రిఫ్రిజిరేటర్‌లో పెట్టినప్పటికీ ఒకోసారి బెండకాయలు పాడవుతుంటాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. బెండకాయలను తాజాగా ఉంచేందుకు ఇలా చేసి చూడండి...
- ∙మార్కెట్ నుంచి లె చ్చిన బెండకాయల్లో తాజాగా ఉన్న బెండకాయలను ఏరి పక్కన పెట్టుకోవాలి.
- ∙తాజా బెండకాయలన్నింటిని స్పూను వెనిగర్ వేసిన నీటిలో వేసి ఇరవై నిమిషాలు ఉంచాలి. తరువాత సాధారణ నీటితో కడిగి, తడిలేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి.
- ∙ ఆరిన బెండకాయలను నచ్చిన పరిమాణం, ఆకారంలో ముక్కలుగా తరిగి జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసుకోవాలి.
- ∙ ఇలా నిల్వచేసుకుంటే బెండకాయలు ఎక్కువ రోజులపాటు తాజాగా , రుచిగా ఉంటాయి. అవసరమైనప్పుడు జిప్‌లాక్ బ్యాగ్‌ను బయటకు తీసి వేడినీటిలో కొద్దిసేపు ఉంచాలి. కూలింగ్ తగ్గిన తరువాత వాడుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment