లి 38 మునగకాడలు 40 క్యారెట్ 50 వంగ 45 బెండ 52 పచి్చమిర్చి 120 -
వంట చేయాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వేడిగాలులు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయలు, పప్పుల ధరలపైన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు, టమాటా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత అస్థిరంగా ఉంటుంది. వేడిగాలులు, భారీ వర్షాలు, పంట నష్టం మొదలైన పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 11 నెలల కనిష్ట స్థాయి అంటే 4.8 శాతానికి పడిపోయింది. వెల్లుల్లి, అల్లం ద్రవ్యోల్బణం మార్చి , ఏప్రిల్‌లలో మూడు అంకెలలో ఉంది.పప్పులు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా తగినంతగా లేదు. ప్రతికూల వాతావరణం కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడిగాలు ఇదే రీతిన కొనసాగితే ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన అధిక ధరలను అరికట్టడానికి కూరగాయలు, పప్పుల దిగుమతులను సరళీకరించాలని వారు సూచిస్తున్నారు. -
ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!
బెంగళూరు కూరగాయల మార్కెట్లోని ఒక ఫొటో ట్రెండ్‌గా మారింది. చాలా షాప్‌లలో ఆ ఫొటోను గోడలకు వేలాడదీస్తున్నారు. లెక్క ప్రకారం అయితే షాప్‌లలో అభిమాన తారల పోస్టర్లు కనిపిస్తాయి. బెంగళూరు కూరగాయల మార్కెట్లోని టొమాటో స్టాల్లో వేలాడదీసిన పెద్ద ఫొటోలో ఒక మహిళ గుడ్లురుముతూ కోపంగా చూస్తుంటుంది. ఏ కారణం వల్ల ఇట్టి టెర్రిఫిక్ ఫొటోను వేలాడదీశారు అనే గండికోట రహస్యం గురించి తెలియకపోయినా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఊహించుకున్నవారికి ఊహించుకున్నంత మహదేవా’ అన్నట్లుగా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఈ ఫొటోకు భాష్యం చెబుతున్నారు. ‘బేరం అడుతున్నావా! అదేం కుదరదు. చచ్చినట్లు కొనాల్సిందే... అని కస్టమర్‌ని బెదిరిస్తున్నట్లుగా ఉంది’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. I am so glad I stepped out today pic.twitter.com/nJx6PZUuUV— Niharika 🌌 (@Niharika__rao) May 10, 2024 (చదవండి: కరెంట్‌తో పనిలేకుండానే వాటర్‌ని కూల్ చేసుకునే సిపుల్ టెక్నిక్!) -
మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?
బిజీ లైఫ్‌లో ఏ రోజు కారోజు తాజాగా ఉండే కూరగాయాలు తెచ్చుకోవడం అందరికీ కుదరదు. అందులోనూ కొన్ని కాయగూరలు తొందరగా మెత్తగా లేదా మొలకెత్తడం, కలర్ మారిపోవడం జరుగుతుంది. అన్ని డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసొప్పక ఏదో రకంగా వండేస్తాం. కొందరైతే పాడైన భాగాన్ని తొలగించి మిగతా భాగం నుంచి వండేస్తారు.ఇలా చెయ్యొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా..? కొన్ని కూరగాయాలు కొద్ది రోజులే నిల్వ ఉంటాయి. మరికొన్ని పాడైపోయినా ఆ విషయం తెలియదు. మెత్తబడటం లేదా మొలకెత్తుతుంటాయి ఇంకొన్ని కూరగాయాలు. మనం పడేయబుద్ధికాక వండేస్తుంటాం. అయితే ఇలా ఉంటే కొన్ని రకాల కూరగాయాలు అస్సలు వాడకూడదట. అవేంటో సవివరంగా చూద్దామా..! బంగాళదుంపం: బంగాళ దుంపపై మొలకలు వస్తే కొందరూ వెంటనే పడేస్తారు. మరొకందరూ వాటిని తొలగించి వండేస్తారు. మరీ వాడొచ్చా అంటే..నిజానికి బంగాళదుంపలో సహజంగా సోలనిన్ , చకోనిన్ అనే రెండు రకాల టాక్సిన్లు ఉంటాయి. అయితే బంగాళదుంపపై మొలకలు వచ్చి, ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయ్యడం మంచిది. జస్ట్ అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపించనట్లయితే వినయోగించొచ్చు. కానీ మొలకలు, ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినయోగించొద్దిన నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఉల్లిపాయలు వద్దకు వస్తే బయటి తొక్కలు పొడిగా ఉంటాయి. కానీ లోపాల చాలా వాటికి నల్లటి రంగు ఉంటుంది. మనం వాటిన కడిగేసి వాడేస్తుంటా. అయితే ఇదేం అంత ప్రమాద కాదని చెబుతున్నారు నిపుణులు. మట్టిలో ఉండటం వల్ల వచ్చే కొద్దిపాటి ఫంగస్ అని, దీన్ని చక్కగా కడగడం లేదా ఆ భాగాన్ని తీసేయండి చాలు అని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి బయటపోరలు తీస్తుండగా మెత్తగా కుళ్లినట్టు ఉండి లోపల భాగం బాగుంటే అస్సలు వంటకు వినయోగించొద్దుని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆకుకూరలు వద్దకు వస్తే.. ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వడలిపోయి, కలర్ మారిపోతే వాడొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఆకులు పసుపురంగులో ఉంటే ఆయా ఆకులను తీసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఆకుకూర కాళ్లుభాగం లేదా, ఆకులు కుళ్లినట్లు ఉంటే అస్సలు వినయోగించొద్దని చెబతున్నారు. మొత్తని టొమాటాలు.. దెబ్బతగిలిన టొమాటాలు, కొన్ని లేత మచ్చలు ఉన్నా..ఆ ప్రాంతం వరకు కట్ చేసి తీసేసి వాడుకోవచ్చు. అదే టమాట బూజు పట్టి ఉండి మొత్తం మొత్తగా ఉంటే వెంటనే పారేయండి. కొన్ని టమాటాలు మెత్తగా అయిపోతాయి. అవి వాడుకోవచ్చని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. వెల్లుల్లి.. భారతీయ వంటశాలల్లో ప్రధానమైనది. ఇవి గోధుమ రంగులోకి మారిన, దానిపై గోధుమ కలర్ మచ్చలు ఉన్నా.. వెల్లుల్లి పాడైందని అర్థం. కొన్నింటికి ఆకుపచ్చగా మొలకలు వస్తాయి. అలాంటి వెల్లుల్లిలోని ఆకుపచ్చ భాగాన్ని తొలగించి హాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే..? వెల్లుల్లిలోని మొలకెత్తిన ఆకుపచ్చ భాగం చేదుగా ఉంటుంది. కూరల్లో వినయోగిస్తే టేస్ట్ మారుతుంది కాబట్టి వాటిని తొలగించాలి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ముడతలు పడినట్టు ఉండి జిగటగా ఉండి పాడైపోయినట్లు సంకేతం. అలాగే వాటిపై నల్ల మచ్చలు చెడిపోవటాన్ని సూచిస్తాయి. ఇలాంటివి వినియోగించకపోవటమే మేలు. దోసకాయలు.. దోసకాయ సాధారణంగా ఫ్రిజ్‌లో ఒక వారం పాటు తాజగా ఉంటుంది. దోసకాయ మెత్తబడితే అది పాడైపోయిందని అర్థం. మొత్తంగా కాకుండా కేవలం దోసకాయ చివరి భాగం మాత్రమే మెత్తగా ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్‌కు ముందు అనేక వింతలు, విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జలోర్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. జలోర్ సిరోహి సీటుపై పోటీకి దిగిన భర్త వైభవ్ గెహ్లాట్‌కు మద్దతుగా అతని భార్య, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమార్తె హిమాన్షి గెహ్లాట్ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాన్షి గెహ్లాట్ జలోర్‌లో కూరగాయలు అమ్ముతూ కనిపించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అతని కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు హిమాన్షి గెహ్లాట్ జలోర్-జైసల్మేర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భర్త వైభవ్ గెహ్లాట్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమె గతంలో సిడ్నీలో చదువును పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగుల కోసం స్వ్ఛంద సంస్థను నడుపుతున్నారు. వైభవ్, హిమాన్షి దంపతులకు కాశ్వని అనే కుమార్తె ఉంది. హిమాన్షి లాగే కాశ్వనికి కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమట. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి.ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి.తాజా కూరలు, పళ్లుకూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది.ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు.వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి.ఇతర జాగ్రత్తలుమరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
ఇవి తింటే! బీపీ, కొలెస్ట్రాల్, షుగర్‌కు చెక్! అందానికి అందం!
మనలో చాలా మందికి కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉండదు. అలాగే కూరగాయలు తినడం ఆరోగ్యకరమైన అలవాటు అని తెలిసినా, పెద్దగా పట్టించుకోరు. కార్బోహైడ్రేట్లు లేకుండా, పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కూరగాయలు-ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కూరగాయల్లో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి. విటమిన్-ఎ, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకు తాయి. ఇది బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ నియంత్రకు దోహదపడుతుంది. బీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరల్లాంటివన్నంటిని మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరల్ని వారానికి మూడు సార్లయినా తినడం ఉత్తమం. ఈమధ్య కాలంలో మైక్రో గ్రీన్స్ వాడకం బాగా పెరిగింది. బీర,సొర, దొండ, బెండ, లేత చిక్కుళ్లు, గుమ్మడి కాయ కూరను కూడా తినాలి. క్యాలీఫ్లవర్, బ్రకోలీ లాంటివి మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని, కాస్త ఎక్కువ పరిమాణంలోనైనా తినొచ్చు. ఇష్టమైన వాళ్లు కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది. కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ : ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవాలంటే కూరగాయలు ఉత్తమమైన ఆహారం. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు అధిక బీపీతో బాధపడేవారు పోషకాలులభించే కూరగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ పొటాషియం-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల అధిక సోడియం బాడీలోకి చేరుతుంది. ఈ నష్టాన్ని తగ్గించుకోవాలంటే బచ్చలికూర వంటి కూరగాయలు పొటాషియం, ఇతర పోషకాలు లభించే కూరగాలు తీసుకోవాలి. వీటిల్లోని ఫైబర్ కూడా గుండెకుచాలామంది. ఫైబర్: 2020-2025 ఆహార మార్గదర్శకాల ప్రకారం, 2,000 క్యాలరీల ఆహారంలో రోజుకు 28 గ్రాముల ఫైబర్ కూడ అందదు. అందుకే తృణధాన్యాలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. చిలగడదుంపలు , బఠానీల్లో ఆపిల్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కళ్ళు: రోజంతా కంప్యూటర్స్ ఫోన్ వైపు చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యంమీదప్రభావం పడు తుంది. కళ్ళను రక్షించు కోవాలనుకుంటే, ఎక్కువ కూరగాయలు తినడంతోపాటు మధ్య మధ్యలో స్క్రీన్ బ్రేక్‌లు తీసుకోవడం మంచింది. తులసి, క్యారెట్లు, మొక్కజొన్న, ఎర్ర మిరియాలు, బచ్చలికూర ,బ్రోకలీలో కంటినిరక్షించే కెరోటినాయిడ్లు దొరుకుతాయి. అలాగే లుటీన్ , జియాక్సంతిన్ అనేవి రెండు కెరోటినాయిడ్లు, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం: చర్మ తేమగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తినాలి. టొమాటోల్లోని లైకోపీన్ చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది అవకాడోలు ,నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయలు ఆకుకూరలు లాంటివి చర్మంలోని తేమను, మృదుత్వాన్ని కాపాడతాయి. బ్లడ్ షుగర్ కూరగాయలలో కేలరీలు తక్కువ, ఫైబర్ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థం ఎక్కువ గా ఉండే దుంప కూరలుమినహా మిగిలినవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందుకే సహజసిద్ధంగా పండించిన కూరగాలు కేన్సర్ నివారణలో పనికొస్తాయి. బ్రస్సెల్స్ మొలకలు , కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్టు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి , ఫైటోకెమికల్స్, అలాగే సల్ఫోరాఫేన్ (బ్రోకలీలో అత్యధికం)లో ఎక్కువగా ఉంటాయి. మెదడు మెదడును పదునుగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం సరైన మార్గం. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, మైండ్ డైట్లో కీలకం, అల్జీమర్స్ వ్యాధి, మతిభ్రమణం ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడతాయని పరిశోధకులు తేల్చారు. యాంటీఆక్సిడెంట్లు,ఫోలేట్ మీ మెదడుకు కీలకమైన పోషకాలు. -
పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు..కానీ బతుకుదెరువు కోసం ఆ వ్యక్తి..
ఉన్నత చదువులు చదివినా కొందరూ లైఫ్‌లో తొందరగా సెటిల్ అవ్వలేరు. మంచి ఉద్యోగం రాక నానాపాట్లు పడుతుంటారు. ఉన్నత చదువులు చదివినా అందుకు తగ్గ స్థాయిలో ఉద్యోగాల లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణాల వల్లే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు సరైన ఉద్యోగం లేక సతమతమవుతున్నారు. ఇక్కడొక పంజాబ్ వ్యక్తి కూడా అదేకోవకు చెందినవాడు. వివరాల్లోకెళ్తే..పంజాబ్‌కి చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన గత 11 ఏళ్లుగా పంజాబీ యూనివర్సిటీ న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పనిచేశారు. కానీ అక్కడ ఇచ్చే అరకొర జీతం అక్కరకు రాక నానాపాట్లు పడ్డాడు. పైగా వేతనం కూడా సకాలంలో రాకపోవడం వంటి సమస్యలతో విసుగు చెంది బతుకుదెరువు కోసం కూరగాయాలు అమ్మడం ప్రారంభించారు. ఆయన న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసిన వ్యక్తి. అంతేగాదు జర్నలిజం, పొలిటికల్ సైన్సు వంటి సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి. ఈ మేరకు సందీప్ సింగ్ మాట్లాడుతూ..సమాయానికి జీతం రాకపోవడం, ఒకవేళ వచ్చినా..ఆ అరకొర జీతంతో తాను తన కుటుంబం బతకడం కష్టంగా మారడంతో కూరగాయాలు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన తన కూరగాయాల బండిపై పీహెచ్డీ సబ్జీవాలా అనే బోర్డు పెట్టుకుని మరీ ఇంటి ఇంటికి తిరుగుతూ కూరగాయాలు అమ్ముతుంటాడు. అయితే తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒక పక్కన ఇలా కూరగాయాలు అమ్ముతూనే చదువు కొనసాగిస్తున్నాడు సందీప్ సింగ్. అంతేగాదు తాను తన ప్రొఫెసర్ వృత్తికి బ్రేక్ ఇచ్చినప్పటికీ ఎప్పటికీ తన ఈ ప్రోఫెసర్ వృత్తిని వదలనని ఇది తనకు ఇష్టమని చెబుతున్నాడు. పైగా డబ్బు ఆదా చేసి, ఎప్పటికైనా సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్‌ని స్టార్ట్ చేయాలన్నది తన కోరిక అని చెప్పాడు. ఈ ఉన్నత విద్యావంతుడి కోరక నెరవెరాలని ఆశిద్దాం. ఇలాంటి ఘటనలు మన దేశంలో ఉన్న నిరుద్యోగతకు అద్దం పడుతోంది కదా!. కొంగొత్త కోర్సులు వస్తున్నట్లే అంతే స్థాయిలో ఉద్యోగాలు ఉంటే ఇలా సందీప్ లాంటి వాళ్లకు కూరగాయాలమ్మే పరిస్థితి ఏర్పడదు కదా!. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
మరో సారి అబద్దాలు అచ్చేసిన ఈనాడు
-
Fact Check: కుట్ర బుద్ధితో కుంగిపోయారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూరగాయల ఉత్పాదకత ఏటా పెరుగుతూనే ఉన్నా పెత్తందారులు మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు! ‘కూరగాయల్లోనూ కుంగి పోయాం’ అంటూ కాకి లెక్కలు కడుతున్నారు! రాష్ట్రంలో ఉద్యాన పంటల దిగుబడుల్లో 20.9 శాతం వృద్ధి రేటు సాధించగా కూరగాయల దిగుబడుల్లో 12.88 శాతం నమోదైంది. కూరగాయల దిగుబడులను పరిశీలిస్తే 2014–15లో 42.61 లక్షల టన్నులు ఉండగా ప్రస్తుతం 79.06 లక్షల టన్నులకు పెరిగింది. అంటే పదేళ్లలో 88.09 శాతం పెరిగింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు దిగుబడులు 63.61 లక్షల టన్నులు ఉండగా గత నాలుగున్నరేళ్లలో 74 లక్షల టన్నులుగా ఉంది. టీడీపీ హయాంలో సగటు ఉత్పాదకత 7.48 శాతం ఉంటే ప్రస్తుతం 12.88 శాతంగా ఉంది. దిగుబడులు పెరిగాయో తగ్గాయో చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు. కంటి చూపు మందగించిన పెత్తందారులకు ఇవేమీ కానరాక కూరగాయల దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ నేలచూపులు చూస్తోందంటూ అబద్ధాలు అచ్చేశారు. ఎగుమతులు కనిపించవా? పంట ఉత్పత్తులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సీజన్లో వస్తాయి. మన రాష్ట్రంలో పంట సాగు దశలో ఉన్న సమయంలో నాసిక్ నుంచి ఉల్లి తెచ్చుకుంటాం. మన దగ్గర ఉత్పత్తి ప్రారంభం కాగానే మన ఉల్లిని మహారాష్ట్రకు పంపుతుంటాం. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే టమాటాలో ఏటా మూడొంతులు పొరుగు రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంది. వంగ, బీర, సొర, దొండ, బెండ లాంటి కూరగాయలు సైతం పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని పలు ప్రముఖ నగరాలకు నిత్యం సరఫరా అవుతాయి. పట్టణీకరణ వల్ల కొంత విస్తీర్ణం తగ్గినా దిగుబడులు మాత్రం రికార్డు స్థాయిలో ఏటా పెరుగుతూనే ఉన్నాయి. నాడు పంటల బీమా రక్షణ ఏది? సీఎం జగన్ వివిధ పథకాల కింద కూరగాయలు సాగు చేసే 1.42 లక్షల మందికి రూ.140.58 కోట్ల సబ్సిడీని అందించారు. నాలుగున్నరేళ్లలో హెక్టార్‌కు రూ.80 వేల సబ్సిడీతో 6.75 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు బిందు, తుంపర పరికరాలు అమర్చారు. వాటిలో కూరగాయలు సాగయ్యే విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలకు పైనే ఉంది. టీడీపీ హయాంలో కూరగాయల పంటలకు బీమా రక్షణే లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నోటిఫై చేసిన కూరగాయల పంటలకు సైతం ఉచిత పంటల బీమాను వర్తింప చేస్తోంది. నాలుగున్నరేళ్లలో 10,87,608 హెక్టార్లలో సాగైన పంటలకు సంబంధించి 5,35,554 మంది రైతులకు రూ.1,409.57 కోట్ల పంటల బీమా పరిహారాన్ని జమ చేసింది. నేడు మిన్నగా పంట నష్టపరిహారం టీడీపీ సర్కారు ఐదేళ్లలో 3.34 లక్షల మంది రైతులకు రూ.387.33 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వగా సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో 3.84 లక్షల మంది రైతులకు రూ.449.34 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని చెల్లించారు. ఈ ఏడాది 17,992 మంది ఉద్యాన రైతులకు రూ.19.56 కోట్ల కరువు సాయం విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఉద్యాన పంటల విస్తరణ పథకాల కింద షేడ్ నెట్స్, పాలీహౌస్‌లకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీలను అందించారు. రాయితీలు.. ప్రోత్సాహకాలు సాగులో మెళకువలు, చీడపీడల నియంత్రణ, కొత్త సాంకేతిక పద్ధతులు ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న తోటబడుల ఫలితంగా నాణ్యతతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. తీగ జాతి కూరగాయలను పెంచేందుకు శాశ్వత పందిళ్లు, టమోటా నాణ్యత పెంచేందుకు ట్రెల్లీస్ పద్దతిలో నాటటాన్ని ప్రోత్సహిస్తున్నారు. కూరగాయల సాగుకు షేడ్ నెట్ హౌస్, పాలీ హౌస్, ప్లాస్టిక్ మల్చింగుకు ప్రభుత్వం సబ్సిడీతో ప్రోత్సహిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తగా తెచ్చిన గ్రాప్టింగ్ విధానంలో ఉత్పత్తి చేస్తున్న టమాటా, వంగ, బీర, సొర మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఏటా 15–20 లక్షల గ్రాఫ్టెడ్ మొక్కల పంపిణీ ఫలితంగా దిగుబడులు 3–4 రెట్లు వస్తున్నాయి. టీడీపీ హయాంలో హెక్టార్‌కు 15–20 టన్నులకు మించి రాని టమాటాలు ప్రస్తుతం 35–40 టన్నుల దిగుబడులు వస్తున్నాయి. గతేడాది వర్షాలకు నీరు నిలిచినా తట్టుకొని మంచి దిగుబడులొచ్చాయి. గతంలో 10 టన్నులకు మించని వంగ ప్రస్తుతం 25 టన్నులు వస్తోంది. -
కూరగాయల బాక్స్ అనుకొని వ్యక్తి ప్రాణం తీసిన రోబో..
వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి కారణంగా ఎంత మేలు జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. సాంకేతిక విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో రోబోల వినియోగం బాగా పెరిగింది. మనిషులు చేసే చాలా పనులను రోబోలు చిటికెలో చేసేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు సాంకేతికతను మనం మంచి పనుల కోసం ఉపయోగించినా.. కొన్నిసార్లు చెడుగా మారుతుంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పే ఘటన దక్షిణ కొరియాలో బుధవారం వెలుగుచూసింది. మనిషిని, కూరగాయల డబ్బాను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో వ్యక్తి మరణానికి కారణమైంది. వివరాలు.. దక్షిణ జియోంగ్సాంగ్ ప్రావిన్స్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ పరిశ్రమంలో రోబోటిక్ మిషిన్లను వినియోగిస్తున్నారు. అవి కూరగాయాలతో నింపిన డబ్బాలను గుర్తించి కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కిస్తాయి. ఈ క్రమంలో ఓ రోబో దాని పక్కనే ఉన్న ఓ వ్యక్తిని కూరగాయాల డబ్బాగా భావించి.. అతన్ని ఎత్తి కన్వేయర్ బెల్ట్‌పై పడేసింది. రోబో వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో అతని ఛాతీ భాగం, ముఖం ఛిద్రమయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే బాక్సులను గుర్తించాల్సిన రోబోలో సాంకేతిక లోపం తల్లెత్తడం కారణంగానే అది మనిషిని, కూరగాయలతో ప్యాక్ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైందని సదరు కంపెనీ తెలిపింది. ఇదే ప్రమాదానికి దారితీసిందని పేర్కొంది. మూడు రోజుల క్రితం రోబో సెన్సర్‌లో లోపం ఉందని గుర్తించగా.. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. పైగా మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడిందని పేర్కొంది. ఇక దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. మార్చిలో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలో పనిచేస్తున్న 50 ఏళ్ల వ్యక్తి రోబో చేతిలో నలిగి తీవ్ర గాయాలతో మరణించాడు. చదవండి: కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్ -
డయాబెటిస్ పేషెంట్లకు ఈ పండ్లు..కూరగాయాలతో మేలు!
మనకు డయాబెటిస్ ఉందనగానే ఆ పండు తినకూడదని, ఈ కూరగాయ తినకూడదనీ రకరకాల సలహాలు చెబుతూ మనల్ని తికమకకు గురి చేసేస్తుంటారు చాలామంది. ఈ సందిగ్ధం లేకుండా డయాబెటిస్ ఉన్న వారు ఏయే పండ్లు, కూరగాయలు తినవచ్చో తెలియజేసే ప్రయత్నంలో భాగమే ఈ కథనం. కొన్ని పండ్లు సహజ సిద్ధంగా చక్కెర పరిమాణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఇలాంటి పండ్లను తీసుకోవడం చాలా హానికరం. ముఖ్యంగా మామిడి, శీతాఫలం, సపోటా, అరటి, పైనాపిల్‌ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. ఎండు ఖర్జూరాలు రోజూ కొన్ని ఎండు ఖర్జూరాలను తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు సహాయపడతాయి. అయితే వీటిని పరిమితంగానే తీసుకోవాలి. నారింజ సిట్రస్ జాతి ఫలాల్లో నిమ్మకాయ, నారింజ చాలా మంచివి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేసేందుకు నారింజ ఎంతగానో ఉపకరిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ పండును రోజువారీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జామ జీర్ణసంబంధిత సమస్యలకు జామ అద్భుత ఔషధం. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంచిది. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే మధుమేహులు జామను దోరగా ఉన్నదే తీసుకోవడం మంచిది. యాపిల్ మధుమేహం ఉన్న వారికి యాపిల్ పండు మంచిది. ఇందులో పిండిపదార్థాలతోబాటు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మధుమేహులు యాపిల్ తీసుకోవడం మంచిది. అయితే తొక్కతోపాటు తీసుకున్నప్పుడే ప్రయోజనం. తినవలసిన కూరగాయలు క్యాబేజీ డయాబెటిస్ డైట్లో వాడే కూరగాయల్లో అద్భుతంగా పనిచేసేది క్యాబేజీ ఒకటి. ఎక్కువగా చలికాలంలోనే దొరికే క్యాబేజీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులోని అధిక ఫైబర్ శరీరంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. చిలగడ దుంప (స్వీట్ పొటాటో) చిలగడ దుంప అని, గెణుసుగడ్డ అని, రత్నపురి గడ్డ అనీ ఇలా రకరకాలుగా పిలిచే ఈ కూరగాయను నేరుగా తినొచ్చు లేదా కూరలా వండుకొని కూడా తినొచ్చు. యాంటీ డయాబెటిక్ ఫుడ్‌గా దీనికి పేరుంది. ఇందులోని న్యూట్రిషన్లు, ఫైబర్ సహా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్‌షుగర్‌ను అదుపు చేయడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా బాగా పని చేస్తుంది. ఇంకా టమోటా, దొండ, బెండ, కాకర, బీర, సొర, పొట్ల, క్యారట్ మంచిది. బంగాళదుంపను, బీట్రూట్ను వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఇంచుమించు ఆకుకూరలన్నీ డయాబెటిస్‌కు మంచిదే. (చదవండి: చక్కెర కంటే బెల్లమే ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..) -
ఆడి కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న రైతు
-
వినూత్నంగా సెల్ఫోన్లో కూరగాయల వ్యాపారం, నిమిషాల్లో డోర్ డెలీవరీ
కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్‌ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు. శమ తప్పింది నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి. – కేఎల్ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట తాజా కూరగాయలు వాట్సాప్‌లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది. – సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట ఆదరించారు.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్‌లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట -
ఏటీఎం మోడల్‌తో పంటల సాగు.. రైతులకు రూ.25 వేల వరకు లాభాలు
నంద్యాల(సెంట్రల్): పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. ఈ నూతన వ్యవసాయం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నిజంగానే ‘రైతును రాజు’గా మార్చుతోంది. ఇందులో భాగంగా ఏటీఎం అనే కార్యక్రమం ద్వారా 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ ప్రతి నెలా కనీసం రూ.10–25 వేల ఆదాయం పొందే మార్గం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ వరం లాంటిది. ఏటీఎం మోడల్ విధానంలో సాగు చేసిన పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసిన 45 రోజుల నుంచే దిగుబడి రావటం ప్రారంభమవుతుంది. ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు వాటి పంట కాలం బట్టి దిగుబడి వస్తూ ఉంటాయి. ఫలితంగా నిత్యం కోతలే...రోజూ కాసుల గలగలలే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం జిల్లాలో ఈ ఏటీఎం మోడల్లో డోన్, బేతంచెర్ల, ఆత్మకూరు, బనగానపల్ల్లె, మహానంది, చాగలమర్రితో పాటు పలు మండలాల్లో రైతులు కూరగాయ పంటలను సాగు చేసి లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 96 ఏటీఎం మోడళ్లను రైతులు సాగు చేస్తున్నారు. ఏయే పంటలు సాగు చేస్తారంటే.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 96 ఏటీఎం మోడల్ కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. ఈ ఏటీఎం మోడల్ కింద టమాట, వంగ, మటిక, మిరప, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్తో పాటు గోంగూర, పాలకూర, మెంతాకు, కొత్తిమీర వంటి ఆకుకూరలు పండిస్తారు. వీటితో పాటు తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, చిక్కుడు వంటివి సాగుచేస్తున్నారు. వీటిలో కొన్ని కూరగాయలు సాగు చేసిన 25 నుంచి 30 రోజులకు కోతలు ప్రారంభమవుతాయి. మరికొన్ని 45 రోజులకు ఇంకొన్ని 90 రోజులకు దిగుబడి వస్తుంది. ఇలా ఏడాదంతా కూరగాయలను పండించుకుంటూ డబ్బులను సంపాదిస్తున్నారు. ఉన్న ఊర్లోనే... తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు, ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా కిలో చొప్పున వినియోగదారులకు అందిస్తున్నారు. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం కషాయాలు, జీవామృతం, ఘనామృతంతోనే పండించే కూరగాయలు కావటంతో ప్రజలు వీటిని తీసుకునేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారని రైతులు తెలిపారు. అందులోనూ ఉన్న ఊర్లోనే కళ్లెదుటే పండిన కూరగాయలు కాబట్టి తాజాగా ఉండటంతో అందరూ కొంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన ఏటీఎం మోడళ్లలో సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులన్నీ ప్రాచీన ప్రకృతి సేద్య విధానంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తక్కువ విస్తీర్ణంలో సాగు...పైగా ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో చాలా మంది సాగు చేస్తున్నారు. పలు దశల్లో ఉన్న ఈ పంటల ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయి. మేము కూడా సిబ్బందితో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 96 మోడళ్లు సాగులో ఉన్నాయి. – నరేంద్రారెడ్డి, ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి సేద్యం -
బరువు తగ్గాలని రోజూ కూరగాయలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ తగ్గించడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నీ, జంక్ ఫుడ్‌నీ తీసుకోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరైన బరువును మెయింటెయిన్ చేయడం అవసరం. బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోనవసరం లేదు. కొన్ని రకాల కూరగాయలని డైట్లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం. బ్రకోలీ బ్రకోలీలో ఉండే కెరోటినాయిడ్ అనే మూలకం వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాప్సికమ్ క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు. వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
పప్పులతో పరేషాన్.. పెరిగిన కందిపప్పు ధరలు
నిన్నామొన్నటి వరకు కూరగాయలు ధరలు ఆకాశాన్నంటగా సతమతమైన ప్రజలను ఇప్పుడు పప్పుల ధరలు పరేషాన్ చేస్తున్నాయి. కూరగాయల ధరలు కొంత మేరకు అందుబాటులోకి వచ్చాయని ఊపిరి పీల్చుకుంటుండగానే పప్పుల ధరలు అమాంతం పెరగడం వారి ఆందోళనకు కారణమవుతోంది. ప్రతీ ఇల్లు, హోటళ్లలో ప్రధానంగా వినియోగించే కంది పప్పు ధర దాదాపు రెట్టింపైంది. అంతేకాకుండా ఇతర పప్పుల ధరలు కూడా కిలోకు రూ.30 నుంచి రూ.40 మేర పెరిగాయి. జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసినా వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవటంతోనే పప్పుల ధరలు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కందిపప్పు రూ.170కి పైగానే... కందిపప్పు ధర ఊహించని విధంగా పెరిగింది. పంట సీజన్ ఫిబ్రవరిలో రకం ఆధారంగా కేజీకి రూ.95 నుంచి రూ.105 వరకు ధర పలికింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో గరిష్టంగా రూ.110, జూన్‌లో రూ.135 వరకు లభించిన కంది పప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ.175 నుంచి రూ.185 పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోనైతే ఏకంగా రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కంది పంట సాగు చేస్తారు. కంది పప్పులో అకోల, నాగపూర్ రకాలకు డిమాండ్ ఎక్కువ. దీంతో ఈ రకాల ధర ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగింది. ఇక తాండూరు, దేశీయ రకం కంది పప్పుకు డిమాండ్ ఉండడంతో ధర నానాటికీ పెరుగుతోంది. ఇతర పప్పులదీ అదే బాట కంది పప్పుతో పాటు పెసర, మినప, బొబ్బెర వంటి పప్పుల ధరలు కూడా పెరిగాయి. కిలోకు రకం ఆధారంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరి గాయి. పెసర పప్పు ధర సీజన్లో గరిష్టంగా రూ.100 పలకగా, ఇప్పుడు రూ.120కి పైగానే విక్రయిస్తున్నారు. ఇక రూ.80 నుంచి రూ.90 పలికిన మినప పప్పు ధర రూ.120కి పైగానే పలుకుతోంది. అంతేకాక శనగ పప్పు ధర సీజన్లో రూ.65 నుంచి రూ.70 ఉండగా.. ఇప్పుడు వందకు చేరువైంది. సాగు తగ్గి.. కాలం కలిసిరాక.. అపరాల పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గడమే పప్పుల ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పూర్వం అపరాల పంటలకు ప్రాధాన్యత ఉండేది. కానీ నీటి వనరులు పెరగటం, వాణిజ్య పంటలతో అధిక ఆదాయం ఉండటంతో రైతులు ఇటే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మూడేళ్ల క్రితం వరకు వానాకాలం పెసర సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలకు పైగానే ఉండేది. కందులు కూడా 5వేల నుంచి 6 వేల ఎకరాల వరకు, అంతర పంటగా మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పెసర సాగు 13,746 ఎకరాలకు పరిమితం కాగా కంది కేవలం 494 ఎకరాల్లో మాత్రమే వేశారు. కంది సాగు కాలం ఆరు నెలలు ఉండడంతో రైతులు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అంతేకాక దిగుబడి కూడా ఆశాజనకంగా లేకపోవటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. వినియోగానికి తగిన విధంగా పంట సాగు లేకపోవటంతో పొరుగు రాష్ట్రాల నుంచి పప్పులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లోనే సాగు విస్తీర్ణం తగగా... పప్పుల ధరలు బాగా పెరుగుతున్నాయి. 2015 సంవత్సరంలో అనుకూలించని వాతావరణంతో పప్పుల ధరలు భారీగా పెరగగా... ప్రభుత్వం రైతుబజార్లు, రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేసింది. మళ్లీ ఇప్పుడు ధరలు పెరుగుతున్న నేపథ్యాన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుటుందనేది వేచిచూడాలి. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకే... ఏటా అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. రైతులు ఎక్కువమంది వాణిజ్య పంటల వైపునకు మళ్లారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గటంతో పాటు వాతావరణం అనుకూలించకపోవటంతో దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా పంట లేకపోవడంతో ధర పెరుగుతోంది. కంది పప్పుడు ధర కొద్ది నెలలుగా పెరుగుతున్నా, ఈనెల మరింత పెరిగింది. – తేరాల ప్రవీణ్‌కుమార్, వ్యాపారుల అసోసియేషన్ ప్రతినిధి, ఖమ్మం -
టమాట భగ్గు:15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం
Retail inflation at 15 month high in July వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా టమాట ధరలు భగ్గుమనడంతోపాటు పాటు ఇతర కూరగాయల ధర సెగతో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎగబాకిందని , ఈ ఒత్తిడిమరి కొంతకాలం కొనసాగ వచ్చని భావిస్తున్నారు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో జూలైలో 4.87 శాతం 15 నెలల గరిష్ట స్థాయికి చేరింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం జూలైలో 11.51శాతానికి పెరిగింది, అయితే ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్రవ్యోల్బణం 10.57శాతానికి పెరిగింది. కూరగాయల రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ప్రతి ద్రవ్యోల్బణం -0.93శాతం నుండి గత నెలలో 37.34శాతాకి పెరిగింది. (SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!) వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆ చిల్లర ద్రవ్యోల్బణాన్ని లెక్కగడతారు. జులైలో ఒక్కసారిగా పైకెగబాకడానికి కారణం టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమేనని డేటా పేర్కొంది. 2022 ఏప్రిల్ మాసంలో 7.79 శాతంగా నమోదైంది. -
పూర్తిగా శాఖాహారిగా మారితే ప్రమాదమా? చనిపోతారా!
ఇటీవల "వేగన్" అంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం అవుతోంది. శాఖాహారమే తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలు వెల్లువెత్తున్నాయి కూడా. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. గానీ ఏదైనా మనం మోతాదుకు మించి ఉపయోగించటమే సముచితం. ఎందుకంటే శాకాహారి అయినా, మాంసహారి అయిన దేన్నైనా లిమిట్‌గా తీసకుంటూ శరీర తత్వాన్న బట్టి వారికి అనువైన రీతిలో డైట్ ఫాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఈ రష్యన్ మహిళే ఉదహారణ. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది అంటే.. అసలేం జరిగిందంటే..39 ఏళ్ల శానా శామ్సోనోవా అనే రష్యన్ మహిళ గత కొన్నేళ్లు వేగన్ రాఫుడ్ కోసం ప్రచారం చేస్తోంది. ఎప్పటి కప్పుడూ తాను ఏవిధంగా పూర్తి స్థాయిలో రా శాకాహారం తింటుందో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. ఒక దశాబ్దంపాటు ఆ డైటే ఫాలో అయ్యింది. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి వేగన్‌గా మారడం అంటే వాళ్లు కనీసం ఆవు లేదా గెదే పాలు తాగారు, సోయాబీన్స్ వంటి వాటికి సంబంధించిన పాలే తాగుతారు. ఐతే శానా శామ్సోనోవా శాకాహారం అంటే మరీ ఘోరంగా ఆయిల్ లేనివి, కేవలం పచ్చి కూరగాయాలు, వాటితో చేసిన వంటకాలు అంతే తీసుకునేది. అది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎంతలా అంటే అస్థిపంజరం మాదిరిగా అయ్యేంత దారుణ స్థితికి తీసుకొచ్చింది. పోనీ అప్పుడైన కాస్త డైట్ మార్చి కొవ్వులతో కూడిన ఫుడ్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం ఆరోగ్యం కుదుటపడేంత వరకు ప్రోటీన్లతో కూడిన అన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా బావుండేది. అలా చేయకపోవడంతో కాళ్లు వాపుకి గురై లేచి నడవలేనంత స్థితికి వెళ్లిపోయింది. చివరికి ఆస్పత్రి పాలై ప్రాణాల కోసం పోరాడుతూ చనిపోయింది. పాపం ఆమె తల్లి కూడా తన కూతురు పూర్తి స్థాయిలో శాకాహారం తీసుకుని చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. చివరి స్టేజ్‌లో ఆకలివేసినా.. తినలేని దయనీయ స్థితికి చేరుకుని చనిపోయినట్లు వెల్లడించింది. ఏ డైట్ అయినా ఆరోగ్యకరమైన రీతిలో మన శరీరీం యాక్స్‌ప్ట్ చేసేంత మోతాదులో తీసుకోవాలి. తీసుకుంటుంది శాఖాహార అయినప్పుడూ కొవ్వులు లభించే నట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే కాస్త శరీరానికి బలం చేకూర్చేలా కూరల్లో ఆయిల్ చేర్చాలి. అంతేగాని 'వేగన్' పేరుతో ఇలా పూర్తిగా కూరగాయాలు అంటూ పిచ్చిపిచ్చిగా ఫాలో అయితే ఇలానే చెయిచేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవుతారు. దయచేసి శాకాహారం లేదా మాంసహారి అయినా సరైన రీతిలో డైట్ ఫాలో అవ్వండి లావు అవుతామనో లేదా ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం అనో మరింతగా నోరు కట్టేసుకునేలా డైట్లు చేసి ప్రాణాలను కోల్పోవద్దు. (చదవండి: పీచే కదా అని తీసిపడేయకండి!) -
బెండకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి
రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పటికీ ఒకోసారి బెండకాయలు పాడవుతుంటాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. బెండకాయలను తాజాగా ఉంచేందుకు ఇలా చేసి చూడండి... ∙మార్కెట్ నుంచి లె చ్చిన బెండకాయల్లో తాజాగా ఉన్న బెండకాయలను ఏరి పక్కన పెట్టుకోవాలి. ∙తాజా బెండకాయలన్నింటిని స్పూను వెనిగర్ వేసిన నీటిలో వేసి ఇరవై నిమిషాలు ఉంచాలి. తరువాత సాధారణ నీటితో కడిగి, తడిలేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ∙ ఆరిన బెండకాయలను నచ్చిన పరిమాణం, ఆకారంలో ముక్కలుగా తరిగి జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి. ∙ ఇలా నిల్వచేసుకుంటే బెండకాయలు ఎక్కువ రోజులపాటు తాజాగా , రుచిగా ఉంటాయి. అవసరమైనప్పుడు జిప్‌లాక్ బ్యాగ్‌ను బయటకు తీసి వేడినీటిలో కొద్దిసేపు ఉంచాలి. కూలింగ్ తగ్గిన తరువాత వాడుకోవాలి. -
కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!
సాక్షి, కొత్తగూడెం: ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో అల్లాడుతున్న వినియోగదారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ కూరగాయల వ్యాపారి కుటుంబం ఉపశమనం కలిగించింది. టమాటా ధరచూస్తే నోట మాటరాని పరిస్థితి. పచ్చిమిర్చి ముట్టుకోకుండానే మంటమండుతున్న వేళ ప్రజలెవరూ మార్కెట్ ముఖం చూడకపోవడంతో పలురకాల కూరగాయల ధరలు తగ్గించింది. ఇన్నిరోజులు ధరల దరువుతో వెలవెలబోయిన మార్కెట్లో తాజాగా వినియోగదారుల సందడి నెలకొంది. ఇల్లెందుకు చెందిన కూరగాయల వ్యాపారి యాకూబ్ కుమారులు గౌస్, జానీ, ఖాజా మానవతాదృక్పథంతో ముందుకు వచ్చి ఐదు రకాల కూరగాయల ధరలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. కిలో రూ.60 పలుకుతున్న బెండ, దొండ, సొరకాయ, వంకాయ, ఆలుగడ్డను కేవలం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ విషయమై గౌస్, జానీ, ఖాజా మాట్లాడుతూ కూలీలు, చిరుద్యోగులు కూరగాయలు కొనే పరిస్థితి లేకపోవడంతో తమ తండ్రి స్ఫూర్తితో లాభనష్టాలు చూసుకోకుండా ధరలు తగ్గించినట్లు తెలిపారు. -
మంట ధరల మంట! టమాటా, పచ్చిమిర్చి చోరీ
డోర్నకల్: అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డలపై దొంగల కళ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కూరగాయల మార్కెట్లోని పలు దుకాణాల్లో ఇటీవల కూరగాయలు చోరీకి గురవుతున్నాయి. గాంధీసెంటర్లోని కూరగాయల మార్కెట్లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలిక నెట్ ఏర్పాటు చేస్తారు. మార్కెట్‌కు నైట్‌వాచ్‌మన్ లేకపోవడం, ఇటీవల కూరగాయల ధరలు పెరగడంతో రాత్రి వేళల్లో పలు దుకాణాల్లోని కూరగాయలు చోరీకి గురవుతున్నట్లు వ్యాపారులు గుర్తించారు. బుధవారం ఉదయం కూరగాయల వ్యాపారి లక్పతి తన దుకాణం తెరిచి చూడగా అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డతోపాటు ఇతర కూరగాయలు చోరీ అయినట్టు గుర్తించి లబోదిబోమన్నాడు. కర్ణాటకలో టమాటా పంట చోరీ యశవంతపుర: కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలను దాటాయి. దీంతో అందరి కళ్లు ఇప్పుడు టమాటాలపై పడ్డాయి. కర్ణాటకలో హసన్ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు ఎత్తుకుపోయారు. మంగళవారం రాత్రి తోటలోకి ప్రవేశించి, దాదాపు 60 సంచుల టమాటాలను కోసుకెళ్లారు. రైతు పొలంలోకి వెళ్లి చూడగా పంట మొత్తం మాయం కావడంతో హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన పంట ధర రూ.1.5 లక్షల వరకూ ఉంటుందని తెలిపాడు. టమాటా తోటకు సీసీ కెమెరా రక్షణ కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్ తాలూకా అక్కి ఆలూరు గ్రామంలో రైతు మల్లప్ప తన టమాటా తోటకు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ధరలు పెరగటంతో దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అటువైపు దొంగలు రాకుండా కాపలా కాస్తున్నట్లు తెలిపాడు. -
కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం యాప్ ద్వారా రోజూ క్షేత్రస్థాయిలో కూరగాయల ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తోంది. ఉల్లి, ఇతర కూరగాయల ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా.. టమాటా ధర పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, కృష్ణా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోనే టమాట ధర పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా టమాటాతో పాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఉల్లి, బంగాళదుంపలు, మిరప వంటి ఇతర కూరగాయల ధరలను సమీక్షిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపింది. ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో టమాటా ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ. 32 నుంచి రూ. 65 మధ్యలో, ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి 25 మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఈ రెండింటి ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టారు. టమాటా కిలో రూ.100 దాటితే మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో రైతుబజార్ల సీఈవో నందకిషోర్ సమీక్షించనున్నారు. సీఎం యాప్ ద్వారా రోజూ జిల్లాలవారీగా కూరగాయల ధరలను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైతే మార్కెట్లో జోక్యం చేసుకుంటామని చెప్పారు. మిర్చి రైతుకు పండగే కంకిపాడు: రాష్ట్రంలో మిర్చి రైతుకు పండగొచ్చింది. సంవత్సర కాలంగా కిలో రూ.50 కి మించని పచ్చి మిర్చి ప్రస్తుతం రూ. 100 దాటింది. వారం, పది రోజులుగా మిర్చి ధర రూ 35 నుంచి క్రమేపీ పెరిగింది. వేసవి కారణంగా మిర్చి సాగు తగ్గింది. డిమాండ్‌కు సరిపడా దిగుబడి లేకపోవడంతో ధర పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టమాటా రూ.100 పచ్చిమిర్చి రూ.160
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వరకు రూ.వందకు నాలుగు కిలోల చొప్పున అమ్మిన టమాటాల ధర ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ.100కు చేరింది. పావుకిలో కొనాలంటే రూ.30 ఇస్తే తప్ప దొరకని పరిస్థితి. అలాగే, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడుతోపాటు అన్ని కూరల్లో వాడే అల్లం, వెల్లుల్లి ధరలు కూడా సామాన్యుడికి ఏమాత్రం అందనంతగా పెరిగిపోయాయి. పచ్చిమిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు తప్ప బెండకాయలు, బీరకాయలు, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కిలో రూ.60–80కి మధ్య ఉండటం గమనార్హం. రైతుబజార్లు, మార్కెటింగ్ శాఖ మొబైల్ వ్యాన్లలో విక్రయించే చోట ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ దుకాణాల్లో కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్మార్కెట్లలో రిటైల్ మార్కెట్ల కన్నా కిలోకు రూ.10–15 వరకు అధికంగా ఉంది. అల్లం కిలో రూ.300 కూరల్లో రుచికి తప్పనిసరైన అల్లం ధర ఊహించని విధంగా కిలో రూ.300కి చేరింది. మంగళవారం హైదరాబాద్ చింతలబస్తీలో బండ్లపైన అల్లం పావుకిలో రూ.80 ఉండగా, కిలోకు రూ.300 చెప్పడం గమనార్హం. వెల్లుల్లి కిలో రూ.200 ఉండగా, మేలురకం ధర రూ.240 ఉంది. మూడు నెలల క్రితం వరకు కిలో రూ.100కి లభించిన అల్లం, వెల్లుల్లి ధరలు ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయి సామాన్యుడు కొనలేనంత పైకి చేరుకున్నాయి. బీన్స్ నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి రూ.160 వరకు ఉండగా, చిక్కుడుకాయలు కిలో రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. వేసవిలో కూరగాయలు పండించకనే.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మూడునెలలుగా రాష్ట్రంలో కూరగాయల పంటలు ఆశించిన స్థాయిలో లేవు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షాలు, మే, జూన్లలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీ నుంచి కూడా ఆశించినస్థాయిలో తెలంగాణకు దిగుమతులు లేవు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, క్యారెట్ వంటివి తప్ప నిత్యం వండుకునే కూరగాయల దిగుమతులు తక్కువగానే ఉన్నట్లు హైదరాబాద్ రైతుబజార్ ప్రతినిధి ఒకరు చెప్పారు. -
ఈ కూరగాయలు నేరుగా తింటున్నారా?ఇందులోని విషపూరిత బాక్టీరియా..
మనకు ఆహార పదార్థాలలో కొన్ని వండకుండా నేరుగా తినేయవచ్చు, మరికొన్నింటిని తప్పకుండా వండుకొనే తినాలి. మనలో చాలా మంది కొన్ని కూరగాయలను పచ్చిగా తినడమే ఆరోగ్యకరం అని నమ్ముతారు. అయితే అన్ని సందర్భాలలో.. అన్ని కూరగాయల విషయంలో అది మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా పచ్చిగా తినకూడని కూరగాయలేమిటో తెలుసుకుందాం. కొన్ని కూరగాయలలో సహజమైన విషపూరిత సమ్మేళనాలు, జీర్ణం కావడానికి కష్టతరమైన చక్కెరలు ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు కలిగించడంతో పాటు గ్యాస్ట్రోనామికల్ వ్యాధులకు దారితీయవచ్చు. అంతేకాదు, కూరగాయలను పండించటానికి ఎరువులు, పురుగుమందులు ఎక్కువగా వాడుతున్నారు. మనం వాటిని ఎంత శుభ్రం చేసినా, వాటి లోపలి భాగంలో ఉండే హానికర సమ్మేళనాలు, బ్యాక్టీరియా వంటివి అలాగే ఉంటాయి. బాగా ఉడికించినపుడు మాత్రమే అవి క్రిమిసంహారం అవుతాయి, అప్పుడే అవి తినడానికి అనువైనవిగా ఉంటాయి. అయితే పచ్చిగా అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. చిలగడదుంప/ గెణుసుగడ్డ/ రత్నపురి గడ్డ వీటిని నేరుగా తిన్నా, రుచిగానే ఉంటుంది. అయితే ఇలా తినడం జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ఉండే పిండి పదార్థం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి వీటిని కాల్చడం లేదా ఉడికించడం మంచిది. బీన్స్ పచ్చిగా తినకూడని మరో వెజిటెబుల్ బీన్స్. కొన్నిరకాల బీన్స్ పచ్చిగా తింటే ప్రమాదకరం కూడా. బీన్స్ లోని కొన్ని రకాలు హానికరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిలోని హానికరమైన టాక్సిన్ను తొలగించడానికి ముందు బీన్స్‌ను క్లీనర్ నీటిలో నానబెట్టండి. ఆపైన వండుకొని తినాలి. రెడ్ కిడ్నీ బీన్స్ ఉడికించని లేదా సరిగ్గా ఉడకని కిడ్నీ బీన్స్ (రాజ్మా) లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకో ప్రోటీన్ లెక్టిన్ ఉంటుంది. వీటిని తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. లక్షణాల తీవ్రత కూడా మీరు తిన్నపరిమాణంపై ఉంటుంది. ఎక్కువగా తినేస్తే ఎక్కువ మొత్తంలో టాక్సిన్స్ మీ శరీరంలోకి చేరతాయి. కాబట్టి కిడ్నీబీన్స్ని ఎప్పుడయినా ఉడకబెట్టి తినాలి. ఆకు కూరలు ఆకుకూరల్లో కొన్నింటిని పచ్చిగా తినకూడదు. క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, అలాగే మొలకలను పచ్చిగా తినడం వల్ల అనేక గ్యాస్ట్రోనమికల్ సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులను పచ్చిగా తినవచ్చు, అయితే ఎక్కువ పోషకాలను పొందడానికి ఉడికించిన వాటిని తీసుకోవడం మంచిది. కాల్చిన, వేయించిన లేదా ఉడికించిన పుట్టగొడుగుల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా వాటి రుచికూడా పెరుగుతుంది. కాబట్టి వండుకొని తినండి. శాకాహారాలు కాకుండా ఏ రకమైన మాంసాహారాన్ని అయినా పచ్చిగా తినడం చాలా ప్రమాదకరం. పచ్చి మాంసంపై రకరకాల హానికర బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. కాబట్టి మాంసాన్ని బాగా ఉడికించుకొని తినాలి. అలాగే కోడిగుడ్లను కూడా పచ్చిగా తినడం హానికరమే! -
పొలం నుంచి వైఫల్యం వరకు...
దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ‘నేను దాన్ని పెంచాను. నేనే దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది కానీ నేను ఏం చేయగలను? గిట్టుబాటు ధరైనా రాకుంటే..’ అని కూరగాయలు, పండ్లు పండించే రైతు ఆవేదన చెందుతున్నాడు. పంట ఉత్పత్తికి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్ని నాశనం చేయడమనేది రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ‘పొలం నుంచి వైఫల్యం వరకు’ అనే ఈ పునరావృత రైతు గాథ దేశంలో ప్రతిచోటా కనిపిస్తున్నదే. అంతేకాదు... కొన్ని సంవత్సరాలుగా ఈ విఫలగాథ మరింతగా విస్తృతమవుతూ వస్తోంది! ఈ సంవత్సరం క్వింటాల్ బంగాళా దుంపల ధర రూ. 500లకు పడిపోయి నప్పుడు (గత సంవత్సరం రూ. 1,200లు సగటు ధర పలికింది) ఒక రైతు మీడియాతో ఏం చెప్పాడంటే... ‘‘క్వింటాల్ బంగాళా దుంపలను 900 నుంచి 1000 రూపాయల ధరకు తక్కువ అస్సలు అమ్మలేము. ఎందుకంటే ఈ రేటు వద్ద అయితేనే మాకు దిగుబడి ఖర్చులు రావడమే కాకుండా కాస్త లాభం కళ్ల చూడగలం’’ అని. అయితే ఇప్పుడు బంగాళాదుంపల ధర ఏమాత్రం పెరిగే సూచనలు కనిపించకపోవడంతో రానున్న కాలంలో బంగాళా దుంపల ఉత్పత్తిదారులు గడ్డు కాలాన్నే ఎదుర్కోనున్నారు. పంజాబ్‌లోనే కాదు, బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా బంగాళాదుంపల ధర ఘోరంగా పతనం కానుంది. క్యాలిఫ్లవర్, క్యాబేజి, టమోటా ధరలు కూడా పడిపోయాయి. కేజీకి 3 రూపాయల ధర కూడా పలకదని గుర్తించక ముందే పంజాబ్‌లో రైతులు తమ పంటను ఇప్పటికే ధ్వంసం చేయడం ప్రారంభించారు. ‘నేను దాన్ని పెంచాను. నేను దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ నేను ఏం చేయగలను..’ అని కూరగాయలు పండించే రైతు ఒకరు అన్నారు. వీటి ఉత్పత్తికి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్నీ నాశనం చేయడమనేది ఈ రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీయకుండా ఉంటుందా?! ఇటీవల తెలంగాణలోని జహీరాబాద్ జిల్లా ప్రాంతాల గుండా నేను ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడ విరివిగా పండిన టమోటాకి కూడా ఇదే గతి పట్టడం చూశాను. టమోటా పంటను ఎందుకు పండించడం లేదని అడిగాను. నిరాశతో కనిపించిన టమోటా రైతు ఒకరు నాతో మాట్లాడుతూ, మార్కెట్ ధర కిలో టమోటాకు 2 రూపాయలు పలుకుతున్నప్పుడు టమోటాలను బుట్టల్లో సర్దడం, వాటిని రవాణా చేయడం వంటివాటికి అదనపు ఖర్చు పెట్టాలని తానను కోవడం లేదని చెప్పాడు. ‘మీకు ఎన్ని టమోటాలు కావాలంటే అన్నీ తీసుకోండి’ అని అతను నిస్పృహతో అన్నాడు. ‘పొలం నుంచి వైఫ ల్యానికి’ సంబంధించిన ఈ గాథను నేను ప్రతి చోటా చూస్తున్నాను. దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలో చిస్తున్నట్లు లేదు. నేను ఎందుకిలా చెబుతున్నానంటే, ఛత్తీస్‌గఢ్ నుంచి పక్షం రోజుల క్రితం ఒక నివేదిక వచ్చింది. మహాసముండ్కి చెందిన ఒక రైతు రాయపూర్ మండీకి వంకాయ పంటను తీసుకెళితే అతడికి రూ. 1,475 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చిందనీ, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల కింద అదనంగా 121 రూపాయలను రైతే చెల్లించాల్సి వచ్చిందనీ ఆ వార్త తెలిపింది. అంతకు ముందు నెల రోజుల క్రితం వెల్లుల్లి రైతులు తమ పంట మొత్తాన్ని స్థానిక నదుల్లో కలిపేశారన్న వార్తలు మీడియాలో రాజ్యమేలాయి. తర్వాత ఉల్లి పాయల సాగుదార్ల వ్యధలకు సంబంధించిన వార్తలు కూడా బయటికి వచ్చాయి. మరో మాటలో చెప్పాలంటే, దేశంలో ఈ పరిస్థితి రోజువారీ కార్యక్రమంలా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా, పొలం నుంచి వైఫల్యానికి సంబంధించిన గాథ మరింతగా విస్తృతమవుతూ వచ్చింది. పొలంలో రైతు చిందిస్తున్న రక్తం మీడియాలో పేజీలకు మాత్రమే పరిమితమవుతోంది. స్టాక్ మార్కెట్లో రక్త పాతాన్ని దేశం చూస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి తీవ్ర స్పందన రైతుల వ్యధల పట్ల కలగడం లేదు. ఇది చాలదన్నట్లుగా, మార్కెట్లో జోక్యం చేసుకునే వ్యవస్థ (ఎమ్ఐఎస్)ను మరింతగా బలోపేతం చేయడంలో ఎలాంటి ప్రయో జనాన్నీ మన ఆర్థిక మంత్రి చూడడం లేదు! సమృద్ధిగా పంటలు పండి ధరలు పడిపోయినప్పుడు లేదా పంటలు చేతికొచ్చిన సమయంలో ఉత్పత్తి ధరకంటే తక్కువ ధరకు పడిపోయినప్పుడు ఎమ్ఐఎస్ రంగంలోకి దిగుతుందన్నది తెలిసిందే. 2023 బడ్జెట్ ఖర్చుల కింద, ధర మద్దతు పథకం (పీఎస్ఎస్), ఎమ్ఐఎస్లకు కేటా యింపులను బాగా తగ్గించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఎమ్ఐఎస్కి బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం దాన్ని కేవలం లక్ష రూపాయలకు కోసిపడేశారు. బడ్జెట్లో పొందుపర్చిన ఈ కేటాయింపు, కొద్దిమంది వెల్లుల్లి ఉత్పత్తిదారులకు కలిగిన నష్టాలను పూరించడానికైనా సరిపోతుందని నేను భావించడం లేదు. 2018–19 బడ్జెట్లో రూ. 500 కోట్ల కేటాయింపుతో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్‌ను గుర్తుంచుకోండి. టమోటో, ఉల్లి పాయలు, బంగాళాదుంపలు మామూలుగా ఎదుర్కొంటున్న అస్థిర ధరల నియంత్రణకు ఉద్దేశించినట్లు చూపించినప్పటికీ అవసరమైన దానికంటే తక్కువగా బడ్జెటరీ కేటాయింపులు చేశారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాతిపదికన, కనీసం ఈ మొత్తాన్నయినా ప్రకటించారు. ఈ పథకాన్ని అన్ని పండ్లు, కూరగాయలకు వర్తింపచేస్తూ, ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్‌ని మరింతగా విస్తరించింది. కానీ 2023 నాటికి ఈ పథకాన్ని దాదాపుగా విస్మరించేశారు. కూరగాయల ధరలు (పండ్ల విషయంలో కూడా) పడిపోయిన ప్రతి సందర్భంలోనూ నేను ట్వీట్ చేసినప్పుడు, ఇవి పాడైపోయే సరకులు అని సాధారణ పల్లవి పాడుతూ వచ్చేవారు. సాధారణ ప్రజానీకం నుంచి ఈ మాటలు వింటే వాటిని సులువుగా పక్కనపెట్టేయవచ్చు కానీ విధాన నిర్ణేతలు ఇంత భిన్నంగా ఉండ టానికి ఇది కారణం కాకూడదు. అమెరికాలో కూడా, ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్ట పోకుండా ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చారు. పాలధరలు పడి పోయిన సమయాల్లో స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్‌లలో పొందు పరిచేలా రైతులు మరింత చీజ్‌ని తయారు చేయాలని రైతులను కోరే యంత్రాంగాన్ని అమెరికా రూపొందించింది. అలాగే స్ట్రాబెర్రీ ధరలు పతనం అయే సమయాల్లో ఇదే విధమైన కార్యక్రమాలు ఉంటున్నాయి. ప్రతిదీ సజావుగా ఉంటుందని చెప్పలేం కానీ, వ్యవ సాయ క్షేత్రాల నష్టాలను తగ్గించడానికి ఇప్పటికీ ప్రయత్నాలు జరుగు తున్నాయి. భారత్‌లో తగిన ఉష్ణోగ్రతా నియంత్రిత నిల్వ సౌకర్యాలు, ప్రాసె సింగ్‌పై ఆధారపడి ఉండే వాల్యూ ఛెయిన్‌ని పునర్నిర్మించడానికి, స్థానికంగా అందుబాటులో ఉంచేందుకు చిత్తశుద్ధితో కూడిన ప్రయ త్నాలు చేపట్టాలి. ధరల క్షీణత పథకాన్ని అమలు చేసే యంత్రాంగం ద్వారా దీన్ని అమలు చేయాలి. కానీ మధ్యప్రదేశ్‌లో గతంలో స్కీమ్ పైఫల్యం చెందడం అనేది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. అయితే మరింత ముఖ్యంగా ధరల అస్థిరత్వాన్ని అధిగమించడానికి రైతుల కోసం గ్యారంటీ ధరకు హామీ పడటం మార్గదర్శక స్ఫూర్తిగా ఉండాలి. కూరగాయల పెంపకందార్లకు గ్యారంటీ ధరను అందిస్తున్న కేరళ స్కీమ్ నుంచి వెలికివచ్చిన పాఠాలను నేర్చుకోవలసి ఉంటుంది. రైతుల కోసం భవిష్యత్తులో పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడంలోనే కాదు.. వైవిధ్యభరితమైన పంటల వైపు మారే విషయంలో వారికి సహకారం అందివ్వడంలో ఆపరేషన్ గ్రీన్స్ కి అతి పెద్ద సవాలు ఎదురవుతోంది. వినియోగదారులు ఇప్పటికే అత్యధిక మార్కెట్ ధరను చెల్లిస్తున్నారు. కానీ భారీగా ఆర్గనైజ్ అయివుండే వ్యాపారంలో కూడా జరిగే బేరసారాల్లో రైతులే నిండా మునిగి పోతున్నారు. కాబట్టి పొలం నుంచి వైఫల్యానికి చెందిన గాథ మారాల్సి ఉంది. కొనసాగుతున్న వ్యవసాయ దుఃస్థితికి గాను సప్లయ్ – డిమాండును మాత్రమే మనం నిందిస్తూ కూర్చోలేము. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
కూరగాయలకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: దేశంలో కూరగాయలకు డిమాండ్ భారీగా పెరగనుంది. 2030 నాటికి దేశంలో కూరగాయల కొరత ఏర్పడుతుందని, దేశంలో అవసరాలకు తగినంతగా ఉత్పత్తి ఉండదని జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే మాంసం, పండ్లకు కూడా స్వల్పంగా కొరత ఏర్పడుతుందని పేర్కొంది. 2030 నాటికి దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లు కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తి పెరుగుతుందా లేదా అనే అంశంపై నాబార్డు అంచనా వేసింది. పంట తరువాత వృథాను కూడా తీసివేసిన తరువాత డిమాండ్, లభ్యతను లెక్కగట్టింది. 2030వ సంవత్సరానికి దేశంలో కూరగాయల డిమాండ్ 192 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, అయితే లభ్యత 160 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా 32 మిలియన్ టన్నుల కూరగాయల కొరత ఉంటుంది. అప్పటికి దేశంలో 103 మిలియన్ టన్నుల పండ్లు అవసరమైతే 93.1 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతాయని తెలిపింది. 9.9 మిలియన్ టన్నుల పండ్ల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో 5.54 శాతం వాటాతో భారతదేశం రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఎగుమతులు చేసినప్పటికీ, చేపల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందని చెప్పింది. 2030 నాటికి చేపల డిమాండ్ 11.1 మిలియన్ టన్నులు ఉంటుందని, ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువగా 11.9 మిలియన్ టన్నులు ఉంటుందని వెల్లడించింది. గుడ్లు 5.8 మిలియన్ టన్నులు డిమాండ్ ఉండగా లభ్యత 5.9 మిలియన్ టన్నులు ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా పాలకు కొరత ఉండదని, అవసరానికంటే పాల ఉత్పత్తి ఎక్కువే ఉంటుందని వివరించింది. మాంసం అవసరానికంటే లభ్యత 1.2 మిలియన్ టన్నులు తక్కువ ఉంటుందని నివేదిక తెలిపింది. రైతులు పండించిన పంటలకు రవాణా వ్యయం తగ్గించేందుకు మార్కెటింగ్‌లో సమష్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. సన్న, చిన్న కారు రైతులతో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతులకు మంచి ధరలకు హామీ లభిస్తుందని నివేదిక పేర్కొంది. వివిధ సమస్యలను అధిగమించేలా ఒప్పంద వ్యవసాయం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. -
సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే!
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థలు కొన్ని పండ్లు, కూరగాయల కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా కొరత తలెత్తింది. నెల రోజుల వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో సూపర్ మార్కెట్ యాజమాన్యాలు ఈ చర్యను ప్రకటించాయి. టమాటాలు, క్యాప్సికం, దోసకాయలు, బ్రకోలి, క్యాలిఫ్లవర్ తదితరాల సరఫరా తక్కువగా ఉండటంతో వీటిని ఒక్కో వినియోగదారుకు మూడు వరకే విక్రయిస్తామని టెస్కో, అస్డా, మోరిసన్స్, ఆల్డి సంస్థలు తెలిపాయి. ఆఫ్రికా, యూరప్‌ల్లో ప్రతికూల వాతావరణం, ఇంధన ధరలు పెరగడం, బ్రిటన్, నెదర్లాండ్స్‌లో గ్రీన్హౌస్ వ్యవసాయంపై ఆంక్షలు కారణంగా పండ్లు, కూరగాయల దిగుబడి, రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
Hyderabad: దిగివచ్చిన ఆకుకూరలు, కూరగాయలు.. 50-80 శాతం తగ్గిన ధరలు
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా మార్కెట్లో ఒక కూరగాయ ధర ఎక్కువ ఉంటే మరో కూరగాయ ధర తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కూరగాయల ధరలు చూస్తే బాబోయ్ అనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తున్న వారు బ్యాగు నిండా కూరగాయలతో ఇంటికి వస్తున్నారు. కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం తక్కువ ధరలకే లభిస్తుండటంతో శాఖాహారులు, ఆరోగ్య అభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 80 శాతం తగ్గిన ధరలు టమాటా నుంచి క్యాబేజీ వరకు చౌకగా లభిస్తున్నాయి. తాజా ఆకుకూరలు అతి తక్కువ ధరకే విరివిరిగా లభిస్తున్నాయి. కూరగాయల దిగుబడి బాగా ఉండటంతో మార్కెట్లో అధికంగా లభ్యమవుతున్నాయి. రిటైల్‌గా కిలో టమాటా రూ.8 నుంచే రూ.10లకి లభిస్తోంది. వంకాయ, కాకరకాయ ధరలు తక్కువ ఉండగా ఒక్క ఆలుగడ్డ తప్పతో మిగతా కాయగూరలు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. మెంతికూర, పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలు గతంలో కంటే 80 శాతం ధరలు తగ్గాయి. పుదీనా కొత్తిమీర ధలకు కూడా తగ్గాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూ.10 నుంచి రూ.15కే పీస్ చొప్పున అమ్ముతున్నారు. ఎప్పుడూ కూడా చుక్కలను అంటే ధరలతో ఉండే బీన్స్ మాత్రం కేజీ రూ.25 నుంచి రూ.30లకే లభ్యమవుతోంది. నేరుగా కాలనీలు, బస్తీల్లోకే.. కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పోయిన యువకులు అధిక సంఖ్యలో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కాగా కూరగాయల కోసం బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే లభ్యమవుతున్నాయి. ఆటో ట్రాలీలలో గల్లీ గల్లీ తిరిగి విక్రయిస్తున్నారు. సాయంత్రం రోడ్లపక్కన, ప్రధాన కూడళ్ల వద్ద కూరగాయల స్టాళ్లు వెలుస్తున్నాయి. తాజాగా.. చౌకగా లభ్యమవుతుండటంతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్
గుడ్లు, మాంసానికి కటకట ఏర్పడింది. పాల ఉత్పత్తుల సరఫరా భారీగా పడిపోయింది. కూరగాయలు, పండ్ల సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. దుంపలు పండడమే లేదు. డిమాండ్‌కు సరిపడా పంటల ఉత్పత్తిలేక బ్రిటన్‌లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. ధరాభారంతో రైతులు, సామాన్యులు కుదేలైపోతున్నారు. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లకి రేషన్ పెట్టేశారు. ఇదే పరిమితి ఇతర ఆహార పదార్థాలపై విధించే పరిస్థితులొస్తాయన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. బ్రిటన్ ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. బ్రెగ్జిట్ నుంచి దేశానికి మొదలైన ఆర్థిక కష్టాల పరంపర కొనసాగుతోంది. కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి పంట దిగుబడులు, నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా దేశాన్ని ఊపేసిన ఏవియాన్ ఫ్లూతో గుడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లు అమ్మకంపై పరిమితులు విధించారు. బంగాళదుంపలు దొరకడం లేదు. టమాట దిగుబడులు కనీవినీ ఎరుగని రీతిలో పడిపోయాయి. బ్రాసిల్, యాపిల్స్, దోసకాయలు, ఇతర కూరగాయల దిగుబడి భారీగా తగ్గిపోయాయి. గత 45 ఏళ్లలో ఈ స్థాయిలో పంట దిగుబడులు తగ్గిపోవడం ఈ ఏడాదే జరిగింది. 27% పెరిగిపోయిన పంట ఉత్పత్తి వ్యయం ఏడాది వ్యవధిలో పంటల ఉత్పత్తికయ్యే ఖర్చు 27 శాతం పెరిగింది. చమురు, ఎరువులు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి ఖర్చులు తడిసిమోపెడు కావడంతో రైతన్నలు పంటల్ని పండించే పరిస్థితులు లేవని చేతులెత్తేస్తున్నారు. డీజిల్ ధరలు 2019తో పోలిస్తే 75 శాతం పెరిగిపోవడం రైతన్నలపై పెనుభారం మోపింది. ప్రభుత్వం జోక్యం కల్పించుకొని రైతులను ఆదుకోకపోతే బ్రిటన్‌లో కనీవినీ ఎరుగని ఆహార సంక్షోభం ఏర్పడుతుందని జాతీయ రైతు యూనియన్ (ఎన్ఎఫ్యూ) హెచ్చరించింది. 2019తో పోల్చి చూస్తే రిజిస్టర్డ్ వ్యవసాయ కంపెనీల సంఖ్య 7 వేలు తగ్గిపోయిందని వెల్లడించింది. పనివాళ్ల కొరత సైతం రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కుదేలైపోయాయి. ఎన్నో సూపర్ మార్కెట్లలో ర్యాక్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్‌లో పాలు, వెన్న సరఫరా చేసే అతి పెద్ద సంస్థ ఆర్లా ఫుడ్స్ డిమాండ్‌కు సరిపడా సరఫరా ఇక చేయడం కష్టమని తేల్చి చెప్పింది. పశుపోషణకయ్యే వ్యయం భారీగా పెరగడంతో రైతులు పాలు సరఫరా చేయడం లేదని తెలిపింది. వాతావరణ మార్పుల ప్రభావం పంటలపై పడుతోంది. బంగాళదుంపలు, ఇతర దుంప కూరలు సరిగా పండడం లేదని జేమ్స్ హట్టన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ లెస్లీ వెల్లడించారు. బంగాళదుంపల ధరలు రెట్టింపయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అంచనా వేశారు. వాతావరణ మార్పులు, ఇంధనం ధరల ప్రభావంతో ఈ ఏడాది ఆహార ఉత్పత్తులు 11% శాతం మేరకు తగ్గిపోయాయని ఇంధన, పర్యావరణ నిఘా విభాగం నివేదిక వెల్లడించింది. బ్రిటిష్ రిటైల్ కన్సోర్టియమ్లో ఫుడ్ అండ్ సస్టయినబులిటీ డైరెక్టర్ ఆండ్రూ ఒపె రిటైల్ మార్కెట్లు నిత్యావసరల కొరతతో కళ తప్పినప్పటికీ సంక్షోభం వచ్చే పరిస్థితులు వచ్చే అవకాశం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రభుత్వం రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితుల్ని అంచనా వేస్తోందని, ఆహార భద్రతకు రిషి సునాక్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నవంబర్‌లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 14.6 శాతానికి చేరుకున్నప్పటికీ అక్టోబర్‌తో పోలిస్తే 0.1 శాతం తగ్గిందని, గత రెండేళ్లలో ధరలు తగ్గడం ఇదే తొలిసారని ఆయన వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ కళ తప్పిన క్రిస్మస్ క్రిస్మస్ పండుగ దగ్గరకొస్తుంటే సామాన్యుల్లో ఈ సారి ఆ హుషారు కనిపించడం లేదు. సాధారణంగా క్రిస్మస్కు నెల రోజుల ముందు నుంచే మార్కెట్లు జనంతో కళకళలాడుతుంటాయి. కానీ ఈ సారి మార్కెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లుల భారం భరించలేక ఎందరో చిరు వ్యాపారులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ధరలు ఆకాశాన్నంటడం, కావల్సిన వస్తువులకి కొరత ఏర్పడడంతో ప్రజలు ఉన్నంతలో బతుకుని నెట్టుకొస్తున్నారు. ఒక కుటుంబంపై నెలవారి నిత్యావసరాల ధరల భారం 34 పౌండ్లు. అంటే 3,400 రూపాయల వరకు పడుతోంది. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. -
సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి దిగి రాగా, టోకు ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయి అయిన 8.39 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలోనూ తగ్గినట్టయింది. ముఖ్యంగా ఏడాదిన్నర విరామం తర్వాత ఒక అంకెకు దిగొచ్చింది. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడాన్ని గమనించాలి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి సమీక్షలో రేట్ల పెంపు ఖాయమే అని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలకు 7 శాతంలోపునకు దిగొస్తుందన్న ఆశాభావాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గత శనివారం వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యంగా గరిష్ట పరిమితి 6 శాతంపైన 9 నెలలపాటు చలిస్తుండడంతో, ఆర్బీఐ తన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. రిటైల్ ధరలు ఇలా... ► సెప్టెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్ట్ నెలలో 6.71 శాతంగా ఉండడం గమనార్హం. ► ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికి పైన రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా పదో నెలలోనూ (ఈ ఏడాది జనవరి నుంచి) జరిగింది. ► ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 7.01గా నమోదైంది. ► కూరగాయలకు సంబంధించి 7.7 శాతానికి దిగొచ్చింది. ► ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది. ► డిసెంబర్ త్రైమాసికంలో 6.5 శాతం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్బీఐ అంచనాగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం – 8.39 శాతం ► ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది. ► కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 17.61 శాతానికి తగ్గింది. ► వరి, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి. ► నూనె గింజలకు సంబంధించి ద్రవ్యోల్బణం మైనస్ 5.36 శాతంగా, మినరల్స్‌కు సంబంధించి 3.86 శాతంగా ఉంది. ► ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి పరిమితం కాగా, తయారీ ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 4.42 శాతంగా ఉంది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
‘ఒయాసిస్’.. పండ్లు, కూరగాయాల్ని శుభ్రం చేసే వాషింగ్ మెషిన్
పండ్ల తోటలు, కూరగాయల తోటల పెంపకంలో పురుగుమందులు, రసాయనాల వినియోగం అందరికీ తెలిసిన సమస్యే! రసాయనాల ప్రభావం ఉందని వాటిని తినడం మానుకోలేం కదా! మరి పరిష్కారం ఏమిటంటే? వీలైనంత వరకు వాటిని శుభ్రంగా కడుక్కోవడమేనని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు అంతకు మించిన పరిష్కారమే అందుబాటులోకి వచ్చింది. పండ్లు, కూరగాయలకు ఒక వాషింగ్ మెషిన్ ప్రత్యేకంగా రూపొందింది. దక్షిణ కొరియాకు చెందిన సియింఘో స్టూడియోకు చెందిన డిజైనర్లు ‘ఒయాసిస్’ పేరుతో ఈ పండ్లు, కూరగాయల వాషింగ్ మెషిన్‌ను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇది అల్ట్రాసోనిక్ వాషింగ్ మెషిన్. పండ్లు, కూరగాయలను ఇందులో వేసి, ఆన్ చేసుకుంటే, దీనిలో వెలువడే అల్ట్రసోనిక్ తరంగాలు వాటిపైన ఉండే ప్రమాదకర రసాయనాలను నిర్వీర్యం చేస్తాయి. ఇందులో వేసి, శుభ్రం చేసుకున్నాక పండ్లు, కూరగాయలు తినడానికి పూర్తి సురక్షితంగా తయారవుతాయి. దీనిని ఇంకా మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంది. -
చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు
రోజూ సాయంకాలం అయ్యిందంటే చాలు పిల్లలు, పెద్దలు ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనుకుంటారు. చిప్స్లాంటి జంక్ ఫుడ్‌ని బయట కొని తింటుంటారు. వాటిలో పోషకాల లేమి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ సౌమ్య మందరపు పోషకాలు పుష్కలంగా ఉండే చిరుతిళ్లను కూరగాయలు, చిరుధాన్యాలతో తయారుచేస్తున్నారు. ఉదయపు అల్పాహారంగానూ బ్రేక్‌ఫాస్ట్ బార్‌ను అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉంటున్న ఈ పోషకాహార నిపుణురాలు చేస్తున్న కృషికి సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు. ‘వరి,గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒకసారి భోజనంగా తీసుకుంటూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు తింటే జీవనశైలి జబ్బులతో బాధపడేవారు నెలరోజుల్లోనే తమ ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు’ అంటున్నారు డాక్టర్ మందరపు సౌమ్య. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన సౌమ్య 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. తన కృషిని సౌమ్య ఈ విధంగా వివరిస్తూ... ప్రకృతి దిశగా ఆలోచనలు ‘‘పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో. ఇంటర్మీడియెట్ తర్వాత ఇష్టంతో న్యూట్రీషియన్ విభాగంలోకి వచ్చాను. డిగ్రీ పూర్తవగానే మా జిల్లాలోనే కృషి విజ్ఞాన కేంద్రంలో వర్క్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో చేరాను. గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణ మన దేశంలోని పల్లె ప్రాంతాల్లో పిల్లలు, గర్భవతులు, మహిళల్లో రక్తహీనత సమస్య ఉందనే విషయం తెలిసిందే. ఈ విషయంగా పల్లె ప్రాంతాల్లో క్యాంప్స్ నిర్వహించాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. పిల్లలు, పెద్దలు ఎంత పోషకాహారం తీసుకోవాలనేది వయసులవారీగా ఉంటుంది. దాని ప్రకారం మనమేం ఆహారం తింటున్నాం, ఎలా ఉంటున్నామనేది పరిశోధనలో భాగంగానే గడిచింది. దీంతో ఎంతోమంది వారు తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పల్లె నుంచి పట్టణ స్థాయి వరకు తెలుసుకున్నాను. చిరుధాన్యాలతో ప్రయోగాలు రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవన విధానం సరిగా లేకుండా వచ్చే మధుమేహం, రక్తపోటు, ఊబకాయం.. వంటి వాటి వల్ల అనారోగ్యం బారినపడుతుంటారు. వీటిలో ముఖ్యంగా ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు.. ఇలా ఆరోగ్యాన్ని పెంచేవాటిని ఎలా సరైన విధంగా తీసుకోవాలో పరిశోధనలు చేశాను. దాదాపు పదహారేళ్లు్ల ఈ విభాగంలో చేసిన వర్క్ నాకు సరైన దిశను చూపింది. మూడేళ్లు చిరుధాన్యాలపైన చేసిన రీసెర్చ్ సంస్థ నెలకొల్పేలా చేసింది. ప్రొటీన్ బార్ ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ పోషకాహారంతో కూడుకున్నదై ఉంటే ఆ రోజంతా చురుగ్గా పనిచేయగలం. ఆ దిశలోనే.. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్‌తో ప్రొటీన్ బార్, బ్రేక్‌ఫాస్ట్ బార్, ఇమ్యూనిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించాను. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నాం. పోషకాల చిరుతిళ్ల తయారీ, సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణా తరగతులను కూడా ఇస్తున్నామ’ని తెలియజేశారు ఈ పోషకాహార నిపుణురాలు. - నిర్మలారెడ్డి -
Sakshi Cartoon: ...కూరగాయలు తింటే, అమ్మితే ఇన్నేళ్లు బతకడం కాదు! పనిచేయడం
...కూరగాయలు తింటే, అమ్మితే ఇన్నేళ్లు బతకడం కాదు! పనిచేయడం వలన బతుకుతున్నాను! -
టమాట ధర పైపైకి
మదనపల్లె : వేసవిలో ఎండలు పెరుగుతున్నట్లుగా మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు మెల్లమెల్లగా పైకి ఎగబాకుతున్నాయి. ఎండ దెబ్బకు కూరగాయల పంటలు వాడిపోవడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా పంటపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో డిమాండ్‌కు సరిపడా సరుకు లభ్యత లేకపోవడంతో మెల్లమెల్లగా ధరలు పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.30 ఉంటే గురువారం ఏకంగా రూ.44కు చేరుకుంది. నెలరోజుల క్రితం పరిస్థితిని పరిశీలిస్తే మార్చి 28న మొదటిరకం కిలో టమాటా రూ.9.20 ఉంది. ఈ లెక్కన వారంరోజుల వ్యవధిలో కిలోకు రూ.14, నెలరోజుల వ్యవధిలో రూ.35 పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో టమాటాకు పెట్టుబడి ఖర్చులు అధికం కావడం, ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్ష వరకు ఖర్చుచేయాల్సి రావడం, ఆశించిన స్థాయిలో «మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు. మార్చి రెండోవారం నుంచి మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆశలు చిగురించిన రైతులు నర్సరీల నుంచి నారును కొనుగోలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో సాగును ఆరంభించారు. పంట చేతికి వచ్చేందుకు 45–50 రోజుల సమయం ఉండటంతో దిగుబడులు పెరిగేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పెరిగిన ఎండలతో టమాటా దిగుబడులు తగ్గడం.. మరోవైపు పొరుగు జిల్లాల నుంచి టమాటాలు మార్కెట్‌కు రాకపోవడంతో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రెండునెలల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఆ యువతి 22 ఏళ్లుగా చికెన్ మాత్రమే తింటోంది.. ఎందుకో తెలుసా!
చికెన్ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చినా, పార్టీకి వెళ్లినా చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అదే చికెన్‌ని రోజు తినాలంటే ఎవరికైనా సాధ్యం కాదు పైగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ మొన్రో అనే యువతి మాత్రం గత 22 ఏళ్ల నుంచి రోజు చికెన్ మాత్రమే తింటోంది. తన రోజువారి డైట్లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయి. అయితే దీనికి కారణం కూడా ఉందని అంటోంది సమ్మర్ మొన్రో. ఆమె మాట్లాడుతూ.. గత 22 ఏళ్ల నుంచి తను పండ్లు తినకున్నా.. కూరగాయలు తినకున్నా చాలా ఆరోగ్యంగా ఉందట. ఎలాంటి సమస్యలు తనకు రాలేదట. మూడు సంవత్సరాల వయస్సులో మెత్తని బంగాళాదుంపలను తినాల్సి వచ్చినప్పుడు ఆమెకు ఫోబియా మొదలైనట్లు చెప్పుకొచ్చింది. సమ్మర్ తన ఫోబియా నుంచి బయటపడేందుకు రెండుసార్లు థెరపీని, హిప్నోథెరపీని ప్రయత్నించింది, కానీ అదేది ఆమెకు సహాయం చేయలేదట. అందుకే తాను పండ్లు, కూరగాయలు తినడం మానేసినట్లు చెప్పింది. అసలు అవి చివరిసారిగా ఎప్పుడు తిన్నానో కూడా తనకు గుర్తులేదని తెలిపింది. అయితే తను పాటిస్తున్న డైట్ తనని ఆరోగ్యంగా ఉంచుతోందని అందుకే.. కేవలం చికెన్‌తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది. -
Weight Loss: గుడ్లు, పప్పుధాన్యాలూ, ఉప్పు కలపని తాజా వెన్న తీసుకుంటే..
శరీరానికి తగినంత శక్తి అందనప్పుడు ఆకలి నియంత్రణలో ఉండదు. దాంతో ఏవి పడితే అవి తినేస్తాం. దీన్ని అదుపులో ఉంచాలంటే.. పొద్దున పూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచు పదార్థాలు, కార్బో హైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆటోమేటిగ్గా మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకుంటాం. గుడ్లు, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలూ వంటివి మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో అసలు కొవ్వే ఉండకూడదనుకుంటారు. ఇది పొరబాటు. శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకూ అవసరమే అంటారు నిపుణులు. లేదంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే మేలుచేసే కొవ్వు పదార్థాలైన బాదం, వాల్నట్స్, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్‌బ్రాన్ ఆయిల్ వంటివి ఎంచుకోవాలి. అలాగే ఉప్పు కలపని తాజా వెన్న కూడా మంచిది. ఆవునెయ్యి తగు మోతాదులో పుచ్చుకోవచ్చు. బరువు పెరగడానికి ప్రధాన కారణం.. మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంక్లిష్ట పిండి పదార్థాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. -
కూరగాయాల దుకాణం నడుపుతున్న కోతి!: వైరల్ వీడియో
In This Video Monkey Sitting At A Vegetable Shop: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. మనుషులను కాపాడిన వీడియోలు, దాడి చేసిన వీడియోలు చూశాం. జంతువులు మనుషులును అనుకరిస్తాయని అందరికీ తెలుసు. కానీ మనుషలు మాదిరిగా వ్యాపారం చేసే జంతువులు గురించి విన్నారా!. విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఒక కూరగాయాల దుకాణంలోకి కోతి చొరబడింది. కూరగాయలమ్ముకునే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కోతి అతని స్థానంలోకి వచ్చి కుర్చొంది. దుకాణదారుడి మాదిరిగా కూరగాయాలు అమ్ముతున్నట్లుగా నటిస్తూనే కూరగాయలను తినేసింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైన సరే కోతి కూరగాయాల దుకాణం నడుపుతుందని అనుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. కాగా మా దగ్గర విపరీతమైన కోతుల బెడద ఉందని.. అవి ఇలా దుకాణంలోకి చొరబడి వస్తువులను పాడుచేయడం లేదా ఎత్తుకుపోవడం చేస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by GNTTV (@goodnewstoday) (చదవండి: ఔను! ఆ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో) -
టీచరమ్మ స్కూలు సేద్యం.. ‘థ్యాంక్స్ టు కోవిడ్’
పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్లు భవిష్యత్ ఫలాలు ఇస్తారు. కాని ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు. బెంగళూరులోని ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కి ఆ ఆలోచనే వచ్చింది. వెంటనే ఆ బడి ఆవరణంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది. ఇంకేముంది... రోజుకు కిలోల కొద్ది పండ్లో, కాయలో, కూరలో దిగుబడికి వస్తున్నాయి. నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు ఇవి. స్కూల్లో తోట పెంచితే రెండు రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఒక రకం యూనిఫామ్ వేసుకున్నవి. ఒక రకం రంగు రంగుల రెక్కలల్లారుస్తూ మొక్కలపై వాలేవి. పిల్లలకు ఏ మంచి చూపినా ఇష్టమే. వారు ఆడమంటే ఆడతారు. పాడమంటే పాడతారు. మొక్కలు పెంచమంటే పెంచుతారు. క్లాసుల్లో వేసి సిలబస్‌లు రుబ్బడమే చదువుగా మారాక పిల్లలకు బెండకాయ చెట్టు, వంకాయ మొలకా కూడా తెలియకుండా పోతున్నాయి. ‘థ్యాంక్స్ టు కోవిడ్’ అంటారు సుశీలా సంతోష్. ఆమె బెంగళూరులోని ఎలహంకలో ఉన్న విశ్వ విద్యాపీఠ్ స్కూల్‌కు డైరెక్టర్. ఆ స్కూల్‌కు మరో రెండు క్యాంపస్‌లు ఉన్నా ఎలహంక బాధ్యతలు చూస్తున్న సుశీలా సంతోష్ చేసిన పని ఇప్పుడు తీగలు, పాదులుగా మారి స్కూల్‌ను కళకళలాడిస్తూ ఉంది. ‘2021 మార్చి ఏప్రిల్ నుంచి లాక్డౌన్ మొదలయ్యింది. 1400 మంది పిల్లలు చదివే క్యాంపస్ మాది. మధ్యాహ్నం భోజనాలు మా స్కూల్లోనే చేస్తారు. కనుక స్టాఫ్ ఎక్కువ. కాని లాక్డౌన్ వల్ల బస్ డ్రైవర్లు, ఆయాలు, వంట మాస్టర్లు, అడెండర్లు అందరూ పనిలేని వారయ్యారు. వారంత చుట్టుపక్కల పల్లెల వారు. పని పోతుందేమోనని భయపడ్డారు. కాని వారిని మేము తీసేయ దలుచుకోలేదు. అలాగని ఖాళీగా పెడితే వారికి కూడా తోచదు. అలా వచ్చిన ఆలోచనే ఆర్గానిక్ ఫార్మింగ్. స్కూలు తోట. పదండి... ఏదైనా పండిద్దాం అన్నాను వారితో. అప్పుడు చూడాలి వారి ముఖం’ అంటుంది సుశీలా సంతోష్. స్కూలులో ప్రెయర్ గ్రౌండ్ తప్ప మిగిలిన ఏ ప్రదేశమైనా పంట యోగ్యం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. ‘ఇంతకు ముందు వీరిలో కొందరికి సేద్యం తెలుసు కనుక మా పని సులువయ్యింది’ అంటారు సుశీల. ఆమె సారధ్యంలో స్కూల్ పెరడు, బిల్డింగుల మధ్య ఉన్న ఖాళీ స్థలం, కాంపౌండ్ వాల్స్‌కు ఆనుకుని ఉండే నేల... ఇంకా ఎక్కడెక్కడ ఏ స్థలం ఉన్నా అదంతా కాయగూరలు, పండ్ల మొక్కలు, ఇవి కాకుండా 40 రకాల హెర్బల్ ప్లాంట్లు వేసి వాటి బాగోగులు చూడటం మొదలెట్టారు. ‘మాకు చాలా పెద్ద కిచెన్ ఉంది. దాని టెర్రస్‌ను కూడా తోటగా మార్చాం’ అన్నారు సుశీల. స్కూలులోపల ఉన్న నీటి వ్యవస్థనే కాక వంట గదిలో వాడగా పారేసే నీటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ (ఆ నీరు అరటికి చాలా ఉపయోగం) 200 అరటి చెట్లు పెంచడం మొదలెట్టారు. ఇవి కాకుండా ఆకు కూరలు, కాయగూరలు, క్యారెట్, క్యాబేజీ వంటివి కూడా పండించ సాగారు. ‘మూడు నెలల్లోనే ఏదో ఒక కాయగూర కనిపించడం మొదలెట్టింది. స్టాఫ్ మధ్యాహ్న భోజనానికి వాడగా మిగిలినవి చుట్టుపక్కల వారికి పంచడం మొదలెట్టాం. మరి కొన్నాళ్లకు మేమే వాటితో వండిన భోజనాన్ని కోవిడ్ పేషెంట్స్‌కు సాధారణ రేట్లకు అమ్మాం. ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకు కాబట్టి సంతోషంగా తీసుకున్నారు. మా స్టాఫ్‌కు ఇదంతా మంచి యాక్టివిటీని ఇచ్చింది’ అంటారు సుశీల. ఈ సంవత్సర కాలంలో స్కూలు ఆవరణలో సీజనల్ పండ్లు, కాయగూరలు స్కూల్ స్టాఫ్ తమ అనుభవం కొద్దీ పండిస్తూ స్కూలు ఆవరణను ఒక పంట పొలంలా మార్చారు. ‘ఇప్పుడు స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. వారిని మేము ఈ సేద్యంలో ఇన్వాల్వ్ చేయదలిచాం. స్కూల్ కొరికులం కూడా ఆ మేరకు మార్చాం. పిల్లలకు పంటల గురించి తెలియాలి. తమ తిండిని తాము పండించుకోవడమే కాదు నలుగురి కోసం పండించడం కూడా వారికి రావాలి. మార్కెట్లోని తట్టలో కాకుండా కళ్లెదురుగా ఉంటే మొక్కకి టొమాటోనో, తీగకి కాకరో వేళ్లాడుతూ కనిపిస్తే వాళ్లు పొందే ఆనందం వేరు’ అంటారు సుశీల. మన దగ్గర కూడా చాలా స్కూళ్లల్లో ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది. ‘స్కూలు సేద్యం’ కొంత మంది టీచర్లు ప్రోత్సహిస్తుంటారు. కాని ప్రతి స్కూల్లో సుశీల లాంటి మోటివేటర్లు ఉంటే సిబ్బంది పూనుకుంటే ప్రతి స్కూలు ఒక సేంద్రియ పంటపొలం అవుతుంది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరం అవుతుంది. ఇలాంటి స్కూళ్లను గ్రీన్ స్కూల్స్ అనొచ్చేమో. -
హైదరాబాద్‌లో నో‘టమాటా’ రావట్లే.. అంత వద్దు ‘అర కిలో చాలు’
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు టమాటా రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. ఆరేడు క్వింటాళ్లకు మించకపోవంతో రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడం, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నగరంలోని బహిరంగ మార్కెట్లో ట‘మోత’ మోగుతోంది. ప్రస్తుతం సైజు, కలర్‌ను బట్టి కేజీ ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. (చదవండి: Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు?) రైతుకు నష్టం.. కొనుగోలు కష్టం.. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14,173.05 ఎకరాల్లో కూరగాయల సాగవుతోంది. ఇందులో 5,827.03 ఎకరాల్లో టమాటా వేశారు. ఇటీవల ఏకధాటి వర్షాలతో పంట చేలోనే కుళ్లిపోయింది. టమాటా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోయే ప్రమాదం ఉండటంతో వచ్చిన పంటను వచ్చినట్లే మార్కెట్‌కు సరఫరా చేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో ప్రస్తుతం ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. అవసరం కొండంత.. దిగుబడి గోరంత.. ► గ్రేటర్లో రోజుకు సగటున 350 నుంచి 380 టన్నుల టమాటా అవసరమవుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రంగారెడ్డి సహా ఇతర శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఆధించిన స్థాయిలో దిగుమతి కావడం లేదు. నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, మాదన్నపేట, ఎర్రగడ్డ, ఎల్బీనగర్ మార్కెట్లకు రోజుకు సగటున 150 నుంచి 180 టన్నులకు మించి రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► కేవలం టమాటా మాత్రమే కాదు బీర, కాకర, బెండ, మిర్చి, దోస, సోర వంటి కూరకాయలు, పాలకూర, తోటకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర్ వంటి ఆకుకూరల దిగుబడి కూడా భారీగా పడిపోయింది. ఫలితంగా ఆయా కూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. నవంబర్ మొదటివారంలో కేజీ కాయకూరల ధరలు సగటున రూ.20 నుంచి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60పైగా ఉంది. ఆకుకూరలు రూ.10కి నాలుగు నుంచి అయిదు కట్టలు ఇస్తే.. ప్రస్తుతం అంతే మొత్తానికి రూ.20కిపైగా చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే) అర కేజీతో సరిపెట్టుకుంటున్నాం.. మార్కెట్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. సాధారణ రోజుల్లో కేజీ రూ.10 నుంచి రూ.20కే వచ్చేది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. ఈ ధరను పెట్టి కొనడం కష్టం. తాత్కాలికంగా వినియోగాన్ని తగ్గించాం. గతంలో వారానికి రెండు కేజీలు కొంటే..ప్రస్తుతం అరకేజీతో సరిపెట్టుకుంటున్నాం. – చౌహాన్ లక్ష్మి, బడంగ్పేట్ పంట చేతికొచ్చే దశలోనే.. నేను రెండెకరాల్లో టమాటా సాగు చేశా. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని భావించాను. తీరా కాయ కోతకొచ్చే దశలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా చెట్టుకున్న కాయలు నేలకు ఆనుకుని ఉండటంతో వాటికి మచ్చలు ఏర్పడ్డాయి. బూజు పట్టి పాడైపోయాయి. చేను మొత్తం వెతికి ఏరినా ఒక డబ్బా నిండటం లేదు. తెంపిన కాయకు కూడా మచ్చలు ఉండటంతో వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. – యాట అంజయ్య, జాపాల గ్రామం -
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే!
లక్నో: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే ఈయన ఇటీవల రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతూ ఉన్న ఒక ఫోటోను తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో అప్పటి నుంచి ఈ ఫోటో నెట్టింట్టా హల్చల్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక ఉన్నత అధికారి అయి ఉండి ఇలా సామాన్యుడిలా రోడ్డుపై కూరగాయలమ్మడాన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! అయితే తాజాగా ఈ ఫోటోపై సదరు ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా స్పందించారు.. కూరగాయలు దుకాణం వద్ద కూర్చున్న ఫోటో నిజమే.. కానీ తాను కూరగాయలు అమ్మలేదని, కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లానని స్పష్టం చేశారు. ‘నేను వృత్యిరీత్యా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లినప్పుడు, అక్కడ మార్కెట్లో ఆగి కూరగాయలు కొన్నాను. అయితే కూరగాయలు అమ్మే ఓ ముసలామే కాసేపు ఆమె కూరగాయల షాప్ వద్ద కూర్చోవాలని అడిగింది. దీంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆమె అడిగినదానికి కాదనలేకపోయా. అక్కడే కాసేపు కూర్చున్నాను. ఈ లోగా కొందరు అక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫోన్ ద్వారా ఫేస్బుక్లో పెట్టారు. నేను కూడా ఆ ఫోటోను ఈ రోజే చూశాను’ అని అఖిలేశ్ మిశ్రా వివరించారు. చదవండి: పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్! -
Leaf Vegetable: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారా?
సాక్షి, అమరావతి: దేశంలో నూటికి 80 శాతం మంది కౌమార దశలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేదలే. ఇవి ప్రైవేటు సంస్థలో, వ్యక్తులో చెప్పిన మాటలు కాదు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే యూనిసెఫ్ భారతదేశానికి సంబంధించి ఇటీవల ఇచ్చిన నివేదిక. మారుతున్న రోజులకు ఇదో సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు అనేక పరిష్కార మార్గాలు మన చేతుల్లోనే ఉన్నా వాటిని చిన్నచూపు చూస్తున్న ఫలితమే ఈ దుర్గతి అని ఆహార నిపుణులు ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో పోషకాహార లేమిని తరిమి కొట్టేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ నిపుణులు అనేక పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిల్లో అత్యంత ఆచరణాత్మకమైంది పెరటి తోటల పెంపకం. పెరటి తోటలకు పెరిగిన గిరాకీ పోషకాహార లోపం, కాలుష్యం, హిడెన్ హంగర్ (పౌష్టికాహర లేమి)కు ఏదీ అతీతం కాకపోవడంతో ఇటీవలి కాలంలో పెరటి తోటలకు బాగా గిరాకీ పెరిగింది. పోషకాహారలోప నివారణలో వీటి పాత్ర కీలకమైంది. ఆహార ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంలోనూ అదేస్థాయిలో ఉంది. పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాలను, కూరగాయల లభ్యతను, ధరలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన కూరగాయలను ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేందుకు ఈ పోషకాహార పెరటి తోటలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయన ఎరువులు, సస్యరక్షణ, కలుపు నివారణ మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవడం అనివార్యమని శాస్త్రవేత్తలు సైతం సలహా ఇస్తున్నారు. ఒక్కో మనిషికి ఎన్నెన్ని గ్రాములు కావాలంటే.. సగటున ప్రతి మనిషికి రోజుకు కనీసం 85 గ్రాముల పండ్లు, 75 నుంచి 125 గ్రాముల ఆకుకూరలు, 85 గ్రాముల ఇతర కూరగాయలు, 85 గ్రాముల దుంప కూరలు కావాలి. ఇలా తీసుకున్నప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలు సమకూరతాయి. ప్రస్తుత లెక్క ప్రకారం ఇంతకన్నా తక్కువ తీసుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఆకుకూరలకు రోజువారీ ఆహారంలో చోటు తక్కువైంది. ఫలితంగా విటమిన్ల లోపం ఏర్పడుతోంది. విటమిన్–ఎ లోపంతో రేచీకటి వస్తుంది. ఐరన్ లోపంతో రక్తహీనత వస్తుంది. దాదాపు సగంమంది మహిళలు, పిల్లలు, యుక్త వయస్కులు రక్తహీనతతో బాధపడుతున్నారు. విటమిన్–బి లోపంతో ఆకలి మందగించడం, నోటిచివర పగుళ్లు, నాలుకపై పూత వస్తాయి. ఈ లోపాలను నివారించాలంటే ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే లెక్క ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన పోషకాహారం అందడంలేదు. 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లల్లో విటమిన్–ఎ లోపం తీవ్రంగా ఉంది. కూరగాయల వినియోగం తక్కువగా ఉంది. పెరటి తోటల్లోని ఆకుకూరలతో.. పోషకాహార పెరటి తోటలు పెంచడం వల్ల కుటుంబ ఆరోగ్యం బాగవుతుంది. దీనికి కావాల్సిందల్లా ఆసక్తే. చాలామందికి పెరళ్లు ఉంటాయి. లేనివారు కుండీల్లోను పెంచుకోవచ్చు. ఏడాది పొడవునా బెండ, వంగ, టమోటా, మిరప, పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి, సిర్రాకు, నిమ్మ, జామ, అరటి, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి వాటిని పెంచుకోవచ్చు. అదనపు ఆదాయం పొందవచ్చు. ఇవి పోషకాహార లోపాన్ని నివారిస్తాయి. ఇళ్లల్లో మనకున్న స్థలాన్ని చిన్న మడులుగా విడగొట్టి తీగ జాతి కూరగాయలను కంచె మీదికి పాకించవచ్చు. దంప కూరలను గట్లపై పెంచవచ్చు. పండ్ల చెట్లను పెరట్లో ఏదైనా మూలగా వేసుకోవచ్చు. పెరట్లోనే ఒక పక్క కంపోస్టు గుంతను ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్నే ఉపయోగించుకోవచ్చు. బయటి నుంచి నారు తెస్తే 3, 4 వారాల మధ్య నాటుకోవాలి. నాటే సమయంలో 2, 3 గంపల పశువుల ఎరువులు వేయాలి. ఉపయోగాలు ఏమిటంటే.. కూరగాయల వినియోగం పెరిగితే పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపాలను నివారించుకోవచ్చు. కుటుంబ ఆహార అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా కూరగాయలతో పోషకాలు మెండుగా వస్తాయి. వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు సరేసరి. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ పోషకాహార తోటలు పెంచుకోవడానికి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఇళ్లల్లో పెంచుకోవడానికి ఆకుకూరల విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నట్లు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానశాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.విజయలక్ష్మి, డాక్టర్ కె.మల్లికార్జునరావు, బి.గోవిందరాజులు తెలిపారు. -
ఈ బ్యాగులు చూస్తే కొనాలని కాదు..తినాలనిపిస్తాయ్!
ఖరీదైన బ్రాండ్ ‘హమీజ్’ సంస్థ రొటీన్‌కు భిన్నంగా అంటే లెదర్‌తో కాకుండా కూరగాయలతో బ్యాగ్‌లను తయారు చేసింది. ధరా రొటీన్‌కు భిన్నమే. ధరే ప్రకటించకపోవడం. కారణం అమ్మకానికి కాకుండా ఆసక్తికోసం తయారైన బ్యాగ్‌లు కావడం. ప్యారిస్‌కు చెందిన డిజైనర్ బెన్ డెన్జర్.. తాజా కీరా, బ్రొకొలీ, క్యాబేజ్, యాపిల్‌తో కొన్ని బ్యాగులను రూపొందించాడు. వాటిని హమీజ్ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నోరూరించే కళాత్మకమైన హమీజ్ బ్యాగ్‌లు’ అంటూ పోస్ట్ చేసింది. దాంతో అవి ఆ బ్రాండ్ న్యూడిజైనర్ బ్యాగ్స్ అనుకొని కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. తర్వాత ఆ బ్యాగులు అమ్మకానికి పెట్టినవి కాదని తెలిసి నిరాశ పడ్డారు. ఈ వ్యవహారమంతా వైరల్‌గా మారింది. ఊహించని ఆ స్పందనను గుర్తించి త్వరలోనే ఈ డిజైనర్ బ్యాగ్‌లను అందిస్తామని హమీజ్ సంస్థ ప్రకటించడం కొసమెరుపు. -
‘కూరగాయల’ కోసం పొడుచుకున్న స్నేహితులు
హైదరాబాద్: ఇద్దరు కలిసి ఒకే పరిశ్రమలో పని చేస్తుండడంతో వారిద్దరూ కలిసి ఒక గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో వంటావార్పు చేసుకుని తింటూ పనికి వెళ్తున్నారు. అయితే రూమ్‌లో పనులు చెరి సగం చేసుకోవాల్సిన విషయంలో ఇద్దరి అభిప్రాయ బేధాలు వచ్చి చంపుకునే దాక చేరాయి. తాజాగా కూరగాయలు కోయమని మిత్రుడిని అడగా అతడు పెడచెవిన పెట్టడంతో వివాదం మొదలైంది. అటు నుంచి గొడవ పెద్దదై అదే కత్తితో పొడిచే స్థాయికి చేరింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక హెచ్‌పీ రోడ్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైతాస్ ఆలి సల్మాన్, ఫిరోజ్ ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలల నుంచి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో గదికి వారిద్దరు వచ్చారు. వంట కోసం కూరగాయలు కట్ చేసి ఇవ్వమని మైతాస్ ఆలి కోరగా సల్మాన్ ఫిరోజ్ పట్టించుకోలేదు. దీంతో కూరగాయలు కట్ చేసే కత్తితో సల్మాన్ ఫిరోజ్‌పై దాడి చేశాడు. దీంతో ఫిరోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఫిరోజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి
► కొంతమందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. ► కొవ్వును కరిగించేందుకు గుమ్మడి కాయ తీసుకోవడం మంచిది. మంచి గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఫలితాలనిస్తుంది. ► ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట. ► కాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యంగా అరికడతాయి. ► అదేవిధంగా వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం కూడా కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజంను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది. ► ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవడమూ శరీరంలోని అదనపు కొవ్వు ను కరిగించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ చదవండి: ఫోడ్మ్యాప్ ఆహారం అంటే..? ఈ ఆహారంతో అస్తమాకు చెక్! -
కొత్త రకం కూరగాయ.. కేజీ రూ.లక్ష మాత్రమే
పట్నా: మన దేశంలో అత్యంత విలువైన వృత్తి.. అధికంగా నష్టాలు మిగిల్చే పని ఏదైనా ఉందా అంటే అది వ్యవసాయం మాత్రమే. ఆరు గాలం కష్టపడి.. కన్న బిడ్డలా పంటను కాపాడి.. శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు.. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ.. మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా పంటలు పండించే వారికి సేద్యం కనక వర్షం కురిపిస్తుంది. అలాంటి కోవకు చెందినదే ఈ కథనం. సంప్రాదాయ పంటలతో విసిగిపోయిన ఓ రైతు కొత్త రకం కూరగాయను పండించాడు. ప్రస్తుతం అది కేజీ అక్షరాల లక్ష రూపాయలకు అమ్ముడవుతోంది. నమ్మలేకపోయినప్పటికి ఇది మాత్రం వాస్తవం. మరి ఆ పంట ఏంటో.. సాగు విధానం తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన చెందిన అమ్రేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు సంప్రదాయ పంటలను సాగుచేసి విసిగివేసారి పోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది తన పంథా మార్చిన అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ అనే కూరగాయను సాగుచేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా ‘హాప్ షూట్స్’కు పేరుంది. మన కొనే కూరగాయల మాదిరి దీని ధర కేజీకి పదులు, వందల రూపాయలు ఉండదు. ‘హాప్ షూట్స్’ కిలో ధర కనిష్టంగా 85,000 రూపాయలు ఉంటుంది. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కిలో లక్ష రూపాయల వరకూ పలుకుతుంది. ఈ కూరగాయ సాగుకు తన సొంత పొలాన్ని సిద్ధం చేసిన అమ్రేష్ రూ.2.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి కూడా ఆశించిన విధంగానే ఉంది. ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు వాడకుండా అమ్రేష్ ఈ పంటను పండించడం విశేషం. ‘హాఫ్ షూట్స్’ శాస్త్రీయ నామం హ్యుములస్ లుపులస్. ఈ కూరగాయ మొక్కలను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పెంచుతున్నారు. అమ్రేష్ కూడా తన పొలంలో ఈ మొక్కలను నాటేందుకు అక్కడి నుంచే తెచ్చాడు. ఈ మొక్కకు పూచే పూలను ‘హాప్ కాన్స్’ అంటారు. బీర్ తయారీలో వీటిని వాడతారు. ఈ మొక్క కొమ్మలను పొడిగా చేసి మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు. అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ పండిస్తున్న విషయాన్ని సీనియర్ బ్యూరోక్రాట్, ఐఏఎస్ సుప్రియా సాహు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వ్యవసాయంలో ఓ కొత్త ప్రయత్నం చేసిన అమ్రేష్‌ను ఆమె అభినందించారు. అమ్రేష్ ప్రయత్నం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయంలో రైతులు అధిక మొత్తంలో లాభాలు గడించేందుకు వీలవుతుందని సుప్రియ ఆశించారు. ‘హాప్ షూట్స్’ సాగు చేసిన పొలంలో ఉన్న అమ్రేష్ ఫొటోలను సుప్రియా ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. One kilogram of this vegetable costs about Rs 1 lakh ! World's costliest vegetable,'hop-shoots' is being cultivated by Amresh Singh an enterprising farmer from Bihar, the first one in India. Can be a game changer for Indian farmers 💪https://t.co/7pKEYLn2Wa @PMOIndia #hopshoots pic.twitter.com/4FCvVCdG1m — Supriya Sahu IAS (@supriyasahuias) March 31, 2021 హిమాచల్ ప్రదేశ్‌లో ఈ కూరగాయలను పండించే ప్రయత్నం చేశారని, కానీ.. సరైన మార్కెటింగ్ లేక రైతులు మళ్లీ సంప్రదాయ పంటల వైపే మొగ్గుచూపారని అమ్రేష్ చెప్పాడు. ‘హాప్ షూట్స్’ యాంటీ బాండీస్ ఏర్పడేందుకు కూడా తోడ్పడతాయని.. టీబీతో బాధపడుతున్నవారు ఈ కూరగాయను తినడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు, ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను, లుకేమియా కణాలను ఈ కూరగాయలో ఉడే యాసిడ్స్ నిరోధించగలవని తేలింది. చదవండి: స్పెయిన్ చెబుతున్న ‘రైతు’ పాఠం శారదకు అండగా ‘టిటా’ -
ఈ ఐటీ బాబులకు ఆదివారం సెలవు లేదు!
బంజారాహిల్స్ (హైదరాబాద్): పత్రికల్లో, టీవీల్లో రైతుల బాధలను నిత్యం చూస్తుంటాం. కానీ అయ్యో అని నిట్టూర్చకుండా హైదరాబాద్‌లోని కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ వంతు సాయం చేయాలని భావించారు. రైతుల నుంచి కూరగాయలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మి, వచ్చిన డబ్బులను వారికే ఇస్తున్నారు. ఇందుకోసం 250 మంది సభ్యులుగా ఉన్న ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ (ఫర్ ఐటీ) రైతులకు అండగా ఉంటోంది. 2007లో ఏర్పడిన ఈ ఫర్ఐటీ.. తొలుత ఐటీ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసేది. ఆ తర్వాత సామాజిక బాధ్యత వైపు అడుగులు వేసింది. తాజాగా టమాటా రైతులకు గిట్టుబాటు ధర రాక.. కిలో టమాటా రెండు రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని తెలుసుకున్న ఈ బృందం.. నల్లగొండలోని రైతులకు సాయం చేయాలని భావించింది. ఇందుకోసం రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం డబ్బును రైతులకే అందజేస్తున్నారు. హైదరాబాద్‌లో 9 చోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేసి కిలో టమాటాను రూ.15కు విక్రయిస్తున్నారు. ఇలా రెండు రూపాయలకే అమ్ముకునే రైతుకు ఏకంగా రూ.15 వచ్చేలా చేస్తున్నారు. టమాటా మాత్రమే కాకుండా నిమ్మకాయలు, పుచ్చకాయలు, సోరకాయలు, ఆకు కూరలు కూడా తెచ్చి అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలీ, అలకాపురి కాలనీ, జేఎన్టీయూ, బీహెచ్ఈఎల్, రాజేంద్రనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో విక్రయించి రైతులకు బాసటగా నిలవడమే కాకుండా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరి ప్రోత్సాహం మరవలేనిది నేను 6 ఎకరాల్లో టమాటా పంట వేశాను. గిట్టుబాటు లేకుండా పోయింది. ఆ సమయంలోనే హైదరాబాద్ నుంచి 30 మంది యువకులు వచ్చి నా టమాటాలను లారీల్లో తీసుకెళ్లి హైదరాబాద్‌లో కిలో రూ.15కు అమ్మి పెట్టారు. నాలాగే ఇంకా కొందరు రైతుల నుంచి కూడా కూరగాయలు తీసుకున్నారు. పైసా ఆదాయం లేకుండా రవాణా ఖర్చులు కూడా వారే భరించారు. – నాగమణి, రైతు మరిన్ని చోట్ల విక్రయిస్తాం లాక్డౌన్లో మా సభ్యులకు వచ్చిన ఆలోచన ఇది. చాలా చోట్ల ఎక్కువ ధరకు టమాటాలు, కూరగాయలు విక్రయిస్తున్నారని తెలుసుకొని రైతులకు ఉపయోగపడేలా మేమే వెళ్లి కూరగాయలు తీసుకొచ్చాం. మేం తె చ్చిన తాజా కూరగాయలు అందరికీ నచ్చాయి. అందుకే కూరగాయల బ జార్లు ఏర్పాటు చేసిన నాలుగైదు గం టల్లోనే అమ్ముడుపోయేవి. రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల విక్రయిస్తాం. – కిరణ్ చంద్ర, ఫర్ ఐటీ సంస్థ అధ్యక్షుడు రవాణా ఖర్చులు మేమే భరిస్తాం రైతుల నుంచి కూరగాయలు తీసుకొచ్చే క్రమంలో రవాణా ఖర్చులన్నీ మా సంస్థే భరించింది. గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న ఇబ్బందులపై మేం చర్చించుకున్నాం. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. నల్లగొండ జిల్లా హాలియా, కట్టంగూర్ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి నేరుగా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించాం. రైతుకు కూడా తగిన గిట్టుబాటు ధర లభించింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తాం. – ప్రవీణ్ చంద్రహాస్, జనరల్ సెక్రటరీ ఫర్ ఐటీ -
ఇవే ఇమ్యూనిటీ బూస్టర్స్...
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్–19 లేదా కరోనా వైరస్ దాటికి గజగజ వణికిపోతుంది. దీనికితోడు వర్షాకాలం, చలికాలం రాబోతున్న సమయంలో మరిన్ని సాంక్రమిక వ్యాధులు పెచ్చురిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో వ్యాధులు వచ్చాక చికిత్స కన్నా, నివారణ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏంతింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది? ఏవి తినాలి? ఏవి తినకూడదు?.. చూద్దాం... రోగనిరోధక శక్తిని పెంచడంలో ఏ, బీ, సీ, డీ, ఈ విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటికి కనిపించని హానికారక సూక్ష్మ జీవుల కారణంగా సంక్రమించే అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఏ దోహదపడుతుంది. విటమిన్ సీ, బీటా కెరోటిన్, ఈ, డీ విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఈ పోషకాలన్నీ మన శరీరానికి చేరతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మోతాదుకు మించి పోషకాలు తీసుకున్నా ఇతర రకాల సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ దొరుకుతాయి? ప్రధానంగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి. అందువల్ల వీటన్నింటిని దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో పోషకాలు అధికంగా లభిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసి వండి ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు. కార్బోనేటెడ్ శీత పానీయాలు తాగకూడదు. వీటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు మోతాదుకు మించి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఏవీ ఉండవు. మాంసం, గుడ్లు వంటి ఆహారాలను బాగా ఉండికించిన తర్వాతే తినాలి. పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్‌తో కడుక్కోవాలి. లేదంటే వాటి మీద ఉన్న సూక్ష్మజీవులు మన శరీరంలోకి సులభంగా ప్రవేశించి వివిధ అనారోగ్యాలను కలుగచేస్తాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక వ్యక్తి రోజుకి 30 గ్రాములకు మించి నూనెను, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. చక్కెరలో కెలరీలు తప్పించి పోషకాలు ఏవీ ఉండవు. అందువల్ల చక్కెరను మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఈ అలవాట్లు ఉన్న వారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వీటిని మానేయాలి. మరీ ముఖ్యంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి. నీరు శరీర ఉష్ణోగ్రతలను సమ స్థితిలో ఉంచడంతోపాటు. శరీరంలో వ్యర్థాలను స్వేదం, మూత్రం ద్వారా బయటకు పంపి మన శరీరాన్ని స్వచ్చగా ఉంచుతుంది. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితోపాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్లు ఏ, ఈలు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకునేందుకు ఇవి ఎంతగానో సాయపడతాయి. నారిజం, నిమ్మ, బత్తాయి, బెర్రీ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతున్న వారు ఇప్పటిదాక వాడుతున్న మందులను వాడుకుంటూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కేవలం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే కాకుండే ఎవరైనా సరే మానసిక ఒత్తిడి లేకుండా చూసుకుంటూ, రోజూ సమతుల ఆహారం తీసుకోవాలని, అప్పుడు ఆటోమేటిగ్గా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణుల మాట!. -
ఒక్కో పల్లె వెరైటీ..
వ్యవసాయ భూములకు సమీపంలో స్వర్ణముఖి నది.. సాగునీటికి ఇబ్బంది లేదు. రైతులంతా ముందస్తుగా మాట్లాడుకుంటారు. ఏ పంటలు వేయాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో గ్రామంలో ఒక్కో రకం సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రస్తుతం పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న పరిస్థితి ఉంది. సాక్షి, పెళ్లకూరు: మండలం నదీ తీర ప్రాంతం కావడంతో ఇక్కడి భూములు సారవంతంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆకుకూరలు, కూరగాయలు తోటలు విస్తారంగా వేస్తున్నారు. ప్రధానంగా వంగ, బెండ, బీర, చిక్కుడు, కాకర, టమోటా, ముల్లంగి, ఉల్లిపాయలు, మిర్చి, గోంగూర, తోటకూర, చిర్రాకు, పాలకూర తదితరాలు సాగులో ఉన్నాయి. ప్రతి ఏడాది రైతులంతా కలిసి పంటల ఎంపికపై చర్చించుకుంటారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. టమోటా, కాకర, బీర తదితర పంటలను అల్లిక విధానంలో సాగుచేసి మేలు రకం దిగుబడులు సాధిస్తున్నారు. లాభాల బాటలో.. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలకే పరిమితమైన మిర్చి సాగు ఇప్పుడు మండలంలోని కానూరు, తాళ్వాయిపాడు, రోసనూరు, చావలి, చెంబడిపాళెం, దొడ్లవారిమిట్ట, పెన్నేపల్లి తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. ఉద్యానవన శాఖ అధికారుల రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో మంచి గిరాకీ ఉన్న మిర్చి రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు చెన్నై, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. విరివిగా.. ఈ ప్రాంత రైతులు పంటల మార్పిడి విధానంతో మొక్కజొన్న పంటను విరివిగా సాగు చేస్తున్నారు. చెంబడిపాళెం, చావలి గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న పంటపై ఆసక్తితో మేలురకం విత్తనాలు ఎంపిక చేసుకుని సాగుకు శ్రీకారం చుట్టారు. పంటను నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తరలించి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. భూసారం పెంచడంలో.. ఇక్కడి రైతులు సాగు భూముల్లో భూసారాన్ని పెంచడంలో వారికివారే సాటి. ఏడాదంతా పంటలు సాగు చేసే ఇక్కడి రైతులు పంటకు పంటకు మధ్య వ్యవధిలో పచ్చిరొట్ట పంటలు జీలుగ, జనుము, పిల్లిపెసర తదితర వాటిని వేయడం, వేరుశనగ ఆకులను పరచడంతోపాటు ఎక్కువుగా సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. అలాగే అంతర పంటల సాగుతో భూసారం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుబాటులో నర్సరీ తాళ్వాయిపాడు గ్రామానికి చెందిన కట్టా బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మొక్కల నర్సరీని నిర్వహించడం రైతులకు అనుకూలమైంది. గతంలో చిత్తూరు, పీలేరు, మదనపల్లి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లి వంగ, మిరప తదితర మొక్కలను తెచ్చుకునేవారు. ప్రస్తుతం అందుబాటులో నర్సరీ ఉండడమే కాకుండా కేవలం ఒక్క రూపాయికి ఒక మొక్కను విక్రయించడం విశేషం. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో బాలసుబ్రహ్మణ్యం నర్సరీని ఏర్పాటు చేసి వంగ, బెండ, టమోటా, బంతి, చిక్కుడు, బీర, కాకర పలు రకాల మొక్కలను ట్రే సాగు పద్ధతిలో పెంచి రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో ఇక్కడి సామాన్య రైతులు నారు పోసుకోవడానికి ఇబ్బంది లేకుండా తక్కువ ధరపై మొక్కలను తెచ్చుకుని సాగు చేస్తున్నారు. బంతి సాగు శిరసనంబేడు, రాజుపాళెం, తాళ్వాయిపాడు గ్రామాల్లోని నిమ్మ తోటల్లో అంతర పంటగా బంతి సాగు చేస్తున్నారు. ఇక్కడి మెట్ట భూముల్లో భూ సారం పెంపొందించేందుకు దుక్కి చేసి దానికి వర్మీ కంపోస్టు ఎరువును మొక్కల కుదుళ్లలో వేసి నీరు పెట్టడంతో మొక్కలు బాగా పెరిగి నాణ్యమైన పువ్వులతో తోట కళకళలాడుతుంది. బంతి పంటకు ఆకుముడత తెగులు రాకుండా తేలికపాటి రసాయన మందులను పిచికారీ చేస్తూ తెగుళ్ల బారి నుంచి రక్షించుకుంటున్నారు. సాగు ప్రారంభం నుంచి ఒక ఎకరానికి సుమారు రూ.60 వేలు పెట్టుబడి పెడుతున్నారు. విక్రయం ఇలా.. జాతీయ రహదారి మార్గంలో రోడ్డుపక్కనే పలుచోట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని వాహనచోదకులకు, ప్రయాణికులకు కూరగాయలు, ఆకుకూరలను విక్రయిస్తున్నారు. తాజాగా లభిస్తుండడంతో అధిక సంఖ్యలో ప్రజలు, ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాయితీపై.. మండల వ్యవసాయ శాఖ గతేడాది 916.50 క్వింటాళ్ల జీలుగలు, 30 క్వింటాళ్ల జనుము, 112 క్వింటాళ్లు పిల్లిపెసర రాయితీపై రైతులకు అందించారు. అలాగే ఈ ఏడాది జీలుగలు 625 క్వింటాళ్లు, జనుములు 20, పిల్లిపెసర 225 క్వింటాళ్లు రాయితీపై పంపిణీ చేశారు. ఇంకా చిల్లకూరు సహకార సంఘం నుంచి రూ.48 లక్షలకు పైగా యూరియా, డీఏపీ, పొటాష్ తదితర ఎరువులను రైతులకు విక్రయించారు. కంపోస్టు ఎరువులు తయారు చేసుకుంటాం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగిస్తాం. వర్మీకంపోస్టు ఎరువులను స్వయంగా తయారు చేసుకుంటాం. – సీహెచ్ మార్కండేయ, రైతు, చెంబడిపాళెం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం మిర్చి, బెండ, వంగ, కాకర తదితర పంటలను ఎక్కువగా సాగు చేయడం జరుగుతోంది. నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, చెన్నై, బెంగుళూరు పట్టణాలకు పంటను తరలిస్తున్నాం. – ఎం ప్రకాష్, రైతు, చావలి -
కూరగాయల విషయంలో గొడవ.. భర్త మృతి
పాలకొండ రూరల్ : కూరగాయల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన తగాదాతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) ఈశర్ల రామకృష్ణ (35) ఈ నెల 25వ తేదీ రాత్రి మృతి చెందారు. పాలకొండ గాయత్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపటాపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణకు 2008లో నిర్వహించిన మెగా డీఎస్సీలో పీఈటీగా ఉద్యోగం లభించింది. 2017లో వీరఘట్టం పట్టణానికి చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వీరికి మూడేళ్లలోపు ప్రణీత, నితిన్ పిల్లలున్నారు. పాలకొండలోని గాయత్రీనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఇంటికి బంధువులు రావటంతో కూరగాయలు తెమ్మని భార్య సంధ్యారాణి కోరింది. ఆయన వెళ్లి కూరగాయలు తీసుకురాగా.. అవి బాగోలేవని భార్య చెప్పడంతో వారి మధ్య మాటామాట పెరిగింది. భోజనం మానేసిన ఆయన ఇంటి హాల్లో పడుకోగా సంధ్యారాణి ప్లిలలకు పాలిచ్చేందుకు వేరే గదిలో ఉండిపోయారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ కిందకు పడిన శబ్ధం రావటంతో వెళ్లి చూసిన ఆమె రామకృష్ణ ఉరివేసుకున్నట్లు గుర్తించి కేకలు వేయటంతో బంధువులు, చుట్టుపక్కల వారు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆతన్ని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆదే రోజు రాత్రి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం రిమ్స్ వర్గాలు మెరుగైన వైద్యం కోసం ఈ నెల 24న రాగోలు జెమ్స్‌కు రిఫర్ చేయగా.. శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందారు. రామకృష్ణ మృతదేహాన్ని శుక్రవారం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై సీహెచ్ ప్రసాద్ తెలిపారు. రామకృష్ణకు 2018లో పీడీగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం బూర్జ మండలం ఓవీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. బలవన్మరణానికి పాల్పడి విషాదాన్ని మిగిల్చారు. పీడీగానే కాకుండా దళిత సంఘ నాయకునిగా హక్కుల సాధన పోరాటాల్లో చురుగ్గా పాల్గొనే రామకృష్ణ మృతిపై దళిత హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు సంతాపం తెలియజేశారు. -
కుళ్లిన కూరగాయలతో సౌర విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం... ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ..అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతిని మాత్రమే ఒడిసిపడతాయన్నది తెలిసిందే. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్నమాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణాలను ఈ పదార్థం ఉపయోగించుకుంటుంది. అద్భుతమైన ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది. వెలుగునిచ్చే పదార్థం... భూమి అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీలలోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్‌గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజిని నియంత్రించుకుంటూ ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసుకోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు. ఎన్నో లాభాలు... నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేందుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధారణ సోలార్ ప్యానెల్స్‌ను ఎప్పుడూ సూర్యుడికి అభిముఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండదు. కాంక్రీట్ గోడలు, ఫుట్‌పాత్‌లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు తొమ్మిది రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నాయాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుందని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్ను వాడుకోవచ్చని తెలిపారు. -
తినండి... బరువు తగ్గండి!
రంగు రంగుల్లో మెరిసే కూరగాయలకు మనిషి బరువును తగ్గించే శక్తి ఉంటుందట. పచ్చివే తినదగ్గ ఈ కూరగాయలు అదనపు కొవ్వులను తగ్గించి సన్నబరుస్తాయని అంటున్నాయి వివిధ అధ్యయనాలు. టమోటాలు, వివిధ రంగుల్లో లభించే బెల్ పెప్పర్, తాజా ఆకుకూరలకు బరువును తగ్గించే గుణాలుంటాయి. బఠానీలు, ఎర్ర ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, కీరా, గుమ్మడికాయలు.. ఇలా మెరిసే రంగుల్లో ఉండేవి కూడా శరీర బరువును నియంత్రణలో ఉంచాలనుకొనే వారికి నేస్తాలు. అలాగే మిరపకు కూడా బరువును తగ్గించే గుణం ఉంటుందట! వివిధ రంగుల్లో లభిస్తున్న మిరపకాయల్లో బరువును తగ్గించే రసాయనా లుంటాయని గుర్తించారట. -
అన్నం తక్కువ తిందాం..!
సాక్షి, హైదరాబాద్: తిండి కలిగితే కండ కలదోయ్... కండకలవాడేను మనిషోయ్.. అన్నాడు కవి గురజాడ. అలాగని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో మెజార్టీ జనాలు ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ.. కొవ్వులు, గ్లూకోజ్‌లు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో శరీర సౌష్టవం దెబ్బతినడంతో పాటు అనారోగ్యానికి దారితీస్తోంది. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా పరిశీలన చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న దానిపై ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ పలు సూచనలు చేశాయి. అలాగే వీటన్నింటినీ వివరిస్తూ ‘వాట్ ఇండియా ఈట్స్’ నివేదికను విడుదల చేశాయి. పరిశీలన సాగిందిలా... దేశాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్ ఈస్ట్‌గా విభజించి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, తీసుకుంటున్న విధానాన్ని 24 గంటల(ఒక రోజు)ను ఒక యూనిట్ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లున్నా... తీసుకునే విధానం మాత్రం సరిగా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా> తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా తృణ, చిరుధాన్యాల వినియోగం అధికంగా ఉంది. పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని మోతాదులోనే భుజిస్తున్నారు. పాల ఉత్పత్తులతో పాటు కాయగూరలు, పండ్లు, గింజలను తక్కువగా తీసుకుంటున్నారు. దుంపలను ఎక్కువగా తీసుకుంటుండగా... పట్టణ ప్రాంతాల్లో కొవ్వు పదార్థాల వినియోగం అధికంగా ఉంది. ‘మై ప్లేట్ ఫర్ ది డే’ మెనూ ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు సగటున 2 వేల కిలో కెలోరీల ఆహారం సరిపోతుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం, వ్యాయామంతో శరీర సౌష్టవం, చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ఎన్ ఐఎన్ సూచిస్తోంది. రోజువారీగా ఏయే పదార్థాలు ఎంత శాతం తీసుకోవాలన్న దానిపై ఒక మెనూను రూపొందించి ‘మై ప్లేట్ ఫర్ ది డే’ పేరు పెట్టింది. ఇందులో 40% ఆహారంగా బియ్యం లేదా గోధుమలు, మొక్కజొన్నతో పాటు తృణ ధాన్యాలైన జొన్నలు, రాగులు, అరకలు, సజ్జలతో వండిన పదార్థాలు కూడా తీసుకోవాలి. 11% పప్పులు, 6% మాంసాహారం, 10% పాలు లేదా పెరుగు, 5% కాయగూరలు, 3% పండ్లు, 8% బాదం, ఖాజు, పల్లీ తదితర నట్స్ తినాలి. కొవ్వు లేదా నూనె పదార్థాలను 12% తీసుకోవాలి. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సగటు మనిషి ప్రామాణిక బరువును ఐదు కిలోలు పెంచగా, మనిషికి కావాల్సిన కేలరీలను వారి శ్రమ ఆధారంగా పోలుస్తూ మార్పులు చేశారు. ► పప్పుదినుసులతో చేసిన ఆహారానికి బదులుగా గుడ్లు, మాంసం, చేపలను అదే మోతాదులో తీసుకోవచ్చు. ► పండ్లను జూస్‌ల రూపంలో కాకుండా నేరుగా తినేలా తీసుకోవాలి. ► కొవ్వులు, నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిత్యం ఒకే రకమైన నూనె పదార్ధాలు కాకుండా వేరువేరుగా తీసుకోవాలి. ► ఊబకాయం ఉన్నవారు, లేదా బరువు తగ్గాలనుకున్న వారు బియ్యం, గోధుమ తదితర ధాన్యాలతో చేసిన పదార్థాలను తగ్గించాలి. -
సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?
బెంగళూరు : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్థాంగి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి సమాజానికి మంచి చేస్తూ ఆదర్శప్రాయురాలుగా ఎంతో పేరు సంపాదించారు. ఎన్నో అనాథ ఆశ్రమాలు నెలకొల్పి ఎంతోమంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా మంచి రచయిత అయిన సుధా మూర్తి ఎన్నో మంచి నవలల కూడా రచించారు. (చదవండి : పుట్టిన రోజున పిల్లలకు కానుక) అలాంటి సుధా మూర్తి బెంగళూరు జయానగర్‌లోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద కూరగాయలు అమ్మారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ' ఫోటోలో కనిపించేది ముమ్మాటికి సుధా మూర్తియే. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాల్లో గడుపుతారు. ప్రతి ఏడాదిలో ఒకరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాసుడికి దండలు తయారు చేయడం.. మరో మూడు రోజులు రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద కూరగాయలను అమ్మడంతో పాటు భక్తులకు అందించే ప్రసాదానికి తనవంతుగా కూరగాయలు కట్ చేస్తుంది. వ్యాపారంలో తమకు వస్తున్న సంపద కారణంగా అహంకారం అనేది రాకూడదనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆమెకు ఇవే మా వందనాలు' అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చూసిన కొన్ని ప్రచురణ సంస్థలు సుధా మూర్తి గురించి తప్పుడు కథనాలు ప్రచురించాయి. (చదవండి : డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్) కల్పితం : సుధా మూర్తి రాఘవేంద్ర స్వామి గుడి బయట కూరగాయలు అమ్ముతున్న ఫోటోలను చాలా సంస్థలు తమ కథనాల్లో తప్పుగా ప్రచురించాయి. సుధా మూర్తి కూరగాయలు అమ్మడం లేదని.. గుడి బయట సేవా కార్యక్రమాల పేరిట ఒక స్టోర్ నడుపుతున్నారని.. ఇలా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకుంటున్నారని ఆరోపించాయి. కొన్ని సంవత్సరాలుగా స్టోర్ వద్దకు వచ్చి కూరగాయలతో పాటు ఇతర రకాల సేవలు కూడా అందిస్తున్నారు. వాస్తవం : వాస్తవానికి సుధా మూర్తి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. స్వచ్చంద సేవ పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి రాఘవేంద్ర స్వామి గుడికి వస్తున్న ఆమె భక్తులకు భోజనం సిద్ధం చేయడం, పండ్లు కడగడం, ప్రసాదానికి కూరగాయలు కోయడం వంటి కార్యక్రమాలతో సుధా మూర్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సందర్భంలోనే ఆమె కూరగాయల ముందు కూర్చొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే ఆమె రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులు మాత్రం తమ అనుమతితో స్టోర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా అంతకుముందు బెంగళూరు మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధా మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నప్పుడు తన సేవా కార్యక్రమాల్ని స్వయంగా వెల్లడించారు. 'ప్రతి ఏడాదిలో మూడు రోజులు దేవుడికి స్వచ్చంద సేవ చేయాలని అనుకున్నా. ఉదయం నాలుగు గంటలకే లేచి.. బెంగళూరులోని రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లి ఏ ప్రతిఫలం ఆశించకుండా స్వచ్చంద సేవ చేస్తుంటా. సెక్యూరిటీ గార్డు సాయంతో వంటగదితో పాటు అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులకు అందించే ప్రసాదాల కోసం నా వంతు సాయం అందిస్తా. తర్వాత కూరగాయల నుంచి వచ్చిన వ్యర్థాలను చెత్త డబ్బాలో వేసి స్వయంగా తీసుకెళ్లి పడేసి వస్తా. ఇదంతా స్వచ్చంద సేవ మాత్రమే.. ఏ ప్రతిఫలం ఆశించను. 'అంటూ ఆమె తెలిపారు. -
కిసాన్ రైలుతో రైతులకు ఎంతో మేలు
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ సర్వీసెస్ ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డుమార్గంతో పోల్చుకుంటే పదిహేను గంటల సమయం, టన్నుకి 1000 రూపాయల చొప్పున ఆదా అవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌కి ప్రయోగాత్మకంగా శుక్రవారం ఈ నూతన కిసాన్ రైల్ సరీ్వస్‌ని ప్రారంభించారు. ఈ రైలు పది పార్సిల్ వ్యాన్లు కలిగి ఉంటుందని, 238 టన్నుల సరుకుని రవాణా చేయగలుగుతుందని వారు తెలిపారు. ఈ సర్వీసు ప్రస్తుతానికి వారానికి ఒకసారి దేవ్లాలి నుంచి ప్రతిశుక్రవారం, తిరుగుప్రయాణంలో ప్రతి ఆదివారం దానాపూర్ నుంచి బయలుదేరుతుంది. (యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్ కుమార్ జోషి) -
శారదకు అండగా ‘టిటా’
సాక్షి, హైదరాబాద్ : కరోనా మూలంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల శనివారం శారదకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందచేశారు. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, కృత్రిమ మేథస్సు (ఏఐ) టెక్నాలజీపై శారదకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను శారదకు అందించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శారద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. (‘సాఫ్ట్వేర్ శారద’కు సోనూసూద్ జాబ్) -
కూరగాయలపై కరోనాను ఖతం చేసే టెక్నిక్!
న్యూఢిల్లీ: ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించి కూరగాయలను స్టెరిలైజేషన్ చేయొచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదివేయండి.. సాధారణంగా కుక్కర్లను పప్పులు ఉడికించడానికి వాడతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం అంతకు మించి వాడుకున్నాడు. కుక్కర్ పైన ఉండే విజిల్‌కు ఓ పైపు తొడిగించాడు. మరో చివరను కూరగాయల దగ్గర పెట్టాడు. సహజ పద్ధతిలో అక్కడున్న ఉల్లి ఆకులు, టమాటలు, కాకరకాయలు తదితర కూరగాయలకు ఆవిరి తగిలించాడు. తద్వారా వాటిపై ఏవైనా సూక్ష్మిక్రిములు కానీ, కరోనా వంటి వైరస్ కణాలు ఉన్నా నశించిపోతాయని ఆయన అంటున్నాడు. (చావు కబురు చల్లగా చెప్పాడు..) ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు ట్విటర్లో షేర్ చేశారు. ఇంత వెరైటీగా కూరగాయలను శుభ్రం చేసే పద్ధతిని చూసి ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది అతడిని పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరమైన పద్ధతని వారిస్తున్నారు. అంతగా శుభ్రం చేయాలనుకుంటే సబ్బునీళ్లలో వేసి కడిగితే సరిపోతుందని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ పైపు ద్వారా ఆవిరి పట్టడం అస్సలు మంచిది కాదని, దానివల్ల ఆ కూరగాయలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఓ నెటిజన్ హెచ్చరించాడు. (ఈ బుడ్డోడికి ఎంత ధైర్యమో!) -
వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోవాల్సిందే!
ఈ రోజుల్లో ప్రతి చిన్న వేడుకను కేక్‌తో సెలబ్రేట్ చేసుకోవడం సాధారణమైంది. అయితే, ఎప్పుడూ ఒకే తరహా కేకులతో విసిగిపోయిన అమెరికాకు చెందిన ప్రముఖ చెఫ్ నటాలీ సైడ్‌సర్ఫ్ సరికొత్తగా ఆలోచించారు. చాలా వెరైటీగా కేకులు తయారు చేసి అబ్బురపరిచారు. వెరైటీ అంటే మరీ షాక్ అయ్యే విధంగా చేసేశారు. వంకాయ, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, ఇలా అన్ని రకాల పళ్ల ఆకారాలతో కేకులు తయారు చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ వెరైటీ కేకుల వీడియో అందరినీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో వైరల్ అయింది. అచ్చం నిజమైనా కూరగాయాల్లా ఉన్న కేకులను చూస్తే మీరూ ఆశ్చర్యపోవాల్సిందే! 'నేను అక్షరాలా జీవించడానికి కేకులను తయారుచేస్తాను, కాబట్టి ఇది నిజంగా నాతో మాట్లాడుతుంది' అనే కాప్షన్‌తో నటాలీ ఈ వీడియో షేర్ చేశారు. నోరూరించే కేకుల వీడియోపై నెటిజన్ల కామెంట్ల వర్షం కురుస్తోంది. I literally make cakes like this for a living so this really speaks to me 😂😂 pic.twitter.com/507k4uXcEr — Natalie Sideserf (@NatalieSideserf) July 10, 2020 -
36 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఉద్యానశాఖ ప్రణాళిక రచించింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లలో 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు మంగళవారం ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, వంటనూనెలు వంటివి మన రాష్ట్రంలోనే పండించుకోవాలనేది ఉద్యానశాఖ లక్ష్యం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. కూరగాయల దిగుమతికి చెక్ పెట్టేలా.. రాష్ట్రంలో ప్రస్తుతం 3.52 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. ఏటా 30.71 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుబడి అవుతున్నాయి. దాదాపు 20 రకాలకు పైగా కూరగాయలను పండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఏడాదికి 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఏడాదికి సరాసరి 90 కిలోల కూరగాయలు వినియోగిస్తున్నాడు. ఆ ప్రకారం ఏటా రూ.11,130 కోట్లు కూరగాయలకు ఖర్చు చేస్తున్నారు. అయితే మనం పండించే వాటిల్లో కొన్నింటిని అవసరానికి మించి, కొన్నింటిని అవసరానికన్నా తక్కువగా పండిస్తున్నాం. టమాట, వంకాయ, బెండ మొదలైన వాటిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. పండించిన వాటిలో 7.72 లక్షల మెట్రిక్ టన్నులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. అదే సమయంలో మన అవసరాలకు కావాల్సిన ఉల్లి, మిరప, బీర, సోర, కాకర, చిక్కుడు, దోస, ఆలు, క్యారెట్, ఆకుకూరలు వంటి 17 రకాలను 13 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతులను తగ్గించి, మన రాష్ట్ర అవసరాలకు పూర్తిగా సరిపడా కూరగాయలను పండించేందుకు ఉద్యానశాఖ ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలలో సాగు చేయాలని నిర్ణయించింది. ఈ వానాకాలంలో 2.47 లక్షల ఎకరాల్లో 17.64 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 2.77 లక్షల ఎకరాల్లో 18.36 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తారు. రాష్ట్రంలో 12 రకాల పండ్ల సాగు.. మన రాష్ట్రంలో పండ్లు 4.35 లక్షల ఎకరాలలో సాగవుతున్నాయి. ఏడాదికి 22.97 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అవుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా 14 రకాల పండ్ల వినియోగం జరుగుతుండగా, 12 రకాలు మన రాష్ట్రంలోనే పండుతున్నాయి. సగటున రాష్ట్ర జనాభా ఏడాదికి 12.44 లక్షల టన్నుల పండ్లను వినియోగిస్తున్నారు. అందుకోసం ప్రజలు ఏడాదికి రూ. 7,942 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చ మన అవసరాలకు మించి ఉత్పత్తి అవుతున్నాయి. 18.44 లక్షల మెట్రిక్ టన్నుల ఈ పండ్లను ఉత్తర భారత్‌కి ఎగుమతి చేస్తున్నాం. మన రాష్ట్రంలో కొరత ఉన్న అరటి, సపోట, నేరేడు, కర్బూజ, యాపిల్, పైన్ యాపిల్ పండ్లను ఏడాదికి 7.91 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. యాపిల్, పైనాపిల్ రాష్ట్రంలో పండించేందుకు వీలుకాదు. మిగిలినవాటిని దాదాపు 65,866 ఎకరాలలో కొత్తగా దశల వారీగా పెంచేందుకు ప్రయత్నించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. సుగంధ ద్రవ్యాలు.. రాష్ట్రంలో సుగంధ ద్రవ్య పంటలు 3.85 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఏడాదికి 7.85 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో 8 రకాల సుగంధ ద్రవ్యాలు వినియోగంలో ఉన్నాయి. పసుపు, ఎండు మిర్చి సాగులో రాష్ట్రం దేశంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటిని మన అవసరాలకు మించి సాగు చేస్తున్నాం. మన రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న ధనియాలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, చింతపండు మొదలైన పంటల స్వయం సమృద్ధి కోసం 95,646 ఎకరాల్లో పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. దేశంలో 15 మిలియన్ టన్నుల నూనె దిగుమతి.. మన దేశ జనాభాకి 22 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలిన 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతుల్లో పామాయిల్ ఒకటే 60 శాతం. అంటే 9 నుంచి 10 మిలియన్ టన్నుల పామాయిల్ నూనెను సుమారు రూ.60 వేల కోట్లు వెచ్చించి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. అందుకే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందని నివేదికలో వెల్లడించారు. -
వైరల్: టమాటాలు అమ్ముతున్న నటుడు
కరోనా వైపరీత్యాన ఎంతోమంది ఉపాధి కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్నారు. సినీ నటులకు లాక్డౌన్ కష్టాలు తప్పలేదు. తాజాగా నటుడు జావేద్ హైదర్ పని లేకపోవడంతో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బిగ్‌బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌టాక్‌లో షేర్ చేసింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల అతడికి ఉపాధి కరువైంది. దీంతో విధి లేక పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకుంటున్నాడంటూ ఆమె పేర్కొంది. ఈ వీడియోలో అతడు కూరగాయల బండి ముందు టమాటాలు అమ్ముతూ ఓ హిందీ వీడియోకు లిప్‌సింక్ ఇచ్చాడు. (వైరల్: ట్రెండింగ్ పాటకు త్రిష స్టెప్పులు) దీనికి మిలియన్‌కు పైగా లైకులు వచ్చాయి. "ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ మరో మార్గాన్ని ఎంచుకుని జీవించడం గ్రేట్", "అతని మంచి పని చేస్తున్నాడు. జీవితంలో ఆశ కోల్పోకూడదనడానికి ఇది ఉదాహరణ" అని టిక్‌టాక్ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. కాగా అతడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై ప్రవేశించాడు. అమీర్‌ఖాన్ 'గులాం', 'లైఫ్ కీ ఐసీ కి తైసి', 'బాబర్' చిత్రాల్లో నటించాడు. వీటితోపాటు 'జెన్నీ ఔర్ జుజు' అనే టీవీ సిరీస్‌లో కనిపించాడు. (నిజమేంటో తెలుసుకోండి) -
పోస్ట్మ్యాన్లతో కూరగాయల సరఫరా
చెన్నై : సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. ఇప్పటి వరకు మనం అదేం చూశాం .అయితే ఇకపై వారు పండ్లు, కూరగాయలు సరఫరా చేయనున్నారు. ఇండియా పోస్ట్‌తో ఉద్యానవన శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పండ్లు, కూరగాయలు ఇళ్లకు సరఫరా చేయనున్నారు. ఇటీవల చెన్నైలోని చిట్లపాక్కంలో పోస్ట్మ్యాన్లతో విజయవంతంగా పంపిణీ చేశారు. దీంతో ఈ వ్యవస్థను మరో వారంలో అమల్లోకి తీసుకురావాలని ఉద్యానవన శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రతి పోస్టాఫీసు పరిధిలోని ఆపరేటివ్ ఏరియా సామర్థ్యాన్ని బట్టి కూరగాయల పొట్లాలు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రతి పార్సిల్లో గరిష్టంగా ఏడు కిలోల కూరగాయలు, పండ్లను సరఫరా చేసేలా యోచిస్తోందని తెలిపారు. పార్సిళ్లు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడానికి వాహనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నందున కొత్తగా కూరగాయలు, పండ్లు సరఫరా వల్ల ఇండియా పోస్ట్‌కు ఆదాయం కూడా లభిస్తుందని తపాలాశాఖ అధికారులు భావిస్తున్నారు. ‘లాక్’ తీస్తే కరోనాతో కష్టమే.. -
వ్యర్థాలతో పోషక జలం!
కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సౌలభ్యం ఏమిటంటే.. ఏరోజుకారోజే పోషక జలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో రెండు పద్ధతులున్నాయి. మొదటిది.. వంట కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని సాధారణంగా సింక్‌లో పారబోస్తుంటాం. కానీ, అలా పారబోయకుండా.. వంటింట్లోనే ఒక మూలన ప్రత్యేకంగా ఇందుకోసం ఒక బక్కెట్‌ను ఉంచండి. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఉదయం నుంచి దాంట్లో పోస్తూ ఉండండి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తరిగినప్పుడు వచ్చిన తొక్కలు, ముక్కలను ఆ నీటిలో వేయండి. బక్కెట్‌పై ఈగలు మూగకుండా మూత పెట్టండి. సాయంత్రం (నియమం ఏమిటంటే.. బియ్యం, పప్పులు కడిగిన నీటిలో వేసిన వ్యర్థాలు 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు) వంట పూర్తయిన తర్వాత.. ఆ బక్కెట్లో నీటిలో నుంచి తొక్కలు, ముక్కలను బయటకు తీసి లేదా వడకట్టి.. ఆ పోషక జలాన్ని మొక్కల కుండీల్లో పోసుకోండి. ఇలా పోస్తూ ఉంటే.. మొక్కలు అంతకుముందు కన్నా కళగా, ఏపుగా పెరుగుతుండటం గమనించవచ్చు. మిగిలిన వ్యర్థాలను మీరు ఇప్పటికే కంపోస్టు తయారు చేస్తూ ఉన్నట్లయితే కంపోస్టు పిట్ లేదా పాత్రల్లో వేయండి. ఒకవేళ.. ఇంకా కంపోస్టు తయారు చేయడం ప్రారంభించకపోతే.. ఆ వ్యర్థాలను కూడా బయట పారేయనక్కర లేదు. అందుకు ఇంకో ఉపాయం ఉంది. కూరగాయలు, పండ్ల తొక్కలను.. నీటి లో నుంచి బయటకు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మిక్సీలో వేయండి. దాన్ని పోషక జలంతో కలిపి కుండీలు, మడుల్లో మీరు పెంచుకుంటున్న ఇంటిపంటలకు పోసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పోషక జలం మరీ చిక్కగా లేకుండా మట్టిలో ఇంకిపోయేలా ఉండేలా చూసుకోవాలి. పెరట్లో పెరిగే చెట్లకు కూడా పోసుకోవచ్చు. వారానికి రెండు సార్లు పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది.